Saturday, November 1, 2008

హిందూమతం Vs సనాతనధర్మం

మతాల గురించి చర్చవచ్చిన ప్రతిసారీ,ఎవరో ఒకరు "హిందూయిజం మతంకాదు. అదొక జీవన విధానం. సనాతనధర్మం." అంటూ, ఏవేవో చెప్పేస్తూ వుంటారు. ఇదివరకూ నేను రాసిన టపాలోకూడా ఇలాంటి వ్యాఖ్య ఒకటొచ్చింది. ఈ వాదన చేసేవారు నిజంగా సనాతనధర్మం యొక్క అర్థం తెలిసీ, ప్రస్తుతం హిందూయిజంలో వున్నపోకడల్ని చూస్తూకూడా ఈ నిరర్థక ప్రయత్నం ఎందుకు చేస్తారో నాకు అర్థం కాదు.


సనాతనం అంటే, నశ్వరమూ,ఆది-మధ్యం-అంతం లేనిది. ధర్మం అంటే సహజవిధానం అని అర్థం. రెంటినీ కలిపి అర్థం చేసుకుంటే, మొదలు-తుది లేని ఒక సహజ జీవన విధానమే సనాతనధర్మం. కాకపోతే, అది ఖచ్చితంగా హిందూమతమే అని వీరు ఎలా చెప్పగలుగుతున్నారు అనేదే నాకొచ్చే సందేహం. అంతేకాక, మనం ప్రస్తుత పరిస్థితుల్లో పాటిస్తున్న హిందూ విధుల్ని దృష్టిలో పెట్టుకుని కూడా, ఈ వాదన ఎలా చెయ్యగలరనేది మరీ ఆశ్చర్యాన్ని గొలిపే విషయం.


చాలా వరకూ హిందూ స్వాములూ, రాజకీయ నాయకులూ, మతాధిపతులూ,మఠాధిపతులూ, గుళ్ళూగోపురాలలో ప్రస్తుతం విజయవంతంగా అమలులోవున్న హిందూమతానికీ సాతనధర్మంగా పిలువబడే విలువలకీ నక్కకీ నాగలోకానికీ వున్నంత తేడా వుంది. ఆ తేడావల్ల వచ్చిన అతివాదాన్ని తప్పుబట్టడానికి ప్రయత్నించినాకూడా, సనాతనం పేరుచెప్పి "మేము మిగతా మతాలకన్నా, ప్రత్యేకం" అనెయ్యడం చిత్రంగా వుంటుంది. నిర్ధిష్టంగా చూపించగలిగే ప్రత్యేకతల్లా, మిగతామతాలకి ఏకదేవుడూ లేక ప్రవక్తా మరియూ గ్రంధం అయితే, మనకుమాత్రం దేవతలు కోట్లలో దాటుతారు. మతగ్రంథాల్లో మనకు సోలో గ్రంథం అంటూ ఏదీలేదు. మనకిష్టమొచ్చినట్లు ఒకసారి భగవద్గీత అంటే, మరోసారి రామాయణాన్నీ, వేదాల్లో దేన్నోఒకదాన్ని చెప్పెయ్యొచ్చు. అస్సలు సమస్య రాదు.


కానీ, కొంచెం లోతుగా చూస్తే సనాతనధర్మం యొక్క అర్థం చాలా ఆసక్తికరంగా వుంటుంది. సనాతనధర్మానికి నిర్థిష్టమైన ప్రవక్తలూ,గ్రంధాలూ లేకపోయినా, మూలాధారం మాత్రం అనుభవం మరియూ నమ్మకం. అంటే,ఇతర మతాలలాగా ఎవరో ప్రవక్త అనుభవించి నమ్మిన సిద్ధాంతాలనుకాకుండా, తనంతటతానుగా ప్రతివ్యక్తీ ‘సహజమార్గంలో’(ధర్మ) అనుభవించి నమ్మాలన్నది సనాతనధర్మం యొక్క ఉద్దేశం.ఇక్కడ ఉదయించే ప్రశ్నేమిటయ్యా అంటే, నిజంగా ప్రస్తుతం అమలులోవున్న హిందూమతంలో ఈ లక్షణం ఉందా? అని. నాకైతే లేదనే అనిపిస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కడూ ఇదితప్పు ఇది కరెక్టూ అని శాస్త్రాలుపట్టుకుని తయారుగా వుంటారు. చివరికి కాలకృత్యాలు తీర్చుకోనేప్పుడు కూడా జంధ్యం ఎక్కడ చుట్టుకోవాలో చెప్పే హిందూమతం, ‘సనాతనధర్మం’ ఎలా అయ్యిందో అబ్బురపరిచే చిత్రమే కదా!


