Tuesday, December 27, 2011
ఎడారివర్షం - లఘుచిత్రం
Posted by Kathi Mahesh Kumar at 5:50 PM 15 comments
Labels: వ్యక్తిగతం, సినిమాలు
Saturday, October 15, 2011
మాయావతి జిందాబాద్ !
బృహత్తర నిర్మాణాలే వారసత్వాలుగా గుర్తించే భారతదేశంలో, ప్రభుత్వం డబ్బుతో పార్కుల నిర్మాణం. దళితబాంధవుల విగ్రహాల నిర్మాణం చేసినందుకు మాయావతిని ఖండించాలట. ఎందుకు ఖండించాలో నాకు అర్థం కావడం లేదు. విగ్రహాల నిర్మాణం చెయ్యని పార్టీ ఏది? నాయకుల్ని చిరస్మరణీయులు చెయ్యడానికి ఎయిర్పోర్టులకి, రోడ్లకీ, పార్కులకీ, భవనాలకూ పేర్లుపెట్టని రాష్ట్రం ఏది? అవన్నీ పబ్లిక్ డబ్బులతో జరగలేదా?! ట్యాంక్ బండ్ మీద విగ్రహాలెందుకు? హుస్సేన్ సాగర్ లో బుద్దుడెందుకు? అది మాత్రం ట్యాక్స్ పేయర్ డబ్బుకాదా?!
మాయావతి చాలా మందికి నచ్చదు. తను బాహాటంగా చేసే వెల్త్ డిస్ప్లే అస్సలు నచ్చదు. నిజమే... బాత్రూముల్లో మాత్రమే బంగారు కమోడ్లు పెట్టుకునే నాగరికులుండే లోకంలో బాహాటంగా వెయ్యిరూపాయిల దండేసుకోవడం అసహ్యంగానే ఉంటుంది. చచ్చినోడి రాజకీయ ఉత్తరాధికారిగా నిరూపించుకోవడానికి వాడవాడలా విగ్రహాలు పెట్టిస్తే అది రాజకీయం. కానీ తన విగ్రహాన్ని తనే ఉద్ఘాటిస్తే మాత్రం అసహ్యం. ఇది ఏరూల్ బుక్ ప్రకారమో కాస్త చెబుతారా? ఆ రూల్ బుక్ తగులబెట్టడానికే పుట్టిన ‘మాయ’ ఇది. అగ్రకుల రాజకీయాల్ని, హిందూమతాహంకారాన్ని కాలరాయడానికి పుట్టిన ‘అతి’ ఇది.
Posted by Kathi Mahesh Kumar at 7:32 PM 63 comments
Labels: సమాజం
Tuesday, September 13, 2011
తెలుగు సినిమాలు - డబ్బింగ్ సినిమాలు
కన్నడ పరిశ్రమ తరహాలో ఇక్కడా డబ్బింగ్ సినిమాల్ని నిషేధిస్తారట: హహహ...
