The current psychological war against dalits in Indian cultural realm is fought by the brahmanical hegemony and ideology with inventions of newer psychological tools especially in cinema. It is evident in the texts of acclaimed tamil films which are celebrated as the depiction of village and real life outlets. These so called new generation tamil industrial cinema also revolves round the dichotomy of life/killing, elites/dalits, happiness/tears etc., and avoids the different complex political aspects of these two sided presentations. Killing of dalit identities and dalit bodies in the films like Veyil, Kadhal, Pruthiveeran, Subramaniapuram, Vennila KabadiKuzhu etc., are cunningly avoided in the intellectual discourses and are celebrated as refreshements in tamil film culture in the realm of presentation and text. These films are read as the depiction of reality of village and dalit life which were neglected by the Indian cinema seems to be paradoxical...
****
12 comments:
మహేష్ గారు,
నాకు దళిత అంశాలపై కొద్దోగొప్పో సానుభూతి ఉంది.నాకు సానుభూతి పల్లెటూళ్ళలో కూలి వాళ్ళు, డబ్బులేని దళితుల గురించి. డబ్బు ఉన్న దళిత రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద ఉద్యోగులూ నా దృష్టిలో దళితులు కానే కాదు. వాళ్ళు కొత్త బ్రాహ్మణులు.
కానీ ఈ టపా రాసినాయన కోడి గుడ్డు కి ఈకలు పీకుతున్నారేమోనన్న అనుమానం వచ్చింది. దళిత జీవిత వాస్తవికత ని చూపించకుండా ఊహల్లో తేలే సినిమా తీస్తే అది దళితులకి ద్రోహం చేసినట్లు. అప్పుడప్పుడూ కమర్షియల్ సినిమాలు ఇలాంటి విన్యాసాలు చేస్తుంటాయి (కొండవీటి దొంగ లో చిరు ట్రైబల్ వేషం వేసినట్లు). ఎవరైనా ఒక మనిషి దళితుల కష్టాలను చిత్రిస్తూ సినిమా తీస్తే, అతను దళితులు కష్టపడాలని అనుకొన్నట్లు కాదు.అతను దళితులకు హెచ్చరిక జారీ చేస్తున్నాడని అనటానికి ఆధారాలేమీ లేవు. అలా అనటం బహుశా ఈ వ్యాసం రాసినాయన భయాలనీ కించిత్ ద్వేషాన్నీ ప్రతిబింబిస్తోందేమో!
అలానే బీ సీ లని బార్బారియన్స్ అని ఒకతను కామెంట్ చేయటం సరి కాదు.
@ఆంధ్రుడు, మీకు దళిత అంశాలపట్ల సానుభూతికన్నా "సహానుభూతి" ఉంటే నేను సంతోషించేవాడిని. ఇక వ్యాసం గురించి.
సినిమా తీసేవాళ్ళు conscious గా కుల అజెండాల్ని సినిమాలో ఉంచరు. Film as a social product of representation, దాని కల్పనలో దర్శకనిర్మాతల సామాజిక ధృక్కోణం అన్యాపదేశంగా కనిపిస్తుంది. ఉదాహరణకు "పల్లె" అనగానే తెలుగు సినిమా ప్రేక్షకుడికి పచ్చదనం,పాడిపంట,నీళ్ళతో నిండిన కాలువలూ ఊహల్లో కనిపిస్తాయి. నిజానికి ఆంధ్రప్రదేశ్ లోని కోస్తాజిల్లాలలోని కొన్ని పల్లెలు వదిలేస్తే మరేగ్రామాలూ అలా ఉండవు.కానీ that becomes "our representation". Same thing is true of caste.
తెలుగు సినిమాల్లో చాలా వరకూ హీరో పేరు value neutral గా అనిపించినా, ఇంటిపేరు దగ్గరకొస్తేమాత్రం అగ్రకులాలకు, ముఖ్యంగా కమ్మ కులానికి చెందడం మీకు కోడిగుడ్డుకు ఈకపీకినట్లు అనిపిస్తే, మీరు film as a tool of hegemony ని అర్థం చేసుకోలేదనే అనుకోవాలి.
