Wednesday, November 3, 2010

తెలుగు బ్లాగర్లకు ‘వికాసధాత్రి’ ఆహ్వానం

తెలుగు సాహితీ లోకంలో ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తున్న తెలుగు బ్లాగర్ల రచనలను 'యువ తరంగం' పేరిట పుస్తక రూపంలో ముద్రించాలని 'వికాస ధాత్రి' భావిస్తోంది. తెలుగు అంతర్జాలంలో వినూత్నమైన శైలితో, విభిన్నమైన అంశాలతో పాఠకులను అలరిస్తున్న బ్లాగులు ఎన్నో ఉన్నాయి. పేరు గాంచిన రచయితల కన్నా మిన్నగా వ్రాస్తున్న తెలుగు బ్లాగర్లు ఎందరో ఉన్నారు. ఈ బ్లాగర్లను, వారి బ్లాగులను తెలుగు పాఠకులకు మరింత దగ్గర చేయవలసిన అవసరం ఉంది. ఇంటర్నెట్‌ అందుబాటులో లేని పాఠకులను చేరేందుకు చేస్తున్న మా ఈ ప్రయత్నానికి చేయూత ఇవ్వవలసిందిగా బ్లాగర్లకు ఆహ్వానం పలుకుతున్నాము.
 

తాము బ్లాగును ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన పోస్టులలో తమకు ఎంతగానో నచ్చిన రెండు పోస్టుల లింక్‌లను 'వికాస ధాత్రి'కి పంపించవలసిందిగా కోరుతున్నాము. ఒక్కో పోస్ట్‌ 'ఎ4' పేపర్‌ సైజుకు మించకుండా ఉంటే మంచిది. పోస్టుల వివరాలతో పాటు బ్లాగర్లు తమ వివరాలను, డిజిటల్‌ ఫోటోను కూడా పంపించాలి. పంపించవలసిన ఈ - మెయిల్‌ : blog@vikasadhatri.org

****

2 comments:

ఆ.సౌమ్య said...

good start...I appreciate it!

కొత్త పాళీ said...

Excellent idea.
Can you post some background on Vikasadhatri? Who they are? etc..