Monday, April 5, 2010

‘పొద్దు’లో నా కవిత - షర్టులేని కన్నీరు

పొద్దు వెబ్ జైన్ లో నా కవిత ఎడిటెడ్ వర్షన్ వచ్చింది. 
పూర్తి కవిత ఇక్కడ ఉంచుతున్నాను.
-----------------------------------------
నీ జ్ఞాపకాలతో బరువెక్కిన మనసు
సమ సాంద్రత నీళ్ళని 
కళ్ళలో నింపి కన్నీళ్ళొదిలింది
అచ్చంగా... 
ఆర్కెమెడీస్ సూత్రాన్ననుసరించింది

నువ్వెళ్ళిపోయిన చర్య
నన్ను జఢుణ్ణి చేసిందేగానీ
ప్రతిచర్యకు పురికొల్పలేదు
న్యూటన్ సూత్రం తప్పిందా?
లేక...
నీలేమి శూన్యంలో
సూత్రమే మారిపోయిందా!

తర్కం తెలిసిన మెదడు
మనసు పోకడకు
హేతువు కోరింది 
నీ శూన్యాన్ని... 
కనీసం కొలిచైనా
సాంత్వన పొందే
దారి వెదికింది

నీ చితి మటలు ఎగసాయి
ఆ కాల్చేవేడిని చల్లారుస్తూ 
నాకళ్ళ మబ్బులు కమ్ముకున్నాయ్
వర్షించే కళ్ళతొ 
అర్థనగ్నంగా 
నేను కూర్చునే ఉన్నాను

అప్పుడు తెలిసింది...
కన్నీరుకార్చే మగాడికి షర్టెంత అవసరం అని.

(Inspired from CVS Sarma's short story)
****

10 comments:

వేణూశ్రీకాంత్ said...

కవిత బాగుంది మహేష్ గారు...

కానీ "షర్టు లేని కన్నీరు" అన్న పేరు చూడగానే మాత్రం "ఆకుపచ్చని కన్నీరు, మెత్తని గుండ్రాయి ఇవి కవితలా" అనే సినిమా డైలాగ్ గుర్తొచ్చింది. మీ మనసు నొచ్చుకుంటే తప్పు జంధ్యాల గారిది, నాది కాదు :-)

Vinay Chakravarthi.Gogineni said...

mahesh.entandi aa poetry........evadikanna artdam ayyidda........

sandrata,arkemedis law.entandi....mee naannagaariki chopinchi adagandi elaa vundo........

rayraj said...

I can't understand poems, though i try to write some myself :)
Your poems - I have never understood.

Though I have not understood which Archimedes' principle is used here, well, i understood the poem!!

The edited version of poddu.......never mind. May be i have told 100 times in 100 posts to these kind of people that an expression such as " Why did the Newton third law failed? Why I failed to react!? " is as poetic as any of your other poems. Although it is clear that Newton's law is physics and only under certain circumstances, it is still a poetic expression. They can not understand it. Atleast, thus, I understood them.

And, perhaps, it is proved in your case too (along with few commentators on the film webzine) that blogging is better than webzines! ;)

You should visit my poems/ patalu section once i say :). Barring few poems (for which i have already given the rights to somebody), I am ready to give away the rest to your name, for giving them some fame. ;)

Who is this CVS Sarma and what is the story?

Padmarpita said...

చాలా బాగుందండి.

rayraj said...

నీ జ్ఞాపకాలలో మునిగిపోయింది
మనసు
బరువుక్కెంది
నాలో
పొంగుకొచ్చాయి కన్నీళ్ళు
అచ్చంగా...
ఆర్కెమెడీస్ సూత్రాన్ని అనుసరించేనా?

నన్ను వీడి
నువ్వెళ్ళిపోయిన చర్య
జఢుణ్ణి చేసిందేగానీ
ప్రతిచర్యకు పురికొల్పలేదు
న్యూటన్ సూత్రం తప్పిందా?
లేక...
నీవు లేని శూన్యంలో
సూత్రమే మారిపోయిందా?


