Thursday, December 31, 2009

బ్లాగులు నాకేమిచ్చాయి?
టైంపాస్ కి నేను బ్లాగు మొదలెట్టలేదు. నా ఆలోచనలూ,అభిప్రాయాలూ,అనుభవాలూ (ఒకవేళ ఉంటే) ఆధర్శాలు రాసుకోవడానికి బ్లాగు మొదలెట్టాను. ఎప్పుడో మర్చిపోయిన "తెలుగులో రాయడాన్ని" సానబెట్టుకోవడానికి మొదలెట్టాను.

మొదలెట్టిన రెండున్నర సంవత్సరాల్లో ఎన్నో అనుభవాలు.
కొన్ని అహ్లాదపరిచేవి, కొన్ని కలవరపెట్టేవి. 
ఎన్నో వాదాలూ వివాదాలు. 
కొన్ని మెదడుకు పదునుపెట్టేవి, మరికొన్ని మనసుని (గాయ)గట్టిపరిచేవి.
ఎన్నో ఆలోచనలు.
కొన్ని నన్నునాకు పరిచయం చేసేవి,మరికొన్ని ఇతరులకు నాపరిచయం కలుగజేసేవి.
ఎందరితోనో పరిచయాలు.
కొన్ని జీవితాన్ని మార్చేవి, మరికొన్ని జీవన మూల్యాల్ని ప్రశ్నించేవి/బలపర్చేవి.

ఇలా బ్లాగు నా వ్యక్తిత్వంలో భాగమయ్యింది. ఎన్నో మార్పులు,ఒత్తిడుల మధ్య 2009 లో నా బ్లాగులో నేను తక్కువ రాశానేమో అనిపించింది.కానీ లెక్క చూసుకుంటే 171 టపాలు తేలాయి. ఒకనెలలో ఏకంగా 30 టపాలున్నాయి.

బ్లాగుల్లో రాయడం వలన నా ఎన్నో ఆలోచనలకు పదాలు దొరికాయి. నా అభిప్రాయాల పదును పెరిగింది. వాటిని చెప్పే విధానంలో నాదంటూ ఒక శైలి కలిగింది. ఇదే సాధన మొదటిమెట్టుగా నా సినిమా ఆశయం నెరవేర్చుకునే అవకాశం వచ్చింది. ఈ సంవత్సరం ఒక సినిమాకు మిత్రుడు వెంకట్ తో కలిసి మాటలు రాశాను. నూతన సంవత్సరంలో రిలీజయ్యే ఈ సినిమా పేరు "న్యూ". మొదటిసారి వెండితెరపై నా పేరు కనిపిస్తుంది. నా రాతలకు మరో గుర్తింపు వస్తుంది.

బ్లాగులు నాకింకా ఏమిచ్చాయి? తెలీదు. ముందుముందు చూడాలి.

అందరికీ "న్యూ" సంవత్సర శుభాకాంక్షలు.

"న్యూ" చిత్రం వెబ్ సైట్ కోసం ఇక్కడ చూడండి.

**** 

47 comments:

సత్యప్రసాద్ అరిపిరాల said...

(నా లాంటి..).. మంచి మిత్రుల్ని ఇచ్చింది.. మర్చిపోతే ఎలా..!!
మీ "న్యూ" అవతారానికి శుభాభినందనలు

Suresh Kumar Digumarthi said...

My hearty congratulations on your success. మీ బ్లాగు మీకేమిచ్చిందో మీరు చెప్పండి, మీ బ్లాగు నాకేమిచ్చిందో చెప్పనా. నాకు బ్లాగులు మీకన్న ముందే తెలుసు కానీ మిమ్మల్ని చదవడం ద్వారా నాలో ఆసక్తి కలిగింది. నేను భావాలను ఎంతో పంచుకొనే అవకాశం కలిగింది.

ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని....
సురేష్ కుమార్ దిగుమర్తి

సుజాత said...

మీ బ్లాగు మీకే కాదు, మాకూ ఇచ్చిందిగా మీలాంటి మంచి మిత్రుల్ని!

monkey2man said...

నూతన సంవత్సర శుభాకంక్షలు..
"బ్లాగులోకంలో మంచి టపాలు - 2009"
కోసం ఈ కింది లంకే చూడండి.
http://challanitalli.blogspot.com/2009/12/2009.html

అప్పారావు శాస్త్రి said...

