Sunday, October 5, 2008

సమస్య మతమార్పిడా? మనుషులా?

నావరకూ మనిషి ప్రాణంకన్నా, ఏదీ ముఖ్యంకాదు. మతాలు,కులాలు, వాదాలూ,ఇజాలూ ఏవీ..ఏవీ మనిషి ప్రాణంకన్నా గొప్పవి కావు. అందుకే మతమార్పిడికన్నా, ఇప్పుడు ఒరిస్సాలో పెచ్చరిల్లుతున్న హింస నన్నెక్కువగా కలవరపెడుతోంది. హిందూమత ప్రచారం చేస్తూ, మతంమారకుండా గిరిజనుల్ని కాపాడుతున్న ఆ స్వామీజీని ఎవరు చంపారో ఖచ్చితంగా ఇప్పటికీ తెలీదు. మావోఇస్టులు మేమంటుంటే, మరికొందరు ‘క్రైస్తవులే చంపారని' డిసైడ్ చేసి, దాడులు నిర్వహిస్తున్నారు. మొత్తం ఘటనలకి మూల కారణం బలవంతపు మతమార్పిడులు.


నవీన్ పట్నాయక్ ప్రభుత్వం స్వామీజీ హత్య వెనుకనున్న నిజాల్ని వెలికితియ్యడానికి CBI దర్యాప్తుకి ఒప్పుకోవడం లేదు. కానీ, ఈ హింస నేపద్యంలో జరిగిన దారుణాలు మాత్రం దాదాపు ముఫైరోజుల తరువాత ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. కొన్ని భయాన్ని సృష్టిస్తుంటే, మరికొన్ని మానవత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. కొన్ని షాకింగ్ గా ఉంటే మరొకొన్ని మతం పేరుతో చెలరేగే మనిషిలోని ఉన్మాదాన్ని పరిచయం చేస్తున్నాయి.


29 సంవత్సరాల క్రైస్తవ ప్రచారకురాలు (నన్) ఒక హిందూమూక చేతిలో సామూహిక మానభంగానికి గురయ్యింది. సాధారణంగా ఏసును ప్రార్థించే ఈ నన్, "నన్ను కాపాడండి" అంటూ అక్కడే ఉన్న ఒక పోలీసును దీనంగా ప్రార్థిస్తుండగా, ఏమీ చెయ్యలేక తలతిప్పేసుకున్న ఒక చట్టాన్ని రక్షించే పోలీసు సాక్షిగా ఈ ఘోరం జరిగింది. మతకల్లోలాల నేపధ్యాల ఉన్మాదస్థితిలో, ఇలాంటివి జరుగుతాయి. అయితే ఇక్కడ,మానభగం జరిగిన తరువాత "భారత్ మాతాకీ జై" అనే నినాదాల మధ్యన ఆ ప్రచారకురాల్ని నగ్నంగా ఊరేగించారు. ఈ క్షణంలో, ఆ నినాదం మీదున్న గౌరవం మొత్తం మట్టిలో కలిసిపోయింది.


ఒక అనాధశరణాలయంపై జరిగిన దాడిలో రంజని అనే ఒక యువతి హిందూమూకకు పట్టుబడితే, దారుణంగా మానభంగం చెయ్యబడి, జీవించి వుండగానే నిప్పుపెట్టి...కాల్చి చంపబడ్డది. ఆ చంపేసిన తరువాత ఆ యువతి క్రిస్టియన్ కాదు..హిం...దూ అని తెలిసింది. తన పాపం అక్కడ తలదాచుకోవడమా? క్రిస్టియన్ లా అనిపించడమా? లేక తరువాత హిందూ అని తెలియడమా?


‘భారత్ మాత ఆర్మీ’ (బజరంగ దళ్ కి ఇదొక మారుపేరిక్కడ) సగర్వంగా, "క్రైస్తవుల్లో భయాందోళన సృష్టించి, మతం మార్పిడికోసం వీరు హిందువుల దరిదాపుల్లోకి రాకుండా చేసాం" అని TV ముఖంగా ప్రపంచానికి చాటి చెప్పారు. దాదపు 50,000 మంది శరణాలయల్లో, ప్రభుత్వ క్యాంపుల్లో మతంమార్చుకున్న గిరిపుత్రులు తమ గ్యారంటీ లేనిబ్రతుకులు వెళ్ళదీస్తున్నారు. దాదాపు వందమందికి పైగా చనిపోతే ప్రభుత్వం 35 కు మించి లెక్క తేల్చడం లేదు.మొత్తానికి హిందూ మతాధిపత్యం నిరూపించబడింది.నాకు మాత్రం హిందూ అనిచెప్పుకోవడానికి కొంచెం అవమానంగా అనిపిస్తోంది.


రక్షణకూ,పునరావాసానికీ కేంద్రం సహాయం చెయ్యడం లేదని ఇక్కడా పొలిటికల్ స్కోరు చూసుకుంటున్నారేగానీ, ప్రజల ప్రాణరక్షణకు పెద్ద ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపించడం లేదు. కాదలేని కొన్ని సాక్షాలు ఇప్పటికి వెలుగుచూసేసరికీ, కొందరు పోలీసుల్ని సస్పెండ్ చేసి పేర్లులేని కొందరు హిందూ మూకల్ని అర్జంటుగా అరెస్టు చేసారు.


ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగినా, మాస్టర్ మైండ్లంటూ కొన్ని ముస్లిం ముఖాల్ని తెరపైకితెచ్చే ప్రభుత్వాలకి ఇక్కడి "మాస్టర్ మైండ్లు" TV తెరపై కనబడ్డాకూడా వారి పేర్లు ఉచ్చరించడానికి ఎందుకు జంకుతున్నారొ అర్థంకాని ప్రశ్న.ముస్లింలో కిస్టియన్లో ఎదైనా దారుణం చేస్తే, "వాళ్ళంతా ఇంతే" అని మనం చాలా సులభంగా అనేస్తాం. కానీ, "మన హిందూ సోదరులు" ఈ ఘోరాలు చేసారండేమాత్రం, కొంచెం మింగుడుపడదు.కారణం, మనమూ హిందువులమే, దానితోపాటూ చాలా మర్యాదస్తులైన హిందువులతో మనకు చాలా పరిచయాలున్నాయి. కాబట్టి, "మనం" అలా చెయ్యగలమంటే నమ్మకం కలగదు. బహుశా, అలాగే మనకు ముస్లిం స్నేహితులూ, క్రైస్తవ మిత్రులూ ఉంటే "అందరూ అలాంటివారే" అనే అపోహ తొలగుతుందేమో!


ఏది ఏమైనా మనందరం మనుషులం. మనకు జీవించే హక్కుంది. మనుషులుగా, గౌరవప్రదంగా, అన్యాయం కాకుండా బ్రతికే హక్కుంది. ఆ హక్కుని కాలరాసే అధికారం, మతానికి,కులానికీ,ప్రభుత్వానికీ ఎవ్వరికి..ఎవ్వరికీ లేదు. ఈ ఘటనలపట్ల ఒక హిందువుగా గర్విద్దామా! ఒక మనిషిగా సిగ్గుపడదామా!! అనేవే ఆలోచించాల్సిన ప్రశ్నలు. మిగతావన్నీ అప్రస్తుతం,అనవసరం.


****

56 comments:

veeraswamy said...

violence in any name relegion, caste or any thing else should be punished strictly.when the goverment will not do this there rampant increase of viloence in any relegion irrespective of it may hindu, dalit or forwrd castes.you need not woory as a hindu for this feel bad for living with such a incompetent police and political sysstem

సత్యసాయి కొవ్వలి said...

"ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగినా, మాస్టర్ మైండ్లంటూ కొన్ని ముస్లిం ముఖాల్ని తెరపైకితెచ్చే ప్రభుత్వాలకి ఇక్కడి "మాస్టర్ మైండ్లు" TV తెరపై కనబడ్డాకూడా వారి పేర్లు ఉచ్చరించడానికి ఎందుకు జంకుతున్నారొ అర్థంకాని ప్రశ్న." యధాతధంగా పేపర్లలో లేవనెత్తిన ప్రశ్న ఇక్కడ మీరు ఉటంకించారు. ఇలా ప్రశ్నించడంలోని ఫేలసీని గ్రహించండి. ఒకపక్క మానవత్వం అంటూన్నారు, తప్పు చేసినవాళ్ళని పట్టుకోవాలంటారు, ఇంకోపక్క ముస్లింలను పట్టుకోవడాన్ని ఎత్తిచూపిస్తున్నారు. పనాటపో చూడండి - వీలైతే.

కత్తి మహేష్ కుమార్ said...

@సత్యసాయి కొవ్వలి: బాంబ్ బ్లాస్ట్ కీ ఒరిస్సా మారణహోమానికీ నాకు తెలిసిన common thread అమాయకుల ప్రాణాలు పోవడం. ముస్లింలు చేస్తే దాన్ని టెర్రరిజమనీ, హిందువులు చేస్తే మరోటనీ అనడాన్ని నేను ఆమోదించను. అందుకే,అక్కడా మాస్టర్ మైండ్లున్నట్లే ఇక్కడా పబ్లిగ్గా తమ హిందూ ఫిలాసఫీని చెప్పేవాళ్ళని అనమంటున్నాను.

ఇక్కడ ముస్లింలను పట్టుకోవడాన్ని ఎత్తిచూపట్లేదు. హిందువుల్ని ఎందుకు పట్టుకోవట్లెదనే ప్రశ్నిస్తున్నాను. క్రైస్తవులపై జరిగిన ఈ దాడులు ఒక పధకం ప్రకారం జరిగినవి కావంటారా? అవి మాస్టర్ మైండ్లు లేకుండా spontaneous గా జరిగాయంటున్నారా?

@వీరాస్వామి: రాజకీయ,రక్షణ వ్యవస్థలు తమ చెతగానితన్నాన్ని ఎప్పుడో తెలియజెప్పాయి. కానీ, మనుషుల్లో ఇంకా మానవత్వం ఉందనే నమ్మకం నాకు మెండుగా ఉండేది. ఇలాంటివి జరిగినప్పుడే కాస్త నేలమీదకొచ్చి బాధపడాల్సివస్తుంది.

ఎవడికి కావాలండీ, మనిషికి విలువివ్వని ఈ మతాలూ కులాలూ? మడిచి గోచిలో దోపుకోవడానికి తప్ప!

వర్మ said...

మహేష్ గారు,

అందరిలా ఆలోచిస్తే ఏం బాగుంటంది. కొంచెం భిన్నంగా ఆలోచిద్దాం అన్న తొందరలో పోస్టింగ్ చేసినట్టున్నారు. ఏవో రెండు సంఘటనలు (అందులో మీడియా వక్రీకరించినవి కొన్ని) ఉదాహరణగా చెప్పి హిందువులు కూడా విధ్వంసం చేసారు అంటే ఒప్పుకోలేం. వందలమంది జీహాదీకి బలవుతున్న ఈ తరుణంలో హిందువు ఈ మాత్రం తెగించటం సబబే. మీకేమనిపించానా ఫర్వాలేదు .......

కత్తి మహేష్ కుమార్ said...

@వర్మ: ఒకవైపు హిందువులు విధ్వంసం చేసారనడం ఒప్పుకోకుండానే, మరో వైపు "తెగించడాన్ని" సమర్ధిస్తున్నారు. ఏమిటీ వైరుధ్యం?

నేను భిన్నంగా ఆలోచించాలికాబట్టి ఈ టపా రాయలేదు. బహుశా నా ఇదివరకటి టపాలు మీరు చదవలేదనుకుంటాను. నేను ఇలాగే ఆలోచిస్తాను.

మొత్తానికి హిందువులదీ ఒకరకమైన జిహాదే అని కనీసం మీరైనా అంగీకరించారు. అలాంటప్పుడు ‘సిమి’ని బజరంగదళ్ నీ ఒకేగాటన కట్టమనే నేనూ అంటున్నాను. ఇద్దరూ ఒకే తప్పు చేస్తున్నారు. మీలాంటి కొందరు దాన్ని సమర్ధిస్తున్నట్లే ముస్లింలలోనూ కొందరు మద్దత్తునిస్తున్నారు.అలాంటివారికీ నాలాంటి ఎందరో సాధారణ హిందూ/ముస్లిం లకి అస్సలు సంబంధం లేదు. మాకు మతంపేరుతో ఛావడం,చంపడం కన్నా,మనుషులుగా బ్రతకడం ముఖ్యం.

bhavani said...

@వర్మ
దయచేసి ఈ ప్రశ్నలకు సమాదానం చెప్తారా.
ఇక్కడ మీ వ్యాఖ్యలకి మిమ్మల్ని తగలబెట్టాలన్నంత కోపం వస్తే నేను మిమ్మల్ని తగలబెట్టొచ్చా? అందులో ఏ తప్పూ లేదా?
జిహాద్ పేరుతో హిందువులను బలి చేసే వాళ్ళనే చంపుతున్నారా? అసలు వాళ్ళని చంపుతున్నారా? ఆ పేరుతో ఎవరిని చంపుతున్నారో అసలు మీకు తెలీదా?

సత్యసాయి కొవ్వలి said...

మహేశ్
మీటపాలు రెగ్యులర్ చదివే వాళ్ళలో నేనొకడిని. కొన్ని అభిప్రాయాలతో నేను ఏకీభవించక పోయినా, మీరు వినిపించే భిన్నస్వరం నాకు బాగా రుచిస్తుంది.
మీరు కాస్త నిదానంగా నా వ్యాఖ్య చదివి ఆలోచించండి. నేను మీసమాధానంలో చెప్పినవేమీ అనలేదు. ఒరిస్సాలో జరిగిన సంఘటన సమర్ధనీయం అనికానీ మాస్టర్ మైండులు లేరనికానీ అనలేదు. ఈకేసులో దోషులని పట్టుకోకపోవడానికి పోలీసు వైఫల్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణం. ఓకే. బ్లాస్టుకేసుల్లో ముస్లింలని అరెస్టుచేయగలగడం పోలీసులదోషం అన్న అర్ధం తెప్పించింది మీ వాక్యంలోని లింకు. పేపరువాళ్ళు ఇలాంటి లింకులు కాస్త మసాలా రుచి కోసం పెడతారు. మీరంత కమిటయి పోకుండా మీ లాజిక్కుని వాడండి. మీ వాదనలు, ప్రతివాదనలూ చదువుతున్నా. మీ ఆర్తి లీలగా అర్ధమవుతోంది. ఎందుకో మీలాజిక్ &expression దానికి సరిపడా పూర్తిస్థాయిలో unfold అవడంలేదు.

Anonymous said...

@Mahesh garu,
Meeru Hindu vulanu jihaadi ani andamu sababu kaadu. Hinduvula lo konthamndaina conversion meeda modate minimum protest chesi vunte paristhi intha varaku raadu Meeru kuda English National news channels ( they are all hailing from cities good at asking questions only) oka nirnayaaniki vacheyakandi.

పెదరాయ్డు said...

