Friday, April 30, 2010

రూపాయి నాణేలకే మతముంటే...

****

అనుభవ మంటపం

ఆ నీరసపు మద్యాహ్నం వేళ
పీఠభూమి నిర్ధిష్టపు ఒంపుల్లో సేదతీరాను.
నా తీవ్రత బలాన్ని చల్లబరిచే చలమకోసం మళ్ళీ  ప్రయాణం
ఈ చీకటిమధ్యాహ్నం, ఆ మూలుగుల్లో మరణించడానికి సిద్దంగా ఉంది
ఆ మరణం కడతేరేందుకు కాదు
ఎప్పుడో మర్చిపోయిన జీవితాన్ని గుర్తుచేసేందుకు
****

Wednesday, April 28, 2010

మహిళలు - సంస్కృతి - గ్రేట్ వీడియో

Tuesday, April 27, 2010

‘ప్రస్థానం’ దర్శకుడితో వీడియో ఇంటర్వ్యూ

సినిమా మీద ప్రేమ. ఎంచుకున్న పనిమీద నమ్మకం. స్వశక్తి మీద విశ్వాసం. ప్రతిభ మీద అపారమైన గౌరవం. అన్నింటినీ మించి, స్నేహశీల స్వభావం. దేవకట్టా గురించి తెలుసుకోవాలంటే ఇంతకుమించి ఏమీ చెప్పనక్కరలేదు. ఈ మధ్యనే నవతరంగం టీం దేవకట్టాను కలిసి తన గురించి, తన సినీప్రస్థానం గురించీ, భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చించింది. ఆ వీడియో ఇంటర్వ్యూ మీ కోసం…నవతరంగంలో

****

సూపర్ హిట్ తమిళ చిత్రాలపై ఒక దళితధృక్కోణం

గత కొన్ని సంవత్సరాలుగా సహజత్వం పేరుతో వచ్చిన కాదల్, పడుత్తివీరన్, సుబ్రమణ్యపురం, వెయిల్ వంటి చిత్రాలలో దళిత పాత్రల చిత్రీకరణ ఎంత సహజంగా ఉంది అని ప్రశ్నిస్తూ వచ్చిన విశ్లేషణాత్మక వ్యాసం మీకోసం...

The current psychological war against dalits in Indian cultural realm is fought by the brahmanical hegemony and ideology with inventions of newer psychological tools especially in cinema. It is evident in the texts of acclaimed tamil films which are celebrated as the depiction of village and real life outlets. These so called new generation tamil industrial cinema also revolves round the dichotomy of life/killing, elites/dalits, happiness/tears etc., and avoids the different complex political aspects of these two sided presentations. Killing of dalit identities and dalit bodies  in the films like Veyil, Kadhal, Pruthiveeran, Subramaniapuram, Vennila KabadiKuzhu etc., are cunningly avoided in the intellectual discourses and are celebrated as refreshements in tamil film culture in the realm of presentation and text. These films are read as the depiction of reality of village and dalit life which were neglected by the Indian cinema seems to be paradoxical...


****

ఇంటర్నెట్ హిందుత్వవాదులు

ఈ మధ్యనే మిడ్ డే పత్రికలో ఒక ఆసక్తికరమైన వ్యాసం వచ్చింది. ఆ లంకె ఇక్కడ ఇస్తున్నాను చూడండి.
"It's a fact that many who assert their Hindu identity online do so by pulling down people of other faith, or by using cuss words. That gives the pseudo-secularists a chance to ridicule us. With time, hopefully, saner voices will speak up for Hindus on the Net,"- Ranojoy

మన తెలుగు బ్లాగులోకంలోనూ వీళ్ళకు కొదవలేదు. 


****

Saturday, April 24, 2010

వ్యభిచారం (?) వృత్తెందుకు కాదు?!

