ఈ మధ్య బ్లాగుల్లో జరుగుతున్న చర్చల్లో 'కుహానా లౌకికవాదం' (pseudo-secularism) అనేపదం మాటిమాటికీ వినిపిస్తోంది. ఇంకో అభియోగమేమిటయ్యా అంటే, మైనారిటీలను బుజ్జగించే నెపంతో ప్రభుత్వాలు (ముఖ్యంగా కాంగ్రెస్ నేతృత్వ ప్రభుత్వాలు) ముస్లింలకు "పెద్దపీట" వేస్తున్నారు అని. వీటిల్లో నిజానిజాలెంత? అపోహలెన్ని? అనేవి కొంచెం ఆలోచించవలసిన విషయాలే.
హిందువులను ప్రశ్నిస్తేనో లేక ముస్లింలను,క్రైస్తవులనూ సమర్థిస్తేనో చాలా తేలిగ్గా వేసెయ్యదగిన 'బ్రాండ్' సూడో సెక్యులరిస్ట్. ఎవరైనా కాంగ్రెస్ పార్టీభావజాలానికి దగ్గరగా, అది మానవతాదృష్టితో చర్చించినా అర్జంటుగా విధించెయ్యదగిన మూస 'కుహానా..లౌకికవాది'. నేను ఈ బ్రాండింగుకు గురయిన ప్రతిసారీ కన్వీనియంటుగా, "ఇవి హిందూ అతివాద ధోరణులులే!" అనుకోవచ్చు. లేకపోతే రాజకీయపార్టీల ప్రకారంగా వాళ్ళనీ ఒక మూసలోకట్టి, "అబ్బా! వీళ్ళు బీ.జె.పీ, ఆరెస్సెస్స్ వాళ్ళలాగున్నారే" అనుకుంటే సరిపోతుంది. కానీ ఈ బ్రాండుకీ ఆబ్రాండుకీ అపోహ, prejudice తప్ప మరేకారణం కనిపించక, కొంత తర్కాన్ని వెతుక్కుంటూ నిజాల్ని తెలుసుకోవడానికి బయల్దేరాను.
భారతదేశం ఒక లౌకికరాజ్యంగా మనలేకపోవడానికిగల చాలా కారణాలలో ముఖ్యమైనది రాజకీయాన్నీ,మతాన్నీ విడిగా చూడలేకపోవడం. భారతీయ జీవితాలలో మతం ఎంతబలంగా పెనవేసుకుపోయిందంటే, దాన్ని ఒకపక్కనపెట్టి మరో ముఖ్యమైన జీవనాంశమైన రాజకీయన్ని 'తొడుక్కోవాలంటే' అసాధ్యమనిపించేలా మమేకమైపోయింది. ఇదే తీరు మన భారతీయ professionals లో కూడా చూడచ్చు. వ్యక్తిగతజీవితాన్నీ, ప్రొఫెషనల్ జీవితాన్నీ compartmentalize చెయ్యడం మన భారతీయులకి అంత సులువుగా రాదనుకుంటాను.కానీ, ఒక సైద్దాంతిక భావజాలానికి దేశం కట్టుబడినతరువాత ప్రజలూ,ప్రభుత్వాలూ దాన్ని పాటించడం చాలా అవసరం అన్నది కాదనలేని సత్యం. అయితే, ఆ సిద్దాంతమే "హుష్ కాకి" అయిపోతే?
రాజ్యాంగం రాసినప్పుడు సెక్యులర్ అన్నపదం లేకున్నా, 1976 లో ఈ పదాన్ని చేర్చేముందు జరిగిన చర్చల్లో 'Equal distance from every religion' అని నిర్ణయించుకోవడం జరిగింది. అప్పటినుండీ ఇప్పటివరకూ మారిన పరిస్థితులకు అనుగుణంగా 'Equal respect for every religion' అనుకునే వరకూ వచ్చాం. మొదటి సిద్ధాంతంలోని మూలబిందువు మతాన్ని రాజకీయానికి దూరంగా ఉంచడం. రెండో దాంట్లో, అన్నిమతాల్నీ సమానంగా చూడటం అనే నెపంతో మతానికి ఒక రాజకీయ అంగీకారం కల్పించడం. మొదటిది Utopian అనిపిస్తే, రెండోది "తప్పదుకదా!" అనిపించేలా ఉంటుంది. ఈ వైరుధ్యమైన అంగీకారాల నడుమ అటు హిందూపక్షాన వాదించినా, ఇటు ఇతరమతాల తరఫున వకాల్తాపుచ్చుకున్నా రెండూ "కుహానాలే". అంటే ‘మీది తెనాలే..మాది తెనాలే’ పాటవరసలో "నువ్వు కుహానా..నేను కుహానా" అని పాడుకోవాలన్నమాట.
