Saturday, April 24, 2010

వ్యభిచారం (?) వృత్తెందుకు కాదు?!

"ఒక సెక్స్ వర్కర్ ఆత్మ కథ" పుస్తకం పై రంగనాయకమ్మ గారు రాసిన విమర్శ కు నేను రాసిన వ్యాఖ్య;

ఆత్మకథలో అదిరాసిన వ్యక్తి అనుభవాలతోపాటూ, అభిప్రాయాలూ, ఆలోచనలూ ఉంటాయి. అంతమాత్రానా అవి అందరూ ఆచరించాలనే ఆశయం ఉందనే అపవాదు సరైనదికాదనే నా వాదన.ఉదాహరణకు హిట్లర్ తన ఆత్మకథలో తాను నమ్మింది రాశాడు. దాంతో మనం విబేధించొచ్చు. కానీ అలా రాయడమే తప్పంటే ఎలా?

అయినా, వేశ్యవృత్తి భారతదేశంలోని అత్యంత ప్రాచీనమైన వృత్తి. కాబట్టి అది వృత్తా కాదా అనే ప్ర్రశ్నే ఉత్పన్నంకాదు. వ్యభిచారం అనే పదం నైతికతకు సంబంధించింది. వృత్తికి కాదు.కాబట్టి సెక్స్ వర్కర్లను వ్యభిచారులు అనడం ఎంతవరకూ సమంజసమో నాకు తెలీదు. కానీ నైతికత ప్రాతిపదికన ఆ fair trade ని అవమానపరిచేలా మాట్లాడటం ఎంతవరకూ సమంజమో నాకైతే ప్రశ్నార్థకమే.

వేశ్యవృత్తి చట్టవ్యతిరేకం కాదు. పబ్లిక్ గా విటుల్ని ఆకర్షించే ప్రయత్నం చెయ్యడం నేరం. వ్యవస్థీకృత బ్రోతల్స్ చట్టవ్యతిరేకం.ఔనన్నా కాదన్నా సమాజంలో వ్యభిచారం ఉంది. ఉంటుంది. గౌవమైన కుటుంబాలలో మాత్రం వ్యభిచరించడం లేదా! ఇక వేశ్యవృత్తి అంటారా పెళ్ళి వ్యవస్థ ఉన్నంతవరకూ అదీ ఉంటుంది.

****

47 comments:

తెలుగు వెబ్ మీడియా said...

ఏ స్త్రీకి వ్యభిచారం చేసే పరిస్థితి ఉండకూడదు అని రంగనాయకమ్మ గారు అన్నారు. మరి నళిని జమీలా అలా కాదు, డాక్టర్లు &‌ టీచర్లు లాంటి వృత్తిదార్లకి ఇచ్చిన గౌరవం వేశ్యలకి కూడా ఇవ్వాలని అంది. అందుకే రంగనాయకమ్మ గారు ఆమెని విమర్శించారు.

సుజాత వేల్పూరి said...

ముందు నాకో విషయం చెప్పండి! మీరు నళిని రాసిన పుస్తకం చదివారా లేదా?

వ్యభిచారం అనేది నైతికతకు సంబంధించిన పదం కావొచ్చు! అక్కడికి వస్తున్న పురుషుల పరంగా చూస్తే అది వ్యభిరాచమేగా! వేరెవరి వ్యభిచారానికో(అనైతికతకు) సెక్స్ వర్క్ తోత్పడుతున్నట్లా కాదా?

అవసరార్థం పొట్ట పొసుకోడానికి గతిలేక ఇందులో ఇరుక్కున్న వారికి అది అనైతికమా కాదా అని ఆలోచించే పరిస్థితి ఉండదు.

సమాజానికి ఏ రకంగానూ ఉత్పాదకతను కానీ, సర్వీస్ ని కానీ అందించకుండా కేవలం "శరీరాన్ని" కొద్ది సేపు అద్దెకిచ్చి సంపాదించే వృత్తి ఒక వృత్తి ఎలా అవుతుంది?

వృత్తి అనేదాంట్లో సంతోషం, తృప్తి లభించాలి. నళిని ఆత్మకథలో రాసుకున్నంత మాత్రాన సంతోషంగా ఉన్నట్లు కాదు. మరో పక్క ఆమె ఆ వృత్తిలో ఎన్ని అవమానాలు, హింస అనుభవించిందో చెప్తూనే దాన్ని 'ప్రేమ" బంధంగా అంగీకరించమంటే ఎలా ఒప్పుకోవాలి?

సెక్స్ వర్కర్లు దాదాపుగా గతిలేని పరిస్థితిలోనే ఆ పనికి దిగుతారు. ఇష్టం లేకుండానే కొనసాగిస్తారు. వ్యభిచారం ప్రాచీన కాలం నుంచి ఉన్నంత మాత్రాన దాని సీనియారిటీ ప్రాతిపదిక మీద దాన్ని వృత్తిగా ఎలా అంగీకరిస్తారు?

లక్షల కొద్దీ స్త్రీలు అందులో ఉంటే వారు ఆ పరిస్థితుల్లోకి రావడానికి కారణం ఏమిటో ఆలోచించాలి కానీ, ఇంతమంది ఉన్నారు కాబట్టి దీనికి వృత్తి హోదా ఇచ్చేద్దామనో, ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉంది కాబట్టి వృత్తి అవుతుందనో అనుకోవడం సరికాదు!

Anonymous said...

వివిధ దేశాల్లో Sex Workerల గురించిన వివరాలు, చట్టపరమైన అంశాలు చక్కగా ఇవ్వడం జరిగింది, ఒక సారి ఈ లంకెను చూడండి.

http://en.wikipedia.org/wiki/Prostitution_in_Europe#Prostitution_in_Belgium

Anonymous said...

కొంతమంది దీన్ని ఎందుకు సమర్ధిస్తారు, మరి కొంతమంది దీన్ని ఎందుకు సమర్ధిస్తారు?

వ్యతిరేకించే వారి కారణాలు:
1) నైతికంగా తప్పు.
2) దీని కారణంగా human trafficking పెరిగి ఆడపిల్లలను ఎత్తుకెల్లడం, వారిని బలవంతంగా ఇందులోనికి దింపడం ఈ క్రమంలో స్త్రీలపై జరిగే హింస.
3) ఆరోగ్యపరన్‌గా ఇది చాలా సమస్యలను తీసుకు వస్తుంది.
4) స్త్రీల ఆత్మగౌరవానికి భంగపాటు.

