Sunday, February 8, 2009

ఉరుము ఉరిమి, మంగలం మీద...


శంఖారావం అనే బ్లాగులో ప్రస్తుతం బ్లాగుల్లో మహిళలపై జరుగుతున్న హేయమైన దాడికి పరోక్షంగా నేనే కారణం అంటూ గొప్పగా శెలవిచ్చారు. దానికి ఆ బ్లాగరి సరస్వతీకుమార్ గారిచ్చిన వివరణ చదివి నవ్వుకుని నిన్న పక్కకొచ్చేసినా, ఇప్పుడు వారి సమర్ధింపు వ్యాఖ్య చూసి ఇది రాయక తప్పడం లేదు. దానితోపాటూ'కంప్యూటర్ ఎరా'లో నా బ్లాగు సమీక్ష దగ్గర సీబీ.రావు గారూ జీడిపప్పు గారూ లేవనెత్తిన ప్రశ్నలు చదివి అచ్చెరువొంది, కొంత వివరణని పొందుపరుస్తున్నాను.


సరస్వతీకుమార్ గారు తమ టపా ప్రారంభంలోనే నేను నా బ్లాగులో చేసే వితండవాదం వల్ల ద్వేషాన్ని మూటగట్టుకున్నాని తేల్చేశారు. నా బ్లాగులో నేను రాసే నా నమ్మకాల గురించి ప్రజలు చర్చించడం మాని, నాతో వాదించి, నా అభిప్రాయాల్నీ, నమ్మకాల్నీ మార్చాలని ప్రయత్నిస్తే నేను వాటికి తలొగ్గకపోవడం ఈయన దృష్టిలో వితండవాదం.నా అనుభవాన్నీ, ఆత్మపరిశీలననీ కాదని ఇతరుల వాదనల్ని నా ఆలోచనలకు ప్రాతిపదికగా చేసుకోకపోవడాన్ని వ్యక్తిత్వం అని నేను అనుకుంటాను. అంతే తేడా! నాగురించి నేను బ్లాగులో చెప్పినట్లు సాధన, శోధన చేసిన జ్ఞానం సత్యమని నమ్ముతాను. అదే సమయంలో ఇతరుల జ్ఞానాన్ని గౌరవిస్తానేగానీ నా అనుభవాల్ని విలువలేనివంటే సహించను. సావకాశంగా చర్చించే ఓపిక లేని కొందరు ఒకవేళ నాది వితండవాదమని అనుకున్నా, వారికి నా మీద ద్వేషం పెంచుకునే అవసరం, కారణం, సమయం ఎలా వచ్చాయో నాకు అర్థం కాని విషయం. "If I don't like some one, its my problem" అని నమ్ముతాను. అందుకే నన్ను పనిగట్టుకు ద్వేషించేవాళ్ళ గురించి, నేను ఆత్మపరిశీలన చేసుకునే అవసరమెప్పుడూ రాలేదు.


"అగ్గి" లాంటి జ్యోతిగారూ సుజాతగారూ నాలాంటి "ఇనుముని" చేరి ఇప్పుడు ఈ దుండగుల సమ్మెటపోట్లకి బలవుతున్నారని మరో అభిప్రాయం. అది కేవలం అభిప్రాయమైతే బాగానే ఉండేది. కానీ ఇప్పుడు వారి వ్యాఖ్య ద్వారా, నాకు మానసిక వ్యధ లేదుకాబట్టి నా పేరుని ప్రస్తావించి, నన్ను నిందించి తద్వారా ఆత్మపరిశీలన కోసం అర్రులుచాస్తూ ఈ టపా రాసినట్లు వారు చెప్పుకోవడం చూస్తే నాకు ఆశ్చర్యంతోపాటూ చిరాకూ కలుగుతోంది.


బ్లాగులోకంలో నాకు కనిపించిన మంఛి టపాని అభినందించడం, నేను విభేధించే చోట నా అభిప్రాయాన్ని వీలైనంత గౌరవప్రదంగా వెళ్ళడించడం, కొత్త బ్లాగర్లకు కొంత ప్రోత్సాహాన్ని అందించే ప్రయత్నం చెయ్యడం నేను మొదట్నుంచీ చేస్తున్న పనులు. క్రితం టపా వరకూ వీరలెవల్లో వాదించుకుని ఆ తరువాత టపాను విపరీతంగా మెచ్చుకున్న సందర్బాలూ ఉన్నాయి. వరుసగా విభేధించుకుంటూ మూలసైద్ధాంతిక స్థాయిలోనే తేడాలున్నాయని గ్రహించి కొన్ని బ్లాగుల్ని కేవలం చదివి ఊరకుండిన ఘటనలూ ఉన్నాయి. ఈ ప్రయాణంలో వ్యక్తులతో సంబంధం లేకుండా ఆలోచలతో,అనుభవాలతోఆభిప్రాయాలతో, సిద్ధాంతాలతో స్నేహపూరిత సంబంధాలూ,సైద్ధాంతిక వైరుధ్యాలూ ఏర్పరుచుకుని జీవితంలో కొంత వైవిధ్యాన్ని అనుభవించాను. ఇలా నేను బ్లాగుసిక(మానసిక అనేపదాన్ని బ్లాగులకిలా అన్వయించుకున్నాను) బాంధవ్యాల్ని పెంచుకున్న బ్లాగర్లలో నా రాతల్ని అభిమానించిన వారూ ఉన్నారు, తీవ్రంగా విభేధించినవారూ ఉన్నారు.


ఇక్కడ చెప్పిన జ్యోతి,కొత్తపాళీ, సుజాత గార్లు ఆ రెండు పార్స్వాల్నీ సమంగా చేసినవారే. నేను చెప్పిన కొన్ని ఆలోచనల్ని outrageous అని ఒక టపాలో అంటే, మరో టపాలోని అభిప్రాయాల్ని interesting అంటూ అభినందించినవారే. మరి మిగతావారిని ఒదిలేసి వీరిని మాత్రం ఈ బ్లాగ్ముష్కరులు టార్గెట్ చేస్తే అందులో నా తప్పేముంది? Guilty by association అని blame చెయ్యడానికి ఇక్కడ సమస్య ప్రారంభమయ్యింది నా బ్లాగు నుంచీ కాదు. నేను ప్రారంభించిన చర్చనుంచీకూడా కాదు. ఇలా సుత్తి నరేష్ కుమార్ ‘పానశాల’లో జరిగినప్పుడు మొదటగా ప్రతిస్పందించింది నేను, ఖండించి ఆపాలని ప్రయత్నించిందీ నేనే. I take that moral responsibility. నా కారణంగా ఎవరూ అవమానింపబడకూడదని అనుకునేవాళ్ళలో నేనూ ఒకడ్ని. అలాగని ఈ ఘటనతో నాకు సంబంధం లేదని ఊరకనే కూర్చోలేదుకూడాను. రవిగారి బ్లాగులో అసభ్యపదజాలంతో రాసిన కాగడా శర్మ, ధూం మచాలేల వ్యాఖ్యలు చూడగానే అది అసహ్యమన్న మొదటి గొంతు నాది. వాటిని తొలగించాలంటూ రవిగారికి వెళ్ళిన మొదటి ఫోన్ కాల్ నాదే. కారణం...ఇలాంటిది ఎవరికి జరిగినా, ఒక వ్యక్తిగా అది సరైనది కాదని నేను నమ్ముతాను గనక.