మరి అసలు సెక్యులరిజం ఎక్కడపోయింది? కొంత హాస్యంగా చెప్పాలంటే, మనదేశ రాజకీయపరిణామాల నేపధ్యంలో నిజమైన సెక్యులరిజాన్ని రాజ్యంగంనుంచీ కాకెత్తుకెళ్ళిపోయిందన్నమాట..హు
కొంచెం వేదాంత ధోరణిలో చెప్పాలంటే, "సెక్యులరిజమే ఒక మిధ్య..మరి దానికో 'సూడో' జోడిస్తేమాత్రం పోయేదేముంది? అదీ మిధ్యను మించిన మాయేకదా!" ఈ మాయలో ఉన్నవారిలో నేనూ ఒకడ్ని...నేను సూడో సెక్యులరిస్టునే!
ఇక రెండో విషయానికొస్తే, ముస్లింలకు ‘పెద్దపీట’ వెయ్యటం. నావరకైతే, ముస్లింలకు ఇంతకాలం దక్కింది రాజకీయ lip service తప్ప, నిజమైన పీఠాలూ, privilege ఎన్నటికీ కాదు. సచ్చర్ కమిటీ రిపోర్టువరకూ ఎందుకు, చుట్టుపక్కల నివసిస్తున్న ముస్లింలను చూస్తేవారి సామాజిక,ఆర్థిక స్థితి సగటు హిందువుకన్నా తక్కువని ఇట్టే చెప్పెయ్యొచ్చు. అదివాళ్ళ మతంవల్లవచ్చిందో, మూర్ఖత్వంవల్ల వచ్చిందో అనేది అవసరమే అయినా, as a welfare state భారతదేశానికి వీరిని పట్టించుకోవలసిన అవసరంకూడా ఎంతైనా ఉంది. వృద్ధాప్యపు పెంషన్లు, రిజర్వేషన్లూ, గ్రామీణ ఉపాధిపధకం లాగానే ఏదో ఒక సంక్షేమపధకం వీళ్ళకీ అవసరమేకదా! "వద్దు, మతపరమైన రాయితీలు రాజ్యాంగవిరుద్ధం" అని అలాగే వదిలేద్దామంటే, అదెంతవరకూ సమంజసం అన్నది ఆలోచించాల్సిన విషయం.
ఈ "పెద్దపీట" ధోరణిని లేవనెత్తే వారందరూ ఉదహరించేది హజ్ యాత్రలకోసం ముస్లింలకు ఇచ్చేరాయితీలు, మదరసాలకు ప్రభుత్వాలు అందించే నిధులువంటి రాజకీయ తంతునిచూసి. దాన్నే ముస్లింలకు పెద్దపీటగా ఇప్పుకున్నా, నిజంగా హిందూ మతానికి మన దేశం ఎమీచెయ్యటం లేదా అనికూడా ప్రశ్నించుకోవాలి. ఈ ప్రశ్న మనలో చాలామంది వేసుకోము, వేసుకోవాలనే ఆలోచనకూడా రాదుకూడా.
ఒక ఉదాహరణ చూద్దాం. అలహాబాద్ కుంభమేళాలో (2001) దాదాపు 1500 హెక్టార్ల విస్తర్ణంలో హిందువుల కోసం జరిగిన ఏర్పాట్ల వివరాలు చూడండి.12,000 నీటికొళాయిలు, 50.4 మిలియన్ లీటర్ల నీళ్ళు, 450 కిలోమీటర్ల పొడవునా విద్యుత్ లైన్లు, 15,000 వీధిదీపాలు, 70,000 లెట్రిన్లు, 7100 మంది స్వీపర్లు, 11 పోస్టాఫీసులు, 3000 టెంపరరీ ఫోనుకనెక్షన్లు, 4000 బస్సులు,ఐదు రైళ్ళు, పర్యవేక్షణకై 80 మంది అధికారులు , పోలీసులూ (11,000), ఆర్మీ, ఇతర ఫోర్సెస్ (40 కంపెనీలు) ఎన్నోఎన్నెన్నో. వీటన్నిటికీ లెక్కలుకట్టి చూసుకుందామా!
మధ్యప్రదేశ్ అజ్జయిని లో జరిగిన (2004) అర్థకుంభమేళాకు అయిన ఖర్చు 100 కోట్లపైమాటే. అప్పటి ముఖ్యమంత్రి ఉమాభారతి స్వహస్తాలతో ఈ ఖర్చు జరిగింది. ఇలా ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్,ఆంధ్రప్రదేశ్,హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్,తమిళనాడు ప్రభుత్వాలు హిందూ యాత్రికులకు కల్పించే వసతులూ, రాయితీలూ కలుపుకుంటే హజ్ యాత్రలకు పెట్టే ఖర్చులో ఎంతశాతం ఉంటుందో? ఈ ఖర్చులో మిగతా మతాలకీ వాటా ఉందనుకుంటాను, సిక్కులు పాకిస్తాన్ లో ఉన్న ఒక గురుద్వారాకు వెళ్ళటానికి ప్రభుత్వసహాయం చేసినట్లుగా నాకు గుర్తు. అంటే, మతానికి దూరంపాటించాల్సిన మన సెక్యులర్ ప్రభుత్వాలు దర్జాగా మతం కోసం ప్రభుత్వ ఖజానా నుంచీ డబ్బులు ఖర్చుపెడుతున్నాయన్నమాట.