సమర్ధించే వాల్లకుండే కారణాలు:
1) మొదటిది, బయటకి చెప్పడానికి చాలా మంది భయపడేదీ, అయినా అందరికీ తెలిసింది. దీని వల్ల మగవారికి ఎంతో ఇష్టమైన sex దొరుకుతుంది. మగవాడు ఒక వయస్సొచ్చిన తరువాతా పొందడానికి ఎంతో తపించే ఒక సుఖాన్ని, ఎలాంటి Emotional Attachment లేకుండా, ఎవ్వరినీ బతిమాడాల్సిన పని లేకుండా, అతి సులభంగా కొంత డబ్బు చెల్లించి, తనకు కావాల్సిన సమయములో, తనకు నచ్చిన వ్యక్తితో (ఉన్న వాల్లలో) తెచ్చుకోగల అవకాశం వుండడం. మన సమాజములో Sex మీద వున్న ఆంక్షలు మనకు తెలీనివి కావు. మగవాడు ఈ వ్యభిచారం ద్వారంగా కాకుండా మరో మార్గములో sex పొందడానికి చాలా కష్టపడాలి. లేదా బుద్దిగా పెల్లి చేసుకొని ఒక life time commitment ఇవ్వాలి. రెండింటిలో ఏది సులభం?
2) AIDS లాంటి వ్యాధుల వ్యాప్తి:
ఈ వ్యభిచారం కారణంగా ప్రభలే వ్యాధులు sex worker లను వారి వద్దకు వెల్లే మగవాల్లనే కాదు, అన్నెం పుణ్యం ఎరుగని అమాయకురాల్లైన స్త్రీలు, పిల్లలకు కూడా ప్రమాదం వుంది (భార్య, పిల్లలు). కానీ ఇది చట్టబద్దత కానీ కారణంగా sex workerలు సరైన చికిత్సకు నోచుకోక పోవడం.
3) ఇది వరకే ఆ వృత్తిలో వున్న వారు, మరో విధంగా బతకడానికి సమాజం తమను ఆధరించదనీ, తమకు ఇది తప్ప మరో మార్గంలేదనీ భావించడం.

ఇంకా చాలా చెప్పొచ్చు. ప్రస్తుతానికి నాకు గుర్తుకు రావడం లేదు. ఏది అఏమైన ఒకటి మాత్రం నిజం. Giving sex is a power. ఈ విషయంలో మాత్రం నాకు ఎటువంటి అనుమానాల్లేవు.

KAMAL said...

ఒకప్పుడు వేశ్యావృత్తి భారతదేశంలో అత్యంతప్రాచీన వృత్తే కావచ్చు. కాని ఇప్పుడు ఉన్నరోగాల వల్ల దీన్ని ప్రోత్సహించకూడదు.

@ఇక వేశ్యవృత్తి అంటారా పెళ్ళి వ్యవస్థ ఉన్నంతవరకూ అదీ ఉంటుంది.

తప్పు.

పెళ్లి అనే వ్యవస్థ లేకపోతే ఇంకా ఉండేది అంతా వేశ్యా వ్యవస్థే...

Kathi Mahesh Kumar said...

@సుజాత: నళిని పుస్తకం చదివాను. స్త్రీవాదుల విపరీత ధోరణుల గురించి రంగనాయకమ్మ observations తో నేను అంగీకరిస్తానుకూడా. కానీ జడ్జిమెంటుతో మాత్రం విబేధిస్తాను.

సెక్స్ వర్కర్ల స్థితిగతులు, సమస్యలు, మానవహక్కుల ఉల్లంఘనలు వాటి గురించి కాదుకదా ఇక్కడ చర్చ!

తెలుగు వెబ్ మీడియా said...

ప్రాచీన కాలంలో వేశ్యావృత్తి ఉన్నంతమాత్రాన ఇప్పుడు సమర్థించలేము. ప్రాచీన కాలంలో ఈజిప్ట్ కి చెందిన ఒక చక్రవర్తి తన కన్న తల్లినే పెళ్ళి చేసుకున్నాడు. అప్పట్లో అది నేరం కాదు. ఇప్పుడు అలాంటి పెళ్ళిళ్ళని సమర్థిస్తే పట్టుకుని తంటారు.

Anil Dasari said...

దొంగతనం కూడా ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన వృత్తే. వేశ్యావృత్తితో దీనికి చాలా పోలికలున్నాయి. ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా సమాజంలో దొంగతనాలు జరుగుతూనే ఉంటాయి. మరి దాన్ని కూడా fair trade అందామా? దొంగోళ్ల దీనగాధల్ని సానుభూతితో వినని మనం వేశ్యల ఆత్మకథలకి మాత్ర ఆ వెసులుబాటెందుకీయాలి?

తెలుగు వెబ్ మీడియా said...

పాకీవృత్తిలో ఉన్నవాళ్ళపై సానుభూతి ఉండొచ్చు. వాళ్ళు దొంగలలాగ కొంపలకి కన్నాలు వెయ్యరు, వేశ్యలలాగ సంసారాలు కూల్చరు. నళిని జమీలా వేశ్యావృత్తి నుంచి బయటకి రావడానికి ప్రయత్నించలేదు. తాను ఆ వృత్తిలోనే ఉంటానని, ఆ వృత్తిలో ఉన్నవాళ్ళు బయటకి రాకపోయినా గౌరవించాలని కోరింది.

కొసమెరుపు said...

అనాదిగా జరుగుతున్నంత మాత్రాన దొంగ తనాన్ని వ్రుత్తి అనలేం.

ప్రతి వృత్తికి provider, customer ఇద్దరూ తప్పనిసరి. customer డబ్బు కాని మరో ప్రతిఫలం కాని ఇచ్చి provider వద్ద సర్వీసు పొందుతాడు. వ్రుత్తి వ్యాపారంలో భాగంగా వీరిద్దరి ప్రయోజనాలు నెరవేరుతాయి. వేశ్యా వృత్తిలో కూడా వేశ్య, విటుడు, వీరిద్దరి ప్రయోజనాలు ముడి పది ఉన్నాయి. ఎందుకో పైన కొదరు చెప్పారు.

కాని దొంగ తనం వల్ల అది చేసే వారికి తప్ప ఎవరికీ ప్రయోజనం ఉండదు. ఇక్కడ ప్రొవైడరూ లేడు, సర్వీసూ లేదు. కాబట్టి దొంగ తనాన్ని వేశ్యా వ్రుత్తితో పోల్చడం తెలివి తక్కువ వాదన.