మిమ్మల్ని గాయ పరిచిన బ్లాగుల్లో నాదోకటి అనుకుంటా! మహాత్మా రాంధీ కి మీరు బాధపదినట్లున్నారు.
ఆ తర్వాత నుంచీ ఇటు చూడటమే మానేశారనుకుంటా. దాంట్లో చివర కొసమెరుపు ఇచ్చా !
any way
WISH YOU A HAPPY NEW YEAR

డల్లాస్ నాగేశ్వరరావు said...

మహేష్,
మనఃపూర్తి అభినందనలు. నేను తెలుగు బ్లాగులు చూడడం మొదలు పెట్టింది 2009 లోనే(ఇన్ని రోజులు చూడకుండా ఎలా వున్నానా అని చాలా బాధ పడ్డాను). ’శరత్ కాలం’ వారి వీడియో చూస్తుండగా, మీ బ్లాగు పరిచయం జరిగింది.(అసందర్భమైనా, ’శరత్ కాలం’ వారికి కృతజ్నతలు). ఆరోజు ఆపకుండా మీ బ్లాగులోని దాదాపు అన్ని టపాలు చదివేశాను. మీ రచనల శైలి నాకు బాగా నచ్చింది. అసలు ఒక శైలి అంటూ ఏర్పరచుకోవడం ఎంత ముఖ్హ్యమో, ఎంత కష్టమో ఇప్పుడిప్పుడే తెలుస్తోంది.
మీ మొదటి ప్రయత్నం ’న్యూ’ మీకు సంత్రుప్తి మిగల్చాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.

sunita said...

Wish you a happy new year!

కొత్త పాళీ said...

బాగుంది. అభినందనలు.
తరచూ రాయడం వల్ల సొంత శైలిని సృష్టించుకోవడం, వచ్చిన శైలికి పదును పెట్టుకోవడం అంటే మీ బ్లాగు మంచి ఉదాహరణ.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

మీరు మంచి సినిమా రచయితగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను.

Venu said...

బ్లాగులు మీకేమిచ్చాయో కాని, బ్లాగుల వల్ల ఒక మంచి రచయిత మాకు దొరికారు.

నేను బ్లాగు మొదలెట్టినప్పుడు కూడలి లేదు. నాకు నచ్చిన పాటల్ని తెలుగు అక్షరాలలో చూసుకోవటానికి, నా పిల్లల పిక్స్ ని ఒక చోట చూసుకోవటానికి 2005/2006 లో మొదలెట్టాను. అప్పుడు అంతగా తెలుగు లో బ్లాగులు ఉండేవి కావు.

మీ బ్లాగుని చూడటం ఎలా, ఎప్పుడు జరిగిందో గుర్తు లేదు కాని, మీ రచనా శైలి, మీరు నమ్మిన విషయాన్ని చెప్పటంలో స్పష్టత, దృఢత్వం నాకు నచ్చాయి. అలా అని మీ ప్రతి ఒక్క పోస్టు నచ్చేది అని కాదు. కొన్ని విషయాల్లో మీరు ఒక వైపు నించే ఆలోచిస్తారు అనిపించినా ఆ పోస్టుల్లో కూడా మీరు నమ్మిన వాటిని ధైర్యంగా చెప్పే ఆత్మ స్థైర్యం నచ్చేది.

నేను ఇప్పటికీ కూడలి లో మీ పోస్టు కనిపించకపోయినా వెతుక్కుని చూసే బ్లాగ్ మీది మరియూ వేణూ శ్రీకాంత్ ది.

మీరు ఈ మధ్య పోస్ట్ చెయ్యటం కొంచెం తగ్గించినట్టుగా కనిపిస్తుంది. కొత్త సంవత్సరం లో మరిన్ని విభిన్నమైన అంశాలు మీ నించి ఆశిస్తూ..

:)

All The Best for 'New'

Indian Minerva said...

#All the best#.

kaanI I "nyuu" ardham kaalEdu. dIni nirmaaNamlO mIrEmainnaa paalupamcukonnaaraa? #wallpapers# komcem #artistic#gaa vunnaay #so intresting#gaa vunnaay.

తృష్ణ said...

ఏమిచ్చినా ఇవ్వకపోయినా blog is a mirror...!
మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

కెక్యూబ్ వర్మ said...

మీ మాటల పదును 'న్యూ'లో మరింత వినవచ్చుననుకుంటా. ఈ నూతన సం.లో మీరు మరిన్ని విజయాలకు చేరువకావాలని ఆశిస్తూ...
అభినందనలతో..

వేణూ శ్రీకాంత్ said...

Wow That's good to know. Congratulations. మీ నూతన ప్రయత్నం విజయవంతం కావాలని మీరు మరిన్ని అవకాశాలను సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను.

