కొన్ని సంవత్సరాలుగా తస్లీమా సస్రీన్ 'లజ్జా' (Shame) పుస్తకం కంటిముందు కనబడుతూవున్నా, ఇంతవరకూ చదవలేదు. కానీ ఇప్పుడే ఆ నవల ఆంగ్లానువాదంనుంచీ కొన్ని వాక్యాలు చదవటం జరిగింది. వాటిని తెలుగులో అనువదించి ఇక్కడ అందిస్తున్నాను.
నువ్వు ఆడపిల్లవి
ఆ విషయం నువ్వు మర్చిపోకు
గడపదాటావా, మగాళ్ళు నిన్ను అనుమానంగా చూస్తారు
నువ్వు వీధిలోకి వస్తే
మగాళ్ళు నిన్ను వెంటాడతారు, వేధిస్తారు
వీధిదాటి రోడ్డుమీదకొచ్చావో...
నిన్ను నిందిస్తారు,నిన్ను కళంకిని అంటారు
నువ్వు నిజంగా పవిత్రురాలివైతే
వెనుదిరిగి చూడవు
తలొంచుకు వెళ్తావు
ఇప్పుడెలా వెళ్తావో, అప్పుడూ అలాగే ఉంటావు.
- తస్లీమా సస్రీన్
ఈ వాక్యాలు చదివిన తరువాత ఆడపిల్లలపై ఆంక్షల విషయంలోభారతీయ పరిస్థితికీ బాంగ్లాదేశ్ పరిస్థితికీ పెద్ద తేడా లేదనిపిస్తుంది. ఈ పుస్తకం ఆంగ్లంలో తెలుగులోకూడా విరివిగా లభ్యమవుతుంది. ఈ వాక్యాలు చూసిన తరువాతనే నేనూ పూర్తి నవలను చదవాలని నిర్ణయించుకున్నాను. వీలైతే మీరూ చదవండి.
Monday, November 17, 2008
నువ్వు ఆడపిల్లవి
****
Subscribe to:
Post Comments (Atom)
13 comments:
దారుణమైన పోలిక! ఇంతకన్నా ఏమి చెప్పలేను.. పూర్తి నవల ఇంకా చదవనూ లేదు, అప్పుడే Conclusion :(
@satya: అది నా conclusion కాదు. ఈ వాక్యాలు చదివిన తరువాత నేను "అనుకున్నది" మాత్రమే! అదీ దారుణం అనుకుంటే, మీరొకసారి హర్యాణా,పంజాబ్,యూపీ,బీహార్,రాజస్థాన్,మధ్యప్రదేశ్లు తిరిగిరండి.
ఆడపిల్ల అని పుట్టకముందే తెలిస్తే అబార్షన్లు. పుట్టినా వీలైతే పుట్టగానే మట్టిలో కలిపే ప్రయత్నాలు.సమరవ్వగానే స్కూలుమానిపించిన ఆడపిల్లలూ.ప్రేమవివాహమంటే కులగౌరవంకోసం హత్యలు. తమవయసుకన్నా కనీసం మూడొంతుల వయసు వాళ్ళతో పెళ్ళిళ్ళు.లేదా బాల్యవివాహాలు. ఘూంఘట్ కొనలనుంచీతప్ప మిగతా ఏవిధంగానూ ప్రపంచాన్ని చూడలేని నిబంధనలు.
ఇంకా దారుణం కావాలా! హైదరాబాదో, బెంగుళూరో,అమెరికానీ,బ్రిటనో దాటండి! భారతదేశాన్ని పూర్తిగా చూడండి.
"భారతీయ పరిస్థితికీ బాంగ్లాదేశ్ పరిస్థితికీ పెద్ద తేడా లేదనిపిస్తుంది". రెండూ ఒకటే అంటారా ?
అయ్యా మన వంట్లోంచి విడిపోయిన భాగమే కదా ఆబంగ్లాదేశం కూడా..
భారత దేశంలో పరిస్థితి ఎక్కడో కొన్ని చోట్ల తప్పించి, ఇంత దారుణంగా లేదు లెండి!మీరు నవల మొత్తం చదవండి, అప్పుడు బహుశా మీరే ఒప్పుకుంటారు. నాకు మాత్రం ఈ నవల మధ్యలో అక్కడక్కడా బోరు కొట్టింది.
కత్తి మహేష్ గారు అవి లజ్జలోని కవిత కాదండి , అసలు లజ్జ స్త్రీనిగురించి కాదు, బాబ్రి మసీదు కూల్చినప్పుడు బంగ్లాదేష్ లో జరిగిన గొడవల సారం ఆ లజ్జ, ఇందులో హిందువులను కుక్కలు గానూ మహమ్మదీయులను పందులతోటి పోలచటం జరుగుతుంది, అందువలన తనకు భారతదేశ మహమ్మదీయులచే తీవ్ర నిరసన ఎదురంది.
