Tuesday, November 18, 2008

కొత్త బిచ్చగాడు

కొత్తగా ఏదైనా నేర్చుకుంటే దాన్నే సమయం సందర్భం లేకుండా చేస్తూ, కనపడినవాడికి తమ కొత్త విద్యలోని నైపుణ్యాన్ని గురించీ, కొత్తగా నేర్చుకున్న విషయవిజ్ఞానాన్ని గురించీ చెప్పిచెప్పీ విసిగించి వేసారిపోయేలా చెయ్యడం మనం సాధారణంగా చేసేపని. అప్పుడే "కొత్తబిక్షగాడు పొద్దెరగడు" అని వ్యవహరించేస్తూ ఉంటారు.


విశాల్ భరద్వాజ్ హిందీ సినిమా 'మఖ్బూల్'లో ఇలాంటిదే ఒక మతానికి సంబంధించిన సామెత చెబుతాడు. "నయా ముసల్మాన్ హై, పాంచ్ బార్ నమాజ్ తో పఢేగా హీ" అని. అంటే, 'కొత్తముస్లిం కదా, ప్రస్తుతానికి ఐదుసార్లు నమాజ్ ఖచ్చితంగా చదువుతాడ్లే!' అని అర్థం. ఈ విధంగా, కొత్తగా మతంపుచ్చుకున్నవాళ్ళలో ఈ ధోరణివుండటం సహజంగా జరిగిపోతూ ఉంటుంది. మాటిమాటికీ మతపరమైన references వాళ్ళమాటల్లో కనిపించేది అందుకే.


కొత్తగా మతంపుచ్చుకున్న ఒక క్రైస్తవ మిత్రుడి వింతధోరణి గురించి వాసిలి సురేష్ తన బ్లాగు 'తెలుగు నేస్తమాలో' రాసినటపా చదివేసరికీ, మా కాలేజిలో జరిగిన మతచర్చలు గుర్తొచ్చాయి. నేను చదివింది ఇంగ్లీషు సాహిత్యం, అందులో ఆధునిక సాహిత్యంలోని సింహభాగం చర్చ్ (Church) వ్యతిరేక సాహిత్యం గనక, మా చర్చల్లో మతం తరచూ receiving endలో ఉండేది. బైబిల్ గ్రంధాన్ని గురించికూడా ఆంగ్లసాహిత్య చరిత్రలో భాగంగా చదువుకున్న మాకు ఈ వింతపోకడల్ని సాధికారంగా ఖండించే అవకాశం ఉండటంతో, క్లాసులోవున్న క్రైస్తవ మిత్రులు తమ నిరసనని బాహాటంగా చెప్పేవారు కాదు. కానీ, క్లాసు ముగిసిన తరువాత కాస్త informal గా జరిగే మాటల్లో "మతాన్ని గురించి అలామాట్లాడితే ఎలా?" అనేవాళ్ళు.


ఈ సంవాదాల్లో జరిగేచర్చల్లో ముఖ్యంగా వచ్చే విషయాలు "మనమంతా పాపులం" అనే నమ్మకం. ఇతర మతాల దేవుళ్ళపటాలు,ప్రసాదాలూ తాకకూడదు. సినిమాలు చూడకూడదు,సినిమా సంగీతం వినకూడదు లాంటివి. మొదటి నమ్మకానికి కనీసం బైబిల్ లో కొంత ప్రాదిపదిక వున్నా, మిగతా రెండిటీకీ క్రైస్తవమతానికీ సుదూరంలోకూడా సంబంధం లేదు. కానీ,దినదిన వ్యవహారాలలో ఇలాంటివి మాటిమాటికీ ఎదురై, ఎప్పుడూ ప్రశ్నలు తలెత్తేవి. అందుకే తెగని చర్చలకు మూలమయ్యేవి.


మా ఫ్రొఫెసర్ ఒకాయన సరదాగా "పాపిగళూ బన్ని అంతా బోర్డ్ హాకి కరితారప్పా! నీవు హోగబేడ. నీ పాపియేనో?" అని కన్నడలో ప్రశ్నించేవాడు. అంటే, "పాపులారా రండి అని బోర్డుపెట్టుకుని మరీపిలుస్తారయ్యా! నువ్వెళ్ళకు. నువ్వు పాపివి కావుకదా?" అనర్థం. క్రైస్తవమతంలో original sin అనే ఒక భావన ఉంది.ఆడమ్- ఈవ్ భగవంతుడు నిషేధించిన (జ్ఞానఫలం)పండు (forbidden fruit) తినడం వలన దేవుడు సృష్టించిన పవిత్రలోకానికి దూరమయ్యారని. కాబట్టి, ఆడమ్-ఈవ్ సంతానమైన అందరిమనుషులూ పుట్టుకతో ఆ పాపాన్ని పంచుకుని పుడతారని ఒక నమ్మకం. ఆ పాపం నుంచీ పరిహారం పొందడానికి దేవుడిదారి ఎంచుకోవాలనే ఆధారంతో ఈ నమ్మకాన్ని మతవ్యాప్తికి బాగా ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. ఈ విషయం మీద క్రైస్తవుల్లోని వివిధ శాఖల్లోకూడా బహు విభేధాలున్నాయి.


