Wednesday, October 1, 2008

ప్రియమైన శత్రువు

ఈ మధ్య బ్లాగులద్వారా పరిచయమైన ఒక స్నేహితుడు గూగుల్ చాట్లో "ఏంటిబాబూ! బ్లాగులద్వారా మిత్రులతోపాటూ, శత్రువుల్నికూడా బాగా సంపాదించుకున్నట్లున్నావు" అంటే, బహుశా నా టపాలకు వచ్చే కొన్ని ఘాటు వ్యాఖ్యల గురించి చెబుతున్నారేమో అనుకుని, "దాందేముందండీ, ఒక అభిప్రాయమున్నాక దాన్ని అందరు ఆమోదించాలని లేదుకదా. అందుకనే విభేధాలు జరుగుతుంటాయి. అప్పుడప్పుడూ విభేధాలుకాస్తా, వివాదాలవుతూ ఉంటాయి. అంతమాత్రానా శత్రువులైపోతారా!" అనేశాను.


కానీ దానికి ఆ మిత్రుడు తఠాలున ఒక లంకెపంపి "చూడు" అన్నారు. తీరా చూస్తే అది మన "జల్లెడ" బ్లాగ్ అగ్రిగేటర్ లో నా టపాలకు వచ్చిన రేటింగులు. సాధారణంగా నేను జల్లెడ చూడను. కూడలిలో కామెంట్లుకూడా చూసే సౌలభ్యం ఉండటంతో, కూడాలి మొరాయించినప్పుడుతప్ప జల్లెడలో జాలించడానికి బయల్దేరను. అందుకే అక్కడ జరిగిన తతంగం గురించి ఈ మిత్రుడు చెబితేగానీ అర్థం కాలేదు. జల్లెడలో బ్లాగు టపాలను 5 పాయింట్లలో రేటింగ్ చేసి,చదువరులు తమ అభిమానాన్ని తెలియజెప్పే సౌకర్యం ఉంది. ఈ రేటింగ్ వలన ఎప్పుడు ఎవరికి "అవార్డులు" వచ్చాయో నాకు తెలీదుగానీ, నా టపాలకు కొన్ని మాసాలుగా జరిగిన గౌరవం ఏమిటయ్యా అంటే...టపా ప్రత్యక్షమైన గంటా రెండు గంటల్లో టపాకు ఎదురుగా "(0.8)" అనే రేటింగ పాయింట్ వచ్చేయ్యడం.


ఎవరో అభిమాని నా టపాకోసం నిరీక్షించిమరీ 1 నొక్కుతున్నారన్నమాట. దీనర్థం నా టపా అతితక్కువ రేటింగ్ కు అర్హమయ్యిందని. సర్లే దీనివల్ల మనకొచ్చే నష్టం పెద్దగా ఏమీ లేదుగనక, కేవలం ఆ అభిమాని నిబద్దతకు ముచ్చటపడి "పోన్లెండి సార్! ఎవరి ఆనందం వారిది" అని వదిలేద్దాం అనుకున్నాను. కాని నా మిత్రుడు "అలాక్కాదు. మొదటి పేజీ చూడు" అన్నారు. చూస్తే.."నా సామిరంగా!", నా టపాలలో చాలావాటికి యావరేజ్ రేటింగ్ దాదాపు 3 కి పైనే ఉంటే, కొన్నింటికైతే 5 కూడా దాటింది. అప్పుడు నా మిత్రుడు "hahaha" అని నవ్వి, "నీకు వీడేవడో మంచేచెస్తున్నాడయ్యా" అన్నాడు.


ఆ అభిమాని నొక్కే ఒకటికి ఆ తరువాత కొన్ని నెంబర్లు జోడై, మొత్తానికి నా రేటింగ్ పాయింట్లు పెరుగుతున్నాయేగానీ, కేవలం మొదటి రేటింగ్ 0.8 అవడంవల్ల ప్రజలు ఓట్లు తగ్గించి వెయ్యడం చెయ్యడం లేదన్నమాట. నిజానికి జల్లెడలో ఈ సౌకర్యం ఉన్నా, చాలా టపాలకు అసలు రేటింగే ఉండదు అలాంటిది, నాకు కనీసం ఎప్పుడూ 0.8 గ్యారంటీఅన్నమాట.