మీ టపా సందేశం సంగ్రహంగా(reading between the lines):

మొత్తం ఘటనలకి మూల కారణం బలవంతపు మతమార్పిడులు. మతమార్పిడికన్నా, ఇప్పుడు ఒరిస్సాలో పెచ్చరిల్లుతున్న హింస నన్నెక్కువగా కలవరపెడుతోంది. రక్షణకూ,పునరావాసానికీ కేంద్రం సహాయం చెయ్యడం లేదని ఇక్కడా పొలిటికల్ స్కోరు చూసుకుంటున్నారేగానీ, ప్రజల ప్రాణరక్షణకు పెద్ద ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపించడం లేదు. ముస్లింలో కిస్టియన్లో ఎదైనా దారుణం చేస్తే, "వాళ్ళంతా ఇంతే" అని మనం చాలా సులభంగా అనేస్తాం. కానీ, "మన హిందూ సోదరులు" ఈ ఘోరాలు చేసారండేమాత్రం, కొంచెం మింగుడుపడదు. మొత్తానికి హిందూ మతాధిపత్యం నిరూపించబడింది.నాకు మాత్రం హిందూ అనిచెప్పుకోవడానికి కొంచెం అవమానంగా అనిపిస్తోంది.

పై వ్యాఖ్యల్లో ప్రతి వ్యాఖ్యా దాని తర్వాతి వ్యాఖ్యకు విరుద్దంగా వుంది.

మీరుదహరించిన ఘటనలలో ఒక మనిషి మరో మనిషిని అణగార్చడం అన్యాయమంటే అంగీకరిస్తాను, ఒక మనిషిగా ఇటువంటి అకృత్యాలకు సిగ్గుపడతాను. కాని మీ భాధ ప్రత్యేకమైనది. ఒక హిందువు ఒక క్రిస్టియంపై దారుణానికి ఒడిగట్టడం మీరు భరించలేకపోతున్నారు. మీ వాదనా పటిమతో విషయాన్ని జిహాదీ దాకా తీసుకెళ్ళారు. మీ వ్యాసాన్ని ఏ మతాన్నీ ప్రస్తావించకుండా రాయటానికి ప్రయత్నించండి. అప్పుడే మీ వ్యాసంలోని మొదటి వ్యాఖ్యకు న్యాయం చేకూరుతుంది.

Anonymous said...

మీ ఆవేదన సరైనది. అది దారుణమైన ఘాతుకం. దానికి పాల్పడిన వాళ్ళకు తగిన శిక్ష పడాలి. అలాగే ఆ సంఘటనతో పెనవేసుకున్న అన్ని ఘాతుకాలనూ విచారించాలి.

కానీ..

"ఆ నినాదం మీదున్న గౌరవం మొత్తం మట్టిలో కలిసిపోయింది." - హంతకుడొకడు హత్య చేస్తూ మహాత్మా గాంధీకి జై అని అంటాడనుకోండి.. ఆ దెబ్బకి గాంధీ మీద మనకున్న గౌరవం మట్టిలో కలిసిపోతుందా?

"అందరూ అలాంటివారే అనే అపోహ తొలగుతుందేమో" - అందరూ అలాంటివారేనని "అందరూ" అనుకుంటున్నట్టుగా మీరు చిత్రీకరిస్తున్నారు. ఇది ఉచితంగా లేదు, ఎందుకంటే అది అబద్ధం కాబట్టి. బాంబులేసినపుడు కొందరు ముస్లిములను అనుమానిస్తే (అది కూడా పాత నేరాల, నేరస్తుల చరిత్రను బట్టి) మొత్తం ముస్లిములందరినీ అనుమానించినట్టెలా అవుతుంది? ఇలాగ మాట్టాడ్డం వల్ల, లేని విభేదాలు మనసుల్లో పుట్టుకొస్తాయి, పుట్టుకొచ్చాయి.

అబ్రకదబ్ర said...
This comment has been removed by the author.
అబ్రకదబ్ర said...

చదువరిగారు,

మీ బ్లాగులో కామెంట్ల పొడుగు ఎక్కువైపోయి అది సరిగా ఓపెన్ అవటం లేదు (నేనే పెద్ద కారణం పొడుగు పెరగటానికి).

నాకు అర్ధం కాని విషయం, తాడేపల్లిగారిలాంటి పెద్దమనిషి 'నాకు దేశభక్తి ఉన్న క్రిస్టియన్ ఒక్కడూ కనపడలేదు' అని నిస్సంకోచంగా కుండబద్దలు కొడితే ఖండించని వాళ్లంతా కలిసి మహేష్ మీద, నా మీద దాడికి దిగటం.

మీరేమో ఇక్కడ 'అందరూ అలాంటివారేనా' అని అడుగుతున్నారు. ఆ మాట తాడేపల్లిగారిని కూడా అడిగినట్లయితే మీరైనా, ఇతరులయినా నిస్పాక్షికంగా మాట్లాడినట్లు ఉండేది. నేను రెండు మూడు సార్లు నా వ్యాఖ్యల్లో 'అందరూ అలాంటివారు కాదు' అని చెప్పాను. బలవంతపు మతమార్పిడులని నిరోధించే దేశవ్వాప్త చట్టాలుండటం అవసరం అనికూడా స్పష్టంగా చెప్పాను. అవన్నీ ఒదిలేసి నేను క్రిస్టియన్ల కొమ్ము కోస్తున్నట్లు మాట్లాడటం వింతగా తోచింది. నేను ఎత్తి చూపదలచుకుంది 'మత మార్పిడుల విషయంలో క్రిస్టియన్లు, ముస్లిములనే కాదు, హిందూ మతమార్పిడుల సంగతినీ చర్చలోకి తీసుకు రండి' అని. ఆ విషయమొచ్చేసరికి 'గుడ్డు ముందా, కోడి ముందా', 'ఏది పెద్ద తప్పు, ఏది చిన్న తప్పు' లాంటి వితండవాదాలతో సమర్ధింపజూసుకునే ధోరణే నాకు కనిపించింది. నేనో చోట స్పష్టంగా చెప్పాను, 'మిగిలిన వారంతా ఒక వైపు నుండే మాట్లాడుతుంటే, నేను రెండో వైపు నుండే మాట్లాడటం తప్పటం లేదు' అని. నన్ను ఖండించేవారు నా వివరణలు మాత్రం ప్రతిసారీ అలవాటుగా మర్చిపోతున్నారు, అదేమిటో!

మహేషైనా, నేనైనా ఎత్తిజూప ప్రయత్నిస్తున్నది మైనారిటీలలోని అతివాదంకన్నా మెజారిటీ వర్గంలోని అతివాదం దేశానికి అతి ప్రమాదకరం అన్న విషయాన్ని. దానర్ధం మేము మైనారిటీలని వెనకేసుకురావటం, హిందువులని హేళన చెయ్యటం అనికాదు. మెజారిటీల అతివాదాన్ని కళ్ళుమూసుకుని గమనించటం దేశభక్తి ఎప్పటి నుండీ అయింది?

Uday said...

Mahesh gaaru,

ప్సూడో సెక్యులరిసానికి అంటే మీరే పెద్ద వుదాహరణ అనిపిస్తుంది. మీరు " అందుకే మతమార్పిడికన్నా, ఇప్పుడు ఒరిస్సాలో పెచ్చరిల్లుతున్న హింస నన్నెక్కువగా కలవరపెడుతోంది " అని రాసారు. మీరు మత మార్పిడులకు కలవర పడ్డట్టు, మీరు మత మర్పిడిపైన రాసిన పొస్టులొ కనిపించలేదే!! ఎవరో కొంతమంది చెస్తున్న హింస ను చూసి, హిందువుగా పుట్టినందుకు అవమనకరం గా అనుకుందాం, మైనార్టీలుగా చెప్ప బడే వారిలొ కొంత మంది దెశాన్ని ( ఒక వర్గం) , మన మతాన్ని (ఇంకో వర్గం) చిల్లులు పెడుతుంటే చూస్తూ వూరుకుందాం. మీ బ్లాగు చాలా రోజుల నుండి చదువుతున్నను, హిందూ మతాన్ని, దానికి సంబందించిన వ్యవహారలు, విలువలు, హిందూ మతం తొ బాగ పెన వేసుకున్నట్లు కనిపించె మనుషులు అన్నిటిని చాన్సు దొరికినప్పుదల్లా సోపిస్టికేటేడ్ గా ఏకటమె పనిగా పెట్టుకున్నారు అని అనిపిస్తూ వుంటుంది. నాణేనికి ఒక వైపు వున్న విషయాన్ని మరీ పెద్దదిగ చేసి చూపిస్తూ, మరొక పార్శ్వాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారు.

Uday said...

అబ్రకదబ్ర గారు,

భలె చెప్పారండీ, ఒరిస్సా లొ జరుగుతున్న హింస, వరుస బాబు పెలుళ్ళ కంటే ఇండియా ఎదుర్కుంటున్న అతి పెద్ద సమస్య. శెభాష్. మిగతా మతాల గురించి నేను ఇక్కడ చెప్ప దలచుకోలొలేదు, కాని దేశమో, మతమో అన్న పరిస్తితే వస్తే, హిందువులు దేశానికే వోటు వేస్తారు.

నెను నాకిస్టమీన గుడికి వెల్లి, నా కిస్టమైన ప్రార్ధన చెసుకుంటూ వుంటే, ఎవడొ వచ్చి ప్రభువును నమ్మకపోతే పుట్ట గతులు వుండవు అని ఎవేవొ చెప్తూ వుంటే, హిందూ మతం, నా సంస్క్రుతి నేర్పిన సంస్కారం వుండబట్టే తల తిప్పుకుని రాగలిగాను. ఇప్పటికీ 99 శాతం హిందువులు ఇదే సహనాన్ని చూపగలరు. హద్దులు మీరుతున్న మిగతా 1 సాతాన్ని, అడ్డు అదుపు లేని మత మార్పిడుల్ని , ఎదుర్కోవతం ప్రభుత్వం భాద్యత.

Aditya said...

Uday will said.

Aditya

Aditya said...

oh.. sorry for the spelling.

"Uday well said"

Anonymous said...

Another mistake.
uday! well said

చంద్ర శేఖర్ కాండ్రు said...

""బహుశా, అలాగే మనకు ముస్లిం స్నేహితులూ, క్రైస్తవ మిత్రులూ ఉంటే "అందరూ అలాంటివారే" అనే అపోహ తొలగుతుందేమో!""


యిది సమంజసంగా అనిపిస్తుంది.

Anonymous said...

అబ్రకదబ్ర:

హిందువులంతా అలాంటివారేనా అని నేను అడగలేదు! నేనే సరిగ్గా అర్థమయ్యేలా చెప్పలేదనుకుంటా.. మరింత విపులంగా చెప్పాలంటే..

"మనకు ముస్లిం స్నేహితులూ, క్రైస్తవ మిత్రులూ ఉంటే "అందరూ అలాంటివారే" అనే అపోహ తొలగుతుందేమో!" అని మహేష్ అన్నారు కదా..

అలా రాయడం వలన - 'క్రైస్తవులంతా కుట్రదారులే, సాయిబులంతా ఉగ్రవాదులే అని వీళ్ళు అనుకుంటున్నారు' అనే తప్పు భావనను ఆయా మతస్తులలో కలగజేస్తున్నారు అని నా ఉద్దేశ్యం.

పాటూరు చైతన్య కృష్ణ ఈ సంగతిని చాలా చక్కగా చెప్పారు, చూసారా?

"మైనారిటీలలోని అతివాదంకన్నా మెజారిటీ వర్గంలోని అతివాదం దేశానికి అతి ప్రమాదకరం" - అంటే..
ఎన్ని అవమానాలు జరిగినా, ఎంత హింస ప్రబలినా, సామాజికంగా ఎంత అణగదొక్కబడినా, ప్రభుత్వ మైనారిటీ పక్షపాత వైఖరి ఎంత జుగుప్సాకరంగా తోచినా, హిందువులు నోరు మూసుకోని కూచ్చోవాలి. నోరు పెగిలితే అరిచి కరిచేస్తారు! నిరసనగా నినదిస్తే అతివాదులంటారు, తీవ్రవాదులంటారు. ఉగ్రవాదులనీ అంటున్నారు. ప్చ్! అందరూ ఒకవైపు మాట్టాడుతున్నారు, మనం ఇటేపు మద్దతిద్దాం అని తప్ప, మైనారిటీలను వెనకేసుకు రావడం తప్ప మరోటి కాదు.

"మెజారిటీల అతివాదాన్ని కళ్ళుమూసుకుని గమనించటం దేశభక్తి ఎప్పటి నుండీ అయింది?" భలే అడిగారు సార్! ఎప్పుడైందో మీరు గమనించలా?
ఎప్పుడైతే మైనారిటీ సంక్షేమమే సర్వజన కల్యాణమని ప్రభుత్వాలనుకున్నాయో,
ఎప్పుడైతే సిమి నిషేధాన్ని తొలగించాలని నినదించారో,
ఎప్పుడైతే ఆ నినదించిన నోళ్ళే ఆరెస్సెస్సును నిషేధించాలని కోరాయో,
ఎప్పుడైతే దేశ వనరులపై తొలి హక్కు మైనారిటీలదేనని స్వయానా ప్రధానే చెప్పాడో,
ఎప్పుడైతే మైనారిటీ రిజర్వేషన్లొచ్చాయో,
ఎప్పుడైతే చరిత్రను ఇజాల నేపథ్యంలోంచి చూట్టం మొదలెట్టారో,
ఎప్పుడైతే వందేమాతరం పాడకపోయినా పర్లేదని తేల్చారో,
ఎప్పుడైతే బాంబులేసే వాళ్ళను పట్టుకోవడం తప్పని తేల్చారో,
ఎప్పుడైతే ఈ బాంబుల ఫెళాఫెళారావాలు, బాధితుల హాహాకారాలు నాయకులను కదిలించలేకపోయాయో,
ఎప్పుడైతే ఉగ్రవాద నిందితులను రక్షించేందుకు విశ్వవిద్యాలయపు డబ్బులతో న్యాయసహాయం అందించబూనారో,
ఎప్పుడైతే లౌకికవాదులు ఈ న్యాయసహాయ చర్యను, సదరు మేధావిని సమర్ధించబోయారో,
ఒక్ఖమాటలో చెప్పాలంటే..
ఎప్పుడైతే మైనారిటీకి పాయసాన్నము, మెజారిటీకి తొడపాశమూ పెట్టడమే లౌకికవాదానికి నిర్వచనంగా మారిపోయిందో.. అప్పుడు,
అప్పుడు మీరన్నది జరిగింది.
మెజారిటీ గొంతెత్తడం మొదలైంది. దొంగ లౌకికవాదులకు, పిడి లౌకికవాదులకు గంగవెర్రులెత్తడం మొదలైంది.

