Sunday, December 28, 2008

మా ముకుందుడి ‘భాష’ తంటాలు

నేను తెలుగు.మా ఆవిడ బెంగాలీ. నాకు బెంగాలీ మాట్లాడ్డం రాది. మా ఆవిడకి తెలుగు మాట్లాడ్డం రాదు. ఇద్దరికీ దాదాపు చాలావరకూ అర్థమవుతుంది. అందుకే ఇంట్లో మాట్లాడే భాష హిందీ. మా అబ్బాయి ముకుంద్ చిన్నప్పట్నించీ ఇంట్లో హిందీ వింటూ పెరగటం వలన వాడి మాతృభాష హిందీ. అందుకే మాతృభాష అనడంకన్నా ‘ఇంటిభాష’ లేక ‘మొదటిభాష’ అంటే ఈ సందర్భంలో అర్థవంతంగా ఉంటుందని నా భావన.


బాల్యంలో ఏభాషలో అయితే మీ అవసరాలనూ,అనుభవాలనూ,ఆలోచనలనూ చెప్పడం చేస్తారో అదే ‘ఇంటిభాష’/‘మొదటి భాష’ అని నా ఉద్దేశం. దానికి పవిత్రత గౌరవం,గొప్పతనం లాంటివి లేవు. అది ఒక సహజ ప్రక్రియ అంతే. ఇంకా చెప్పాలంటే అదొక default setting. భాష నేర్చుకునే క్రమంలో మొదటగా వినడం తరువాత తిరిగిపలకటం ఆ తర్వాత మాట్లాడటంగా జరుగుతుంది. ఆ తర్వాత అవసరాన్నిబట్టి చదవటం, రాయటం నేర్పించబడతాయి లేక నేర్చుకోబడతాయి.నేను తెలుగు భాష ఇలాగే నేర్చుకున్నాను. నా కుటుంబ మరియూ చుట్టూవున్న సహజవాతావరణంలో తెలుగు ఆవరించుకుని ఉండటం, నా ప్రాధమిక విద్య తెలుగులో సాగటంతో తెలుగు నా ఇంటిభాషతో పాటూ వ్యవస్థ భాష(Institutional language) కూడా తెలుగయ్యింది. ఆ తరువాత కాలక్రమంలో వ్యవస్థభాష ఆంగ్లంగా రూపాంతరం చెందింది.


శిక్షణ రీత్యా భాషా బోధకుడిగా, ఏ సందిగ్ధతలేకుండా పిల్లలు తమ బాల్యావసరాలు,భావాలూ వ్యక్తికరించడానికి ఒకే భాష ఉండాలనే సిద్ధాంతాన్ని నమ్ముతాను. అందుకే ఇంట్లో హిందీతప్ప మరోభాష వాడకం చెయ్యలేదు.అందుకే పితృభాష అయిన తెలుగు, మాతృభాష అయిన బెంగాలీని ఇంటిభాష గా చెయ్యలేదు. ఇంగ్లీషునైతే ఉద్దేశపూర్వకంగా మరింత దూరంగా ఉంచడం జరిగింది. ఇప్పుడు మా ముకుంద్ తనంతట తాను ఆసక్తిచూపడంతో కొంత తెలుగు బెంగాలీ నేర్పడం జరుగుతోంది. కానీ సమస్యల్లా వాడి స్కూల్లో ఇంగ్లీషురూపంలో వచ్చింది.