ఈ context లో నా ఖండనని ఎద్దేవా చేస్తూ, "ఇప్పుడు “ఖండిస్తున్నాను! ఖండించాలి కూడా!” ఆని వ్యాఖ్యలు రాస్తే ప్రయోజనం ఏం ఉంటుంది. గాయపడాల్సిన మనసులు గాయపడిపోయాయి ..జరగాల్సిన నష్టం జరిగిపోయింది...ఎదుటివారి emotions ను అదే పనిగా stir చేస్తే పర్యవసనాలు ఇలానే ఉంటాయి" అంటూ మళ్ళీ మూలకారణం నేను రాజేసిన వివాదాలూ, దానివల్ల చెలరేగిన విద్వేషాలూ అని నిర్ణయించేశారు. ఏమిటి నేను రాజేసిన వివాదాలు? నా టపాలు వివాదాస్పదం అయినంత మాత్రానా, నావాదన అంగీకారం కానంత మాత్రానా ఊరూపేరూ తెలీని ప్రజలు విద్వేషాలు నింపుకుని, బ్లాగులోకంలో అపహాస్యాలూ, అక్రమాలు,అసహ్యాలూ, అసభ్యాలూ సృష్టించుకుంటూ చెలరేగిపోవడం అభినందనీయమా? కనీసం తమ పేరుకూడా ధైర్యంగా చెప్పుకోలేని ఈ రౌడీ మూక emotions కు గౌరవమిచ్చి నేను నా ఆలోచనల్ని బ్లాగులో రాయడం మానేసి తెలుగు బ్లాగుల్ని ఉద్ధరించాలా!


ఈ టపాలో సరస్వతీకుమార్ గారి ఉదారస్వభావం చూడముచ్చటేస్తుంది. ఒకవైపు "ఇక్కడ జరిగిన విషయాన్ని సభ్యత గలిగిన ఎవరూ సమర్ధించరు" అంటూనే "ఇక ఆ బూతుల సంగతంటారా! సాధారణంగా చాలా మంది బాచలర్స్ రూముల్లోనూ, కుర్రాళ్ళ ప్రైవేటు సంభాషణల్లోనూ వాడబడే పదాలే అవి. ఇప్పుడు అవి పబ్లిగ్గా బయటపడేసరికి గగ్గోలు తలయెత్తింది. అంతే తేడా!" అని చాలా హుదాంతంగా ఈ ఉగ్రవాదుల్ని జనజీవన స్రవంతిలో కలిపేసి చప్పట్లు కొట్టేసారు. ఖర్మకొద్దీ ఇంత ఔదార్యం నా సొంతం కాదు. I always try to be true to my own self and will agree and oppose according to my believes and convictions. అందుకే అసభ్యకరమైన వ్యాఖ్యల్ని ఆ రాసినవాళ్ళని ఉద్దేశిస్తూ నా అభ్యంతరాన్ని తెలుపుతూనే, సుజాత గారు "ఖండించరా?" అని అడిగితే, “ఖండిస్తున్నాను! ఖండించాలి కూడా!” అని నా సంఘీభావాన్ని తెలియజెప్పుకున్నాను. కొత్తాపాళీ గారిని విమర్శిస్తూ రాస్తే దాని ఔచిత్యాన్ని సమర్ధవంతంగా ప్రశ్నించే పనీ చేశాను.


ఇలాంటి అనుచిత వ్యాఖ్యల్ని ఎవరు ఎవరిపైన రాసినా వాటిని వీలైనంత అడ్డుకోవడం లేక కనీసం ఈ పోకడల్ని ఖండించడం నేను కొనసాగిస్తాను. ఇక్కడ "కొందరి మధ్యనే కామెంట్లు తిరుగుతుండటం.." అంటూ కొత్తపాళీ,సుజాత,జ్యోతి గార్లు నా బ్లాగుకి regular గా వ్యాఖ్యలు రాస్తారు కాబట్టి, నా మీదున్న కోపం reflected anger గా వారిమీదకు మరలిందని చెప్పబూనడం silly గా అనిపించింది. నా బ్లాగులో ఇప్పటికి 175 టపాలున్నాయి. వాటికొచ్చిన వ్యాఖ్యల సంఖ్య దాదాపు 2,500. బహుశా తెలుగు బ్లాగుల్లో అధికసంఖ్యలో వ్యాఖ్యలు కలిగిన బ్లాగుల్లో నాదొకటి. ఇన్నేసి వ్యాఖ్యల్లో ప్రతి టపాకూ ఆ ముగ్గురూ వ్యాఖ్యలు రాసున్నా అవి 500 ఉంటాయి. మరి మిగతా వ్యాఖ్యలు చేసినవాళ్ళేరి? వారిపైన దాడి జరగలేదే? నేను వ్యాఖ్య రాయని బ్లాగులు, టపాలూ కూడలి, జల్లెడల్లో చాలా తక్కువ. అందరికీ రాసినట్లే ఈ ముగ్గురి బ్లాగుల్లో రాసుంటాను. మరి...కొందరి మద్యనే కామెంట్లు తిరుగుతాయనే మీ అభియోగానికి హేతువెక్కడుంది? అంటే మీరు selective గా ఈ విషయాన్ని గ్రహిస్తూ ఉండాలి లేక sheer ignorance అన్నా అయ్యుండాలి. Both are no excuses for blaming me as a root cause for all that is happening.