ఎప్పుడో చదివేసా. నచ్చిన పుస్తకాలలో అది ఒకటి. ఏ మతం లోనయినా ఛాందసత్వం ఎంత చెడ్డదో మనకు మరోసారి తెలుస్తుంది.
you seem to assume that this book is some feminist writing(your post implies that). It is not.
The background of this novel is anti hindu riots occurred in Bangladesh after Babri Masjid demolition.
from the perspective of a novel, it is badly written; no skill. But it has a point, that humanity is greater than any religion.
If you think this is a feminist writing and read this, you may find yourself disappointed.
మహేష్ గారు,
నేను మొదటినించి గమనించేది మీరు ఒక టాపిక్ మీద అభిప్రాయం చెప్పేప్పుడు "Quantum of Error/Quantum of deviation" ని పరిగణలోకి తీసుకోకుండా మీకు అనుగుణంగా పోలికలు పెట్టటం. ఇంక మీరు చెప్పే 'అనిపించటం/అనిపిస్తూవుండటం/అనిపించేయటం' 'conclusion/tend towards conclusion/concluded లాంటివే.. వేరే opinion దానిని Replace చేసేవరకు. ఇంక ఈ పదాలతో పదనిసలు ఎందుకులే..విషయానికి వద్దాం.
మీరు చెప్పినవి అసలు లేవని అనటం లేదు కానీ, అతి తక్కువ (బంగ్లాదెశ్ తొ సమానం అనే స్థాయి లో లేవు )అని చెప్తున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ లోని అతి మారుమూల పల్లె లోంచి వచ్చినవాడనే (ప్రకాశం జిల్లా). ఇప్పుడు అక్కడ మీరు చెప్పినవి ఏవి లేవు. ఇప్పుడే కాదు, అప్పుడు కూడా మూడొంతులు వయసు వారితో పెళ్ళి, అబార్షన్ వంటివి అత్యంత అరుదు. విద్య విషయం లొ అమ్మాయికా/అబ్బయికా అన్నది ఆర్ధిక స్థొమత ని బట్టి తీసుకునే నిర్ణయాలు. కాని ఆ రచయిత ఉద్దేశ్యం మిగిలిన ఆంక్షలని తెలియచెయ్యటం. UP, బీహార్ లొ కొద్దిగా ఎక్కువే. కాని హర్యానా, పంజాబ్, MP లని మినహాయించండి. అక్కడ మనం చూసే Honour killings బాగా ఉన్నత కుటుంబాలలోని కొంతమంది చేస్తున్నవి మాత్రమే. అన్నట్లు ఇవి అమెరికా, బ్రిటన్ వంటి దేశాలలో కూడా జరిగినట్లు విన్నవే.. వాళ్ళని కూడా పొల్చకండి.
అంతెందుకు! ఒక్క ముక్కలో చెప్పాలంటే మనదేశం లోని ఆడపిల్లలకి Below middle/middle/upper class లో లభిస్తున్న కుటుంబ మద్దతు, స్వేచ్ఛ ని బంగ్లాదేశ్ :( లోని వాళ్ళ తో పొల్చండి. దీనికి బీహార్, UP వెళ్ళనవసరం లేదు, మన చుట్టూ వున్న సమాజాన్ని కొంత గమనిస్తే చాలు లేక పుస్తకాలు, పత్రికలు... అన్నట్లు మీరు బంగ్లాదేశ్ కి వెళ్ళారా?
@ aswin budaraju,
yes.. u r right. but jst to differ with Mahesh's opinion irrespective of Novel's view.. I made my point
చది వాను, కాని మీరనుకుంటున్నట్లు ఫెమినిష్టిక్ రచన కాదు.నవల బాగుంటుంది.రచయిత్రి వాస్తవాల్ని అతి హృద్యంగా చిత్రీకరించింది.
తస్లీమా నవల ఒకటి ఇటీవల తెలుగులోకి అనువదించబడింది..."చెల్లు కు చెల్లు" ఆ నవల పేరు. అది ఫెమినిస్టు నవలే!
19 ఏళ్ళప్పుడు నేను చదివిన మొదటి నవల అదే అని చెప్పడానికి ఎప్పుడు ఆనందపడతాను. నేను తెలుగులోనే చదివాను.
అందులో ఎన్నెన్నో భావాలని ఎంతో హృద్యంగా తస్లిమ నస్రీన్ వర్ణించింది.
కుర్చుంటే ఒక్కరోజులో చదివెయ్యొచ్చు... మధ్య మధ్యలో మన పనులు చేసుకుంటూ...
Post a Comment