"Post-modernism is not an ideology. Its an 'idea' of demystifying all ideologies at the strength of independent thinking" అని మా ఆంగ్లసాహిత్యం ఫ్రొఫెసర్ చెప్పేవారు.అప్పట్లో కొంత అర్థమయ్యిందనిపించినా,ఇప్పటికీ దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలోనే ఉన్నాను.
"ఒక సిద్ధాంతానికి కాని, ఒక నియమానికి కాని, ఒక వాదానికి గాని, ఒక సంప్రదాయానికి కాని కట్టుబడి ఉండకుండా, స్వతంత్రంగా ఆలోచించి, సందర్భశుద్ధి తో తమ తమ భావాలని నిర్భయంగా వ్యక్త పరచటమే ఉత్తర అధునాతన తత్వం". ఇలా ఉంటే ‘మీ మాటల్లో పొంతనలేదు’ అన్న వ్యాఖ్యలు వినాల్సివస్తుంది. అలాంటప్పుడు గ్రహించాల్సింది ఏమిటంటే, seeking nobody's approval and disapproving no one's idea of what you are is also part of post- modernism.
****
20 comments:
ఇది సాద్యమేనంటారా?
ఏదో ఓ గుంపులో (స్పిరిచ్యువల్/సామాజికం/వృత్తిపరం/ఆర్ధికం/రాజకీయం etc) చేరకుండా జీవనం సాఫీగా జరుగుతుందా?
బహుసా ఆ స్థితి చాలా ఉత్కృష్టమైనది కావొచ్చేమో.
ఈ వాదం రాతలవరకూ బాగుంటుందేమో, ఆచరణలో అసాద్యం కావొచ్చు.
i wish to see more light thrown on this
బొల్లోజు బాబా
// "ఒక సిద్ధాంతానికి కాని, ఒక నియమానికి కాని, ఒక వాదానికి గాని, ఒక సంప్రదాయానికి కాని కట్టుబడి ఉండకుండా, స్వతంత్రంగా ఆలోచించి, సందర్భశుద్ధి తో తమ తమ భావాలని నిర్భయంగా వ్యక్త పరచటమే ఉత్తర అధునాతన తత్వం".
ఈ నిర్వచనం అర్ధమైంది. కానీ దీన్ని భౌతికంగా అన్వయించాలంటేనే వీలు కావటం లేదు. నేను చదివిన ఒక నవల్లో పోస్ట్ మోడర్నిస్టిక్ ధోరణులు ఉన్నాయని తర్వాత విన్నాను. అంటే ఏమిటో తెలుసుకోవాలని ఉండేది. దానికోసం అంతర్జాలంలో వెదికాను కూడా. కానీ సంతృప్తి పరిచే జవాబు దొరకలేదు.
Perhaps, you are right!
One can niether seek nor give,
an approval or disapproval
on ideology or otherwise
Or
one tactfully agrees
on only certain points
for a desired effect - some call him
లౌక్యం గల మనిషి
Having said that,
Ramu does not look like one,
inspite of knowing this! Isn't it!?
Or
One clearly realises
there is indeed no right ideology;
and no wrong ideology either
It functions to bring a uniformity
in choosing the ' right' and 'wrong'
and thus to bring a presumed 'order',
in a seemingly chaotic world.
The universe goes on! or may be not!
With all its incosistencies with in it!
Is there an ideology which just acknowldeges this!!
and just helps to make choices?
between right and wrong!?
and all the dilemmas!?
Its so much fun to race your car
in an utterly confusing and chaotic path! Isn't it?
Are you too afraid!?
Try it, at least, on a video game!
:)
భలే చెప్పారు.
బాబ్బాబు... అలాగే గతితార్కిక భౌతికవాదం అంటే కూడా ఏంటో చెప్పి పుణ్యం కట్టుకోండి (దాన్ని ఇంగ్లీషులో ఏం అంటారు అని చెప్పడం మాత్రం మరవ్వద్దు). ఇది విన్నప్పుడల్లా ఎవరినైనా ఎవరైనా తిట్టారేమోననుకుంటుంటాను.
@బొల్లోజుబాబా: ఈ మధ్య దుప్పల రవిగారు ఒక వ్యాసంలో “The test of a first rate intelligence is the ability to hold two opposed ideas in the mind at the same time, and still retain the ability to function” అంటూ ఒక కొటేషన్ చెప్పారు. దాని గురించి ఒకసారి ఆలోచించండి. ఆచరణసాధ్యమే అనిపించదూ! కొంచం కష్టం అంతే!!
@ఇండిన్ మినర్వా: రేపు ఒక చిన్న టపారాస్తాను...గతితార్కిక భౌతికవాదం గురించి.
అంతర్జాలంలో వెదికితే ఈ లంకె దొరికింది. అయినా సంతృప్తి కలగలేదు.
http://latebloomer-usa.blogspot.com/2008/12/blog-post_16.html
ఆ నిర్వచనాన్ని ఏదైనా ఉదాహరణతో చెప్పగలరా!.
