Wednesday, March 25, 2009

చలం గురించి నేను


చలం వ్యక్తికాదు. ఒక సాహితీ విప్లవం. ఒక సామాజిక ఉద్యమం.నిర్ధిష్టమైన prescribed విలువల్లో కుంచించుకుపోయిన మానవతలోని ఒక పార్శ్వాన్ని తన రచనలతో ఉద్దీపనం చేసిన ఋషి.

మనుషులూ,మనసులూ,విలువలూ,నమ్మకాలూ,ఆకర్షణలూ,ఆవేశాలూ అన్నీ మారతాయని చెప్పిన చలం, తన విధానాన్ని మార్చుకుంటే నిరసించాల్సిన అవసరం లేదు.

ఇలాంటి వ్యక్తులు వ్యక్తిగత,వైవాహిక,సాంఘిక జీవితంలో పెద్ద విఫలురిగా కనిపిస్తారు. అది మన సాధారణ కోణంలోంచీ చూస్తే అలాగే అనిపిస్తుందికూడా. కానీ Their contribution will be measured by a collective consciousness of a society.

చలం సాహిత్యం over rated అనుకునేవాళ్ళకు ప్రపంచసాహిత్యంతో పరిచయం లేదనుకోవాలి. James joeys తన stream of consciousness శైలిలో కుస్తీలు పడుతున్న సమయానికి చలం "మ్యూజింగ్స్" రాసేశాడు. ప్రపంచ సాహిత్యం Absurd,abstract, magic realism అనే మాటలు వంటబట్టించుకున్న సమయంలో చలం "మైదానం" సృష్టించాడు.

చలం ఇంగ్లీషులో రాయలేదుగాబట్టి ఈ ఖర్మగానీ, లేకపోతే ఎప్పుడో నోబెల్ బహుమతి వచ్చేది. ఇక మరో ఖర్మ తను తెలుగు పాఠకులకోసం రాయడం. చాలా మంది చదవకుండానే విమర్శిస్తారు, మరికొందరు చదివి అర్థం చేసుకునే ధైర్యం లేక తిట్టిపోస్తారు. మనమింతే!

చలాన్ని ఆస్వాదించి అనుభవించడమేతప్ప అర్థం చేసుకు దాన్ని విడమర్చి చెప్పే సాహసాన్ని చెయ్యలేను. అంత పరిణితి నాకు లేదు. కాకపోతే, ఒక్క విషయం మాత్రం చెప్పగలను.Chalam works appeal to my primordial instincts that are still raw and formative.

మనమే ఒప్పుకోలేని మనలోని నిజాల్ని మనకు పరిచయం చేసిన చలాన్ని, వ్యక్తిగతంగా అనుభవించి మన meaninglessness ని,futility ని, insignificance ని,guilt ని celebrate చేసుకోవాలేగానీ, సాహితీవిమర్శనమో లేక సామాజిక దర్శనమో కొలమానాలుగా కొలవకూడదని నా నమ్మకం.

Chalam is personal to anyone and everyone who reads him.అనుభవించండి. Intellectual and emotional limitations మధ్య అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యకండి.

చలం ‘మైదానం’ ఒక ఆలోచన. సమాజంలోని hypocrisy కి వ్యతిరేకంగా రచయిత సృష్టించే parallel ప్రపంచానికి ప్రతీక.Its an imagery of resistance. దాన్ని ప్రాపంచిక నిజం అనుకుని చదివితే లేదా అలా జరుగుతుందా లేదా అని ప్రశ్నించుకుంటే సంతృప్తికరమైన సమాధానాలు దొరకవు.బహుశా మీ ప్రయత్నం అలాంటిదే అయ్యుండచ్చు.

చలం alternate values స్థాపనకోసం పుస్తకాలు రాయలేదు. తన నిజాన్ని సామాజిక నిజానికి ఎదురుగా నిలిపి ప్రశ్నించాడు. చలం చెప్పినవాటినీ,చేసినవాటినీ అమలు చెయ్యాలనే రూలేం లేదే! నావరకూ,నాలోని బలహీనతల్ని,వాంఛల్నీ,అర్థరహితత్వాన్నీ అర్థం చేసుకోవడానికి, వాటిని celebrate చేసుకోవడానికీ నేను చలం సాహిత్యం చదువుతాను.