ఈ సందర్భంలో గరికపాటి నరసింహారావు గారు సాగరఘోషలో రాసిన ఒక పద్యం గుర్తుకొస్తోంది: (ఆయన రాసింది మైనారిటీ, మెజారిటీ గొడవల నేపథ్యంలో కాదు.)

ఎపుడీ మారణహోమకుండములు మిన్నే మన్నుగా జేయునో
ఎపుడీ నీరములింకి నింపబడునో ఇల్లాళ్ళ కన్నీళ్ళతో
ఎపుడీ ధర్మ శిశు ప్రసూనములు కన్నే విప్పలేకుండునో
అపుడీ లోకములాహరింపబడు అశ్వారూఢ కల్కి ప్రభన్

అలా గుర్రమెక్కి మహోత్సాహంతో దూసుకువచ్చే కల్కి, ఎవరో మామూలు సైనికుడు కాదు.., సాక్షాత్తూ వాసుదేవుడు!

Anonymous said...

పై పద్యంలో చిన్న తప్పు (రెండో పాదం చివరి అక్షరం) దొర్లినట్టు అనిపిస్తోంది. సవరించిన పద్యం:

ఎపుడీ మారణహోమకుండములు మిన్నే మన్నుగా జేయునో
ఎపుడీ నీరములింకి నింపబడునో ఇల్లాళ్ళ కన్నీళ్ళచే
ఎపుడీ ధర్మ శిశు ప్రసూనములు కన్నే విప్పలేకుండునో
అపుడీ లోకములాహరింపబడు అశ్వారూఢ కల్కి ప్రభన్

Anonymous said...

Well said Mr. Chaduvari ! Big applause !

Bhasker said...

"మొత్తం ఘటనలకి మూల కారణం బలవంతపు మతమార్పిడులు."
I have been following incidents happening Orissa. based on my minimal understanding root cause is NOT మతమార్పిడులు.
these are deep rooted problem from last few decades. suddenly took communal turn.
can watch good discussion here
http://www.ndtv.com/convergence/ndtv/videopod/default.aspx?id=40401

any ways what ever the root cause .. these thigs are great shame and ఒక మనిషిగా ఇటువంటి అకృత్యాలకు సిగ్గుపడతాను.

అబ్రకదబ్ర said...

చదువరిగారు,

నేనడిగింది అతి మౌలికమైన, చాలా తేలిగ్గా సమాధానమివ్వగల ప్రశ్న: మతమార్పిడులైనా, కలహాలైనా, మతానికి సంబంధించినవి మరేవైనా, మన మతాన్ని గుడ్డిగా వెనకేసుకు రావటం ఎంతవరకూ సమంజసం అన్న విషయాన్ని. దానికి ఓపికగా ఛందోబద్ధంగా సమాధానమిచ్చారుగానీ అసలు ప్రశ్నని మాట్రం దాటేశారు. 'ఎప్పుడైతే' అంటూ మొదలుపెట్టి మీర్రాసిన ప్రతి వాక్యంలోనూ వాళ్లలా చేశారు కాబట్టి మేమిలా చెయ్యటం ఒప్పే అన్న ఆవేశమే కనిపిస్తుంది కానీ వివేకం గోచరించట్లేదు. నా ముందటి వ్యాఖ్యలో నే చెప్పిన 'గుడ్డు ముందా, కోడి ముందా', 'ఏది పెద్ద తప్పు, ఏది చిన్న తప్పు' ధోరణే ఇది. ఎన్నో తెలిసిన మీవంటివారే ఇంత తేలికగా ఈ మాయలో పడితే ఇక సామాన్యుల సంగతేమిటి?

'ఎప్పుడైతే' ఓటు బ్యాంకు రాజకీయాలు ఆగిపోతాయో అప్పుడే మీరనుకునే కుహనా సెక్యులరిజం ఆవిరైపోతుంది. మైనారిటీలనైనా, దళితులనైనా, మరెవరినైనా ఓట్ల దృష్టితో చూసేవాళ్లంటే నాకు జుగుప్స. ఈ ఓటు బ్యాంకు రాజకీయాలు నడిపేవాళ్లకి నిజంగా మైనారిటీలమీద ప్రేమ ఉండే ఆ పని చేస్తున్నారని మీరనుకుంటే అంతకన్నా అమాయకులెవరరూ ఉండరు. వాళ్ల వెధవ నిర్ణయాలకి విరుగుడు హిందూ అతివాదం అనుకోవటం మరీ అమాయకత్వం. ఆంధ్రప్రదేశ్‌లో ముస్లిములకి రిజర్వేషన్లకోసం ఉద్యమాలేవన్నా జరిగాయా? అడగకుండానే వాటిని దానం చేసిన కాంగ్రెసు ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో నిలదీయలేరా హిందూ మేధావులంతా కలిసి? ఆ దారి ఉండగా, ఇటువంటి కారణాలతో ముస్లిములు, క్రైస్తవులు దేశద్రోహులు అన్న భావాన్ని నరనరానా జీర్ణించుకోవటం ఎంతవరకూ సమంజసం ('అందరూ' కాదు, కొందరు మేధావులు. ముందు వ్యాఖ్యలో నేను దీని గురించే ఓ ప్రశ్న అడిగాను. మౌనమే సమాధానం).

'జనగనమణ'ని అవమానించిన వారిని, మతాతీతంగా, నేనూ క్షమించను. వందేమాతరం విషయంలో నాకంత పట్టింపు లేదు - కానీ ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. అయితే, హిందువులలో ఎందరికి వందేమాతరం పూర్తిగా కంఠతా వచ్చో చెప్పండి. 'మేం పాడం' అని మొండికేసిన వాళ్లు దేశద్రోహులే అనుకుదాం. మరి అంత పవిత్రమైన గేయాన్ని నేర్చుకోని మనవారినేమందాం? నేర్చుకున్నవారిలోనూ ఆ బెంగాలీ గీతానికి అర్ధం తెలిసిన వారెందరు? వందేమాతరం సంగతి అవతల పెట్టండి. అసలు జాతీయగీతంలో ప్రతి వాక్యానికీ అర్ధం తెలిసిన వాళ్లెందరు ఈ దేశంలో? ఆయా గీతాల వెలుగులు ఇంత ఘోరంగా అఘోరిస్తుంటే ఆ సంగతొదిలేసి అది పాడనన్న కొందరిపై అక్కసెందుకు? ఓ హిందువుకి వందేమాతరం వచ్చినా రాకపోయినా ఫరకులేదు, ఓ ముస్లిం అది పాడనని మొండికేస్తే మాత్రం దేశద్రోహం. మాబోటి వాళ్లవి కుహనా లౌకికవాదాలయితే మరి ఇదేరకం లౌకికవాదమో? అందరికీ ఒకటే న్యాయం ఉండాలని ఘోషించే మాలాంటివాళ్ల మాటల్లో పెడార్ధాలు తీసి మైనారిటీలని వెనకేసుకొస్తున్నారని ఆరోపణలు చేయటమా లౌకికవాదం? (బలవంతపు మతమార్పిడులని నిరోధించే చట్టాల అవసరం గురించి నేను పదే పదే ప్రస్తావించిన విషయం పక్కనబెట్టి హిందుత్వంలోకి బలవంతపు మార్పిడులని గురించి నే చేసిన వ్యాఖ్యానాలని మాత్రమే పట్టుకుని వేలాడటం దీనికో పెద్ద ఉదాహరణ)

చివరగా, హిందువులని నోరు మూసుకుని కూర్చోమని ఎవరూ అనటం లేదు. నిజమైన హిందువు ఇటువంటి వాటికి స్పందించే విధానాలు ఇలా ఉండవు. 'అభం శుభం తెలియని వాళ్లని ఊచకోత కోయటం ఏమి న్యాయం' అన్న ప్రశ్నకి అసలైన హిందువెవడూ 'వాళ్లు బాంబులేశారుగా, అందుకే అల్లర్లు జరిగాయి' అని చెప్పడు. అటు ముస్లిం ఉగ్రవాద చర్యలకీ సమాధానం అల్లర్లే, ఇటు క్రిస్టియన్ మతమార్పిడులకీ సమాధానం అల్లర్లే. ప్రభుత్వాల చేతగానితనానికి సమాధానంగా చట్టాన్ని మనచేతిలోకి తీసుకుందాం, నచ్చని ప్రతివాడినీ నరుక్కుంటూ పోదాం. ఆ రకంగా సమ సమాజాన్ని స్థాపిద్దాం. సరే, అలాగే కానిద్దాం. భారతదేశమా, బహుపరాక్!

సూర్యుడు said...

@అబ్రకదబ్ర:

మతమంటే ఏమిటి? బలవంతపు మతమార్పిడులంటే ఏమిటి?

కత్తి మహేష్ కుమార్ said...

@చదువరి: "అందరూ అలాంటివారే" అనే మాటలు లేక దాదాపు అదే అర్థం వచ్చేమాటలు దళితులు,ముస్లింలు మరియూ క్రైస్తవులను సూటిగా అన్న ఛాంధసవాదుల్ని ఎవరూ కనీసం వేలెత్తిచూపరుగానీ, భావవైకల్యం లేకుండా మన అపోహలు తొలగాలని కోరుకున్న నా మాటను వక్రీకరించడం భావ్యమా?

మీరు ఛంధోబద్ధంగా చెప్పిన "ఎప్పుడైతేలో" చాలా వరకూ రాజకీయ ప్రేరిత ప్రహసనాలే ఉన్నాయి. అయినప్పటికీ, ప్రతి దానికీ (అంగీకారాత్మకం కాకున్నా) సహేతుకమైన సమాధానం ఉందని నేననుకుంటాను.
1.మైనారిటీ క్షేమమే సర్వజనకల్యాణం అని అన్ని ప్రభుత్వాలూ 100 శాతం బడ్జెట్ కేటాయించేస్తే,ఈ పాటికి మన ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోయేది. మీది ఈ విషయంలో ఖచ్చితంగా over statement. మైనారిటీ సంక్షేమానికి ఏ ప్రభుత్వమైనా 4-5% మించి స్వతంత్ర్యభారతంలో బడ్జెట్ కేటాయించిందా?

2&3.SIMI &RSS (నిషేధించమన్నది భజరంగ్ దళ్ ని అనుకుంటాను) లమధ్య నిజానికి భావజాలం పరంగా పెద్ద తేడాలేదు.సిమి కి గల్ఫ్,పాకిస్తాన్ నుంచీ డబ్బొస్తే, ఆర్.ఎస్.ఎస్ కి అమెరికా కెనడా,యూకే లో ఉన్న హిందువులు డబ్బులు పంపిస్తారు. ఇద్దరూ ఇతర మతం మీద కోపాన్నివెళ్ళగక్కి,ప్రజల్లో అశాంతినీ,అసురక్షిత భావనల్ని నింపి రెండుమతాలూ కొట్టుకుచావాలని కోరుకుంటారు. సిమిలో కొందరు బాంబుబ్లాస్టుల్లో పాల్గొన్నారు.RSS లో కొందరు గుజరాత్ అల్లర్లు,ఒరిస్సా ఊచకోతలూ చేసారు.Both are religious extremists. దేశాన్ని అస్థిరత్వం వైపు ఉద్దరూ నడుపుతున్నారు. అలాంటప్పుడు కేవలం హిందువులు కనక RSS కు ప్రత్యేకరాయితీ ఎందుకు?

4.ఒక కుటుంబంలో ఎవరైనా వికలాంగుడో లేక బ్రతకనేర్వని పిల్లాడో ఉంటే, తల్లిదండ్రుల ప్రేమ కొంచెం ఎక్కువగా ఆ పిల్లాడిమీద ఉంటుంది. కొంత Reverse discrimination ద్వారా ఆ లోపాల్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తాం.ఆ కుటుంబంలో ఒక సురక్షితమైన స్థానం కల్పించే ప్రయత్నం చెయ్యబడుతుంది. "దేశ వనరులపై తొలి హక్కు మైనారిటీలదే" అని ప్రధాని అంటే తండ్రిగా తన బాధ్యత తీరుస్తున్నాడని మాత్రమే అర్థం. అయినా,మొదటి హక్కు అన్నాడేగానీ మొత్తమంతా దోచిపెడతాననలేదుకదా?

5.మైనారిటీలకు రిజర్వేషన్లనేవి రాజకీయ ఉద్దేశంతో అమలు చేసినా. దానికి సచ్చర్ కమిటీ ఇచ్చిన సైద్దాంతిక నేపధ్యం ఉంది.భారతదేశ ముస్లింల పరిస్థితి సగటు హిందువుకన్నా,ఘోరంగా ఉండటంతో కొన్ని ప్రయత్నాలు చెయ్యటం అవసరం అన్నది నిర్వివాదాంశం. కానీ రిజర్వేషన్లు అందుకు సమాధానం కాదు అని మీకు అనిపిస్తే దాన్ని వ్యతిరేకించొచ్చు,నిరసించొచ్చు, ప్రభుత్వాన్ని మార్చొచ్చు, కోర్టుకెళ్ళి కేసువెయ్యొచ్చు

6.చరిత్రని ఇజాలరూపంలో చూడటం అనేది కొత్తకాదు. అయినా, ప్రస్తుతం alternate history లభ్యంలో ఉందిగా! మీ ఉద్దేశం ప్రభుత్వం పాఠ్యపుస్తకాలలో చెప్పే చరిత్రను తీసుకునైతే, కొంత లోతైన విశ్లేషణ అవసరం. స్వాతంత్ర్యం వచ్చేవరకూ ఆ తరువాత కొంతకాలంకూడా మన చరిత్రని బ్రిటిష్ వారి కళ్ళతో(colonial eyes) చూడ్డం జరిగింది.

ఆ తరువాత మెధావివర్గం/చరిత్రకారులూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉండటం వలన వామపక్ష భావజాలం వైపు మొగ్గుచూపి, చరిత్రను ఆ ఇజం ద్వారానే రాయటం జరిగింది.కాబట్టి ఇప్పటిదాకా మనం చదువుతున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీకి అనుకూల చరిత్ర అనిమాత్రం అనుకోకండి. మధ్యలో అధికారంలోకి వచ్చినప్పుడు BJP చెయ్యబూనింది correction అన్న ఆపోహవుంటే దాన్నీ కూలంకషం చర్చించాల్సిందే.

7.వందేమాతరం గురించి అబ్రకదబ్రగారు తమ వ్యాఖ్యలో చెప్పారు. నా మాటా అదే!

8.బాంబులేసే వాళ్ళని పట్టుకోవడం తప్పని ఎవరూ అనడం లేదు. అదే న్యాయం అన్నిచోట్లా జరగాలని మాత్రమే కోరుకుంటున్నది.

9.బాంబుపెళపెళలు బాధితుల హాహాకారాలుకూ జరిగిన రాజకీయ స్పందనపట్ల సర్వత్రా అసంతృప్తి నెలకొని ఉంది. సమస్యల్లా, "అంతమాత్రానా హింసకు పూనుకుంటామా?" అని మాత్రమే.