ప్రభుత్వ సబ్సిడీతో(పూర్తి వ్యయం కాదు) ముస్లిం యాత్రికులు హజ్ కు వెళితే, మన హిందువులు కేదార్ నాధ్, అమరనాధ్ యాత్ర, కుంభమేళా, కైలాసయాత్ర, బ్రహ్మోత్సవాలూ,తెప్పోత్సవాలూ, వగైరావగైరాలతోపాటూ, ప్రభుత్వాధీనంలో ఉన్న కొన్ని లక్షల ఆలయాలకూ,పూజారులకూ, ఇతరత్రా వాటికి అయ్యే ఖజానా ఖర్చు ఉండదంటారా? బహుశా వీటిని, ఏర్పాట్లకి అయ్యే ఖర్చుగానో, సెక్యూరిటీ ఖర్చులుగానో చూపిస్తుండొచ్చు. కానీ, మన దేశం హిందూ మతంకోసమే కొన్ని బిలియన్లు ఖర్చుపెట్టిన విషయాలు మాత్రం నిజం.
కాబట్టి, ‘హిందువులకి ఖర్చుపెట్టకుండా, కేవలం ముస్లింలకి దోచిపెడుతున్నారనేది’ భావజాలప్రేరిత అపోహగా కనబడుతుందేతప్ప, నిజాలుగా మాత్రం కనబడటం లేదు.
Saturday, October 11, 2008
నేను కుహానా లౌకికవాదిని (pseudo-secularist) !
*****
Subscribe to:
Post Comments (Atom)
27 comments:
mahesh, please just remeber one thing. no church, mosque or any realegious instittution is not allowed government to have control over its property. they are all governed by their own set of rules. where as more than half the property of hindu temples control is forcibly over taken by govt in the name of secularism. for example recently a forcible attemptby ap state govt to take over chilkur.when any body has taken others property for maintenance it should definitely take care of property holders well fare. And just compare the amount percentages govt spending wrto percentage of relegion population.
మహేష్ గారూ,
కుంభ మేళా కి, మిగతా వాటికి, అయిన, అవుతూన్న ఖర్చు ఖజానా నించే వచ్చిందని మీరు అనుకుంటున్నారు. దేవాలయాల్లో, హుండీ ల ద్వారాను, ఇతర ఆర్జిత సేవల ద్వారాను భక్తులు ఇచ్చే నగదు / కానుకలు ప్రభుత్వ ఖజానాకి దేవాదాయ శాఖ సమర్పిస్తోంది.. మరి క్రైస్తవ మిషనరీల ఆదాయాన్నీ, వక్ఫ్ ఆదాయాన్నీ అలాగే ప్రభుత్వానికి అప్పగిస్తున్నారా? ఎవరి మతం, ఎవరి అభిమతం వారిది. వారి వారి మతాచారాలని ఆచరించుకునే హక్కు ప్రతి పౌరుడికీ ఉంది. కానీ హిందూ మతం మాత్రం మతమౌఢ్యానికి ప్రతీక అయినట్లు, మిగతా మతాలన్నీ చాలా గొప్పవి అయినట్లు, వారికి ప్రత్యేక రాయితీలు ఇవ్వడం చూస్తూ ఉంటే, ఏ సగటు హిందువుకైనా బాధ కలుగుతుంది. ఈ దేశం లో హిందువుల పండగలకి ఎంత ప్రాముఖ్యత ఉందో, మిగతా మతాల వారికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. కుంభ మేళా లకి ఏర్పాట్లు జరిగినట్లే, రంజాన్ ప్రార్ధనలకి, మేరీ మాత ఫీస్ట్ కి జరిగే ఏర్పాట్లకి కూడా ప్రభుత్వ ఖజానా నించే ధన వ్యయం జరుగుతోంది. అన్ని మతాలలోనూ మనకు స్నేహితులు లేరా? కార్తీక పౌర్ణమి రోజు గురునానక్ ఊరేగింపు ఎంత పెద్దగా జరుగుతుందో హైదరాబాదు లో మీరు చూడలేదేమో... అలాటి వాటికీ భారీ బందోబస్తు ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందండీ.... వేరే మతం వాళ్ళ విషయం దగ్గర మౌనంగా ఉండి, కేవలం హిందువులకే అన్ని సౌకర్యాలు ఉంటున్నాయని అనుకోవడం సరైనది కాదేమో అలోచించండి.. !!
@విరజాజి: "కేవలం హిందువులకే అన్ని సౌకర్యాలు ఉంటున్నాయి" అని నేను అనుకోవడం లేదు. నేను చెప్పబూనింది"ఇతర మైనారిటీ మతాలతోపాటూ హిందూమతానికి కూడా అన్ని సౌకర్యాలూ ఉంటున్నాయి" అని మాత్రమే.ఈమధ్యకాలంలో ప్రభుత్వాలు హిందువుల్ని దోచిమరీ ముస్లింలకు పెద్దపీట వేసేస్తున్నారు అన్న అపోహకు సమాధానం వెతికాను అంతే!
@వీర: మీ వాదన చాలా అంగీకారాత్మకం.దేవాదాయ ధర్మాదాయ చట్టాన్ని మార్చాల్సిందిగా ఉద్యమం లేవదీస్తే నేనూ మీతోనే ఉంటాను. నావరకూ State has no business with religion.