"ఒక సెక్స్ వర్కర్ ఆత్మ కథ" పుస్తకం పై రంగనాయకమ్మ గారు రాసిన విమర్శ కు నేను రాసిన వ్యాఖ్య;

ఆత్మకథలో అదిరాసిన వ్యక్తి అనుభవాలతోపాటూ, అభిప్రాయాలూ, ఆలోచనలూ ఉంటాయి. అంతమాత్రానా అవి అందరూ ఆచరించాలనే ఆశయం ఉందనే అపవాదు సరైనదికాదనే నా వాదన.ఉదాహరణకు హిట్లర్ తన ఆత్మకథలో తాను నమ్మింది రాశాడు. దాంతో మనం విబేధించొచ్చు. కానీ అలా రాయడమే తప్పంటే ఎలా?

అయినా, వేశ్యవృత్తి భారతదేశంలోని అత్యంత ప్రాచీనమైన వృత్తి. కాబట్టి అది వృత్తా కాదా అనే ప్ర్రశ్నే ఉత్పన్నంకాదు. వ్యభిచారం అనే పదం నైతికతకు సంబంధించింది. వృత్తికి కాదు.కాబట్టి సెక్స్ వర్కర్లను వ్యభిచారులు అనడం ఎంతవరకూ సమంజసమో నాకు తెలీదు. కానీ నైతికత ప్రాతిపదికన ఆ fair trade ని అవమానపరిచేలా మాట్లాడటం ఎంతవరకూ సమంజమో నాకైతే ప్రశ్నార్థకమే.

వేశ్యవృత్తి చట్టవ్యతిరేకం కాదు. పబ్లిక్ గా విటుల్ని ఆకర్షించే ప్రయత్నం చెయ్యడం నేరం. వ్యవస్థీకృత బ్రోతల్స్ చట్టవ్యతిరేకం.ఔనన్నా కాదన్నా సమాజంలో వ్యభిచారం ఉంది. ఉంటుంది. గౌవమైన కుటుంబాలలో మాత్రం వ్యభిచరించడం లేదా! ఇక వేశ్యవృత్తి అంటారా పెళ్ళి వ్యవస్థ ఉన్నంతవరకూ అదీ ఉంటుంది.

****

Wednesday, April 21, 2010

‘ప్రస్థానం’ సమీక్షలకు నవతరంగం బహుమతి

మంచి సినిమా ఎక్కడొచ్చినా ఎలుగెత్తిచాటే తెలుగు వేదిక నవతరంగం.అలాంటిది తెలుగులో వచ్చే మంచి సినిమాల గురించి చెప్పకపోవడం అన్యాయమే అవుతుందనే స్పృహతో, తెలుగు సినిమా సమీక్షలు ప్రచురిస్తే అనవసరమైన రభసలేతప్ప సభ్యత కలిగిన చర్చలు జరగవనే అనుభవం కలిగినా, వాటన్నింటినీ పక్కనబెట్టి ‘ప్రస్థానం’ చిత్రం సమీక్షని ప్రచురించడం జరిగింది.
మంచి సినిమాని ప్రోత్సహించే వేదికగా నవతరంగం “ఉత్తమ సమీక్షకు ఐదువేలు” పోటీ నిర్వహిస్తోంది.

వివరాలకు నవతరంగం చూడండి.

****

Monday, April 19, 2010

ప్రస్థానం - తప్పక చూడండి !

ప్రస్థానం సినిమా చూసి బయటకు రాగానే నాకొచ్చొన ఫీలింగ్, “ఎంత కాలానికి తెలుగులో మంచి సినిమా చూశానూ!” అని.
ఆ తరువాత నిజంగానే ఆలోచించా, “ఈ మధ్యకాలంలో నాకు బాగానచ్చిన తెలుగు సినిమా ఏమిటా?”.
గుర్తుకురాలేదు…
నిజంగా….అస్సలు గుర్తుకురాలేదు.
అందుకే “తప్పక చూడండి” అని చెప్పడానికి ఇది రాస్తున్నాను.
ప్రస్థానం…DON’T MISS IT.