ఇన్ని అపవాదులు నా పేరుపెట్టి మరీ చెప్పేసి, చివరాఖర్న సార్వజనికంగా కొన్ని సూచలు చేసినట్లు 1) "మన అభిప్రాయాలను మన పరిధులలో మనం రాసుకోవచ్చుగానీ, 2)వాటికి నేపథ్యంగా మరే ఇతర ulterior motives ఉండకూడదు" అంటూ మళ్ళీ "కెలకడం" ఈ టపా హైలైట్. వ్యక్తిగత అభిప్రాయాల పరిధులేమిటో? అవి మీరి నేను రాసిన టపా లేమిటో? నేను ఎలాంటి వాదనలు చెయ్యాలో వీరు తమ జడ్జిమెంటులో చెప్పేస్తారు...వాటిని నేను అచ్చుతప్పు కాకుండా ఫాలో అయిపోతే, "తోటి బ్లాగర్ల emotion" ని కెలకని వాడినవుతాను. వీరు కెలికిన కెలుక్కి ఇక్కడ నా ఎమోషన్ మాటేమిటి??? రెండోది, మరే ఇతర లోపాయకారి ఉద్దేశం ఉండకూడదట. నేను రాసె టపాల్లో వీరికి ulterior motives కనపడ్డాయనుకుంటాను. అవేమిటో చెబితే నేనూ తెలుసుకుని ఆనందిస్తాను. ఇదివరకూ చెప్పినట్లు, బ్లాగు రాయడం నేను నాకోసం చేసే పని. నమ్మిన విలువల్ని జీవితంలో ఆచరించే నాకు, ఉద్దేశాలూ,ఆశయాలూ, ఆదర్శాల propagation కోసం బ్లాగుల్ని అడ్డంపెట్టుకోవల్సిన అవసరం లేదు. I have enough places in life to live my ideology. కాబట్టి, రాసే motivationనే తప్ప ulterior motives నా పంధా కాదు.


ఆద్యంతం రెచ్చగొట్టే ధోరణిలో రాసిన ఈ టపాలో "ఎదుటివారి భావాలను సాధ్యమైనంతవరకు రెచ్చగొట్టకుండా టపాలు, వ్యాఖ్యలు రాయాలి" అనేది వీరు చేసిన మరో హాస్యాస్పదమైన సూచన. నేను వ్యస్థనూ, సిద్ధాంతాలనూ, ఆలోచలనూ వ్యక్తిరేకిస్తూనో లేదా సమర్ధిస్తూనో టపాలు రాస్తే అది రెచ్చగొట్టేవి. ఈయనగారు నన్ను ప్రత్యేకంగా టార్గెట్ చేసి,లేని కారణాలనూ, కల్పిత ఉద్దేశాలనూ అంటగడుతూ రాసే టపా మాత్రం "ఆత్మపరిశీలన" ఉద్దేశంతో రాయబడింది. పైగా "మిగతా వారంతా ఇప్పటికే మానసికంగా బాధపడుతున్నారు కనుక కత్తిగారిని తప్ప మరెవరినీ నేను హైలైట్ చేయలేదు" అని విజయవంతంగా నన్ను గౌరవించడానికి కారణాన్ని తెలుపుకున్నారు. ఏమిటీ విపరీతం? ఏమిటీ దాష్టీకం?


దీన్ని తెలియనితనం అనుకోవాలో లేక మూర్ఖత్వం అనుకోవాలో తెలీని పరిస్థితి. ఆ రెండూ కాకుండా, నేనూ ఒక conspiracy theory ప్రతిపాదిద్ధామని నిర్ణయించుకున్నాను. సరస్వతీకుమార్ గారి బ్లాగును కూలంకషంగా పరిశీలించిన మీదట నాకు కలిగిన అపోహ ఏమిటంటే, ఈ మేధావి గారు తమ మేధనంతా ఉపయోగించి, చాలా విలువైన సమాచారాన్ని టపాల ద్వారా అందిస్తారు. భారతదేశానికి ఎలాంటి వ్యవస్థకావాలో, తత్వశాస్త్రాన్ని తేలిగ్గా ఎలా చెప్పాలో వంటివాటితోపాటూ ‘రెచ్చగొట్టి ఎలా అదుపు చెయ్యాలో’,ఎలా ‘ఇతరుల నిర్ణయాలు నియంత్రించాలో’ చెప్పే వ్యక్తిగతవికాస వ్యాసాలు పుంఖాలు పుంఖాలుగా తెలుగు బ్లాగులోకానికి ధారాదత్తం చేస్తున్నారు. కానీ ఎప్పటిలాగే కమర్షియల్ మాసాలా సినిమాలు తప్ప, అర్థవంతమైన ఆర్టు సినిమాలు చూడని మన తెలుగు జనతలాగానే బ్లాగు జనులుకూడా, కాలక్షేపం బఠాణీల్లాంటి టైంపాస్ బ్లాగుల్ని ఎడాపెడా చదువుతారేగానీ వీరి ఒలికించిన మేధని గమనించరు. అవి వీరి సీరియస్ టపాలకొచ్చే వ్యాఖ్యల్ని బట్టే అర్థమవుతుంది. కానీ వీరు రాసిన కొన్ని టపాలకి మాత్రం వ్యాఖ్యల సంఖ్య రెండంకెలు దాటాయి. Unfortunately ఆ టపాలలో ‘ఎవరు దురహంకారులు?’, ‘దేశభక్తంటే మానవత్వం’ అంటూ నా మీద విరుచుకుపడినవే. అంటే ఇంత మేధావికీ నాలాంటి substance లేనివాడి పేరు చెప్పుకుంటేగానీ....


ఇక ‘కంప్యూటర్ ఎరా’ లో వచ్చిన బ్లాగు సమీక్ష వ్యాఖ్యలకి వస్తాను. వివాదాస్పదం అయ్యింది నా బ్లాగు కాదు. నా బ్లాగు గురించి కొందరు చేసిన ఆగడం వివాదమయ్యింది. నేను ప్రతిపాదించినవి మింగుడుపడని సిద్ధాంతాలని సీబీ.రావు గారంటే, జీడిపప్పు గారు రావుగారితో అంగీకరిస్తూనే అవేవీ పెద్ద గొప్పవి కావని తేల్చేశారు. నాకు అర్థంకాని విషయమల్లా ఒక్కటే నేను కొత్తవీ,గొప్పవీ, మింగుడుపడని సిద్ధాంతాలు రాస్తానని ఎక్కడైనా చెప్పుకున్నానా? లేక నా "పైత్యాన్ని" అందరూ ఒప్పుకోవాలని పట్టుబట్టానా? మరలాంటప్పుడు వివాదాలు చేసింది ఎవరు! అవి గొప్పవో కావో, ప్రత్యేకమైనవో-చెత్తవో నిర్ణయించినవారెవరు? ఎవరికి వారు తమ జడ్జిమెంటులు ఇచ్చేసుకుని అవేవో నా ఉద్దేశాలూ, భావనలుగా ప్రచారం చెయ్యడం ఎంతవరకూ సమంజసం?


