ఉదార-లౌకిక సాంప్రదాయాలు (secular liberal traditions) లేక లౌకికమానవతావాదాల(secular humanism) త్రోవలో ఏ చర్చ సాగించాలన్నా, సాంప్రదాయవాదులు మొదటిగా వేసే నింద "మెకాలే మానసపుత్రులు". భారతదేశంలో ఆధునికవిద్య ప్రవేశపెట్టిన థామస్ బెనింగ్టన్ మెకాలే -Lord Thomas Babington Macaulay (1800-1859) విధానాలవలన హిందూమతానికి దూరమైన మూఢులే ఈ ‘మెకాలే మానసపుత్రులు’. హిందూజాతీయవాదం పేరుతో ఉప్పొంగుతున్న భావజాల నేపధ్యంలో, ఈ భావన బలంగా పాతుకుపోయింది. హిందూజాతీయవాదులే కాక, సాధారణ హిందువులుకూడా, ఈమధ్య అంతర్జాలంలో ప్రచలనలోకి వచ్చిన కొన్ని వాక్యాలను (quote) ఆధారం చెసుకుని ఈ విషయాన్ని నమ్మడానికి తయారుగా వున్నారు. పూర్తి చరిత్ర చదవటమో, లేక కనీసం ఆ quote యొక్క పూర్వాపరాలను తెలుసుకోవడం (ఆ మెకాలే విధానాలవలన వచ్చిన ఉద్యోగాలలో) బిజీగా వున్న మనజీవితాలలో కుదరదు కాబట్టి, చెప్పింది యధావిధిగా నమ్మేయడం జరుగుతోంది.
ఈ quote నేపధ్యానికి చెందిన కొంత చరిత్ర, మరికొంత విశ్లేషణా సేకరించి ఔత్సాహికులైన ఉదారవాదులకోసం ఇక్కడ పొందుపరుస్తున్నాను.
"I have traveled across the length and breadth of India and I have not seen one person who is a beggar, who is a thief. Such wealth I have seen in this country, such high moral values, people of such calibre, that I do not think we would ever conquer this country, unless we break the very backbone of this nation, which is her spiritual and cultural heritage, and, therefore, I propose that we replace her old and ancient education system, her culture, for if the Indians think that all that is foreign and English is good and greater than their own, they will lose their self-esteem, their native self-culture and they will become what we want them, a truly dominated nation."
మెకాలేకి ఆపాదించబడుతున్న పై quote యొక్క కాలం 1835 బ్రిటిష్ పార్లమెంట్ గా చెబుతారు. ఇక్కడున్న సమస్యేమిటంటే, 1835 సమయానికి మెకాలే భారతదేశంలో వున్నాడు. ఈ విషయం మీద తను బ్రిటిష్ పార్లమెంట్లో మాట్లాడింది 1833 లో. ఈ నిజాన్ని పక్కనబెట్టి, కేవలం తను చెప్పాడని అనుకుంటున్న quote లోని విషయాన్ని చూద్ధాం. ఆకాలంలో ఆంతరంగికంగా బ్రిటిష్ వాళ్ళ ఈ విషయాల గురించి మాట్లాడుకున్నాకూడా, ఒక పార్లమెంటరీ డిబేట్ లో ఇలాంటి వాదాలు చేసేవారు కాదు. ‘నాగరికతను స్థాపించడం’ మరియూ ‘బానిస విధానాలను అంతమొందించడం’ లాంటి ఉద్దాత్తమైన విధానాల పేరుతో అప్పటి సామ్రాజ్యవాద (colonial) విస్తరణ జరిగింది. అందుకే, ఎప్పుడూ తాము గొప్పవాళ్ళమని, ఈ చీకటి ప్రపంచంలోకి వెలుగు నింపడానికి వచ్చామనీ చాలా బలంగా నమ్మేవాళ్ళు. కానీ, ఇక్కడమాత్రం మెకాలే భారతీయ సంస్కృతిని ఆకాశానికెతేస్తూ, దాన్ని నాశనం చెయ్యడానికి కంకణం కట్టుకోవాలని ఒక పబ్లిక్ ఫోరంలో చెబుతున్నట్లుగా నమ్మించాలని చూసారు. పైగా, బ్రిటిష్ సంస్కృతికన్నా ఈ నాగరికత గొప్పదన్నట్లుగా ఆ కాలంనాటి ఒక upper class ఇంగ్లీష్ అధికారి (అదీ పార్లమెంట్ లో, ఈస్ట్ ఇండియా కంపెనీని represent చేస్తూ) మాట్లాడినట్లు చెప్పడం నమ్మశక్యం కాని విషయం.
ఒకవేళ మాట్లాడాడు అనుకున్నా, 1833-35 నాటికి మన భారతీయ సంస్కృతి తను చెప్పినంత ఉన్నతంగా ఉన్నట్లు చారిత్రక ఆధారాలు లేవు. కేవలం 2% కన్నా తక్కువమందికి వేదాలూ,స్మృతులూ,ధర్మాలూ ఇతరత్రా విషయాల జ్ఞానం ఉండేది. కేవలం బ్రాహ్మణ,క్షత్రియ, వైశ్యులు ఈ విధివిధానాలను పాటించేవారు. ఈ జ్ఞానాన్ని సమపార్జించేవారు. అప్పటికే జనబాహుళ్యంలో మూఢనమ్మకాలూ, హింసాత్మకమైన ఆచారాలూ వేళ్ళూనుకొని వున్నాయి.ఇక్కడ మరో విచిత్రమేమిటంటే, ఈ పురాతనజ్ఞానం మీద సర్పాల్లా తిష్టవేసుకున్న ఇవే వర్గాలు/కులాలు, మెకాలేవిధానాల వలన అత్యధికంగా లాభపడ్డారు. కార్మికులూ,కర్షకులూ, రైతులూ బ్రిటిష్ వారి ఆర్థిక విధానాలవలన చితికిపోతే, ఈ సాంప్రదాయ ప్రేమికులు దుబాసీలుగా, బ్రిటిష్ అధికారానికి దాసులుగా రాజ్యం చేసారు.
ఇక్కడ మెకాలే భారతదేశానికేదో పెద్ద సేవ చేసాడని చెప్పడం ఉద్దేశం కాదు. కాకపోతే, అప్పట్లో తనకు ఇచ్చిన పనిని సిన్సియర్గా చేసాడు అంతే! అప్పట్లో బ్రిటిష్ వారి ముఖ్య ఉద్దేశం వ్యాపారం, ఆ తరువాత రాజ్యాధికారం. వాటిని సాకారం చెయ్యడానికి కావలసిన విధానాల రుపకల్పన చేసాడు.