క్రీస్తుపుర్వం దాదాపు 6,000 సంవత్సరాల పుర్వంనాటి వేదాలు ఈ సనాతనధర్మానికి మూలమని చెబుతారు. మౌఖికంగా చెప్పబడి ఆతరువాత ఎప్పూడో సంస్కృతంలో రాయబడాయిగనక ఈ వేదాలు ఆటోమేటిగ్గా హిందూ మతానికి సంబంధించినవే అని మనవాళ్ళ గట్టినమ్మకం.మరైతే "ఏకంసత్య; విప్రోహ వివిధ వదంతి"(సత్యం ఒక్కటే.దాన్ని విభిన్నమైనవ్యక్తులు వివిధరకాలుగా చెబుతారు) అన్న వేదవాక్కుని మనవాళ్ళు పక్కనబెట్టి వాళ్ళు వేరే మతమోళ్ళు, మతమార్పిడి చేస్తున్నారని ఎలా అంటారు? ఆ మతాన్నికూడా సత్యాన్ని చేరేందుకుగల ఒక విభిన్నమార్గంగా ఎందుకు అనుకోరు?


నిజానికి సనాతనధర్మం ఒక cosmopolitan పోకడలాగా అనిపిస్తుంది. మనిషి సంతోషాన్నీ,మనిషిలోని దైవత్వాన్నీ ఈ ధర్మం ప్రేమిస్తుంది, ఆకాంక్షిస్తుంది."సర్వే భవంతి సుఖిన:,సర్వే సంతు నిర్మాయ:,సర్వే భద్రాణి పష్యంతి, మా కశ్చిద్ దు:ఖ భగభవేత" అంటూ సర్వమానవ సౌభ్రాతృత్వాన్నీ, సంతోషాన్నీ కోరుకునే సనాతనమెక్కడ ! హిందూమతమెక్కడ? ఏవరు ఏం చేస్తే పాపమో, ఎవరు ఏ పని చేస్తే పుణ్యమో, దానికి పరిహారమేమిటో, పుణ్యంపురుషార్థాలేమిటో చెబుతూ, జీవితంలోని సహజత్వాన్ని చంపేస్తూ, రూల్సుతప్ప అనుభవానికీ,నమ్మకానికీ అసలు విలువివ్వని హిందుమతమా సనాతనం?


అందుకే, ప్రస్తుతం నేను రోజువారీగా చూస్తున్న హిందూమతం సనాతనమంటే నాకు అంగీకారాత్మకం కాదు. ఎవరైనా ఆ సనాతనధర్మం మన హిందూయిజం అని భ్రమపెట్టడానికి తయారైతే అంగీకరించడానికి నేను సిద్ధంగా లేను.

అసతోమా సద్గమయా
తమసొమా జ్యోతిర్గమయా
మృత్యొర్మా అమృతంగమయా

అంటూ, బూటకం నుంచీ నిజానికీ, అంధకారంనుంచీ వెలుగులోకి, చావునుంచీ బ్రతుకులోకి నడిపించే సనాతనధర్మం నాకు శిరోధార్యమేగానీ, ఇక్కడ చర్చలకు పెట్టే హిందూమతం అదేనంటే నమ్మే మూర్ఖత్వం మాత్రం నాలో ప్రస్తుతానికి లేదు. సనాతనధర్మం దీపమైతే, ఆ దీపపు వెలుగు క్రిందనే వుండే చీకటి ప్రస్తుతం వున్న హిందూమతం. కేవలం ఆ వెలుగు క్రిందవున్నంతమాత్రానా, చీకటి వెలుగెప్పటికీ కాలేదు. అందుకే, మతమౌడ్యం గురించి జరిగే చర్చల్లో హిందూమతం సనాతనం,నిత్యనూతనం, అనంతం,జీవనవిధానం వంటి శుష్క వ్యాఖ్యలు చెయ్యకపోవడమే మంచిది.


****

39 comments:

Anonymous said...

Meeru cheppimdi baagumdi..sanaatanuDu amTea puurvapuvaaDu alaagea sanaatana darmam amTea puurapu darmam anagaa ippaTidi kaadu chaalaa kaalam numchi anusaristunnaa dharmam anikadaa..veadaalu ippaTivikaavu meerannaTTugaa Bc 6000 naaTivea hindu mataaniki adhaaramani annaaru ok kaane veadaalanu nammaDam nammakapoevaTam meeda adhaarapaDea migataamataalannee aavirbhavimchaayi kadaa kaabaTTi himdu darmam mummaaTiki sanaatana dharmamea..teluguneastamaa..

సుజాత said...