మా కాలేజి చర్చల్లో తేలిన conclusion ఏమిటంటే,‘if eating the fruit of knowledge is a sin, it's good that the sin happened’ అని. జ్ఞానఫలం తినకుండా ఉంటే, మనిషి మనషిగా ఉండేవాడుకాదు కదా! అందుకే, ఆ "పాపం" జరగడం మంచిదనే నిర్ణయానికొచ్చేవాళ్ళం. ఆపని చెయ్యకుండా ఉంటే మనుషజాతికూడా అనభూతులులేని కూరగాయలో,జంతువులలాగానో ఉండేవాళ్ళంకదా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఆ పాపం, పాపమెలా అవుతుంది అనేది ప్రశ్నార్థకమే! అంతేకాకుండా, మతానికి ‘గిల్ట్’ (అపరాధభావన) ప్రాతిపదికైతే,దాంట్లో ఎస్కేపిజమే తప్ప జీవనమూల్యాల సాధన సాధ్యమా అనేది తరచూ ఉద్భచే సందేహం.


ఇక ఇతరమతాల దేవుళ్ళపటాలనూ,ప్రసాదాన్నీ తాకకూడదు అనేది కేవలం అపోహేతప్ప బైబిల్ ను ప్రాతిపదికగా చేసుకున్న నమ్మకమైతే అస్సలు కాదు. చారిత్రకంగా రోమన్ సారాజ్యానికి వ్యతిరేకంగా ఒక reactionary మతంగా క్రైస్తవమతం ఉధ్బవించినా, (ఆ తరువాత కాలంలో రాజకీయ ఉద్దేశాలతో ప్రారంభమైన క్రుసేడర్ సమయం మినహా) చాలావరకూ శాంతీ, ప్రేమలను ఆధారం చేసుకుని వ్యాప్తి చెందింది. అందుకే, ఇస్లాం మతంలో కనిపించే పరమతంపట్ల వ్యతిరేకత ( పేగన్లకు వ్యతిరేకంగా ఇస్లాంలో చాలా విధివిధానాలున్నాయి) కనబరిచే అవకాశం లేదు. అదీ ముఖ్యంగా "ఒక అంగీకారాత్మక ప్రాతిపదికన రాయబడిన" కొత్తనిబంధన గ్రంధం ఆవిధంగా ప్రవచించే అవకాశమే లేదు.


ఇక కొత్తక్రైస్తవుల సినిమా ప్రహసనం గురించి నా ఇదివరకటి టపాలో చెప్పాను చూడండి.


అందుకే, కొత్తగామతం పుచ్చుకున్నవాళ్ళ పోకడల్లో ఫాదర్లూ, పాస్టర్లూ, ఇతర మతప్రచారకులు నింపే అపోహల పాత్ర చాలా ఉందనిపిస్తుంది. హిందుమతంలోని అపోహలకు చాలా కారణాలుండొచ్చు. కారణం ఇక్కడ ఏక గ్రంధం,ఏక ప్రవక్త, ఏక దేవుడు లేడు. కానీ, క్రైస్తవం బైబిల్ కు కట్టుబడింది కాబట్టి (పేరే కొత్తనిబంధన గ్రంధం కదా!), నియో- క్రైస్తవులు కనీసం బైబిల్ ని పుర్తిగా చదువుకోవాలేమో!


****

9 comments:

Anonymous said...

As far as my memory goes, there are many implied statements about not praying the other Gods in new testament.
I don't exactly remember. But they quote from Romans/Corinthians(part of new testament)saying that "a believer cannot yoke with an unbeliever".
Only the chapters dealing with the emergence of christ as God convey the message of love.

Anil Dasari said...

యూదుల మత గ్రంధాలని తీసుకొచ్చి Old Testament పేరుతో బైబిల్లో పెట్టేయటంతో వచ్చిన చిక్కులు - ఈ ఒరిజినల్ సిన్ వగైరా కాన్సెప్టులు. బహుశా యూదులని కొత్త మతంలోకి ఆకర్షించే ఉద్దేశంతో చేసుండొచ్చా పని. వ్రతం చెడ్డా ఫలమైతే దక్కలేదు - యూదులు యూదులుగానే ఉన్నారు; క్రైస్తవానికి మాత్రం వాళ్ల చిత్ర విచిత్ర ఆచారాలు కొన్ని తగులుకున్నాయి.

VJ said...

ఏంటండి బాబు ఒక్క కామెంటు కూడా లేదు, నేను మీ బ్లాగు కు వచ్చేది కామెంట్లు చూసేకే.

Anonymous said...

Hi, Here is a intersting book that I come across recently on the internet. Read it when you get a chance.

"The Christ Conspiracy:
The Greatest Story Ever Sold"
by Acharya S
http://www.truthbeknown.com/christ.htm

http://en.wikipedia.org/wiki/Jesus_myth_hypothesis

లక్ష్మి said...

