Tuesday, December 1, 2009

ఆర్య లాంటి ఫ్రెండుంటే - కేసీఆర్ లాంటి నాయకుడుంటే


ఈ మధ్యే విడుదలైన ఆర్య-2 సినిమా "ఆర్య లాంటి ప్రెండ్ వుంటే చాలు వేరే శత్రువులు అక్కర్లేదు…" అనే డైలాగ్ తో మొదలౌతుంది. సినిమా మొత్తం అతిప్రేమ-సైకోప్రేమ- అతిసైకో చేష్టలతో ఆర్య పిచ్చిపిచ్చిగా సినిమా మొత్తం ఎనర్జీతో గెంతి, ప్రేక్షకుల్ని 70MM లో వెధవల్ని చేసి బయటికి పంపిస్తాడు...

అదే పిచ్చి నాకు తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు KCR చేసిన "ఆమరణ నిరాహారదీక్ష" డ్రామాలో కనిపించింది. ఇలాంటి నాయకుడే ఉండే తెలంగాణాకి మరే శత్ర్రువూ అవసరం లేదు. నట్టేట ముంచాడు, ముంచుతాడు, ముంచుతూనే ఉంటాడు. తెలంగాణా ఎప్పటికీ రాకపోవడానికి కారణమెవరైనా ఉంటే అది కె.సి.ఆర్ మాత్రమే.

****

15 comments:

జై తెలంగాణ..! జై జై తెలంగాణ !!! said...

పొట్టకూటికి తప్పని కొత్తఫీట్లు
పండు గుండెల్లో కత్తిదించందే
గొంతు జారదు

సౌదీ మస్కట్‌ దుబై
ఏ పేరైనా పొరుగోడికి ఊడిగవే,
‘జీవునం కాపాడుకపో’ బిడ్డా
ఊరు తల్లి తరిమింది.

బకాసురునికి రోజుకొక్కడు
ఊరంతా ప్రవాసమే
ఇన్నాళ్ళూ… తలరాతని తలవంచినం
మర్మం తెల్వక కర్మనుకున్నం

ఆహా! ఇంకానా!
కాదు మేం కండ్లుమూసుకున్నా ఎర్రోల్లం
మా నెత్తిన గోదారి పక్కన కృష్ణమ్మ
ఐనా పొలాలెందుకు శెల్కలైపాయె
మా భూములేల నెర్రెలు బిడ్డ బీళ్ళు
మా నీళ్ళను మర్రగట్టె మో కాలడ్డిందెవడు
కాలువలల్ల కాట్లమొద్దేసిందెవడు?

మా నౌకర్ల కెసరు బెట్టి
మమ్మల్నాగం జేసిందెవడు

మా నోళ్ళల్ల దుమ్ము గొట్టి
పోరల్ని అడవులు పట్టించిందెవడు?

మా భాష నీకు యాసైతే… మరి జాగో!?

నాగడ్డమీద నన్నే సుట్టపోన్ని చేస్తావ్‌!

ఊసర వెళ్లి నాటకాలకు తెరదించుతం

కనబడలేదా
ఇరగబూసిన మోదుగపూలు
అవీ దగా పడ్డ మా కండ్లల్ల ఎర్రజీరలు

వినబడలేదా
మా కాళోజీ కలలు గన్న తెలంగాణా స్వరం
దినదినం రగిలే మా గుండెం దిక్కారం

ఓ తల్లీ నా తెలంగాణా!
ఇన్నాళ్ళ నీ సంకెళ్ళని ఛేదించే నీ పిల్లలం
పులిపిల్లలై వస్తున్నాం

శ్రీనివాస్ said...

మహేష్ గారు ఏం పోలిక పెట్టారండి .... సూపర్

మాలా కుమార్ said...

బాగా చెప్పారు

తమిళన్ said...

jai telangana

సుజాత said...

తెలుగోడు అబ్రకదబ్ర ఎప్పుడో చెప్పారుగా, కేసీ ఆర్ ఉన్నంత కాలమూ తెలంగాణాకు ప్రత్యేకంగా ఎవరూ అడ్డు పడక్కర్లేదని !

అడ్డ గాడిద (The Ass) said...

ikkado lukkeyandi.

http://pokirikiri.blogspot.com/2009/10/lord-of-rings-return-of-pimp.html

BTW what is it about Arya?

రవిగారు said...

మహేష్ కెసిఆర్ ఆర్య అయితే ,గద్దర్ ధీ అజయ్ (నవదీప్) క్యారెక్టర్. కాసేపు సపోర్ట్ చేస్తాడు కాసేపు దు అంటాడు .

భావన said...

ఆర్య ఇంకా చూడలేదు కాని పోలిక మాత్రం బాగుంది. అవును పాపం కే సీ ఆర్ లాంటోడు ఒక్కడు చాలు వుద్యమాలు భ్రష్టు పట్టించటానికి.

అబ్రకదబ్ర said...

కేసీయార్ అర్జున్, గద్దర్ నవదీప్ ఐతే మరి కాజల్ ... రాఁవులక్క విజయశాంతి? :-)

@సుజాత:

బాగా గుర్తుంచుకున్నారు. రాష్ట్రంలోని ఏకైక నూరణాల సమైక్యవాది ఆయనే మరి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటం కోసం ఎన్ని త్యాగాలు చేస్తున్నాడో, ఎన్ని నిందలు పడుతున్నాడో .. ఆ సంగతి అర్ధమైనప్పట్నుండీ ఆయనకి వ్యతిరేకంగా రాయ బుద్ధి కావటం లేదు.

Sirapangi Santhi Swaroop said...

Interesting comparison. Though I haven't watched Arya-2, can vividly imagine, the two comparisons.

vani said...

correct ga cheppaav i too feel the same

Madhu. said...

I am so far removed with the local politics , that I had to google this KCR guy . That said , I still do not get how a separate Telangana state is going to solve any of the ongoing problems which seem more like a gordian knot in their gargantuan magnitude . Have we not been privy to the fact that division into states based on linguistic barriers does not certainly promote sense of nationalism , and we come up with ridiculous punch lines like ' Mumbai for Mumbaikars ' etc . And if we keep dividing and re-dividing based on I don't know what , there probably will not be this barethread figment of notion of statehood . And then I 'd have to go with the armageddon predictors and say that we will divide until we are reduced to ashes and then a new state will arise like from the ashes of the phoenix .

mahendar said...

telangaana ante kcr okkade kaadu
adi rajkeeyamaina athani venakunna prajaladi aavedana,
telangaana gurinchi kotlade andhravaallaina, kcr aina okkate. pakkavadni munche andhravallakante kaastaina baagupadalanukune kcr chaala bettea thammi.
oorike koorchindi edava rathalu rayaku... raathalo vishayam undali.. vetakaram kaadu.

కత్తి మహేష్ కుమార్ said...

అన్నా మహేంద్రా, వెటకారాన్ని సాహిత్యంలో వ్యంగ్యం అంటారు. అదిరాయడమూ "విషయమే". అవి నీకు తెలీవులే..ఏంచేస్తాం!

sowmya said...

కత్తిలా రాసారండీ.
నా జీవితంలో ఆర్య అంతటి అవకతవక అస్థవ్యవస్థ సినిమా ఇంతవరకు చూడలేదు. అలాగే లాంటి చవకబారు చీపుట్రిక్కుల రాజకీయనాయకులని చూడలేదు. మీరన్నది అక్షరాల నిజం, ఉన్నంతవరకు తెలంగానమే తప్ప తెలంగీతమయ్యే అవకాశం కనిపించట్లేదు