కర్ణాటకలో తెలుగు తమిళ సినిమాలు డైరెక్టుగానే రిలీజై వందరోజులు ఆడేస్తాయి. డబ్బింగ్ సినిమాలు వాళ్లకి అసలు అవసరమే లేదు. అయినా నిషేధాలవల్ల సినిమా పరిశ్రమ అభివృద్దిచెందదు. సెన్సిబుల్ సినిమాల వల్ల అభివృద్ధి చెందుతుంది. ఆ జ్ఞానం మనోళ్ళకి కావాలి. అయినా, డబ్బింగ్ సినిమాలు లేకపోతే ఉన్న థియేటర్లలో ఈగలు తోలుకోవలసిందే. డబ్బింగ్ సినిమాలు లేకపోతే పూటగడవని పరిస్థితికి తెలుగు పరిశ్రమ చేరింది. కాబట్టి డబ్బింగ్ మీద నిషేధం పరిశ్రమని మరింతగా దిగజారుస్తుందేతప్ప మెరుగుపరచదు. మౌళికాంశాలని వదిలేని ఈ పనికిమాలిన పనులేమిటో మన పరిశ్రమ పెద్దలకు!మన తెలుగు పరిశ్రమ సమస్యల విస్తృతత్వానికి అంతే విశాలమైన సమాధానాలు కావాలి. “సెన్సిబుల్ సినిమా” అనే పదం చిన్నదే అయినా దానిలో ఆ విశాలత్వం దాగుందని తమిళ,మళయాళ,బంగ్లా, మరాఠీ, హిందీ సినిమాలు నిరూపిస్తూ వస్తున్నాయి. సినిమాని కేవలం కళగా భావించినా చెల్లదు, వ్యాపారంగా మాత్రమే భావించినా పొసగదు. కళాత్మకవ్యాపారం అని అంగీకరిస్తూనే, రెంటిలోని నిబద్ధతని ఒకటిచెయ్యగలిగితేనే సెన్సిబుల్ సినిమా పుడుతుంది. విషయపరమైన సెన్సిటివిటీ దర్శకుడి బాధ్యత అయితే, వ్యాపారపరమైన సిన్సియారిటీకి నిర్మాత బాధ్యుడు. ఈ విధంగా ఇద్దరూ సెన్సిబుల్ సినిమాకి రథసారధులే.
వ్యాపారనిబద్ధత కలిగిన నిర్మాత ఆద్యుడైతే, కళపట్ల సమగ్రమైన అవగాహన కలిగిన దర్శకుడు మధ్యాంతాలుగా కొనసాగితేనే మంచి సినిమా పుడుతుంది. అటు వ్యాపారాత్మకంగానూ ఇటు కళాత్మకంగానూ వృద్ధిచెందుతుంది.
సమస్య నిర్మాతల వైపునుంచే అని ఒప్పుకోవాలనిపించినా, తమిళంలో మొదలైన దర్శకనిర్మాతల ట్రెండ్ నన్ను ఆపుతోంది. ఒక సెన్సిబుల్ సినిమా ఇచ్చి పరిశ్రమని ఒక కుదుపుకుదిపిన దర్శకులు తమిళంలో వెనువెంఠనే కార్పొరేట్ ఫండింగో, ఫైనాన్సర్ల ఫండింగో సంపాదించి దర్శకనిర్మాతలుగానూ, సెన్సిబుల్ నిర్మాతలుగానూ ఎదిగి వైవిధ్యాన్ని నిలబెడుతున్నారు. “ట్రెండ్” సృష్టిస్తున్నారు. కానీ తెలుగులో ఆ పరిణామం కనిపించదు. శేఖర్ కమ్ముల కొంత ప్రయత్నించినా, చంద్రశేఖర్ ఏలేటి, చంద్రసిద్దార్థ, క్రిష్, దేవకట్టా లాంటివాళ్ళుకూడా తమ సర్వైవల్ కోసం వెతుక్కునే పరిస్థితిదాటి ఎదగలేని బలహీనతలోనే ఉన్నారు. ఈపాటికి వీళ్ళ స్వీయదర్శకత్వంలోనో లేక నిర్మాణంలోనే కనీసం నాలుగేసి సినిమాలు సంవత్సరానికి వచ్చుంటే ఈపాటికి పరిశ్రమ రూపురేఖలు మారేవి.
కథల విషయానికి వస్తే, తెలుగు సినిమా కథలు చెప్పడం మానేసి సీన్ల అల్లికలోపడు పాతికసంవత్సరాలు దాటుతోంది. కాబట్టి మార్పు అక్కడినుంచే రావాలి. అది నిర్మాతగా కూడా మారగలిగే సత్తాఉన్న దర్శకుల దగ్గరనుంచే రావాలి. కథలు చాలానే ఉన్నాయి.
Posted by Kathi Mahesh Kumar at 6:49 AM 2 comments
Labels: సినిమాలు
Saturday, September 10, 2011
రెండు సినిమాలు: ఒకటి కొత్తది మరొకటి పాతది.