క్రితం సంవత్సరం LKG లో చేర్పించిన కొన్నాళ్ళకి, పేరెంట్స్ మీటింగులో వాళ్ళ మేడమ్ నా ముందుకుతీసుకొచ్చిన సమస్య "your son do not follow instructions in English" అని.దానికి నేను మర్యాదగా,"Sure I understand. We speak Hindi at home and I would expect school to teach him English" అనిచెప్పాను. కానీ, ‘ఇంట్లో మీరు నేర్పిస్తేకదా మీవాడికి స్కూల్లో సూచనలు పాటించడానికి సులువయ్యేదీ’ అని స్కూలువాళ్ళ గోల. నాభాధేమిటంటే నేను ఇంట్లో తెలుగు మాట్లాడుతూనే బయటప్రపంచానికి కావలసిన institutional language అయిన ఆంగ్లాన్ని నేర్చుకున్నప్పుడు, హిందీ మాట్లాడే నాకొడుక్కు స్కూల్లో వీళ్ళు ఇంగ్లీషు నేర్పలేరా? ఇంత మాత్రానికి వేలకువేలు ఫీజులు నేనెందుకు కట్టాలి? అని. ఈ విషయం స్కూల్లో కొంత చర్చించిన తరువాత, మా ఆవిడ నన్ను బలవంతంగా(తలాతోకా లేని ఆర్గ్యుమెంట్ చేస్తున్నానని) ఆ మీటింగ్ నుంచీ లాక్కొచ్చేసింది.



ఏమిటో... నా వాదనలో తప్పుందో... లేక నా ఆలోచనలో తప్పుందో ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. కాకపోతే, ఇప్పుడు మాఆవిడ ఇంగ్లీషు పదాలూ,వాక్యాలు ఇంట్లో మా ముకుందుడిపై విరివిగా ప్రయోగిస్తోంది.


****

28 comments:

Anonymous said...

తంటాలు మీవా ముకుందుడివా ???
మీ అబ్బాయిపేరు నిజంగా ముకుందుడేనా
తెలుగుపేరులా లేదు అంటే గ్రుహమంత్రిణి గారి డామినేషన్ అన్నమాట
తెల్సిపోయిందోచ్

Kathi Mahesh Kumar said...

@లలిత: మా ముకుందుడితో నా భాష తంటాలనుకోవాలేమో! మావాడి పేరు ‘ముకుంద్ అవినాష్’. ఇక గృహమంత్రిణి డామినేషన్ లేని గృహమేది చెప్పండి!!!

worthlife said...

మహేష్ గారూ... ఎవరి కోణంలో వారిది సరైన వాదనే. అదే జీవితంలో కొత్త కోణం.

worthlife said...

మహేష్ గారూ... ఎవరి కోణంలో వారిది సరైన వాదనే. అదే జీవితంలో కొత్త కోణం.

శ్రీనివాసకుమార్ గుళ్ళపూడి(జీవితంలో కొత్త కోణం)
http://worthlife.blogspot.com

Anonymous said...

@ఏమిటో... నా వాదనలో తప్పుందో... లేక నా ఆలోచనలో తప్పుందో ఇప్పటికీ నాకు అర్థం కాలేదు:

గుచ్చుకుంది సార్ ..

వేణూశ్రీకాంత్ said...

తప్పొప్పుల మాట ఎలా ఉన్నా. మొత్తం గా స్కూల్ మీదే ఆధార పడటం కన్నా ఇంట్లో కూడా అలవాటు చేయడం వలన పిల్లల మీద కూడా కొంచెం భారం తగ్గుతుంది అని నా అభిప్రాయం మహేష్. లేదంటే పిల్లలు తీవ్రమైన కన్‍ఫ్యూజన్ కి గురయ్యే అవకాశం ఉంది. పూర్తిగా ఆంగ్లం లో సంభాషించక పోయినా కనీసం తను టీచర్స్ చెప్పే బేసిక్ instructions ఫాలో అవగలిగేలా మనమే తర్ఫీదు ఇవ్వాలి. ideal world లో మీరు చెప్పిన విషయం వర్తిస్తుందేమో కానీ ఇప్పటి స్కూల్స్ నడుస్తున్న పద్దతి ప్రకారం ప్రతి విధ్యార్ది పై అంత సమయాన్ని వెచ్చించ లేరు కదా, సో మన పిల్లలకోసం మనమే భరించక తప్పదు.

gaddeswarup said...