Film makers subconscious propagate certain ideologies that will be deciphered only after a certain social effect is registered as time passes by.రాఘవేంద్రరావు సినిమాల ప్రభావం ఇప్పటికిగానీ మనకు తెలీదు. Academicians ఉండేది అలాంటి ప్రభావాన్ని థియరెటికల్ గా అర్థం చేసుకోవడానికి. అలాంటి theorist కొన్ని ప్రాతిపదికల ఆధారంగా విశ్లేషణలు చేస్తారు. We can surely disagree with them on another basis, but cannot dismiss because we have limited knowledge to understand them.
@మహేష్: Are you contracdicting yourself by showing this piece? ఎందుకంటే, ఈ సినిమాలు వాస్తవికతకు దర్పణంగా ఉన్నాయని, నిజ జీవితాలను ప్రతిబించించాయని, మీరే పరిచయాలు చేసినట్టు నాకనిపిస్తోంది. కాదంటారా?
(లేదా ఆ ఇంగ్లీషు పోస్టులో అసలు టెక్స్టు నాకు ఎక్కడం లేదా? కొద్దిగా మీ కామెంటే క్లియర్‌గా ఉంది.)
ధనిక వర్గాలు/అగ్ర వర్ణాలు ఆయా తమిళ/మళయాళ సినిమాలలోని హింసాకాండను చూసి, దళితుల మీద కసి తీర్చుకునే వికేరియస్ ఆనందం పొందినట్టూ, సినిమాల ద్వారా దళితులని భయపెట్టినట్టు భావించడం, నాకు అర్ధం గావటం లేదు.ఇలాంటి సినిమాలని తిరగ్గొట్టినందుకు, తెలుగు సమాజం గురించి ఏమని భావించాలి!!???
పోనీ, మనం తీస్తున్న అన్ని రకాల సినిమాలూ, క్లాస్/మాస్ అని విడదీసి, మాస్ అనే ఆడియన్స్‌లో భావోద్రేకాలను మాత్రమే కలిగిస్తున్నాయిగానీ, ఏ విధమైన ఇంటెలెక్ట్యుయల్ స్టిమ్యులేషన్నీ సాధించటం లేదని, ఓ కాలంలో నేను చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు, మీరు ఒప్పుకున్నట్టు కనపడలేదే! కనీసం దానికి దగ్గరగా ఉన్న పై పాయింటునీ చెప్పలేదే!
చాలా గందరగోళంగా ఉంది నాకు.
ఇంకో విషయం చెప్పానా? మన బ్లాగ్లోకపు కాన్సిపరసీ థియరిస్టు సైతం అచ్చం ఇలాగే వాదిస్తారు.ఉదా: అరుంధతి లాంటి సినిమాలతో, మనలోని తిరగబడే శక్తిని నశింపజేస్తారని; లేకపోతే, ఎత్తుకుపై ఎత్తులు వెయ్యడంలో క్రిమినల్స్‌ని అతి బలవంతులుగా చూపడం ద్వారా, సమాజంలోని చెడుని ఎదొర్కొనకుండా, ’ఇదేమీ సినిమా కాదు కదా, వాళ్ళతో మనమెక్కడ పోరాడగలం’ అనుకునే విధంగా చిత్రిస్తారాని;
మీరే ఓ సరియైన పోస్టు వేయడం మంచింది.
మహా నగరం లో, వేరే రాష్ట్రం లో ఏదో మధ్య తరగతి జీవితం ఈడుస్తున్న నాకు మీరన్న సహానుభూతి ఎలా ఉంటుంది? ఇక్కడ వేరే భాష అవతల ఏముందో మనకు సరిగా తెలియదు.
సహానుభూతి అనేది వారి తో కలిసి జీవించటం లేక పంచుకోవటం వలన వస్తుంది(కరక్టో కాదో ఆ పదాన్ని ఉపయోగించిన మీరే చెప్పాలి). లేని సహానుభూతి నటించటం సరైనది కాదనుకొంటా.అందుకే సానుభూతి మాత్రమే అంటున్నాను.సహానుభూతి పొందటానికి ఏవైనా అవకాశాలు ఉంటే మాత్రం వదలను.