I believe it was one of the most personal literature ever written.

కవి,రచయిత ఒక కాల్పనిక ప్రపంచాన్ని నిజమైన ప్రపంచానికి ధీటుగా సృష్టించడం ద్వారా, సామాజిక నిజాన్ని ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నించడం యొక్క ఉద్దేశం, సామాజిక విలువల్లో ఉన్న లొసుగుల్ని ఎత్తిచూపడమే తప్ప escapist గా మారి ఆ కల్పనల్లో బ్రతకమని కాదు.

మైదానం ఒక surrealistic నవల.కథా ప్రదేశం ఒక mind scape.అందుకే, అక్కడ జరిగేదాన్ని నిజమనుకోవడం, లేదా నిజ జీవితంలో అలా జరగాలనుకోవడం అర్థతహితం. రచయిత ఉద్దేశం,ఇలా జరిగే అవకాశం ఉన్నప్పుడు నిజమైన ప్రపంచంలో ఆ "హద్దుల్ని" ఎలా చెరపాలో ఆలోచించాలనే బీజాన్ని నాటడం.

ఇక్కడ సమస్యేమిటంటే, చలాన్ని మన భౌతిక విలువల నేపధ్యంలో బేరీజు చేసి అర్థం చేసుకోవాలనుకోవడం. లేదా వాటికి అనుగుణంగా లేడని నిరసించడం. అదీ కాకపోతే, తను చెప్పేది అక్షర సత్యమని (alternate truth గా) ప్రచారం చేసి మూర్ఖత్వాన్ని మూటగట్టుకోవడం. అన్నీ తప్పే! అందుకే చలం సాహిత్యాన్ని అర్థం చేసుకోవడం కష్టం అని నాకు అనిపిస్తుంది.

ప్రపంచ సాహిత్యంలో రెండో ప్రపంచయుద్ధం నాటికిగానీ రాని disillusionment with life and questioning the very existence of the "meaning" of life ఆలోచనలు చలం సాహిత్యంలో మొదటి ప్రపంచయుద్ధ కాలం నాటికి ముందే కనిపిస్తాయి.Fragmented consciousness ని అత్యంత లాఘవంగా అక్షరబద్ధం చేసిన అతికొద్దిమంది ప్రపంచసాహితీకారుల్లో చలం ఒకరు.

నావరకూ చలం సాహిత్యం, ప్రత్యామ్నాయ విలువల్ని సృష్టించే సాహిత్యం కాదు. కాబట్టి ఆ విలువలు పాటించాలా? తను చెప్పేవాటిల్లో విలువెంత? వంటి ప్రశ్నలు నిరర్థకం.

చలం సాహిత్యం సంధించిన ప్రశ్నల సాహిత్యం. కాబట్టి ఎంతవరకూ existing విలువల్ని ప్రశ్నించి ఆకళింపు చేసుకున్నావు? ఎంతస్థాయిలో జీవితాన్ని గౌరవించి ఆ prescribed విలువల్ని త్యజించావు? అన్నవే సరైన ప్రశ్నలు.

చలం దేవుడు కాదు. మామూలు మనిషి. అందుకే అతని సాహిత్యం బలహీనతల సాహిత్యం. శైశవదశలో ఉన్న వాంఛల సాహిత్యం. అర్థం కాని శారీరక ఉన్మాదాల సాహిత్యం.Some one should give voice to such complexities in human life. He did it. అందుకే అతను ఒక ముఖ్యమైన సాహితీవేత్త.

నచ్చడం నచ్చకపోవడం అనేవి వ్యక్తిగత అభిరుచినిబట్టి ఏర్పడే అభిప్రాయాలు. వాటిల్లో విభేధించడానికి ఏమీ ఉండదు. కానీ,dismissing Chalam as whole based on it, may not be a wise thing.

చలం ఆడజాతిని "ఉద్దరించాలని" అనుకున్నట్లు నాకైతే ఎక్కడా అనిపించలేదు. ఆడవాళ్ళకూ అంతర్గత భావేవేశాలుంటాయని తన అనుభవంతో నేర్చుకున్నాడు.ఆ భావావేశాలకు తగిన గౌరవం ఇవ్వాలని కాంక్షించాడు,ఇచ్చాడు.

