మధ్యాహ్నం రెండుగంటల ప్రాంతంలో ఫిల్మ్ నగర్ చేరుకున్నాను.ఫోన్ లో మళ్ళీ ఆఫీస్ అడ్రస్ అడగాల్సొచ్చింది. ఒకటో సారి. రెండో సారి మూడో సారి. అదే గొంతు విసుగులేకుండా ఓపిగ్గా డైరెక్షన్స్ చెబుతుంటే…’కొత్తగా విజయాన్ని దక్కించుకున్న ఒక నూతన సినీదర్శకుడు ఇంకా సాధారణంగా ఉన్నాడంటే అసాధారణమే’ అనిపించింది. ఆఫీస్ లోపలికి అడుగుపెట్టాను. అప్పుడే కొత్తగా ఏర్పాటుచేసుకుంటున్న పార్టిషన్లు ఇంకా పని జరుగుతున్నట్లుగా సంకేతాలందించాయి. ఆదివారం కాబట్టి వర్కర్లు పని చెయ్యడానికి రాలేదేమోగానీ, లేకుంటే the office would have been bustling with work of setting up the place…a new place for new achiever in Telugu film industry.
రిసెప్షన్లో ఎవరూ లేరు. లోపల కొన్ని గొంతులు వినపడుతున్నాయి. కొంత ఇబ్బందిగా అనిపిస్తుండగానే గదిలో అడుగుపెట్టాను.’సాయి కిరణ్!!’ అంటూ నేను నీళ్ళు నమిలేసరికీ పాతిక ముప్పై సంవత్సరాల యువకుడొకరు “హలో మహేష్” అంటూ చెయ్యి కలిపాడు. పరిచయాల తర్వాత, “ప్లీస్ ఓ రెండు నిమిషాలు వెయిట్ చెయ్యగలరా!” అంటూ పక్కనున్న వ్యక్తితో నన్ను పక్కగదిలో కూర్చోబెట్టమని పురమాయించాడు. రెండు నిమిషాలకన్నా ముందే వచ్చి, “చెప్పండి మహేష్ గారు. ఏదో స్టోరీ డిస్కషన్ నడుస్తుంటేనూ…” అంటూ ఎదురుగా కూర్చున్నాడు. అప్పుడు చూసాను, ఏదో కాలేజో యూనివర్సిటీ క్యాంపస్ లోనో కనిపించే ఒక సాధారణ విద్యార్థిలాంటి యువకుడ్ని. తెలివైన ముఖం. తెలివిని కప్పిపుచ్చే అమాయకపు కళ్ళద్దాలు. ఆ కళ్ళద్దాలమాటున దాక్కునీ దాక్కోలేకున్న విజయగర్వంతో కాకుండా విజయానందంతో మెరిసేకళ్ళు.
తన పేరు సాయి కిరణ్ అడివి. ఈ మధ్య చిన్న సినిమాగా రిలీజై పెద్ద సినిమా స్థాయిలో నడుస్తున్న ‘వినాయకుడు’ సినిమా దర్శకుడు.పూర్తి వ్యాసం కోసం నవతరంగం చూడండి....
2 comments:
నవతరంగంలో పూర్తి వ్యాసం చదివాను. అన్ని ఇంటర్వ్యూల్లా లేదు. సినిమా పరిభాషలో - రొటీన్‌కి భిన్నంగా ఉంది. బాగుంది.
nijamE. 'novel'gaa undi.
naaku chaalaa chaalaa naccindi.
Post a Comment