మీకు మీ కుటుంబానికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

శరత్ 'కాలమ్' said...

న్యూలుక్కేయాల్సిందే!

పరిమళం said...

మీ చిత్రం విజయవంతం కావాలని అలాగే మీరు మరిన్ని అవకాశాలు అందుకోవాలని ఆశిస్తూ మీక్కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు!

మరువం ఉష said...

"ఈ దేశం మాకేమిచ్చింది" అన్న మునుపటి నవల పేరు గుర్తుకొచ్చింది. ఇక్కడ ఎవరికివారు చెప్పుకోవాలి, యేమి ఇస్తున్నారో, పుచ్చుకుంటున్నారో. ఇదీ ఒక మాధ్యమం, మరొక వేదిక. మిగిలినవి మీరే చెప్పారు. మీకు అభినందనలు. మీ సంతు బ్లాగుకి ఆశీర్వాదాలు.

Kalpana Rentala said...

మహేష్,
మీరు సినిమా మాటలు రాసారా? ఇప్పుడే ఆ విషయం తెలుసుకోవటం. నేను బ్లాగ్ ల్లో ఎంత వెనకబడి వుంటానో మీకు తెలియనిది కాదు. తెలిసిన కొద్ది బ్లాగ్ లోకంలో మీ స్టైలే వేరు అంటాను. బ్లాగులు ఏమిచ్చాయో నేనుకూడా వెనక్కు తిరిగి చూసుకోవాలి.
మీ విజయానికి అభినందనలు.

మేధ said...

మీ "న్యూ" రాతలకి శుభాభినందనలు.. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు..

'Padmarpita' said...

నూతన సంవత్సర శుభాకంక్షలు..

$h@nK@R ! said...

బ్లాగు లలొ మీ బ్లాగ్ బుల్లి బ్లాగర్లకు ఒక రిఫరెన్స్ లాంటిందండి.. మీ న్యూ ప్రయత్నాలకు.. అభినందనలు

Chandra Latha said...

అయితే ,కొత్త ప్రపంచంలో కళ్ళు తెరవబోతున్నారన్న మాట! మహేష్ కుమార్ గారు, మీ పర్ణశాల పదికాలాలు పచ్చగా ఉండాలని ఆకాంక్షిస్తూ...అనేక శుభాకాంక్షలతో... మీ అభిమాన పాఠకురాలు..చంద్ర లత

చంద్ర మోహన్ said...

అభినందనలు! బ్లాగుల ద్వారా ఇంత వికాసం కలుగుతుందని ఇప్పుడే తెలిసింది. ఈ మాట మీరుగాక ఇంకెవరు చెప్పినా నమ్మేవాడిని కాను.

మరోసారి నూతన సంవత్సర శుభాభినందనలు!

జయ said...

మీకు నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

నిజం said...

నూతన సంవత్సర శుభాకాంక్షలు ....

విశ్వ ప్రేమికుడు said...

wish you happy new year.

మీ ప్రగతికి అభినందనలు. నాకేమిచ్చిందో నా బ్లాగులో రాసుకున్నాను. వీలైతే చూడండి. :)

సిరిసిరిమువ్వ said...

ముందుగా అభినందనలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు ..

మాలా కుమార్ said...

నూతన సంవత్సర శుభాకాంక్షలు .

ప్రవీణ్ గార్లపాటి said...

మీ ఈ విజయానికి అభినందనలు.
ఈ సంవత్సరం ఇంకా ఎన్నో విజయాలు మీకు కలగాలని కోరుకుంటున్నాను.

శిశిర said...

మీ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటూ...నూతన సంవత్సర శుభాకాంక్షలు .

శ్రీకాంత్ said...

మహేష్ గారు,

న్యూ సినిమా ద్వారా మీ చిరకాల వాంఛ ఫలించబోతున్నందుకు శుభాభినందనలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు

Bhadrasimha said...

బ్లాగు మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకంక్షలు,
ఈ కొత్త వత్సరం అందరు సుఖ సంతోషాలతో ఉండాలని ,
మనందరి పై ఆ శ్రీ నృసింహుని కృప ఉండాలని ఆసిస్తూ మీ కోసం భద్రాచల నరసింహ క్యాలండర్ - 2010 ఈ కింది లింకులో
http://bhadrasimha.blogspot.com/2010/01/2010.html
ధన్యవాదములు
- భద్రసింహ

Anonymous said...