అయినా ఆడవారు తేరగా కూర్చును ఉద్దరింపబడటానికి తయారుగా ఉన్నట్లు భావించడంలో అసలు అర్థమే లేదు. ఆడది ఒక మౌనవిప్లవం. ప్రతిరోజూ,ప్రతిచోటా (సమూలమైన)మార్పు తెస్తూనే ఉంటుంది.

ఆడదాన్ని ఆడదానిగా గౌరవించడం,అభిమానించడం,ప్రేమించడం కాముకత్వం అని మీరు నిర్ణయిస్తే చలం నిస్సందేహంగా కాముకుడే.

23 comments:

గీతాచార్య said...

"అయినా ఆడవారు తేరగా కూర్చును ఉద్దరింపబడటానికి తయారుగా ఉన్నట్లు భావించడంలో అసలు అర్థమే లేదు. ఆడది ఒక మౌనవిప్లవం. ప్రతిరోజూ,ప్రతిచోటా (సమూలమైన)మార్పు తెస్తూనే ఉంటుంది."

ఈ మాట అన్నారుగా. ఇక మీరు నిస్సందేహంగా ఒక స్త్రీ ద్రోహే. :-D

గీతాచార్య said...

"చలం దేవుడు కాదు. మామూలు మనిషి. అందుకే అతని సాహిత్యం బలహీనతల సాహిత్యం. శైశవదశలో ఉన్న వాంఛల సాహిత్యం. అర్థం కాని శారీరక ఉన్మాదాల సాహిత్యం.Some one should give voice to such complexities in human life. He did it. అందుకే అతను ఒక ముఖ్యమైన సాహితీవేత్త."


ఇంతకు మునుపు చలం నాకి ఒక నిషేధిత వ్యక్తి. కానీ ఈ వాక్యాలను చూశాక నాకు interest కలిగింది. ఈ సెన్సార్ సర్టిఫికేట్ ఉంటే నేను ఆ వైపు దృష్టి సారించగలనేమో!

అంత మాత్రాన అంతా మారినట్టేనా అంటే... that solely depends on my metaphysical premises. Same is the case with D H Lawrence. Last time at the Vijayawada Book FEST, when I was about to buy DH Lawrence's 'The Rainbow', I have a second thought after seeing the header page. This's because of my previous experience.

The thing is that... when I bought Ayn Rand's THEROMANTIC MANIFESTO, my brother after merely looking at the title, imagined a lot of things, and said, "నాన్నా, వీడు చెడిపోయే స్టేజి కూడా దాటేశాడు. రోమాన్సే కాదు. దాని మానిఫెస్టోలు కూడా చదివేస్తున్నాడు."

What can I say on such things? http://en.wikipedia.org/wiki/The_Romantic_Manifesto

My third thought, which is my rational consciousness said to me, "You know what u r about to do." It's obvious what followed next.

A good and thought provoking post, but not at your best.

ThankQ.

మోహన said...

very well said.

ప్రియ said...

మైదానం ఒక surrealistic నవల.కథా ప్రదేశం ఒక mind scape

Gr8.

Anonymous said...

Well said Mahesh gaaru.

There are few people, who do not exist in the realm of any sort of measurements. To measure or understand them, with our faculty called "brain" is nothing but a futile exercise. In contemporary literature, undoubtedly chalam is one among such.

రవీంద్రుడి గీతాంజలి ని మొదట ఎద్దేవా చేసిన వాళ్ళున్నారు. అలానే, మానవత జాలువారే ఆయన కథలను ఈసడించిన ప్ర-ముఖులూ (కుష్వంత్ సింగ్) ఉన్నారు.

నా దృష్టిలో చలం రచనల ద్వారా, చలం అన్న వ్యక్తిని అర్థం చేసుకోవచ్చునేమో కాని, చలం అన్న రచయిత ను కాదు.

Unknown said...

chaala baaga vraasaaru. nenu elage anukuntu vuntanu... chalam english lo vraasi vuntena... ani

సుజాత వేల్పూరి said...

"నా దృష్టిలో చలం రచనల ద్వారా, చలం అన్న వ్యక్తిని అర్థం చేసుకోవచ్చునేమో కాని, చలం అన్న రచయిత ను కాదు".....Ravi gaaru, interesting!