ప్రస్థానం సమీక్ష కోసం నవతరంగం చూడండి. 
****

Thursday, April 15, 2010

తెలుగమ్మాయి తమిళ సినిమా...

ఈమధ్య వచ్చిన అంగాడి తేరు (అంగడి వీధి) చిత్రంలో నటించిన అంజలిని అలనాటి మేటి నటీమణులైన రేవతి, సుహాసిని స్థాయితో పోల్చాడు దర్శకుడు వసంత్ బాల.
చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఈ అమ్మాయి తెలుగమ్మాయి.

2006 లో వచ్చిన ‘ఫోటో’అనే తెలుగు చిత్రంతో తెరంగేంట్రం చేసిన ఈ నటి తరువాత 2007 లో ‘కట్రాతు తమిళా’(Katrathu Thamizh) అనే సినిమాతో తమిళంలో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాతో తన నటనను నిరూపించుకుని ఇప్పుడు అంగడి తేరు తో మరోమారు తనని తాను ప్రూవ్ చేసుకుంది.

తమిళ సినిమాని పొగిడిన ప్రతిసారీ పొరుగింటి పుల్లగూరు రుచి అనే తెలుగు సినీప్రేమికులు ఈ విషయంలో తమిళోళ్ళని ఏమంటారో !
ఈ నటి తెలుగమ్మాయి అని గర్విస్తారా….లేక తమిళోళ్ళు కూడా పక్కింటి పుల్లగూర కోసం అర్రులుచాస్తున్నారని గర్హిస్తారా!!!
మన తెలుగోళ్ళు గుర్తించని ప్రతిభని తమిళోళ్ళు గుర్తించి ప్రోత్సహిస్తున్నారని సిగ్గుపడతారా?

*****

Wednesday, April 14, 2010

చివరకు మిగిలేది - అమృతం

అమృతం 'మంచి వ్యవహర్త' అనే అనిపిస్తుంది నాకు.

అదేమీ negative పదం కాదు.అలా బ్రతకనేర్వకపోతే "ఆడతనాన్ని" కాపాడుకోవడం అప్పటి/ఇప్పటి సమాజంలో కష్టమైన విషయం. సమాజానికి కావలసిన "నటన" చేస్తూనే, తన అవసరాల్నీ ఆకాంక్షల్నీ ప్రేమగా తీర్చుకునే నేర్పరి అమృతం.

Unconditional ప్రేమ అందిస్తూనే తన తరఫున్నుంచీ అన్నికండిషన్లనూ తీర్చుకునే ఒక (అ)సాధారణమైన ఆడది అమృతం. తన పరిధిలో విప్లవాలు లేవదీయకుండా లౌక్యంతో అవసరాలు తీర్చుకునే తెలివిమంతురాలు. దయానిధికి సహాయపడుతూనే తన అవసరానికి ఉపయోగపడుతుంది అమృతం. ఒకరకమైన balancing act లో తను సిద్ధహస్తురాలు.

బహుశా ఇలాంటి స్త్రీలే ఈ సమాజంలో పవిత్రంగా మనగలుగుతారు. ఆ survival instinct కి ప్రతీక అమృతం. ఆ "ముగ్ధజాణతనానికి" చిహ్నం అమృతం. అందుకే ఈ పాత్ర మగాడికి, ముఖ్యంగా దయానిధి వంటి తాత్వికుడికి అర్థం కాదు. సామాజిక "వ్యవహారాలు" తాత్వికులకి అర్థం కావు. పైగా స్త్రీలలోని వ్యవహర్తతత్వం అస్సలు కాదు.

ఎందుకో నాకు బుచ్చిబాబు ‘చివరకు మిగిలేది’కీ గురుదత్ ‘ప్యాసా’కూ చాలా సిమిలారిటీస్ కనిపిస్తాయి. రెండూ నా జీవితాన్ని ప్రభావితం చేసినవే.