>> "seeking nobody's approval and disapproving no one's idea of what you are is also part of post- modernism"
That will be a perfect world. Everybody will have his/her own ideas, and respects everybody else's ideas . అయితే, అది జరిగే పనేనా?
It is not just TWO opposing ideas my frined... it is about holding many opposing ideas...The world is not just Dark or White....it is a spectrum of ideas, lighting a point....... its a very very colourful world out there.....
ofcourse, there is another view that human mind can not grapple with more than 3 to 5 items at one point......
m...m....I think i am being spoil sport here :)
that line of duppala ravi is indeed very good one.. :)
And I thought you should have done today that గత్తర గత్తర పిడి గుద్దుల వాదం......
Just kidding...even i am eagerly waiting to learn some lines...please.
Hmm interesting
"ఒక సిద్ధాంతానికి కాని, ఒక నియమానికి కాని, ఒక వాదానికి గాని, ఒక సంప్రదాయానికి కాని కట్టుబడి ఉండకుండా, స్వతంత్రంగా ఆలోచించి, సందర్భశుద్ధి తో తమ తమ భావాలని నిర్భయంగా వ్యక్త పరచటమే ఉత్తర అధునాతన తత్వం". ఇలా ఉంటే ‘మీ మాటల్లో పొంతనలేదు’ అన్న వ్యాఖ్యలు వినాల్సివస్తుంది.
ఇలా జీవించడాన్ని పోస్ట్ మాడర్నిజం అని అంటారని నాకింత వరకు తెలీయదు, కాని నేను నా వ్యక్తిగత జీవితం లో ఇలానే జీవిస్తున్నాను, ఎటువంటి సిద్దాంతాలు, ప్రాధమిక సూత్రాలు, ఇంకా వగైరా లాంటివి ఏవి ఆలోచించకుండా నామెదుడుకి తోచినట్లు, అనిపించినట్లు జీవిస్తున్నా..! అది ఎంతవరకు పోస్ట్ మాడర్నిజం కి దగ్గరో నాకు తెలీయదు కాని, నా జీవితం మాత్రం అలానే ఉంది మరి. కమల్.
ఎందుకు సాధ్యం కాదు ? Thoreau made it possible. Independent thinking was one of his prime philosophies. He lived independently at Walden completely away from society. He never sought anyone's approval or disapproval of what he said. కాకపోతే ఈనాటి సమాజానికి ఆ సిధ్ధాంతాలు...?
ఆధునికోత్తరవాదం పేరుతొ ఇలా చెప్పిన సిద్దాంతకారులు మరి సమాజం పై దేనికీ ఆధారపడకుండా బతికేయగాలరా? తామూ సృష్టించిన వస్తువులు తామే అనుభవించుకొని అమ్ముకోకుండా బతికేస్తే ఎవరికీ నష్టముండదు. ఈ దోపిడీలు, హత్యలకు తావులేని ప్రపంచం వచ్చేస్తుంది. కాని మరి అడిలేకుమ్డా తెల్లరదే వారికి. ఇలా సమాజానికి ఉపరితలంగా ఆలోచనలమేరకు జీవిద్దామనుకోవడం భావ్యమా? దీనివలన పుట్టిన పోరాట రుపాలేవి విజయవంతం కాలేదు. సమాజాన్ని నాలుక్కాళ్ళ స్థంభంలా ఊహి౦చుకొని వ్యక్తివాదాన్ని బలపరిచే ఆలోచనవలన సమాజం ముందుకు నడుస్తుందా? ఇప్పటికే వైయక్తిక కుటుంబాలవలన వృద్ధాశ్రమాల పాలుకాబడుతున్న తల్లిదండ్రులు, అనాదరణకు గురికాబడుతున్న వ్యక్తులతో సమాజంలో ఏమి కోల్పోతున్నామో తెలియక, సాధించినదేమిటో కనులముందు కానరాక ఆత్మహత్యల టె౦డెన్సీ పెరిగిపోతో౦ది.
@కుమార్: ఆధునికోత్తరవాదం ప్రస్తుత సమాజంలో ఉన్న multi polarity కి తాత్వికరూపం. అంతేతప్ప అదొక Utopian ఆలోచన కాదు. కాబట్టి, ఈ సిద్ధాంతకారులు సమాజంపై ఆధారపడకుండా బ్రతకడం అనే ప్రశ్నే ఉదయించదు.
ఆధునికోత్తరవాదం వ్యక్తివాదం కానేకాదు. ‘అందరి ఆలోచనలూ ముఖ్యమే’ అనుకునే భావవైశాల్యాన్ని ప్రతిపాదించే ఈ వాదం వైయక్తికం ఎలా అవుతుంది? దీనివలన సమాజానికి నష్టం ఎలా వస్తుంది?