Kathi Mahesh Kumar said...

@రవి: చాలా బాగా చెప్పారు. నిజమే చలం రచనల్ని కాకుండా, తన రచనల్ని ఆధారం చెసుకుని తనని బేరీజు చేసేవారే ఎక్కువగా కనిపిస్తారు. అందుకనే తన రచనల్ని అర్థం చేసుకునే పాఠకులు కరువయ్యారు.

@గీతాచార్య:మనలోని చీకటికోణాల్ని మనకే పరిచయం చేసే రచనలు చలం సాహిత్యం. మన unrealized dreams,aberrations ని అంగీకరించకపోయినా, కనీసం గుర్తించడానికి చలం రచనల్ని చదవాలి. Inner most coronal desires కి అక్షరరూపం ఇచ్చిన చలాన్ని చదివి అనుభవించాలంటే కొంత సాహసం అవసరం. అది అందిపుచ్చుకుని చదవండి.

Anonymous said...

చలం ‘మైదానం’ ఒక ఆలోచన. సమాజంలోని hypocrisy కి వ్యతిరేకంగా రచయిత సృష్టించే parallel ప్రపంచానికి ప్రతీక.Its an imagery of resistance. దాన్ని ప్రాపంచిక నిజం అనుకుని చదివితే లేదా అలా జరుగుతుందా లేదా అని ప్రశ్నించుకుంటే సంతృప్తికరమైన సమాధానాలు దొరకవు.బహుశా మీ ప్రయత్నం అలాంటిదే అయ్యుండచ్చు

-- చాలా వరకు అలాగె ఆలోచిస్తారు!

పరిమళం said...

"మనుషులూ,మనసులూ,విలువలూ,నమ్మకాలూ,ఆకర్షణలూ,ఆవేశాలూ అన్నీ మారతాయని చెప్పిన చలం" నిజం ! పరిస్థితులకు అనుగుణంగా , కాలానుగుణంగా అన్నీ మారిపోతాయన్నది నిజం . చలంగారి రచనల పట్ల మీ విశ్లేషణ బావుంది .చివరి ఐదు పేరాల్లో చలం గారి పట్ల మీ అభిప్రాయ వ్యక్తీకరణ బావుందండీ .

Anonymous said...

@Ravi: 'There are few people, who do not exist in the realm of any sort of measurements. To measure or understand them, with our faculty called "brain" is nothing but a futile exercise.'

రవీ, మహేషూ ఎటువంటి హిపోక్రైట్లంటే - వాళ్ళ బ్రెయిన్లు చలాన్ని అంచనా వెయ్యలేవు. కానీ అవే బ్రెయిన్లు రాముణ్ణీ, కృష్ణుణ్ణీ, హిందూమతాన్నీ, హిందూ ఫిలాసఫీని, భారతాన్నీ, రామాయణాన్నీ, గాంధీని అద్భుతంగా అంచనా వేస్తాయి. జడ్జిమెంట్లు పాస్ చేస్తాయి. తమ బుర్రలో పుట్టిన అభిప్రాయాల్ని ’సాధికారం’గా ప్రచారం చేస్తాయి.

వారేవా.. మహేష్ రాతలకంటే ముందు రవి కామెంటుకి చప్పట్లు కొట్టాలి ఇక్కడ.

Kathi Mahesh Kumar said...

@కొత్తపాళీ: మీరు "interesting" అని ఒక్క పదంలో ముక్తసరిగా ముగించేసరికీ ఖంగారుగా ఉంది సార్! ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు.

@అనామకుడు: Fools and fanatics are always certain of themselves అంటారు. I am neither of them కాబట్టి, ఇప్పటివరకూ నేను నమ్మేవాటిని పరమసత్యాలని ఎప్పుడూ ప్రచారం చెయ్యలేదు. They are my believes and convictions. So,I am entitled to it as my right.

Anil Dasari said...

@మహేష్:

చలం విషయంలో మనిద్దరికీ పెద్ద సంవాదమే జరిగింది, వేరెక్కడో. కాబట్టి ఈ విషయంలో నా అభిప్రాయాలు మళ్లీ చెప్పబోవటం లేదు. నాకర్ధం కానిది ఒకటి అడగాలని మాత్రమే ఈ ప్రశ్న.

