Thursday, November 4, 2010

టపాసుల్లో లక్ష్మీ టపాసు వేరయా !

చిన్నప్పుడు తుస్సులు, సీమటపాకాయలు/మిరపకాయలు సరాలు సరాలుగా దొరికేవిగానీ లక్ష్మీ టపాసో... లేక బాంబు దగ్గరికో... వచ్చేసరికీ రాషనింగ్ విధింపబడేది. చిన్నవాళ్ళు పెద్దటపాకాయలు పేల్చకూడదనే ఆంక్ష ఒకటైతే రెండోది వాటి ధర. ఒక బాక్సు కొనాలంటే ఆ రోజుల్లో ముఫై రూపాయల పైమాటే. ఇప్పుడు బహుశా ఏ నూటయాభైయ్యో అయ్యుంటుంది.

లక్ష్మీ టపాకాయ వీధిలో ఎక్కడన్నా పేలుతుందంటే అక్కడ చిన్నపిల్లలందరం చేరేవాళ్ళం. పెద్ద శబ్ధమంటే భయం. కానీ అందులోని థ్రిల్ కావాలి. కాలిస్తే ఏమవుతుందో అనే బెదురు. కానీ ఎవరైనా కాలుస్తుంటే చూడాలి. ఇదే పద్దతి బాంబుకు కూడా. ఆకు పచ్చటి పసరు పూసినట్లుండే చుట్టచుట్టలుగా చుట్టిన బాంబు అంత శబ్ధం ఎలా చేస్తుందా అని ఒకసారి పూర్తిగా విప్పేసిన జ్ఞాపకాలు టీనేజి దీపావళివి. లక్ష్మీ టపాసు పేల్చడానికి లైసెన్సు వచ్చినా, ఆ చిన్న వత్తిని వెలిగించి దూరంగా పరుగెత్తి, చెవులు మూసుకునే స్పీడులో ఎక్కడ తేడా వస్తుందో అని తీగపొడవుగా ఉండే బాంబులకే ఎప్పుడూ నా ఓటు. అదో సేఫ్టీ ఫ్రికాషన్ మరి.

ఆ తరువాత పర్యావరణంపై అవగాహనో, డబ్బెందుకు "తగలెయ్యడం" అనే స్పృహో తెలీదుగానీ మతాబులు, కాకరపువ్వొత్తులు, విష్ణుచక్రాలతో యువకజీవితం గడిచిపోయింది. కాకపోతే ఇప్పటికీ లక్ష్మీ టపాసులు ఒక తనివి తీరని జ్ఞాపకాల కోరిక. అది ఇప్పుడు తీర్చుకోగలిగా తీర్చుకోలేని బలహీనత.

ఇదంతా జ్ఞాపకం రావడానికి ఒక ఫన్నీ కారణం ఉంది. ఈ రోజు పొద్దున్నే న్యూస్ చూస్తుంటే...ఏదో హిందూ పరిరక్షక సంస్థ అట, "లక్ష్మీ టపాసుల్ని బ్యాన్ చెయ్యాలి" అని మాట్లాడుతున్నారు. ‘వీడి పిచ్చి తగలడా’ అనిపించింది. ఆర్గ్యుమెంట్ ఏమంటే ఏ లక్ష్మినైతే మనం దీపావళి రోజు కొలుస్తామో అదే లక్ష్మిని బాంబుగా దీపావళి రోజు పేల్చడం బ్లాస్ఫమీ అంటాడు. వీడి దుంపదెగ...ఎంత బారు లాజిక్కో కదా!


కొన్ని తరాలుగా లక్ష్మీ టపాకాయకి ఒక బ్రాండ్ వాల్యూ ఉంది. ఎంత సనాతన హిందువులైనా ఇంత వంకరగా ఆలోచించిన దాఖలాలు మాత్రం లేవు. కానీ ఇప్పుడు ప్రతి దాంట్లోనూ మనోభావాలు దెబ్బతీసుకుని మతాల్ని కాపాడెయ్యటమే...ఇది మూర్ఖత్వానికి పరాకాష్టో లేక పైత్యమో...  ఎలా అర్థం చేసుకోవాలో నాకైతే అర్థం కాలేదు.  మీకెలా అనిపించింది?

****

17 comments:

Katragadda Gali Aruna said...

Baavundi Lakshmi Tapas meeda pedda manishi charcha. I agree with you. There is a limit for everything. Let us stop unnecessary arguments in the name of religion. Ofcourse the livelihoods of people who make the Lakshmi Bomb will be at stake if we ban :)

Keep continuing the good posts in Parnashala. Wish you all the best.

Anonymous said...

కొన్ని తరాలుగా లక్ష్మీ టపాకాయకి ఒక బ్రాండ్ వాల్యూ ఉంది.
______________________________

agree.

మా వూల్లో నరక చతుర్దశి రోజు తలంటికి ముందు టపాకాయ కాల్చాలనే రూలుండేది. అందరు చిన్న తాటాకో సీమ టపాకాయో కాలిత్తే, నేను మాత్రం పొద్దున్నే లక్ష్మి అవుట్ పేల్చి జనాల్ని నిద్దర్లు లేపేటొడ్ని.. ఇప్పటికీ లక్ష్మి బాంబు లేకుండా దీపావలి అవదు మాకు.

రాసింది బానే వుంది కానీ, ఇదే అవకాశవాద లాజిక్కు ఈ బలాగులో వేరే ఏ ఒక్క పోస్ట్లో వాడినా బాగుండెది.

Weekend Politician said...