ఇక మతాలవారీగా ఖర్చుల పర్సెంటేజ్ తేల్చిచెప్పగలిగే అంకెలు నాదగ్గర లేవుగానీ,హిందువులభాగం హిందువులకు దక్కుతోందని మాత్రం నేను నమ్ముతాను.
ఒక న్యాయమైన, తార్కికమైన వాదనను "ఇక మతాలవారీగా ఖర్చుల పర్సెంటేజ్ తేల్చిచెప్పగలిగే అంకెలు నాదగ్గర లేవుగానీ,హిందువులభాగం హిందువులకు దక్కుతోందని మాత్రం నేను నమ్ముతాను." అంటూ తేల్చి పారేసారు. మీకు ఇతర మతాల లెక్కలు తెలీవుగానీ, హిందూమతపు లెక్కలు మాత్రం, కుంభమేళాకు ఎన్ని మరుగుదొడ్లు కట్టించారన్న లక్కతో సహా, అన్ని వివరాలూ బాగా ఉంటాయి. మీరు చెప్పుకున్నది నిజమే సుమండీ!
ఇక్కడ చాలా చారిత్రిక మైన విషయాలు ఉన్నాయి. మిగతా దేశాలతో పోలిస్తే మైనారిటీలకి మన దేశంలోనే స్వేచ్ఛ ఎక్కువ ఉంది. అలాగే సౌకర్యాలూ ఎక్కువే. మరీ మైనారిటీ బుజ్జగింపు చర్యల లాగానే చేస్తున్నారు మన ప్రభుత్వపు వాళ్లు.
ఇక వెనుక బాటు తనానికి వస్తే కేవలం ముస్లిమ్స్ కాదు. హిందువులలో కూడా వెనుక బడిన వారున్నారు. అలాగే ఇతర మతాలలో కూడా. నేను పరమ ఛాందస హిందువునే అయినా ఒక ముస్లిం ఆకలితో నా దగ్గరకు వస్తే అన్నం పెట్టి పంపుతాను. అంత మాత్రాన నేను సూడో సెక్యులరిస్ట్ ను అవుతానా? కష్టాలనేవి ఎ మతం వారికైనా వస్తాయి. అలాంటి వారిని ఆదుకోటం ఏ మతస్తుడైనా చేయ వచ్చు. విరజాజి గారి వ్యాఖ్యతో నేను ఏకీభవిస్తాను. ఏ పని చేసేముందై నా ఒక రేషనల్ వ్యూ లో ఆలోచిస్తే ఈ సమస్యలు ఉండవు.
మన అవసరాలకి ఎవరి నైనా అడుక్కుంటాం. కడుపు నిండిన తర్వాత ఈ మతం ఆ మతం అంటాం.
"రాజ్యాంగం రాసినప్పుడు సెక్యులర్ అన్నపదం లేకున్నా, 1976 లో ఈ పదాన్ని చేర్చేముందు జరిగిన చర్చల్లో 'Equal distance from every religion' అని నిర్ణయించుకోవడం జరిగింది. అప్పటినుండీ ఇప్పటివరకూ మారిన పరిస్థితులకు అనుగుణంగా 'Equal respect for every religion' అనుకునే వరకూ వచ్చాం. మొదటి సిద్ధాంతంలోని మూలబిందువు మతాన్ని రాజకీయానికి దూరంగా ఉంచడం. రెండో దాంట్లో, అన్నిమతాల్నీ సమానంగా చూడటం అనే నెపంతో మతానికి ఒక రాజకీయ అంగీకారం కల్పించడం. మొదటిది Utopian అనిపిస్తే, రెండోది "తప్పదుకదా!" అనిపించేలా ఉంటుంది. ఈ వైరుధ్యమైన అంగీకారాల నడుమ అటు హిందూపక్షాన వాదించినా, ఇటు ఇతరమతాల తరఫున వకాల్తాపుచ్చుకున్నా రెండూ "కుహానాలే". అంటే ‘మీది తెనాలే..మాది తెనాలే’ పాటవరసలో "నువ్వు కుహానా..నేను కుహానా" అని పాడుకోవాలన్నమాట."
ఇది మాత్రం అభినందనీయం గా ఉంది.
అన్నట్టు నేను చాన్దసుడిని కాదండోయ్. అది నా ప్రశ్న మాత్రమె. :-)
http://thinkquisistor.blogspot.com/2008/10/blog-post.html
Mahesh,
Spending money on Hindu festivals like kumbah mela creates lot of business opporunities people who are working in unorganized sector. This money is not going outside of the country.
@చదురవి: మీరు మరీనండీ!మతాలవారీగా state expenditure ఎక్కడా లభ్యంకాదని తెలిసీఇలా మాట్లాడటం మీకు భావ్యం కాదు.