ఇక పోతే ఇక్కడ ప్రస్థావించిన తమిళ సినిమాలకు, దళిత సమస్యల పట్ల మన తెలుగు సినిమాల కన్న కొంచెం పాజిటివ్ దృక్పధం ఉన్నవి అనిపిస్తోంది.
@రేరాజు: I am not contradicting myself. By presenting this article I am only showing that, there is a contradictory view point that exists. With which I ideologically agree with few reservations.
వ్యాసకర్త సినిమాల్లోని subtext ని విశ్లేషించాడు. నేను సినిమాని సినిమాగా సమీక్షించాను. ఉదాహరణకు కె.విశ్వనాధ్ సప్తపది చిత్ర నా ఫేవరెట్ చిత్రాల్లో ఒకటి. కానీ దాన్నొక దళితదృక్కోణం నుంచీ (ముఖ్యంగా హీరో పాత్రని చూసి) reinforcing brahmanical hegemony and ideology అన్నాననుకోండి.అంటే నాకు సినిమా నచ్చినట్లా నచ్చనట్లా...అదొక POV అంతే. అది contradictoryగా అనిపించొచ్చుగాక, కానీ అ possibility లేదంటారా?
కేవలం dalit representation కారణంగానే అవి తమిళనాడులో హిట్ అవలేదు, తెలుగులో ఫ్లాప్ అవ్వలేదు. కాబట్టి దీని ఆధారంగా సమాజాల మీద జడ్జిమెంటు చెయ్యలేము. ఇదొక ఆలోచించదగిన కోణం అనిమాత్రమే అంగీకరించగలము.సమాజంలో జరిగే churning చాలా సైలెంటుగా జరుగుతుంది. ఇమేజెస్, మోషన్ పిక్చర్స్, ఐకనోగ్రఫీ అన్నీ దానికి దోహదమౌతాయి. ఆ దృష్టితో చూడగలగాలి ఒక objective analysis చెయ్యగలగాలి. అంతే!
ఈ చర్చలు గందరగోళంగానే ఉంటాయి. ఏపుట్టలో ఏపాముందో అనే conspiracy ల్లాగానే ఉంటాయి. అందుకే వాటి ప్రాతిపదికని, ప్రామాణికతను, ధృక్కోణాన్నీ,శాస్త్రీయతనూ బేరీజు చేసుకుని మాత్రమే confer అవ్వడానికి ప్రయత్నించాలి.
బ్లాగ్లోకపు కాన్సిపరసీ థియరిస్టు గురించి చెప్పాలంటే కొన్ని valid points ఉన్నప్పటికీ చాలా వరకూ ఒక ఫోబియా నేపధ్యంలోంచీ వచ్చినట్టుగా అనిపించడం వలన credibility సమస్యలున్నాయి.
You should watch MelGibson's "Conspiracy theory" Its a very good example of such theorists.
@మహేష్: క్రెడిబిలిటీ ఇష్యూస్ ఉన్నాయని నాకూ తెలుసు.అందుకేగా....సరే..చెప్పేదేంటంటే, ఓ పద్దతి ప్రకారం జనాలిని నిర్వీర్యం చేయడానికే అలాంటి సినిమాలొస్తాయంటే నేను నమ్మను.
మీ ముందటి కామెంటులో మీరు చెప్పినట్టు, అన్యమనస్కంగానైనా, దర్శకులు, నిర్మాతలు వాళ్ళ ఐడియాలజీయో, ఆధిక్య/న్యూనతా భావాలో జనాలపై రుద్దుతారని మాత్రం నేనొప్పుకుంటాను.దానికి "ఆబ్జెక్టివ్ ఎనాలిసిస్" అన్నంత పదం లేకపోయినా, ఏ ఫ్యాన్స్‌తో కూర్చున్నా ఏ హీరో డైలాగు ఎవరిని ఉద్దేశించో (అన్యమనస్కంగానో, కేంద్రికృతమనస్కంగానో) చెప్పేస్తారు ;)
సప్తపదిలో, హెజిమనీ రియిన్‌ఫోర్స్‌మెంట్ ఏం జరిగిదంటారో అర్ధం కాలేదుగానీ, ఆ సినిమా ఖచ్చితంగా బ్రాహ్మణదృక్కోణంలో తీసిన సినిమానే. ఇన్ ఫాక్ట్, విశ్వనాధ్ సినిమాలంతా బ్రామిన్ సెట్-అప్‌లో ఉంటాయని, and he excels in that అని నా అభిప్రాయం.