ఈటివి లో శోభన్ బాబు- లక్ష్మి నటించిన ‘కోడెనాగు’ సినిమా చూశా . చాలా శక్తివంతమైన సినిమా. యువతరం ఆరాటం. సమాజం పట్ల ఉండే నిరసన, కోపం. వ్యక్తిగత ద్వేషాలూ, పగ. అలవికాని ప్రేమ. అర్థంకాని ఆవేశాలు. ఎంత సహజంగా రచించారా అనిపించింది. ఈ భావతీవ్రత అంతా ఈ చిత్రానికి కన్నడ మాతృక అయిన ‘నాగరహావు’ రాసిన ‘తరాసు’ కు చెల్లుతాయనుకుంటా. పుట్టణ్ణ కణగల్ దర్శకత్వం వహించిన ఒరిజినల్ కూడా చూశాను. అందులో విష్ణువర్థన్ నటనే నాకు శోభన్ బాబుకన్నా బాగా నచ్చింది. బహుశా అదే విష్ణువర్థన్ మొదటి సినిమా కావడం, శోభన్ బాబు ఈ సినిమా చేసేసరికే ఒక ఇమేజ్ ఉండటం ఒక కారణం కావొచ్చు. కొడెనాగు సినిమాలో ఆచార్య ఆత్రేయ నటించడం ఒక హైలైట్.
ఈ ‘గ్యాంబ్లర్’ తో పెట్టుకుంటే పాపరే!
అజిత్ అభిమానుల వీరాభిమానం మీద, అతగాడి స్క్రీన్ ప్రెజెన్స్ మీద తప్ప స్క్రిప్టు మీద ఏమాత్రం శ్రద్ధలేకుండా తీసిన చిత్రం ఇది. ఒక థిల్లర్ కథకు అనవసరపు కామెడీ మిక్స్ చేసి అసందర్భమైన, అర్థరహితమైన స్క్రీన్ ప్లేతో సినిమా అంతా నడుస్తుంది. ఉపసంహారం (ఎపిలాగ్)లో మలుపు తిప్పి, కథ మొత్తాన్నీ మార్చేసే పద్దతి హాలీవుడ్ లో కొన్ని సినిమాలలో వర్కవుటైనా అప్పటికే సహనం చచ్చిన ప్రేక్షకుడికి ఈ చిత్రంలోని ఎండ్ ట్విస్ట్ ఏమాత్రం కిక్ ఇవ్వదు. అజిత్ నటన చాలా కొత్తగా, బాగుంది. అర్జున్ మామూలే. అంతకు మించి ఈ సినిమా గురించి చెప్పుకోవడానికి ఏమీలేదు.
****
Posted by Kathi Mahesh Kumar at 1:40 AM 1 comments
Labels: సినిమాలు
Tuesday, August 30, 2011
ది క్రిటిక్
పల్లెమిత్రుడు, పట్నం మిత్రుడి ముఖంలో విచిత్రాన్ని చూసిన అనుభూతిని చూద్దామని తిరిగి చూశాడు.
Posted by Kathi Mahesh Kumar at 7:29 AM 2 comments
Labels: కథ
Thursday, August 25, 2011
వచ్చాడు. కెలికాడు.
అప్పుడే చుట్టుపక్కల గమనించాను. ఏదో సినిమా స్టాండీలు, వాటిపైన తమిళనటుడు జీవా ఫోటోలు “ఏంటీ రంగం సినిమా విజయోత్సవాలా?!” అనిఅడిగితే దానికి మిత్రుడు నవ్వేసి, “కాదు. రాబోయే సినిమా ప్రమోషన్లు” ఓహో...అంటూ పరికించి చూస్తే ఆ సినిమా టైటిల్ “వచ్చాడు. గెలిచాడు”...
