Saturday, December 27, 2008

స్వగతం


నమ్మకం:
నా పరిధిలో తెలుసుకున్నవాటితో నా అభిప్రాయాలు ఏర్పడుతాయి.అవి ఎంతబలమైనవి అనేది నేను తెలుసుకున్న source నుంచో లేక నేను convince అయిన తీరునుంచో జరుగుతాయి.నా అత్మవిశ్వాసానికి కారణం నేను తెలుసుకున్న జ్ఞానంపై నేను ఏర్పరుచుకున్న నమ్మకం.మళ్ళీ ఎవరైనా నా నమ్మకాన్ని సవాలుచేసి, నా కళ్ళు తెరిపించేంతవరకూ అదే నాకు "సత్యం". అందుకే ఈ సాధికారత.



విశ్వాసం:
అతివిశ్వాసానికీ ఆత్మవిశ్వాసానికీ తేడా ఎంతో... ఎలావుంటుందో... సొంత కొలతల్లో లేక ఎదుటిమనిషి నలతల్లోంచీ కనిపెట్టెయ్యడం అర్థరహితం. కారణం, అవి చాలా వ్యక్తిగతపరిధిలోంచీ చేసే నిర్ణయాలు. వాటిని నిరపేక్ష సిద్ధాంతాలుగా అంగీకరించిన క్షణాన, నా వ్యక్తిత్వానికీ నేను వ్యక్తిగానమ్మిన సాపేక్ష సిద్ధాంతానికీ విఘాతం కలిగినట్లే లెక్క.


ఎదుటివారు నాగురించి చేసే వ్యక్తిగత బేరీజుకన్నా, నాగురించి నేను అనుభవించే అపోహే మిన్నకాదా! isn't my reality better than perceived notion of others...or is it others reality and perceived notions of my own self? either ways it makes no difference.



జీవించేద్దాం!
ప్రతిమనిషీ తను సృష్టించుకున్న మూసలోనే జీవిస్తాడు. తను అల్లుకున్న బోనులోనే బతికేస్తాడు.కానీ తనదంటూ ఒక పిచ్చితనం లేకపోతే...తనకంటూ కొన్ని నమ్మకాలు లేకపోతే బోనుకూ,మూసకూ సార్థకత కలిగేనా? అస్థిత్వానికొక అర్థం లభించేనా!



ఒరిజినల్ ధాట్:
సొంత ఆలోచనలు కావాలట...original thought. Foolish romantics. అసలు సిసలు ఆలోచనలున్న మహానుభావులెవరో సెలవిస్తారా? Best that has been thought and said is in literature అని ఊరికే అన్నారా! సొంతవీ కొత్తవీ ఎక్కడినుంచీ వస్తాయి..ఆదేదో మనకన్నా ముందు మనల్ని మించిన మొనగాళ్ళే పుట్టనట్టు.


అద్వితీయమైన ఆలోచనలున్నాయి. ఆచరణసాధ్యంకాని అనుభవాలున్నాయి. అనుభవైక్యమైన అనుభూతులున్నాయి. అనుభవించడం చేతకాదుగానీ..ఆలోచించాలట! అదీ ఒరిజినల్గా...ఎవడిక్కావాలి ఒరిజినాలిటీ? అందమైన అనుభవాలు రెడీమేడ్ గా అవేలబుల్ అయితేనూ...



ఆన్ బీయింగ్ సినికల్:
"ఎందుకురా జీవితం మీద అంత నిరసన.ఎప్పుడూ ప్రశ్నించడమేనా..కాస్త ప్రశాంతంగా ఉండలేవా?" అంటాడొక స్నేహితుడని చెప్పుకునే వెధవ. నిరసించని జీవితమూ ఒక జీవితమే! ప్రశ్నించని బ్రతుకూ ఒక బతుకే!!


అన్నిటినీ అంగీకరించి బతికెయ్యడంలో సుఖముండొచ్చుగాక...కానీ శోధించి సాధించడంలోని ఆనందం ఏ సుఖం ఇవ్వగలదు. If you don't problamatize your existence, can it ever become a meaningful Life...its a life with ‘L’ capital mind you. Not just any life.


అయినా నువ్వనుకునేట్లు నేను విరాగిని,విరసుడ్ని,రంధ్రాన్వేషకుడ్ని,నిరాశావాదినీ,నిస్పృహనిండిన వ్యక్తిని కాదు. జీవించే క్రమంలో జీవితాన్ని అర్థవంతమైన క్రమంలో అమర్చుకోవాలనుకునే వేదాంతిని. వేదాంతానికీ వైరాగ్యానికీ ఆర్థం తెలియని నువ్వా సినిక్...లేక నేనా?



****

8 comments:

MURALI said...

మహేష్ గారు మీరు చెప్పినది 100% నిజం. ప్రతీ మనిషి తనకంటూ ఒక సిద్దాంతాన్ని, జీవనవిధానాన్ని ఎంచుకుంటాడు. తాను ఎంచుకున్న సిద్దాంతమే గొప్పది అని నమ్ముతాడు. అలా నమ్మితేనే ఆచరించగలుగుతాడు. ఆ నమ్మకాలు కొన్నిసార్లు సమాజాన్ని అనుసరిస్తాయి, కొన్ని సార్లు వ్యతిరేకిస్తాయి. వ్యతిరేకంగా ఉన్నవాటి పై సమాజం దుమ్మెత్తిపోస్తుంది.

జ్యోతి said...

:) అన్నీ కరక్టె..

Bala said...

I liked these reflections of self. I think self is nothing but a mirror image of our feelings towards the world and ourself.

-bala
P.S: soon, I will be active with my communication as well as with navatarangam.

Dr.Pen said...

"Know thy Self" - Buddha the Great.

Anonymous said...

"శోధించి సాధించడంలోని ఆనందం ఏ సుఖం ఇవ్వగలదు" నిజంగా నిఝం...

durgeswara said...

శోధించడమే వేదాంతానికి ప్రాణమ్. చాలా బాగా వ్రాశారు.కాకుంటే మనతో పాటు ,మనకంటే ముందు వాల్లుశోధించినవి కూడా స్త్యాలే కావచ్చు కదా అన్న దృష్టితో పరిశీలన సాగితే పరవాలేదు. అవన్నీనా అనుభవం లోనుంచే రావాలంటే ఈ జీవిత కాలం చాలదేమో? బాగుంది .

Anil Dasari said...

కొన్ని సులువుగానే అర్ధమయ్యాయి, బాగున్నాయి కానీ కొన్ని మరీ వేదాంతభరితంగా ఉన్నాయి. నాకర్ధం కాలా :-) అర్ధమైన వాటిని అంగీకరించటం తేలిక్కాదు. ఉదాహరణకి: 'ప్రతిదాన్నీ ప్రశ్నించటం ఎందుకు' అనేది. కొన్నిసార్లు నాకూ అలాగే అనిపిస్తుంది కానీ వెంటనే 'ఎందుకు ప్రశ్నించకూడాదు' అనే ప్రశ్నొచ్చేస్తుంది, సహజంగానే.

ప్రవీణ said...

bagunnayi..konni artham kaaledu "అనుభవించడం చేతకాదుగానీ..ఆలోచించాలట! అదీ ఒరిజినల్గా...ఎవడిక్కావాలి ఒరిజినాలిటీ? అందమైన అనుభవాలు రెడీమేడ్ గా అవేలబుల్ అయితేనూ..."??