సాహిత్యసృజన విమర్శనకన్నా ఎప్పుడూ ఒక మెట్టు ఎక్కువే. ఎందుకంటే, ‘తులనకన్నా సృష్టి ఉన్నతం ’కాబట్టి. అది ఎలాంటిదైనా సరే, సృష్టి సృష్టే!
వర్డ్స్ వర్త్ చెప్పినట్లు సృజనాత్మకత అనేది "emotions recollected in tranquility". కాబట్టి, అక్కడ తర్కానికీ,తులనకూ స్థానం లేదు. మనిషీ ప్రకృతీ ఒక బలవత్తరమైన స్థాయిలో సంగమించి సాహితీసృజనకు ప్రాణంపోస్తాయి.
అలా సృష్టించబడిన సాహిత్యంలో తర్కాన్ని,తులలను ప్రవేశపెట్టి సామాజిక ప్రయోజనాన్నీ గుర్తించి ఆ ఆలోచనల్ని పాఠకులదగ్గరికి తీసుకొచ్చేవాడే విమర్శకుడు. అంటే తమ విశ్లేషణతో సృజనాత్మకతలోని నిగారింపుని గుర్తించే పరీక్షకుడు విమర్శకుడు.అంతటి బృహత్తర కార్యాన్ని భుజాన వేసుకున్న విమర్శకుడికి బాధ్యత,నిబద్ధత చాలా అవసరం.
వ్యక్తిగత అభిప్రాయాలకన్నా సామాజిక ప్రయోజనాన్ని ముందుంచాలి. ఉత్తమమైన ఆలోచనల గుర్తింపుకు ప్రాధాన్యత ఇవ్వాలి.ముఖ్యంగా రచనను రచనగా చూడాలి.
విమర్శకుడి బాధ్యత "to make the best ideas prevail. New ideas reach society.The touch of truth is the touch of life, and there is a stir and growth everywhere; out of this stir and growth come the creative epochs of literature." ఆ ఉత్తమమైన ఆలోచనల వ్యాప్తిద్వారా మరింత సాహితీసృజన జరిగే అవకాశాల్ని మెరుగు పర్చడం.
విమర్శకుడికి అనుకున్నది చెప్పే అధికారంకన్నా, రచన ఆదర్శాన్ని అర్థంచేసుకుని విశ్లేషించడం ముఖ్యం. తన అనుకోలుకు తగ్గ ఆధారాలు చూపుతూ పాఠకుడికి రచనను పరిచయం చేస, దాని "విలువను" తెలపడం ముఖ్యం. ఆ రచన ఒక విఘాతమైతే దాని గురించి ‘వార్న్’చెయ్యడం ముఖ్యం.
ఈ మూలభావనలకు విఘాతంకలిగేలా విమర్శనం చేస్తే అది కేవలం "విమర్శ" అవుతుంది.నింద అవుతుంది. అది చాలా మంది mediocre విమర్శకులు చేస్తారు. విమర్శకులంటూ సాహిత్యాన్ని కాపాడే బాధ్యత తీసుకున్నవాళ్ళు "కేవలం భాధ్యతాయుతంగానే" రాయాలి.
****
4 comments:
'మూలభావనలు' అనేవి విమర్శకి మాత్రమే ఉంటాయా. సాహిత్యానికి ఉండవా?
బాధ్యత కేవలం విమర్శకులకేనా. సదరు 'సృష్టికర్త'లకి అవసరం లేదా?
మీ రెండో మరియు మూడో పేరాలు చదివితే ఒక్కొక్కరికీ ఒక్కోలా అనిపించొచ్చు. నాకు మాత్రం అనిపించిందిది: 'రచయిత తర్కంతో పని లేకుండా చెత్తంతా రాసి పారేస్తే అందులో లేని లాజిక్కులు కనిపెట్టి ప్రచారం చేయుట విమర్శకుడి పని'
@అబ్రకదబ్ర: ఒకప్పుడు "సహితస్యభావఃసాహిత్యం.హితేనసహితం సాహిత్యం" అంటూ, ధర్మ ప్రతిపాదనం చేసేది, ప్రీతిదాయకమైనది, ఉపదేశాత్మకమైనది మాత్రమే సాహిత్యంగా పిలవబడుతుంది అని చెప్పుకొచ్చారు.
కానీ,ప్రస్తుత post-modern యుగంలో ఆ నిర్వచనం చెల్లుతుందా అనేది నాకు మాత్రం సందేహమే.రసస్పందన కలిగించేదేదైనా రచన అయినప్పుడు, ‘రసం’తో కూడిన అన్ని రచనలు...అవి బూతు కథలైనా సరే సారస్వతమే అనుకుంటాను. అయితే, వాటి సామాజిక ప్రయోజనాన్ని నిర్దేశించేప్పుడు మాత్రమే విలువలతో బేరిజు చెయ్యాల్సివస్తుంది. వాటి సృజనాత్మకతను ప్రశ్నించనఖ్ఖరలేదు.
ఇక మీ విమర్శకుల డెఫినిషన్ అనుభవం నుంచీ వచ్చుంటుంది. ప్రస్తుతం చాలా మంది అలాంటివాళ్ళే ఉన్నారు మరి!
well said, Mahesh!
//విమర్శకుడికి అనుకున్నది చెప్పే అధికారంకన్నా, రచన ఆదర్శాన్ని అర్థంచేసుకుని విశ్లేషించడం ముఖ్యం....
ఏకీభవిస్తాను. ఆర్.యస్. సుదర్శనం గారు మన తెలుగు ఉత్తమ విమర్శకులలో ఒకరు అంటారు. ఆయన కూడా ఈమాటే అన్నారు.ఇంకా అంపశయ్య నవీన్ గారు కూడా ఇదే చెప్పారు.
Post a Comment