సర్కాస్టిగ్గా నా మిత్రుడివైపు తిరిగి “‘రంగం’తో వచ్చాడు హిట్ కొట్టి గెలిచాడా!” అన్నాను.
తను నావైపు తమాషాగా చూస్తూ “ఇండస్ట్రీ అంతేకదా బ్రదర్. హిట్ ఉన్నవాడిదే రాజ్యం. వాడు ఏంచేసినా చెల్లుతుంది. ఏం చెప్పినా ఊకొడుతుంది” అని పత్రిక ప్రాస భాషలో అనేశాడు.
“రంగం సినిమా హిట్ అవడానికి కారణం కథ కదా, మరి అలాంటి కథల్ని వెతుక్కోకుండా ఆ హీరోని పట్టుకుని వేలాడితే మరో హిట్ వస్తుందని ఎందుకనుకుంటారు మనోళ్ళు” అని నేను సాలోచనగా నాలోనేను అనుకుంటే, నా మిత్రుడు సానుభూతిగా నా భుజంతట్టి, “ఇలా అలోచించి బుర్ర పాడుచేసుకోకు. నాకైతే ఈ సినిమా హిట్ అవడానికి జీవాకన్నా ఇంకో నటుడు అజ్మల్ పాత్ర కారణం అనిపిస్తుంది” అని చల్లగా చెప్పాడు.
నిజమే జీవాకు రంగం సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నమాట నిజమేకానీ, కథాపరంగా అజ్మల్ చేసిన యువరాజకీయనేత పాత్ర నటనపరంగానూ, సబ్జెక్టుపరంగానూ చాలా ప్రముఖమైన పాత్ర. చివరికొచ్చేసరికీ మొత్తంగా కథను నడిపిన పాత్రగా నిలబడుతుంది.
కాకపోతే సమస్యల్ని తీర్చేవాడే హీరోకాబట్టి చివరాఖరికి జీవానే ఆ సినిమా హీరో. నా ఆలోచన సంగతి ఎలా ఉన్నా అసలే కాన్స్పిరసీ థియరీలు రాసే పత్రికలో గాసిప్స్ రాసే పాత్రికేయుడిగా నా మిత్రుడి ఆలోచన ఎలా ఉందో తెలుసుకుందామనే క్యూరియాసిటీ కలిగి “అలా ఎందుకనుకుంటున్నావ్?” అని ఒక శరంసంధించాను. కానీ నేను రియలైజ్ కానిది ఎంట్రా అంటే, ఈ మిత్రుడు నా మైండ్ బ్లాంకయ్యే కాన్స్పిరసీ చెబుతాడని.
నా మిత్రుడు చెప్పెనదాని ప్రకారం రంగం సినిమా తెలుగులో హిట్ అవ్వడానికి ముఖ్యకారణం అజ్మల్ పాత్ర్ర. “ఒకసారి జాగ్రత్తగా గమనించు, ఆ పాత్ర తీరు, డ్రస్సింగ్, డయలాగ్స్ అన్నీ మన లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ్ ని తలిపించడంలేదూ!” అన్నాడు.
ఒక్క క్షణం నాకు పోలిక అర్థం కాలేదు. కానీ ఎందుకో మళ్ళీ ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లోకెళ్ళి సినిమా రీలు మైండ్ లో తిరగేస్తే ఒక క్రూషియల్ సీన్ లో “నేనూ స్వార్థపరుడినే, నా కుటుంబం బాగుండాలని కోరుకుంటాను. కాకపోతే నా కుటుంబం పెద్దది. విశాలమైనది. మీరు, ఈ సమాజం, దేశం అన్నీ దానిలో భాగమే” అంటూ ఏదో ఒక డైలాగ్ ఉంటుంది. అది ఎగ్జాక్ట్ గా ఏదో సభలో (లోక్ సత్తా పార్టీ ఆవిర్భావసభ అనుకుంటా) అన్నాడు. “హమ్మో! నిజమేనేమో” అనుకున్నా.