ఇంట్లో హిందీ మాట్లాడినా, హోం వర్కు లాగా ఇంగ్లీషు చెప్పవచ్చు అనుకుంటున్నాను. నా ఉద్దేశం చాలామంది పంతుళ్ళు వీలైనంతవరకు పని తప్పించుకుంటారు, వాళ్ళల్లొ తప్పులు పట్టితె హోం వర్కు ఎక్కువ ఇస్తారు, ఇంకా కష్తాలు పెట్టవచ్చు. వాళ్ళని ఎక్కువ పట్టించుకోకుండా పిల్లలకు ఏది మంచిదో చూసుకోవాలి.కొంతమంది పంతుళ్ళు మంచివాళ్ళు కావచ్చు. నేను చూచినంతవరకు ఎక్కువమంది కనపడలేదు. మానాన్న, నేను పంతుళ్ళమే. నా అనుమానం స్కూళ్ళు కొంతవరకు మిగతావాళ్ళతో ఎలా మెలగాలో నేర్చుకుంటానికి గాని నిజమైన చదువులకు పనికిరావు. సుగత మిత్రా గారి టెడ్ టాక్ ఒకసారి చూడండి:
http://www.ted.com/index.php/talks/sugata_mitra_shows_how_kids_teach_themselves.html

Disp Name said...

Nizamgaa Idi Mukundudi Samasya maatrame kaadu maa abbayi thanmay samasya kooda. Matru Basha okate aina english aapaati kastamaina bashaa kaadu nerchukovadaniki. Naavarakaite ee madhya putta godugulla vachina schools standards aapaati danipistundi. Nenu chadivina veedhi badi leka municipal school nepinanta kooda veellu nerpakapote ika veeri standard emitantaaru?

zilebi
http://www.varudhini.blogspot.com

Bolloju Baba said...

గృహమంత్రిణి డామినేషన్ లేని గృహమేది చెప్పండి! మరే.

Sreenivas Paruchuri said...

Mahesh-gaaru,

I understand your problem or dilemma. In fact, I was in a much more complex position with my seven year old daughter, who is born in Germany and moved between three countries; viz. Germany, India and UK until this August. Now she goes to school in England. We continue to speak to her in Telugu at home and expect, like you, "the school to teach her English", and its working out very well. And she can (still :-)) speak and write good Telugu.

As Prof. Swarup Gadde said above, "స్కూళ్ళు కొంతవరకు మిగతావాళ్ళతో ఎలా మెలగాలో నేర్చుకుంటానికి గాని నిజమైన చదువులకు పనికిరావు".

Regards,
Sreenivas

Anonymous said...

తప్పొప్పుల గురించి మాటాడుకోటం అటుంచితే
1. పిల్లలు ఆత్మన్యూనతకి లోనయ్యే అవకాశం
ఎక్కువ. ఇంగ్లీషు నేర్చుకోటం బ్రహ్మవిద్య
కాదని వాళ్ళకు తెలీదుగా. అందరూ అలానే
ఆలోచించాలని లేదు. కానీ, కొందరు ఆత్మన్యూనతకు
గురవుతారు.

2. పైగా స్కూల్లో అదో సబ్జెక్ట్ లా చదివితే
వాళ్ళకు భారంగా అనిపిస్తుంది. అందుకే ఇంటి
వద్ద మాట్లాడితే మాతృభాషలానే ఇంగ్లీషు
నేర్చుకునే అవకాశం ఉంటుంది. చిన్న చిక్కేంటంటే
కొంచం ఎక్కువ ఇంగ్లీషు మాటాడే వాతావరణం
ఉండాలి.
ఇది భాషను ఎక్వైర్ చేసుకోగలిగే వయసు.
ఇప్పుడు ఏ భాషనైనా మాతృభాషలా నేర్చుకోగలరు.
అంచేత మీరు హిందీతో పాటూ, ఇంగ్లీష్ మాటాడితే
నేర్చుకోగలుగుతాడు. మీరు తెలుగు మాటాడినా,
ఎక్కువ తెలుగు స్నేహితులు ఉన్నా తెలుగు కూడా
నేర్చుకోగలుగుతాడు.

durgeswara said...