10.మీరు చెప్పిన ఉగ్రవాద "నిందితుడు" ఆ యూనివర్సిటీలో పాఠాలు చెప్పే ప్రొఫెసర్.కాబట్టి, యూనివర్సిటీలో ఉన్న కొందరు అతడికి స్నేహితులుగా,సహౌపాధ్యాయులుగా ముఖ్యంగా మనిషులుగా న్యాయసహాయం అందివ్వడానికి ముందుకొచ్చారు. UGC grants లోంచీ ఈ డబ్బొచ్చినట్లుగా అనవసరమైన అపోహలు పెంపొందించకండి. యూనివర్సిటీవారు తమకు ప్రభుత్వం ఇచ్చిన ఫండ్స్ నుంచీ ధనసహాయం చెయ్యలేదు. యూనివర్సిటీలో జోలెపట్టి అడుక్కుని, ఆ వచ్చినడబ్బుల్తో legal help తీసుకున్నారు.

మీరు చివర చెప్పిన పద్యానికి ప్రతిగా రవీంరనాధ్ ఠాగోర్ రాసిన "ఎక్కడ మనస్సులు నిర్భయంగా ఉంటాయో
ఎక్కడ మనుష్యులు తలెత్తుకు తిరగగలరో"
చదవండి.

చివరిగా నేను చెప్పాలనుకుంది ఒక్కటే, ఎంతటి అహింసాపుర్వకమైన అవమానానికైనా, హింసతో సమాధానం చెప్పడం అంగీకారాత్మకంకాదు. No amount of nonviolent provocation should be met with violent means.నేనైతే ఒకమెట్టు పెంచి హింసకు కూడా ప్రతిహింస జరగకూడదని కోరుకుంటాను.అది ఆమోదయోగ్యం కాకపొవడంతొపాటూ,గర్హనీయం,అమానవీయంకూడా.

@భాస్కర్: ఒరిస్సాలోని సమస్యకి మూలకారణం అక్కడి ethnic conflict అని అంగీకరించినా, ప్రస్తుతం జరుగుతున్న ఘటనలకు మూలం మాత్రం మతంమార్పిడుల నేపధ్యంలో జరిగిన దాడులే.

Anonymous said...

అబ్రకదబ్ర గారు, మొత్తానికి భలే చెప్పారండి ...
క్రైస్తవులు, ముస్లిములు ఇతరులకి ఏమైనా చెయ్యవచ్చు, అది కూడా ఏమి ఆలోచించకుండా ...
ఇతరులు మాత్రం, కోడి ముందా, గుడ్డు ముందా అని ఆలోచించుకుంటూ చేతులు ముడుచుకు కూర్చోవాలి.
ఇదే పద్ధతిని క్రైస్తవులు, ముస్లిములు ఎందుకు పాటించరు ? వాళ్లు మాత్రం ఏమి ఆలోచించనక్కర్లేదా ?
మొన్నటికి మొన్న నవరాత్రి పందిరి ద్వారం వాళ్ళకి కొంచం అడ్డం వచ్చిందని నానా రభస చేసారు ... వీళ్ళు మాత్రం మైకులు పెట్టుకుని రోజుకి ఐదు సార్లు మా దేవుడే గొప్ప అని జనాలకి ఊదర కొడుతూ ఉంటారు ...
నిన్నటికి నిన్న హిందువులు ఏదో ఉత్సవానికి banners కట్టుకుంటే, వాటిని చించి గొడవ చేసారు. వీటికి మాత్రం సహనం, సంయమనం అక్కర్లేదు. వీళ్ళని అసలు విమర్సించనే కూడదు.
వారం ముందు వీళ్ళే సూరత్ లో హిందువుల గుడిని కాల్చి పారేసారు.
మీ తర్కం ప్రకారం పాకిస్తాన్ వాళ్ళు కార్గిల్ ని ఆక్రమించుకున్నాసరే మన వాళ్ళు ఏమి అనకూడదు ... మరి మీరు కార్గిల్ లో భారత సైనిక చర్య ని సమర్ధించారా లేదా ?

- Shiv.

Anonymous said...

కత్తి మహేష్ కుమార్ గారు,

ఇక మీకు మళ్ళీ మళ్ళీ ఎదురు పడుతూనే ఉంటాను. మీకు అభ్యంతరం ఉన్నా లేకపోయినా ...

నేను చదువరి గారి బ్లాగులో మీ knowledge sources ఒక సారి సరి చేసుకోండి అని సలహా ఇచ్చాను ... దాన్ని మీరు గమనించినట్లు లేరు.

SIMI కి, RSS కి నక్కకి, నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. SIMI ఒక మత వాద సంస్థ అయితే RSS జాతీయ వాద సంస్థ. SIMI కి వచ్చిన డబ్బు దేశం లో బాంబులు పెట్టి కల్లోలం సృష్టించడానికి వాడితే, RSS కి వచ్చిన డబ్బు ఆ సంస్థ మనుగడ కోసం వాడుతున్నారు. RSS కి వచ్చిన డబ్బు చట్టబద్ధమైన దారిలో వస్తే, SIMI కి వేరే దేశాలలో మన కరెన్సీ ముద్రించి పంపుతున్నారు.
ఈ రెండు సంస్థల websites చూస్తే ఎవరికైనా ఈ విషయం అర్థం అవుతుంది. Teesta Setlavad లాంటి కుహనా మేధావుల మాటలు, NDTV లాంటి pseudo-secular ఛానల్ ప్రసారాలు చూస్తే మీకు కలిగినటువంటి అభిప్రాయమే కలుగుతుంది.

నా knowledge sources నావే, అవే కరక్టు, నా బ్లాగుకి నేను సుమన్ ని అంటారా, నేనేమి అనలేను. కాకపోతే ఇది ఒకసారి చూడండి. చదువరి గారికి మీరిచ్చిన సమాధానం, పాయింట్ 10 లో చెప్పినట్లు ఆ 'నిందితుడు' JMI లో ప్రొఫెసర్ కాదు. ఇద్దరు నిందితులు అందులో విద్యార్ధులు, ఇంకొకడు పూర్వ విద్యార్ధి. మీరు చెప్పినట్లు వాళ్లు జోలె పట్టి అడుక్కోలేదు కూడా. ఈ లింకుని ఒక క్లిక్కు క్లిక్కండి తెలుస్తుంది.

http://www.rediff.com/news/2008/sep/23delblast2.htm

ఆ ప్రొఫెసర్ చెప్పేది ఒక సారి వినండి. 'University is morally bound' అట. ఒకవేళ వాళ్ల మీద మోపబడిన అభియోగం నిజం అని తేలితే వాళ్ల మీద ఖర్చు పెట్టిన డబ్బు ఎవరు ఇస్తారు ? పాకిస్తాన్ లో ప్రింట్ చేసి తెప్పిస్తారా ?

- Shiv.

భైరవభట్ల కామేశ్వర రావు said...

"అయితే, హిందువులలో ఎందరికి వందేమాతరం పూర్తిగా కంఠతా వచ్చో చెప్పండి. 'మేం పాడం' అని మొండికేసిన వాళ్లు దేశద్రోహులే అనుకుదాం. మరి అంత పవిత్రమైన గేయాన్ని నేర్చుకోని మనవారినేమందాం? నేర్చుకున్నవారిలోనూ ఆ బెంగాలీ గీతానికి అర్ధం తెలిసిన వారెందరు? వందేమాతరం సంగతి అవతల పెట్టండి. అసలు జాతీయగీతంలో ప్రతి వాక్యానికీ అర్ధం తెలిసిన వాళ్లెందరు ఈ దేశంలో? "

ఈ చర్చకి అప్రస్తుతమే కావచ్చు కాని చెప్పకుండా ఉండలేక - వందేమతరం సంస్కృతంలో ఉన్న గీతం, బెంగాలీ కాదు. జనగణమన బెంగాలీ గీతం.

భైరవభట్ల కామేశ్వర రావు said...

మహేష్ గారు,
"చివరిగా నేను చెప్పాలనుకుంది ఒక్కటే, ఎంతటి అహింసాపుర్వకమైన అవమానానికైనా, హింసతో సమాధానం చెప్పడం అంగీకారాత్మకంకాదు. No amount of nonviolent provocation should be met with violent means.నేనైతే ఒకమెట్టు పెంచి హింసకు కూడా ప్రతిహింస జరగకూడదని కోరుకుంటాను.అది ఆమోదయోగ్యం కాకపొవడంతొపాటూ,గర్హనీయం,అమానవీయంకూడా."

మీరన్నది నూటికి నూరు శాతం ఒప్పుకుంటాను. అయితే, ఇలాంటి ఖచ్చితమైన వైఖరి మీరు ఇంతకుముందు టపాల్లో చూపించలేదని నాకు కలిగిన impression. ముస్లింల తీవ్రవాదానికి ఏ కారణమైనా అది గర్హనీయమే అయినప్పుడు దాని వెనకనున్న లాజిక్ ని వెతకడంలో ఆంతర్యమేమిటి? అదే లాజిక్ ఇప్పుడు చదువరిగారు హిందువుల తీవ్రవాదంలో వెతకడానికి ప్రయత్నిస్తుంటే అది ముఖ్యం కాదనే విధంగా వ్యాఖ్యానించడం ఎందుకు?
ఇదే కొలమానం కాష్మీరు సమస్యకి అన్వయించినా, గర్హనీయమైన, అమానవీయమైన తీవ్రవాదంతో కాష్మీరుని దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్న వాళ్ళని అణచకుండా, కాశ్మీరుని ఇచ్చేస్తే ఆ అమానుష చర్యలకి లొంగిపోవడమని మీకనిపించ లేదా?
ఈ విషయాన్ని ఆలోచిస్తే నా కనిపిస్తున్నది ఏమిటంటే, మీరు కాని, నేను కాని, చదువరిగారు కాని తీవ్ర(హింసా)వాదాన్ని తీవ్రంగా ఖండిస్తున్న వాళ్ళమే. హింసా మార్గం తప్పని అందరమూ అంగీకరించే వాళ్ళమే. కానీ అలాటి తీవ్రవాదానికి పాల్పడుతున్న వాళ్ళ మీద ఒకో వర్గం వాళ్ళ మీద ఒకోరికి సానుభూతి ఉంది. ముస్లిం తీవ్రవాదుల మీద మీకు, హిందూ తీవ్రవాదుల మీద చదువరి గారికి నాకూను. సానుభూతి ఉన్నంత మాత్రాన వాళ్ళని సమర్ధిస్తునామని కాదు. వాళ్ళు తీవ్రవాదానికి పూనుకోవడంలో బాహ్య ప్రేరకాలని(External factors) వెతుకుతున్నాం. ముస్లిం తీవ్రవాదానికి మీరు External factors వెతికితే, చదువరిగారు హిందూ తీవ్రవాదానికి వెతుకుతున్నారు. అదీ తేడా. సహజంగా ఈ వెతుకులాటలో ఒకరిపై ఒకరు కారణాలు మోపడం జరుగుతోంది. అబ్రకదబ్ర గారన్నట్టు కోడి ముందా గుడ్డు ముందా అన్న సమస్యలా తయారవుతోంది. దీని వల్ల మన మన ఆవేశలు చల్లార్చుకొనే ఒక channelగా బ్లాగులని వాడుకోవడమే కాని దీన్నుంచి ఎవరూ ఏదీ గ్రహించే అవకాశం ఉందని నాకనిపించటం లేదు. దీని బదులు, ఈ సమస్యలని పరిష్కరించడానికి మార్గాలేవిటో అన్వేషిస్తే బాగుంటుందని నా భావన. దీనికి మూలాలు తెలుసుకోనక్కరలేదా అంటే ఏమో నేను ఖచ్చితంగా చెప్పలేను కాని, మూలాలని పక్కన పెట్టి, పరిష్కారాలు వెతికే దిశగా ప్రయత్నం ఎందుకు చెయ్యకూడదు? అందరం కోరేది ప్రజలందరూ సుఖ శాంతులతో జీవించాలనే కదా. ఇది ఎలా సాధ్యమవుతుంది అని ఆలోచించలేమా? పరిష్కారం నిజంగా మన చేతుల్లో లేక పోవచ్చు, కాని కనీసం దాని గురించి అందరం ఒక ఏకాభిప్రాయానికి వస్తే అలా వచ్చామన్న సంతృప్తి మిగులుతుంది. అప్పుడందరం కలిసి దాన్ని ఆచరణలోకి తెచ్చే ప్రయత్నమూ చెయ్యవచ్చు.
ఏమంటారు?

అబ్రకదబ్ర said...

కామేశ్వరరావుగారు,

వందేమాతరం విషయంలో మీరూ నేనూ ఇద్దరమూ కరెక్టే. అది బెంగాలీ, సంస్కృతం మిళితం చేసి రాయబడ్డ గేయం. బంకించంద్ర ఛటోపాధ్యాయ బెంగాలీ కావటం, అది మొదటిసారిగా ఓ బెంగాలీ నవల (ఆనందమథ్) లో 'బందేమాతరం' పేరుతో ప్రచురించబడటం, అందులో సంస్కృతంకన్నా బెంగాలీ పదాలు ఎక్కువ ఉండటం, తదితర కారణాలవల్ల దాన్ని బెంగాలీ గేయంగా నేను పేర్కొన్నాను.

nagaprasad said...

@అబ్రకదబ్ర గారు,

వందేమాతరం, జనగనమణ చిన్నప్పుడు స్కూళ్లో చదువుకున్నాం సరిగా గుర్తులేదు అనేవాడికీ, "నేను పాడను" అనే వాడికీ తేడా లేదంటారా?

అబ్రకదబ్ర said...

తేడా ఉంది. ఒకడు తెలివిగా తప్పించుకునే లౌక్యుడు, రెండోవాడు మొండిగా మాట్లాడే మూర్ఖుడు. మొత్తమ్మీద ఇద్దరూ దేశభక్తితో ముడిపడ్డ గేయాన్ని అవమానించేవారే. ఒకడు పరోక్షంగా, మరొకడు ప్రత్యక్షంగా - అదీ తేడా.

చంద్ర మోహన్ said...

@అబ్రకదబ్ర గారు,

"అది మొదటిసారిగా ఓ బెంగాలీ నవల (ఆనందమథ్) లో 'బందేమాతరం' పేరుతో ప్రచురించబడటం, అందులో సంస్కృతంకన్నా బెంగాలీ పదాలు ఎక్కువ ఉండటం, తదితర కారణాలవల్ల దాన్ని బెంగాలీ గేయంగా నేను పేర్కొన్నాను."
మొండిగా వాదించడం అంటే ఇదే. ఆ గీతం మీరు చెప్పినట్లు బెంగాలీ నవల్లో వచ్చింది. బెంగాలీలు కనుక 'వ ' పలకలేక 'బ ' అనడం నిజమే. ఐతే అందులో సంస్కృతం కన్నా బెంగాలీ పదాలు ఎక్కువ అని ఏ ఆధారంతో అంటున్నారు? నాక్కొంత సంస్కృతం తెలుసు, కామేశ్వర రావుగారికి అంతకంటే ఎక్కువే తెలుసని నా నమ్మకం. అందులో ఒక్కటి కూడా సంస్కృతేతర పదం లేదు. అది నూటికి నూరు పాళ్ళూ సంస్కృత గీతమే. బాంబులేసిన ముస్లింలు తీవ్ర వాదులా, అమాయకులా అన్న సబ్జక్టివ్ ఆర్గ్యుమెంట్లలో ఎవరిమాటా వినకుంటే మానె, కనీసం భాష, సాహిత్యం వంటి ఆబ్జెక్టివ్ విషయాలలోనైనా పిడివాదం మాని నిజాన్ని అంగీకరించండి. కుదరదంటారా, ఇక చెప్పడానికేమీ లేదు :-)

Anonymous said...