మీరు మంచి విషయంతో లాజికల్ గా మొదలెట్టారు. కానీ సూడోసెక్యులర్ నని నిరూపించుకోవడానికి చాలా కష్టపడ్డారు. విజయం సాధించారు. ఆమధ్య షిర్డీ బాబా దేవాలయాలని కూడా తీసుకోవాలని ప్రభుత్వప్రయత్నం మీకు తెలియనిది కాదు. ఎందుకో? కుంభమేళాకి ఖర్చు పెడితే ఎకానమీ ఎంత లాభపడుతుందో మీ ఊహకందక పోతే తాడేపల్లి వారి బ్లాగులో చదవండి. గోదావరి పుష్కరాలకి ప్రభుత్వం, రవాణా, హోటల్, స్వయం సేవక బృందాలు, ఇతర వ్యాపారులు లాభపడ్డారో మీకు తెలియనిదా మహేషా. హజ్ యాత్రకి డబ్బులిస్తే ఏదేశ ఎకానమీకి లాభమో సూక్ష్మం గ్రహించండి.
Hindu devaadaayanni dobbitintunnappudu aa matram karchu pettochu tappem leadu.
వంద గజాల వేరే మతం వాళ్ళ భూమి భూమి కబ్జా అయితే అంతెత్తున లేచే లౌకిక వాదులు , అన్యాక్రాంతమైన లక్షల ఎకరాల దేవాలయ మాన్యాల గురించి మాట్లాడారు . మీ ద్రుష్టి లో వీరు ఎ వాదులు . ఒకటి గమనించాలి, హిందూ దేవాలయాలు ఏనాడో స్వయం సమృద్ధి ని సాధించాయి, ఈ నిధులపై కన్నేసిన ప్రభుత్వాలు దేవాలయాలను తమ నియంత్రణ లోకి తెచుకున్నాయన్నది పచ్చి నిజం . వాటిని శిధిలావస్థ కు తెచ్చింది అన్నది నిజం . ప్రత్యక్ష వుదాహరణ ఈ ప్రభుత్వం తన ఇష్టానికి వచినట్టు ఖర్చు పెడుతున్న తిరుమల నిధులు . హిందూ దేవాలయాల ఏర్పాట్ల కోసం ప్రభుత్వాలు మీరు చెప్పినట్టు బిలియన్లు ఖర్చు పెట్టి వుంటే, ప్రభుత్వ ఖజానకి దేవాలయాలు ట్రిలియన్లు పోగేసాయని గమనించాలి. హిందూ మతం గురించి హిందూ మాట్లాడితే మతతత్వ వాది . వేరే మతాన్ని హిందూ పొగిడితే వాడు లౌకిక వాది. వేరే మతం వ్యక్తి తన మతం గురించి మాట్లాడితే సంప్రదాయ వాది . ఇది ప్రస్తుతం మన దేశం లో వున్న వాదం. అయినా ఎందుకు వోదిలేయండి సార్ ఎప్పుడో ఆశలు వదులుకున్నాము. మీరు చెప్పినట్టు మాట్లాడితేనే నాయకులు పాలకులు.
@ మహేష్ గారు,
నిన్న జరిగిన భైంసా ఘటనపై మీ అభిప్రాయాలు, ఆలోచనలు వినగోరుటున్నాను...
"హిందువులను ప్రశ్నిస్తేనో లేక ముస్లింలను,క్రైస్తవులనూ సమర్థిస్తేనో చాలా తేలిగ్గా వేసెయ్యదగిన 'బ్రాండ్' సూడో సెక్యులరిస్ట్" - ప్రతిదానికీ ’హిందువులను మాత్రమే’ ప్రశ్నించేవారికి వేయదగిన బ్రాండ్ ఇది.
"సెక్యులరిజమే ఒక మిధ్య..మరి దానికో 'సూడో' జోడిస్తే మాత్రం పోయేదేముంది?" - రెండూ మిధ్యే అయితే ఒకరకం కానీ, సెక్యులరిజం మిధ్యగా మిగిలి, సూడో సెక్యులరిజం మాత్రం వాస్తవం అయిపోతేనే ప్రమాదకరం.
కుంభమేళాకి ప్రభుత్వం పెట్టిన ఖర్చు గురించి మాట్లాడుతున్నారు కానీ, హిందూ పుణ్యక్షేత్రాల నుంచి, యాత్రల నుంచి ప్రభుత్వానికి, ఇతర ప్రైవేటు సంస్థలకు వస్తున్న ఆదాయం గురించి మాట్లాడరే. అలహాబాద్ కుంభమేళాకి రైల్వేశాఖ ప్రత్యేక రైళ్ళు నడుపుకుంది. ఈ యాత్రకి ప్రభుత్వ టూరిజంతో పాటూ, Thomas cook, Cox & Kings లాంటి ప్రైవేట్ దిగ్గజాలు రంగంలోకి దిగాయి. నిజంగా లాభసాటి కాకపోతే ప్రైవేట్ సంస్థలు రంగంలోకి దిగుతాయా. నేరుగా ప్రభుత్వానికి ఆదాయం లేకపోయిన విషయంలో కూడా, స్థానిక ప్రజలకు, వ్యాపారులకు లాభం వస్తోంది కాబట్టే ప్రభుత్వాలు వీటి పట్ల శ్రద్ద చూపిస్తున్నాయి కానీ, హిందూమతం మీద అభిమానం పొంగిపోయి కాదు.