Krishna Karthik said...

అబ్రకదబ్ర గారు దొంగతనంతో వేశ్యావృత్తిని చాలా బాగా పోల్చారు. ఒకరి కడుపు కొట్టి దొంగతనం చేయడం ఖచ్చితంగా నేరం, కాని వైశ్యా వృత్తిలో ఇద్దరూ సుఖపడతారు. అయినా ప్రక్కన వాడికి ఇబ్బంది కలగ నంత వరకు ఏ పని అయినా తప్పు అనిపించుకోదు, ఇది తప్పు అనుకుంటే జర్మని లాంటి దేశాలు వీటిని చట్టం చేయవు, మనం సంఘలో బ్రతుకుతున్నాం కొన్ని కట్టుబాట్లు వండవచ్చు, కాని ఎవరి అబిప్రాయాలు వారివి, అడ్డుకున్నంత మాత్రానా ఈ వ్యవస్ధ ఆగదు, దీనికి ఒకటే పరిష్కారం దీనిని చట్టం చేయాలి, వారికి తగిన గౌరవం ఇవ్వాలి, అయితే బ్రోకర్ వ్యవస్ధ ఇందులో చొరబడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

Anil Dasari said...

వృత్తి అనే పదానికి నిర్వచనం భలేగా సెలవిచ్చారు. ఒప్పుకుందాం. ఒకవేళ మీ ఇళ్లలో వాళ్లూ ఈ మహాగొప్ప సర్వీసు వృత్తిలోకి ప్రవేశిస్తే అప్పుడూ ఇదే పాట పాడతారా తెలం-గానం గారూ? మీ విశాల భావాలు అప్పుడు ఇరుకైపోతాయేమో.

ఎదుటి వాళ్లని తెలివి తక్కువోళ్లనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోకపోతే ఇలాంటి స్పందనే వస్తుంది. జాగ్రత్త.

Kathi Mahesh Kumar said...

@అబ్రకదబ్ర: మీ వాదన ఎంత సిల్లీగా ఉందో మీకే తెలుసు. ఒకసారి మళ్ళీ చూసుకోండి. అప్పుడైనా ఆ స్పృహ కలుగుతుందేమో!

Anonymous said...

అబ్రకదబ్ర గారూ,
ఇటువంటి వ్యాఖ్యలు దయచేసి వాడడం మానేయండి. మనం ఒక అభిప్రాయాన్ని మాత్రమే చెబుతున్నాం ఇక్కడ. ప్రతీ వ్యక్తికీ తమ ఇంట్లోవాల్లు కొన్ని చేయడం నచ్చదు. అంత మాత్రాన అవన్నీ తప్పై పోవాల్సిన అవసరం లేదు కదా.

రోడ్లు ఊడ్చేవాల్లను మనం తప్పు చేస్తున్నారని చెప్పం. కానీ, ఆపని మన ఇంట్లో వాల్లు చేస్తే ఫీలవుతాం, అవునా...? అంతమాత్రాన రోడ్లుడ్చే పని తప్పవ్వదు కదా..?

Kathi Mahesh Kumar said...

అబ్రకదబ్ర: Every job is a prostitution in one way or the other. తెలివినో,శ్రమనో, నైపుణ్యాన్నో ఫణంగా పెట్టే డబ్బు "సంపాదిస్తాం". మరి ఇష్టంగానో అయిష్టంగానో, బలవంతంగానో, బలయ్యో వేశ్యలు ఒళ్ళమ్ముకుని డబ్బులు సంపాదిస్తారు. మరి దాన్ని నైతికంగా నీచమని నిర్ణయించడానికి మీరెవరు? అది వృత్తేకాదనడానికి రంగనాయకమ్మ ఎవరు?

చట్టాల ఉల్లంఘన, మానవహక్కుల హననానికి అందరం వ్యతిరేకులమే. నైతికత పేరుతో మనుషుల్ని నీచమడానికి నేను వ్యతిరేకం. దాన్ని ఒకరకంగా మానవహక్కుల ఉల్లంఘనగానే నేను పరిగణిస్తాను.

తెలుగు వెబ్ మీడియా said...

ఒక మగావాడు తాను వేశ్య దగ్గరకి వెళ్తాను కానీ తన భార్య గిగోలో (మగ వేశ్య) దగ్గరకి వెళ్ళకూడదు అని అంటాడు. వ్యభిచారం వల్ల నీతి విషయంలో సమానత్వం రాదు. ఆ విషయమే అబ్రకదబ్ర గారు చెపారు.

కొసమెరుపు said...

అబ్రకదబ్రా,

నీ నీచత్వాన్ని నువ్వే బయట పెట్టుకున్నావ్. దానికి నేను చూడక ముందే దీటుగా స్పందిచిన వారికి థాంక్స్.

ఏ విషయం పై నైనా మాట్లాడేటప్పుడు నీ ఇంట్లోని ఆడాల్లందరినీ అందులోకి ఊహించుకొని మరీ మాట్లాడతావన్న మాట! ఆ అలవాటు మాకు లేదు. మేం విషయాన్ని విషయంగానే చూస్తాం మరి!

నీ తెలివి తక్కువ వాదనని ఏ విధంగానూ సమర్థించు కోలేక నీచత్వానికి దిగావ్. తెలివి తక్కువగా వాదిస్తే స్పందనలు ఎలాగుంటాయో నీకిప్పుడైనా తెలిస్తే సంతోషం.

కొసమెరుపు said...

ప్రవీణూ,

అబ్రకదబ్ర అలా చెప్పారా? నాకు సరిగా అర్థం కాలేదు లెండి. ఏమైనా, ఆయన అన్నీ 'సరైన' పద్ధతిలో 'ఊహించుకొనే' చెప్తారు సుమండీ.

"వ్యభిచారం వల్ల నీతి విషయంలో సమానత్వం రాదు". ఈ వాక్యం నాక్కు సరిగ్గా అర్థం అయినట్టు లేదు. అయినా వ్యభిచారం వాళ్ళ సమానత్వం రావట మేమిటండీ? కాస్త వివరిద్దురూ.

Anonymous said...