అమృతం పాత్రకు నవలలో భావస్వేచ్చ లేదు. అమృతం ఎప్పుడూ తనకోసం తాను బ్రతకలేదు. ఇతరులను సంతృప్తిపరచి తన "స్థానాన్ని"కాపాడుకోవటానికి బ్రతికింది. అందుకే "నటన" అమృతానికి ఒక సహజమైన అవసరం. ఇందులో నెగిటివ్ గా ఫీలవ్వడానికి ఏమీ లేదు.

భర్త జమాబందీ, అత్త జబర్దస్తీల మధ్య, పిల్లల లేమి తనను "తన ఇంటికి" దూరం చేస్తుందన్న కటికనిజం నేపధ్యంలో దయానిధితో అమృతం కలయిక జరుగుతుంది. దయానిధిపైన అమృతానికి ఎప్పుడూ ప్రేమ ఉండుండొచ్చుగాక, కానీ ఈ కలయికలోని అమృతం యొక్క ఉద్దేశం "కేవలం ప్రేమ" కాదు. అలా కాకున్నా తప్పులేదు. She did it for her survival. ఇందులో దయానిధికి జరిగిన నష్టంకూడా ఏమీ లేదు. He is rich by one experience. He got some thing more to think about.All he needed out of life was to "think about life", rather than living it.

అమృతం నైతికతను నేను ప్రశ్నించడం లేదు. అలా ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు. నేను అమృతం ఉన్న పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికి మాత్రం ప్రయత్నిస్తున్నాను.

‘అమృతం selflessness లో selfishness ఉంది’ అనే ప్రతిపాదన ఆ పాత్రపట్ల కఠినంగా అనిపించినా, నవలలో దానికి ఆధారాలు బోలెడు.స్వార్థపరురాలిగా ఉండటంలో తప్పులేదే? self centered గా ఉంటేతప్పు. ఇతరుల జీవితాలతో ఆడుకునే స్వార్థం ఉంటే తప్పు. కానీ అమృతం ప్రేమించే స్వార్థపరురాలు.

(ఇవి నెమలికన్ను బ్లాగులో నేను అమృతం పాత్రపై రాసిన వ్యాఖ్యలు)

****

అంగడి వీధి

గత పది సంవత్సరాలుగా మనకళ్ళ ముందే కొన్ని వందల షాపింగ్ మాల్స్ వచ్చేశాయి. వచ్చేపొయ్యేవాళ్ళ హడావుడి. సంతను మరిపించే సందడి. ఉత్సవాన్ని గుర్తుతెచ్చే ఒరవడి.సూపర్ మార్కెట్ల జిలుగుల్లో, నియోన్ లైట్ల వెలుగుల్లో మనల్ని మనం మర్చిపోయి వస్తువులతో పాటూ అనుభవాల షాపింగ్ చేసుకొచ్చేయ్యడమే మనకు తెలిసిన ఆనందం. ఆ అందమైన అనభవాన్ని మనకు అందించేవారి వెనుక కొన్ని చీకటి కోణాలుంటాయని గానీ, కొన్ని వందల బ్రతుకులు అడకత్తెరలో పోకచెక్కల్లా మారిపోయాయని మనకు తెలీదు. బహుశా తెలియాల్సిన అవసరం కూడా లేదేమో ! కానీ అవి తెలిస్తే!? మన షాపింగ్ అనుభవాల్లోని తీపిదనం చేదెక్కదా?  ఏమో!!


బిగ్ బజార్లూ, షాపింగ్ మాల్స్ రాక ముందునుంచే చెన్నై నగరం ఈ కొత్త ఒరవడిని తన సొంతం చేసుకుంది. నిజానికి ‘వాల్ మార్ట్ సంస్కృతిని భారతదేశంలోకి ఎలా తీసుకురావాలా!’ అని ఆలోచిస్తున్న కొందరు వ్యాపారులకు ప్రేరణగా నిలిచింది. బిగ్ బజార్ (ప్యూచర్ గ్రూప్) అధినేత ‘కిషోర్ బియానీ’ తన వ్యాపార అనుభవాల్ని పంచుకుంటూ, బిగ్ బజార్ ఎలా పెట్టాడో వివరిస్తూ తన ప్రేరణ చెన్నైలోని శరవణ స్టోర్స్ అని చెప్పడం అందరికీ తెలిసిందే. అలాంటి చెన్నైలోని ఒక సాంప్రదాయక షాపింగ్ మాల్ వెలుగుజిలుగుల మాటునున్న చీకటి బ్రతుకుల గురించి అంతే శక్తివంతంగా తెలియజెప్పిన చిత్రం “అంగడి తేరు” (అంగడి వీధి).

