మునెమ్మ నవల అందులోని పాత్రల మార్మికత,కథ లోని గాథాత్మకత దృష్ట్యా ఒక మనోవైజ్ఞానిక నవల అనేది నిర్వివాదాంశం. కానీ, ప్రాచిన- మానవమౌళిక( primitive and primordial) భావనలైన లైంగికతను మోరలిస్టిక్ దృష్టితో చూసే పురుషభావజాలం కోణం నుంచీ అర్థం చేసుకునే ప్రస్తుతపోకడలలో ఒక objective analysis ఈ నవలపై జరగలేదు అనేది నా నమ్మకం. ‘మునెమ్మ’ కేశవరెడ్డి పైత్యానికి ప్రతీకగా సాక్షి పేపర్లో కాత్యాయని విరుచుకుపడ్డా, కొందరు సాహితీ మిత్రులు ఆవిడ అర్బన్-ఎలీటిస్ట్- మిస్ ఇంటర్ప్రిటేషన్ కు సాగిలపడ్డా, అదంతా అనలిటికల్ సైకాలజీలోని నవీనపోకడలు (ముఖ్యంగా కార్ల్ యంగ్)- సాహిత్యంలో ఆ పోకడల్ని అన్వయించడం తెలియకపోవడమే అనే నిజాన్ని బహుచక్కగా వివరించిన వ్యాసం పసుపులేటి పూర్ణచంద్రరావు గారు ద సండే ఇండియన్ (19th Oct,2009)లో రాసిన "మునెమ్మ - ఒక ‘ఫండమెంటల్’ కథ! : A manifesto on the Feminine" అనే వ్యాసం.
ఆ వ్యాసం లంకెను ఇక్కడ ఇస్తున్నాను (పేజి నెంబర్ 42- 47). చదివి మీ అభిప్రాయాల్ని తెలిపితే, చర్చ ఇక్కడా ప్రారంభించొచ్చు.
****
3 comments:
మునెమ్మ నవల మీద సమీక్ష, వ్యాసాలు కాకుండా, నవల చదివాక నా అభిప్రాయాలు పంచుకుంటాను. కేశవరెడ్డి గారి 'అతడు అడవిని జయించాడు ' నవల చదివా. మంచి నవల. చూద్దాం 'మునెమ్మ ' నవల ఎలా ఉంటుందో.
ఏమయినా పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
నేను 'అతడు అడవిని జయించాడు ' చదివాను. ఈ వ్యాసం త్వరలో చదువుతాను. ఇక్కడ చర్చ మొదలుపెట్టినందు థాంక్స్. త్వరలో రాగలననే ఆశ.
క్లిష్టమైన సైకో అనాలసిస్/సైకాలజీ గురించి ఇంత సరళంగా తెలుగులోనైతే నేనెక్కడా చూడలేదు. ఈయనెవరన్నా ఇరగదీశాడు?
పూర్ణచంద్రరావు గారి గురించి తెలియడం ఇదే మొదటిసారి. పరిచయం చేసినందుకు థాంక్స్. ఆయన రచనలు ఎక్కడ దొరుకుతాయో చెప్పండి.
-చక్రి
Post a Comment