మీలాజిక్ కు సమాధానం చెప్పటానికి విద్యాబోధన ప్రక్రియ మనిషిని విజ్ఞానవంతుని చేసే కోణము నుంచి కాక ,మార్కెట్ కనుకూలంగా తయారు చేయాలనే తపనతోనడుస్తున్నది.ఇక లాజిక్్ లకు తావులేదుఫీజులుగుంజే మాజిక్ లతోనే సరి పోతున్నది మాకు.ఏమి చేస్తాము మేమూ పొట్టకూటి కోసం చేస్తున్న పనిగా భావించి బ్రతకవలసిన పనయి పోయినది మావృత్తి.వాస్తవాని కయితే మీ ఆలోచన నిజమే.

Anonymous said...

అసలు విషయం మర్చేపోయాను.
మీ వైఫ్ చేస్తున్నదే కరెక్ట్

Rajendra Devarapalli said...

ఇప్పటికిప్పుడు రిఫరెన్సులు చూపలేను గానీ,ఆమధ్యెక్కడో చదివా.పసితనం నుండి ఎన్ని భాషలయినా నేర్చుకోగల సామర్ధ్యం పిల్లలకుంటుందీ అని.వాటిలో తెలుగుదేశంవరకూ తెలుగు,ఇంగ్లీషు,హిందీ,ఉర్దూ,సంస్కృతం--(ఇదేవరుసలో కానక్కరలేదు)ఒరియా,మరాఠీ,తమిళం,కన్నడ తదితరాలు నేర్చుకుంటున్నారు.కనీసం మూడు భాషలు తప్పనిసరి తెలుగుబాలలకు,పాపం యధాశక్తి వారూ నేర్చుకుంటూనే ఉన్నారు.
ఈవార్తాంశం చదివిన కొన్నాళ్లకు మాతోడల్లుడి కూతురిని చూసాక నమ్మకతప్పలేదు.ఆయన మహారాష్ట్రలో పుట్టిపెరిగిన మళయాళీ,నాకు తోడల్లుడు అయ్యారు.వాళ్ళమ్మాయి మరాఠీ,హిందీ,మళయాళం,ఇంగ్లీషు,తెలుగు ..ఇన్ని భాషలు నేర్చుకుంటూ,మాట్లాడుతూ ఉంది.ఇంతచేస్తే ఆపాప ప్రస్తుతం యల్.కె.జీ.చదువుతుంది.కానీ వారి ఇంట్లో సంధానభాష ఇంగ్లీషు.ఒక్క ఇంగ్లీషు సాయంతో ఇన్నిభాషలు నేర్చుకోవటం నాక్కాస్త అబ్బురంగానే ఉంది.

కొత్త పాళీ said...

Very Very interesting.
ఒక సవరణ. గృహమంత్రి ఒక్కటే కాదు, అధ్యక్షురాలూ, ప్రధానమంత్రీ, ఆర్ధికమంత్రీ ఇత్యాది పవరున్న పోష్టులన్నీ ఆవిడవే అని గ్రహించాలి! :)