ప్రస్తుతం నడుస్తున్న హిందూ అతివాధ ధోరణులు సనాతన ధర్మం కాదు. సనాతన ధర్మం వీటన్నింటికీ అతీతమైంది. శాస్త్రాలు పట్టుకుని ప్రతి దానికీ ఏదో ఒక రుజువులు ,ఏదో ఒక కారెక్టరుని ఉదాహరణలు గా చూపించే వాళ్ళు ఉన్నంత కాలం, హిందూ మతంలో ధర్మం పేరిట అతివాదం కొనసాగుతూనే ఉంటుంది.

veera said...

చివరికి కాలకృత్యాలు తీర్చుకోనేప్పుడు కూడా జంధ్యం ఎక్కడ చుట్టుకోవాలో చెప్పే హిందూమతం, I want to know has hindu relegion really forced you to follow this kind of rules any where and as it imposed any punishments if you do not follw this?
Any system it is relegion, country or business will formulate some rules at the time of incorporarion for proper functioning.and there will be always some persons who will not follow blindly formed rules and create new paths for future generations.
Coming to Hinduism it has not banned any one from criticizing old rules and proposing new ones. It do not also have a history killing people judt for sake of opposing relegious rituals.
and the other thing there will be always a chance to make better already existed system and grab a chance to hold the torch to do that if you are capable.
But simply saying it contains many worstthings, so it is bad serves no purpose.
Propos any solution you have or if you do not like relagion simply leave it. No body give fatwa against you. but if you stand on the road and simply cry like this some body may throw stones at you.

Anantaachaaryulu said...

మీలాంటి పిరికివారు హిందూమతం గురించి అవాకులు,చవాకులు పేలగలరు కాని ధైర్యముంటే ఇస్లాం,క్రైస్తవ మతం లోని లోపాల గురించి మాట్లాడలేరు.ఎప్పటినుండో మతమార్పిడికి పాల్పడుతున్న వారి గురించి మాట్లాడలేరు కానీ ఈ మధ్య భరించలేని స్థితిలో తిరగబడుతున్న హిందువుల గురించి మాట్లాడగలరు.

మే.వేం.భాస్కర రామి రెడ్డి said...

what is your definition of Hindu religion and Sanatana dharma? it would be better if you write critics based on certain foundation ( either good or bad ). As far as I know there is no single definition for hindu religion. Its upto the followers to decide what is good and what is not relevant to them ( I am not saying bad, in practice there is no absolute truth).

By the way have you read Vedas? do you know what is there inside? I am wondering looking at "Vedas difine sanatana dharma".There are people who belives it, but if you read atleast few items and comapre your current life style with vedic time life style....

I believe everything in this world is relative. Hindu religion gives you that flexibilty .. do whatever you like ... I am flexible .. I have no single book.. live like a good man ... make comfortable your self...

Rest all is from priests for their lively hood.

flexibilty. I belive this flexibilty

పరుశు రాముడు said...

అందరూ పూజించే దాన్ని తిడితే నీకేదో ఫాలొయింగ్ వస్తుందని నువ్వు భ్రమపడూతున్నావే, అది ఒట్టి భ్రమ, దిక్కుమాలిన తనం లా ఉంది. ఈ టపా

answer said...

అయ్య anantaachaaryulu,
జరుగుతుంది హిందుమతము గురించి చర్చ ,మద్యలొ ఇస్లామ్,క్ర్తేస్తవ మతం ఏందుకు.
నీకు హిందుమతం గొగొగొప్ప అనుకుంటె దాని గురించి అందరికి చేప్పు.అంతే తప్ప ఇతర మతల జొలికి రాకు.
నిలాంటి వారు,నిలాంటి వారి వంత పాడే తొత్తులు వల్లే సమస్య అంతా.
నికే ని మతం గురించి పుర్తిగ తేలియదు.ఇక నువ్వు ఎంటి ఇతరులకు చేప్పెది,ముందు ని మతం గురించి పుర్తి గా తేలుసు కొని అప్పుడు ఇతర మతాల జొలికి రా

బొల్లోజు బాబా said...

maMci posT.

good insight.

bollojubaba

సురేష్ బాబు said...

మీరన్నది బాగానే ఉంది.నా అభిప్రాయం ఏమిటంటే నేడు కనిపిస్తున్న హిందూమతం(నా ఉద్దేశ్యం మతం కాదు,పాటిస్తున్నవారు) సనాతన ధర్మానికి నీడ మాత్రమే.అసలు విషయానికి ఉన్న లక్షణాలు నీడకు ఎలా ఉండవో అలానే సనాతనధర్మానికి ఉన్న లక్షణాలు ఇప్పటి హిందూమతం(మతం కాదు,కొందరు అనుసరిస్తున్న విధానాల వలన హిందువులు కోల్పోయారు)కోల్పోయింది.మహేష్ గారూ! కొన్ని సవరణలు."ఏకంసత్య; విప్రోహ వివిధ వదంతి"కాదు "ఏకం సత్,విప్రా బహుదా వదంతి".అలాగే "నక్కకు నాగ లోకానికి" కాదు,"నాకలోకానికి".అనగా స్వర్గానికి.అన్యధా భావించకండి సవరణలు చెప్పినందుకు.