ఇతని మీద వేసే మరొ అభియోగం, ‘హిందువుల్ని మతరహితుల్ని చేసి, తమ భావజాలానికి బానిసలుగా చేసే విద్యావిధానాన్ని నిర్మించాడు’ అని. దానికి ఆధారంగా చూపే quote ఇది;
'It is impossible for us, with our limited means, to attempt to educate the body of the people. We must at present do our best to form a class who may be interpreters between us and the millions whom we govern; a class of persons, Indian in blood and colour, but English in taste, in opinions, in morals, and in intellect." నేనిక్కడ ఒక వాక్యాన్ని బోల్డ్ లో పెట్టి, ప్రత్యేక ఆకర్షణగా నిలిపినట్లే ఈ quote చెప్పేటప్పుడు తమ వాదనల్ని వినిపించేవారూ చేస్తారు. కానీ మెకాలే అదే వ్యాఖ్యలో తరువాత చెప్పిన వాక్యాల్ని మాత్రం ఎక్కడా చూపించరు. వాటిని ఇక్కడ చూడండి; "To that class we may leave it to refine the vernacular dialects of the country, to enrich those dialects with terms of science borrowed from the Western nomenclature, and to render them by degrees fit vehicles for conveying knowledge to the great mass of the population.'" ఇప్పుడు మొత్తం పేరాని ఒకసారి చదువుకోండి. Now you may know, who is taking you for a ride.
ఇక్కడ మెకాలే మాటల్లో ఆ కాలంనాటి classic liberalism కనిపిస్తుందేతప్ప "కుట్ర" కనిపించదు.అప్పట్లో యూరోప్ లో ప్రచులితమైన శాస్త్రీయ ధృక్పధం (scientific temperament), సాంకేతిక విజ్ఞానాన్ని మనస్ఫూర్తిగా జ్ఞానమని నమ్మి, దాన్ని అందరికీ అందేలా చెయ్యాలనుకునే ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఒక సంస్కృతి గొప్పదనంవలన తమ ఉద్దేశాలు సాకారం కావుగాబట్టి, మోసంతో దాన్ని అంతం చెయ్యాలనుకునే మూర్ఖుడు కనిపించడు.అంతేకాక, అప్పటికే ఇతర సంస్కృతులవలన బాగుపడిందనుకున్న బ్రిటిష్ సంస్కృతి నేర్చుకున్న పాఠాలను, భారతదేశానికి అన్వయించాలనుకునే మేధావి కనబడతాడు. ఇదే speech లో తను బ్రిటన్ గురించీ, బ్రిటన్ లోకి ఇతర సంస్కృతులు వచ్చి ఎలా enrich చెసిందీ చెప్పాడు.
"The first instance to which I refer, is the great revival of letters among the Western nations at the close of the fifteenth and the beginning of the sixteenth century. At that time almost everything that was worth reading was contained in the writings of the ancient Greeks and Romans. Had our ancestors acted as the Committee of Public Instruction has hitherto acted; had they neglected the language of Cicero and Tacitus; had they confined their attention to the old dialects of our own island; had they printed nothing and taught nothing at the universities but Chronicles in Anglo-Saxon, and Romances in Norman-French, would England have been what she now is? What the Greek and Latin were to the contemporaries of More [Thomas --, 1478-1535] and Ascham [Roger --, 1515-68], our tongue is to the people of India."
ఇక్కడ, జ్ఞానాన్ని పంచుకోవడంలో తను తెలుసుకున్న మార్గాన్ని విధానరూపంలో చూడాలనుకునే ఒక ఔత్సాహిక విధ్యావేత్త కనిపిస్తాడు. గ్రీకు లాటిన్ భాషలద్వారా బ్రిటిష్ వారు నేర్చుకున్న నమూనాలో ఇంగ్లీష్ ద్వారా భారతీయులు ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటారనే conviction కనిపిస్తుంది. కొందరు మిత్రులు "ఆ..మెకాలే కొత్తగా నేర్పే జ్ఞానమేమిటి? మనదగ్గరున్న వేదాల్లో అప్పటికే అన్నీ వున్నాయిగా!" అంటారు. నిజమే. నిజమే!! కానీ అదెక్కడుంది? ఎంతమందికి తెలుసు? దాన్ని పంచుకోవడానికి ఎవరు తయారుగా ఉన్నారు? కనీసం ఇప్పటికన్నా దాన్ని వెలికితీసి అందరికీ పంచరే!!! వీటికి మాత్రం సమాధానాలు రావు.
మెకాలే ఇదంతా ఏదో లాభాపేక్షరహితంగా చేసాడనో, బ్రిటిష్ వారు భారతదేశం మీద ప్రేమతోనో చేసింది కాదని అందరికీ తెలిసిన సత్యమే.అది వారెక్కడా దాచుకోలేదుకూడా.
"It is scarcely possible to calculate the benefits which we might derive from the diffusion of European civilisation among the vast population of the East. It would be, on the most selfish view of the case, far better for us that the people of India were well governed and independent of us, than ill governed and subject to us; that they were ruled by their own kings, but wearing our broadcloth, and working with our cutlery, than that they were performing their salams to English collectors and English magistrates, but were too ignorant to value, or too poor to buy, English manufactures. To trade with civilised men is infinitely more profitable than to govern savages."
ఇలా విద్యకూ వ్యాపారానికీ గల సంబంధం యొక్క రహస్యాన్ని విప్పిచెప్పాడుకాబట్టే, మొదట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఆ తరువాత బ్రిటిష్ ప్రభుత్వం విద్యపైన డబ్బులు ఖర్చుపెట్టాయి. లేకపోతే, మనమూ ఏ ఆప్ఘనిస్తానో లేక ఆఫ్రికా దేశాల్లాగానో అధమం నేపాల్ లాగానో తయారయ్యుండేవాళ్ళం. మెకాలే అర్థజ్ఞానంతో తన ప్రతిపాదనల్ని సమర్పించాడనుకున్నా, ఈ ప్రతిపాదనలు ఏకపక్షంగా అంగీకరించబడలేదు. దాన్ని ప్రతిఘటించినవారూ, చర్చించినవారూ ఉన్నారు. కానీ, వారి వాదనలు నిలబడలేకపోయాయి. అప్పటికే Tradition Vs Modernity చర్చలు జరుగుతున్న బ్రిటన్లో, ఈ రెండిటిమధ్యా కావలసిన సమన్వయాన్ని ప్రతిపాదించేవాళ్ళు లేకపోయుండచ్చు. అందుకే సాంప్రదాయం మీద ఆధునికత విజయం జరిగిపోయింది.
