మళ్ళీ బాలల దినోత్సవం వచ్చింది. అందరుపిల్లలూ బడికెళ్ళి, ప్రేమగా చాచా నెహ్రూని తలుచుకుంటారు. చిన్నపిల్లలో ఎవడోఒకడికి నెహ్రూ తరహా శేర్వాణీ తొడిగి, జేబుకు గులాబిగుచ్చి సరదాగా నవ్వుకుంటారు. టీచర్లు చాక్లెట్లో, లడ్డూలో పంచిపెట్టి "ఈ రోజు మీరోజర్రా!" అని ఒక పదినిమిషాలు ఊదరగొట్టేస్తారు. ఆ తరువాత, బాలల దినోత్సవం అయిపోతుంది.
కానీ, పుట్టగానే చనిపోయే కొందరి గురించి. పుట్టినా, కొన్నాళ్ళకే గిట్టే మరికొందరి గురించి. బ్రతికినా, బ్రతికినకొన్నాళ్ళూ ఆకలీ, అనారోగ్యంతో బ్రతికే మరికొందరిగురించి. బడికెళ్ళలేని బడుగు బుడుగుల గురించి కొన్ని నిజాల్ని కూడా తెలుసుకుని, వాళ్ళకోసంకూడా బాలల దినోత్సవం జరుపుకుందాం.
- ప్రతిసంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్ళు నిండకుండానే 9.7 మిలియన్ పిల్లలు చనిపోతే, వారిలో దాదాపు 21% అంటే 2.1 మిలియన్ పిల్లల భారతదేశంలో మరణిస్తారు.
- ప్రపంచవ్యాప్తంగా ఇలా మరణించేవారిలో, పుట్టిన నెలరొజులకే సంక్రమించే అనారోగ్యాల (neo-natal) కారణంగా 37% చనిపోతే, మనదేశంలో 50% మంది పిల్లలు మరణిస్తారు.
- నిమోనియా కారణంగా 19%
- విరోచనాలు (డయేరియా) కారణంగా 17%
- మలేరియా కారణంగా 8%
- తట్టు (measles) మరియూ ఇతర గాయాల కారణంగా 4% మరియూ 3%
- ఎయిడ్స్ కారణంగా 3%
- ఇతర కారణాలవల్ల మిగతా 10% మరణిస్తారు.
- ప్రస్తుతం 9.4 మిలియన్ పిల్లలు ప్రాణాంతక వ్యాధుల్ని నివారించే టీకాలు వేయించుకోకుండా ఉన్నారు.
- దాదాపు 8.3 మిలియన్ పిల్లలు పుట్టుకసమయంలో కనీసం 1.5 కిలోల బరువుకూడా లేకుండా పుడుతున్నారు.
- ప్రపంచంవ్యాప్తంగా పౌష్టికాహారలేమి కారణంగా బరువుతక్కువగా (underweight) ఉన్న పిల్లల్లో 1/3 వవంతు భారతదేశంలో ఉన్నారు.
- ప్రతి లక్షజన్మాలకీ 450 నుంచీ 301 మందిపిల్లలు చనిపోతున్నారు (Infant Mortality Rate)
మరిన్ని వివరాలకు ఇక్కడ చూడండి.
16 comments:
Thanks for posting the information that everyone should read/know.
మంచి సమాచారం!
flip side - Infant mortality తక్కువున్న అభివృద్ధి చెందిన దేశాల్లో 700 నించీ 500 గ్రాముల బరువుతో పుట్టిన ప్రీమచ్యూర్ బేబీస్‌ని NICUల్లో ఉంచ్హి అతి జాగ్రత్తగా బ్రతికిస్తారు. కానీ దాదాపు 90 శాతం ఈ బేబీస్ కళ్ళు,ఊపిరితిత్తులు, మెదడు పెరుగుదలకి సంబంధించిన రుగ్మతల్తో బాధ పడుతూండటం వల్ల ఆ కుటుంబం మొత్తం శారీరక, మానసిక వత్తిళ్ళకి లోనవుతూంటుంది.ఆ తరువాత వాళ్ళకవసరమయ్యే వీల్ చైర్,పోర్ర్టబుల్ ఆక్సిజన్ టాంక్లూ, స్పెషల్ స్కూళ్ళూ, హోమ్ కేర్ నర్సులూ ఇంకా తదితర ప్రత్యేక ఏర్పాట్ల కోసం ప్రభుత్వం ఖర్చు పెట్టే మొత్తం మిలియన్లలో ఉంటుంది. విపరీతమయిన వత్తిడికీ లోనయిన ఆ తల్లిదండ్రులు విడాకులు తీసుకోడమూ అరుదు కాదు. :(
పుట్టగానే సంక్రమించగలిగే అనారోగ్యాల = congenital
Neonatal = నెలరొజుల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు
measles = తట్టు
Mumps = గవదలు
అయ్యా సమాచారాన్ని అందించేటప్పుడు కొద్దిగా పరిశోధన చేసి వ్రాయండి
@సుజాత గారు
NICU నుండి బయటకు వచ్చే పిల్లలందరినీ మీరు అందరినీ ఉద్దేశించి వ్రాశారు. మీరు వ్రాసిన దానిలో పూర్తిగా వాస్తవము లేదు. ౨౪-౨౬ వారాలకు పుట్టితే వారు ౪౦ వారాలు వచ్చే వరకు ఉంటారు.