@రేరాజు: సప్తపది గురించి నేను రాసిన ఒక వ్యాసంలో (http://navatarangam.com/2008/07/sapatapadi-analysis/)హీరోపాత్ర రూపకల్పన గురించి ఈ విధంగా చెప్పాను...
"అసలు సమస్య ‘హరిజన’ కథానాయకుడి పాత్ర సృష్టిలో గోచరిస్తుంది.అతనెవరో? ఎక్కడ్నించి వచ్చాడో? గుణగణాలేమిటో? ఖచ్చితంగా చెప్పగలిగే ఆధారాలు సినిమాలో కనిపించవు. ఒక నాట్య ప్రదర్శనలో పిల్లనగ్రోవి ఊదుతూ ప్రత్యక్షమై, గోదారి ఒడ్డున ఒక మంటపం దగ్గర వేణువు వాయిస్తూ నాయికకు పరిచయమై, ఆభేరీరాగాన్ని ప్రేమలేఖగా పంపి, సంగీతంతో నాయిక మనసుదోచుకుంటాడు. “రేపల్లియ ఎదఝల్లున పొంగిన మురళి” అనే పాటలో నాయిక తండ్రిని మంచిచేసుకుని నాయికకు దగ్గరౌతాడు. అంతా బాగుందన్న తరుణంలో “నేనొక హరిజనుణ్ణి” అని ఒక గొల్లపిల్లవాడితో చెప్పి, నాయికకు తెలిసేలా చేస్తాడు. ఇప్పటివరకూ, ‘పోనీ కథానాయకుడే నిజాన్ని దాచాడుకాబట్టి, ఇలా చిత్రించడం సరే’ అని సరిపెట్టుకునేంతలో మరికొన్ని, అసంభద్దాలు కనిపిస్తాయి.
చివరిలో యాజులు చెప్పే “భగవంతుడు గుణగణాల్ని బట్టి నాలుగు కులాలు నిర్ణయించానన్నాడుగానీ, పుట్టుకనిబట్టి కాదు” అనే ఆర్యోక్తికి సరితూగేలా నాయకుణ్ణి ‘కర్మ బ్రాహ్మణున్ని’ చెయ్యడానికి అతని చేత (దొంగతనంగా) వేదం, సంగీతం నేర్పించడానికి పూనుకొనుండోచ్చు.
That's what I refer as హెజిమనీ రియిన్‌ఫోర్స్‌మెంట్.
@మహేష్:నవతరంగంలో "సప్తపది" బ్రాహ్మణదృక్కోణం అని పలువురు ఒప్పుకున్నారు. మీ విశ్లేషణ కూడా బావుంది.ముఖ్యంగా హరిజన కథానాయుకుడి "సృష్టి"లో విశ్వనాథ్‌కి ఉన్న లిమిటేషన్స్, - ఆయనకి తెలియదు -అన్నదానితో ఏకీభవిస్తాను. ఐతే, ఆ పాత్ర అలా సృష్టించేసుకున్నా కథకి తప్పులేదేమో అనేది మళ్ళా ఎప్పుడన్నా సినిమా చూస్తే చెప్తాను.
కానీ ఈ రెయిన్‌ఫోర్స్‌మెంట్,హెజిమనీ, ఆ ఇన్నేవేషన్ మీద నావి భిన్న అభిప్రాయాలు.