ఈ తంతువల్ల వచ్చేలాభమేమిటో తెలీదుగానీ, ఇక్కడా విజయవంతంగా తన నిబద్ధతను చాటుకున్న ఆ అభిమాని మాత్రం నాకు తెగనచ్చేసాడు. మొత్తానికి ఈ ప్రియమైన శత్రువు ఎవరోగానీ..నా హృదయపూర్వక నెనర్లు, థాక్యూలు, ధన్యవాదాలు, వణక్కంలు, నన్రిలు ఇంకా చాలా చాలా.

****

14 comments:

Anonymous said...

నేనే ఆ శత్రువుని....నిజంగా నిజం

ramya said...

రేటింగ్!! ఎందుకో్సం ఉద్దేశించినవి? నాకు నిజంగా అర్ధంకాలేదు.( అంటే ఎక్కువ ఓట్లు వచ్చిన పోస్ట్లు పైన కనిపిస్తూ ఉంటాయా?)

అన్నట్లు మహేష్ గారు మీ షివల్రి పోస్ట్ కి ఆ రోజు నేను కామెంట్ పెట్టాను, ఇప్పుడు చూస్తే లేదు, మళ్ళీ రాద్దామనుకుని కాసేపు కుస్తీపట్టి వదిలేసా( ఎందుకోమరి మీ కామెంట్ బాక్స్ తెగ సతాయించేస్తుంది)

Purnima said...

ఇవ్వన్నీ అవసరమా? జల్లెడ రేటింగూ, బ్లాగు హిట్లు, కమ్మెంట్ స్టాట్స్.. ఇవ్వన్నీ అవసరమా?

నిజంగా అడుగుతున్నా, అవసరమా?

Anonymous said...

This is the best blog i have read in telugu after Charasala.com

Anil Dasari said...

పూర్ణిమ వ్యాఖ్యకి నా కొనసాగినంపు:

దాని గురించి మహేష్ టపాయించటం అవసరమా?

(ఏంటో మహేశా, ఈ మధ్య నిన్ను ఏకే వ్యాఖ్యలే రాయబుద్ధేస్తుంది నాకు. (మరి నేన్నీ మితృడినో లేక శతృవునో..)

Anonymous said...

as I predicted and which is quite natural, you are running out of ideas. take a break. your posts lost their steam. One need not express ones views on every damn thing under the sun

Kathi Mahesh Kumar said...

@పూర్ణిమ: నిజమే రేటింగ్ పాయింట్లూ,హిట్లు,స్టాట్సూ ఆన్నీ అనవసరం,అప్రస్తుతమే! నేను చెప్పాల్నుకున్నదీ అదే. ఈ తంతువల్ల నాకొచ్చిన లాభంగానీ నష్టంగానీ లేవు.కానీ ఇలా జరిగిందన్నది నిజం. అదే ఇక్కడ రాశాను.

@అబ్రకదబ్ర & అనామకుడు: బ్లాగురాసేప్పుడు,ప్రతిటపా రాసినప్పుడు నేను చెప్పాలనుకున్నదే చెబుతాను.అవి కొన్ని సిల్లీగా,కొన్ని సిద్ధాంతంలా,కొన్ని సాహిత్యంలా,మరికొన్ని పైత్యంలా ఉంటాయి.

నాకు తెలిసిందొక్కటే ఆరొజు నాకు తొచింది రాయటం. ఇక్కడ ఎవర్నీ ఉద్దరించడానికో లేక నా పాండిత్యం ప్రదర్శించడానికో నెనైతే రాయడం లేదు. నా టపాలలో నాకేతెలీని కొన్ని స్టాండర్డ్స్ కొందరు ఆశిస్తే నాతప్పైతేకాదు కదా!

@రమ్య: కామెంట్ బాక్స్ తో ఎవరికీరాని సమస్య మీకు ఎలావస్తోందబ్బా! ఏంజరుగుతోందో కొంచెం విశదీకరించిచెబితే సమాధానం వెతకడానికి ప్రయత్నిస్తాను.

ఈ రేటింగులేమిటో నాకు తెలీదు. టపాలో చెప్పినట్లు ఒక మిత్రుడు ఎత్తిచూపేవరకూ వీటి గురించి నేను పట్టించుకో లేదుకూడా. రాయడాన్ని ఒక హాబీగా మలుచుకున్నాను. తోచింది రాస్తాను. అంతే!

@గంగాభవాని: హమ్మయ్య ఇప్పటికి దొరికారన్నమాట! ఐతే మీపనిమీరు కానివ్వండి. నా మద్దతు మీకు ఫుల్ గా ఉంటుంది.

@సునంద: ధన్యవాదాలు.