ప్రవీనూ,
మొదటిగా ఇతరుల మాటలను మీరు వివరించి చెప్పడం మానెయ్యండి. ఇంకెవరైన అయితే పర్వాలేదుగానీ మీరు వివరించడం మొదలు పెడితే అవతలి వారు చెప్పిన దానికి వ్యతిరేకార్థం వచ్చినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు.

రెండవది. మగవాడు sex worker వద్దకు వెల్లడానికి భార్య అంగీకరిస్తుందా? ఏకాలంలో? సతీసావిత్రి కాలం నాటినుండి ఈ కాలానికి వచ్చి ఆలోచించండి. ఎవరూ తమ భాగస్వామి sex workers దగ్గరికి వెలతానంటే ఎదురొచ్చి శకునం ఇవ్వరు.

మూడవది, క్లుప్తంగా చెప్పడం అన్నది ఒక కళ అది మీకు లేదు(Sorry!I don't want to offend you, but that's the truth). మీరు రాసే టపాలలో, వ్యాఖ్యలలో ఇలాంటి ఏక వాఖ్య వ్యాఖ్యలు అసంబద్దంగా ఉంటాయి. కాబట్టి కాస్త విషదీకరించి చెప్పండి.

Anonymous said...

>>ఇక వేశ్యవృత్తి అంటారా పెళ్ళి వ్యవస్థ ఉన్నంతవరకూ అదీ ఉంటుంది.

ఎత్తుకున్న టాపిక్కేమిటి? దానికీ, పెళ్ళికీ సంబంధం ఏమిటి? ఇప్పుడు ఇక్కడ పెళ్ళి ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఏమైనా ఉందా అసలు? ఈ మాటడిగినందుకు ఇప్పుడు మళ్ళీ ఓ కథ అల్లుతావు.

షరా మామూలే.. ఏదో అర్ధంగాని టాపిక్కు(తమకే) ఎత్తుకుని, కొండని తవ్వేద్దామని ఫీలైపోయి చివరికి ఎలుకని పట్టుకుని బయటపడతావు..

Anil Dasari said...

@మహేష్:

వేశ్యావృత్తి నీచమనీ కాదనీ నేననలేదిక్కడ. రంగనాయకమ్మ గారు ఏమన్నారో కూడా నాకు తెలీదు. నా ప్రశ్నల్లా మీ వాదన గురించి. వేశ్యావృత్తిని fair trade అనేప్పుడు దొంగతనాన్నీ అలాగే ఎందుకనరని అడిగాను. మీరు దానికి మాత్రం సమాధానం చెప్పకుండా ఏవేవో చెబుతున్నారు.

Kathi Mahesh Kumar said...

@అబ్రకదబ్ర: దొంగతనం fair trade ఎలా అవుతుందో కాస్త చెప్పండి? నాకు తెలిసీ దొంగతనమంటే ఇతరుల దగ్గరున్నది దోచుకోవడం. ఒకరి అవసరాలు మరొకరు తీర్చుకుని ఆ సర్విస్ కు సరిపడా డబ్బులు కట్టడం కాదు. కాబట్టి I cannot compare prostitution with robbery and call it a fair trade.

@బ్లాగు వీరుడు: వేశ్యవృత్తికి పెళ్ళివ్యవస్థకి చాలా అవినాభావసంబంధం ఉంది. అతి ప్రతి సమాజంలోనూ ప్రతి కాలంలోనూ ఉండేదే. అది మీకు అర్థం కాకపోతే విశదపరచి చెప్పే తీరిక ప్రస్తుతం నాకు లేదు. వీలైతే Bertrand Russell's Marriage and morals అనే పుస్తకం చదవండి.

Anil Dasari said...

తెలంగానం,

a typical response - very much expected from you. నా నీచత్వం సంగతి సరే. మీదాకా వస్తే ఇది నీచమైన వృత్తైపోయిందా? If you really meant all those golden words you wrote about customer-supplier relationship .. why are you so pissed off by my simple question? When it comes to your folks, you can't even bear the mere thought. Can you?

ఇక నా సంగతి .... అవును. నేను వేరేవాళ్ల పనులనీ, స్వభావాన్నీ వెనకేసుకొచ్చినా, విమర్శించినా అదే పని నావాళ్లు చేస్తే ఎలా స్పందిస్తాననేదీ ఆలోచించుకుని మరీ ఆ పని చేస్తాను. I am not a hypocrite. I practice what I preach, and I am proud of it.

తెలుగు వెబ్ మీడియా said...

నాకు తెలుగులో అంత నైపుణ్యం లేదు. ఇంగ్లిష్ లో చెపుతాను. Accumulation of money through unproductive methods is no better than robbery. Even prostitution is a variety of robbery.

కొసమెరుపు said...

అబ్రకదబ్రా,

మొదట వ్యభిచారానికి, దొంగ తనానికి లంకె కుదర్చ బోయావు. దొంగతనం ఎలా వృత్తిగా భావించ వచ్చని నేననిదిగిన ప్రశ్నకి నీవద్ద సమాధానం లేదు. పైగా 'మీ ఇంట్లో', 'మీవాళ్ళు' అంటూ తలా తోకా లేని లేకి వాదనకు దిగావు. నువ్వు చేస్తున్న వాదన నీచమైనదని చెప్పాను.

నువ్వు మొదటినుండి నా కామెంట్లు జాగ్రత్త చదువు. నేను వ్యభిచారాన్ని వ్రుత్తిగా భావించినా, దొంగ తనాన్ని మాత్రం వృత్తిగా భావించ లేమని మాత్రమే చెప్పాను. అంతే గాని, అది గొప్ప వృత్తా, నీచమైన వృత్తా అని నేను చెప్ప లేదు. దీన్ని 'మహా గొప్ప సర్వీసు' అని పైన నువ్వే వర్ణించావు. ఒక వేళ నీ స్వీయానుభవం తో అలా చెప్పావేమో నాకు తెలియదు. నువ్వు వ్యంగ్యంగా అన్నా, మామూలుగా అన్నా, అనుభవం మీద కాని అనవు కదా! 'I practice what I preach, and I am proud of it' అని తమరే సెలవిచ్చారు కదా.

మొదట ఒక తప్పుడు వ్యాఖ్య వ్రాశావు. దాన్ని ఎలాగైనా సమర్థించు కోవడానికి ఒక లేకి వ్యాఖ్య వ్రాశావు. ఇప్పుడేమో, ముందు వ్యభిచారం ఉన్నత మైనదని చెప్పి, తమరి వ్యాఖ్య చూడగానే భయపడి పోయి నీచమైనదని మాట మార్చానని చెపుతున్నావు. కుడితిలో పడ్డ ఎలకలా వున్న నీ పరిస్థితి చూస్తుంటే నిజంగా జాలేస్తుంది!