Mr. Mahesh you deservered your post title, it is 100% correct.
మహేష్ గారు,
పెద్దపీట గురించి మాట్లాడినప్పుడు, మైనారిటీ రిజర్వేషన్ల గురించీ, ప్రభుత్వ నిధితో మైనారిటీ విద్యాలయాలూ, మైనరిటీ సంక్షేమ నిధులూ మొదలైనవాటి గురించి మాట్లాడకపోవడం ఆశ్చర్యంగా ఉంది!
ఇవన్నీ ఉన్నా మీరన్నట్టు మైనారిటీల పరిస్థితుల్లో మార్పు రావడం లేదంటే దానికి కారణం ఏవిటో మీరు ఆలోచించే ప్రయత్నం చేస్తే బావుంటుంది. ఇది కేవలం రాజకీయ నాయకుల స్వార్థమూ, చిత్తశుద్ధి రాహిత్యమూ అయినట్టైతే అది కేవలం మైనారిటీలకే వర్తిస్తుందా? వర్తించనప్పుడు దీనికి మతం రంగు పులమడం ఎందుకు?
మైనారిటీలకి సంక్షేమ పథకాలు తక్కువై వాళ్ళ అభివృద్ధి జరగటం లేదని మీ అభిప్రాయమా?
వీటన్నిటి గురించీ స్పష్టమైన ఆలోచన మీకు లేకుండా మైనారిటీల దుస్థితి గురించి మీరు ప్రత్యేకంగా తాపత్రయ పడుతూంటే, మీరు సూడో లౌకికవాది అనే ముద్రనుండి తప్పించుకోవడం కష్టమే!
I wont speak most barbarous
హిందు మతంలో వుండి ఇలా వాగుతున్నా సరిపోయింది. మరో మతంలో వుండి వుంటే ఫత్వానో శిలువో వేసేవారు. ఇలాంటి కుహనాలౌకికవాదులెందరినో తనలో ఇమిడ్చుకొని సాగిపోతున్న గొప్ప జీవన విధానమిది. కన్నతల్లి రొమ్ములు గుద్దే నీలాంటి వారిని కూడా ఈ మతం ఆదరిస్తుంది.
మహేష్ గారూ,
మీరు టపాలో "ముస్లిములకు రిజర్వేషన్" తప్పేంకాదు అన్నట్లుగా ఉంది. దానికి మీరు చెప్పే కారణం, వెనుకబడ్డారు, అదీను ముఖ్యంగా ఆదాయంలో. మరి అటువంటప్పుడు మతపరంగా ఇచ్చేకంటే ఆదాయపరంగా ఇవ్వచ్చుకదండీ రిజర్వేషన్‌లు.
@ఆఖరి అనామకుడు: కులపరమైన రిజర్వేషన్లలోకూడా ఆదాయపరమైన కోతలున్నాయి. కాబట్టి, ఆదాయపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగానికి విరుద్ధంకావని నా అభిప్రాయం. ఆదాయపరంగా అగ్రకులాలు/ఇతర మతాలు వెనకబడుంటే, వారికీ ఏదో ఒక పథకం (అది రిజర్వేషన్ కూడా కావచ్చు) ద్వారా వెసులుబాటు కల్పించడం సంక్షేమ రాజ్యంగా మన దేశ కనీస బాధ్యత.ఇందులో నాకు సైద్దాంతికపరమైన వ్యతిరేకతా లేదు, వ్యక్తిగతంగా ఎటువంటి సమస్యాలేదు.
@మరో అనామకుడు: క్రైస్తవమతానికి వ్యతిరేకంగా కొన్నివేల సంవత్సరాలుగా ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. చరిత్ర చదువు, లేకుంటే కనీసం తెలుసుకోవడానికి ప్రయత్నించు.
ఇక ఇస్లాం అన్నిటికన్నా యువమతం (వయసులో చాలా చిన్నది) అందుకే కొంత అర్థంలేని ఆవేశం వారిలో ఉంటుంది. అయినా, ఫత్వాలు అంతత్వరగా ఈ మతంలోకూడా నీలాంటి మూర్ఖులే జారీ చేస్తారుతప్ప ఖురాన్ లేక షరియాను సమూలంగా ఎరిగినవారుకాదు.
' ఫత్వాలు జారీ చెసేది మూర్ఖులే ' అంటే ' ఇస్లాం మత పెద్దలు మూర్ఖులు ' అంటున్నారా? లేదు అలా కాదు అంటే ఓసారి మీరు ఇస్లాం ని గాని, మహమ్మద్ ని గాని, ఖురాన్ ని గాని విమర్శించి చూడండి. ఒకవేళ విమర్శించడానికి నాకు ఇస్లాం గురించి అంతగా తెలియదు అంటే, ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం కనుక్కోవడానికి నిజాయితీగా ప్రయత్నించండి.
మహమ్మద్ షుమారుగా ఎంతమందిని స్వహస్తాలతో చంపి వుంటాడు? ISLAM ని అది మతం కాదు ఓ DANGEROUS CULT అని ఎందుకంటారు? ముస్లింస్ ని PEDOPHILE WORSHIPPERS అని ఎందుకంటారు?