Specific గా చెప్పారుకాబట్టి నేను ప్రతిపాదించిన "కాశ్మీర్ నాకొద్దు" సిద్ధాంతం గురించి ఒక మాట చెబుతాను. ఈ ఆలోచన నేను కొత్తగా ప్రతిపాదించినదేమీ కాదు. కొన్ని circles లో ముఖ్యంగా కాశ్మీర్లో జరుగుతున్న పౌర-మానవహక్కుల సమస్యల్ని, కాశ్మీర్ ను అడ్డంపెట్టుకుని ప్రముఖరాజకీయ పార్టీలు ఆడుతున్న నాటకాల్ని ఇన్నాళ్ళుగా దగ్గరగా చూసిన వర్గాల్లో alternate గా వినిపించే అభిప్రాయమే అది. హిందూస్థాన్ టైంమ్స్ వంటి జాతీయపత్రికలో వీర్ సాంఘ్వీ దాదాపు ఇదే అభిప్రాయాన్ని తెలియజెప్పితే లేని వివాదం నేను చెబితే మింగుడుపడనిది అయిపోయిందా? ఈ పరిణామం సమాచారం, పరిణితిలేని కొందరి సమస్యగా అనిపిస్తోందిగానీ నా పైత్యంలా అస్సలు కనిపించడం లేదు. కనీసం ఇప్పటికైనా నేను పెట్టిన లంకె చూసి ఆలోచనాపరిధిని పెంచుకోగలరని ఆశిస్తాను.


నాకూ సరిగ్గా తెలీదుగానీ, దాదాపు రెండు సంవత్సరాలుగా ‘కంప్యూటర్ ఎరా’లో బ్లాగు పరిచయాలు/సమీక్షలు సాగుతున్నాయి. దాదాపు అన్ని సమీక్షలూ బ్లాగు బాగుందని చెప్పి, చదవమని ప్రోత్సహించేవేతప్ప నెగిటివ్ గా చెప్పిన దాఖలాలు లేవు. అలాంటిది, ఇది నా బ్లాగు కాబట్టి "ఆకాశానికెత్తేసారు" "ముఖస్తుతి" గా రాశారు అని సమీక్షకురాలి నిబద్ధతను శంకించడం చూస్తే, అక్కడ బూతులు రాసిన కాగడా శర్మకీ మీకూ పెద్ద తేడా కనిపించడం లేదు. అంతేకాక "అతి ముఖ్యంగా - బ్లాగులోకంలో మీకు ఒక విశిష్టస్థానం, గౌరవం ఉన్నాయి. మీరు కూడా ఇలా వ్రాయడం శోచనీయం" అంటూ, నాగురించి మంచిగా రాయడం వలన వారి గౌరవానికీ, మర్యాదకూ భగం కలుగుతుందనే సూచన చెయ్యడం షాకింగ్. పైపెచ్చు "బ్లాగులోకంలో ఎందరో మహేష్ గారి కంటే మంచి బ్లాగర్లు ఉండగా ఆయనను పొగడడం"(తగదు) అని జ్యోతిగారికీ, "జ్యోతి గారు అంత పెద్ద ఎత్తున ముఖస్తుతి చేయడానికి మీరు తగరు" అని నన్నుద్దేశించి వ్యాఖ్యానించి, ఎవర్ని ఎక్కడ పొగడాలో ఎవర్ని ఏ విషయంలో తెగడాలోకూడా వీరే నిర్ణయించేస్తే ఎట్లా!!!


ఏదిఏమైనా...ఇదింతే. నాకెప్పుడూ పర్ణశాల మాత్రం ప్రశాంతంగానే ఉంటుంది.



****

24 comments:

జీడిపప్పు said...

మహేష్ గారు,
మీకు జ్యోతిగారు అనవసరంగా "సెలెబ్రిటీ" స్టేటస్ ఇచ్చారు, మీరు అందుకు తగరు అని నమ్ముతాను. ఎందుకు అలా అంటున్నానో, జ్యోతిగారి పైన, మహిళా బ్లాగర్ల పైన దాడికి ముఖ్యకారకుల్లో మీరు కూడా ఒకరు అని ఎందుకు అనుకుంటున్నానో నా బ్లాగులో "జ్యోతిగారూ, మీకిది తగునా?" అన్న పోస్టులో వివరిస్తాను. Stay tuned!

Anil Dasari said...

గొడవ సర్దుమణుగుతుంది అనుకునే దశలో శంఖారావంలో ఆయనేదో రాయటమేంటో, దానికి మహేష్ ఈ స్థాయిలో వివరణియ్యటమేంటో! ఛైన్ రియాక్షన్ లాగుంది. తర్వాతి వంతెవర్దో, ఇదెప్పటికి సమసేనో.

cbrao said...

‘కంప్యూటర్ ఎరా’ లో వచ్చిన బ్లాగు సమీక్ష పై, నా వ్యాఖ్య లోని ప్రశ్నలు, పర్ణశాల లో చర్చించిన సిద్ధాంతాలు, ఆచరణయోగ్యం కాదనో, లేక అవి సాధ్యం కాదనో చెప్పటానికో, అవి రాయలేదు. ఆ ప్రశ్నలు సమీక్షకులకు. ఆ ప్రశ్నలపై కూడా సమీక్షలో కొంత కేంద్రీకరిస్తే సమీక్ష సమగ్రంగా ఉండగలదని చెప్పటానికే. అందులో ఇచ్చిన ఉదాహరణలు కూడా సమీక్షకుల అవగాహనకు రాసినవే కాని పర్ణశాలకు ఎవో ఉద్దేశాలు ఆపాదించటానికి కాదు. వాస్తవంలో పర్ణశాల లో చర్చించిన విషయాలు ఎన్నో గంభీరమైనవి, విస్తృతమైనవి. అంతలోతుగా సమీక్ష ఉండాలని చెప్పటానికే ఉదాహరణగా ఇచ్చిన కల్లోల కాష్మీరం నా కొద్దు.

నా వ్యాఖ్య ఎవరికోసం, ఎందుకోసం రాయబడిందో అనే విషయం లో సందేహ నివారణకు అందులో లేవనెత్తిన ఒక ప్రశ్నకు నేనే బదులిచ్చి, ఈ ఉత్తరాన్ని ముగిస్తాను. "శంఖారావం బ్లాగులో చెప్పినట్లుగా బ్లాగులలో ముసలానికి కత్తి మహేష్ కుమారే కారణమా? " -నా జవాబు: ఇది హాస్యాస్పదమైన ఆరోపణ. నా వ్యాఖ్యలో లేవనెత్తిన ప్రశ్నలను చర్చిస్తూ, సమీక్ష సమగ్రంగా ఉండటానికై ఏమైతే రాయాల్సుంటుందో, అవి ఉదహరించి ఉండవలసినదని నేను అభిప్రాయపడ్డాను.

పర్ణశాల వంటి గంభీర బ్లాగు పై సమీక్షలను peer -review చేసి ఆ పత్రికా సంపాదకుడు ప్రచురించి వుంటే ఈ అపార్ధం కలిగేది కాదు.