“అయితే మాత్రం” అంటూ ఏదో బింకం నటించడానికి ప్రయత్నించాను. నా మిత్రుడు సాలోచనగా నన్ను పక్కకు తీసుకెళ్ళి “బాసూ, రంగం సినిమా A సెంటర్లకన్నా B-C సెంటర్లలో బాగా ఆడింది. సినిమా బాగుండటంతో పాటూ ఆంధప్రదేశ్ రాజకీయాలకు చాలా దగ్గరగా ఉంటుంది. జయప్రకాష్ నారాయణ్ లాంటి న్యూట్రల్ సిన్సియర్ ఫేస్ ను అడ్డుపెట్టుకును ఈనాడు పేపర్ అటు కాంగ్రెస్ ను తెలుగుదేశం ను ఎలా ఆడుకుందో వాడుకుందో అనేదే అసలు కథ. ప్రజలకు అర్థమయిన కథ. జె.పి.ఎలాగూ అగ్రకులాల రాజకీయాలకు మరో ఫేసు తనబండారమూ ఇలా ఎదో ఒక రోజు బయటపడుతుందని అందరికీ తెలుసు. ప్రజలకు అన్నీ తెలుసు. అందుకే అలా కనెక్ట్ అయిపోయారు” అని తన కాన్స్పిరసీ థియరీతో నాకు జ్ఞానోదయం కలిగించాడు.
“ఛా! నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావ్. సినిమా బాగుంది హిట్ అయ్యింది” అని నేను కొంచెం బెదురుగా అంటే, “బ్రదరూ జె,పి. కుల కోఠరీ గురించి, ఈనాడు అతన్ని ఎలా లీడర్ ను చేసింది అనేదాని గురించీ నీకూ తెలుసుకదా?” అని అడిగాడు.
“అదిసరే! కానీ మరీ సినిమా కథకూ దానికీ లింకు కట్టడం నాకైతే పెద్దగా లాజికల్ గా అనిపించడం లేదు” అని తేల్చేశాను. నా మిత్రుడు కొంచెం కోపంగా “ఇదేనయ్యా మీలాంటి సీరియస్ ఫిల్మ్ క్రిటిక్స్ తో వచ్చే తంటా, ‘తెలుగుతనం లేదు కాబట్టే శక్తి, తీన్ మార్, బద్రీనాథ్ ఫెయిలయ్యాయి’ అంటారు. ఇదిగో ఈ తెలుగు రాజకీయాల్ని చూపించింది కాబట్టే రంగం సినిమా హిట్ అయ్యింది అంటే మాత్రం ఒప్పుకోవడానికి కష్టం అంటారు. ఎలాగయ్యా మీతో చేసేది” అనేశాడు.
“మరీ బోడి గుండుకీ మోకాలికీ ముడిపెట్టడం...” అంటూనేను నసుగుతుండగానే ఎవరో ఆడియో ఫంక్షన్ స్టార్ట్ అవుతోందనే సరికీ ఫ్రీబీస్, స్వీట్ ప్యాకెట్స్, గిఫ్ట్ కవర్ల కోసం మావోడులగెత్తాడు కవరేజ్ అనుకుంటూ. నేను మాత్రం చేతిలో రాంగోపాల్ వర్మ ‘నాట్ ఎలవ్ స్టోరీ’ సినిమా టికెట్లు పట్టుకుని పిచ్చిచూపులు చూస్తూ “వచ్చాడు గెలిచాడు” పోస్టర్ చూస్తుంటే పోస్టర్ మసకబారి “వచ్చాడు. కెలికాడు” లా కనిపించింది.
Posted by Kathi Mahesh Kumar at 11:59 AM 6 comments
Labels: సినిమాలు
Friday, August 5, 2011
ఈ మధ్యకాలంలో బ్లాగులు రాయాలనిపించలేదు.
Posted by Kathi Mahesh Kumar at 7:45 PM 13 comments
Labels: వ్యక్తిగతం
Sunday, May 8, 2011
అవును నామిని పుడింగే !