అదలా ఉండగా .. మీ ముకుందుడి భాషవిషయంలో మీరు చేస్తున్న పని సరియైనది. ఎంత ఫీజులు వసూలు చేసే స్కూళ్ళైనా, ఇంగిలీషు మీడియం అయినాక, LKG నించీ, ప్రతీ ఆజ్ఞా, సూచనా బుడ్డోళ్ళకి ఇంగిలీషులో అర్ధమై పోవాలన్నది వారి ఉద్దేశం. మొత్తమ్మీద భాషని మెల్లగా నేర్పుతారు, ఈ లోపల పిల్లలు టీచరు చెప్పే సూచనల్ని అర్ధం చేసుకునేంత భాష మనం నేర్పడంలో తప్పు లేదనుకుంటాను. We have to meet them at least half the way.
బైదవే, నేను రెండు భాషల తలిదండ్రులకి పుట్టాను. నా మాతృ (అమ్మ) భాషే నా చుట్టూ ఉన్న సమాజం భాష కూడా కావడంతో అదే డామినేట్ చేసింది. చదివింది కూడా తెలుగు మీడియం కావడం వల్ల, నాలుగో క్లాసుదాకా ఇంగిలీషు గొడవే లేదు. మా అన్నయ్యది ఇంకా మీకంటే కాంప్లికేటెడ్ పరిస్థితి. మా వదిన బెంగాలీ. నివాసం ముంబాయి. పిల్లాణ్ణీ పంపేది కేంద్రీయ విద్యాలయానికి. ఇంటో బెంగాలీ, సమాజంలో మరాఠీ, లేదా ముంబాయి హిందీ, బళ్ళో ఇంగ్లీషూ, పుస్తకాల హిందీ. వీటన్నిటిమధ్య మా వాడు తెలుగుని మింగేశాడు :)
మీ దంపతులిద్దరూ మీమీ భాషల్ని పక్కకి పెట్టి, ముకుందుకి చుట్టూ ఉన్న హిందీనే ఇంటిభాషగా పరిచ్యాం చెయ్యడం అభినందించదగిన విషయం. ఈ వయసులోనే మెల్లగా తెలుగూ బెంగాలీ కూడా పరిచయం చేసేస్తే, కొంతైనా వాటిమీద కూడా పట్టు సాధించ గలడు. ఇంతకీ కత్రీనా ఆర్ధన ఎంతలో ఉంది??

Anonymous said...

"ఇంత మాత్రానికి వేలకువేలు ఫీజులు నేనెందుకు కట్టాలి?" - ఔను. మనమే నేర్పించుకునేకాడికి వీళ్ళెందుకసలు?

Anonymous said...

మీరు చెప్పింది నిజమే అండి బడిలో నేర్పిస్తే నేర్చుకుంటారు. మా బాబు నర్సరీ లో చేర్చే సమయానికి ఒక్క ముక్క ఆంగ్లము రాదు.కేవలం 3 నెలలలో బాగా నేర్చుకున్నాడు. మేము ఇంట్లో తెలుగు లోనే మాట్లాడతాం.

రాధిక said...

నాకూ ఈ సమస్య వుండేది మొదట్లో.ఇంట్లో తప్ప ఎక్కడన్నా మాకు ఇంగ్లీషే వినిపిస్తుంది కదా సమస్య రాదనుకుని నేను తెలుగే చెప్పాను మావాడికి.వాడు చాలాసార్లు తెలుగులో ఆలోచించి ఇంగ్లీషులోకి మార్చుకుని మాట్లాడుతున్నాడని టీచర్ నుండి వత్తిడి బాగా పెరిగిపోయింది.నేను కొద్దిగా ఇంగ్లీషులోకి దిగాను.మావారయితే పూర్తిగా ఇంగ్లీషుకి మారిపోయారు.ఇప్పుడు పరిస్థితి ఎమిటంటే వాడికి తెలుగు అర్ధం అవుతుంది కానీ తిరిగి తెలుగులో సమాధానం చెప్పలేకపోతున్నాడు.వాడిని బలవంతం గా తెలుగులో సమాధానం చెప్పేలా ప్రయత్నిస్తుంటే వాడి నిరాశక్తత నన్ను బాధ పెట్టేది.కానీ ఆలోచిస్తే అర్ధం అయింది మనం తెలుగులో పుట్టి తెలుగులో పెరిగినందువల్ల మనకి ఆ అభిమానం వుంటుందేమో గానీ వాళ్ళకి ఎందుకు వుంటుందని.ఈ మధ్యనే మొదలుపెట్టాను తెలుగు అక్షర మాల నేర్పడం.అచ్చులు గుర్తుపట్టి చదువుతున్నాడు.రాయడం మాత్రం ఇంకా ఇ,ఈ ల దగ్గరే వున్నాడు.

నాగప్రసాద్ said...