మెకాలే మీద చేసే మరో ఆరొపణ క్రైస్తవ మిషనరీల ఉద్దేశాలకు అనుగుణంగా విద్యావ్యవస్థను తయారు చేసాడని. ఒకవైపు బ్రిటిష్ ప్రభుత్వం మరో వైపు బ్రిటిష్ చర్చిని సముదాయించి, బిజ్జగిస్తేగానీ ప్రశాంతంగా ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం చేసుకోలేని సమయం అది. తను కలకత్తాలోని ఒక ఎవాంజెలిస్ట్ ఫాదర్ కు రాసిన లేఖలోని భాగాలను చూడండి;
"No Hindoo, who has received an English education, ever remains sincerely attached to his religion. Some continue to profess it as matter of policy; but many profess themselves pure Deists, and some embrace Christianity. It is my firm belief that, if our plans of education are followed up, there will not be a single idolater among the respectable classes in Bengal thirty years hence. And this will be effected without any efforts to proselytise; without the smallest interference with religious liberty; merely by the natural operation of knowledge and reflection. I heartily rejoice in the prospect."
ఇక్కడకూడా హిందూమతానికి దూరమైన వార్లో కొందరి క్రైస్తవానికి రావచ్చనే ఆశనికల్పించాడేతప్ప, అది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పలేదు. జ్ఞానం మనిషిలో బుద్దివికాసానికి తోడ్పడితే, వాడు మానవతావాది అవుతాడే తప్ప మతాల్ని పట్టుకుని వేలాడడు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే,ఈ దారిలోనే ఇస్లాం మతం లో, మదరసాల విద్యకు దూరంగా, సెక్యులర్ విద్యను భోధిచడం ఇస్లాం తీవ్రవాదానికి సరైన మందుగా ఒకవైపు ప్రభుత్వాలు భావిస్తుంటే, అది త్వరితగతిన జరగాలని హిందూ సాంప్రదాయవాదులు కోరడం. అప్పట్లోని అవసరాలకు అనుగుణంగా మెకాలే ప్రతిపాదిస్తే తప్పు, ఇప్పుడు మన అవసరాలకి అనుగుణంగా మనం కావాలనుకుంటే ఒప్పు. అంతే!
మెకాలే సిద్ధాంతాల వలన వచ్చిన ఆంగ్లవిద్య కావాలి. అదే విద్యద్వారా వచ్చే ఉద్యోగాలు, సాఫ్ట్ వేర్ జాబ్స్ కావాలి. తద్వారావచ్చే ఆర్థిక లాభాలూ,స్వావలంబనా కావాలి. దాని ఆధారంగా మనం ఒక developed nation కావాలి. కానీ, ఎవరైనా ఉదార-లౌకిక సాంప్రదాయాలు (secular liberal traditions) లేక లౌకికమానవతావాదాల(secular humanism) గురించి మాట్లాడితే మాత్రం "వాడొక మెకాలే మానసపుత్రుడు". సాంప్రదాయాల్నీ, సంస్కృతుల్నీ, విలువల్నీ ఆధునికత ఆధారంగా ప్రశ్నిస్తే...వారు మెకాలే మానసపుత్రులు. మెకాలే విధానాలు అందించిన లాభాలు మాత్రం కావాలి, ఆలోచనలు మాత్రం ఒద్దు. మెకాలే విధానాలు అందించే సామాజిక గుర్తింపుకావాలి, విలువలు మాత్రం ఒద్దు. వాటిని మాత్రం ఎవరికీ తెలీని రహస్య వేదాల్లో, అర్థంకాని సంస్కృత శ్లోకాల్లో వెతుక్కోవాలి.
"English remains indispensable for technical education and as a means of inter-State communication. The software revolution in India might never have happened had it not been for Macaulay's Minute. And India might not have still been united had it not been for that Minute either. For, it was the existence and availability of English that allowed the States of South India to successfully resist the imposition of Hindi upon them"
- Guha (2007)
*కొసమెరుపేమిట్రా అంటే, మొదట్లో ఉటంకించిన quote ఒక అంతర్జాల HOAX అని కొన్నాళ్ళకి తేలడం.
References
http://en.wikipedia.org/wiki/Thomas_Babington_Macaulay
http://www.languageinindia.com/april2003/macaulay.html
http://www.humsurfer.com/india-in-1835-a-proposal-from-lord-macaulay-to-british-parliament
http://www.countercurrents.org/dalit-prasad271004.htm
http://koenraadelst.bharatvani.org/articles/hinduism/macaulay.html
http://www.mumbai-central.com/nukkad/jan2008/msg00251.html
****
29 comments:
I can no way agree with you... If the English and other people didn't invade India, may be India would've been a set of different countries, each with its own official language and a separate identity, similar to the European countries and all being developed nations, in contrast to what you said.. "an african country or nepal"... All these so called softwares and programming languages would've been in our own native language.. You can see that even now in those countries.. Germans use softwares in German language only..but not English... and of course, they have huge contribution in IT... they use German "only" for communicating with others...
Do not correlate the
contributions by Indians in IT industry with the education system introduced by the English.
The English period in India took away the wealth of this country but left us a poor nation, with just that education system.. Today we are only making use of the same to connect to global economy.... we only have a small edge compared to other non-english speaking countries.. chinese for example, learning english fast to connect with the world...
may be things would've been different if India wasn't invaded by English...... The point saying that the British education system is the reason for our opportunities in IT is absolutely false propaganda....
ఇలాంటి చర్చలు ఎప్పుడో వెనకటి కాలంలో జరిగేవనుకున్నాను, ఇంకా సాగుతున్నాయన్నమట.
ఈ వ్యాసంలో నాకు కనిపించిన లోపాలు చాలానే వున్నాయి. కానీ నేను వాటిని ఎత్తి చూపడం, నన్ను మీరు నమ్మించ ప్రయత్నం చేయడం వంటివి చేసుకుంటే, బ్లాగ్లోకం భయపడే రచ్చ మాత్రం జరుగుతుంది, చివరకి ఎవరు నమ్మేది వారు నమ్ముతారు.
ఇక ఆధునికత అంటే యూరోపియన్లే చేతులెత్తే సమయంలో, (చేంజ్ ని నమ్మే అమాయకులు అమెరికాలో పెద్ద మొత్తాల్లో లేకపోలేరు), ఇలాంటి చర్చల పెద్ద ప్రయోజనంలేదు.
ఇక ఆంగ్లం-ఆర్థిక వ్యవస్థ చర్చ అంటారా, దాని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత నయం.