నామిని రచనల్లో కనిపించే తెలియనితనం ఈ పుస్తకంలో మాయమై, ఒక మాయగాడూ, తెంపరి కనిపించడం అందరికీ షాకే. ఇదీ అదీ రెండూ నామినే. నామిని పుడింగే ! నెంబర్ వన్ పుడింగే !! కాదంటారా !?!
Posted by Kathi Mahesh Kumar at 8:21 AM 5 comments
Sunday, March 20, 2011
స్పృశ్యాస్పృశ్య దేహాలు - ఒక హోళీ అనుభవం
అన్నింటికన్నా విశేషం-- వేళ్ళు తగిలినా కొరకొర మనే మా ఆడపిల్లలు (క్లాసుమేట్లు), దేవతలు తాకటనికి కూడా సందేహపడే ప్రదేశాల్లో తాకుతూ రంగులు పూస్తున్నా ఏమీ అనకపోవడం. అప్పట్నుంచి, హోళిని మించిన పండగ నాకు లేకుండా పోయింది. 365 రోజుల్లో, ఒక్క రోజు మాత్రమే హోళి రావడం నా జన్మకి శాపమేమో అనిపించింది.
ఇదిలా ఉండగా, మేము ఇంజినీరింగ్ లో జాయిన్ అయినప్పుడు, ఆ తర్వాత రెండేళ్ళ వరకు సిద్ధార్థ మెడికల్ కాలేజి మా కాంపౌండ్ లోనే ఉండేది. మాధవీ లతల కన్నా నాజూకైన మెడికో ఆడపిల్లలతో స్నేహం వల్ల, అనాటమి ఇరుకిరుకు గదుల్లో వాళ్ళ practicals లో నేనూ ఉండే వాడిని. అక్కడ ద్రావకాల్లో కూడా nude bodies ఉంటాయి కదా. కానీ, ఎంత contrast? ఆ వైరుధ్యాన్ని, అనుభవాన్ని అర్థం చేసుకునే యాతనలో, నా brother in law, Osmania medical collegeలో తన anatomy practicals experience నాకు ఉద్వేగంతో చెప్పినప్పుడు, 1997లో నేను రాసిన కవిత ఇది. ప్రతి హోళీకీ గుర్తుకొచ్చే పోయెం.
ఒట్టి దేహాలేనా
ధూళి దుప్పట్ల్లై కప్పుతున్న
పంచరంగుల కేరింతల మధ్య
.............................. అవొట్టి దేహాలేనా
వాన చిత్తడి దయన
కొంగొత్తగా తెలిసే పసిడి పాదాలు
కుదురులేని పైటల చాటు
పియానో మడతల గమకాలు
కొనవేళ్లు తాకినా
ఒళ్లెర్ర చేసి కొరకొరమనే చూపుల
అంటరానితనాల్ని వర్ణావర్ణంగా
చెరిపేసిన
ఆనందహోళీల స్మృతిలో...
................................ అవి ఒట్టి దేహాలేనా
ప్రమత్తంగా తాకిన
క్షణభంగుర స్పర్శలేనా-
నును సెగల నివురును తప్పిస్తున్న
భీతి!
ఇది జఘన చంద్రవంక గాయపరిచిన
సౌఖ్యం!