Anonymous said...

కత్తన్నాదాగుడు మూతలు ఎందుకన్నా? నువ్వు హిందూమత ద్వేషివి. నువ్వు పెరిగిన వాతావరణమో విద్యాలయమో పరాయి మతబోధనలో నిన్ను ,నీమనసును ఆవిధంగా చేసాయి. కాకుంటె తెలివైన మెకాలే మానసపుత్రుడవు కనుక మాటల చాతుర్యంద్వారాదాన్ని కనపడకుండా దాచాలని ప్రయత్నిస్తున్నావు. మాటలతోటేగదా మన మార్గం సుగం చేసుకుని జనాలను తమమతం పట్ల తామే విమర్శిమ్పజేసుకుని తమనౌతామేకిమ్చపరచుకుని మీ వ్యూహములోకి లాగేది.చక్కగా చేస్తున్నావాపని. కాకుంటే ,నువ్వేనాడూ ఆచరించక [మనస్పూర్తిగా] దూరమ్గా వుమ్డే మతాన్ని గురించి,,అదీ దేవున్ని నమ్మను అంటూనే కేవలము హిందుమత ద్వేషమ్తో చేసే ప్రచారానికి స్పమ్దనలు కూడా లభిస్తున్నాయంటె అది నీవిజయమే. కాకుంటే ఇది నీఛపుపని. దానికంటే నువ్వు అభిమానించే మతంపట్ల నిర్భయంగా పనిచేసేవారే నయం.నువ్వు నిజంగా సనాతన మతాభిమానివి అయితే నువ్వు తప్పులున్నవి అన్నచోట సమ్స్కరణలకు ప్రయత్నించేవాడివి. అవునా?కాదా? నీకేమితెలుసని ఇతరుల ఆచార వ్యవహారాలను తప్పుబడుతున్నావు? అదే ఇతరమతాలైతే నీ అడ్రస్ గల్లమ్తయ్యేది. సనాతన మతంకాబట్టే హిందువులు నీ మాటలని కూడా ఆలకించి,కోపపడకుందా నిన్ను ఆదరిస్తున్నారు. అది గమనించు.

నీలాంటీవారికి లక్ష్యము ముఖ్యము.మార్గం ఎలాంటిదయినా .వారికి నీతులు తలకెక్కవు.

rasool rafi said...

hey stupid antacharulu,
dont insert your finger in islam.
otherwise we will teach you a lesson.
all of you please dont compare islam to other religions

islam is everfoever

Anonymous said...

మహెష్ మీరు మొదట్లొ వ్రాసిన టపాల కి ఈ టపా కి తెడా చాలా వుంది. మీ అభిప్రాయాలు వ్యక్త పరచడము లో కూడా చాల మర్పు వచింది. మీరు నెమ్మది గా ముసుసు తీసి అసలు రూపం చూపిస్తునారు. హిందు మతం కాలని కి అనుగున మార్పు చెందుతున్నాది మిగత మతాల తొ పొలిస్తె. మీరు ఒప్పుకొక పొతె దని మీద టపలు రాసుకుంటుండంది తీరికగ.
అంతే కాని
" ఇక్కడ చర్చలకు పెట్టే హిందూమతం అదేనంటే నమ్మే మూర్ఖత్వం మాత్రం నాలో ప్రస్తుతానికి లేదు. సనాతనధర్మం దీపమైతే, ఆ దీపపు వెలుగు క్రిందనే వుండే చీకటి ప్రస్తుతం వున్న హిందూమతం. కేవలం ఆ వెలుగు క్రిందవున్నంతమాత్రానా, చీకటి వెలుగెప్పటికీ కాలేదు. అందుకే, మతమౌడ్యం గురించి జరిగే చర్చల్లో హిందూమతం సనాతనం,నిత్యనూతనం, అనంతం,జీవనవిధానం వంటి శుష్క వ్యాఖ్యలు చెయ్యకపోవడమే మంచిది."

చర్చ పెట్టింది మీరు, వ్యఖ్యానం చెసింది మీరు
ఇటువంటి టపాలు రాయ కుండా వుంటె చాల మేలు.

rasool rafi said...

my dear muslim brother i dont know telugu well.
if anyone know telugu well please start a blog support islam.

my special request to all of my muslim brothers

Anonymous said...

@rasool
I am wondering how can you comment anatacharyulu, if you don't know telugu. you don't have guts to speak truth, what leason will you teach.

