Thursday, April 15, 2010

తెలుగమ్మాయి తమిళ సినిమా...

ఈమధ్య వచ్చిన అంగాడి తేరు (అంగడి వీధి) చిత్రంలో నటించిన అంజలిని అలనాటి మేటి నటీమణులైన రేవతి, సుహాసిని స్థాయితో పోల్చాడు దర్శకుడు వసంత్ బాల.
చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఈ అమ్మాయి తెలుగమ్మాయి.

2006 లో వచ్చిన ‘ఫోటో’అనే తెలుగు చిత్రంతో తెరంగేంట్రం చేసిన ఈ నటి తరువాత 2007 లో ‘కట్రాతు తమిళా’(Katrathu Thamizh) అనే సినిమాతో తమిళంలో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాతో తన నటనను నిరూపించుకుని ఇప్పుడు అంగడి తేరు తో మరోమారు తనని తాను ప్రూవ్ చేసుకుంది.

తమిళ సినిమాని పొగిడిన ప్రతిసారీ పొరుగింటి పుల్లగూరు రుచి అనే తెలుగు సినీప్రేమికులు ఈ విషయంలో తమిళోళ్ళని ఏమంటారో !
ఈ నటి తెలుగమ్మాయి అని గర్విస్తారా….లేక తమిళోళ్ళు కూడా పక్కింటి పుల్లగూర కోసం అర్రులుచాస్తున్నారని గర్హిస్తారా!!!
మన తెలుగోళ్ళు గుర్తించని ప్రతిభని తమిళోళ్ళు గుర్తించి ప్రోత్సహిస్తున్నారని సిగ్గుపడతారా?

*****

9 comments:

శ్రీనివాసమౌళి said...

ఇలా జరగటం కొంత సహజమే అనుకుంటా... విక్రం(అపరిచితుడు) తెలుగులో చాలా చిన్న చిన్న వేషాలు వేసి తమిళ్ లో మంచి బ్రేక్ సంపాదించుకున్నారు.. అలాగే సంగీత దర్శకుడు విద్యాసాగర్... తెలుగులో(కొన్ని పెద్ద సినిమాలు చేసినా) పెద్దగా క్లిక్ కాలేదు... ఆయన తమిళ్ లో చాలా పెద్ద సంగీత దర్శకుడిగా మారారు.. తరువాత మళ్ళీ తెలుగులో ఒట్టేసి చెబుతున్నా,స్వరాభిషేకం లలో చేశారు.. story has other angle too... dance masters like Amma Rajasekhar and lawrence got busy in telugu...

sowmya said...

ఇదే మాట నేను నవతరంగం లో మీ టపాకి వ్యాఖ్యగా రాదామనుకున్నాను, ఇక్కడ మీరు రాసేసారు. తమిళ్ వాళ్ళకి పొరుగింటి పుల్లకూర రుచి తెలిసింది అనడం కన్నా, తెలుగు వాళ్ళు సొంతింటి కమ్మని కూరని విస్మరిస్తున్నారు అనుకోవడం
సబబేమో. ఆమె అంత గొప్ప నటి అయిఉండి కూడా తెలుగులో ఆమెకి అవకాశాలు రావట్లేదో,ఇవ్వట్లేదో! బహుసా పాటలకే పరిమితమయ్యే పాత్రలు ధరించనందేమో! బరువు తగ్గి, జీవం కోల్పోయి అంగాంగ ప్రదర్శన చేయనందేమో......ఎవరికి తెలుసు !

కత్తి మహేష్ కుమార్ said...

@శ్రీనివాసమౌళి: సమస్య అక్కడ్నించీ ఇక్కడికి రావడం లేక ఇక్కడ్నించీ అక్కడికి వెళ్ళడం అనేది కాదు.అసలు సమస్య, ఉన్న ప్రతిభని గుర్తించలేని మన చేతకానితనానిది.మరొకరి (తమిళోళ్ళ) ప్రతిభని గుర్తిస్తే వచ్చే అక్కసుది. మన ఆభిజాత్యానిది.