సుజాత వేల్పూరి said...

మీ అభిప్రాయాలతో నాకు కొన్ని సార్లు తీవ్ర విభేదాలున్నా కొన్ని సార్లు మీ రాతలు నచ్చుతాయి. ఇలా మీతో ఏకీభవించినపుడల్లా నాకు "భట్రాజిణి"(రాజు అంటే బాగోదేమో) "సుజాత &కో"అనే బిరుదు కూడా ఇచ్చారు దయగల ప్రభువులు. పర్లేదు. నా అభిప్రాయం ఏమిటో తెలీడమే ముఖ్యంగానీ ఇలా అయాచితంగా వచ్చి పడే దూషణ భూషణలని లెక్క చేయను. బ్లాగ్లోకంలో నా గొంతెప్పుడూ నా సొంతమే! అభిప్రాయాలతో విభేదించడమా ఏకీభవించడమా అన్నది టపాను బట్టి ఉంటుంది, బ్లాగేదైనా సరే!కొందరి అభిప్రాయాలతో విభేదించడం వల్ల అలిగో, కోపగించో నా బ్లాగు చదవటం మానేసిన వారున్నారు. ఓకే!సరే!

ఇందులో అగ్గీ, ఇనుము ఇలాంటి పోలికలే అనవసరం! నేనెవరి బ్లాగులు చదవాలో, ఎవరివి చదవక్కర్లేదో నిర్ణయించుకోవాల్సింది నేను.

ప్రతి అంశం మీదా దాని అంతు తేలే వరకూ చర్చ సాగేది ఈ బ్లాగులోనే
అనుకుంటా!

కానీ ప్రస్తుత దాడులకు, మహేష్ గారి బ్లాగుకూ ముడిపెట్టడమే నాకూ మింగుడు పడటం లేదు. ఎందుకంటే సరస్వతీ కుమార్ గారి బ్లాగు కు కూడా నేను రెగ్యులర్ పాఠకురాలిని. ఇటువంటి తీవ్ర అభిప్రాయం ఇంతకు ముందెన్నడూ వ్యక్తపరిచినట్లు అనిపించడం లేదు.

మహేష్ గారు, మీరు కూడా చట్టం లాగా మీ పని మీరు చేసుకుంటూ పొండి!

నోట్: ఈ ఏడాది నాకు పంచాగంలో రాజపూజ్యం -0 అవమానం 25, ప్రచారం 100 అని రాశారేమో చూసుకోవాలి నేమాని వారూ, పిడపర్తి వారూనూ!

Unknown said...

సిబిరావు గారు, కంప్యూటర్ ఎరా మాసపత్రికను గత ఎనిమిదేళ్లుగా ప్రతీనెలా ఒంటిచేత్తో రాసుకుంటూ వస్తున్నాను. బ్లాగులపై సమీక్ష ప్రారంభించి మన బ్లాగర్లని పాఠకులకు పరిచయం చేస్తే బాగుంటుందని మొదట్లో జ్యోతి గారు సూచించబట్టి నేను ఒక పేజీ కేటాయించాను. సమీక్షలు సమయానికి అందించడం బాధ్యత ఆవిడ తీసుకున్నారు. ఈ నేపధ్యంలో తాడేపల్లి గారు, ఇంకా పలువురుని అభ్యర్థించి ఆవిడ సమీక్షలు అందించేవారు. ఇక్కడ ఒక్క విషయం చెప్తాను.. ప్రతీనెలా మేగజైన్ ప్రిపరేషన్ లో నాకున్న విపరీతమైన వత్తిడి వాతావరణంలో ఏ బ్లాగు సమీక్ష యొక్క పరిపూర్ణతనూ స్వయంగా పరిశీలించి మార్పు చేర్పులు చేసే సమయం నాకుండదు. ఒకవేళ బ్లాగు సమీక్షలపై నేనూ స్వయంగా స్పెండ్ చెయ్యవలసిన తీరుబడి ఉంటే ఆ సమీక్షలేవో నేను రాసేవాడిని తప్ప బయటి నుండి తీసుకునేవాడిని కాదు. ఒకవేళ అసమగ్ర సమీక్షలతో ఎందుకు కాలమ్ అనుకుంటే.. ఆ పేజీని కూడా ఇతర మా టెక్నికల్ విషయాలతో రూపొందించుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు. "పబ్లిష్ చేయబోయే ముందు ఎడిటర్ పాత్ర పోషించవలసి ఉంటుంది" అన్న కోణంలో మీరు మాట్లాడుతున్నారు. ప్రతీ నెలా మేగజైన్ లోని 48 పేజీల్లో బ్లాగు సమీక్ష మినహాయించి మిగిలిన 47 పేజీల కంటెంట్ కోసం రీసెర్చ్ చెయ్యడం, రాయడానికే నాకు సమయం ఇబ్బందిగా ఉంది. సో ఎక్కువమంది స్టాఫ్ ఉండే ఇతర పత్రికల మాదిరిగా నేను కేవలం ఎడిటర్ గా వ్యవహరించడం కుదరని పని. సమీక్ష రాసిన వారికే దాని బాగోగులు వదిలేస్తున్నాను.

MURALI said...

ఎవరో ముసుగులో ఉన్న వ్యక్తుల వ్యాఖ్యలని ప్రాతిపదికగా తీసుకుని, మనలో ఒకరు అని భావిస్తున్న వారు మనవారు అనుకున్న మరికొందరిని కించపరిచేలా వ్రాయటం, నిబద్దతని ప్రశ్నించటం చాలా భాదాకరమయిన విషయం.

అవును నిజమే కత్తిగారి భావాలని పూర్తిగా ఏకీభవించేవారు ఎవరూ ఈ బ్లాగులోకంలో లేరు. అలా అని పూర్తిగా వ్యతిరేకించేవారు లేరు. ఒక వ్యక్తిగాని అతని రచనలు గాని ఇష్టపడాలంటే తను వ్రాసిన ప్రతీది నచ్చాలని లేదు కదా. కొన్ని టపాలు నేను అంగీకరించలేనివి పర్ణశాలలో కనిపించినప్పుడూ మౌనంగా తప్పుకున్నా. నాకు నచ్చిన టపాలు వచ్చిన రొజున అభినందించా. అందరికీ అన్ని విషయాలలోను ఒకేరకమైన భావాలు ఉండాలని లేదు కదా. మద్యం త్రాగటం కొందరికి పెద్ద నేరంలా కనిపిస్తే కొందరికి ఆనందాన్ని ఇస్తుంది. మితంగా పుచ్చుకుంటే తప్పేమీ లేదు అనేవారు కొందరు, జీవితం అనేది అనుభవించటానికే ఇలాంటి రూల్స్ పెట్టుకుని నాశనం చేసుకోవద్దు అనే వారూ ఉన్నారు. అందుకే అందరి అభిప్రాయాలు ఒకేలా ఉండాలని, సమాజం హర్షించేలానే ఉండాలని అనుకోవటం తప్పేకదా. బ్లాగులోకంలో వివాదాలు పక్కనపెడితే కత్తిగారు ఒక వ్యక్తిగా చాలా మంచివారని ఎవరయినా అంగీకరించాల్సిందే.