@రాజేంద్ర కుమార్ దేవరపల్లి గారు, ఈ మధ్య యోగా శిక్షణా తరగతుల్లో, Infant Education System అనే ఒక పద్ధతిని ప్రవేశపెట్టారండి. అంటే అభిమన్యుడు, ప్రహ్లాదుని Education System అన్నమాట. ఈ విధానం ద్వారా పిల్లలకు 8 సంవత్సరాల వయస్సు వచ్చే నాటికి 10-15 భాషల దాకా నేర్చుకుంటారు.

మనము కూడా ఈ విధానాన్ని సులభంగా నేర్చుకోవచ్చు.


కత్తి మహేశ్ కుమార్ గారు, మీ పిల్లాడికి ఇంగ్లిష్ నేర్పడానికి "ఓరియంట్ లాంగ్మెన్" వారి "ఇంగ్లిష్-400" అనే పుస్తకాన్ని కొనుక్కోండి. ఈ పస్తకం( అట్ట ముక్కలు అనాలేమో) ద్వారా 40 గంటల్లో ఆంగ్లంలోని 10,000 పదాలు నేర్చుకోవచ్చంట!. మామూలుగా ఇంగ్లిష్ మాట్లాడటానికి 3000 వేల పదాలు వస్తే చాలంటారు. దీని ధర కేవలం రూ. 32000 వేల రూపాయలు మాత్రమే. ఏమీ అనుకోకండి. సరదాకి రాశాను. ఈ పుస్తకాన్ని వాళ్ళు కేవలం పాఠశాలలకి మాత్రమే అమ్ముతారని తెలిసింది.

ఇక మనమే నేర్పించుకునే కాడికి వాళ్ళకు వేలకు వేలు ఫీజులు కట్టడం అనవసరమే.

శ్రీ said...

ఇంట్లో మనమే నేర్పిస్తే ఇక స్కూలెందుకూ?నా మాటిని ముందు స్కూలు మానిపించేయండి!
నేను 6 క్లాసు వరకు నా స్కూలంతా ఇంట్లోనే!

Anonymous said...

"your son do not follow instructions in English" --> "your son does not follow instructions in English"

Thanks.

Bhaskar said...

This reminds me one thing. My daughter is suffering from Autism. She was diagnosed when she was in pre-KG, i.e., 30 months. Now she is 8 yrs, but still speech did not develop. But from the day, we came to know about her disorder, we started talking with her in English at home to have a common language with School. Now she understands 75% of instructions.

I feel that it is important to have a common language between home and school, whether normal or special children. Apart from that you can teach other languages, most of the children are very sharp in picking up multiple languages.

Dr.Pen said...

@మహేష్...
మీరు చేస్తోంది మంచి పనే! కానీ తెలుగు నేర్చుకోకపోతే 'కృష్ణశాస్త్రి'ని ఎలా చదువుతాడు? సమయం తీసుకొని నేర్పించండి. నాకు తెలిసి ఈ వయస్సులో వారి బుఱ్ఱ అమోఘంగా పని చేస్తుంది. ఒకటికన్నా ఎక్కువ భాషలు నేర్చుకోవాలంటే ఇదే మంచి సమయం.
ఇహపోతే నాకూ ఈ సమస్య ఉంది. మా 'సుహాస్' మూడేళ్లకే చక్కగా తెలుగు అక్షరాలు గుర్తు పట్టేవాడు. నాలుగేళ్లకి వేమన పద్యాలు అలవోకగా పాడేవాడు. స్కూలుకెళ్లడం మొదలు పెట్టాక ఇప్పుడు ఆరేళ్ల వయస్సులో ఇంట్లో ఇంగ్లీషులో మాట్లాడ్డానికే ప్రయత్నిస్తాడు. తెలుగులో మాట్లాడమంటే "Why is Telugu so difficult నాన్న?" అంటాడు:-( అయినా సరే తెలుగులో మాట్లాడితే సాంటా 'Bakugan'లు తెచ్చిస్తాడ్రా అని ఊరించి తెలుగులో మాట్లాడిస్తున్నాం. ఇక ఉర్దూ ఎప్పుడు నేర్పాలో?:-)

@భాస్కర్...
Autism పై పరిశోధనలో పాల్గొన్న అనుభవం ఉంది. మీకేమైనా సమాచారం కావలిస్తే ఇక్కడికి 'drchinthu@జీమెయిల్.కాం' వేగు పంపండి.