తెలుగు వెబ్ మీడియా said...

కుడితిలో పడ్డ ఎలుకలు ఎవరు? నీతి విషయంలో సమానత్వం గురించి అడిగితే సమాధానం చెప్పలేనివాళ్ళా?

KumarN said...

హ్మ్మ్. ఈ టాపిక్ మహత్యం ఏంటి? కాస్తో కూస్తో సెన్సిబుల్ గా మాట్లాడే వాళ్ళు కూడా గాడి తప్పి డొంకల్లోకెళ్ళి మరీ మాట్లాడుతున్నారు? వ్యభిచారానికీ, దొంగతనానికీ వృత్తి పరంగా పారలల్స్ ఏంటి, నాకర్ధం కాలేదు. పైగా ఇంట్లో వాళ్ళని లాక్కు రావటమేంటి మధ్యలోకి అసహ్యంగా, మాట్లాట్టానికి పాయింట్స్ లేక, డిబేట్ చేయటం చేత కాక, బాక్ టు ద వాల్ ఉన్నవాళ్ళు బిలో ద బెల్ట్ హిట్ చేసే లేకి మాటలు అవి.
ఇక్కడ పాయింట్స్ కీ కొదవ లేదు, డిబేట్ చెయటం రాని వాళ్ళూ లేరు. అయినా ఈ జారుడు బండ మీద నుంచి ఈ జారుడు ఏంటో, బాలేదు.

Kathi Mahesh Kumar said...

@చెరసాలశర్మ: వేశ్యావృత్తిలో Accumulation of money through unproductive methods లేవు. శరీరాన్ని ఉపయోగించి శ్రమ చెయ్యడం ఉంది. శ్రమకుతగ్గ ప్రతిఫలం "సంపాదించడం" ఉంది. So, your argument stands no good.

తెలుగు వెబ్ మీడియా said...

శరీరాన్ని అద్దెకి ఇవ్వడం అనే సోకాల్డ్ ఉత్పాదనని ఉత్పాదన అని ఎలా అనుకోవాలి? భార్యాభర్తలు ఇద్దరు సుఖంగా సంసారం చేసుకుంటే వేశ్యలు దగ్గరకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. కేవలం పడుకుని డబ్బులు తీసుకునే పని ఒక శ్రమా?

Kathi Mahesh Kumar said...

@ చెరసాల మార్తాండ శర్మ,
ఉత్పాదన అంటే వస్తువులే కాదండీ వాటిల్లో సేవలు కూడా ఉంటాయి. సినిమా మనోరంజకమైన సాధనమైనట్లే వేశ్యవృత్తీ శారీరక సంతృప్తి అనే సేవను అందించే వృత్తి. కాబట్టి మీ "శ్రమ" డెఫినిషన్ ఇక్కడ కుదరంటే ఎట్లా?

నిజమే సుఖంగా అందరూ సంసారాలు చేసుకుంటే వేశ్యవృత్తి అవసరం లేదు. కానీ పెళ్ళిలో అందరూ సుఖపడిపోయే పరిస్థితి మానవసమాజం ఉన్నంత వరకూ రాదు. So till such time, prostitution will remain a profession.

తెలుగు వెబ్ మీడియా said...

భర్తని ప్రేమగా చూసుకునే భార్య ఉన్నా వేశ్యల దగ్గరకి వెళ్ళి కుతి తీర్చుకునేవాళ్ళ సంగతి ఏమిటి? వ్యభిచారం వల్ల సంసారాలు పాడవుతాయనేది నిజమే కదా.

Anonymous said...

ప్రవీనూ,
మీకు ఒక Internet Cafe వుందని చెప్పినట్లు గుర్తు. మరి దాని వల్ల వచ్చే ఉత్పాదన ఏమిటి? మీరు Internet Cafe ద్వారా ఎటువంటి వస్తువులు ఉత్పత్తి చేయడం లేదు కాబట్టి, అది శ్రమ కాదు. దాని వల్ల (శ్రమ చేయకుండా) సంపాదించిన డబ్బు మీ సిద్దాంతం ప్రకారం దొంగతనమే. కాబట్టి మేము మిమ్మల్ని "దొంగ" అనొచ్చా? అనాలన్న కోరికతో కాదు గానీ, వివరించి చెప్పాలనన్న కోరికతో మాత్రమే దీన్ని రాస్తున్నాను.

తెలుగు వెబ్ మీడియా said...

సంసారాల్ని పాడు చేసే వ్యభిచారానికి ప్రొడక్టివిటీ ఉందా అను నేను అడిగాను. దానికి నా వ్యాపారంతో పోలిక ఏమిటి? నా ఇంటర్నెట్ కేఫ్ లో ఎవరూ సెక్స్ వెబ్ సైట్లు చూడకుండా కాబిన్లు స్థానంలో ఓపెన్ డెస్క్స్ పెట్టించాను. నా వ్యాపారం వల్ల ఎవరి సంసారాలూ కూలవు. వ్యభిచారాన్ని వ్యాపారంతో ముడి పెట్టడం ఏమిటి?

rayraj said...

రంగనాయకమ్మగారి వాదన ఈ విధంగా ఉంది:
అ. ఆకలి, అధిక శ్రమ, నిరుద్యోగం, కులం, మతం, అనారోగ్యం కన్న్నా, అతి క్రూరమైన, నీచమైన దురంతం-వ్యభిచారం.
__ఇది నిజంగా దురంతమేనా? లేక నయం చేయవలసిన అవలక్షణమేనా?

ఆ. మగవాళ్లు విటులుగా తయారైనట్టే, ఆడవాళ్లు వేశ్యలుగా తయారవడం, వారి ఆనందానికి చక్కని మార్గమనే సూచన ఇస్తుంది ఈ పుస్తకం.
___ స్త్రీలు "ఆనందం" కోసం కూడా వేశ్యలవుతారు.ఈ సూచన తప్పెలా ఔతుంది?
>>వేశ్యవృత్తికి కారణం నిరుపేదతనమే అనడానికి సాక్ష్యం. ధనిక కూటుంబాల స్త్రీలలో, వ్యభిచారంతో జీవించేవారెవరూ ఉండకపోవడమే.
___ధనిక స్త్రీలలో వ్యభిచారం లేదా? ఒకవేళ ఈ వృత్తివల్లే కొందరు స్త్రీలు ధనవంతులైపోతుంటే, అదీ కూటి కోసమే నంటారా?

