Wednesday, February 3, 2010

నువ్వు - నేను

నువ్వు నువ్వుగా ఉన్నందుకు
నిన్ను నేను కోల్పోయాననుకున్నాను
ఇప్పుడే తెలిసింది...
నేను నేనుగా మిగిలినందుకు
నిన్ను నేను కోల్పోయానని

Loss

I thought I lost you
because you were you
but now I know
I lost you
because I was I

                   - Shekhar kapur


****

8 comments:

మోహన said...

Confusing!

>>నేను నేనుగా మిగిలినందుకు
"నేను నేనుగా మిగిలేందుకు" అని అనుకున్నా నేను.

Harish G said...

నేను నేనుగా మిగిలినప్పుడు
నిన్ను మాత్రమే కాదు
అన్నీ కోల్పోయి ఉంటాను.

పరిమళం said...

కోల్పోవడంలోని బాధను రెండే లైన్లలో చెప్పారు . కోల్పోవడానికి గల కారణాన్ని కూడా!

సుజాత వేల్పూరి said...

"నేను నేనుగా మిగలాలి" అని ఇద్దరూ అనుకున్నపుడు విడిపోవడం తప్ప వేరే చాయిస్ లేదనుకుంటా.

Padmarpita said...

మూడు లైన్లలో మొత్తం చెప్పారుగా.

Sri said...

I thought I lost you
because you were you
but now I know
I lost you
because I was I


I read this in Shekhar kapoor blog few years ago :)

Kathi Mahesh Kumar said...

@శ్రీ: గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.

నేను శేఖర్ కపూర్ కవితలు చాలా అనువదించాను. ఇది కూడా ఎప్పుడో రాసుకున్నదే. ఒరిజినల్ కాకుండా కేవలం తెలుగు వర్షన్ మాత్రం నా మెయిల్లో ఉండిపోయింది.మొన్న చూస్తుంటే దొరికింది. ఎందుకో అది నా భావమే అనిపించింది. అనువాదమనే స్పురణ రాలేదు.

భావన said...

హ్మ్.. సుజాత.... ఇలా కూడా అనొచ్చు. ఆలోచించండి విడిపోకుండా..
నేను నేను గా మిగిలి... నువ్వు నువ్వుగానే వున్నా నీలోని నేను నీకు చాయ గా.. నాలోని నువ్వు నాకు మారు పేరు గా వుండొచ్చు. రెండు ఇండీవిడ్యువాలిటీలు నిలబెట్టుకుంటా పరస్పర గౌరవం తో సహజీవనం కష్టం కాని ఇంపాజిబుల్ ఐతే కాదు కదా.