పరుశు రాముడు said...

బ్లగరులారా,
మహేషా,
ఇవి చుసావ ?
ఏంటది,
నిన్నసలు ఏమనాలి, నీకు తెలియదూ చావదూ,
చంపుకు తింటున్నావ్
జనాల్ని,
అందరూ నిన్ను తిడదామనే, కానీ నాకెందుకులే అని ఊరుకుంటున్నారు,
కారణం ఎదో వచ్చ్చామా పోయామా అని
నా కదేం లేదు, తప్పౌంటే కడిగవతలపడేస్తా,

నా పేరు రామశాస్త్రి, నా బ్లాగు అడ్రస్సు ఉంటుంది,

తాడేపల్లి అంటటి వారి తో గొడవ పడ్డవ్, వారి పాత టపాలు చూడు ఆయిన గురించి తెలుస్తుంది, మనసుకు తీసుకుని ఆయన రాఅయటం మానేస్తే మంచి టపాలు మిస్ అవుతామని ఎంత భాధ పడ్డానో, చీ, మళ్ళి అంటున్నా

దిక్కుమాలిన రాతలు రాయకు, మంచిగా బతుకు,

రాముడు లేడనుకో ఊరకుండు,

బంతి లో కూర్చోని అన్నం తింటూ పెంట అనే వాడివు నువ్వు

ఇక మానేయ్

వికటకవి said...

@ మహేష్,

అనేక లొసుగులతో కూడిన వాదనల టపా ఇది. మచ్చుకు కొన్ని.

వేదాలు సనాతనధర్మానికి మూలం అంటూ, వాటి ఆధారంగా వచ్చిన స్మృతులు నిర్దేశించిన మంచిచెడులని మాత్రం వెక్కిరిస్తూ మాట్లాడతారా? మీకు జంధ్యం మీద నమ్మకం లేకపోతే, ఉన్నవాళ్ళని వేళాకోళం చెయ్యటమేనా మీ సంస్కారం?


>>"ఆ మతాన్నికూడా సత్యాన్ని చేరేందుకుగల ఒక విభిన్నమార్గంగా ఎందుకు అనుకోరు?"

ఎందుకనుకోరు. సుబ్బరంగా అనుకుంటారు మతం మాత్రమే అయితే. కానీ మీరు ఎంతో తెలివిగా మతాన్ని, మత మార్పిడులని ఒకే గాటన కట్టి మాట్లాడటం ద్వారా మీ వాదనని మీరే పలుచన చేసుకున్నారు.

ఎవరో కొందరు పట్టిన తప్పుమార్గాన్ని బూచిగా చూపి, మోకాలికీ బోడిగుండుకీ లంకెపెట్టినట్లు ఏకంగా హిందూమతమే అసలు సనాతనం కాదనటమేమిటి? అసంబద్ధమయిన వాదన ఇది.

ఇలాంటి అడ్డగోలు వాదనలతో విషయాల్ని సంకుచితంగా చూడటం మొదలెడితే, మనం అసలు హిందువులుగా పరిగణింపబడటానికి అనర్హులం. ఒకప్పుడు స్మృతులు చెప్పిన వర్ణవ్యవస్థ ఇప్పుడు లేదు. కాబట్టి మనందరం హిందువులు కాకపోతామా?

మొత్తమ్మీద ఈ టపా మీరు ఏదో రాయాలని ఏదో రాసినట్లుగా అనిపించింది తప్ప గట్టి ఆలోచన చేసినదిగా ఏ మాత్రం లేదు.

భాస్కర్ రామరాజు said...

>>కానీ, కొంచెం లోతుగా చూస్తే సనాతనధర్మం యొక్క అర్థం చాలా ఆసక్తికరంగా వుంటుంది. సనాతనధర్మానికి నిర్థిష్టమైన ప్రవక్తలూ,గ్రంధాలూ లేకపోయినా, మూలాధారం మాత్రం అనుభవం మరియూ నమ్మకం. అంటే,ఇతర మతాలలాగా ఎవరో ప్రవక్త అనుభవించి నమ్మిన సిద్ధాంతాలనుకాకుండా, తనంతటతానుగా ప్రతివ్యక్తీ ‘సహజమార్గంలో’(ధర్మ) అనుభవించి నమ్మాలన్నది సనాతనధర్మం యొక్క ఉద్దేశం.ఇక్కడ ఉదయించే ప్రశ్నేమిటయ్యా అంటే, నిజంగా ప్రస్తుతం అమలులోవున్న హిందూమతంలో ఈ లక్షణం ఉందా? అని. నాకైతే లేదనే అనిపిస్తుంది.
మీలో ఉందా? మీలో ఎలాంటి లక్షణాలు ఉన్నయో వాటి గురించి రాస్తే బాగుంటుంది.