* * *
ఒట్టి దేహాలేనా
తెంపులేని గొలుసు కలల్ని
చెడనివ్వని ద్రావకాల్లో
...................................... ఇవొట్టి దేహాలేనా
పండు కొరకని ఈవ్‌ల
నగ్నాచ్ఛాదనలివేనా
నిద్రంటని దిండు దాచిన
డెబొనేర్ బొమ్మల్లో
అడ్డు తెరల నూలుపోగై
శ్వాస తెంపిన దిసమొలలివేనా
అనాటమీ ఇరుకిరుకు గదుల్లో
అనైచ్చికంగా తాకేవన్నీ తమకపు స్పర్శలేనా
ఎప్రాన్ భుజాల్ని తీకే తామర తూడు
విశ్లేషణల వేళ్లకంటే నలుపెరుపు నరం
జలదరింపుల మెడపై ఊపిరి సెగ
శ్వాసల్లేని గుండెకి డిసెక్షన్ కత్తిగాటు
వీపును గుచ్చే ఉలిమొనల వక్షం
మండుతున్న కంటిలో శవ నగ్నత్వం
నిర్లిప్తోద్వేగాలకు స్పృశ్యాస్పశ్యంగా
తెరతీస్తున్న
జ్ఞాత జ్ఞానాల స్పృహలో
........................................ ఇవి ఒట్టి దేహాలేనా
అనైచ్ఛికంగా తాకేవన్నీ
తమకపు స్పర్శలేనా-
రహస్యాల వేళ్లమధ్య
నలిగి జారే ముగ్గురేణువు!
రంగవల్లుల కెంపుబుగ్గకు
పేడముద్దల దిష్టిచుక్క!!
* * *
*మెడికో బావమరిది 'శివ' 'కు అనుభవంలో వాటా పంచుతూ-
Posted by Kathi Mahesh Kumar at 8:36 AM 3 comments
Tuesday, March 1, 2011
Wednesday, February 23, 2011
"ఓయు"ద్యమం
"ఈ పెద్ద ఉద్యమం ముందు మా చదువులు చాలా చిన్నవిగా అనిపిస్తున్నాయి." - ఒక విద్యార్థిని, ఉస్మానియా యూనివర్సిటీ.
కొన్ని ఆశయాల ముందు జీవితాలు చిన్నవి అనిపించని జీవితాలూ జీవితాలేనా !?
ఉద్యోగాలకోసం యువతా! ఉజ్వల భవిష్యత్ నిర్మాణానికి ఉద్యమించడానికి యువతా! ఏది సరైంది?
Posted by Kathi Mahesh Kumar at 10:59 AM 39 comments
Labels: సమాజం
Tuesday, February 22, 2011
యువతజీవిత అనుభవశకలాల సినిమాటిక్ అనుభవం - LBW
కథ: ఈ సినిమాకథలో రెండు కథలున్నాయి. నిజానికి మూడున్నాయి. మూడోకథ గురించి అప్రస్తుతంగానీ, ముందుగా రెండుకథల గురించి చూద్దాం.
కథ1: హైదరాబాద్ లో జై (అభిజిత్) – రిషి (సిద్దు)చిన్ననాటి స్నేహితులు. రిషి అను(నిషాంతి) ని ప్రేమిస్తాడు. పరిస్థితుల ప్రభావంతో జై- అను ప్రేమికులుగా మారతారు.
కథ2: డల్లాస్ లో ఉద్యోగం చేసుకునే రాజేష్ (రోహన్) – రాధిక (చిన్మయి) స్నేహితులు. రాధిక రాజేష్ ని ప్రేమిస్తుంది. రాజేష్ రాధికని ఒక స్నేహితురాలిగా మాత్రమే చూస్తాడు. రాజేష్ స్నేహితుడు వరుణ్(అసిఫ్), రాజేష్ వద్దనుకున్న రాధికలు ప్రేమలో పడతారు.
ఈ రెండు కథలూ ఒక సినిమాలో ఎందుకున్నాయి అనేది సినిమాలో చూడాల్సిందే.
ఇక మూడోకథేమిటా అని ఆలోచిస్తున్నారా…! ఈ రెండుకథల్నీ లంకె కలపడానికి ఒక ఉపకథ ఉందిలెండి. అది నాకైతే అనవసరం అనిపించింది. కానీ బహుశా దర్శకరచయిత తనకు తెలిసిన (మరి)కొంత జ్ఞానాన్ని పంచుకోవడానికి tempt ఆయ్యి, దాన్ని నెరేటివ్ గా ఎంచుకున్నాడేమో . ఎంతైనా మొదటి సినిమాకదా. అది లేకపోయినా సినిమాకొచ్చే నష్టమైతే ఏమీలేదు.