అబ్రకదబ్ర గారు @ కామెంట్ #32,
కామెంట్ #23 లో మీకు మీరే చెప్పుకున్న ప్రకారం మీరు ఏ విధంగా అవమానించిన వారు అవుతారు ?

- Shiv.

Anonymous said...

కత్తి మహేష్ కుమార్ గారు,
గత 24 గంటలలో మీరు, నేను, ఇంకొక అనానిమస్ చేసిన వ్యాఖ్యలు అదృశ్యమయినట్లు ఉన్నాయి ? నా దగ్గర ఆ వ్యాఖ్య backup కూడా లేదు. జీసస్ చేసే పని (Jesus saves) నేను చెయ్యక పోవడం వలన ఎంత నష్టం ? మళ్ళీ తిరిగి అంత పెద్ద వ్యాఖ్య రాసే ఓపిక కూడా లేదు.

నిన్న నా తరువాత రెండు వ్యాఖ్యలు చేసిన అనానిమస్ గారు,
మీరు కనీసం మీ పేరన్నా రాసి ఉంటే బాగుండేది ... మీరు వ్యాఖ్యలు రాసిన శైలితో కూడా నేను పూర్తిగా ఏకీభవించను.

- Shiv.

కత్తి మహేష్ కుమార్ said...

@శివ్: ప్రస్తుతం మీరు లేవనెత్తిన ప్రశ్నలు,నా అవగాహనా రాహిత్యం గురించి మీరు చూపిన ఆధారాలకు సవివరంగా సమాధానం చెప్పగలిగే సమయం నా దగ్గర లేకపోవడంతో ఆలస్యమవుతోంది. ఈ తరుణంలో అనానిమస్ వ్యాఖ్యలు నాకు చాలా అభ్యంతరంగా తోచాయి. అందుకే ఈ అనామక వ్యాఖ్యాత వ్యాఖ్యలకు కారణమవుతున్న కామెంట్లను నేను డిలీట్ చేసాను.

మీ కామెంట్లు నా దగ్గర సురక్షితంగా ఉన్నాయి.నేను జీసస్ చేసే పని చేసానులెండి. మళ్ళీ మీరు కష్టపడక్కరలేదు. త్వరలో మళ్ళీ ఆ వ్యాఖ్యలు నా బ్లాగులో ప్రత్యక్షమవుతాయి.

నా అవగాహనా రాహిత్యాన్ని,అనాలోచిత వ్యాఖ్యల్నీ ఒప్పుకోకుండా వితండం చేసే ఆలోచన నాకు లేదు. తప్పును ఒప్పుకోవడంలో నాకు ఏమాత్రం సంకోచాలు లేవు.

Anonymous said...

మహేష్ గారూ,

మీకు అవగాహన లేనప్పుడు అనాలోచితంగా ఎందుకు రాయాలి? అది జనాల్ని పక్కదోవ పట్టించడం కాదా? నేను రాసినది తప్పే అని పబ్లిగ్గా చెప్పకుండా సైలెంటుగా కామెంటుని ఉపసంహరించుకుంటే, అది అతితెలివి అవుతుందేగానీ, సంకోచాల్లేకపోవడం అవ్వదు. మీరొక counter argument ని వెతుక్కునేదాకా శివ్ గారి కామెంట్లు పబ్లిష్ చెయ్యనని అనడం కూడా అతి తెలివే. మొదట జనాల్ని ఆ కామెంట్లు చదవనివ్వండి. అవి చదివి జనాలు కళ్ళు తెరుస్తారనే భయం మీకు లేకపోతే వాటిని దాచెయ్యడం ఎందుకు?

- గణేష్

కత్తి మహేష్ కుమార్ said...

@గణేష్:నేను రాస్తున్నది బ్లాగు.పత్రికకాదు.దీని ఉద్దేశం నా ఆలోచనల్ని పంచుకోవడం,ఆసక్తి ఉన్నవారు చర్చల్లో పాలుపంచుకోవడానికి మాత్రమే. కాబట్టి,మీ అభియోగాలైన జనాల్ని ఉద్దరించడమో/కళ్ళుతెరిపించడమో లేక పక్కదోవపట్టించడం వంటి చెల్లవు.

నేను రాసినవాటిల్లో కొన్ని factual errors ఉన్నా,మూల ఉద్దేశానికి సంబంధించిన ఆధారాలు సెకరించే సమయం ఇప్పుడు లేక..మీ "దమ్మున్న" భాషని సహించలేక ఈ పని చెయ్యాల్సొచ్చింది.

ఐతేగీతే ఈ మొత్తం విషయంలో శివ్ కు సమస్యుండాలేగానీ,మధ్యలో మీ బాధేమిటోనాకైతే అర్థం కావటం లేదు. My stand on this issue is very clear.

Harry said...

వాడి వేడి వ్యాఖ్యలు, ప్రతి వ్యాఖ్యలు విన్నాక ఒక విషయం బాగా అర్ధం అయింది. జరిగిన సంఘటనకి మీ అభిప్రాయాలని అన్వయిస్తున్నారు. మనిషిగా అలోచించండి. జరిగిన సంఘటన గర్హనీయం. అది ఎవరు చేసినా సరే.దానికిమూలం ఏదైనా సరే. దాన్ని అలాగే చూద్దాం. కులమతాలకి అతీతంగా మనుషులుగా ఖండిద్దాం.

అబ్రకదబ్ర said...

చంద్రమోహన్ గారు,

కామేశ్వరరావు గారికీ, మీకూ తెలిసినంత బాగా నాకు సంస్కృతం తెలిసుండకపోవచ్చు. అయితే, అది బెంగాలీ గీతమేనని మొండిగా వాదించటానికి నేను బెంగాలీని కాదు కదా. అదే భాషా గీతమయినా నాకు వచ్చేదీ, పోయేదీ ఏదీ లేదు.

వందేమాతరం గురించి నాకు చిన్నప్పట్నుండీ తెలిసిన సమాచారం నేను పంచుకున్నాను. అది బెంగాలీ, సంస్కృత భాషల్లో రాయబడిందనేదానికి రుజువుగా నేను కొన్ని లంకెలు ఇస్తాను చూడండి:

వికీపీడియా

మరో లంకె

సరిగా చెప్పాలంటే, సంస్కృతీకరించబడ్డ బెంగాలీలో రాయబడింది వందేమాతరం. అంతమాత్రాన అది సంస్కృత గీతం ఐపోతుందా? త్రిమూర్తుల కృతుల్లోనూ, తిక్కన వంటివారు రాసిన తెలుగు కావ్యాల్లోనూ సంస్కృత పదాలు విరివిగా దొర్లాయి కాబట్టి అదంతా సంస్కృత సాహిత్యం అంటున్నామా? వందేమాతరానికీ అదే వర్తిస్తుంది.

chandramouli said...

మనకి సెక్యూలర్ మాటల రుచి బాగా వంట బట్టినట్టుంది....

సెక్యూలరిజం పాటించే వాళ్ళు మతాన్నే కాదు తరతరాలుగా వస్తున్న సొంత డబ్బా వేసుకునే తత్వం, బద్దకం, వంటివి వదిలేస్తూ , నమ్మకం , నిభద్దత,తర్కం వంటి ఎన్నో అధునాతన నాగరిక భావలు తమ దైనందిన జీవితంలో జొప్పించుకుంటారు.... ఇప్పుడూ సడన్ గా వచ్చి అందరం సెక్యూలర్ ఆలోచనలు చేద్దాం అంటే...పునాదుల్లేని భవనం మయబ్రహ్మ కట్టినా కూలిపోవటం తధ్యం.......ఇలానే మైనారిటీ మూఢత్వంతో ముందుకుపోతే ఇంకోసారి సొంతవారి(హిందువులు కాని వారు) చేతిలో బానిసత్వం చవిచూడాల్సిరావచ్చు.....

- మిగిలిన మతస్తులు చూపిస్తున్నా చాందసాలు ఎందరిని హింసించిన పట్టించుకోని సెక్యూలర్లు, సొంత మతం తప్పు మొదలెట్టగానే విరుచుక బడటం ఎంత న్యాయమో అర్దంకాదు. సహజంగా ఈ సెక్యూలర్లు అందరూ సొంత మతం తప్పు చేస్తే విశ్లేషణ ఒకరకంగా , పక్క మతం చేస్తే ఒక రకంగా ఉంటుంది... ఎందుకంటే బాహ్యంలో మతాన్ని విడిచినా అంతరంలో ఎలా విడవాలో తెలియకపోవడమే ...అంటే ఒప్పుకునే వారు ఎంతమంది ఉంటారో....

అదంతా ఒక పెట్టు అయితే,ఈ దిక్కుమాలిన మతాభిరుచి ఒకటి, ఎందుకయ్యా నీకు మతం మారితే అంత మంట అంటే ...మన సంఖ్య తగ్గిపోదూ అని ఒకరు, అది దారుణం అని ఒకరు, ఎవరు మతాన్ని వారు గౌరవించుకోవాలి గాని పక్క మతంలోని జనాలకోసం పాకులాట ఏంటయ్య అని ఎవరికి తొచిన వడ్డన వారిది. ఇంకొంచెం ముందుకు పోయి బలవంతపు మత మార్పిడులు అని పేరు... అవి బలవంతపు మత మార్పిడులు కాదు, లావదేవీలు,ఉదా:(నీళ్ళూ,చదువు,వైద్యం,ఇళ్ళూ, ప్రజలవద్దకు దేవుడు, సమాజంలో తేడాలు ఇలా బోలేడు, అందులోంచి చిన్నదిగా కనపడే ముఖ్యమయినది నీరు..) నీటి కొరత వున్న ప్రాంతంలో నీళ్ళ పంపు వేయించి క్రైస్తవులకొరకు అని రాస్తారు.. దాహమయిన వారికి నీళ్ళు ఇచ్చరు అని సెక్యూలర్లు అంటే, మా మతం వారికి ఎర జూపారు అని చాంధసులంటుండే.... అదేదో నీళ్ళ పంపు లేక పోవటం నిత్యవసర వస్తువులు చేతికి అందకుండా పోవటమ్ వల్లన అని, దాని వలన మతమార్పిడులకు పాల్పడుతున్నారు అని తలంచరు, అవి వారికి అందటానికి ఈ మెజారిటీలు చందాలో,బృందాలో పోయి వారికి చేయూతనిస్తే పోయే దానికి ....రేపులు చేసి, మసీదులు , చర్చీలు కూల్చీ హిందూ చైతన్యం తీసుకువస్తాం, మతం స్తిరత్వం తీసుకువస్తాం ఎలా అనుకున్నారో/టున్నరో నాకు అంతు బట్టటం లేదు. దానికి తోడు, ఆకలితోనో వ్యాధులతోనో మూలన పడ్డపుడు గుర్తురాని సాటి హిందువులందరు మత మార్పిడులప్పుడు మాత్రం గుర్తొస్తారో చెప్పటం కష్టం, బీహార్లో వేల మంది హిందూ సోదరులు (పక్క మత సోదరులు కూడాను) కష్టాల్లో ఉన్నారు వారికి మత పెద్దలు , మత చాందసులు సహయ పడ్డట్టూ ఏ మీడియా చెప్పదు (చేసారేమో నాకు తెలియదు). వారిని కాపాడటానికి గుంపులు గుంపులుగా రైళ్ళూ బస్సులు వేసుకుని ఎందుకు వెళ్ళరు ప్రాణాలు కాపాడటం హీరోఇజంలాగా కనబడదేమో వీళ్ళకు, ప్రాణాలు తీయడమే హీరోఇజమా మతాన్ని కాపాడటమేమో...నా బొంద.....(ఈ సన్నాయి నొక్కులు సర్వమత చాందసులకు చెందును) నాకు అర్దంకాదు, చాందసులను వెనకేసుకొచ్చే వాళ్ళందరుకూడా కనీసం వారి వారి మత సోదరులకు ఎంత సహాయం చేస్తున్నారో చర్చించుకుంటే మంచిది...

తప్పులు అందరు చేస్తారు, మళ్ళీ మళ్ళీ చేసే వాడు మూర్ఖుడు, తప్పు తెలుసుకునే వాడు నాగరీకుడు....అంతకు మించి చెప్పటానికి ఇంకేమీ మిగల్లేదు...

Anonymous said...

కత్తి మహేష్ కుమార్ గారు,

నా వ్యాఖ్యను ప్రచురణ నుండి తొలగించిన విషయంలో నా అభిప్రాయాన్నే గణేష్ గారు ఇంకా కొంచెం గట్టిగా చెప్పారు. ఆ వ్యాఖ్యను అలాగే ఉంచితే మీరు మీ రిసెర్చి చేసే లోపు ఇతరులు కూడా ఒక చెయ్యి వేసే అవకాశం ఉండేదని నా ఉద్దేశ్యం. ఉదాహరణకి నా వ్యాఖ్యలో ఒక విషయంలో చదువరి గారి సహాయం కోరాను. అది ఆయన చూసి ఉంటే ఈపాటికి స్పందించి ఉండేవారు కదా. ఇక అనానిమస్ వ్యాఖ్యలు, ఘాటైన వ్యాఖ్యలు అంటారా, మీరు ఘాటైన విషయం గురించి రాసేటప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు వినడానికి సిధ్ధంగా ఉండాల్సిందే అని నా అభిప్రాయం.

ఇక పోతే ఒక బ్లాగర్కి బ్లాగులో రాసే విషయాన్ని ఎంచుకోవదానికి ఉండే స్వాతంత్ర్యం ఆ విషయాన్ని గురించి వివరించేటప్పుడు factual inadequacies చొప్పించడానికి ఉండదని అనుకుంటున్నాను. ఉదాహరణకి, కౌరవులు మంచి వారు అని రాస్తే అది మీ అభిప్రాయం, అలా రాయడం మీ ఇష్టం. కాని కౌరవులు 200 మంది అని రాస్తే అది factual error అవుతుంది. బ్లాగ్ లోకంలో కొంత ఫ్యాన్ following ఉన్న మీ లాంటి వారి బ్లాగ్ విషయంలో మరింత జాగ్రత్త వహించడం మంచిది (మీరు ఏ విషయం గురించి రాసినా, అద్భుతం, అమోఘం అని వచ్చే వ్యాఖ్యలే అందుకు సాక్ష్యం. వాళ్ళలో కొంత మంది మీరు రాసిన విషయం పూర్తిగా సరైనదా, కాదా అని ఆలోచించకుండా దాన్ని గుడ్డిగా నమ్మవచ్చు కూడా).

