ప్రస్తుతానికి పరిశ్రమలో పూర్తి స్క్రిప్టు రాసుకునేవాళ్ళు వేళ్ళమీద లెక్కించొచ్చు. ఒకవేళ పూర్తిస్థాయి స్క్రిప్టు మనం రాసుకున్నా, చదివే ఓపిక, తీరిక చాలా మంది నిర్మాతలకు/దర్శకులకూ ఉండదు. చదివినా దాన్ని visualize చేసుకునే తీరులో మనోళ్ళింకా ఆరితేరలేదు. దానికి కారణం ఒక standardized script format మనకు లేకపోవడం. హాలీవుడ్ ఫార్మేట్ ను తెలుగు సినిమా అవసరాలకు అనుగుణంగా పూర్తిస్థాయిలో adopt చేసుకోకపోవడం. కొంతమంది హాలీవుడ్ ఫార్మేట్లో రాస్తున్నా, అది ఇంకా పరిశ్రమకు అలవాటు కాకపోవడం. ఇలా కర్ణుడి చావుకి వందకారణాలున్నాయి చెప్పుకుంటూ పోతే.
పూర్తిస్థాయి స్క్రిప్ట్ మన కోసం రాసుకోవడం వరకూ బాగానే ఉంటాయిగానీ, mainstream industry అవసరం కోసం రాయడానికి కొంత process ఉంటుంది. మొదటగా ఒక సింగిల్/డబల్ పేజ్ “ఐడియా” వినిపించడం. ఇందులో థీం,స్థూల కథ, కథన విధానం/వైవిధ్యం గురించి పరిచయం, ఒకవేళ వీలైతే దాని వ్యాపారాత్మక ప్రాముఖ్యం ఉంటాయి. అది నిర్మాతా/దర్శకుడికి నచ్చితే పరిశ్రమ భాషలో “ట్రీట్మెంట్” రాయమంటారు.హాలీవుడ్ పరిభాషలో చెప్పాలంటే ఇది step-outline అన్నమాట.ఇది 20-40 పేజీలు ఉంటుంది.
ఈ స్టెప్ అవుట్ లైన్లోనే ‘సీన్ ఆర్డర్’మిళితమై ఉంటుంది. ఇది నచ్చితే రచయితకు అడ్వన్స్ ఇచ్చి సినిమా మొత్తం రాయమంటారు. ఒకవేళ నిర్మాత/దర్శకుల ఆస్థాన రచయితలుంటే ఆ ట్రీట్మెంట్ వాళ్ళ చేతుల్లో పెట్టి రాయమంటారు. ప్రస్తుతానికి “స్క్రీన్ ప్లే” తెలుగు పరిశ్రమలో ఏ రచయితా రాయరు. వాళ్ళు రాసేదల్లా కథావిస్తరణ మాత్రమే. అందులో description ఎడమవైపు, కుడివైపున డైలాగులూ రాసి పనికానిచ్చేస్తారు.
ఇంకా ప్రమాదం ఎక్కడొస్తుందంటే ఐడియా ఒకడి దగ్గర తీసుకుని, ట్రీట్మెంట్ ఇంకోడి చేత రాయించి, మళ్ళీ ఆట్రీట్మెంటుని నలుగురికిచ్చి నాలుగు వర్షన్లు రాయమంటారు. ఆ తరువాత వాళ్ళ ఆస్థాన విద్వాంసుల్ని పిలిచి అ నాలు వర్షన్స్ లో వచ్చిన మంచి సీన్లను ఏరి ఒక చోట పోగేసి సినిమాగా రాయమంటారు. మరో ఇద్దరి చేత ఆ అతుకుల బొంతను అల్లించి వాళ్ళకు స్క్రీన్ ప్లే క్రెడిట్ ఇస్తారు. ఇక మాటల రచయితలు ఉండనే ఉన్నారు. వీళ్ళేం రాస్తారో వాళ్ళకే తెలియాలి
ఇలా తెలుగు సినిమాలో “కథ” అనే మాట ఎక్కడా వినపడకుండా సినిమాలు తయారైపోతాయి. అందుకే ఈ బాధంతా. కథ ఉంటే పాత్రలుంటాయి. పాత్రలుంటే వాటికి వ్యక్తిత్వాలుంటాయి, వ్యక్తిత్వాలుంటే వాటికి గమ్యాలుంటాయి, గమ్యాలంటే ఘర్షణ ఉంటుంది. అప్పుడే కథ రక్తి కడుతుంది. ఇవేమీ లేకుండా తెలుగు సినిమా కథ నడిచి పోతొంది. సినిమా నుంచీ సినిమా పుడుతోందేతప్ప కథ నుంచీ సినిమా తయారు కావడం లేదు.
****
7 comments:
అందుకే ఎంతో మంది Ghost writers గానే మిగిలిపోతున్నారు. మా మిత్రులు బమ్మిడి జగదీశ్వరరావు, రౌతు బంగారునాయుడు ఇలా చాన్నాళ్ళుగా అక్కడ ప్రయత్నాలతోనే జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. మొన్నటి వేదం అనుష్క పాత్ర నేచర్, థీం అంతా బంగారునాయుడుదే. కానీ సినిమా అంతగా క్లిక్ కాకపోవడంతో మరికొద్దిరోజులు వేచి వుండాలంటున్నాడు.
hi mahesh! i am srinivas from hyderabad. your openion on tollywood is right.
సినిమాకి కథే ముఖ్యం కాదని మీకు తెలీదా మహేష్ గారూ?
Just kidding - couldn't resist it :)
@కొత్తపాళీ: :)
Ee roje Andhra bhoomi lo mana telugu cinemalela untayo oka article vachindi... Dhairyamga nenu copy kottanu ani cheppe directorlu, producerlu.. eppudu baagu padathamo?
Hi,
Visit my blog gsystime.blogspot.com
Please read two topics in english
1 second everything knows (Jan-10)
2 How starts nature in universe (Feb 10)
Plz reply to me by comment.
Thanks,
Nagaraju
బాగుంది...మహేష్ గారు
@కొత్తపాళి మీరు సె(రై)టైరా?
Post a Comment