బాలదినోత్సవము పేరు బాలబాలికల దినోత్సవముగా బాగా మార్చారు
@ధన్వంతరి: ధన్యవాదాలు. సవరణలు చేసాను. ఇకపై జాగ్రత్త వహిస్తాను.
మహేష్ గారు... మీరు ఇచ్చిన సమాచారం యొక్క విషయాని గురించి పక్కన పెడితే... మీరు సరిగ్గా బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ టపా రాయడం బాగుంది.
Dear Mahesh,
Good post .I had doubt(not related to this ).
You have used "theory of relativity" as a thing relating human relations in your posts and comments.But as per my knowledge it is a scientific principle .
Please do post on this topic to clarify the things.
నాక్కూడా అదే అనుమానం అదే అనుమానం వచ్చింది, బాలల దినోత్సవం కదా ? బాలబాలికల దినోత్సవమా అని ? మీరు ఎదన్న చెప్పటానికి టైటిల్ కావాలని పెట్టారా ?
బాలదినోత్సవము పేరు బాలబాలికల దినోత్సవముగా బాగా మార్చారు
why???
మొదట్లో ‘బాలల దినోత్సవం’ అనే రాసాను. తెలుగులో ‘బాల’ అన్నపదం, "పిల్లలు" అనేపదానికి సమానార్థకంగా ఈమధ్యకాలంలో ఎక్కడా వాడగా వినలేదు.మహాఅయితే,"పెళ్ళికళ వచ్చేసిందేబాలా" అని పాటల్లో అమ్మాయిని ఉద్దేశించి వాడినట్లున్నారు.
అదీగాక,బహువచనానికి వాడేప్పుడు మరో ‘ల’కలపగానే, అదేదో బాలలకి(మగపిల్లలకి)సంబంధించిన ఉత్సవంగా వినిపించింది.అసలే పిల్లలలో జెండర్ బ్యాలన్స్ తప్పుతున్న తరుణంలో (0-6 వయసులో ప్రతి 1,000 మంది మగపిల్లలకు,కేవలం 927 ఆడపిల్లలు) మరికొంత sensitive గా ఉండాలని, "బాలబాలికల దినోత్సవం" చేసాను.
మంచి సందర్భోచిత టపా. బాల అంటే బ్రౌణ్యం ప్రకారం 16 ఏళ్ళకన్నా తక్కువ వయసున్న పిల్ల అని. బాలల దినోత్సవం లో అసలుకి మగపిల్లలు లేరన్న మాట. మీరు బాలికల అని చేర్చినందువల్ల మగపిల్లలకి అన్యాయం జరిగింది :)).మీ స్పూర్తి నచ్చింది. అయినా బాల, మనిషి లాంటివి లింగతటస్థ పదాలు.
పిల్లల దినోత్సవమనుంటే మరింతమంది గయ్యిమనే వారేమో ):
నా పిడకల వేట: నాకు తెలిసినంతవరకూ బాలలు అంటే చిన్నపిల్లలు అనే అర్ధం - అమ్మాయిలో లేక అబ్బాయిలో మాత్రమే అని కాదు. బాలుర దినోత్సవం, బాలికల దినోత్సవం అనకూడదు కానీ బాలలదినోత్సవం అనొచ్చు.
ధన్వంతరి గారు చాలా క్లిష్టమైన పదాలకు తెలుగు అర్ధాలు బాగా చెప్పారు.కానీ తెరెసా గారిని సుజాత గా మార్చారు???
@సత్యసాయి కొవ్వలి:బాలానందం, బాలసాహిత్యం అటూ 70-80 దశకాల్లో పిల్లలకు సంబంధించినవాటిల్లో పదప్రయోగాలు జరిగాయి. దానికీ మీరు చెప్పిన బ్రౌణ్యానికీ తేడా ఉంది. మళ్ళీ ‘బాల’అనేది లింగతటస్థం(uni gender)అనడంకూడా కొంత సంశయానికి దారితీసేదే!
@బాబు: పిల్లలదినోత్సవం లేక చిన్నారుల దినోత్సవం పదాలు బాగానే ఉంటాయి.వాడొచ్చు.
@అబ్రకదబ్ర: మళ్ళీ ఇక్కడ బ్రౌణ్యానికీ వాడుకలో మారిపోయిన పదాలకీ తేడావస్తోందండోయ్! బాలుళ్ళనీ,బాలికలనీ కలిపి "బాలబాలికల దినోత్సవం" అనెయ్యడమో సేఫేమో!
@ rajendra - అది నా కామెంట్కి స్పందన కాదేమో NICU అనే ఒక్క మాట తప్పితే మిగతా content నా వ్యాఖ్యకి సంబంధించి లేదుగా!!
Post a Comment