'చలాన్ని అర్ధం చేసుకోబూనొద్దు, ఆస్వాదించండి' అనేది మీరు తరచూ అనే మాట. అదెలాగో నాకంతుబట్టదు. ప్రతిదీ అర్ధం చేసుకోటానికి ప్రయత్నించటం నా నైజం. సరే ఆ విషయమొదిలేద్దాం.

అర్ధం చేసుకునే పనిలేకుండా ఆస్వాదించాలంటే చలమే కాదు, అర్ధం పర్ధం లేని రచనలు చేసిన అనేక ఇతరులూ ఆ కోవలోకే వస్తారు. ఏడాదిగా మీ టపాలు, వ్యాఖ్యల ద్వారా నాకర్ధమైన మీరు ప్రతి విషయాన్నీ అర్ధం చేసుకోటానికి ప్రయత్నించే రకం. చలం విషయంలో మీ మాటలు మీ స్వభావానికి తగ్గట్లుగా లేవు. ఎలాగోలా ఆయన రచనల్ని వెనకేసుకు రావాలనే తపనే నాకిందులో కనిపిస్తుంది.

చలం నచ్చనోళ్లకి ప్రపంచ సాహిత్యంతో పరిచయం లేదనే నిర్ధారణకీ మీరొచ్చేశారు. బాగుంది. ప్రపంచ సాహిత్యంతో పరిచయముంటేనే చలం నచ్చుతాడని మీ నమ్మకమా? దానికీ దీనికీ లంకేమిటో నాకర్ధం కావటం లేదు. ఫౌండేషన్ కోర్సులు చేస్తేనే కానీ అర్ధం కాని సాహిత్యం సాహిత్యమే కాదు.

Anonymous said...

Anonymous గారు,

అంచనా కు ప్రశ్నించడానికి మీకు తేడా తెలుసుకోవాలి. బహుశా అది మీకు చెప్పినా అర్థం కాదేమో. హిందూ మతంలో వైదిక కర్మకాండల్ని విమర్శించడం అన్న పని బుద్ధుడే చేశాడు. ఆది శంకరాచార్యులు బుద్ధుణ్ణి విమర్శించారు. ఆయనను తిరిగి రామానుజుడు, ఆయనను మధ్వాచార్యుడు...

ప్రశ్న, విమర్శ - హిందూ మతం లోనే ఉన్నాయి, గమనిసే బావుంటుంది.

"ప్రచారం" - ఈ మాట మంచి జోకు.

రాముడు, కృష్ణుడు...గాంధీ - ఇది కూడా.

ఇక హిపోక్రసీ. నేను 100 శాతం హిపోక్రైట్ నే. నాకు రేప్పొద్దున రాముడి గురించి బాగా అర్థమయిపోయి ఆయన చర్యలు సబబనిపిస్తే రాముణ్ణి నెత్తి మీద పెట్టుకుని పూజించడానికి అభ్యంతరమే లేదసలు. అయితే అది జరిగే వరకు ప్రశ్నించడమే జరుగుతుంది.

Bolloju Baba said...

after a long gap :-)

చలంపై మంచి వ్యాసం అందించారు.

డభ్బై ఎనభై సంవత్సరాల క్రితం నాటి క్రితమే ఆయన నిర్మించుకొన్న శైలి, ఈ నాటికి ఫ్రెష్ గా ఉండటం ఒక అద్బుతం కాక మరేమిటీ? ఆ కాలంలో వచ్చిన ఏదైనా మరో పుస్తకాన్ని తీసుకొని చదివితే ఈ విషయం స్ఫష్టంగా అర్ధం అవుతుంది.
తెలుగు సాహిత్యాన్ని "ఊగించి, లాలించి, శాసించి" అని శ్రీశ్రీ గురించి చలం అన్నాడు కానీ అది నిజానికి చలానికి ఇంకా ఎక్కువగా వర్తించే మాట.

ఏకాంతపు దిలీప్ said...

"అయినా ఆడవారు తేరగా కూర్చును ఉద్దరింపబడటానికి తయారుగా ఉన్నట్లు భావించడంలో అసలు అర్థమే లేదు. ఆడది ఒక మౌనవిప్లవం. ప్రతిరోజూ,ప్రతిచోటా (సమూలమైన)మార్పు తెస్తూనే ఉంటుంది."
ఆడవారు-మార్పు గురించి కుదిరితే మీరు ఇంకొంత విపులంగా రాయండి. ఏ ఆలోచనలతో మీరు అలా ప్రస్తావించారు?