బ్లాగుల్లో నేను రాసిన మొదటి వ్యాఖ్య మీ బ్లాగులోనే. నా బ్లాగులో వచ్చిన మొదటి వ్యాఖ్య మీరు రాసిందే.....
సంచలనానికి మారుపేరుగా మారిపోయిన మీ బ్లాగుకేసి రావటానికి ( మీ రాతలకి కాదు , వాటికొచ్చే వ్యాఖ్యలకి ) భయపడిపోయి ఇటుకేసి చూడటమే మానేసాను. అబ్బో ఇంతలోనే ఎంత ఎదిగిపోయారు . మీ ఆకాంక్షలన్నీ నెరవేరాలనీ మీరు కోరుకున్న రంగంలో ఎంతో ఎత్తుకు ఎదగాలనీ దేవుని ప్రార్ధిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు

రవి said...

ఆలోచనలు చాలా మందికి ఉండవచ్చు. వాటికి స్పష్టమైన అభివ్యక్తీకరణ కొంతమందికే ఉంటుంది. నా ఆలోచనలను అభివ్యక్తీకరించడం కోసం, మీ బ్లాగును అప్పుడప్పుడూ అదేదో పాఠంలా చదివాను కొన్ని సార్లు. అయినా నాలో ఆ నేర్పు సాధ్యపడట్లేదు. ఎందుకో ఏమో?

నాగప్రసాద్ said...

అభినందనలు. బ్లాగుల్లో మీరు రాసే వాదనల్లా ఉంటాయో లేక "న్యూ" పేరు లాగా కొత్తగా ఉంటాయో తెలుసుకోవడం కోసమైనా ఒకసారి "న్యూ" చూడాల్సిందే. ;)

cbrao said...

బ్లాగులు మీ ఆలోచనలకు, తెలుగుకు పదును పెట్టాయి. కొత్త మిత్రులను, శతృవులను సంపాదించింది. ముఖ్యంగా సంభాషణల రచయితగా కొత్త అవతారాన్నిచ్చింది. భవిష్యత్ లో దర్శకులవుతారేమో! అభినందనలు.

లక్ష్మి said...

మరొక కొత్త అధ్యాయానికి నాంది పలికారన్నమాట, అభినందనలు. అలగే నూతన సంవత్సర శుభాకాంక్షలు

Jyotsna said...

all the best

శేఖర్ పెద్దగోపు said...

తెలుగు సినిమాకి అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్స్ రావటం చాలా ఆనందంగా ఉంది. సినిమా టైలర్స్ చాలా బాగున్నాయి. కొత్తదనం మెండుగా కనిపిస్తుంది. న్యూ సినిమా మూసదోరణిలో కొట్టుకుపోతున్న సినీ పరిశ్రమలో ఒక మంచి చిత్రంగా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. మాటల రచయితగా మొదటసారిగా పరిచయం అవుతున్న మీరు, మిగిలిన న్యూ టీం లోని వాళ్ళు సక్సస్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

చైతన్య said...

Good luck for your "new" work !

నిషిగంధ said...

నాకైతే మీ బ్లాగు వలన ఎన్నో అంశాల గురించి క్షుణ్ణంగా తెల్సుకునే అవకాశం కలిగింది.. ధన్యవాదాలు! మీ ఆలోచనలనూ, భావాలనూ నిష్కర్షగా, స్థైర్యంతో చెప్పే మీ విధానం అయితే ఇంకా నచ్చింది.. ఈ కొత్త సంవత్సరంలో మీకు ఇష్టమైన రంగంలో ఎంతో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..

rayraj said...

wow!!Congratulations! So now you are in a different league!! ఇక మీరు మా మాటల వినరనుకోవచ్చేమో కదా.

@అందరికీ : అందరూ సిద్దం కండి! మనం మహేష్‍ మాటలని విమర్శలతో తూలనాడవచ్చు, Its Official now! ;)

వెంకటరమణ said...

అభినందనలు మహేష్ గారు. మీ బ్లాగు వలన పుస్తకాల గురించీ, సమకాలీన అంశాల గురించి చాలా విషయాలు తెలిసాయి.

బొల్లోజు బాబా said...

wah superb

wish you good luck.

Vinay Chakravarthi.Gogineni said...
This comment has been removed by the author.
Vinay Chakravarthi.Gogineni said...

looking for ur movie.........

yab said...

కొన్ని నన్నునాకు పరిచయం చేసేవి
బ్లాగుల్లో రాయడం వలన నా ఎన్నో ఆలోచనలకు పదాలు దొరికాయి
Very nice expressions, it shows ur clarity of thought. Liked this post very much, as I always wondered what is the point in writing blogs.