...మిగతా సమీక్ష నవతరంగంలో...
Posted by Kathi Mahesh Kumar at 12:29 AM 2 comments
Labels: సినిమాలు
Friday, February 11, 2011
వినాయక్ సేన్ ను ఉరితియ్యండి
వినాయక్ సేన్ గురించి మరింత సమాచారం కొరకు చూడండి: http://www.binayaksen.net/
Posted by Kathi Mahesh Kumar at 8:33 AM 5 comments
Labels: సమాజం
Friday, January 28, 2011
బ్రాహ్మణుల్ని ఎందుకు ద్వేషించాలి?
చరిత్రను బేరీజు చేసే ధృక్పధంలో బ్రాహ్మణులు చాలా సామాజిక కురీతులకు కారణంగా కనిపిస్తారు కాబట్టి వాటిని విశ్లేషించడం జరుగుతోందేగానీ నిజంగా ద్వేషాన్ని విద్వేషాన్నీ సామాజికంగా ఎవరైనా అమలు జరుపుతున్నారా అనేది అత్యంత సందేహాస్పదం. నిజంగా బ్రాహ్మణుల్ని ద్వేషించడం ఒక పంథా అయ్యుంటే, ఈ పాటికి వాళ్ళమీద ఆప్రకటిత నిషేధమో లేదా వివక్షో అమలై ఉండేది. Did it happen?
Let's just ask few questions...
మైనారిటీ ప్రజలు మెజారిటీన శాసించే ఫ్యూడల్ వ్యవస్థను theorize చేసి మూసను సృష్టించింది ఎవరు?
కుల వ్యవస్థలోని కుళ్ళును శాస్త్రీయం చేసింది ఎవరు?
హిందూమతాన్ని బ్రష్టుపట్టించి మాన్వత్వ వ్యతిరేక స్మృతులను సృష్టించి అమలు చేసింది ఎవరు?
ఇవన్నీ అపోహలైతే కాదుకదా !?
Someone has to answer these questions and some need to ask them !
సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా బ్రాహ్మణకులం ఆధిపత్యం ఏనాడో నశించించింది. కాస్తోకూస్తో సాంస్కృతికి ఆధిపత్యం కొనసాగుతున్నా, "ఇదే సంస్కృతి" అనే ధోరణిని ఛాలెంజ్ చేస్తూ ఎన్నో subaltern cultures వస్తున్నాయి, alternate culture సృష్టిస్తున్నాయి. కాబట్టి ఇక్కడా they have a loosing battle at hand. మరి ఎందుకుండాలి బ్రాహ్మణ వ్యతిరేకత...they have nothing to offer, nothing to challenge at this point in time. అందుకే ఈ అపోహల్ని రాజకీయ కుట్రలో భాగం తప్ప మరొకటి కాదు.
ఇప్పుడున్న ద్వేషం ఇక్కడ బ్రాహ్మణులు అనే కులం మీద కాదు. ఆ కులానికి చెందిని మనుషుల మీద అసలు కాదు. బ్రాహ్మనిజం అనే భావజాలం మీద. అది బ్రాహ్మణకులాన్ని దాటి మొత్తం సమాజాన్ని ఆవరించి చాలా శతాబ్ధాలయ్యింది. ఆ ధోరణి,భావజాలం మీద పోరాటం. భౌతికంగా అగ్ర కులాల మీద పోరాటం. ఇందులో బ్రాహ్మణకులం ఎక్కడ్నించీ వచ్చిందో...దాని మీద విద్వేషం ఎవరికుందో ఒకసారి కళ్ళుతెరిచి చూస్తే తెలుస్తుంది.
Posted by Kathi Mahesh Kumar at 10:02 PM 18 comments
Labels: సమాజం