పూర్తి సమీక్ష కోసం నవతరంగం చూడండి.
****

Monday, April 5, 2010

‘పొద్దు’లో నా కవిత - షర్టులేని కన్నీరు

పొద్దు వెబ్ జైన్ లో నా కవిత ఎడిటెడ్ వర్షన్ వచ్చింది. 
పూర్తి కవిత ఇక్కడ ఉంచుతున్నాను.
-----------------------------------------
నీ జ్ఞాపకాలతో బరువెక్కిన మనసు
సమ సాంద్రత నీళ్ళని 
కళ్ళలో నింపి కన్నీళ్ళొదిలింది
అచ్చంగా... 
ఆర్కెమెడీస్ సూత్రాన్ననుసరించింది

నువ్వెళ్ళిపోయిన చర్య
నన్ను జఢుణ్ణి చేసిందేగానీ
ప్రతిచర్యకు పురికొల్పలేదు
న్యూటన్ సూత్రం తప్పిందా?
లేక...
నీలేమి శూన్యంలో
సూత్రమే మారిపోయిందా!

తర్కం తెలిసిన మెదడు
మనసు పోకడకు
హేతువు కోరింది 
నీ శూన్యాన్ని... 
కనీసం కొలిచైనా
సాంత్వన పొందే
దారి వెదికింది

నీ చితి మటలు ఎగసాయి
ఆ కాల్చేవేడిని చల్లారుస్తూ 
నాకళ్ళ మబ్బులు కమ్ముకున్నాయ్
వర్షించే కళ్ళతొ 
అర్థనగ్నంగా 
నేను కూర్చునే ఉన్నాను

అప్పుడు తెలిసింది...
కన్నీరుకార్చే మగాడికి షర్టెంత అవసరం అని.

(Inspired from CVS Sarma's short story)
****

Saturday, April 3, 2010

చూడాల్సిన సినిమా: చూడ్డానికి సాధారణంగా కుదరని సినిమా - పాంచ్

సెన్సార్ అయిదు సంవత్సరాలు సర్టిఫికేట్ ఇవ్వకుండా ఆపితే, ఇప్పుడు నిర్మాతలు అసలు రిలీజ్ చెయ్యాలా వద్దా అనే మీమాంశలో ఉన్న చిత్రం "పాంచ్". బ్లాక్ ఫ్రైడేతో విమర్ల ప్రశంశలు అందుకున్నా, దేవ్D చిత్రంతో కమర్షియల్ సక్సెస్ చవిచూసినా తన మొదటి సినిమా పాంచ్ మాత్రం ఇప్పటివరకూ రిలీజుకు నోచుకోకపోవడం అనురాగ్ కశ్యప్ స్పెషాలిటీల్లో ఒకటి అనుకోవాలేమో.

ఈ మధ్యనే ఈ సినిమా చూశాను. "ఎలా?" అని అడక్కండి. ఇప్పటికే పాంచ్ ను అండర్ గ్రౌండ్ సినిమా ప్రేక్షకులు చాలా సార్లు చూసేసారనడానికి నేనొక ఉదాహరణ అంతే. "ఇలాంటిదొకటుందా" అని అడక్కండి కొంత explore చేసే మీకూ తెలిసొస్తుంది. సినిమా మాత్రం బ్రహ్మాండం. తప్పకుండా చూడాల్సిన సినిమా. అంతే!

*****