ఇ. దొంగతనమూ, ఇతర నేరాలు (జీవనం కోసం చేసేవే) వృత్తే ఔతాయా?
___ఇక్కడ దొంగతనం వృత్తి కాదు అన్నారు. నా దృష్టిలో అవి కూడా వృత్తే! పొట్టపోసుకోడానికి ఏ పనిని ఎంచుకున్నా, అది వృత్తే!

ఈ. వ్యభిచారం అనేది. కుట్టు పనీ. నేత పనీ. వడ్రంగం పనీ వంటి వృత్తే అయితే. ఆ వృత్తుల్లాగే ఇది కూడా సమాజానికి ఎప్పుడూ కావాలి. ఇంటింటికీ కావాలి. కానీ. సెక్సు అనేది శరీర ధర్మం. శరీర ధర్మాలేవీ శ్రమలు కావు. శ్రమలు కానీవేవీ వృత్తులు కాలేవు. వృత్తిగా కనపడే ప్రతీదీ వృత్తి కాదు.
___ ఇదన్నమాట, ఆవిడ దృష్టిలో, ఇలాంటివి వృత్తికాక పోవడానికిగల కారణం.

కానీ, దొంగతనంలోనో, వేశ్యవృత్తిలోనో మాత్రం శ్రమ. మేధావితనమూ లేదని ఎవరన్నారు?ఐతే, దొంగతనాన్ని మనం చట్టబద్ధంగా ’నేరం’అని పరిగణించాము. చట్టానికి లోబడో/ చిక్కకుండానో చేసే దొంగతనాలని ఏమీ చెయ్యలేము. ఇందువల్లే, బహుశా, మీరు చెప్పినట్టు, "వేశ్యవృత్తి చట్టవ్యతిరేకం కాదు" అనిచెప్పి, కాస్త "తెలివి" అవసరాన్ని తగ్గించారు.
-----------------
మీ అసలు కామెంటు : "ఇదొక ఆత్మకథ. సుద్దులు బోధించే నీతికథ కాదు. ఆ జ్ఞాతిలేకుండా రంగనాయకమ్మగారు జడ్జిమెంటు చేసిపారేసినట్టుంది."
దానిని పొడిగించి : "ఆత్మకథలో అదిరాసిన వ్యక్తి అనుభవాలతోపాటూ, అభిప్రాయాలూ, ఆలోచనలూ ఉంటాయి. అంతమాత్రానా అవి అందరూ ఆచరించాలనే ఆశయం ఉందనే అపవాదు సరైనదికాదనే నా వాదన" అన్నారు.

రంగనాయకమ్మగారు కూడా ఆ అపవాదుని అంటగట్టలేదనే నా అభిప్రాయం. తన ఆలోచనలతో రాసిన ఆత్మకథే ఐనా, అందులో "నా జీవితం గౌరవప్రదమైనదేనని గుర్తించు" అనే వాదన వినిపించినప్పుడు, ఆ వాదనని విమర్సిస్తూ తిరస్కరించవచ్చు. అదే ఆవిడ చేసింది. అంతే కాక, "మా జీవితాల వంటి నీచమైన జీవితం ఏ స్త్రీకి సంభవించకూడదు. ప్రపంచం ఏ నాటికైనా వ్యభిచారం అనే రోత మాటని మరిచి పోవాలి" అనే ఈవిడ ఆశయాన్ని ఆమె చెప్పి ఉంటే, సమాజానికి బావుండేదనీ చెప్పారు.(తిరకాసు అక్కడే ఉంది; ఒకవేళ కొందరు స్త్రీలు "మాకు వేశ్యలుగా ఉండటం అత్యంత ప్రీతికరమైన విషయం" అని ఒప్పుకుంటే, మిగితా స్త్రీలు వాళ్ళనీ "గౌరవం"గా చూడలేరు) అలా చెప్పక పోవటం వల్లే, నళిని నిర్దోషి కాలేకపోయింది అని చెప్పారు.
-----------------
సమాజంలో పొట్టపోసుకోడానికి లక్ష్యాతొంభై మార్గాలుండొచ్చు. మనం కొన్నింటినే "గౌరవం"గా భావిస్తాం. దొంగగానీ, వేశ్యగానీ చాలా డబ్బున్న వ్యక్తి ఐతే, ఆటోమేటిక్గా అందరం "గౌరవం" ఇచ్చేస్తాం.అంతెందుకు? స్టార్ హోటల్లో సర్వర్‌కీ, మాములు హోటల్ సర్వర్‌కీ ఒకే గౌరవం ఇస్తామా? రైలింజన్ డ్రైవర్‌కీ, పైయలెట్‌కీ ఒకే గౌరవం ఇస్తామా?
-----------------
బహుశా, ఇక మిగిలిందల్లా - ఏ స్కూలు ఎడ్మిషన్ ఫామ్‌లోనో, "మదర్స్ ఆక్యుపేషన్" అన్న చోట "సెక్స్ వర్కర్" అని రాస్తే, తీసుకుంటారా?. "తీసుకోవాలి" అని నళిని వాదించింది - అని అర్ధమతోంది. తీసుకోవాలా వద్దా? ఇప్పుడు మీరు చెప్పండి.

(బతక నేర్చిన వాళ్ళైతే, సింపుల్గా, "సెల్ఫ్ ఎంప్లాయ్డ్" అని రాస్తారు, ఈ తొక్కలో గొడవలు ఎవరికీ రాకుండా ; చట్ట ప్రకారం తీసుకోవాలేమో, అదీ వదిలేయండి.మీ అభిప్రాయమే చెప్పండి)

ఐతే, ఓ వ్యక్తిగతమైన వృత్తిగా గుర్తించి, "వ్యవస్థీకృత బ్రోతల్స్ చట్టవ్యతిరేకం" ఎందుకు చేశారో అర్ధం గాదు. మున్ముందు అది కూడా రావాలని ఆశిస్తున్నాను.

rayraj said...