-సూర్య
@సూర్య. Islam for sure is a most misinterpreted religion till date. బహుశా అది పుట్టిన బౌగోళిక,చారిత్రక నేపధ్యం అలాంటిది. బౌద్దం,జైనం reformist, nonviolent మతాలుగా ఉధ్బవిస్తే, ఇస్లాం హింసాత్మక యుద్ద నేపధ్యంలో survival కోసం స్థాపించబడింది.అందుకే ఆ లక్షణాలు ఇప్పటికీ ఈ మతంలో ఉన్నాయి.
అయినదానికీ కానిదానికీ షరియాను misinterpret చేసి, ఫత్వాజారీచేసే ముస్లిం మతపెద్దలు ఖచ్చితంగా మూర్ఖులే. అందులో ఏమాత్రం అనుమానం లేదు. షారుఖ్ ఖాన్ సిగరెట్టు తాగితే,సానియా మిర్జా టెన్నిస్ ఆడటానికి మినీస్కర్ట్ వేసుకుంటే ఫత్వా జారీ చేసేవాళ్ళు perverts కాక మరేమీ కారు. వాళ్ళూ మన ప్రవీణ్ తోగాడియా అన్నలో తమ్ముళ్ళో అవుతారు అంతే!
people like you doesn't believe the truth.
Islam is not a peaceful religion. It is a hateful religion.
They are not misinterpreting sharia, they are just following sharia.
If you don't believe me, just read this website. You may feel there are many sites against every religion. But i hope none can show as many proofs as this site.
faithfreedom.org
@శామ్: మీరు చూపించిన సైటుకూడా ఇస్లాం యొక్క interpretation ని మాత్రమే చూపిస్తోంది. ఇస్లాం most misinterpreted మతమని నేను ఎప్పుడో ఒప్పుకున్నాను.కాకపోతే అందరు ముస్లింలూ ఈ అపోహలకు బలయ్యారనే నమ్మకాన్ని వీడి, కొంత విశాలధృక్పధంతో చూద్దామనిమాత్రమే చెబుతున్నాను.
I don't have problem accepting Truth (with 'T' capital). But, I always believe there are alternate realities available that make my world view, and Truth is hardly known. అలాంటప్పుడు, మీరు చెప్పిందే సత్యమో లేక ఈ వెబ్సైట్ లో ఇచ్చినవే నిజమని నమ్మలేను.
నేను చెప్పిందే సత్యం అనికూడా నేను profess చెయ్యటం లేదు. ఇది నాకు అర్థమైన నిజం అంతే!
మీ సమాధానం ' ఇస్లాం ' గురించి మీ అవగాహనా రాహిత్యాన్ని తెలుపుతోంది. దయచేసి నేను పైన అడిగిన ప్రశ్నలకు సమాధానం కొరకు నిజాయితీగా ప్రయత్నించి చూడండి. నిజం నిప్పులాంటిది ఎప్పటికైనా తప్పకుండా బయట పడుతుంది.
- సూర్య
@సూర్య: మీరు చెప్పిన "నిజాలకు" చారిత్రకంగా అంగీకారంకాని అనుకోలులు(assumptions) ఆధారం. అలాంటిది, మీరు నా అవగాహనారాహిత్యంపైన విసిరిన సవాలును ఎలా స్వీకరిస్తాను?
ఇస్లాం స్థాపించబడిన తరువాత మదీనాలో ఉన్న 700-900 మంది జ్యూస్ చంపబడ్డారు అనేది చరిత్రలో లిఖించబడిన నిజమైతే, అందులో ఎంతమందిని మహ్మదుప్రవక్త స్వహస్తాలతో చంపాడు అనేది బహుశా మీరు చూసిన నిజమయ్యుంటుంది.అయినా,యుద్దంలో కొన్ని వేలమందిని చంపిన తరువాతగానీ బుద్ధిజం గుర్తుకురాని అశోకుడిని Ashoka the great అనే మనకి, ఇక్కడికొచ్చేసరికీ అభ్యంతరం వచ్చేస్తుందా. వైష్ణవుల్ని శైవులు చంపలేదా? అఘోరాలని,నాగాలను ఉత్తరభారతదేశంలో కొరత వేయించలేదా?క్రైస్తవులు నైట్స్ గా అవతారమెత్తి యేసు ప్రభువు పేరుతో దండయాత్రలు చెయ్యలేదా? అన్నిమతాలూ ఇలా చేసినవే. మరి ఇస్లాం కొచ్చేసరికీ అర్థనిజం పూర్ణసత్యం అయిపోతుందా? అది మీ prejudice కాకమరేమిటి?
ఇక Cult అంటే సాధారణంగా సమాజంలో ఉండేనమ్మకాలకన్నా వేరుగా ఉండే ఆచారాల్నిపాటించే సమూహమని అర్థం.అంటే కొత్తమతాలన్నీ ఒకప్పుడు Cult గా పిలువబడ్డవే. ఈ విధంగా చూస్తే ప్రతి మెజారిటీ మతానికీ మైనారిటీ మతాలు కల్టులే! ఇక డేంజరస్ అనే పదం బుద్ధిజానికీ,హిందూమతానికీ కూడా వాడిన సందర్భాలు చరిత్రలో కోకొల్లలు.అంతమాత్రానా మీ అపోహల్ని జ్ఞానం నా ఆలోచనల్ని అవగాహనా రాహిత్యం అనేటట్లయితే..మీ తాహతు ఇక్కడే తెలుస్తోంది.
