అది పిల్లల హక్కులకు సంబంధించింది. చిన్నపిల్లల సున్నిత హృదయాలకు సంబంధించింది. భాషకన్నా నాకు ఆ పిల్లోళ్ళ బాధ ముఖ్యం. వారు అనుభవించిన మానసిక వేదనకు న్యాయం చెయ్యడం ముఖ్యం. నవోదయా విద్యాలయాలో చదువుతున్నప్పుడు మాకు three language formula ఉండేది. వారంలోని ఆరు రోజుల్లో రెండేసి రోజులు తెలుగు, రెండ్రోజులు హిందీ మరో రెండు రోజులు దినసరి వ్యవహారాలలో ఇంగ్లీషు భాషాప్రయోగం చెయ్యడాన్ని ప్రోత్సహించేవారు. ఆ రోజులో ప్రార్థన మొదలు రాత్రి స్టడీ అవర్స్ ఆఖరి ఘడియ వరకూ ఈ విధానం అమలయ్యేలా మానిటరింగ్ జరిగేది. చిన్నచిన్న పనిష్మెంట్లు,జరిమానాలూ సాధారణం. కానీ ఇలాంటి శిక్షలూ, అవమానాలూ ఉండేవి కాదు.
ఈ ఫోటో పేపర్లో చూడగానే నాకొచ్చింది ఆ వ్యవస్థపై కోపం. ఇంగ్లీషు "మాత్రమే" నేర్పించాలనే తల్లిదండ్రుల పట్టుదలలపై చిరాకు. ఈ విధానాన్ని విజయవంతంగా అమలుచేస్తూ,reinforce చేస్తున్న టీచర్లు,స్కూళ్ళపై నిరసన. అంతకన్నా మించింది ‘ఆ పిల్లల హృదయాలకు తగిలిన గాయం ఎలా మానుతుందా’ అనే వేదన.
తెలుగు భాష తన బలహీనతల మూలంగానో, పరిస్థితుల ప్రభావం వల్లనో, పాలకుల చేతకానితనం మూలంగానో,తెలుగోళ్ళ ఇంగ్లీషు మోజు కారణంగా బలైనా నాకు పెద్ద తెడాలేదు. కానీ పిల్లల్ని ఇలా మానసిక వేదనకు గురిచేసే హక్కు ఎవరికీ లేదు. చివరికి తల్లిదండ్రులకు కూడా ఆ అధికారం లేదు. Its a gross violation of child rights. అందుకే స్కూలుపై,టీచర్లపై తక్షణం చట్టపరమైన చర్య తీసుకోవాలి.
*****
14 comments:
నా అభిప్రాయం ప్రకారం తెలుగు బాష అంతరించిపోయినా వచ్చే నష్టం ఏమీ లేదు. మెడలో బోర్డులు కట్టడం వల్ల ఇంగ్లిష్ రాదు అనేదే నా అభ్యంతరం. దొంగలకీ, వ్యభిచారులకీ మెడలో బోర్డులు వేసి గాడిద మీద ఊరేగిస్తే ఫర్వా లేదు కానీ చిన్న పిల్లలకి ఇంగ్లిష్ నేర్పించడానికి మెడలో బోర్డులు కడితే మాత్రం నెగటివ్ కాన్సీక్వెన్సెస్ వస్తాయి. తమకి బలవంతంగా ఇంగ్లిష్ ఎందుకు నేర్పిస్తున్నారో పసి పిల్లలకి అర్థం కాదు. అబ్రకదబ్ర గారు చెప్పినట్టు ఇది నిజంగా 420 గాళ్ళ మీద చేసే ప్రయోగంలాగ ఉంది.
కొన్ని సినిమాలలో చూసే ఉంటారు. స్టేషన్ లో పోలీసులు నేరస్తుల మెడలో పలకలు కడతారు. ఆ పలకల మీద "నేను దొంగని", "నేను వేశ్యల్ని సప్లై చేసే బ్రోకర్ ని", "నేను మోసగాడిని" లాంటివి వ్రాసి ఉంటాయి. ఆ స్కూల్ ప్రిన్సిపల్ కూడా సినిమాలు చూసి పిల్లల మీద అలాంటి ప్రయోగం చేసి ఉంటాడు.