ఇక్కడ మీకు మరో విషయం గుర్తు చేస్తాను. "సాగర సంగమం" లో కమల్ హాసన్ పాత్ర, జయప్రద పాత్రని, భర్త దగ్గరికే వెళ్ళిపోమ్మంటాడు( ఇది ప్రదక్షిణాలు చేస్తూ జరిగే సంభాషణ). మారు మాటాడకుండా జయప్రద భర్తతో వెళ్ళిపోతుంది ; నా ఉద్దేశ్యం - కట్ చేస్తే, ట్రైన్ భోగీ ముందు భర్తతో ఉంటుంది. ఇక్కడ కమల్ జయప్రదని ఎందుకు వదులుకున్నాడు? జయప్రద మాట్లడకపోవటానికి కారణమేమిటి!? ఇది బ్రాహ్మణదృక్కోణపు సినిమానా కాదా? ఇందులో రెయిన్‌ఫోర్స్‌మెంట్, హెజిమనీల ఉన్నాయా- వాటి మాటేంటి?
నన్ను నమ్మండి. ఇవి అసంబద్ధ విషయాలు కాదు. కానీ మీ దృక్కోణంలో వీటికి సమాధానలు ఏంటో తెలుసుకుంటేగానీ, నేనూ అర్ధం చేసుకోలేను.
అలాగే, ఇప్పుడు ఈ వేశ్యవృత్తే ఉందనుకుందాం. నైతిక విలువల కింద అది తప్పా, ఒప్పా? దీనికి "ఇన్నొవేటివ్" విలువలు అంటే ఏమిటవి?
ఈ రెండు విషయాల సమాధానం చెబితే, దాన్ని బేస్ చేసుకొని చర్చించగలను. వేశ్యవృత్తి టపాలో, ఆ అప్లికేషన్ తీసుకుంటారో లేదో కూడా మీరు చెప్పలేదు. సమాధానం చెబితేనే కదా ఏదైనా తెలిసేది!
@రేరాజు: సాగరసంగమంలో కమల్-జయప్రదల ‘కానిపెళ్ళి’ ఖచ్చితంగా dominant paradigm ని reinforce చేసేదే. మనుషుల ఆంతర్యాలకన్నా కేవలం సాంప్రదాయంగా ఇప్పటికే పెళ్ళైన కారణంగా కమల్ జయప్రదని ఒదులుకోవడం వ్యక్తి స్వేచ్చకన్నా సమాజ కట్టుబాట్లకు గౌరవమిమ్మని అన్యాపదేశంగా దర్శకుడు చెప్పడమే. అదే ఆదర్శమని స్థాపించడమే. కాకపోతే ఆ తరువాత బాలుపాత్ర (జయప్రద జ్ఞాపకాల్లో) తాగుబోతై డ్యాన్సునే మర్చిపోవడంతో, ఆ ఆదర్శానికి దేవదాసుని తోడు తెచ్చుకుని దర్శకుడు అటకెక్కించాడు.
నైతికతే ప్రశ్నార్థకమైనప్పుడు వేశ్యవృత్తి తప్పా ఒప్పా అనే ప్రశ్నే ఉదయించదు. ఇన్నోవేటివ్ విలువ "అమోరల్" అవుతుంది.
వేశ్యవృత్తికి ఇంకా ప్రభుత్వం గుర్తుంపుని ఇవ్వలేదు.లైసెన్సులు, ట్యాక్సులూ వంటివి ఇంకా లేవు. అయినా ఎన్నో గుర్తింపుల్లేని వృత్తులు మనదేశంలో ఉండగా వేశ్య అని అప్లికేషన్లో రాయడం సమస్య కాకపోవచ్చు. అప్లికేషన్లో మతం పేరు చెప్పనవసరం లేదని ఈమధ్యనే కోర్టు తీర్పునిచ్చింది.అలాగే ఈ విషయంలోనూ ఎవరైనా కోర్టుకెక్కితే విషయం తేలిపోతుంది.