Kathi Mahesh Kumar said...

@ఏకాంతం దిలీప్: స్త్రీ పురుషులు సమానమని మనసావాచాకర్మణా నమ్మే చలం, స్త్రీజనోద్ధరణ కోసం రచనలు చేసాడంటే కొంత సందేహించక తప్పదు. ఉద్దరణ అనేది పైస్థాయిలో ఉన్నవాళ్ళు క్రిందస్థాయి వారికోసం చేసే ప్రయత్నం. ఇలాంటి ఫ్యూడల్ భావనకు చలం ఆధిపత్యం వహించాడని నేను అనుకోను.

నావరకూ చలం తనసాహిత్యం ద్వారా, సమాజం ముఖ్యంగా పురుషుడు తనని తాను సంస్కరించుకుని స్త్రీకి తగిన స్థానం కల్పించి, తనను తాను ఉద్ధరించుకుని సామరస్యమైన సమాజనిర్మాణం చేసుకోవాలనే ఆశయం కనిపిస్తుంది.

ఇక స్త్రీ నిర్దేశించే మానవ-సామాజిక విప్లవాల గురించి విపులంగా రాసే ప్రయత్నం చేస్తాను.

chakri said...

"ఎటు చూసినా నీలపు ఆకాశం, కొండలు, పచ్చని చెట్లు,, ఆకాశం కేసి చేతులు చాచే మైదానాలు.."
"ఆరు బయట చక్కని బంగారపు ఎండలో తళతళ లాడే ఏటి చల్లని నీళ్ళు.. తెల్లని ఇసిక... చిన్ని అలలు నా కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడటం, తమాషా రంగుల పిట్టలు వచ్చి తొంగి చూసి , చిన్ని చిన్ని పలుకులు ఈలలు ,, ఆ ఆకుల గుహల్లోంచి పలికేవి.ఆ పక్షి రెక్కలోంచి ఒక ఈకే నామెడ వచ్చి వాలేది సోమరిగా, "
"ఆ పిట్టలన్ని నాకు గుర్తు, ప్రతి మధ్యాన్నం ఎదురు చూసేదాన్ని వాటికోసం, వాటికీ నాకు ఏదో భందుత్వం ఉన్నట్టు తోచేది. కొంగల బారు నా తల మేడనుండి వెడుతూ నా ఒంటరి తన్నాన్ని గుర్తు చేసింది..."-chalam
ఆస్వాదించండి..:)

chakri said...

చలం గారు కేవలం పాత కాలం నియమ నిభంధంనల్లో లోటు పాట్లు.. స్త్రీ స్వేఛ్ఛా.. ఇవోక్కటే కాదు కదా రాసింది.. ఆయన రచనలు సమాజం.. మనిషి.. జీవితం మీద .. ఒక దృక్పథం కలిగిస్తాయి.. అవొక ఆలోచన ..ఒక మేలుకొలుపు .. ఒక తత్వం ..
ప్రకృతిలో మమేకమై ..ప్రేమించి ..ఆరాధించి.. ఆ అమృతాన్ని తన అక్షరాల్లో నింపిన మహానుభావుడు.
తనలోకి తాను చూసుకొన్న ఒక తపస్వి..
అలాటి రచనలు ముందు తరాలకి పరిచయం చేయటం ఎంతో అవసరం.

Anonymous said...

@రవి: పదాలు మారిస్తే తిమ్మి బమ్మి అయిపోదు. ప్రశ్నా, విమర్శా అనవసరం అని ఎవరూ అనడం లేదు. మరి ఇవే ప్రశ్నా, విమర్శా చలానికి మీరెందుకు అప్లయ్ చెయ్యలేరో!! ముసలోడయ్యాకా చలం చాదస్తుడై ప్రపంచం అంతమైపోతోందని ప్రచారం కూడా చేశాడు. అదంతా ప్రశ్నించకూడని, విమర్శించకూడని విషయం కాబోలు. దాన్ని ప్రశ్నించడానికి మీ బ్రెయిన్లు సరిపోవు కాబోలు. మరి మిగతా గొప్ప వ్యక్తుల్ని ప్రశ్నించడానికి మీ బ్రెయున్లు ఒంటికాలిమీద లేస్తాయి కాబోలు.
చలం ఒక్కణ్ణీ మాత్రం అర్థం అయ్యేవరకూ ప్రశ్నించాల్సిన అవసరం లేదు కాబోలు. రాముడు అర్థం అయ్యేవరకూ మాత్రం ప్రశ్నలు లెగుస్తూనే ఉంటాయి.