Anonymous said...

Hi

Good to see ur reasoning. But let us be clear. The genesis of the word Hinduism is that the dharma that was followed in the area of sindhu region. Looked from this perspective hinduism is nothing but santhana dharma.

Religion we see today according to you may not be qualified to be called as santhana dharma. I would fundamentally differ in this regard. The original intention in the hinduism is still preserved. If we look at the prayers and worship done in temples we say SArvejana sukenobhavanthu. There are many instances in agama and aradhana that stresses the importance of well being of human kind and wellbeing of all living entities.

However the so called followers of hinduism today miss this essence. Because of these guys practice we cannot conclude that hinduism is not identical to sanathana dharma.

Just I am trying to present my opinion.....

Thnx
VPM

చిలమకూరు విజయమోహన్ said...

"ఏకం సత్,విప్రా బహుదా వదంతి"అనేది మీభాష్యంలో ఏవిధంగా"ఏకంసత్య; విప్రోహ వివిధ వదంతి" గా మారిపోయిందో ,అలాగే కాలక్రమేణా మనలాంటి వాళ్ళ భాష్యాల వల్ల హిందూ సనాతన ధర్మాలకు వ్యాఖ్యానాలలో,పాటించడంలో మార్పులు వచ్చి ఉండవచ్చుగదా ! వాటిని అర్థంచేసుకొని పాటించడంలో మనలోపాలను హిందూ సనాతనధర్మాలపై రుద్దడం పొరబాటు గాదా ?

కత్తి మహేష్ కుమార్ said...

@సుజాత: నా వ్యతిరేకతంతా, ప్రస్తుతం నడుస్తున్న హిందూపోకడల్ని సనాతనమంటూ సమర్ధిస్తున్నవాళ్ళనుద్దేశించి మాత్రమే.మతమౌఢ్యం గురించి జరుగుతున్న చర్చల్లో హిందూమతం సనాతనం కాబట్టి గొప్పది అనే వాదాలు అర్థరహితంగా అనిపించి ఈ టపా రాసాను. అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు.

@వీర: "It(హిందూమతం) do not also have a history killing people just for sake of opposing religious rituals" మీ సమాచారం తప్పని చెప్పడానికి చింతిస్తున్నాను.వ్యతిరేకించడమేకాదు, ఆచారసాంప్రదాయాల పేరుతోకూడా హిందువుల్నే(దళితుల్ని) చంపిన ఘనత మన మతానికుంది.ఇక ఇదేమతంలోని ఇతర శాఖలవాళ్ళని ఊచకోతకోసిన perversion మన సొత్తు. అంతెందుకు స్వాతంత్ర్యానంతరం లెక్కలు తీసుకుంటే మతకల్లోలాలలో,దొమ్మీలలో మన హిందూ సంస్థల ఆద్వర్యంలో చనిపోయినవాళ్ళ సంఖ్య కొన్ని వేలుదాటుతుంది.
I have the capacity to build castle out of the stones thrown at me. So,I have no worries about somebody throwing stones at me.

@అనంతాచార్యులు:ఏమతంలో అనాచారం,అమానవీయతా,ఛాంధసంవున్నా నేను ఇలాగే మాట్లాడతాను. దానికి హిందూ,క్రైస్తవ,ఇస్లాం,సిక్కు మతాలు మినహాయింపుకాదు.

"భరించలేని స్థితిలో తిరగబడుతున్న హిందువులు" అంటూ మీలాంటివారు ఊతమివ్వబట్టే హిందూతీవ్రవాదం మొదలయ్యింది.ఇదే మాట ముస్లింలు అంటే మీరొప్పుకుంటారా? ఈ మాట ఏమతంవాళ్ళన్నా నేనొప్పుకోను.

@భాస్కర రామి రెడ్డి: ఒకప్పుడు బ్రాహ్మణులూ(అర్చకులూ,పూజారులూ)ఇప్పుడు రాజకీయనాయకులూ సనాతనధర్మాన్ని హిందూమతంగా మార్చేసి, తమ పబ్బంగడుపుకుంటున్నారేతప్ప, సారవంతమైన మత విలువల్ని అందించలేదు. కానీ, ఈ మౌఢ్యాన్నే మతమనుకుంటూ ఫాలోఅయిపోతూ flexibility ని మరచి వాదిస్తున్నవాళ్ళనుద్దేసించి మాత్రమే నేను రాసింది.

@పరుశు రాముడు: నాకు ఫాలోయింగ్ అఖ్ఖరలేదు. ఈ ఫాలోయింగుతో నేను కట్టే మిద్దెలూమేడలూ ఏమీ లేవు. కాబట్టి మీ అక్కసుని వేరేదగ్గర వెళ్ళగక్కుకోండి.