ఒక్క హిందూ పరిరక్షక సంస్థ అనే ఏముంది లేండి..ప్రతిఒక్కరూ ఈ మధ్య ఓవర్ సెన్సిటివ్ గా ప్రవర్తిస్తున్నారు. దళిత వాదులైనా, హిందూ వాదులైనా, తెలంగాణా వాదులైనా, తెలుగు వాదులైనా అందరూ చేసే ఓవరాక్షనే ఇది.

కొంతమంది అతివాదులు ఇలా అన్ని విషయాల మీదా కొంత అనవసర రాద్ధాంతం చేసినా, మెజారిటీ ప్రజలు ఇటువంటి వాటిలో విషయం లేనప్పుడు సమర్ధించరు.

కొన్నిసార్లు సింబాలిక్ గా అలవాట్లను మార్చుకోవలిస్తే మార్చుకోవడంలో కూడా తప్పేంలేదు.

Anonymous said...

కొన్నిసార్లు సింబాలిక్ గా అలవాట్లను మార్చుకోవలిస్తే మార్చుకోవడంలో కూడా తప్పేంలేదు
________________________________

తప్పేంలేదు. అవసరం కూడా లేదు.

అతివాదులు అతిగా ప్రవర్తిస్తారు.

మేతావులు అలాంటి అతివాదుల వాదనని ప్రామాణికంగా తీసుకొని మిగిలిన వారి మీద దుమ్ము పోస్తారు.

మనం మన టపాసులు కాల్చుకుంటాము.

Sky said...

ide modatisaari... mee abhipraayam tho ekeebhavistunnaanu....

ఆత్రేయ said...

నేను హిం.ప.సం సభ్యుడుని కాదు కానీ చిన్నప్పుడు లక్ష్మి బాంబ్ కాల్చే ముందు నేనూ అలాగే ఫీల్ అయ్యే వాడిని. మీరెందుకు ఆ సంస్థ లింకిచ్చి మరీ ప్రచారం చేస్తున్నారు ?

Kathi Mahesh Kumar said...

@ఆత్రేయ: ఆ సంస్థ వెబ్సైటులోకెళ్ళి చూస్తే మరిన్ని ఫన్నీ విషయాలున్నాయి లెండి. అందుకే లింకిచ్చా ;)
తెలుసుకోగలిగినవాడికి తెలుసుకోగలిగినంత.

Anonymous said...

అంతకంటే మరిన్ని ఫన్నీ విషయాలు కావలంటే, ఇదిగో ఇలాంటి సైట్లకి కూడా వెల్లండి http://vadrangipitta.blogspot.com/2010/10/blog-post_16.html

తెలుసుకోగలిగినవాడికి తెలుసుకోగలిగినంత.

Manju said...

లక్ష్మి ఔట్ అని పెరు బానె ఉంది కాని..టపాకాయ మీద దేవుడి ఫొటొ తీసెస్తె బాగుంటుంది .ఎందుకంటె కాల్చెసినాక ఆ కాగితాలను మనం కాళ్ళతొ నెట్టెస్తాము కద,, కొన్నిటి మీద ఫొటొ ఉంటుంది గా పూర్తి గా కాలకుండా

VENKATA SUBA RAO KAVURI said...

మీ లక్ష్మి బాంబు భలే పేలింది. భలే,,,,భలే
వెంకట సుబ్బారావు కావురి
తెలుగిల్లు

సుజాత said...

లక్ష్మీ బాంబులు లేకుండా దీపావళి చేసుకోడం ఎవరి వల్లా కాదు! అ సౌండు ఎఫెక్ట్ కి అలా అడిక్ట్ అయిపోయాం!

ఆ.సౌమ్య said...

హ హ హ పైత్యం బానే ఉంది...కానీ నకు చిన్నప్పటినుండీ లక్ష్మీబాంబులంటే తెగ భయం, ఇప్పటివరకు ఒక్కసారికూడ పేల్చలేదు.

..nagarjuna.. said...

who cares for the brand name....change the last layer of paper on the cracker, sell it with different name...ppl will still like it.....they like because the sound it makes..not because of the name. were green coloured hydrogen bomb (we call it ఉల్లిగడ్డ బాంబు), bullet bomb become famous for their name...!!?

..nagarjuna.. said...

yeah...,forgot to mention one thing. I wonder why don't these fellas who are making a big deal on this cracker keep quiet even if bars and alcohol outlets are named after their revered gods !!

శరత్ 'కాలమ్' said...

మీరు వేసే టపాల ముందు ఏ లక్ష్మీ టపాకాయ అయినా తుస్సేలెండి. ఆ టపాకాయల మీద దేవతా మూర్తులుంటాయి, మీ టపాల మీద నగ్న మూర్తులుంటాయి :)

Praveen Sarma said...

నాగార్జున గారు చెప్పింది నిజమే. మద్యం దుకాణాలకీ, మాంసం దుకాణాలకీ దేవుళ్ల పేర్లు ఉండగా లేనిది దీపావళి బాంబుల మీద దేవుడి బొమ్మలు ఉంటే తప్పా? ఉమామహేశ్వర థియేటర్ అని పేరు పెట్టి బ్లూఫిల్మ్స్ ఆడించడం, సీతామహాలక్ష్మి లాడ్జి అని పేరు పెట్టి వేశ్యలు సప్లై చెయ్యడం, ఇలా దేవుడి పేరుతోనే కుత్తే, కమీనే పనులు జరుగుతున్నప్పుడు దీపావళి బాంబులు కాల్చడమే ఒక ఇష్యూ అయిపోయిందా?

పానీపూరి123 said...

బాంబుల్లో లక్ష్మి టపాకాయ వేరయా,
బ్లాగుల్లో కత్తి టపా(కాయ)లు వేరయా!