ఆనందకరమైన జీవితానికీ అర్థవంతమైన జీవితానికీ చాలా తేడా ఉంది.
ఆనందం ఆ క్షణమైతే చాలు. ఆ క్షణంలో అనుభవిస్తేచాలు. అలాగే ప్రతిక్షణాన్నీ అనుభవిస్తూపోతే జీవితమంతా ఆనందమే.
కానీ...అర్థవంతమైన జీవితంకావాలంటే?
ఒక మనిషి జీవితంలోని భూత-భవిష్యత్-వర్తమానాల అంచనా కావాలి.
ఆశలు,ఆశయాలు,కలలు,రహస్యాలు, అనుభవాలసారాలు కావాలి.
భూతకాలపు చీకటికోణాల్ని - వర్తమానపు ఆశల ఊహల్ని అన్నింటినీ ఒక క్షణం జీవించి సొంతం చేసుకోవాలి.
మరి ఆనందకరమైన జీవితం కావాలా...అర్థవంతమైన జీవితం కావాలా?
నిర్ణయం ఎప్పుడూ...మనదే!
****
9 comments:
మహేష్ కుమార్ గారు దణ్ణాలు దణ్ణాలు మీకు .....
నేను మీబ్లాగ్కి కొత్త్త అండి
నేను మిమ్మల్ని పొగిడే అంతటి వాణ్ణి కూడా కాదు ...
కాని మీ బ్లాగ్ చూసి నేను చాల చాల ఇన్స్పిరె అయ్యాను ...
జీవితంలో ఆనందమున్న అది అర్థం లేనిదైతే
ఆ జీవితానికే అర్థంపోతుంది ...
అర్థవంతమైన జీవితంలో ఆనండంలేక పోవడమంటూ ఉండదు కదండి.
మీరు పంచిన ఈ స్ఫూర్తితో అర్థవంతమైన జీవితం సాగిస్తూ ఆనందంగా గడిపేస్తాను....
ధన్యవాదాలండి
అవును. నిర్ణయం ఎప్పుడూ మనదే. చాలా బాగా రాశారు.
నిర్ణయం ఎప్పుడూ...మనదే!
Who can oppose it?
ardhavanthamaina, aanandakaramaina jeevitham inkaa merugu
అర్ధవంతమైన జీవితంలో కూడా అంతర్లీనంగా మనం కోరుకునేది ఆనందమే కదా!! ఏమంటారు?
Honestly, నేను దీన్ని అర్ధం చేసుకోలేకపోయాను.
..అంచనా కావాలి అనే లైను అస్సలే అర్ధం కాలేదు.
--------------------------------------------------
నా జీవితం - నాకు ఆనందమయమైన జీవితమే అవ్వాలి.
నా జీవితం - మరొకరికి అర్ధవంతమైన జీవితం అవ్వాలి.
అదీ విషయం.
సింపుల్ గా బాగా చెప్పారు .
అర్ధవంతమైన జీవితం లో వున్నది ఆనందమేగా.. మీరు రాసిన డెఫినిషన్ చూడండి..
"భూతకాలపు చీకటికోణాల్ని - వర్తమానపు ఆశల ఊహల్ని అన్నింటినీ ఒక క్షణం జీవించి సొంతం చేసుకోవాలి." ఆ క్షణం అలా కోరుకున్నట్లు జీవించటం లో వున్నది ఆనందమేగా మహేష్...
ఆ రెండూ కావాలి ;)
Post a Comment