ఆధునికోత్తరవాదమంటే, అన్నివాదాలు తప్పు అనడం కాదు. అన్నివాదాలకూ స్థానం ఉంది,కానీ అది వ్యక్తి స్వాతంత్ర్యం మీద నిర్ణయింపబడాలి అని మాత్రమే. Its about Individuals choice to opt for any ideology that suits him at that point in time.
మంచి ఆలోపింపచేసే పోష్ట్
world is torn by ideologies. The attitude of either you are with me or against me, leaving no scope for middle ground. This got wider ramifications at a macro level. Countries get ruined by the rulers who are fixated on ideologies.
definitely it is not an ideology, rather it is unencumbered by ideologies
"ఒక సిద్ధాంతానికి కాని, ఒక నియమానికి కాని, ఒక వాదానికి గాని, ఒక సంప్రదాయానికి కాని కట్టుబడి ఉండకుండా, స్వతంత్రంగా ఆలోచించి"
పైన చెప్పిన వాటన్నిటి ప్రభావం మనిషి ఆలోచన పై పడుతుంది. వాటన్నిటికి అస్సలు కట్టుబడకుండా ఆలోచనలంటే, తెగిన గాలి పటమే.
అంత పెద్ద టాపిక్ మొదలు బెట్టి , "seeking nobody's approval" అనటం Post-modernism కి సంబంధం లేకుంటా చెప్పటమే.
మొత్తం గందరగోళం గజిబిజి గా చెప్పానా. నా తప్పేమి లేదు, టాపిక్ అలాంటిది
@బాటసారి: మీరు అసలైన అర్థానికి అతిదగ్గరగా వచ్చి మళ్ళీ దూరమైనట్లున్నారు.
మీరు ఉటంకించిన టపాలోని వాక్యంలోని కిటుకు "ఒక"దగ్గరుంది. అంటే, ఒక సిద్దాంతం,ఒక నియమం,ఒక వాదం,ఒక సాంప్రదాయానికి కట్టుబడకుండా "అన్ని" సిద్దాంతాలనూ,అన్ని నియమాలనూ,అన్నివాదాలనూ,అన్ని సాంప్రదాయాలనూ "as they are" అర్థం చేసుకుని,సమయానుగుణంగా పరస్పర విరుద్ధమైన వాటినికూడా అనుమతిస్తూ,ఆలోచిస్తూ స్వతంత్ర్యంగా మనగలగటమే ఆధునికోత్తరవాదం.
ఒక చిన్న ఉదాహరణ ఏమిటంటే, నేను బీజేపీ వారి స్వదేశీ అజెండాను సమర్ధిస్తూనే వారి హిందుత్వభావజాలాన్ని వ్యతిరేకిస్తాను. కాంగ్రెస్ వారి ఫ్యూడల్ రాజకీయాల్ని గర్హిస్తూనే, వారి మైనారిటీ ఆప్పీజ్మెంటుని సమర్థిస్త్రాను. ఇందులో పార్టీకన్నా,భావజాలంకన్నా,ఇజాలకన్నా నా స్వతంత్ర్యభావం పాలు ఎక్కువ.
naadi aadhunikadakshina vadam orannayyo ... LOL
oppukunnollu oppukondi lenollu etlo duukandi
LOLLLLLLLLLLLL
chakradhar
http://www.chakradhar.net
In one sense modernism is better; it allows the search for truth and justice from the world we are live in by not telescoping the truth/justice from higher authority. The corporate culture exploiting the idea of modernism, now we feel freedom means disobey morals and do not care for anything, except searching for pleasures not for happiness. If man searching for pleasures in the name of freedom he end up with emotional sickness and start living for those pleasures. What do you say?
-bala
TO SREENIKA
I feel there is no thought without constrains, because constrains defines the reality.
పోస్ట్ మోడర్నిజ్మ్ ఒక పుస్తకంలో చదివాక ఇప్పటికి కొంచం అర్ధం అయ్యింది.
//ఆధునికోత్తరవాదం వ్యక్తివాదం కానేకాదు. ‘అందరి ఆలోచనలూ ముఖ్యమే’ అనుకునే భావవైశాల్యాన్ని ప్రతిపాదించే ఈ వాదం వైయక్తికం ఎలా అవుతుంది? //
ఆధునికోత్తరవాదం వ్యక్తి వాదమే. అందరి వ్యక్తుల ఆలోచనలు ముఖ్యం అనుకొనే వ్యక్తివాదం. ఇది ఒక వ్యక్తి దృష్టికోణంలోంచి చూస్తుంది. అందుకనే నిర్దిష్టత ఉందని చెప్పే ఏ సిద్ధాంతాన్నైనా చీల్చి చెండాడుతుంది ఇది.
అందరి ఆలోచనలు ముఖ్యం అనుకొనేదే వైయక్తిక వాదం. ఈ విషయం మీద మీరు చెప్పినదాంట్లో స్పష్టత లోపించింది.
Post a Comment