నేను ఇదే విషయంపై రాసాను, పిల్లల హక్కులను నిజంగానే హరిస్తున్నాం. చదువంటే భయబ్రాంతులకు గురియ్యేట్లుగా చేస్తున్నాం.మనకున్న ఇంగ్లీషు మోజుతో వారిని హైరానాకు గురిచేస్తున్నాం,ఇది అక్కడ జరిగిన విషయమే కాదు, ప్రతి కాన్వె౦టులోనూ ఫైన్ ల పేరుతొను, టీచర్ల అవమాన పూరిత వ్యాఖ్యలతోను పిల్లలు నిత్యము మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని గుర్తెరిగేట్లుగా చూడాలి. http://sahacharudu.blogspot.com/
100% agreed.
ఈ సంఘటనలో చర్చించాల్సింది తెలుగు వెలుగుల గురించి కాదు - ఏ తప్పుకైనా, విద్యార్ధులకు ఆ తరహా శిక్షలు అమలుచేసే పెద్దమనుషులకి చట్టబద్ధంగా ఎలాంటి శిక్ష వెయ్యాలనేదాని గురించి.
ఇక్కడ తెలుగుకు జరిగిన అన్యాయం కన్నా,విద్యార్థులకు జరిగిన అన్యాయమే ఎక్కువ. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు ఇంగ్లీషు మాట్లాడాలి అని కోరుకున్నపుడు, వాటిని బోధించడానికి ఓపికతో మరేదైనా మార్గాలు అన్వేషించాలే గానీ ఇలా అవమానించడం తగదు. విద్యార్థులకు సరిగా బోధన చేయలేని చేతగానే పంతుళ్ళే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని భావిస్తాను.
నిజమే మహేష్ పిల్లలెంత బాధ పడి వుంటారు కదా. ఇలా మూసలలో తిప్పి తయారు చేసిన పిల్లలు రేపటి తల్లి తండ్రులై అమ్మో మా పిల్లలు కూడా ఇంగ్లీష్ లోనే ఆలో చించాలి అంటారు.. విషయమేమిటంటే ఆ పిల్లల తల్లి తండ్రులైనా బాధ పడుతున్నారో లేదో పిల్లల మనో భావాల గురించి. బాధ పడతారేమో లే మన పిల్లలకు అలా జరిగితే మనం బాధ పడం ... అలానే కదా..
తెలుగు మీడియం టీచర్లు కూడా తమ పిల్లలని ఇంగ్లిష్ మీడియం స్కూళ్ళకి ఎందుకు పంపిస్తున్నారో పొద్దులో వ్రాసాను. పొద్దు నిర్వాహకుడు డిలీట్ చేశాడు. ఇంగ్లిష్ మీడియం చదువులు అవసరమే కానీ మెడలో బోర్డులు కట్టడం మాత్రం తప్పు అనేదే నా అభిప్రాయం. ఈ ఘటన విషయంలో కూడా పిల్లల హక్కుల గురించి ఆలోచించకుండా మాతృబాషాభిమానం అంటూ అరిగిపోయిన రికార్డ్ పాడిస్తున్నారు.
మహేష్ గారు పొద్దులో అడిగిన ప్రశ్న ఇది
>>>>>
అయినా నాకు తెలీకడుగుతాను…మన తెలుగులో రాసిన గణిత,సామాన్య,సాంఘిక శాస్త్రాలలో పిల్లలకు తెలిసిన (ఇంట్లో మాట్లాడే) తెలుగెంత? అలాంటప్పుడు సమితులు అన్నా సెట్స్ అన్నా వాడికి ఒకటికాదా! భాస్వరం అన్నా ఫస్ఫరస్ అన్నా ఒకటి కాదా!!I see a huge flow in out Telugu teaching. బహుశా అందుకే అది సహజమైన చావు ఛస్తోంది. ఆక్సిజన్ ఇచ్చినా అది ICU లోనే ఉంటుంది. జవసత్వాలు మాత్రం ఎన్నటికీ రావు.
>>>>>
ఈ పాషాణ పాక బాష గురించి తాడేపల్లి గారి బ్లాగ్ లో కూడా చర్చ జరిగింది. http://www.tadepally.com/2009/10/blog-post_12.html కొన్ని సార్లు పాషాణ పాకాన్ని కొరకడం కంటే ఇంగ్లిష్ లో మాట్లాడడమే సులభంగా ఉంటుంది. రెవెన్యూ ఆఫీసర్ ని సుంకం వసూలు అధికారి అంటే ఎంత మందికి అర్థం అవుతుంది అని అడిగితే ఒక్కడు కూడా సమాధానం చెప్పలేకపోయాడు.