ఇక PEDOPHILE గురించి మాట్లాడుకుందాం.ఈ విషయంలోకూడా చారిత్రకారుల్లో ఏకాభిప్రాయం లేదు. కొందరు 6సంవత్సరాలమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడంటే మరికొందరు వయసొచ్చేవరకూ(9ఏళ్ళవరకూ) తనకు దూరంగానే ఉన్నాడంటారు. మనలో బాల్యవివాహాలు 11-12 ఏళ్ళకంటే చిన్నపిల్లల మధ్య జరిగేవికాదంటారా? అయినా, మీరు చెప్పేది ఎలా ఉందంటే,రామకృష్ణపరమహంసని హోమో సెక్సువల్, గాంధీని సెక్సువల్ పర్వర్ట్ అన్నట్లుంది. ఈ మీ జ్ఞానానంకంటే నా అవగాహనా రాహిత్యం ఇక్కడ మేలేనేమో!
' చారిత్రకంగా అంగీకారం కాని ' అనడం ద్వారా మీరు ' హడిత్ ' లో వ్రాసిన మహమ్మద్ చరిత్రను, అతడి ఉనికినే ప్రశ్నిస్తున్నారు. మిగతా విషయాలు తరువాత, ముందు ఈ ఒక్కటి చాలు మీపై ఫత్వా జారీ చేయడానికి.
ఫత్వా కి భయపడి అసలు నేనలా అనలేదనో లేదా నా ఉద్దేశ్యం అదికాదనో , ఇంకేదో అంటూ మీరు సమర్థించుకోవడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తారు. కానీ ఫత్వాలు జారీ చేసే ముల్లాలు మీ మాట నమ్ముతారా చెప్పండి? పైగా, వారిని మూర్ఖులు అని మీరే కదా అన్నారు. ఇక మీ వాదనల్ని వారెలా అర్ధంచేసుకోగలరు?
మీరు హిందువుల్ని వంద సార్లు శిశుపాలుడిలా తూలనాడినా ఏ సుదర్షన చక్రమూ మీ పైకి రాక పోవచ్చు. కానీ ఒక్కసారి మీరు మహమ్మద్ ని గాని, ఇస్లాం ని గాని విమర్శించే ధైర్యం చేసారంటే, మీరు చేసే ఏ మేధొ వాదనా మిమ్మల్ని కాపాడక పోవచ్చు.
-సూర్య
@సూర్య: హడిత్ గురించి తెలిసినాకూడా మీరిలా వక్రీకరించడం బాలేదు. హడిత్ అనేది recored history కాదు. అది మౌఖికంగా ప్రవక్తగురించి చెప్పబడిన విషయాలు. వాటికి మతపరమైన ప్రాముఖ్యతవున్నా,చారిత్రక అంగీకారం లేదు. మనకూ రామాయడం,మహాభారతం లాంటి కాల్పనిక కథలున్నట్లే మహ్మదు ప్రవక్తగురించి కొన్ని కథలు హడిత్ ద్వారా ప్రాచుర్యంలో ఉన్నాయి.
ఇక ముస్లింలైనా,క్రైస్తవులైనా, హిందువులైనా మూర్ఖ్హపుపోకడలుపోతే వాటిని నేను నిర్ధ్వందంగా ఖండిస్తాను. అందులో భయంగానీ, సందేహానికిగానీ ఆస్కారం లేదు. హిందువుల మూఢ నమ్మకాల్ని ఖండించినట్లే,తలాతోకాలేని ఫత్వాలు జారీచేస ముల్లాలను నేను మూర్ఖ్హులుగానే పరిగణిస్తాను.ే
ఓ ఎల్కేజీ ప్రశ్న..సెక్యులరిజం అంటే ఏంటి? భారత దేశం సెక్యులరిస్టు దేశం అన్నప్పుడళ్లా అదేంటని అనుమానమొస్తుంది. మంచి అంశమ్మీద మీద వ్రాశారు. మతం వారిగా రిజర్వేషన్లు, పీనల్ కోడ్లు ఉన్న దేశానికి సెక్యులరిజం ఎందుకు?
మీరో విషయం ఒప్పుకోవాలి కుంభమేళాకి బదరీనాథ్ కి, ఇతర ఆలయాలకి ఖర్చుపెట్టిన డబ్బు మనదేశంలోనే ఉంటుంది. దేవాలయాల వళ్ల ప్రభుత్వానికి చాలా ఆదాయము సమకూరుతుంది. మరి హజ్ యాత్రల వళ్ల భారతదేశానికి ఏమొస్తుంది? until indian government start treating it's subjects as indians instead of treating them as hindus, muslims and christians..sorry religious minorities you will be treated just as that..you can't be equal and unequal at the same time
Post a Comment