కుప్పలు తెప్పలుగా బ్లాగులు పుట్టుకొస్తున్న ఈ కాలంలో రోజుకి 100 హిట్స్ దాటితే ఆ బ్లాగును ఒక చిన్న సైజు వార్తాపత్రిక/మాగజైను (ఆ బ్లాగులో ఉండే విషయాన్ని బట్టి) గానే అనుకోవాలి. అటువంటి బ్లాగర్లు వాళ్ల బ్లాగుల విషయంలో, వారు చేసే వ్యాఖ్యల విషయంలో కొంచెం బాధ్యతాయుతంగా ఉండాలని నా భావన.

ఇక చర్చల విషయం అంటారా, మనం చేసే argument లో honesty, integrity, kindness, respect for others అనే లక్షణాలు ఉండాలని నేను నమ్ముతాను. మీరు కూడా దీనితో ఏకీభవిస్తారని అనుకుంటున్నాను.

చర్చ పక్కదారి పట్టింది. ఇంతటితో ఈ వ్యాఖ్య సమాప్తం.

- Shiv.

కత్తి మహేష్ కుమార్ said...

@శివ్: ఘాటైన వ్యాఖ్యలకు నేనెప్పుడూ సిద్దమే. కాకపోతే గణేష్ వ్యాఖ్యలు (నా)సభ్యత సహనాన్ని దాటాయి. అందుకే వాటిని తొలగిస్తూ దానికి మూలమైన మీ కామెంట్ ని తొలగించాల్సివచ్చింది. మీరు పై వ్యాఖ్యలో చెప్పినవాటి సహేతుకతను గుర్తించి మీరు నా ‘అసంబద్ద వ్యాఖ్యకు’ సమాధానంగా రాసిన వ్యాఖ్యని ఇతరుల కామెంట్ కోసం ప్రచురిస్తున్నాను.

శివ్ వ్యాఖ్య:

కత్తి మహేష్ కుమార్ గారు,

నేను ఇంతకుముందు రాసిన వ్యాఖ్యలో RSS కి ముందు 'హిందూ' అని తగిలించలేదు అన్నారు. ఒక పదం పట్టుకుని మీదకి ఎక్కేయ్యడమే! Out of context లో మాట్లాడడమే! ఎక్కడో విన్నట్లుంది కదూ ? నాకు మాత్రం గురువింద గింజ సామెత గుర్తుకి వచ్చింది.

మీరిచ్చిన సమాధానంలో RSS ని ఆడిపోసుకున్నారే కాని, SIMI మీద నేను చేసిన ఆరోపణలకి ఏ సమాధానం ఇవ్వలేదు. కాబట్టి అవన్నీ మీరు ఒప్పుకున్నారని నేను అనుకుంటున్నాను.
ఇక 'హిందూ' అన్నపదం నేను ఎందుకు తగిలించలేదు ? SIMI కి 'ముస్లిం' అన్న పదం తగిలించలేదు కాబట్టి. మీరు చెప్పినట్లే RSS హిందూ జాతీయ వాద సంస్థ అయితే SIMI ముస్లిం మత వాద సంస్థ. ఇప్పుడు సరి పోయిందా ?

మీరు తెలుసుకుంటానంటే RSS హిందూ జాతీయ వాద సంస్థ ఎలా అయిందో చెపుతాను. వాళ్లు నమ్మేది హిందుత్వాన్ని ఒక మతంగా కాదు. ఒక జీవన విధానంగా. దీన్నే Integral Humanism అంటారు. మీకు ఇంక వివరాలు కావాలంటే దీన దయాల్ ఉపాధ్యాయ గారిని చదవండి.

ఇంకా మీరు రాసిన ఆరోపణల పట్టిక :
౧. మహాత్మా గాంధీ హత్య - RSS ఎప్పుడు గాడ్సే చర్యలని సమర్ధించలేదు. కోర్ట్ ముందు గాడ్సే ఇచ్చిన వాంగ్మూలం లోనే ఈ విషయం తెలుస్తుంది.
౨. గుజరాత్ అల్లర్లు - ఇందులో RSS పాత్ర ఏమిటి ? అసలు గుజరాత్ అల్లర్లు ఎందుకు మొదలయ్యాయో మీకు గుర్తుందా ?
౩. జమ్మూ గొడవలు - దేని గురించి ? ఇందులో RSS పాత్ర ఏమిటి ? అమర్నాథ్ స్థల సమస్య గురించి మాట్లాడుతున్నారా ? అసలు ఆ సమస్య ఎందుకు ఉత్పన్నమయిందో ఆలోచించారా ? జమ్మూ లో ఈ సమస్య గురించి శాంతియుత ఆందోళనలు, ఆత్మహత్యలు చేసుకున్నారు కాని ఏ విధంగా గొడవ చేసారు ? అసలు హిందువులు ఈ మాత్రం చెయ్యడానికి కూడా హక్కు లేదంటారా ఏమిటి ?
౪. బొంబాయి మారణ హోమం - ఇది ఎప్పడు జరిగిన సంగతి ? 1992 సంగతా ? అయినా అది హిందువులు మాత్రమే చేసారా ? అయినా అది చేసింది శివ సైనికులు అంటారే ? RSS వాళ్లా ? ఇంకా చెప్పండి వింటాను. బొంబాయి లో ఆ తరువాత జరిగిన మారణ హోమాలు (బాంబు బ్లాస్టులు) మీకు గుర్తుకు రావా ? అవి కూడా RSS వాళ్లు చేయించారంటారా ?
౬. కర్ణాటక లో చర్చి లపై దాడులు, ఒరిస్సా లో మాన భంగం - RSS వాళ్లు చేయించారా ? అయితే మన హోం మినిస్టర్ గారు RSS ని ban చేస్తానని అనకుండా భజరంగ్ దళ ని ban చేస్తానని ఎందుకు అంటున్నారో ?
౭. శూలాలతో దాడి - RSS వాళ్లు ధరించేది దండ (అంటే కర్ర). గుజరాత్ లో శూలాలు పంచి పెట్టింది VHP. తెలుసుకోండి. అయినా వాళ్లు పంచి పెట్టారు కాని వాటితో ఎవరి మీదా దాడి చేసిన దాఖలాలు ఇంత వరకు లేవు. ఉంటే కొంచెం తేది తో సహా చెప్పండి. తెలుసుకుంటాను.
౮. Organized Attack - RSS శాఖలు organized attack ని ప్రోత్సహించేవి కావు. అందులో కర్ర సాము (అది కూడా దేహ ధారుడ్యం పెంచుకోవడానికి మాత్రమే) ఒక్కటే కాదు. భారత దేశ సంస్కృతీ సాంప్రదాయాల గురించి, వేదాలు, పురాణాల గురించి అందరికి తెలిసేటట్లుగా కధలు చెప్తారు, ఆటలు ఆడిస్తారు. అసలు ఆ మాటకొస్తే పాకిస్తాన్ లోను, కాశ్మీర్ లోను, మహారాష్ట్ర లోను, తీవ్రవాద శిక్షణ ఇచ్చి హిందువులని చంపడానికి తోలుతుంటే, వాళ్ళని ఎదుర్కోవడానికి ఎవరన్న హిందువులకి శిక్షణ ఇస్తే తప్పేమిటి (మావోయిస్ట్ లని ఎదుర్కోవడానికి సల్వా జుడుం వాళ్ళకి పోలీసులే శిక్షణ ఇచ్చినట్లు).

హవాలా - మీకు దీని పేరు మాత్రం తెలిస్తే, నాకు దీని పుట్టు పూర్వోత్తరాలు, దీన్ని వాడేవారు, వాళ్ల వేషాలు, దీని ఎలా గుర్తించాలి, ఎలా అరికట్టాలి లాంటి విషయాలు చాలా బాగా తెలుసు. ఎందుకంటే, నేను పూర్వాశ్రమంలో SWIFT అనే సంస్థ కోసం పని చేశాను, నా వృత్తిలో భాగంగా money laundering, various ways (including hawala) అనే విషయంపై కొంచెం పరిశోధన చెయ్యవలసి వచ్చింది కాబట్టి.
ఈ క్రింది లింక్ క్లిక్కి పూర్తిగా చదివితే దీన్ని ఎవరు ఏ విధంగా ఉపయోగించుకున్తున్నారో మీకు కూడా బాగా అర్థం అవుతుందని భావిస్తున్నాను (గమనిక : ఈ లింక్ కి కూడా PTI అప్ప్రొవల్ లేదు :()
http://www.interpol.int/Public/FinancialCrime/MoneyLaundering/Hawala/default.asp
దురదృష్ట వశాత్తూ నాకు అమెరికా, కెనడా, బ్రిటన్ లో RSS హిందూ స్నేహితులు ఎవరూ లేరు. మీకు ఈ సంగతి చెప్పిన వాళ్ల వివరాలు ఇస్తారా ? కలుస్తాను.

భూపతి విహారి గారు, ఎమన్నా సహాయం చెయ్యగలరా ... మీరు ఈమధ్య ఏదో attend అయ్యారని విన్నాను (నన్ను తన్నడానికి మాత్రం రాకండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది ... అనవసరంగా మిమ్మల్ని ఇందులోకి లాగాను ... సరదాకి మాత్రమే అని గమనించ గలరు).

నేను rediff తో పాటుగా BBC, CNN, Wall Street Journal, New York Times లాంటివి కూడా చూస్తాను. వీటిలో ప్రచురించే వార్తలకు PTI approval ఉండదు. మరి ఇవన్ని చూడకూడదు అంటారా ? అసలు PTI అంటే ఒక News Agency కదా ? నాకు తెలిసిన దాని ప్రకారం News agency అంటే an organization of journalists established to supply news reports to organizations in the news trade: newspapers, magazines, and radio and television broadcasters. These are known as wire services or news services. వీళ్ళు approving authority ఎప్పుడయ్యారండి బాబు ? ఎంత హాస్యాస్పదం ? ఇండియా సంగతి ఏమో గాని ఇతర దేశాలలో ఇండియా కి సంబంధించిన వార్తలు తెలుసుకోవడానికి rediff మీద ఆధార పడేవాళ్లు అనేకమంది ఉన్నారు. వాళ్ళతో ఇలా అనకండి. బాధ పడతారు.
అసలు మీరు నేను ఇచ్చిన లింక్ క్లిక్కి, అందులో కనబడిన మొదటి hyperlink క్లిక్కి వార్త అడుగుకి వెళ్తే ఈ మెసేజ్ కనిపిస్తుంది.
© Copyright 2008 PTI. All rights reserved. Republication or redistribution of PTI content, including by framing or similar means, is expressly prohibited without the prior written consent.
అయినా అది ఈ లింక్ కి లేదు అంటారా ? ఇంకా నేను ఏమి చెయ్య గలను ? ఇదిగో PTI చే approve చెయ్యబడిన వార్త ... ఈ క్రింది లింకులో ...
http://www.hinduonnet.com/thehindu/thscrip/print.pl?file=2008092357100100.htm&date=2008/09/23/&prd=th&

ఇకపోతే, మీరి చదువరి గారి వ్యాఖ్య లోని ఈ వాక్యానికి సమాధానం ఇచ్చారనుకున్నాను.
"ఎప్పుడైతే ఉగ్రవాద నిందితులను రక్షించేందుకు విశ్వవిద్యాలయపు డబ్బులతో న్యాయసహాయం అందించబూనారో,
ఎప్పుడైతే లౌకికవాదులు ఈ న్యాయసహాయ చర్యను, సదరు మేధావిని సమర్ధించబోయారో,"
ఇందులో 'నిందితులు' అనే ఉంది కదండీ ?
చదువరి గారు, కొంచెం సహాయం చెయ్యండి.

సరే, మీరు పార్లమెంటు దాడి నిందితుడి గురించి మాట్లాడారా ? ఆయన పేరు అఫ్జాల్ గురు ఏనా ? కాకపోతే చెప్పండి. ఒక వేళ అయితే, ఆయన కోసం university లో జోలె పట్టి డబ్బులు సేకరించి న్యాయ సహాయం అందించారా ... అయ్యో, నేను ఒక నెల క్రితమే, ఆయన్ని ఉరి వెయ్య కూడదని, ఆయన కేసు కోర్ట్ లో నడుస్తున్నప్పుడు కనీసం లాయర్ ని కూడా ఇవ్వలేదని, NHRC కి అర్జీ పెట్టుకున్ననే ... వెంటనే వెళ్లి withdraw చేసుకోవాలి.

నాకు తెలియక అడుగుతాను, మీరు MCRC లో guest lectures ఇవ్వడానికి, మీకు నాకన్నాఎక్కువ authentic sources ఉండడానికి ఏమిటి సంబంధం ? MCRC లో ఇలాంటి రీసెర్చ్ ఎమన్నా చేస్తారా ? లేకపోతే, వారికి హోం మినిస్ట్రీ తో, సీక్రెట్ సర్వీసెస్ తో లింకులు ఎమన్నా ఉన్నాయా ?

చివరిగా, RSS, VHP ల aims and ambitions కలవకుండా వాటిని ఒక గాటన కట్టలేము అని నా అభిప్రాయం. సంఘ పరివార్ లో 30 సంస్థలు ఉన్నాయి. (ఈ లింక్ చూడండి ... PTI అప్ప్రొవల్ లేదు
http://en.wikipedia.org/wiki/Sangh_Parivar). ప్రతి సారీ అన్ని సంస్థల పేర్లు చెప్పలేక సంఘ పరివార్ అని పిలుచుకుంటున్నారు. United Nations అనే పేరు ఉన్నందువలన అందులో సభ్య దేశాలని ఒక గాటన కట్టలేము కదా ... UPA అనే పేరు ఉన్నందువలన అందులో ఉన్నా రాజకీయ పక్షాలని ఒక గాటన కట్టలేము కదా ...

- Shiv.

కత్తి మహేష్ కుమార్ said...

@shiv: 1992-93 గొడవలు శివసేన-బీజేపీ ఆద్వర్యంలో జరిగాయి నిజమే. కానీ, RSS భావజాలం దీనికి మూలం కాదంటారా? ఎంతైనా బీజేపీ RSS నుంచేపుట్టిందికదా!

RSS కి వచ్చే విదేశీ ఫండ్ గురించి ఈ సమాచారం చూడండి:
1. In America: India Development and Relief Fund (IDRF)

In America, RSS collects its fund through a ‘charitable’ organization called as India Development and Relief Fund. Sabrang Communications & Publishing Pvt. Ltd, Mumbai, India, and The South Asia Citizens Web notes:

The IDRF (India Development and Relief Fund) was set up as a tax-exempt, non-profit organization in 1989 under the provisions of section 501(c)(3) of the tax code. Its official, self-stated purpose is to raise money for organizations in India “assisting in rural development, tribal welfare, and urban poor.” According to its tax filings, the IDRF raised $ 3.8 million in the year 2000, of which it disbursed $1.7 million in ‘relief and development work.