@సౌమ్య: మొన్నొక సినీరచయితతో మాట్లాడుతుంటే ఆయన ఒక దిగ్దర్శకుడి ప్రహసనం చెప్పుకొచ్చాడు. ఆ దర్శకుడి సినిమాకి ఒక ప్రముఖ హిందీ హీరోయిన్ కావాల్సొచ్చిందట. ఆ అమ్మాయిని ఒప్పించడానికి మధ్యవర్తిగా (ఆయన బొంబాయి లింకుల్ని దృష్టిలో ఉంచుకుని) ఈ రచయితని పంపాలనుకున్నారు. ఈయన "హీరోయిన్ పాత్రేమిటి సార్?" అంటే ఆ మహాదర్శకుడు "తెలుగు సినిమాలో హీరోయిన్ కు పాత్రేమిటుంటుందయ్యా? ఈ సినిమాలో హీరోయిన్ జర్నలిస్టుగా ఒక ఛానల్లో పనిచేస్తూ హీరోని ప్రేమించి ఒక రెండు పాటలు ఫస్టాఫ్ లో పాడుతుంది. అంతే" అన్నాడట. ఈ రచయిత ఆ జర్నలిస్టు అనే పాయింటుచుట్టూ ఒక కొత్తకథనల్లి ఆ హీరోయిన్ను ఒప్పించి డేట్లు ఇప్పించాడట. అది మన సినిమాల్లో నాయిక పాత్రల తీరు. మరి ఈ అమ్మాయి ఇక్కడున్నా నటిగా ఎలా నిరూపించుకునుండేదో నాకైతే డౌటే!

sowmya said...

హ్మ్ అంత దీనావస్థలో ఉంది తెలుగు హీరోయిన్ పరిస్థితి. ఈ మాటలని ఆ హీరోయిన్లందరు చదివితే బాగుందును.

sowmya said...

ఈ సినిమా పేరు "అంగాడి" తెరు. అంగాడి అంటే దుకాణం అని అర్థం

కత్తి మహేష్ కుమార్ said...

@సౌమ్య: దుకాణానికి తెలుగులోకూడా "అంగడి" అనే మరో పర్యాయపదం ఉంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఈ పదాన్నే విరివిగా వాడతారు. అంగడి తెరు కు "బజారు వీధి" అనే అనువాదం కూడా సరిపోతుంది.

sowmya said...

అంగడి అనే పదం ఉందని నాకూ తెలుసండీ, "అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోటిలో శని" అనే సామెత కూడా ఉంది మనకి. కానీ నేను చెప్తున్నది తమిళ ఉచ్చారణ గురించి. వాళ్ళు దాన్ని "అంగాడి తెరు" అంటున్నారు మరి. తెలుగులో మనకి అంగడి అవ్వొచ్చు, కానీ వాళ్ళకి అది "అంగాడి". ఈ విషయం నాకు నా తమిళ స్నేహితుల ద్వారానే తెలిసింది.

KTV, sunTV లలో ఈ అంగాడి తెరు సినిమా విశ్లేషణ చూసాను. అందులో కూడా వాళ్ళు అంగాడి అంటున్నారు. నాకు తమిళ్ బాగా వచ్చు, రాయడం చదవడం కూడా. నాకున్న ఙ్ఞానంతో చూస్తే కూడా అది అంగాడే. గ కి దీర్ఘం ఉంది.

కత్తి మహేష్ కుమార్ said...

ఓ చర్చ "దీర్ఘం" గురించా! చెప్పినందుకు ధన్యవాదాలు. మారుస్తున్నాను.

sowmya said...

హ హ హ భలేవారే, మరింక దేని గురించనుకున్నారు? అంగాడి అని రాసి quotes లొ కూడా పెట్టాను కదండీ ముందే :)