కత్తిగారు, మీ గురించి తెలిసిన వారంతా మీ భావవైరుధ్యం తెలిసిన వారే. మీరు ఇలాంటి వివరణలు ఇవ్వాల్సిన అవ్సరంలేదేమో ఆలోచించండి. మీకు మితృలకే కాదు శతృవులకూ కొదవలేదు. మిరు వివరణలు ఇవ్వటం మొదలుపెడితే చాలాబ్లాగుల్లో ఇలాంటి కధనాలే వస్తాయి. ఎన్నిసార్లు స్పందిస్తారు? ఇది ఒక వ్యతిరేఖ వాదం, వారి వారి వ్యక్తిగత అభిప్రాయం అని వదిలేయండి.

జ్యోతి said...

అసలే బ్లాగ్ లోకం వివాదాలతో దద్దరిల్లిపోతుంటే మళ్లీ ఇంకోటా?? నేను సమీక్ష రాసింది మహేష్ కి 'సెలబ్రిటీ' స్టేటస్ ఇవ్వడానికి కాదు. కంప్యూటర్ ఎరా పత్రికలో నా అభ్యర్థన మేరకే శ్రీధర్ గారు ప్రతినెల బ్లాగు సమీక్ష కోసం ఒక పేజీ కేటాయించారు. అందుకే నేను ఆ భాద్యత తీసుకుని ప్రతినెల ఒక బ్లాగు సమీక్ష పంపిస్తున్నాను. నేను ఎప్పుడు కూడా మహేశ్ తో ఏకీభవించలేదు. మెచ్చుకోలేదు. అసలు నేను అతని టపాలన్ని చదివితే కదా ,, చదివి, నాకు అర్ధమైనవాటిలొనే కామెంట్స్ రాసాను. ఏ బ్లాగులో ఐనా ఇంతే.. నేను సమీక్ష రాసినంత మాత్రాన అతని స్టేటస్ వచ్చినట్టా? మరి అంతకుముందు రమణిగారిది రాసానే.. ఆవిడ బ్లాగు మూసేసుకున్నారు. ఆ పత్రికలో వచ్చిన బ్లాగు సమీక్షలకే ఆ బ్లాగర్లకు సెలబ్రిటీ స్టేటస్ వచ్చేస్తుందా?? ఇంతకు ముందు కొత్తపాళీ, తాడేపల్లిగారు కూడా సమీక్షలు ఇచ్చారు. కంప్యూటర్ ఎరా పాఠకులకు మన బ్లాగులను , వాటిలోని మంచి ఆలోచింపచేసే టపాలు పరిచయం చేయడమే ముఖ్యం అనుకున్నాను .. అందుకే మహేశ్ బ్లాగులోని వివాదాల గురించి రాయలేదు. ఇక శంఖారావం బ్లాగులో గొడవ నిన్న జరిగింది. నేనే ఈ సమీక్ష ఇచ్చింది నెల క్రింద.. అదెలా ఇవ్వగలను. శంఖారావం బ్లాగులో మహేశ్ ది తప్పు లేదనడం అతనిని No.1 బ్లాగర్ ని చేస్తుందా?? మహేశ్ మీద ఉన్న అభియోగాలన్నీ నేను పిచ్చాపాటీ లో అడిగాను. ఇవన్నీ చూసి నేను అతనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినట్టు అనిపిస్తుందా అందరికీ..

సుజాతగారు,
నేను కూడా మీరు చెప్పినట్టే ఆలోచిస్తున్నా. నా టైం బాలేదు అని. కాని నా జాతకం, పంచాంగం చూడట్లేదు. మౌనంగా అనుభవిస్తే సరి. తప్పదు కదా.

జీడిపప్పు గారు,

ఈ విషయమై మీరు రాసినా నేను సమాధానమివ్వదలుచుకోలేదు. ఎందుకంటే బ్లాగుల్లో ఇదే నా ఆఖరి వ్యాఖ్య. నా బ్లాగులో తప్ప ఎక్కడా రాయదలుచుకోలేదు. పొగిడితే ఆనందించి, విమర్శిస్తే బాధపడి తప్పుకోవట్లేదు. ఇప్పుడు ఏది మాట్లాడినా తప్పులు తీస్తున్నారు. సో మౌనంగా ఉండడమే మేలు కదా. మీకు ఎటువంటి సందేహాలున్నా నాకు మెయిల్ చేయండి .. తప్పకుండా సమాధానమిస్తాను.

ఏకాంతపు దిలీప్ said...

ఇప్పటికే చాలామంది చెప్పేసారు. ఈ విషయాన్ని పట్టించుకోకపోతేనే మంచిది. పట్టించుకునే కొద్దీ అది తెలుగు బ్లాగావరణాన్ని మరింత కలుషితం చేసే అవకాశం మనమే కల్పించినట్టవుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా ఎవరూ ఎవరికీ మద్ధతు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరి బ్లాగు వారిది. తెరిచి ఉంచుతారా, మూసి వేస్తారా అనేది పూర్తిగా వారి వ్యక్తిగతమైన నిర్ణయం. మనం గమనిస్తే అర్ధం లేని రచ్చ చేసే వాళ్ళని వేళ్ళమీద లెక్కగట్టవచ్చు. 99.9% మంది చాలా ఆరోగ్యకరంగానే మసలుకుంటున్నారు. ఏదో వెయ్యిమందిలో ఒక్కరో, ఇద్దరో ఇంకో ఇద్దరి మీద అర్ధం లేని దాడి చేస్తున్నారు అని, చేతనంగా ఉన్న మిగ్లిన బ్లాగరులు బ్లాగు చోటుని అతిగా ఈ విషయం గురించి వాడుకోవడం నాకైతే రుచించడం లేదు. దాడికి గురికాబడ్డ ఆ ఒకరిద్దరు తమని తాము ఇలాంటి అల్లరి మూకల ఆరోపణల ఆధారంగా
బేరీజు వేసుకోకుండా నిరంతరంగా వారి వారి వ్యాపకాలని కొనసాగించాలని కోరుకుంటున్నాను.