However, this is how they have spent their money. “Nearly 70% of the IDRF funds go to organizations dealing with education (largely in adivasi/rural areas), hostels, 'shuddhi'/reconversion programs, and Hinduization efforts; about 8% goes for health and welfare work; 15% goes for relief work, and only 4% towards what is normally understood in the NGO world as rural development.”For example, one of its beneficiaries was The Vanvasi Kalyan Parishad of Swami Ashim Anand.

This same Swami Ashim Anand was identified as the main person behind forcible reconversion of Christians by the US State Department Report on International Religious Freedom. (Sources: http://www.state.gov/www/global/human_rights/irf/irf_rpt/1999/irf_india99.html and http://stopfundinghate.org/sacw/part4.html).

For the complete report on this visit The Foreign Exchange of Hate: IDRF and the American Funding of Hindutva.


1. In Europe: Sewa International UK (SIUK) and , Kalyan Ashram Trust (KAT, a registered charity, charity number 261327).

SIUK raised around £2.3 million for its India Quake Appeal from the UK public, though it also claimed to have raised £4.3 million in 2001. Awaaz — South Asia Watch Ltd notes: “ A document we obtained from sources in Gujarat shows how approximately £1.9 million raised by SIUK was to be used by Sewa Bharati in Gujarat. We also have grounds for believing that all of the approximately £2.3 million raised by SIUK during its India Quake Appeal was for Sewa Bharati, an RSS organization.” (Source: http://www.awaazsaw.org/ibf/section2.htm)

After receiving the foreign money, RSS chased out Christian NGOs accusing them of receiving foreign money."RSS does not want any organization from outside to come and carry out any relief work in Kutch. It does not want any NGO that received foreign funds to work in Kutch. It has decided to send all the NGOs out of Kutch within 15 days resorting to physical violence if they do not leave the place voluntarily. RSS has already begun using violence. In Adhoi, Kotada and Ratnal villages where Gantar [an NGO] is doing relief work, RSS workers (a large crowd of 2000 or more) went and threatened the volunteers…RSS accuses NGOs of receiving foreign funds [for] converting people to Christian religion" (http://www.ambedkar.org/News/RSSCreating.htm.)

Similar is the story of Orissa too. For the full report read http://www.awaazsaw.org/ibf/index.htm

1. IDRF and Sewa International UK is collecting money for Bihar Flood Relief!!!

IDRF has collected money for Tsunami and is now collecting money for Bihar flood relief (http://www.idrf.org/dynamic/modules.php?name=Hnnews&file=article&sid=194).

Similarly Sewa International UK is also collecting money now for Bihar flood relief (http://www.sewainternational.com/)

నేను MCRC తరచూ వెళ్ళివస్తుండటం వల్ల, అక్కడి ముస్లిం మెధావులూ,టీరర్లతో కొన్ని చర్చల్లో పాల్గొనడం జరుతుంది. అందుకే నా సమాచారం authentic కాకపోయినా,మరో(సాధారణంగా తెలియని)కోణంలోంచీ మాత్రం ఖచ్చితంగా ఉంటాయని చెప్పగలను.JMI is a hub of Muslim intelligentsia కాబట్టి మనకు హిందువులు అర్థం చెసుకోలేని కొన్ని ముస్లిం డైనమిక్స్ గురించి అక్కడతప్ప వేరే స్థలంలో తెలుసుకోవడం నాకు కుదరలేదు.

Anonymous said...

కత్తి మహేష్ కుమార్ గారు, సంతోషం.

కాకపోతే ఒక disconnect. నేను మీయొక్క ఏ వ్యాఖ్యకి అయితే ఇంత పొడుగు ప్రతి వ్యాఖ్య చేసానో, ఆ వ్యాఖ్యని కూడా, అదే వరుసలో (order) ప్రచురిస్తే బాగుంటుంది.

- Shiv.

కత్తి మహేష్ కుమార్ said...

శివ్ ఆగ్రహానికి గురైన నా అసంబద్ధ వ్యాఖ్య:
@శివ: RSS ఉత్త జాతీయవాద సంస్థకాదు,"హిందూ" జాతీయవాద సంస్థ. అంటే,ఇదీ మతపరమైన సంస్థే.
మహాత్మాగాంధీ హత్య నుంచీ,గుజరాత్ అల్లర్లు,జమ్మూ గొడవలూ,బొంబాయి మారణహోమం,కర్ణాటకలో చర్చులపై దాడులు,ఒరిస్సాలో మానభంగాలవరకూ వీరు తమకు వచ్చినడబ్బుతో చాలా చట్టపరమైన పనులు చాలా చేస్తుంటారు. వీరు శూలాలతో దాడి,ముస్లింలపై ఆర్గానైజ్డ్ అటాక్ కు సంబంధించి ఇచ్చే ట్రెయినింగ్ కు మీరడిగితే లెక్కలు కూడా చూపిస్తారు.

అసలు 'హవాలా' అనే పదం మీరెప్పుడైనా విన్నారా? వినకపోతే, మీరు అమెరికా,కెనడా,యూకేలో ఉంటే ఎవరైనా RSS తో సంబంధమున్న హిందూ మిత్రుడిని రహస్యంగా డబ్బెలా పంపాలో అడిగిచూడండి.వీళ్ళకి చట్టబద్దంగా ఎంత డబ్బొస్తుందో తెలిసిపోతుంది.

నా knowledge sources NDTV లాంటి ఛానల్స్, అని ఎద్దేవా చేస్తూ మీరు చూపిన ఉదాహరణ PTI చేత అప్రూవ్ కూడా కాని rediff వార్త. ఇది ఎంత హాస్యాస్పదమో తెలుసా? అయినా చదువరి అక్కడ మాట్లాడింది పార్లమెంట్ బాంబుదాడి "నిందితుడి" గురించి. "నిందితులు" అని చెప్పుంటే నేను JMI గురించి చెప్పుండేవాడిని. మీకు విషయం తెలీదేమో, నేను జామియా మిలియా ఇస్లామియాలో ఉండే,MCRC (mass communication research center) కి గెస్ట్ లెక్చర్స్ ఇవ్వడానికి వెళ్తాను. I have more authentic sources than what you have in hand.

చదువరి బ్లాగులో కూడా RSS-VHP ని ఒకగాటన కట్టినందుకు నా sources ప్రశ్నార్థకం అన్నావు. "సంఘ్ పరివార్" అనే పేరు ఎప్పుడైనా విన్నావా? RSS,VHP,బజరంగ్ దళ్ వంటి హిందూఅతివాద సంస్థల్ని కలిపి సంఘ్ కుటుంబంగా వ్యవహరిస్తారు. మరి వార్ని ఒకగాట కట్టక, ఎక్కడ పెట్టమంటారు?

కత్తి మహేష్ కుమార్ said...

@శివ్: నేను పైన వివరించిన అమెరికా,కెనడా,యూకే ల అధారాలు కాక,RSS-VHP గురించి "హవాలా" అనే పదం mainstream media లో ఉపయోగించబడిన ఆధారం ఇక్కడ:
"he police had already arrested some Rashtriya Swayamsevak Sangh (RSS) workers in connection with the attack on Hameed. But none was yet to be arrested in connection with the killing of Lakshmanan.

The Home Minister said the financial sources of the communal forces, including the NDF and the RSS, would be investigated.

According to him, there were reports about such forces taking recourse to hawala money and fake currency. Mr. Balakrishnan said strong action would be initiated against those giving armed training for communal attacks in the district.
(http://www.hindu.com/2007/03/26/stories/2007032602470700.htm)

Anonymous said...

మహేష్, చదరంగంలో ఒకే ఎత్తు వరసగా మూడోసారి వేస్తే ఇక డ్రా అయినట్టనుకుంటా. అలాగే అబ్రకదబ్రదీ, నాదీ -వాదనలు ఒకే పద్ధతిలో జీళ్ళపాకం సాగినట్టు సాగడం ఎప్పుడు మొదలయ్యాయో.., అప్పుడిక వాదించనక్కరలేదని అర్థం చేసుకుని ఇక వ్యాఖ్యానించవద్దనుకున్నాను. ఈలోగా భైరవభట్ల గారు రాసారు, సరిపోయింది.

అయితే మీ వ్యాఖ్య చూసాక మళ్ళీ ఓ ముక్క రాయాలనుకున్నాను. ఈలోగా రభస జరిగి, మీరేమో వ్యాఖ్యల్ని తీసేసి, మళ్ళీ పెట్టేసి గందరగోళం చేసారు :) (ఎవరి వాదన ఏంటో, ఎవరి వ్యాఖ్య ఏదో తెలీకుండా పోయింది. నా వాదనేంటో కూడా మర్చిపోయాను :) ) నేను చెప్పింది మాత్రం ఒకటే.. ఢిల్లీ పేలుళ్ళలో పట్టుబడ్డ ఆ ఇద్దరు కుర్రాళ్ళ గురించే నేను మాట్టాడింది. అఫ్జల్ గురించి కాదు.

చంద్ర మోహన్ said...

@ అబ్రకదబ్ర గారూ,

మీరు ఇచ్చిన లింకులు చూశాను. ఆ వ్యాసాలు వ్రాసిన వారి భాషా పరిజ్ఞానమేమిటో తెలియడంలేదు. ఈ క్రింది లంకె చూడండి:
http://india.gov.in/knowindia/national_song.php

భారత ప్రభుత్వపు అధికారిక వెబ్ సైట్ ఇది.వందే మాతరంను సంస్కృత గీతంగానే పేర్కొన్నారు. "ముంజేతి కంకణానికి అద్దమెందుకు" అని సామెత. నాకు తెలిసిన భాష గురించి ఎవరో ఎందుకు చెప్పాలి, 'ఇది ఫలానా భాష' అని.

సంస్కృత పదాలున్నంతమాత్రాన ఒక తెలుగు పద్యాన్ని సంస్కృత పద్యం అని చెప్పలేము, నిజమే. ఐతే తెలుగు పుస్తకంలో ఉన్నంత మాత్రాన ఒక సంస్కృత పద్యాన్ని తెలుగు పద్యం అని చెప్పలేము కదా. ఆంధ్ర మహాభారతంలోని మొదటి పద్యాన్ని నన్నయ సంస్కృతంలోనే వ్రాశాడు. ఆంధ్ర మహాభారతంలో ఉంది కనుక అది తెలుగు పద్యమే అందామా!

ఐనా ఈ చర్చ వలన అసలు టపా విషయం మరుగున పడేలా ఉంది. నాకు తెలిసిన నిజం చెప్పాలనే చాపల్యమే తప్ప మీ చర్చకు అడ్డురావాలనే ఉద్దేశం నాకు లేదు. ఇక మీ ఇష్టం :-)

Anonymous said...

కత్తి మహేష్ కుమార్ గారు,

మీ sources నాకు, మిగతా బ్లాగ్ లోకానికి పరిచయం చేసినందుకు సంతోషం. అసలు విషయానికి వెళ్ళే ముందు ఒక చిన్న పిట్ట కధ. నేను స్కూల్ లో చదువుకునేటప్పుడు లెక్కలు చెప్పడానికి సుకుమార్ మాస్టర్ గారు వచ్చేవారు. ఆయన పరీక్షా పేపర్లు దిద్దే పద్ధతి ఇలా ఉండేది. ముందుగా ప్రతి పేపర్ కి 100 మార్కులు ఇచ్చేసేవారు. తరువాత ప్రతి జవాబులో ఎక్కడ తప్పులు ఉన్నాయో, ఎక్కడ పూర్తిగా రాయలేదో చూస్తూ, వాటికి మైనస్ మార్కులు ఇచ్చేవారు. చివరిగా మాకు ఇచ్చే మార్కులు, 100 నుంచి ఆ మైనస్ మార్కులు తీసేస్తే వచ్చేవి అన్నమాట. పిట్ట కధ సమాప్తం.

మీ sources కి 100 మార్కులతో మొదలు పెడుతున్నాను. ఒక రాత్రి నిద్ర పాడు చేసుకుని మీరు చెప్పిన వెబ్సైటులు అన్ని చదివాను.

1. మీరు నాకు ఇచ్చిన ఒక వెబ్సైటు లో కూడా, RSS వాళ్లు హవాలా మార్గం ద్వారా డబ్బులు భారత దేశానికి తరలిస్తున్నారని చెప్పే సహేతుకమయిన ఆధారాలు లేవు. ఇంక పైగా, ప్రతి వెబ్సైటు లోను వాళ్లు సేకరించిన డబ్బులకి లెక్కలు చెప్పడానికి చాలా effort ఉపయోగించారు. వీళ్ళు ఇంత పబ్లిక్ గా డబ్బుల లెక్కలు ఇస్తే, ఇంక హవాలా పద్ధతులని ఉపయోగించి రహస్యంగా పంపించే అవసరం లేదు కదా.

ఇంకా వాళ్లు బీహార్ వరదలకి, ఒరిస్సా వరదలకి డబ్బులు సేకరిస్తున్నారని మీరు ఆరోపించారు. దానిలో తప్పేమీ ఉందండి ?

2. http://stopfundinghate.org/sacw/part4.html :

మీరు ఇచ్చిన పేజి లో RSS వాళ్ళు డబ్బుని మత పునర్-మార్పిడికి వాడుతున్నారని చెప్పారు. నిజమే. అదే వెబ్ పేజి లో చివరి ఉండుకం (appendix H) లో వాళ్లు RSS సేకరించిన డబ్బుని ఖర్చు పెట్టిన సంస్థల లిస్టు, అది ఏ category లోకి వస్తుంది అనే విషయం ఒక పట్టిక లో ఉంచారు.
వారు మత పునర్-మార్పిడి సంస్థలుగా గుర్తించిన వాటిలో మచ్చుకి కొన్ని :

- ఆరోవిల్లె, పాండిచ్చేరి.
- చిన్మయ మిషన్.

ఇప్పటికైనా అర్ధం అయిందా ... ఈ రిపోర్ట్ రాసిన వాళ్ళకి హిందూ సంస్థల గురించి, అవి చేసే పనులగురించి కొంచమైనా విషయ పరిజ్ఞానం లేదని.

ఆంధ్ర ప్రదేశ్ లో RSS సహాయం పొందిన కొన్ని మత సంస్థలు (ఈ వెబ్సైటు ప్రకారం) :
- అన్నపూర్ణమ్మ విద్యార్ధి వసతి గృహం
- జన సంక్షేమ సమితి
- గ్రామ భారతి

ఇలాంటివి చూసే నవ్వు వచ్చింది.

అసలు వీళ్ళు ఎవరు, వాళ్ళతో మాట్లాడదాం అని చూసాను. ఈ రిపోర్ట్ స్పాన్సర్ చేసిన వాళ్లు ఇద్దరు.