ప్రస్తుతం ప్రపంచంలో భారీ మార్పులు జరుగుతున్నాయి. పాశ్చాత్యులూ సుఖంగా లేరు. ప్రాచ్యులూ సుఖంగా లేరు. కాపిటలిస్టులు కంగు తిన్నారు, కమ్యూనిస్టులు కంగు తిన్నారు. ఇలాంటి సమయంలో వేచిచూడడం అన్నిటికంటే మంచి పద్ధతి. :)
hi rakeswar, somewhere i had seen you have studied in SASI, velivennu, where nothing is told about telugu literature. but now you are writing telugu poetry with complete chadassu and alankaras etc. i think you are equipped with the good experiences and able to explain mahesh one person need not get all his living and worldly knowledge from the same place.Every person has his individual choice to get the knowledge he want from the multiple sources like some from sanskrit slokas and some from physics text books.
మెకాలే అంటే క్లర్కులని తయారు చేసేలా భారతీయ విద్యావ్యవస్థని మార్చివేసిన వ్యక్తి గానే ఇంతవరకూ తెలుసు.
మంచి ఇంఫర్మేషను ఉన్న వ్యాసం.
కత్తి,
Very well written.
Here is a very interesting read about Christ creation myth.
http://rationalrevolution.net/articles/jesus_myth_history.htm
http://truthbeknown.com/
Kathi,
You are writing very well, on various subjects.
Please remove the moderation, and allow people to post comments.
It is unfortunate that some of the Indians still think the British (White Christian) rule was good for India.
Please read The Clash of Civilizations, proposed by political scientist Samuel P. Huntington, to understand how India was transformed from 2nd richest country in the world to one of the poorest country by 1947becasue of White Christian (British) rule. When British captured political power in 18th century India's GDP was 25% of the world's GDP and when British left India in 1947, the India's GPD was less than 1% of the GDP of the world.
White Christians looted the welath of our nation and reduced it to rubble. They destroyed our sense of a pride, and divided our country based on Religion, destroyed our indigenious industry, shattered our belief system, culture and social systems. They never hide this fact, where as children of Mecaulay proudly cliam that the White Christian rule was good for India.
Shame on such ignorent bunch. Such people may claim that the rule of Sonia , a lone White Christian Italian Women is good for the country. If foreign rule is so good, why no other coutnry (give the example of at least one country, except India)is importing Prime ministers and Presidents from foreign countries?.
The label "Britsh" was used in our history books by Maxist histerions to mask the true rule of White Christians over India. since 710 AD Muslims ruled over India, it was followed by White Christian rule until 1947, and there after Socialist/Communists rule was imposed by Nehru and his Daughter, grandson and that grandson's tail Sonia. Nehru kept India frozen (socially and economically) for 55 years after independance. Even after 60 years of independance, hundreds of Millions of SC's ST's and BC's living in absolute poor. Most of the lower caste people were kept illiterate by desin by Nehru and his tails to rule India for ever.
Nehru never learn from any body else , as you know, that George Washington (first United States President)refused to serve 2nd term, and he retired after 8 years of rule. Where as Nehru cling to power until he died. And ensured that power passess to his daughter, and she ensured power passes to her son, and that idiot ensured that the imported Italian rule over one Billion Indians.
When we allow the poorest of poor Indians (ST's, SC's and BC's) rule our country and get proper educatcation, get rich and gain social equality?
Mahesh:
Let me start off saying that some of yours conclusions seem a bit too radical (Statements regarding, మెకాలే సిద్ధాంతాల వలన వచ్చిన ఆంగ్లవిద్య కావాలి. అదే విద్యద్వారా వచ్చే ఉద్యోగాలు, సాఫ్ట్ వేర్ జాబ్స్ కావాలి..)
Now I would say, I agree with your statement saying Macaulay may not have any extra evil-interests as the infamous quote suggests. The quote's origins need further investigation though. Someone has the onus to come up with the source for me to believe. At the face of it, if anyone wants to believe, I have no issues:-) "The Competition Wallah By George Otto Trevelyan - 1866" had no mention of the infamous quote. However it writes M. saying : "I have no knowledge of either Sanscrit or Arabic. — But I have done what I could to form a correct estimate of their value. I have
read translations of the most celebrated Arabic and Sanscrit works.
I have conversed both here and at home with men distinguished by
their proficiency in the Eastern tongues. I am quite ready to take
the Oriental learning at the valuation of the Orientalists themselves.
I have never found one among them who could deny that a single shelf
of a good European library was worth the whole native literature of
India and Arabia. The intrinsic superiority of the Western literature
is, indeed, fully admitted by those members of the Committee who
support the Oriental plan of-education. ". In the chapter "EDUCATION IN INDIA SINCE 1835 WITH A MINUTE OF LORD",
nowhere the tone of Mr.M had the same kind of negativety the quote suggests.
I am in no position to judge (at least until I do some findings) what our education during those times had to offer. If only the teachings were more advanced than what west had to offer, I question the motives and authority of those "members".
Having said that I would agree with rest of the bloggers views with respect to leaving india poorer (If not we may have bought/brought the education system ourselves). Another one compared china/Germany and I concur with them. At no point I would support the argument British had done any good to India by invading. I strongly condemn the statement that India would have been another Afghan if not for British.
@యాజి:There is every possibility that Macaulay was ignorant.తన సంస్కృత,అరబిక్ జ్ఞానం దాదాపు నగణ్యం అయ్యుండొచ్చు. అందులో ఏమాత్రం సందేహం లేదు.అప్పట్లో వేదాల గురించి చెబుతున్న రహస్యజ్ఞానమంతా ఏ కొద్దిమంది చేతుల్లోనో వుండేది. మెజారిటీ హిందువులకుకూడా ఈ జ్ఞానం accessible కాదు. అలాంటిది మెకాలే చదివిన ఆంగ్లానువాదాలు useless texts and their translations అయ్యుండొచ్చు.
ఈ తెలియనితనంతోనే he might have down his conclusions.Ignorance can't be showcased as evil.
ఇక నా conclusions radical అన్నారు. నా అభిప్రాయాలకు గల ఆధారాలు కొన్ని మీకు references లో దొరుకుతాయి. కానీ, అడిగారు కాబట్టి let me make myself clear. మెకాలే మినిట్స్ ని మూలాధారం చెసుకునే మన విద్యావ్యవస్థ ఇప్పటికీ నిలచి వుంది. కొత్త professional courses మినహా,మన సివిల్ సర్విస్ విధానం కూడా ఆ మూసలోనే ఉంటుంది గమనించగలరు.మనదేశంలోని అతిపెద్ద job creator ప్రభుత్వం. మిలటరీ మినహా ఇప్పటికీ మిగతా ఉద్యోగాల్లో సింగభాగం మెకాలే కావాలనుకున్న క్లర్కులదే,గ్లోరిఫైడ్ ఆఫీసర్లదే.
ఇక సాఫ్ట్వేర్ అంటారా,ఇంగ్లీషు విద్యలేకుండా ఈ విధమైన job accessibility ఉండేది కాదు. అది నిజంకాదా!