@సురేష్ బాబు: మీ సవరణలకి ధన్యవాదాలు.

Anonymous said...

Mr. Mahesh,


You answered / replied for everyone's response can I know why you left Mr. Rasool Rafi's comments?

కత్తి మహేష్ కుమార్ said...

@ఆఖరి అనామకుడు: నేను ఇంకా అందరికీ సమాధానం ఇవ్వలేదు స్వామీ. ఇచ్చింది కొందరికే.

@మొదటి అనామకుడు: నేను ఏమతానికీ ద్వేషిని కాదు. మనిషి సంతోషానికి ప్రతిబంధకమైన ప్రతిమతంలోని విపరీతపు పోకడలనూ ఖచ్చితంగా ద్వేషిస్తాను.

మనమందరం మెకాలే సృష్టించిన విద్యామూసనుంచీ ఉధ్బవించినవాళ్ళమే, కాకపోతే నేను ఆ మూసను మీరి, స్వతంత్ర్యంగా ఆలోచించడం నేర్చుకున్నవాళ్ళలో ఒకడ్ని. మీరు హిందూమతఛాంధస భావజాలం యొక్క మానసపుత్రులుగా వర్ధిల్లుతున్నవాళ్ళలాగున్నారు. మనిద్దరికీ ఆ మాత్రం తేడా వుండాలి లెండి.

నేను పూజాపునస్కారాల్ని నమ్మకపొయినా దేవుడనే ఒక unknown power ని నమ్ముతాను. నాజీవితంలో అవలంభించే మతంలో చాలా సంస్కరణలే చేసుకున్నాను.నాకు నీతిబోధలు చేసే శ్రమనుంచీ మీరు సగౌరవంగా తొలగిపోగలరని మనవి. మీలాంటి హిందూ సనాతనుల దయతో నేను బ్రతకడం లేదని గమనిక.

@రసూల్ రఫి: వ్యక్తిగతధూషణ చెయ్యడం అత్యంత సులభమైన వాదనా పద్దతి. నీకు నిజంగా ఇస్లాం మీద అంతగౌరవముంటే, దానిగురించి విశదంగా తెలియపరచడానికి ప్రయత్నించు. ఆపొహలు కాకుండా ఇస్లాం మత మూలసారాన్ని ఏ bias లేకుండా తెలుసుకోవడానికి ఇక్కడ చాలా మంది సంసిద్దులుగా వున్నారు.

అన్నిమతాలతోపాటూ, ఇస్లాం గురించి, దానిలోని లోటుపాట్లను గురించి చర్చించే హక్కు భారతీయ పౌరులుగా మాకుంది.కానీ చంపేస్తాను,నరికేస్తాను అని బెదిరించే హక్కుమాత్రం నీకు లేదని తెలుసుకో.చేతనైతే,ఇస్లాం గురించి స్పృహకల్గిన చర్చ చెయ్యడానికి సిద్దం అవ్వు. లేకుంటే,ఇటువైపు రాకు.

@రెండో అనామకుడు: నేను ఎప్పుడూ ముసుగు వేసుకోలేదు. ఇప్పుడు కొత్తగా అసలు రూపం చూపించడానికి. కనీసం వ్యాసం పుర్తిగాకూడా చదవకుండా కామెంటే నేలాంటి వారికి సమాధానం చెప్పడంకూడా నిరర్థకం. ఈ టపా నా ఇదివరకటి టపాకు సంబంధించిన continuation అనికూడా చూడకుండా వ్యాఖ్యానించడంలోనే మీ నిబద్ధత అర్థమవుతోంది.పేరుకూడా చెప్పుకోలేని నీలాంటివాళ్ళ సలహాలు పాటించే ఖర్మనాకు పట్టలేదు.

@పరశురాముడు/రామశాస్త్రి:నీలాంటివాళ్ళ వ్యాఖ్యలకు సమాధానం కూడా రాయాలంటావా!!!

తాడేపల్లి గారు ఎంతగొప్పవారైతే నాకేమి. ఆయన టపాలు కొన్ని అసంబద్ధంగా వుంటే వ్యాఖ్యానించాను. ఇప్పుడు ఆయన బోర్డొకటిపెట్టి, నాలాంటివాళ్ళు వ్యాఖ్యానించకూడదని నిర్ణయాన్ని తెలిపినతరువాత, ఒక్కసారి కూడా అటువైపు వెళ్ళలేదు.