తర్కం తెలిసిన మెదడు
మనసు పోకడకు
హేతువు కోరింది
నీ శూన్యాన్ని...
కనీసం కొలిచైనా
కొంతైనా
స్వాంతన పొందే
దారి వెదికింది


ఎగిసే నీ చితి మంటలవేడికి
కాలే ఈ మనసును
చల్లార్చేందుకా?
కళ్ళ పై మబ్బులు కమ్ముకున్నాయ్
వర్షించే కళ్ళతొ
అర్థనగ్నంగా
నేను కూర్చునే ఉన్నాను


అప్పుడు తెలిసింది...
కన్నీరుకార్చే మగాడికి
చొక్కా ఎంత అవసరమో.


//నన్ను జఢుణ్ణి చేసిందేగానీ
(ఇక్కడ "ప్ర"తో వచ్చే ఒక పదంతో - షాక్డ్ అన్డ్ స్టిల్ అనే అర్ధం వస్తుంది. కానీ, ఆ పదం గుర్తురావటం లేదు మరి! అందుకని వదిలేశాను.పైగా అది సంస్కృత పదం అవ్వచ్చు.అప్పుడు దాని మూలంలో ప్రతిచర్య అనే అర్ధమే ఉంటే?లేక అలాగే మన మూల భావానికే తేడా వస్తే! పైగా, జఢుడు నిర్లప్తంగా ఉన్నాడేమో? అందుకని కూడా వదిలేశాను)
// నీ లేమి = నువ్వు లేని (your absence) అనే భావం కంటే, నీ లేనితనం/ పేదరికం/ నీకు లేనితనం అనే అర్ధాలొస్తాయేమో అనిపించింది. కానీ, నాకంటే మీకే తెలుగు ఎక్కువ వచ్చని కూడా మరో నమ్మకం. సో, ఓ సారి సరి చూడండి.
// స్వాంతన/ సాంత్వన? లేక టైపో?
// ’చితిమంటల’ స్టాంజా మొత్తం మార్చానేమో. బహుశా మీ భావం అది కాదేమో. అందులో ఏ మార్పు అవసరం లేదు.

(నేనింతే! నాకు నచ్చితే, ఇంకేదన్నా చేస్తే ఇంకా బావుంటదని అనిపిస్తే, నేనంతే!ఆ మార్పులు అవసరం లేదేమో,కానీ ఇదీ నా ప్రతిస్పందనే!)
(అప్రతిభుడనయ్యాను అనో ఏదో పదం గుర్తురావటం లేదు. తరచూ మన నవలల్లో వస్తుంది కూడాను.)

rayraj said...

(చిట్టచివరిది.....ప్లీజ్ ఏమనుకోవద్దు. "చితిమంటల” స్టాంజా ఇలా వేస్తే - )

ఎగిసే నీ చితి మంటలవేడి
కాల్చే ఈ మనసును
చల్లార్చేందుకా?
మబ్బులెక్కిన కళ్ళు వర్షించాయ్

అర్థనగ్నంగా
నేను కూర్చునే ఉన్నాను


అప్పుడు తెలిసింది...
కన్నీరుకార్చే మగాడికి
చొక్కా ఎంత అవసరమో

( ఇక ఆ అపభ్రమితుడుని చేసిందో ఏదో...ఆ పదం ఒక్కటి తేల్చుకుంటే, ఐ యామ్ డన్ విత్ ఇట్.
గుడ్ వన్! కంగ్రాట్స్ వన్స్ ఎగైన్! )

అశోక్ చౌదరి said...

Ha ha ha.. title super..

$h@nK@R ! said...

Nice one..

Anonymous said...

modaTi iddari kaamenTarlakee ee kavita enduku ardham kaaledo naakardam kaaledu.

nsmurty said...

Excellent! You caught the angst of the bereaved so well.