ఇక ఆప్ఘనిస్తాన్ ఉదాహరణ ఇవ్వడానికి కారణం బ్రిటిష్ వాళ్ళు ఆ దేశాన్ని పాలించినా, అక్కడ ఇన్ని వ్యవస్థలు కల్పించలేదు (అక్కడ కొల్లగొట్టడానికి ఓపియమ్ తప్ప మరేమీ ఉండేదికాదు).
భ్రిటిష్ వాళ్ళేదో మనదేశాన్ని ఉద్దరించడానికొచ్చారనే అపోహ నాకూ లేదు. వాళ్ళొచ్చింది వ్యాపారం కోసం.చేపట్టింది శోషణతోకూడిన రాజ్యాధికారం. వాళ్ళ శోషణకు అవసరమైన సరంజామా సమకూర్చుకోవడంలొ వాళ్ళు చేసిన కొన్ని పనులవలన కొన్ని లాభాలు జరిగాయి అంతే!They are only by-products.
ఇక్కడ చర్చ విద్యావ్యవస్థ గురించి జరుగుతుంటే,మొత్తం బ్రిటిష్ పాలన గురించి మాట్లాడటం తగదు.
Mahesh, you can see the good in British rule by-products also. Very Good keep posting all these new senses people will develop like you.
"చేంజ్ ని నమ్మే అమాయకులు అమెరికాలో పెద్ద మొత్తాల్లో లేకపోలేరు"
Salutes Rakeswara Rao gaaru, as a guy living in USA for 11 years, who loves this country to the core and studied American Politics of last 40 years, I can say that your statement is so.....true. I can write pages about it, but I just thought I would pass on my appreciation for that statement.
@అనామకుడు: భ్రిటిష్ వాళ్ళు తమ స్వార్థంకోసం అన్నిపనులూ చేసినా, వాటిల్లోకొన్ని indirect గా మనకు లాభాన్నే తెచ్చాయి. అందులో మచ్చుకకి కొన్ని ఇక్కడ రాస్తున్నాను.
1.భారతరాజకీయ ఏకీకరణ: ఇదివరకూ భారతదేశం అనే ఒక ఆలోచన ఉన్నప్పటికీ,చిన్నచిన్న రాజ్యాలుగా విడిపడుండేదేగానీ కలిసికట్టుగా ఒక రాజకీయ భాగంగా రూపిదిద్దుకోలేదు. పైపెచ్చు ఎప్పుడూ తమలోతాము కొట్టుకుంటూ,యుద్ధాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు.
2.ఇంగ్లీషు భాషాభోధన: ఇక్కడే మెకాలే మినిట్స్ ప్రాముఖ్యత తెలుస్తుంది. అప్పటివరకూ inter state-language communication ఒక పెద్ద అఘాతంలా వుండేది. ఈ ఇంగ్లీషుద్వారా అది సులభతరం అయ్యింది.స్వాతంత్ర్యోద్యమ సమయంలో ఆలోచనల వ్యాప్తికి ఈ భాషచేసిన మేలు అంతాఇంతా కాదు. ఈ భాషలో చదివి స్వతంత్ర్యభావాలను అందిపుచ్చుకున్న తరువాతే, గోఖలే,గాంధీ,నెహ్రూ వంటివారు స్వాతంత్ర్యోద్యమంలోకి దిగి బ్రిటిష్ వారిని వారి "rule of law" ఉపయోగించే దెబ్బతీసారు.
3.ప్రింటింగ్ ప్రెస్ మరియూ టెలిగ్రాం: స్వాతంత్ర్యోద్యమ వ్యాప్తిలో ప్రెస్ మరియూ పోస్టల్ సర్విస్ పాత్ర గురించి మీరు ‘బిపిన్ చంద్ర’ను చదవండి.
4.రైల్వే: బ్రిటిష్ వారు అసంకల్పితంగా అందించిన మరో లాభం భారతీయరైల్వే.
5.మిలిటరీ: బ్రిటిష్ వారికి పూర్వం మన సేన ఇంత వ్యవస్థీకృతం కాలేదు. ఇప్పటికీ చాలా బెటాలియన్ల పేర్లు అప్పటివే ఉంటాయి. గమనించండి.
ఇక్కడ ప్రశ్న బ్రిటిష్ వారు ఇవన్నీ స్వార్థంకోసం చేసారా లేక భారతదేశాన్ని ఉద్దరించడానికి చేసారా అనికాదు. ఈ historical events వలన మనకు లాభం జరిగిందా! లేదా! అనిమాత్రమే.
This is neither new-sense not nonsense. Its just plain history. That's all.నేను ఇవి కొత్తగా చెప్పడం లేదు. చరిత్రకారులు అంగీకరించిన విషయాలే! వీలైతే బిపిన్ చంద్రని, రొమిల్లా థాపర్ నీ, రామచంద్ర గుహా నీ చదవటానికి ప్రయత్నించండి.
నిజమే మహేష్ గారూ, మన ఇంటిలో ఎలకలన్నీ చచ్చాయి - ఇల్లు కాలిపోతే అది వేరే విషయం. మంచి నిర్మాణాత్మక సకారాత్మకమైన ఆలోచనావిధానం - అభినందనలు.
నిజంగా ఆంగ్లప్రభావం వల్లగానీ, లేకపోతే మనం ఇంకా పావురాలతో పత్రాలు పంపించుకుంటూ, గుర్రాలపై ప్రయాణాలు చేస్తూ, కత్తులతో యుద్ధాలు చేస్తూ ఉండేవాళ్ళం. ఏవో రష్యాలూ, జర్మనీలూ అంటే అక్కడ వేరేరకం వాళ్ళున్నారు - కాబట్టి ఇంగ్లీషు లేకపోయినా వాళ్ళు సాధించగలిగారు - లేకా ఇంకేమైనా కారణాలుంటే మీరు తెలియచేస్తే సంతోషిస్తాను. అదే మన భారతీయుల్లాంటి అధములకా - ఇంగ్లీషు లేకపోతే తిండేదీ - మనకేమన్నా నాగరికతా, పాడా - బ్రిటిషువారు వచ్చే సమయానికి మనం ఇంకా ఆకులూ అలములూ తింటున్నాం.
లాభం అంటే నాకు తెలిసిన భాషలో మన సొమ్ము మన దగ్గరుండి అదనంగా ఏమైనా వస్తే దానిని లాభం అంటారు.బ్రిటిషువారి పాలనలో మనం కోల్పోయిందెంత, లాభాలెంత ఒక బేరీజు వేస్తూ - ఆ వచ్చిన లాభాల్లో కూడా మనం చేసుకున్నదెంత - ఆంగ్లేయులు చేసినదెంత అని మీరొక పట్టికలాగ తయారు చేస్తే బ్రిటిషువారి పాలన స్వర్ణయుగం అనీ,గుప్తుల పాలనో,రామరాజ్యమో ఎంత నరక సదృశమో మరింతమందికి మనం తెలియచేయవచ్చు.