బ్లాగు అనేది మన గురించి, ప్రపంచాన్ని మనం ఏ విధంగా చూస్తున్నాము అనే దాని గురించి రాసుకునే వెసులుబాటు. మన బ్లాగు మన వరకూ ప్రత్యేకం. మన గురించి మనకే బాగా తెలుస్తుంది. కాబట్టి మనల్ని, మన బ్లాగుని ఎవరో ఇచ్చిన తీర్పుల ఆధారంగా బేరీజు వేసుకుని మన వ్యాపకాలని, వెసులుబాటుని వదులుకోవడం సరైన చర్య కాదు.

గీతాచార్య said...

నవ్వాగటం లేదు బ్రదర్! భలే దొరికారు మన బ్లాగర్లు. ఇదే నేను ఆరోజు బ్లాగర్ల మీటింగ్ లో చెప్పిన ప్రచార టెక్నిక్.

మాటల్లో చెప్పలేను కానీ నేను మనం కలసిన రోజు చెప్పినట్లుగానే మీ టపాలకి వ్యాఖ్యానించే అర్హత లేని వాళ్ళూ మీమీద కామెంట్ వ్రాయటం .... నిజంగా పెద్ద జోక్. I have laughed very loudly after a very long time. I oughtta give a party to my friends.

పిచ్చోడు said...
This comment has been removed by the author.
మాలతి said...

నోట్: ఈ ఏడాది నాకు పంచాగంలో రాజపూజ్యం -0 అవమానం 25, ప్రచారం 100 అని రాశారేమో చూసుకోవాలి నేమాని వారూ, పిడపర్తి వారూనూ!
:))
మహేష్ కుమార్, మీరు చెప్పింది నిజమే. ఎవరి అభిప్రాయాలు వారు సభ్యతలు పాటిస్తూ రాసుకుంటే మరొకరికి అభ్యంతరం కావడం విచారకరం.

durgeswara said...

ఇక్కడ అందరూ ఏమి జరిగినా అంటె పొగిడినా తిట్టినా పట్టించుకోమనే అభిప్రాయమే వ్యక్తం చేస్తున్నారు. మరెందుకిక చర్చ?సమయము వృధా అవటము,సమసి పోతున్న సమస్యలను కెలకటము తప్ప ప్రయోజనమేమున్నది?గీతాచార్య గారన్నట్లు ప్రచార టెక్నిక్లపై ఆధారపడేవారికి తప్ప మరెవరికి ఉపయోగపడని ఈ చర్చను ఇంతటితో ఆపేయమని మనవి.మనకు నచ్చని వ్యాఖ్యలొచ్చినప్పుడు వాటిని రిమూవ్ చేసే టెక్నిక్ ఎవరికన్నా తెలిస్తే పదిమందికి చెప్పండి.దానితో అసలు సమస్యలే ఉండవు.బయట పదిమందికి తెలిస్తే తెలుగు బ్లాగర్ల గురించి తక్కువ భావన ఏర్పడుతుంది.

Bolloju Baba said...

నా మనసులో ఉన్న భావాలను మురళి గారు చక్కగా అక్షరీకరించారనిపిస్తుంది. నేను అంత ప్రభావవంతంగా చెప్పలేను. నూరు శాతం ఏకీభవిస్తున్నాను.

జీడిపప్పు said...

జ్యోతిగారు,
మీ వ్యాఖ్య చూసిన తర్వాత నేను ఈ విషయం గురించి మరో పోస్ట్ వెయదలుచుకోలేదు. ఈ విషయం సాగతీతకు స్వస్తిపలుకుతున్నాను. ఎప్పటిలాగే మీ కీబోర్డు నుండి ఆణిముత్యాలను అందించగలరు.
మీ అభిమాని!

శరత్ కాలమ్ said...

మురళి గారి మాటే నాది కూడానూ. అసంబద్ధమయిన విమర్శలకు వివరణలు అవసరం లేదు.

asha said...

ఎవరైనా తప్పు చేస్తే అందరూ వెళ్ళి వాళ్ళని
ఇష్టానికి మందలించెయ్యటం నాకిష్టం ఉండదు.
ఏమో తెలియక చేసుండొచ్చు కదా అని అనుకుంటాను.
కానీ అర్ధంపర్ధం లేని అతని వివరణ చూశాక
చాలా చిరాకేసింది. ఇంతకు ముందులా ఆశ్చర్యం
కలగటం లేదు. ఇలాంటి వాళ్ళను ఇక్కడ చూసీ,
చూసీ అలవాటు అయిపోయింది. మీరు మీ అమూల్యమైన సమయాన్ని ఇలాంటి వాటి కోసం వెచ్చించకపోతేనే మంచిది.

శరత్ కాలమ్ said...

ఈ వివాదానికి సంబంధించిన బ్లాగులన్నీ ఒకేచోట:
http://sarath2.blogspot.com/

తెలుగోడు బ్లాగు అడ్రస్ తెలియక ఇంకా జతచేయలేదు.

Naga said...

౧. మురళితో ఏకీభవిస్తున్నాను.
౨. ఒరిజినల్ పేరు ఒరిజినల్ ఆలోచన కన్నా శా..నా.. గొప్పది. దాంట్లో దమ్ము అనేది ఉంటుంది గనుక.

Saraswathi Kumar said...

“100 కోట్ల పైగా ఉన్న భారతీయులంతా అవాంఛిత శృంగారం వలనే జన్మించారు..” లాంటి తీర్మానాలు చేసే మీరు ద్వేషం మూట కట్టుకోకుండా ఎలా ఉంటారు?

నా సమర్ధింపు వ్యాఖ్య మీకు చిరాకు తెప్పించడానికి కారణమేమిటి? నేను టపాలో చెప్పిన దానికి విరుద్ధంగా వ్యాఖ్యానించలేదు. ఆత్మపరిశీలన కోరడానికి ఒక innocent person ను పావుగా వాడుకోవాల్సిన అవసరం నాకు లేదు. నాకు మీమీద ఉన్న అభిప్రాయమే చెప్పాను. మిగతా వారిని ప్రస్తావించే సాహసం చేయలేకపోయాను. అదే నా వ్యాఖ్యలో చెప్పాను. పైగా ఈ విషయంలో నా ప్రధానమైన complaint మీ మీదే కనుక వారి పేర్లు ఎత్తవలసిన అవసరం నాకు కనిపించలేదు.

మీ రాతలు రెచ్చగొడతాయన్నది నిర్వివాదాంశం. జరిగిన దానికి మీరే ప్రత్యక్ష కారణమని నేను అనలేదు. అలానే మీరూ అనుకోలేదని మీ టపా వలన తెలుస్తున్నది. కానీ చదివేవారు అనుకుంటున్నట్లుగా అర్ధమవుతున్నది. ఒకసారి దుష్ట సంస్కృతి ప్రారంభమైన తరువాత అది ఎలా అయినా వ్యాపించవచ్చు. ‘పానశాల’లో అదృశ్యమైన వారే మరలా వేరే పేర్లతో ప్రత్యక్షమై ఇలా చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. లేదా వారు పానశాల ద్వారా ప్రేరణ పొందిన వారైనా అయి ఉంటారు.