@అబ్రకదబ్రగారు: "I preach What i practice" అనేది గర్వార్హమైనదిగా కొందరు చిత్రించారు.అదీ ఓ తత్త్వచింతనలోనించే పుట్టిచ్చారులెండి. కానీ, అదీ తప్పే! ఏ? నేను పాఠించ(లేక)పోయినంత మాత్రన, ఓ "నీతి" నీతికాకుండా పోవాలా?. మా ఇంట్లో వాళ్లెనెవరినీ బ్రోతల్‌కి వెళ్ళనివ్వను. అలాగే "రైలింజన్" డ్రైవర్లుగానూ, ఆటో డ్రైవర్లగానూ ప్రోత్సహించను.

"మీ కథ అచ్చు బూతు కథాలా ఉంది" అంటే, ఓ రచయితకి కోపం. నా లాజిక్కేంటంటే - "బూతు కధ"కీ సమాజంలో చాలా ఆదరణ ఉన్నప్పుడు, ఆ కోరికలతో ప్రజలు రగిలిపోతూ ఉండటం వల్లే ఆ కథలు వెతుక్కొని మరీ చదువుకుంటున్నప్పుడు, "మీ కథ బూతు కధలా ఉంది" అనంగానే ఎందుకు కోపం తెచ్చుకోవాలి. ఒకవేళ మీ లాజిక్కు ఇలాగే ఉంటే, సరే నేనోకే! (కానీ, మీరు తొందరపడ్డారనే అనిపిస్తోంది)

మరో విషయం - దొంగతనం కూడా ఫైయిర్ ట్రేడ్ అయ్యుండేదే. కానీ, చట్టరీత్యా అలా కాకుండా చేశారు. "సొంత ఆస్థి"ని కాపాడుకోవడానికే, "ప్రభుత్వం" అవసరమయ్యింది. దొంగతనాన్ని చట్టపరిథిలో ఒప్పుకుంటే, "ప్రభుత్వ" అవసరం లేదు. చట్టం అంతకన్నా అవసరం లేదు. కొందరి ఆదర్శ సమాజంలో, "సొంత ఆస్థి" అనేదే ఉండదు కదా? అప్పుడు, దొంగతనమే ఉండదు! అలాగే, వ్యభిచారమూనూ! - వివాహ వ్యవస్థని కేవలం సెక్సు కోసమని భావించే వాళ్ళకి, వ్యభిచారం అవసరమే!

మహేష్ చప్పినట్టు - "చట్టాల ఉల్లంఘన, మానవహక్కుల హననానికి అందరం వ్యతిరేకులమే. నైతికత పేరుతో మనుషుల్ని నీచమడానికి నేను వ్యతిరేకం. దాన్ని ఒకరకంగా మానవహక్కుల ఉల్లంఘనగానే నేను పరిగణిస్తాను." అంతేగానీ, నిజంగా ఉచ్చనీచాల లేవని మహేష్ అనగలరా?

తెలుగు వెబ్ మీడియా said...

Dear Rayraj. Prostitution is not just the question of economical inequalities. It is also the question of morality. If a railway loco driver and a pilot aren't respected equally, economical inequality is the sole reason for it. The case of prostitution is something different here. Either a rich prostitute in Banjara Hills or poor prostitute in Yadagirigutta won't gain any respect.

WitReal said...

>> ఔనన్నా కాదన్నా సమాజంలో వ్యభిచారం ఉంది.

నైతికతకు సంబంధించా లేక వృత్తి కి సంబంధించా??

>> గౌవమైన కుటుంబాలలో మాత్రం వ్యభిచరించడం లేదా!

ఈ వాక్యానికి, ఇక్కడ రాసిన అంశానికి సంబంధం వివరిస్తె బాగుంటుంది


>> ఇక వేశ్యవృత్తి అంటారా పెళ్ళి వ్యవస్థ ఉన్నంతవరకూ అదీ ఉంటుంది.

Was it there before that? Will it be there after that?

Kathi Mahesh Kumar said...

@WitReal: వ్యభిచరించడం అనేది సామాజిక కట్టుబాటుకు సంబంధించినది. ‘వ్య’వస్థకు ‘భి’న్నంగా చరించడమే వ్యభిచరించడం.(ఇది వ్యుత్పత్యర్థం కాదు. I am using it for pun) అది వృత్తి కాదు. ప్రవృతి. అంతే. ఇక్కడ నేను వాడింది నైతికత కోణంలోనే. అందుకే గౌరవప్రదమైన కుటుంబాలలో మాత్రం వ్యభిచరించడం లేదా అని ప్రశ్నించాను.

చరిత్రప్రకారం పెళ్ళివ్యవస్థకు ముందు సామూహికకుంటుంబ వ్యవస్థమాత్రమే ఉండేది. Communities/tribes use to live as families.ఇక్కడ సొంతభార్య, సొంత కొడుకు వంటి వ్యవస్థలేదు. ఏదైనా అది సమాజానికి చెందుతుంది. కలిసి అనుభవిస్తారు. కలిసి బాధ్యతల్ని పంచుకుంటారు. ఎప్పుడైతే పెళ్ళి వ్యవస్థవచ్చిందో అప్పుడు ownership concept మొదలయ్యింది. ఆ కట్టుబాటుతోపాటే వ్యభిచారం ఒక alternative వ్యవస్థగా ఉద్భవించింది. పెళ్ళి-వ్యభిచారం ప్రత్యామ్న్యాయ వ్యవస్థలు. రెంటికీ అవినాభావ సంబంధం ఉంది.

WitReal said...

You say: Vyabhicharam is anaitikam (not gauravapradam) && it is there in the gauravaprada families also.

then how are they gauravapradam?

you are contradicting yourself here.

next, you are mixing up a concoction of various spicy topics & writing absolutely irrelevant conclusions.

you first stick to one definition of vyabhicharam, then you will see that it is timeless.

Same is the case with Pelli, fidelity etc.

your understanding of pre-historic family life is wrong. Socialism was never there & will never come into existence in future.

might rule.

Kathi Mahesh Kumar said...

@WitReal: గౌరవప్రదమైన కుటుంబాలు వ్యభిచారాన్ని రహస్యంగా చేస్తాయి అంతే తేడా.It's only unethical if you get caught.Most so called respected families don't get caught that's all.

I am not contradicting myself. I am only explaining things through an accepted frames of reference.

My understanding of pre- history is valid. There is nothing to disagree as its not my opinion but a result of research. Its not socialism, its just social living.

తెలుగు వెబ్ మీడియా said...

We cannot justify prostitution in the name of secrecy. Even incest happens in so called reputed families, though we cannot justify it.

WitReal said...