ఇక్కడ ప్రశ్న బ్రిటిష్ వారు ఇవన్నీ స్వార్థంకోసం చేసారా లేక భారతదేశాన్ని ఉద్దరించడానికి చేసారా అనికాదు. ఈ హిస్తొరిచల్ ఎవెంత్స్ వలన మనకు లాభం జరిగిందా! లేదా!
లాభాన్ని గాని నష్టని గాని డబ్బు తో కొలుస్థారు. ఆ విధం గా చూసుకుంటె మనకు నష్టమే జరిగింది ఎక్కువగా. నష్టమ్మే లెకపొతె మనకు freedom fight ఎందుకు chesaamu ?
When British captured political power in 18th century India's GDP was 25% of the world's GDP and when British left India in 1947, the India's GPD was less than 1% of the GDP of the world.
Mahesh your articles lack of clarity and wisdom. It shows your
lack of knoweldge whatever you write. They developed Railways becuase to transport of natural resource ( Janumu, Cotton etc.,),to england. Don't give me your clarification it show every time your lack of knowledge.
@అనామకుడు : Don't blame my lack of knowledge for your ignorance.
లాభనష్టాలకీ స్వాతంత్ర్యస్ఫూర్తికీ సంబంధం లేదు.బ్రిటిష్ వారివల్ల భారతదేశానికి నష్టం రాలేదని ఎవరుచెప్పారు? వారి శోషణ మార్గంలో వాళ్ళకు తెలియకుండా "కొంత మంచి/లాభం" జరిగిందని మాత్రమే ఇక్కడ చెప్పాను. ఇకవ్యాసంలో చెప్పిందంతా మెకాలే మినిట్స్ గురించి మాత్రమే. మొత్తం బ్రిటిష్ పాలనగురించి కాదు.కాబట్టి లాభనష్టాల బేరీజుపట్టిక వెయ్యాల్సిన అవసరం, అగత్యం రెండూ లేవు.
అనామకుడా! నీ GDP ప్రశ్న చరిత్ర,ఆర్థికశాస్త్రం తెలీనివారికి చెప్పవలసింది.ఆ సమయంలో ఇంగ్లండ్ లో Industrial revolution జరిగిందని తెలీదా! India was still an agrarian economy.
ఈ క్రింది సమాధానం చూడు:
"It so happens that the Western world was enjoying an Industrial revolution at that time. This revolution hit India late. This is the proximal reason why Britain ended up wealthier than India.
Was it Britain’s fault that India’s industrialisation took place late? Many people think so. But the policy they hold responsible for this looks suspiciously to me like… Free Trade.
Now I can understand how free trade in that specific instance would have led to the deindustrialization of India. The British had a comparative advantage in manufactured goods and we in agricultural commodities. But it is wrong to talk just of the unemployment among weavers, but not of the benefits to farmers from cheap clothes. A flood of cheap manufactured consumer goods must have brought some benefit to some people - after all they were getting something they valued at a lower price. Does this benefit cancel out the loss of some livelihoods? I wish someone would run the numbers. Besides, India didn’t just buy consumer goods from the British. We also bought machinery from them - machines which were used to set up textile mills in India by traders who earlier used to import finished cloth from Great Britain. So free trade policies ultimately resulted in the start of the reindustrialization of India.
Would protecting the handloom weaver have resulted in the modernization of the textile industry faster? Protection didn’t work during Nehru’s time. What makes you think it would have worked in that bygone era? "
ఈ క్రిందిలంకె కూడా చదువు: http://en.wikipedia.org/wiki/British_Raj#Effects_on_economy
ఈ సంఖ్యలపై conflict లేదు.
@చివుకుల కృష్ణమోహన్: ఇల్లుకాలింది సరే, కనీసం వాసాలు కొన్ని మిగిలాయనిమాత్రమే నేను చెబుతున్నది. అయినా, వ్యాసం మెకాలే ప్రతిపాదించిన విద్యావ్యవస్థ,దాన్ని ఆధారం(వక్రీకరించి) చేసుకుని కొందరు సాంప్రదాయవాదులు చేసే blame ఎంత నిర్హేతుకమో చెప్పడం జరిగిందేతప్ప, మొత్తం బ్రిటిష్ పాలన గురించి అవర్జాచిట్టా తయారుచేసే ఉద్దేశంతో కాదు.
బ్రిటిష్ వారు రాకపోయుంటే మనదేశం ఎంత ప్రగతిపధంలో ఉండేదో speculative గా మీరు చెబితే విందామని వుంది.రష్యా, జర్మన్లకీ మన అప్పటి మన భారతదేశ పరిస్థితికీ మీరు పోలికెలా కలిపారో కూడా చెబితే ఆసక్తికరంగా వుంటుంది. I request you to kindly Educate me.
క్షమించాలి. ఈ చర్చల్లో పాలుపంచుకోడానికి కావల్సినంత సమాచారం నాకు లేదు కాబట్టి ఎక్కువగా ఏమీ చెప్పలేను.
మహేష్, నేను 2001 లో యూకే చానల్ 4 లో ఒక డాక్యుమెంటరీ చూశాను. దాని పేరు, An Indian Affair. బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించకపోయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది అన్నదాని గురించి అందులో చాలా positive గా speculate చెయ్యడం జరిగింది. ఒకే ఒక్క మాటలో, బ్రిటిష్ వాళ్ళూ పాలించకపోతే, ఈ రోజు ఒక United States of India ఉండేదని ఆ డాక్యుమెంటరీ conclude చేసింది. ఆర్థికంగా, సాంస్కృతికంగా ఎంతో బలమైన, వైవిధ్యమైన రాజ్యాలు ఒక సమాఖ్యగా ఏర్పడి ఉండేవని, అలా జరిగితే ఇప్పటికే ఇండియా ఒక సూపర్ పవర్ స్టేటస్ లో ఉండే అవకాశాలు ఉన్నాయని ఆ డాక్యుమెంటరీలో కొంతమటుకు భావించడం జరిగింది. Truth has many shades; I don't take that conclusion as the only possibility, but it is a very positive and realistic possibility.
@నాగమురళి:విలువైన సమాచారానికి ధన్యవాదాలు. అంతర్జాలంలో వెతికితే మీరు చెప్పిన An Indian Affair గురించి ఈ లంకె (http://www.channel4.com/history/microsites/I/indian_affair/)దొరికింది.