ప్రవీణ్ మన ఈ పరభాషాభిమానం యొక్క విపరీతబుద్ధి వలనే మనం మనవాటినుండి పరాయీకరింపబడుతున్నాం. ఉద్యోగాలిస్తోందనో, ఉపాధి కల్పిస్తోందనో ఇంగ్లీషు వెంట పడి మాతృభాషకు దూరమయి ఉనికిని కోల్పోతున్నాం. దానిని కమ్యూనికేషం కు మాత్రమే వినియోగించుకోవాలి. మన మోజును సొమ్ము చేసుకుంటున్నారు. నిజానికి మన కాన్వెంటులలో నేర్పేది ఇంగ్లీషేనా? దాని వలన పిల్లల సృజనాత్మకతను చంపేయడం లేదా? మాతృభాషలో ప్రాథమిక విద్యా బోధనవలన వారికి మానసిక వికాసం కలుగతుందని ఎందరో మానసిక శాస్త్రవేత్తలు చెప్పారు. ఆటా పాటలతో కొనసాగవలసిన విద్య ఆ సమయంలో బలవంతంగా రుద్దబడి ఇంటర్మీడియేట్ స్థాయి వచ్చేసరికి మరింత వత్తిడికి గురై ఎంతోమంది పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మనం శాస్త్రీయ విద్యావిధానానికి డిమాండ్ చేయాలి. మన బలహీనతలను కార్పొరేట్ విద్యానిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు రకరకాల పేర్లతో.
నేను చదివినది ఇంగ్లిష్ మీడియమే కానీ నేను రోజూ మాట్లాడేది తెలుగు బాషే. తెలుగు బాష అంతరించిపోతుంది అనేది కబుర్ల కోసం పలికిన మాట మాత్రమే. ఇండియాని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకున్నారు కాబట్టి భారతీయ బాషలలో ఇంగ్లిష్ పదాలు చేరాయి. ఇండియాని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకోకపోతే చైనా వాళ్ళో, రష్యా వాళ్ళో, ఫ్రెంచ్ వాళ్ళో ఆక్రమించుకునే వాళ్ళు. అప్పుడు మన బాషలలో చైనా బాష పదాలు గానీ, రష్యా బాష పదాలు గానీ, ఫ్రెంచ్ బాష పదాలు గానీ చేరేవి. బాష అంతరించిపోవడం మాత్రం జరగదు.
ఇప్పటికే ప్రపంచంలో అనేక ఆదిమ జాతులు, తెగలుతో పాటు వారి భాషా సంస్కృతులు అంతరించిపోయాయి. అనేక సం.లుగా నాగరిక తెగలు జరిపిన దాడులతో వేలాది తెగలతో పాటు భాషలు కూడా అంతరించిపోయాయి. ఇది ఒకేరోజులోనో, సం.లోనో జరిగే మార్పుకాదు. ఇప్పటికే మన వాడుక భాషలో హిందీ, ఉర్దూ, తెలుగు పదాలు చేరి కొన్నింటికి అర్ధాలే మారిపోయి కనుమరుగైపోయాయి. ఇలా రోజు రోజుకూ జరిగే పరిణామ ఫలితం కొన్నేళ్ళ తరువాత కనబడుతుంది. survival of the fittest సూత్రం నెమ్మదిగా అనకొండలా మింగేస్తుంది.
ఇక్కడ రెండు విషయాలు ముఖ్యం.
1.ఈ పరిస్థితులకి కారకులు ఎవరు.అశక్తులైన ఉపాధ్యయులా ? అవగాహన లేని తల్లిదండ్రులా ?
ఇది నాకెదురయిన స్వీయానుభవం.
దీనికి సమాధానం ఈ క్రింది లింకులో చూడండి.
http://sreemathibhavana.blogspot.com/
టపా:He should speak English, that's all..
2. నిజంగా బాలల హక్కులు పట్ల చిత్తశుధ్ధి ఉంటే అంచెలంచెలుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ విధానాన్ని ప్రభుత్వం ఎందుకు ప్రవేశ పెడుతుంది. ఇదేనా తెలుగు భాషకు జరుగుతున్న ఆదరణ. ఈ రోజున ఈ విషయంపై నోరు పారేసుకుంటున్న మీడియా, మానవ హక్కుల కమీషను, ప్రజలు,బ్లాగర్లు వీరందరికి "వారిని శిక్షించండి" అనగలిగే నైతిక హక్కు ఎక్కడిది. ఆనాడేమయ్యారు వీరందరు.