- SACW France. వీళ్ళ వెబ్సైటు లింకు మీద క్లిక్కితే, ఈ పేరు మీద ఏమి లేదు అని రిపోర్ట్ వచ్చింది. http://www.mnet.fr/aiindex చూడండి. idrf_fx_report@yahoo.com కి మెయిల్ పంపిస్తే, సరైన ID కాదు అని జవాబు వచ్చింది.
- Sabrang Communications. వీళ్ళకి పనిచేసే వెబ్సైటు ఉంది. కాని About Us, Contact Us లింకులు క్లిక్కితే అసలు సమాచారమే లేదు. http://www.sabrang.com చూడండి. దీని నిండా జావేద్ ఆనంద్, తీస్తా సేత్లవాద్ రాసిన వ్యాసాలు ఒకటి.

అసలు చిరునామా లేని వాళ్లు రాసిన రిపోర్టులు ఎలా నమ్మగలమండీ ?

3. http://www.state.gov/www/global/human_rights/irf/irf_rpt/1999/irf_india99.html :
అమెరికన్ state department కి సంబంధించిన ఈ రిపోర్టు 1999 సంవత్సరం లో రాయబడింది. చాలా సమాచారం ఉంది కాని, RSS, IDRF వాళ్ల డబ్బు సేకరణ గురించి ఒక్క ముక్క కూడా లేదు. ఇది పైన చెప్పిన వెబ్సైటు లో ఏదో విషయానికి reference గా ఉపయోగించబడింది కాని, direct గా వాడింది కాదు.

4. http://www.awaazsaw.org/ibf/index.htm :

ఈ వెబ్సైటు సంగతి కూడా అంతే. ఈ వెబ్సైటు ని support చేసే వాళ్లలో ఒక Southall Black Sisters తప్పితే ఇంకెవరికి సరయిన వెబ్సైటు లు కూడా లేవు. మీరు క్లిక్కి చూడండి.

5. http://www.ambedkar.org/News/RSSCreating.htm :

ఇది BSP వాళ్ల unofficially official వెబ్సైటు. ఇందులో వచ్చిన News item అయితే కొంచెం నమ్మదగ్గదే అయి ఉంటుందని అనుకున్నాను. కాని ఇది కనబడింది.

DISCLAIMER : www.ambedkar.org does not represent or endorse the accuracy or reliability of any of the information/content of news items/articles mentioned therein. The views expressed therein are not those of the owners of the web site and any errors / omissions in the same are of the respective creators/ copyright holders. Any issues regarding errors in the content may be taken up with them directly.

మీరు ఉటంకించిన భాగం మాత్రమే కాకుండా, ఆ రిపోర్ట్ మొత్తం చదివాను. అంత సహేతుకంగా, నిష్పాక్షికంగా రాసినట్లు నాకు అనిపించ లేదు. ఆ రిపోర్ట్ రాసిన ఫాదర్ గారికి ఎవరో సాధువులు ఆయనకీ అర్ధం కాని భాషలో గట్టిగ మంత్రాలు చదువుతూ ఉంటే, అది క్రైస్తవ మత మార్పిడికి వ్యతిరేకంగా అరుస్తున్నట్లు అనిపించిందిట. అందువలన ఆయన ADB వాళ్ళకి గుజరాత్ కి అందించే ఆర్ధిక సహాయం నిలిపి వేయాలని కోరుతూ ఉత్తరం రాసారట. వీళ్ళు ఇలా కూడా చెయ్యగలరన్న మాట.

6. http://www.hindu.com/2007/03/26/stories/2007032602470700.htm :

మీరు ఉటంకించిన భాగం మాత్రమే కాకుండా, వార్త మొత్తం చదవండి. బాంబు బ్లాస్టులు జరిగిన ప్రతి సారి, ఉగ్రవాదాన్ని కూకటి వేళ్ళతో పెకిలించి వేస్తామని ప్రగల్భాలు పలికే మన దేశ హోం మంత్రి గారి మాతలలాగా లేవు ? ఇలాగ కాదు అనుకుని, కేరళ మలప్పురం (ఈ ఉదంతం జరిగిన ప్రదేశానికి చాల దగ్గర) వాస్తవ్యుడయిన నా క్రైస్తవ (మళ్ళి హిందువు అంటే పక్షపాతం అవుతుందేమోనని) మిత్రుడికి ఈ వార్త చూపించాను. కేరళ హోం మంత్రి గారు చెప్పిన విధంగా ఎలాంటి విషయాలు బయటికి రావడానికి అసలు అలాంటి ఎంక్వయిరీనే జరగలేదని చెప్పాడు. ఈ నాయకుడి మాటలు నమ్మవద్దని హితవు కూడా చెప్పాడు.

7. మిగతా వెబ్సైటులు :

ఇవన్ని RSS డబ్బు సేకరణ, అదీ సహేతుకమయిన కారణాలతోనే. ఈ విధంగా సేకరించిన డబ్బు మీరు చెప్పినట్లుగా హవాలా మార్గంలో భారత దేశానికి పంపుతున్నారని కాని, వాళ్లు చెప్పిన విషయం కోసం కాకుండా, హిందూ మత వ్యాప్తికి వాడుతున్నారని చెప్పడానికి సాక్ష్యాలు లేవు.

ఇన్ని మైనస్ మార్కులు పోయిన తరువాత మీ sources కి మిగిలే మార్కులు ఎన్నో నేను ప్రత్యేకంగా మీకు చెప్పనక్కర్లేదని అనుకుంటున్నాను.

BJP వాళ్ల RSS భావ జాలం గురించి : మీ తర్కం ప్రకారం మాట్లాడితే, JMI నుండి SIMI, IM కి సంబంధించిన ఉగ్రవాదులు కొంత మంది వచ్చారని అసలు JMI ది పూర్తిగా ఉగ్రవాద నేపధ్యం అని నేను వాదిస్తే మీరు ఏమంటారు ?

JMI లో ఉన్న muslim intelligentsia తో మాట్లాడం వలన మీకు మరొక కోణం అర్థమయిందని మీరు అన్నారు. వీరికి మీకు అర్థమయేలా తెలియ చేసిన ఇస్లాం కోణం తప్ప ఇంకొక కోణం తెలుసా అని నా అనుమానం ...

ఇంకా నేను నా వ్యాఖ్యలో SIMI పై లేవనెత్తిన విషయాలకు, మీ వ్యాఖ్య ని exaggerate, sensationalize చేస్తూ మీరు RSS పై మీరు విప్పిన ఆరోపణల చిట్టా పై నా వ్యాఖ్యలకి మీ నుంచి ఇంకా స్పందన లేదు. అందువల్ల ఈ విషయాలని మీరు ఒప్పుకున్నట్లు భావిస్తున్నాను.

- Shiv.

Anonymous said...

అయ్యా కత్తి మహేష్ కుమార్ గారు,

ఇప్పుడే మీ బ్లాగులో మీరు రాసిన కొత్త టపా చదివాను. నేను ఇంతకుముందు బ్లాగులు రాయడంలో నిష్పాక్షికత, సంయమనం గురించి నేను చేసిన వ్యాఖ్యలని సహేతుకం అంటూనే, మళ్ళి అలాంటి టపాలే రాస్తుండడం వలన నా శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరు, నా ఘోష చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లు అయిందని భావించాల్సి వస్తోంది.

అందువలన మీ బ్లాగులో ఇలాంటి టపాలకి నేను చేసే చివరి వ్యాఖ్య ఇదే. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం.

- Shiv.

భైరవభట్ల కామేశ్వర రావు said...

నేను రెండ్రోజుల కిందట రాసిన వ్యాఖ్య ఎందుకో కనిపించలేదు. మళ్ళీ పంపుతున్నాను.

చంద్రమోహన్ గారు,

అబ్రకదబ్రగారు చెప్పింది నిజమే. నేను సంస్కృత గీతం అని చెప్పింది, మనం National Songగా గుర్తించిన వందేమాతరం మొదటి రెండు చరణాలనీ దృష్టిలో ఉంచుకొని. అది మొత్తం సంసృతంలోనే ఉంది.
కాని అబ్రకదబ్రగారు మొత్తం మూల పాఠాన్ని గురించి అన్నారని తర్వాత clarify చేసారు. అందులో కొన్ని బెంగాలీ పదాలు లేకపోలేదు.

అబ్రకదబ్రగారు,
మీరన్నాట్టు మూలపాఠంలో చాలా బెంగాలి పదాలు లేవండి. నాకు తెలిసి "తుమి", "తొమరి" అన్న పదాలు తప్ప తక్కినవన్నీ సంస్కృత పదాలే.

మహేష్ గారు,
మీ టపాలకి వ్యాఖ్యలు రాయడం చాలా కష్టంగా ఉందండి. pop-up window తెరుచుకొని చాలాసేపటిదాకా hang అయిపోతోంది. నేను రెండు మూడు systemsలో ప్రయత్నించాను. నేరుగా టపా ఉన్న pageలోనే వ్యాఖ్య రాయగలిగంట్టు మీ settings మారిస్తే బావుంటుంది.

వర్మ said...

పైనుండి ఆరవ కామెంట్ కు నేను వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. నేను కొన్ని వ్యక్తిగత కారణాల వలన నెట్ కు చాలారోజులు దూరంగా ఉన్నాను కాబట్టి వివరణ వెంటనే ఇవ్వలేదు.

@భవాని : భవాని గారు మొదట శాంతించండి. మీకంత కోపం వచ్చే విషయం అక్కడ ఏముందో నాకు అర్థం కావటం లేదు. బహుషా ఒక స్త్రీపై హత్యాచారాన్ని నేను సమర్థించారని పొరబడి ఉంటారు. భవాని గారు మీరు సాటి స్త్రీకి నష్టం జరిగితే సమర్థిస్తారేమిటి అన్న కోపంతో 'నన్ను తగలబెట్టేస్తాను' అన్న తీవ్ర వ్యాక్యలు చేసి ఉంటారు. నేను చాలా బ్లాగుల్లో క్రైస్తవులు మత మార్పిడి చేయడాన్ని ఖండిస్తూ కామెంట్లు రాసాను. అంతమాత్రాన నేను క్రైస్తవులకు వ్యతిరేఖం కాదు, ప్రలోభపెట్టి మతమార్పిడులు చేసే క్రైస్తవులకు వ్యతిరేఖం. నేను ముస్లింలకు వ్యతిరేఖం కాదు, జీహాదీకోసం తమ మతస్తులను,ఇతరులకు చంపే నరమాంస భక్షక ముస్లింలకు వ్యతిరేఖం.

బవాని గారు,మహేష్ గారు వారు మారరు. ఖచ్చితంగా మారరు... మనల్ని పోలీసులు కూడా రక్షించరు... మరి మనందరం ఇలాగే బలైపోదామా !!! చెప్పండి... గోకుల్ చాట్ బండార్ లో చనిపోయిన వారిలో మీ బందువులో మా బందువులో ఉన్నారనుకొండి అప్పడు మీకేమనిపిస్తుంది. నేను హిందువులను జీహాదీలు చేయమనటంలేదు. దాడి చేయమనటం లేదు.. జవసత్వాలు లేని, వయసుడిగిన, చేతగాని వాళ్ళు అనే ముద్ర వేసుకోవద్దంటున్నాను. నేను వారిని ఏది తోచితే అది చేయమనటంలేదు. పాములాగా కరవకున్నా కనీసం బుసకొట్టమని నా అభిప్రాయం. హిందువులు అన్యమతస్తులపై దాడి చేసిన సందర్భాలు చాలా చాలా తక్కువ. కాశ్మీరులో ప్రతిరోజూ జరిగే జీహాదీ మారణకాండతో పోలిస్తే ఇది పట్టించుకోలేనంత చిన్నది. ఒరిస్సా సంఘటన వెనుక రాజకీయ కుట్రకూడా చాలా ఉన్నదని నా అభిప్రాయం. ఈ అభిప్రాయానికే తగలబెట్టేస్తామనటం భవాని తెలివితేటలకే వదిలేస్తున్నాను ...


మహేష్ గారు మీ బ్లాగు షెవల్రీ లభించదని తెలుసు కానీ భావప్రకటనా స్వేఛ్చకు తగిన గౌరవం కూడా లభించదా !!!!!! అయ్యో ........

కత్తి మహేష్ కుమార్ said...

@వర్మ: నా బ్లాగుల్లో సారవంతమైన చర్చలకి ఎప్పుడూ స్థానం లభిస్తుంది. కాకపోతే, కొన్ని వెర్రి వ్యాఖ్యలూ, తిక్కవేషాలకీ చికాకు చెంది కొన్ని వ్యాఖ్యల్ని తొలగించి కొన్నాళ్ళు బ్లాగుని మోడరేషన్లో పెట్టానేతప్ప అది భావప్రకటన స్వేచ్చపై నేను వేసిన గొట్టలిపెట్టు ఎంతమాత్రం కాదు.

నాబ్లాగులో నాతో విభేధించడం నేను ఆహ్వానిస్తానుగానీ, నన్ను అవమానించడం మాత్రం సహించను. ఆ మాత్రం ఆత్మగౌరవం లేకుండా ఇక్కడెవరూ లేరు. నిజానికి నాకున్నదే అది.

వర్మ said...

@మహేష్ : బహుషా నేను తరుచుగా RSS కార్యక్రమాలకు వెళుతుండటం వలననో మరే ఇతర కారణాల వల్లనో నేను హిందువులకు వ్యతిరేఖంగా ఏ వ్యాఖ్య వచ్చినా సహించను. ఖండిస్తాను..

ఇంతకీ మీరు భవానిగారు చేసిన వ్యాఖ్యను సమర్థించినట్టా లేక వ్యతిరేఖించినట్టా ????

కత్తి మహేష్ కుమార్ said...

@వర్మ:మీరు మొదట చేసిన వ్యాఖ్యలో, జిహాదీలు చంపేది హిందువులనే కాబట్టి హిందువులు కనీసం ఈ స్థాయిలో retaliate చెయ్యడం సమర్థనీయంగా చెప్పారు. భావానిగారి స్పందన దానిమీదే!

Mindless terrorism కి organized crime కి చాలా తేడా ఉంటుంది. జిహాదిల ఉద్దేశం, హింసద్వారా భయభీతుల్ని చెయ్యడం.వారికి హిందువుల్ని చంపాలా ముస్లింలను చంపాలా అన్న calculations లేవు. కానీ,బజరంగ్ దళ్ చేసింది ఒక organized crime of targeting a religious community on the name of "taking revenge".ఈ రెండురకాల హింసలూ ఖండనీయాలే!

మీరు హిందూఅతివాద హింసని సమర్థిస్తూ మాట్లాడేసరికీ భవానిగారు అలా వ్యాఖ్యానించారు. ఇక మీరు RSS మీటింగులకు వెళ్తామంటున్నారుకాబట్టి, ఈ నేరాల్ని వీరు ఎంత పకడ్బందీగా justifiable చేస్తున్నాయో అర్థమవుతోంది. నావరకూ, Even worst of non-violent provocations should not be met with violence.