ఈ డాక్యుమెంటరీ ఎక్కడైనా దొరికితే తప్పకుండా చూడ్డానికి ప్రయత్నిస్తాను. చాలా ఆసక్తికరమైన hypothesis. కాకపోతే,మనం జరిగిపోయినదాని ఆధారంగా కాలిపోయిన ఇంటిలో కాలకుండా మిగిలిపోయిన వాసాల లెక్కచూస్తున్నాం కాబట్టి,ఈ హైపోథీసీస్ పరిగణలోకి తీసుకోవాలా అని ఆలోచిస్తున్నాను.ఎందుకంటే,There is a possibility of other shade as well.
చివరలో నాగమురళి గారిచ్చిన ట్విస్ట్ ఎదొ బాగుందే.
బొల్లోజు బాబా
It looks like Kathi wrote this post inspired by reading books written by
వీలైతే బిపిన్ చంద్రని, రొమిల్లా థాపర్ నీ, రామచంద్ర గుహా.
Kathi forgot to inform the readers that the above authors were hardcore Maxists/Communists. No one should forget that Maxists and Communists supported British against Indians. They don't want India get independence.
Every one know that Romila Thapar is hiding in liberal Europe after spoiling/poisioning young Indian minds by writing anti-Indian history. Can some one find and post where the other two living.
Under Nehru's socialist/Marxist rule, the Marxists histerions thrived and produced pseudo Indian history. Pakisthan did much better job in writing their history.
Please read the book "Clash of Civilizations" by Samuel P. Huntington. You can get it at www.amazon.com
http://www.amazon.com/exec/obidos/ASIN/0684844419/qid=1010431890/sr=8-1/ref=sr_8_67_1/102-3579527-5380164
"India was a major player in the world export market for textiles in the early 18th century, but by the middle of the 19th century it had lost all of its export market and much of its domestic market, primarily to Britain. The ensuing deindustrialization was greatest c1750–c1860."
"the share of Indian textiles in the West African trade was about 38
percent in the 1730s, it had fallen to 22 percent in the 1780s and 3 percent in the 1840s".
To make matters worse, India, which had captured a good share of the English market in the 17th
century, had -- as an English defensive response -- already been legislated out of that market by
Parliamentary decree between 1701 and 1722. It should be stressed that India also had a technological edge
over England in the early 18th century.
"low nominal wages in pre-colonial and early colonial
India gave it the edge in world textile markets, living standards for labor in the south of India
were just as high as that in the south of England. Indian productivity was higher in food grain
production, and thus food grain prices were lower."
Please read the book, then we will have a healthy discussion.
World Manufacturing Output 1750-1938
(in percent)
Year India China
1750 24.5 32.8
1800 19.7 33.3
1830 17.6 29.8
1880 2.8 12.5
1913 1.4 3.6
1938 2.4 3.1
Source: Simmons 1985, Table 1, p. 600, based on Bairoch 1982, Tables 10
and 13, pp. 296 and 304.
As per your world view,
If British rule was good for India, it must be good for Pakisthan and Bangladesh?.
But in Pakistani history books the British period was either erased or painted has the most barbarious and destructive. Please read some of the Pakistani history books before commenting.
Who suports British rule in India? Those are Mecaulay Children, ultra liberal Hindus, Muslims (Ifran Habib), Christians(James Laine), Marxists (Romila Thapar), Communists (Bipin Chandra).
Nehru created a class of people who hate India and Hindus and show foreign rule in good light when they wrote Indian history books for school children.
When Indians want to correct such inaccuracies in school history books, the media controlled by Marxists and Communists run a huge propaganda against Indians all over the world.
Even in American Schools they are teaching marxists written Hindu history. In this age of Information Technology and Space Technology, where Hindus are dominating, American School Children were taught that Hindus are snake charmer etc.
I am curiously reading everything here. My comment here is not about this post, but I just wanted to pass on my THANKS to Mr Anonymous, for mentioning that they are hardcore leftist writers.
I know a bit or two about these left-wing radicals on this planet.(liberals/socialists/communists/marxists). I also know how these guys screwed up a good chunk of Europe, beyond repair. They now are gaining prominence in America, leading us down through a dangerous slippery slope.
మహేష్,
బ్రిటిషువాళ్ళ వలన మనకేవో మేళ్ళు (ఇది సరైన మాటే ఇక్కడ) జరిగాయంటున్నారే.. "వాళ్ళ వలన మనకు ఇరవయ్యో శతాబ్దం వచ్చేసింది" అనేమాటలో ఎంత నిజముందో మీరు చెప్పే దేశ ఏకీకరణా, రైళ్ళూ, మిలిటరీ వగైరాల్లో కూడా అంతే నిజముంది. వాళ్ళు లేకపోయినా అవి వచ్చేవి, మరింత మెరుగైన రూపంలో వచ్చేవి. అంచేత వాటిని ప్రవేశపెట్టడం వలన మనకు మేలు జరగలేదు, జరిగింది నష్టమే! ఉదాహరణకు..
అఖండమైన భారతం వచ్చేది -ఎందుకంటే మతం ప్రాతిపదికన దేశాన్ని చీల్చింది బ్రిటిషువాళ్ళే కాబట్టి. గత అరవై ఏళ్ళుగా సైన్యం మీద మనమూ, పాకిస్తానూ ధార పోసిన లక్షల కోట్ల రూపాయలను అభివృద్ధికై వాడుకునేవాళ్ళం. కాశ్మీరు ఫిరదౌసీ చెప్పిన స్వర్గంలా ఉండేదో లేదో గానీ, ఇప్పుడక్కడున్న కశ్మలం మాత్రం ఉండేది కాదు.
ఇంగ్లీషు భాషాబోధన: ఇంగ్లీషులో చదివి స్వతంత్ర భావాలను పెంపొందించుకున్నారా? ఆశ్చర్యంగా ఉంది. అసలు వాళ్ళు మనకు చేసిన అతి పెద్ద ద్రోహం ఇదే. మన భాషలను మనకు కాకుండా చేసారు. మీకు తెలిసే ఉంటుంది.. ఇంగ్లీషు బోధనకు వ్యతిరేకంగా మన భాషల్లో చదువు చెప్పుకునేందుకుగాను, స్వాతంత్ర్యోద్యమంలో జాతీయ పాఠశాలలంటూ పెట్టారు. ఇప్పుడు మాత్రం మన మెకాలే మానసపుత్రులు (నాకిలా తిట్టడం బావుంది) తెలుగునెత్తేసి, ఇంగ్లీషును నెత్తినెట్టుకుందామని చూస్తున్నారు. చైనీసు భాష ఉజ్వలంగా ఉంది. వాళ్ళ ప్రభ ఇవ్వాళ దేదీప్యమానంగా వెలుగుతోంది. జపనీయుల తేజస్సు మీకు తెలీనిదేంకాదు. మరి వీళ్ళ కింగ్లీ షొచ్చా? వీళ్లకోసమని ప్రత్యేకంగా వీళ్ళభాషల్లో సాఫ్టువేర్లు తయారవుతున్నాయి. మన పరిస్థితి చూసారుగా.. "నెనరులు" అని అందామంటే గింజుకుంటున్నాం.. శుభ్రమైన తెలుగు మాట్టాడదామంటూంటే అతివాదం అని ఈసడిస్తున్నాం. ఈ ఆత్మనిందను ఇంగ్లీషే మనకు ప్రసాదించింది. సరే.. ఈ బ్రిటిషర్ల కిరుగు పొరుగున ఉండే ఫ్రెంచి జర్మనులకు మనకొచ్చిన పాటి ఇంగ్లీషొచ్చా? వాళ్ళుకాదూ, అనేక సాంకేతిక ఆవిష్కరణలు చేసింది? అంతెందుకు, మన ఆర్యభట్టుకీ, వరాహమిహిరుడికీ, భాస్కరుడికీ ఇంగ్లీషొచ్చేంటి?