>> గౌరవప్రదమైన కుటుంబాలు వ్యభిచారాన్ని రహస్యంగా చేస్తాయి అంతే తేడా.

0. In the original post, your reference to "respectable families" is a result of
Halo Effect -> Prejudice -> Freudian slip

1. Once you referred "respectable families" you are trying desparate by stereo typing your perception.

2. Your statement is self contradictory.


>> It's only unethical if you get caught.


Your definition of ethics is wrong.


>> Most so called respected families don't get caught that's all.

This is self contradictory.

>> I am not contradicting myself.

You said: "X is doing something secretly"

If it is a secret, then how did you know?

If you knew, then how is it a secret??

if respectable families are NOT caught, then how did you come to know?

did you see the contradiction now?


>> I am only explaining things through an accepted frames of reference.

accepted by whom? you??

>> My understanding of pre- history is valid. There is nothing to disagree as its not my opinion but a result of research. Its not socialism, its just social living.

If you can guide me to such a research, i will also learn.

did any social living model preached that the a family of 1 female & many male shared that female - and took turns to XXXXXXX - and was that recorded by any researcher? pl. clarify.

also, pl. dont refer to cock & bull conclusions of taapi dharma rao, who assumes many thing and generalizes his findings and applies them to a whole society.

The idiom "pandaga roju koodaa paatha mogudaenaa": DOES NOT MEAN that "all telugu women enjoy with a different male on festival days"

To come back to the topic - vesyaa vrutti is not an outcome of institution of marriage -- as you claimed in the original post.

cheating, exploitation, greed are basic premordial traits.

The societal norms & the institution of marriage are created to save the meek from the might.

But, the basic instincts never die. Thus you see the vyabhichaaram & dongatanam & 100 other things.

For reference, study the infidelity in animals. you will correct yourself.

Kathi Mahesh Kumar said...

@WitReal: I appreciate your sincere but desperate attempt to prove me wrong.

Cheating సమాజంలో ఏది మంచో దాన్నిబట్టి నిర్వచింపబడుతుంది.దోపిడి మనకు ఉన్నదాన్ని మించొఇ ఎదుటివాడిది కూడా కావాలనుకోవడంతో మొదలౌతుంది. ఆశ మనకి లేనివి కావాలనుకోవడంతో మొదలౌతుంది. ఇవి basic primordial traits కావు. Conditioned according to societal norms and defined too accordingly.

అందమైన అమ్మాయి అందరిదీ అయినప్పుడు చీటింగ్ అనే ప్రస్తావనకు స్థానం లేదు. Community family concept లో ఆ అవకాశం ఉండేది. ఎప్పుడైతే సంపదమీద అధికారం మొదలయ్యిందో వ్యక్తిగత ప్రాపర్టీ విధానం వచ్చిందో అప్పుడే ఈ traits మనిషిలో మొదలయ్యాయి. అందుకే వ్యభిచారం పెళ్ళితోపాటే పుట్టేఅవకాశం ఎక్కువుంది.

మీరు తాపీధర్మారావు, ఆరుద్రల కంటే సాధికారంగా మాట్లాడాలనుకుంటే అభిప్రాయాల్ని కాకుండా కొంత శాస్త్రీయమైన వాదనను చెప్పడానికి ప్రయత్నించండి. అప్పుడు I might consider you. Till that time I stand by my understanding.

WitReal said...

you did not give any research referal of social living + community family concept + etc for my learning.

you did not acknowledge the infidelity in the community living of animals.


Now i understand why paanashala was born.

good bye!

Kathi Mahesh Kumar said...

WitReal: GET LOST! Go to paanashaala and enjoy.

తార said...

చెరసాలగారు,
మీ అభిప్రాయాలు, అలోచనలు చాలా విప్లవాత్మకంగా ఉన్నాయి.
పోరాడకుండా ఎమీ రాదు అని మంజుదర్‌గారు ఎన్నడో అన్నారు, కానీ పోరాటాలు చిత్తసుద్ది, అత్మసుద్ది లేకపోతే నిష్పలం. విరసం సమావేశంలో చెఱబండరాజుగారు అన్నారు " పెట్టుబడీ వ్యవస్థ ఎక్కడి నుంచో రాదు, మన ఇంట్లో నుంచే మొదలవుతుంది, నాదీ ఏది లేని నవసమ సమాజ నిర్మాణమే మన లక్ష్యం" అని.
పుచ్చపల్లి వారు కూడ ఇదే ఆచరించి చుపించారు, కొ.కు. తన రచనల్లో, చేతల్లో ఎమి చూపించారు?
మార్పు తన దగ్గిరనుంచే మొదలు పెట్టారు క్యాస్ట్రో , " నాది కాదు, క్యుబా అంతా మాది అని క్యుబా ప్రజలు అనుకొవాలి" " నా ఆస్థి, నా పిల్లలు, నాకుటుంబం, నావ్యాపారం, ఇలా, నాది ఏదీ అనేది రష్యాలో వుండకూడదు" అని స్టాలిన్ చెప్పారు.
మరి అలాంటి సమాజం కోసం కలలు కనటంతో సరిపెట్టకుండా, క్యాస్ట్రో లాగా ఆచరించు, మిగతా వాళ్ళకి మార్గదర్శకుడివి అవ్వొచ్చు, ప్రజలకి మార్పు రుచి చూపించొచ్చు.

ఎక్కడో, "నా కింద పనిచేసే వాళ్ళు" అని అన్నావు, అది పెట్టుబడి అహంకారమే, స్టాలిన్‌ని చదవలేదా, ఎక్కడైనా అలాంటి భాష వాడారా? సమాజంలో అందరూ సమానమే, ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు తప్ప, ఎవరూ, ఎవరి కింద పనిచేయకుడదు అని స్టాలిన్ అనలేదా?
నువ్వు నీ వ్యపార లాభాలని ఉద్యొగులందరికీ సమానంగా పంచావా? పేరే ఎది పెట్టుకున్నావు, చివర శర్మ అని రాస్తున్నావు, ఇది కులనామం కద, ఇవి అన్నీ పెట్టుబడి వ్యవస్థ కుసంస్కారాలే. వాటిని తిడుతూ, అవే అచరిస్తున్నావు, నువ్వు మరి మీగతవారి లానే బూర్జువా వాదివి అనుకోవాలా?

Raam said...

సుజాత గారు చెప్పింది ఆలోచించదగింది ( రెండవ కామెంట్ )