వస్తువులు మన ఎదురుగా బౌతికంగా ఉంటే ఉంటాయి, లేకపోతే లేదు. కాబట్టి బౌతికవస్తు పరిజ్ఞానానికి ఎటువంటి వ్యతిరేక భావనా లేక వైరుధ్యం ఉండవు. కానీ మన "నిజాల" జ్ఞానానికి ", "అబద్ధం" అనే వ్యతిరేకపదం ఎప్పుడూ వెన్నంటినే ఉంటుంది. అందుకే నిజాల భావనలో వైరుధ్యాలు సహజం. అలాగే అబద్ధాల్లో కూడా వైరుధ్యం అంతే సహజంగా ఏర్పడుతుంది. ఎందుకంటే, నిజం-అబద్ధం అనేవి "నమ్మకం" ఆధారంగా ఏర్పడతాయి. కాబట్టి నిజాన్ని అబద్ధంగానూ,అబద్ధాన్ని నిజంగానూ కూడా ఈజీగా నమ్మొచ్చు. ఒక్కోసారి అబద్ధాల్ని మరింత బలీయంగా నమ్మెయ్యొచ్చు. కాబట్టి నమ్మకాల నిజానిజాల్ని సమీక్షించుకోవడం అత్యంత కష్టం. అంతకన్నా క్లిష్టమైన సమస్య ఏమిటంటే... నిజాన్నీ అబద్ధాన్నీ నిర్వచించడం.
Thursday, October 1, 2009
నిజం - అబద్ధం: ఒక నిర్వచనం
ఎవరైనా నిర్వచించడానికి ప్రయత్నించండి మరి!
****
Subscribe to:
Post Comments (Atom)
7 comments:
The thing that EXPRESSES a "Perceived Fact" is Truth and anything that EXPRESSES something that is NOT a "Perceived Fact" is a Lie!
For example - If I know I am 38 years old but say I am 24 then it's a lie.
If I dont know I am 38, I believe that I am 24 and say that I am 24 then it is not a lie but not a Fact.
Confused you enough? :))
కనుక నిజం-అబద్దం కి సంబంధించిన ఏ సమస్య అయినా నమ్మకం వలన జనిస్తుంది. మరి ఆ నమ్మకాలకి ఆధారం పలు రకాలు.
చందమామ భౌతికంగా కనపడినా అది ఉపగ్రహం అని తెలిసినా, కవుల కల్పనల్లో ఎన్నివర్ణలకి వాడతాం. కనుక బౌతికత్వం కూడా నిజానికి అబద్దానికి మూలాధారం కాదు. అక్కడ కూడా అనుభూతి, ఆ గాఢతలోని నమ్మిక ప్రభావం చూపుతుంది. నాకు చందమామ వ్యక్తిగా, మరొకరికి, ఉదాహరణకి శ్రీ శ్రీ గారికి "ఆకాశంలో కాళ్ళు తెగి పడున్న ఒంటె గా" కనిపిస్తుంది.
నిర్వచనానికి అందనివన్నీ ఆలోచనలకి తావిచ్చేవే. నా "సంతొషానికి కొలమానం ఏది?" http://maruvam.blogspot.com/2008/05/blog-post_25.html ఇటువంటిదే...
నిజం అద్దానికి ఈవలనున్న నువ్వు, అబద్ధం అద్దం లోని నువ్వు. అదే జీవితం.
అద్దంలో మన ప్రతిబింబం అబద్దం, అద్దం ఇవతలి మనం నిజం.
అంత పెద్ద ప్రశ్న ను అంత చిన్న పేరా లో అడిగేసి ఒకటి లేదా రెండు లైనుల్లో సమాధానం చెప్పమంటే ఎలా.. :-). ఏది సత్యం, ఏది అసత్యం అనేది కనిపెట్టటానికే కదా ఎందెరో ఎంత కాలమో సోధించి సాధించాలని ప్రయత్నించారు, సరే సోది ఆపి నీ అభిప్రాయం చెప్పమంటారా..
