Tuesday, July 20, 2010

నిజంలోంచీ కలలోకి, కలలోంచీ కలల్లోకి : INCEPTION

“ Dreams feel real while we’re in them. It’s only when we wake up that we realize something was actually strange”
- Cobb in INCEPTION
నీ కలల్లోకి నేను జొరబడగలిగితే…!
నీకే తెలియని నీ ఆలోచనల్ని నేను దొంగిలించగలను.
నేనే నీ మనసులో ఒక కొత్త ఆలోచనను నింపాలంటే?!
నీ కలల్లోంచీ నిన్ను మరో కల కనేలా ఉసిగొల్పాలి.
అది సాధ్యమా?
‘సాధ్యమే…నిజంలోంచీ కలవరకూ, కలనుంచీ ఒక సామూహిక స్వప్నం వరకూ….
సామూహిక స్వప్నం నుంచీ మరో కలలోకి అలాఅలా జారడం సాధ్యమే. మనసులోని ఆలోచనల్ని దొంగిలించడమే కాదు కొత్త ఆలోచనల్ని సృష్టించడమూ సాధ్యమే’ అంటాడు దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ ‘ఇన్సెప్షన్’ చిత్రంలో.
కానీ సమస్యల్లా, నిజంలా అనిపించే కలలో “జీవించిన”తరువాత నిజానికీ కలకూ బేధం మిగిలుంటుందా అనేదే. దానికి సమాధానం అంత సులభంగా దొరకదు.

మరి సమాధానం లేని సమస్యని అవసరంకోసం ఆహ్వానిస్తే…పరిణామాలు ఎలా ఉంటాయి? అనేదే ఈ సినిమా.
మ్యాట్రిక్స్ సినిమా తరువాత cinematic imagination ని మరోస్థాయికి తీసుకెళ్ళిన చిత్రమిది. ఈ సినిమాను ఒకసారి చూసి సమీక్షించడం, రెండుసార్లు చూసి విశ్లేషించడం లాంటి సాహసాలు చెయ్యడానికి నేను పూనుకోకూడదని తెలిసొచ్చి, కేవలం “చూడండి” అని చెప్పడానికి ఇది రాస్తున్నాను.

చూడబోయే ముందు ఒక్క మాట, ఈ సినిమా ఒకసారి చూస్తే అద్భుతమైన కలలా ఉంటుంది. థియేటర్ బయటొచ్చిన తరువాత అనుభవం లీలగా తెలిసొస్తుందిగానీ, వివరాలు గుర్తుకు రావు. ఎంత అర్థమయ్యిందో అస్సలు అంచనాకు రాదు. అందుకే, ఈ సినిమాని నిజంలా ఫీలవ్వాలంటే కనీసం మరో మూడుసార్లు చూడాలి. అందుకు మీరు రెడీగా ఉంటే GO AHEAD…SEE IT…DREAM IT.





****

4 comments:

భావకుడన్ said...

మాట్రిక్స్ సినిమా థియేటర్లో చూదలేదు కాబట్టి దానితో కంపేర్ చెయ్యలేను కాని జీవితంలో మొదటిసారి సినిమా అయిపొయాక గట్టిగా చప్పట్లు కొట్తాలన్నంతగా నచ్చిందీ సినిమా. Would really recommend it to anyone with an awe for imagination.

yab said...

Saw this movie y'day. A very striking point of this movie is, the originality of the concept. Christopher Nolan should be highly appreciated for that. It is very tough to understand the movie in a single go.

The beauty of this movie is, the concept underlying the movie is not totally absurd but at the same time it is not easy to understand, and the resultant effect is, it makes us think.

If this movie had fantastic visuals (better then standards set by Matrix) and if it was slightly more self explanatory, it would have been the greatest movie ever.

Only thing that comes to my mind after seeing this movie is

Reality is a relative concept.

yab said...

Guys,
Try the link below

http://screenrant.com/inception-spoilers-discussion-kofi-68330/

it helps in understanding the movie better.

శ్రీ said...

గత శుక్రవారం చూసాను, అద్భుతంగా ఉంది.

"ఈ సినిమా ఒకసారి చూస్తే అద్భుతమైన కలలా ఉంటుంది."

అక్షరాలా సత్యం!