Dr.Pen said...

అయ్యో! మరచిపోయా...మీ 'ముకుందుడు' ముద్దొస్తున్నాడు.మీలా 'ముచికుందుణ్ని' మాత్రం చేయకండి:-)

ramya said...

నాలుగేళ్ళ వాళ్ళు చెబితే గానీ ఏదీ తెలుసుకోలేరు, సెలబస్ నేర్పించినంతవరకూ నేర్చుకుని తిరిగి చెప్పగలరు అంతే. తెలియని భాషలో టీచర్స్ మాట్లాడేది అర్ధమవటం కష్టమే.
చుట్టూ ఉన్నవాళ్ళు మాట్లాడే భాషకి అలావాటై ఒకటికిరెండుసార్లు వింటూ మెల్లిగా నేర్చుకోటానికి కాస్త టైమ్‌ పడుతుంది, ఇప్పుడే తొందరపడి ఆ టీచర్స్ కంగారు పడాల్సిన అవసరం లేదని నేననుకుంటా :)

కన్నగాడు said...

నా వరకు పిల్లలకు తెలుగు మాధ్యమంలో బోధించటాన్నే సమర్దిస్తాను, కాని ప్రస్తుత కాలమాన పరిస్తుతుల్లో అది అంత వీజీ కాదెమో!
ఐనా, ఈ కాలం పంతులోల్లు ఏమనుకుంటున్నారో గాని పిల్లోడు ఎల్.కె.జి. లోనే అపరిచిత భాషలో ఇచ్చే సూచనలు పాటించాలని భవిస్తే మనమేం చేయగలం మనం కూడా ఆ భాషలో మాట్లాడటం తప్ప.
కొసమెరుపు: మా అమ్మ వాల్ల వైపు మొదట ఆంగ్ల మాధ్యమంలో విధ్యాభ్యాసం మా చిన్నపిన్ని పిల్లలే, వాల్ల హోంవర్క్ చేయించి చేయించి పదవ తరగతి వరకే చదివిన మా పిన్ని భాషలో ఆంగ్ల పదాల వాడకం పెరిగింది.

సుజాత వేల్పూరి said...

ఏ స్కూలైనా స్కూల్లో ఉన్నంత సేపూ ఇంగ్లీషులోనే మాట్లాడక తప్పదు. ఈ లెక్కన ముకుంద్ కి ఇంగ్లీష్ మాట్లాడ్డం వచ్చేసి ఉండాలే! పైగా పిల్లలకు ఎక్కువ భాషలు సులువుగా నేర్చుకునే సామర్థ్యం ఉంటుందని నేనూ నమ్ముతాను.

పిల్లలు ఈ వయసులో తల్లితో ఎక్కువ గడుపుతారు కాబట్టి తల్లి మాట్లాడే భాష ప్రభావమే ఎక్కువగా ఉంటుంది వాళ్ళ మీద. ఈ లెక్కన ముకుంద్ కి బెంగాలీ రావడంలో ఆశ్చర్యం లేదు.

ఇక తెలుగు విషయంలో, మీరే జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే పిల్లలు స్కూల్లో గుంపులో నేర్చుకున్నంత సులువుగా ఇంట్లో ఒక్కరిగా నేర్చుకోడానికి ఆసక్తి చూపరు. ఇంగ్లీష్ స్కూల్లో తప్పనిసరి కాబట్టి ఎలాగైనా వస్తుంది.రాకపోతే ఇవాళ కుదరదు కూడా!దాని గురించి చింత అక్కర్లేదు.

స్కూలు వాళ్ళు బోధించిన దాని ప్రకారం ఫీజులు కట్టాలంటే మనం సగమే కట్టాలి.

పిచ్చోడు said...
This comment has been removed by the author.