అమ్మయ్య ఈ సారి మిమ్మల్ని కామేంట్స్ తో చితక్కొట్టకుండా ఎందుకో వదిలేశారు. గుడ్. మీరు చెప్పినవే కాకుండా ఈ మధ్య ఇంకొన్ని కొత్త రకాల పైత్యాలని చాలా చూశా. ఈ సారి నా బ్లాగ్లో రాస్తా

సుజాత వేల్పూరి said...

ఫాదర్లు, పాస్టర్లు మతం మార్చుకునే వారికేం చెపుతారో మరి! మా ఇంట్లో పని చేసే అమ్మాయి మతం మార్చుకున్న తాలూకే! స్వీట్లు ఇచ్చినా 'దేవుడికి పెట్టారామ్మా" అని అడిగి, లేదంటేనే తీసుకుంటుంది."దేవుడి సామాను కడగను, పూజ గది తుడవను" అని ముందే చెప్పింది. ఏమి ఇచ్చినా, 'ప్రసాదం కాదు కదా ' అని కన్ ఫర్మ్ చేసుకుని తీసుకుంటుంది. తమలపాకు కనపడినా దేవుడి తాలూకేమో అని ముట్టుకోదు. ఎందుకలా అని అడిగితే 'హిందూ దేవుళ్ళ ప్రసాదాలు తిన్నా, ముట్టుకున్నా, రక్తం కక్కుకుని చచ్చిపోతావు ' అని వాళ్ళ చర్చిలో ఫాదర్ చెప్పాడంది.

నా స్నేహితుల్లో కొందరు ఒరిజినల్ క్రైస్తవులున్నారు. వాళ్ళేమో మేం తిరుపతి వెళ్తున్నామని తెలిస్తే ముందే లడ్డూలు రిజర్వ్ చేసుకుంటారు. మేము మానుకునైనా వాళ్ళకి ఇస్తాం.

ఈ సంధానకర్తలు నింపే అపోహలే పైన చెప్పిన అమాయకత్వానికి, మూఢత్వానికి కారణం!

Anonymous said...

Hi, I come across the following information on Internet about Goa Inquisitions.

http://www.blogs.ivarta.com/Inquisition-Goa-Atrocities-Hindus-by-missionaries-III/blog-191.htm

---------
"When I think of all the harm the Bible has done, I despair of ever writing anything to equal it"
- Oscar Wilde (1854-1900), Irish author:
---------
"Christianity is the most ridiculous, the most absurd and bloody religion that has ever infected the world". - Voltaire (French Philosopher, 1694-1778)

"Millions of innocent men, women and children, since the introduction of Christianity, have been burnt, tortured, find, imprisoned: yet we have not advanced one inch towards humanity. What has been the effect of coercion? To make one half of the world fools, and the other half hypocrites. To support error and roguery all over the earth" - Thomas Jefferson (1743-1826)

---------------

I think the information there in is false. Can you confirm about it.

Anonymous said...

ఇంతకు మునుపు మీరు ఒక టపాలో
"క్రీస్తుపుర్వం దాదాపు 6,000 సంవత్సరాల పుర్వంనాటి వేదాలు ఈ సనాతనధర్మానికి మూలమని చెబుతారు. మౌఖికంగా చెప్పబడి ఆతరువాత ఎప్పూడో సంస్కృతంలో రాయబడాయిగనక ఈ వేదాలు ఆటోమేటిగ్గా హిందూ మతానికి సంబంధించినవే అని మనవాళ్ళ గట్టినమ్మకం.మరైతే "ఏకంసత్య; విప్రోహ వివిధ వదంతి"(సత్యం ఒక్కటే.దాన్ని విభిన్నమైనవ్యక్తులు వివిధరకాలుగా చెబుతారు) అన్న వేదవాక్కుని మనవాళ్ళు పక్కనబెట్టి వాళ్ళు వేరే మతమోళ్ళు, మతమార్పిడి చేస్తున్నారని ఎలా అంటారు? ఆ మతాన్నికూడా సత్యాన్ని చేరేందుకుగల ఒక విభిన్నమార్గంగా ఎందుకు అనుకోరు?"
అని అన్నారు.
మళ్ళీ మీరే ఈ విధంగా అన్నారు
"అందుకే, కొత్తగామతం పుచ్చుకున్నవాళ్ళ పోకడల్లో ఫాదర్లూ, పాస్టర్లూ, ఇతర మతప్రచారకులు నింపే అపోహల పాత్ర చాలా ఉందనిపిస్తుం.ది" అని ఒప్పుకున్నారు.
People do not like the conversions which is creating more division between the same country people because these educated converts are more adament while practising religion and at the same time following religion blindly as told by father etc., There is a lot of difference between people practising religion like K.J. Jesudas, Nayana taara, Meeara jasmin, Comedian Sudhakar or Jayasudha etc., and common man who converted into christianity.

kRsNa said...

Sir, mee blog lo chala information untundi. konni facts ni accept cheyadam kuda kastam.