పైన రౌడి గారు,ఉష చెప్పినట్లు మనం ఏది నమ్మితే అదే సత్యం నమ్మనిది అసత్యం. కాని నమ్మకాలు రెలటివ్ కదా... కాలానికి, అప్పటి పరిస్తితులకు నమ్మకం లోబడి వుంటుంది... అందుకని వాళ్ళు చెప్పిన దానిని, మీరు అడిగిన దానిలోని "ఆలోచనల లో వైరుధ్యం" అనే పాయింట్, అన్నిటిని కలిపి ఇంకా కొంచం ఆలోచిస్తే నాకనిపిస్తుంది, మన స్వభావం మనకు సత్యం మన స్వాభవం కానిదేది మనకు సత్యం కాదు. మనలోకి మనం చూసుకుంటే, చూసుకోగలిగితే ఈ కోర్కెల, ఆలోచనల, ఆశల వెనుక,మనం మనం గా నిలబడగలిగే మన స్వభావం మనకు సత్యం, ఆ సత్యాన్ని మనం పాటించగలిగితే శాంతి, ఆ స్వభావాన్ని దాటి మనసు చెప్పింది, నమ్మకాలు చెప్పినవి లేద కోర్కెలు, ఆశలు చెప్పినవి చేస్తే అది అసత్యం ,అదే మనకు అశాంతి, ప్రేమ, దయ మన లోపలి అసలు స్వభావాలు అంటారు మరి, ఆ లోపలి స్వభావాన్ని మనం మన నేర్చుకున్న విలువలతో అబద్దాన్ని పైన పులిమి అదే నా స్వాభావం ఇలా వుంటే సత్యమే ఐతే అని మనలను మనం మలిన పరుచుకుంటే (మన అందరం చేస్తున్నది అదేనేమో అందుకె మనకు ఇంత అశాంతి, అసత్యాలను నమ్మి అది సత్యమని ప్రచారం చేస్తున్నాము.). అదే అసత్యం, ఈ రోజు గాంధి జయంతి, మరి ఆ ప్రేమ, దయ ను అహింస ను ఇంకో అయుధం ధరించి ఎంతో సాధించారు ఆయన అంటారు, మరి అంత గా సత్యాన్ని అమలు పరిచి కూడా భగత్ సింగ్ ఇంకా కొందరి విషయాలలో ఆయన సత్యాన్ని కొన్ని ప్రయోజనాలకోసం పక్క దారి పట్టించి అసత్యపు క్రీనీడలను రానిచ్చారు అంటారు, మరి అదే నిజమైతే దానికి ఆయన చెల్లించిన మూల్యమేమిటో.... అంతటి ఆయనకే తప్పక పోతే మన లాంటి వాళ్ళకు ఈ సత్య అసత్యాల ప్రశ్న తేలేనా...
Jiddu comes to mind here , ' everything is but a state of mind !!!..' " Time " which was until Einstein came up with his theory of relativity , an absolute measure is now a relative term. There was this very interesting article in the ' Time ' , I think last year... very fascinating but baffling behaviour of photons....which changed their pattern based on whether they were being observed or not. It's almost like Mother Nature changes the truth based on whether she's being observed or unobserved . So, what's truth / false in that ginormous context. As the saying goes, ' one man's meat is another man's poison...'. Mary Magdalene realizes Christ is gone from the tomb... to believer's ..that is the epifocus of the birth of Christianity , when Jesus of Nazarath changed to Christ,who could defy death and rise from the tomb,.. to the non-believers, those are rantings of a half mad woman.... I guess, everything is seen/perceived / judged in the prism of a context. And this context is sooo variable, from person to person, from society to society, from culture to culture and so on. Probably, that is why I have never really had patience for the so called moral police.
naaku toestea adi nijam !haha! niivu chebitea adi abaddham! !hihi! just for fun!
Post a Comment