Wednesday, April 14, 2010

అంగడి వీధి

గత పది సంవత్సరాలుగా మనకళ్ళ ముందే కొన్ని వందల షాపింగ్ మాల్స్ వచ్చేశాయి. వచ్చేపొయ్యేవాళ్ళ హడావుడి. సంతను మరిపించే సందడి. ఉత్సవాన్ని గుర్తుతెచ్చే ఒరవడి.సూపర్ మార్కెట్ల జిలుగుల్లో, నియోన్ లైట్ల వెలుగుల్లో మనల్ని మనం మర్చిపోయి వస్తువులతో పాటూ అనుభవాల షాపింగ్ చేసుకొచ్చేయ్యడమే మనకు తెలిసిన ఆనందం. ఆ అందమైన అనభవాన్ని మనకు అందించేవారి వెనుక కొన్ని చీకటి కోణాలుంటాయని గానీ, కొన్ని వందల బ్రతుకులు అడకత్తెరలో పోకచెక్కల్లా మారిపోయాయని మనకు తెలీదు. బహుశా తెలియాల్సిన అవసరం కూడా లేదేమో ! కానీ అవి తెలిస్తే!? మన షాపింగ్ అనుభవాల్లోని తీపిదనం చేదెక్కదా?  ఏమో!!


బిగ్ బజార్లూ, షాపింగ్ మాల్స్ రాక ముందునుంచే చెన్నై నగరం ఈ కొత్త ఒరవడిని తన సొంతం చేసుకుంది. నిజానికి ‘వాల్ మార్ట్ సంస్కృతిని భారతదేశంలోకి ఎలా తీసుకురావాలా!’ అని ఆలోచిస్తున్న కొందరు వ్యాపారులకు ప్రేరణగా నిలిచింది. బిగ్ బజార్ (ప్యూచర్ గ్రూప్) అధినేత ‘కిషోర్ బియానీ’ తన వ్యాపార అనుభవాల్ని పంచుకుంటూ, బిగ్ బజార్ ఎలా పెట్టాడో వివరిస్తూ తన ప్రేరణ చెన్నైలోని శరవణ స్టోర్స్ అని చెప్పడం అందరికీ తెలిసిందే. అలాంటి చెన్నైలోని ఒక సాంప్రదాయక షాపింగ్ మాల్ వెలుగుజిలుగుల మాటునున్న చీకటి బ్రతుకుల గురించి అంతే శక్తివంతంగా తెలియజెప్పిన చిత్రం “అంగడి తేరు” (అంగడి వీధి).

పూర్తి సమీక్ష కోసం నవతరంగం చూడండి.
****

2 comments:

కన్నగాడు said...

తప్పకుండా చుడాల్సిన సినిమా అన్నమాట, ఓ రెండ్రోజుల క్రితం పాంచ్ సినిమా చూసాను బాగుంది, కానీ ఏ కారణం చేత సెన్సారు వాళ్ళు సర్టిఫికెటు ఇవ్వలేదో అర్థం కాలేదు.
మీకేమైనా తెలుసా!

ఆ.సౌమ్య said...

మంచి సినిమా గురించి చెప్పారండీ, వెంటనే చూస్తాను !