ఈ బ్రిటిషువాళ్ళే లేకుంటే నిజమైన ప్రయోజనాలు కొన్ని జరిగుండేవి మనకు - మతమార్పిళ్ళూ, తదనంతర మారణహోమాలూ లాంటివి ఉండేవి కావు. లంచాలు, అవినీతి ఖచ్చితంగా తక్కువగా ఉండేవి. పేదరికం చాలా తక్కువగా ఉండేది.
మొత్తమ్మీద మీ వాదన ఎలా ఉందంటే..
"ఉగ్రవాదులు బాంబులెయ్యడం వలన ప్రాణనష్టం, ఆస్తినష్టం జరుగుతోందా లేదా అనేది కాదిక్కడి ప్రశ్న.. వాటి వలన భవిష్యత్తులో జరిగే దాడులను ఎదుర్కొనేందుకు అవసరమైన అనుభవం మన పోలీసులకు దొరుకుతోందా లేదా అని మాత్రమే" -ఇదిగో ఇలా!
బ్రిటిషు వారి వలన మనకేవో ఒరిగాయని అనుకోవడం భావదాస్యమే!
It was in 1850 that Lord McCauley prepared the first education policy for British India. Right from the ancient era, India had pursued one education system. Learning was imparted from the Guru to the Shishya or the pupil in a gurukul. A Gurukul is a boarding school where children spend their youth learning Sanskrit Veda and the different forms of Indian philosophy, their critiques etc. Apart from a strong philosophical foundation, the gurukul also taught agricultural practices, animal husbandry, forestry, Ayurveda or ancient Indian medicine, warfare, trade and commerce. We can say that it was a mixture of value based learning and practical instruction. A pass out from the gurukul was treated as a complete human being who was able, stable and could tackle the vagaries and face the challenges that life presents to all of us. Passing out from a basic Gurukul at the age of 14, 16 or 18, the pupil could go on and specialise in an area of his choice. The choice of course depended upon the family and community of his birth. He could be a warrior and be assigned to a Guru of warfare. He could learn commerce, medicine or politics. He could become a guru himself by continuing to learn on those lines. Throughout the educational span, learning was very personal and informal. The pupil would live with the Guru’s family like his own child and respect his Guru even more than his own father. The gurukul had three sources of income. Donations raised from local community. Agriculture and animal husbandry. Finally, State grants, which the monarch would extend to the gurukul periodically. The pupil would get no University Degree or paper certificate. The name of the Guru was enough to make him successful in the area of his excellence across India.
McCauley’s education policy changed all this. His purpose was to prepare a breed of servants who could serve as clerks to British bureaucrats posted in India. Instead of bringing clerks and lower level functionaries from Britain, he sought to recruit them in India. Therefore, Indian values, Indian philosophy or Veda as well as practical Indian skills in agriculture, medicine, warfare etc were discarded as stupid. The new brigade of English public schools that mushroomed in India injected western ideas, British etiquette, English literature, science, math etc. Gradually, ancient Indian learning through the gurukul method was rendered defunct despite its completeness and advantages. The primary reason being that students educated on the British pattern in modern public schools could find a living. While a student passing out of a Gurukul could not. India’s monarch, the Kings who absorbed the breed of Gurukul pass outs no longer existed and the British could not tolerate a Gurukul pass out. They did not need his services. Therefore, for the sake of a bright future, parents began to pinch their pockets to educate their children in public schools. Despite the fact that ancient education was almost free and modern education cost a lot, people not only sent their child to Indian public schools, but also sent them to Britain directly.
from: http://www.suite101.com/article.cfm/india_probe/69614
దీనికి సమర్ధనగా నేను కొంత ఉటంకించ దలిచాను. బ్రిటీష్ పరిపాలనకి పూర్వమే మనకి నలందా వంటి విశ్వవిద్యాలయాలు ఉండేవి. తరువాతి కాలం లొ కొన్ని కాలగర్భం లొ కలిసినా మొత్తం అట్టి వ్యవస్థ కనుమరుగవ్వలేదు. మెకాలే స్వార్దం కోసం చేసినా మనకి మంచే జరిగింది అనటం అంత సహేతుకం గా లేదు. మన నేతల తీరు చూస్తే అలాంటి అభిప్రాయం కలగటం లొ తప్పు లేదేమో కాని నిజం ఎంత మాత్రం కాదు. ఎందుకంటే మెకాలే బ్రిటన్ విద్యా వ్యవస్థ ని మనకి ఇవ్వలేదు. కేవలం వారి సేవలకి సంబందించినదె డిజైన్ చేసినట్లు గా తోస్తుంది. అందుకే మనం ఇప్పటికీ సెవల రంగం లొ వుండి, వస్తూద్పాదక రంగం లొ వెనకబడి వున్నాం. ఇది మంచిదంటారా? ఇంకా software ఉద్యోగాలు మనకున్న కొద్ది మంది నాయకుల వల్లే కాని ఆ వ్యవస్థ వల్ల కాదు. కనీస అభివృద్ది లోని గొప్పతనాన్ని చూడటం సరైన ధోరణి కాదేమో.
@మహేష్
'మకాఉలేయ్ పుత్రులు' కూడా 'హిందూ ఆర్ధిక వృద్ధి' లాంటిదే అన్నమాట. నేను మన దేశం లోని జ్ఞానాన్ని తీసిపారేసే వాళ్ళని 'మకాఉలేయ్ పుత్రులు' అంటారనుకునేవాడిని.
Here's another well-researched ( for a blog) series of posts on Macaulay and the events leading to our present education system: http://varnam.org/blog/2007/08/the_story_behind_macaulays_edu/
If you have some time do read http://www.arvindguptatoys.com/arvindgupta/beautifultree.pdf
Thanks
Post a Comment