మళ్ళా లైసెన్స్ రాజ్ ఎందుకు? టాక్సులు వేసుకోవచ్చు. వ్యవస్థీకృతం చేస్తే, గుర్తింపులు, స్టాండర్డ్స్, స్టార్ స్టేటస్‌లూ ఇలాంటివన్నీ ఆలోచించి చేసుకోవచ్చు. నవ్వులాటకి కాదు - నిజంగానే చెబ్తున్నా. అప్పుడు మొగుళ్ళు, "రిలియన్స్ సెక్స్‌టైన్‌మెంట్లో పని చేసేట్టయితే నాకే అభ్యంతరం లేదు. కానీ చిన్న సంస్థల్లో మాత్రం పని చేయొద్దు ప్లీజ్!" అంటారు. ఆడవాళ్ళు "టాటా సెక్సీలైఫ్‌కి వెళ్తే కాదనం, మరీ ఇంత లేకిగా యాదిగిరి గుట్టదగ్గరా!, కంపరమేసి వదిలేశాను." అంటారు. అదో రకం విలువ! అది "అమోరల్" ఔనో కాదో మీకే వదిలేస్తాను.కొందరు సెక్స్‌ని కొనుక్కోకుండా, భార్యభర్తల సంసారంలోనే ఉంటారు. చాందసుల్లా కనిపించవచ్చు. కానీ కారు. అదే వాళ్ళ అవసరం.
అమోరల్ - బావుంది, Not a bad way of putting it. :) But its just taking it to the neutral state.(+, -, and neutral are age old thoughts) So its not that innovative, i would say. The point is that the world is in a flux, in a continuous change of such states. It is such that you can never determine its exact state. If you do, it is just for the fraction of such a moment.And there are many more combinations giving raise to the diversity we see around. Its more like finding the pattern where there is none - remember!
In that sense, can we say there is dominant paradigm? Yes and No. Is there a hegemony? Yes and No.
Did the audience have a vicarious happiness in those killings? YES - It can not be ruled out! and NO - Not all have seen it that way.
ఆ భారత్‌కీ నారీ చింగారీనే తీసుకోండి - కన్వెన్షన్స్, ట్రెడిషన్స్‌ని వాడుకోవడం వల్ల మార్పుని తెస్తున్నవాళ్ళ గురించి చెప్పింది. ఇందులో ఏ డామినంట్ పారడైమ్ ఉంది? దీన్ని ఎవరెవరు రెయిన్‌ఫోర్స్ చేస్తున్నారు. నేనూ చెప్తా -
౧. చింగారీ - ఇలా పవర్/ఎకనమిక్ సెంటర్ల దగ్గర ఉంటూ "ప్రచారం" చెయ్యటం అనేదే అసలు "హెజిమనీ" కోసం వాడే ఓ "డామినంట్ పారడైమ్". గప్ చిప్పుగా, చేసేదేదో చేసుకోరు.(మీకైతే, "ఇదేం పిచ్చిమాట?"అని కూడా అనిపించొచ్చిప్పుడు)
౨.కన్వెన్షన్స్‌ని కాస్త "alter" చేసి, మార్పు సాదించుకుంటున్న ఆ ముగ్గురు, వాళ్ళ పంథాని "ప్రపంచ ప్రచార సభ"లతో మారుమోగించక పోవచ్చు.( వాళ్ళ గురించి ఇప్పుడే విన్నానుగా, ఏమీ తెలీదు.) కానీ, కేవలం "alter" చేసినంత మాత్రన, కేవలం ఓ చిన్న గ్రూపులో మాత్రమే మార్పుని కాంక్షించినంత మాత్రాన, వాళ్ళ గొప్పతనం ఎందుకు తగ్గిపోవాలి?
సమూలంగా విలువలు మారిపోవడానికి, సమాజంలో అస్సలు అస్తిత్వంలో లేని ఓ "కొత్త విలువ" అంటూ ఏమన్నా ఉంటుందా?
సాగరసంగమం గురించి మరెప్పుడైనా.వాళ్ళ ఆంతర్యాలలో మీరన్నంత "స్పష్టత" ని దర్శకుడు చూపించాడా? మీరూ ఓ సారి ప్రశ్నించుకోండి. ఐతే, సప్తపదిలో మాత్రం, ఆ హీరో పాత్ర ఈయన బ్రాహ్మణదృక్కోణంలోంచి పుట్టిందే. అందులో సందేహ పడాల్సిన అవసరం లేదు. దానికి మిగిలిన సినిమాలు సైతం సాక్ష్యం.మరో ఉదాహరణ - శుభసంకల్పంలోని బెస్త పాత్రలు -ముఖ్యంగా కమల్ పాత్ర.
Post a Comment