Anonymous said...

చాన్నాళ్ళ కిందట నాకు కూడా చాలా ఓట్లే పడ్డాయి ఇలాగ. ఎనీ థింగ్ గ్రేటర్ దేన్‌ జీరో ఈజ్ గ్రేట్ అనే పాలసీ డి.ఎన్‌.ఏ. లో ఎక్కించుకున్నాను కాబట్టి లైట్ గా తీసుకున్నా.

-- విహారి

Anonymous said...

@anonymus, abrakadabra
atanedo atani bloglo raasukunte meekenduku? prati daaniki inkokarini vimarsincatam tappa vere pani leda? asalu mee blogslo eppudu emi raasukoraa? daniki time untunda meeku?

Anil Dasari said...

@మహేష్,

మీ స్థాయి ఇలాంటి వాటికన్నా ఎక్కువని నా ఉద్దేశం. ఇటువంటివాటి మీద రాసి స్థాయి తగ్గించుకోవటం ఎందుకు? తోచిన ప్రతిదాని గురించీ రాసే హక్కు మీకుంది. అలా ప్రతిదీ రాస్తూ పోతే చదివే వాళ్లకి విసుగొచ్చే ప్రమాదముందన్నది నా అభిప్రాయం. 'వస్తే రానీ' అనుకుంటే నే చేసేదేమీ లేదు.

@అనామకుడు-2:

నా వ్యాఖ్యల్ని మహేష్ ఎలా తీసుకుంటాడో నాకు బాగా తెలుసు. మీరు అనవసరంగా బాధపడనవసరం లేదు. ప్రతి బ్లాగులోనూ ఇలాంటి కామెంట్లు చేసే అలవాటు, సమయమూ నాకు లేవు.

Burri said...

సారీ, నేను ఏనాడు ఓటు వేయలేదు, సరేల్లే అని నా మొదటి సారి నా టపాలతో ట్రై చేసాను. oops sorry, there is no way to change my mind or change to without rating.

మరమరాలు

Anonymous said...

నేను చెప్పుతా! నేను చెప్పుతా! మాకు మర్కెటింగ్ లో ఒక ముఖ్య సిద్ధాంతం ఏంటంటె మీరు ఏదైనా అమ్మడానికి వెళ్ళినప్పుడు ఎవడైనా కోప్పడితే అది వాడు కేవలం ఒక మర్కెటింగ్ ఉద్యోగి మీద కొపమే కానీ వ్యక్తిగతంగా కిషోర్ తొనో, మహేష్ గారితొనో పోట్లాట కాదు కబట్టి నవ్వేసి ఊరుకోండి అని చెప్పెవాళ్ళు. ఈ కామెంట్లు కూడ అంతె.. మీ కాన్సెప్ట్ తొ ఏకీభవించలేకపోవడమె తప్ప మరోటి కాదు. కాని కామెంట్లు సినిమాల్లొ ఐటం సాంగ్స్ లాంటివి లేకపొయినా బానే ఉంటుందనుకోండి కానీ ఉంటె సందడిగా సరదాగా ఇంట్రెస్టింగా ఉంటుంది. [అంతకన్న తోచలేదు పోలిక చండాలంగా ఉంటె పెద్దలు క్షమించగలరు]. కానీ రేటింగులు గట్రా తెలుగు సినిమా హిరోయిన్ కు ఉండే తెలుగు భాషా పరిజ్ఞానం లాంటిది... ఎప్పుడూ ఎక్కడా ఎవ్వరూ పట్టించుకోరు...కనుక lage raho మహేష్ భాయ్!

Kathi Mahesh Kumar said...

@కిషోర్: అదిరింది. ‘కామెంట్లు’ సినిమాల్లో ఐటం సాంగ్స్, ‘రేటింగులకు’ తెలుగు సినిమాలోని, ఉత్తరాది హీరోయిన్ కుండే తెలుగుభాషా పరిజ్ఞానంకున్న ప్రాముఖ్యత ...యమహో ఈ రేంజిపోలిక నేను ఇంతవరకూ వినలేదు. నీతో అర్జంటుగా ఏకీభవించి తరువాత టపా రాసేస్తున్నాను.

గీతాచార్య said...

I followed your blogs regularly once. But your pace is so frantic that I could not follow your all posts in the average time of 10 hours which I spend on the net. I hope you deserve good ratings.

Some of your views helped me in learning things. Also I enjoy the discussions in your posts.

Not that I agree with all of your views.