ఆత్మపరిశీలన చేసుకోవాలా వద్దా అన్నది మీ ఇష్టం. నేను అనుకుంటున్నది నేను చెప్పాను. తెలుగు బ్లాగ్లోకం ఓ కుటుంబం అన్న ఆలోచనను పునః సమీక్ష చేసుకుని దానిని బట్టి మన ధోరణిని మార్చుకుంటే తప్పులేదనుకుంటాను. నావరకు నేను ఇది ఒక కుటుంబపు పరిధిని దాటి పెరిగిపోయిందని అనుకుంటున్నాను. దానిని బట్టి మీ stand ను మార్చుకోండని అందరికీ చెప్పాలనుకున్నాను.

మీ పేరు ఎందుకు చెప్పానంటే నేను అలా అనుకుంటున్నాను గనుకనే చెప్పాను. నాకు మీలాగా ఎవరిపేరూ ఎత్తకుండా ఎవరిని ఎక్కడ నొప్పించాలో అక్కడ నొప్పించేటట్లు రాయడం తెలీదు. మనసులో ఎవరు ఉంటే వారి పేరు రాసేస్తాను. మీరు మాత్రం “అగ్రవర్ణాల తలలు తెగుతాయి”, “భారతీయులంతా అవాంఛిత శృంగారం వలన జన్మించారు” అని స్టేట్‌మెంట్లిచ్చేసి ‘తాంబూలాలిచ్చేశాను, ఇక తన్నుకు చావండి’ అన్నట్లుగా పక్కకెళ్ళి నిలబడతారు ఎవరి పేరూ ఎత్తకుండా. అప్పుడు మీకది విపరీతంగా, దాష్టీకంగా అనిపించదా?

నేను ఆ బూతులను తేలికగా కొట్టి పడేసినది అవి మాట్లాడిన వారిని జనజీవన స్రవంతిలో కలపడానికి కాదు. ఆ బూతుల వలన బాధపడుతున్నవారి మనసులను తేలిక పరచడానికి. వారికి మగవారు చేసే పనులు తెలియదు కనుక చెప్పాలనుకున్నాను. అంతే! పైగా అది అబద్దం కూడా కాదని కాలేజి జీవితాన్ని అంతగా ఎంజాయ్ చేసిన మీకు తెలియదా?

నేను మీ emotions ను కెలుకుతున్నానని తెలుసు. కానీ మీ emotions గురించి, నాకు అంచనా ఉన్నది కనుకనే కెలికాను. నేను కెలక వద్దన్నది mass emotions గురించి. ఒక్క సంస్కార హీనుడిలో ద్వేషం రగిలినా పరిస్థితి తారుమారవుతుంది.

నేను కామెంట్లను, పాపులారిటీని ఇష్టపడను. నా భావాలు కొద్దిమందికే అని నాకు తెలుసు. వారికి అందితే చాలు.

మీకు substance లేదనే ఉద్దేశ్యం నాకు లేదు. కాకపోతే మీరు day-to-day matters గురించి చర్చిస్తారు. నాకు basic విషయాలంటే ఇష్టం. అంతే గానీ నేనో మేధావిననే ఫీలింగ్ నాకు లేదు.

‘సుధర్మ’ బ్లాగులో రాసిన సూత్రాలు నా భావాలు కాదు. ఓ సరికొత్త బోధన ఉన్న పుస్తకాన్ని తోటి బ్లాగర్లకు పరిచయం చేద్దామని ఆ పుస్తక సారాన్ని అందించాను. దాని రచయిత ‘ద్వితీయ పురుష’ (second person) లో రచన చేశాడు. శైలి బావుందని నేనూ అలానే అనువదించాను.

నాకు మీ భావాలతో, మీరు వాదించే విధానంతో విబేధమేగానీ మీ వ్యక్తిత్వాన్ని, విమర్శలను తేలికగా తీసుకునే మీ మనస్తత్వాన్ని, మీ స్నేహపూరితమైన నడవడికను నేను ఇష్టపడతానంటే మీరు నమ్మగలరా?

Kathi Mahesh Kumar said...

@సరస్వతీకుమార్: మీరు ప్రారంభంలోనే పప్పులో కాలేసారు. మీరు కొటేషన్లు పెట్టి మరీ నాకు ఆపాదిస్తున్న ఆ రెండు స్టేట్మెంట్లూ నేనివ్వలేదు. నేనన్నది "నూరుకోట్లున్న భారతీయులకు శృంగారం ఒక పాపం. ఇదీ మన హిపోక్రసీ" అని. ఇక రెండవది కలగూరగంప బ్లాగులో కుల హింసలపై జరిగిన చర్చల్లో నేను చెప్పిన దానికి మీ వక్రభాష్యం. అక్కడ నేనన్నది "ప్రతి హింసకూ ప్రతిహింస చెయ్యాలని నిమ్నకులాలు అనుకునుంటే, ఇప్పటికి కొన్ని వేల అగ్రకుల తలలు తెగిపడుండేవి" అని.

మొత్తానికి అర్థమయ్యిందేమిటంటే, మీలాంటి మెడకాయమీద తలకాయున్న మేధావులుకూడా కుల,మత భావజాలాలకు అతీతంగా మనుషుల్లాగా ఆలోచించలేరు.నేను రాసినదాన్ని కనీసం సరిగ్గా చదవకుండా, కేవలం మీకు కావలసిన అర్థాన్ని దాన్నుంచీ గ్రహించి "దాడి" చెయ్యడానికి సిద్ధపడతారని. మీలాంటి వారే ఇలా చేస్తే, ధూంమచాలే, కాగడా శర్మా నాకిప్పుడు గౌరవప్రదమైన వారులాగా కనిపిస్తున్నారు. At least we know that they are rogues. But people like you are much more dangerous.

Bala said...

Most of the times people impose own feelings to others. Mahesh, just write whatever you think is right. Let the people cry with their age old prejudices, or passive aggressive shit.

Anonymous said...

neelanti yedadva raatalaki comments kaaka poolu raaltaayaa aakaasam nunchi. raasukunedi raasukoka neeku ee statistics enduku? evadiki ekkuva comments vunte vaadi blaagu goppa ayipodu. koddiga burra vaadehe.

Anonymous said...

"At least we know that they are rogues. But people like you are much more dangerous."

Is this possible not to hate this son of a bitch?

స్వేచ్చ said...

Mahesh you Rock man....don't even think about these guys....Please dont write or talk about these guys in parnashaalaa....