లక్ష కంటే తక్కువ మంది మాట్లాడే బాషలు మాత్రమే అంతరించిపోయే అవకాశం ఉందని సామాజిక శాస్త్రవేత్తలు అంటున్నారు. తెలుగు బాష మాట్లాడేవాళ్ళ సంఖ్య మన రాష్ట్రంలో ఎనిమిది కోట్లు ఉంది. ఒరిస్సా, దండకారణ్యం, కర్నాటక, తమిళ నాడులలో తెలుగు మాట్లాడేవాళ్ళ సంఖ్య కలిపితే మరి కొన్ని కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉంటారు. ఇంత ఎక్కువ మంది మాట్లాడుతున్న బాష ఎలా అంతరించిపోతుంది?
నిజానికి మనం ఈనాడు మాట్లాడుతున్నది తెలుగేనా? ఇప్పటికే 40 శాతానికి పైగా ఇంగ్లీషు, ఉర్దూ, హిందీ పదాలు చేరిపోయాయి. చివరాఖరకు అమ్మ నాన్న పదాలు కూడా మరిచిపోతున్నారు. ఇది నిజం కాదా?
శ్రీనిక గారూ ఇది గుడ్డు ముందా పిల్ల ముందా లాంటి తర్కంలా అనిపిస్తోంది. ఇరుపక్షాలదీ బాధ్యత. ఏదో తెలియని భయం వెంటాడుతుంటే మనం పరుగులు తీస్తున్నాం కాదా? ఇందులో పాలక వర్గానిదే ప్రధాన బాధ్యత. ఏనాడూ మన విద్యారంగాన్ని సరిగా పట్టించుకున్న పాపాన పోలేదు. అరకొర నిధులతో ఏదో చేస్తున్నామనే అపొహలో జనాన్ని వుంచుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు అధ్యాపకులు, సరైన వసతి సౌకర్యాలు లేక ఏడుస్తుంటే కార్పొరేట్ కాలేజీ ఫీజులను భరిస్తూ వారికి మేత దొరికేట్టు చేయడానికి పేద విద్యార్ధులను చేర్చి ఉద్ధరిస్తున్నట్టు ఫోజులు వెలగబెడుతున్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యం. ప్రజల బాధ్యతా రాహిత్యం. ఏది కావాలో అడగలేని స్థితికి నెట్టబడుతున్నాం కాదా?
ఇంగ్లిష్ మాత్రం నిజమైన ఇంగ్లిష్ అనుకోను. Even English is pidgin mongrel that contains many words borrowed from Latin & Greek languages. Even the word 'India' was borrowed from Greek language. Indus is the Greek name for River Sindh and India means the land where the River Indus flows. తెలుగు కూడా శుద్ధమైన బాష కాదు. తెలుగులో అనేక సంస్కృత, తమిళ పదాలు కలిసి ఉన్నాయి. మనం రోజూ సంస్కృత, తమిళ పదాలు కలిసిన బాష మాట్లాడడం లేదా? విడుదల (విడుదలై, తమిళం), బయట (బయలు, కన్నడం), రక్తం (సంస్కృతం) ఈ పదాలు లేని తెలుగుని ఒకసారి ఊహించండి. కుమార్ గారు, మన ఉత్తరాంధ్ర మాండలికంలో కూడా అనేక కన్నడ, తమిళ పదాలు ఉన్నాయి. మీ పార్వతీపురం దగ్గరే ఉన్న గిరిజన ప్రాంతాలలో పెద్దమ్మని దొడ్డమ్మ అనీ, పెద్దనాన్నని దొడ్డ అనీ అంటారు. కన్నడ బాషలోని దొడ్డమ్మ, దొడ్డప్ప అనే పదాలు మన ఉత్తరాంధ్ర బాషలో కూడా అలా చేరాయి. చిన్నమ్మ (చిక్కమ్మ, కన్నడ), తమ్ముడు (తమ్మ, కన్నడ), అన్నయ్య (అణ్ణ, కన్నడ) ఇలా అనేక తమిళ, కన్నడ పదాలని తెలుగులో చూపించగలను.
Post a Comment