హిపోక్రసీ అంటే పొగడ్త అనుకునే బ్రెయిన్లకి ఇటువంటి విమర్శలూ, ప్రశ్నలూ అర్థం అవుతాయనుకోవడం కూడా భ్రమ.

రవి said...

@Anonymous : ఈ సారి చలాన్ని కాస్త బాగ చదవండి. చలం తనను తానే ప్రశ్నించుకున్న వ్యక్తి. మ్యూజింగ్స్ లో చాలా చోట్ల self - introspection, అలాగే self - contradiction కనిపిస్తాయి. తనొక మామూలు మనిషి. అయితే తనను తాను మభ్యపెట్టుకోని హృదయ వాది.

So called గొప్ప వ్యక్తులు ఎప్పుడూ conformists. వాళ్ళని defend చేసుకోడానికి, శాస్త్రాలు, పురాణాలు, అది వరకే సమాజంలో establish అయిన morals ఇవన్నీ దోహద పడతాయి.

మీరు ఎలాగనుకున్నా ఇబ్బంది లేదు. రాముడి గురించి ప్రశ్నలు నాకు లెగుస్తూనే ఉంటాయి established morals are not morals అని నాకు శంక ఉన్నంతకాలమూ. ఇందులో ఒకరిని అవమానించడం అన్న ప్రశ్నే లేదు, రాముడి మీద కసి, ద్వేషం అన్న ప్రశ్న కూడా లేదు.

If u feel that, one is a hypocrite by defending chalam, and by not going with majority in case of some (defined) great person, then u r entitled to assume so.

No issues.

Kathi Mahesh Kumar said...

@అనామకుడు: చలం గురించి చర్చలో ఎక్కడో ఏదో అన్నారు, ఇక్కడ ఇలా అంటున్నారు అంటూ బోడిగుండుకూ మోకాలుకూ ముడిపెట్టి జడ్జిమెంట్లు చేసింది మీరు.

నా(మా)అభిప్రాయాలు సమయానుగుణంగా మారతాయి. ఇవ్వాళ తెగిడినదాన్ని హేతువు దోరికితే పొగుడుతాను. దాన్ని evolution అంటారు. హిపోక్రసీ కాదు.

కృష్ణ కాంత్ said...

మనిషి మనసు లో తనకే తెలీని అగాధాలు చాలా ఉంటాయి. ఒక రచయితో, కవో మనిషి చేయి పట్టుకుని ఆ అగాదాల్లోకి తీసుకు వెళ్ళినప్పుడు ఎన్నో ఆశ్చర్యాలు, ఆనందాలు, అనుభూతులు, భయాలు చుట్టుముడతాయి. అవన్నీ మనలోనే ఉన్నాయన్న విషయాన్ని మర్చిపోయి ఆ కవినో, రచయితనో నూతన పథికుడు గా పోగుడుతాం, లేదా సమాజాన్ని చీకట్లోకి తోస్తున్నాడని తిట్ట్టుకుంటాం.
చలం రాసిన ప్రతి అక్షరం నిజం. మనకు తెలీకుండా మనలో దాగున్న నిజాలవి. ఆ నిజాన్ని చూసి అనుభూతి, ఆనందం పొందే వారు కొందరు. భయపడో, అసహ్యించుకునో దూరంగా పారి పోయే వారు కొందరు. భార్యనో, ప్రేయసినో, జీవితం లో బాగా దగ్గరైన ఏ రహస్యాలు దాచుకోని స్త్రీ లో ఆలోచనలు అనుభూతుల గురించి అడిగి చుడండి. వారి ఒక్కొక్క మాట లో చలం కనిపిస్తాడు.
చలం రాసింది కొందరికి బూతు, కొందరికి వేదం. ఏదేమైనా అది నిజం.