ఈ ప్రజాస్వామ్య దేశంలో నా అభిప్రాయం చెప్పేహక్కు నాకెప్పుడూ వుంది. మీలాగా "పెంట"మాటలు మాట్లాడేకన్నా,నాలా సగౌరవంగా అభిప్రాయాల్ని పంచుకునేవాడి బ్రతుకా దిక్కుమాలింది? ఎవరి బ్రతుకు ఎలాంటిదో నీ వ్యాఖ్యనుబట్టే తెలుస్తోంది.

@వికటకవి: నేను జంధ్యం మీద నమ్మకం వున్నవాళ్ళని వేళాకోళం చెయ్యలేదు. అంత prescriptive గా తయారయ్యిన flexible హిందూమతాన్ని ఎద్దేవా చేసాను. గమనించగలరు. నేను రాస్తున్న వ్యాసాల నేపధ్యం ప్రస్తుతం హిందూమతంలో నెలకొనివున్న పరిస్థితులు అలాంటప్పుడు మతమార్పిడులనూ, హిందూ/ఇస్లాం మతతత్వవాదాల్నీ పక్కనబెట్టి వ్యాసం ఎలారాయగలను?

నేను రాసిన వ్యాసంలో సంకుచితత్వం కనబడిన మీకు హిందూఅతివాదుల మాటల్లో సనాతనత్వం కనబడటం ఆశ్చర్యంగా వుంది. వర్ణవ్యవస్థ ఇప్పుడు మాత్రం లేదంటారా,రూపం మారిందిగానీ వివక్ష మారిందంటారా? అయినా, ఈ స్థితికి రావడానికి జరిగిన పోరాటాలూ,మారణహోమాలూ మర్చిపొయి మాట్లాడితే ఎలా!

@భాస్కర్ రామరాజు: నా అభిప్రాయాలే నా లక్షణాలు. నాబ్లాగే నా వ్యక్తిత్వానికి ప్రతిరూపం. Take it or leave it your choice.

@VPM: I agree and endorse your view. My only contention is that,the existing Hinduism that is put forth for discussions has nothing to do with Sanatana dharma.That's all.

@చిలమకూరు విజయమోహన్:మనలో లోపాలున్నాయని చెప్పిన ప్రతిసారీ, మనమతం సనాతనం అందులోని లోపాలను లెక్కించకూడదని చెప్పేవారిని ఉద్దేశించే ఈ టపా రాయటం జరిగిందని గమనించగలరు.

రవి said...

కాస్త హడావుడిగా రాసినట్టు అనిపించినా, మీ ఆలోచనలు అర్థం చేసుకున్నాను. నా తరంగ దైర్ఘ్యం (wavelength) అదే కాబట్టి. కాబోతే, ఇలాంటివి అంతర్మథనం గా ఉంటే బావుంటుంది, ఇలా టపాలూ రాస్తే, ఆవేశ కావేశాలకు జనాలు లోనయి, అది మనల్ను బాధపెట్టి (లేదా తలనొప్పి తెప్పించి) అసలు ఉద్దేశ్యాలు దెబ్బ తినే అవకాశం ఉంటుంది.
ఇది మీ శ్రేయోభిలాషి గా చెబుతున్నాను. అపార్థం చేసుకోకండి.

Anonymous said...

మహేష్ గారు,
నేను మీ బ్లాగ్ ని మొదటి నుంచి ఫాలో అవుతున్నాను. ఆ మాత్రం రీసెర్చ్ చేయ్యనిదే, మీరు ఏ విషయం మీద చర్చ మొదలు పెట్టారు. ఇది నేను గమనించిన విషయం. ఏ విషయాన్నైనా ముక్కు సూటిగా చెప్పేతత్త్వం మీది. idemi pogadtha kaadulendi ...

ఇక చర్చ విషయానికి వస్తే, కొందరేమో.... రూల్స్ కష్టం అనిపిస్తే దాని జోలివేల్లకూడదు అన్నారు ... లోటు పాట్లు ఎత్తి చూపడం యొక్క ముఖ్య ఉద్దేశం, దాన్ని సరి చేసుకోవడమే ... అంతే తప్ప, దాన్ని అవమానించటం యెంత మాత్రం కాదు. అంతే కాని, మనం నిజాన్ని అంగీకరించక పోతే మనల్ని మనం మోసం చేసుకోవడమే ...

మహేష్ గారు చెప్పిన దాని మీద మీరు రీసెర్చ్ చెయ్యండి. తప్పు ఏమన్నా ఉంటే నిరభ్యంతరంగా తప్పు పట్టవచ్చు ... :)

and i agree with you Mr. Ravi.

చైతన్య క్రిష్ణ పాటూరు said...

సనాతన ధర్మం చాలా గొప్పదని, ఇప్పటి హిందూ మతంలో దాని విశాల భావనలు లేవని అంటున్నారు. మీకలా అనిపిస్తోందే కాని, పూర్తి నిజం కాదని నా అభిప్రాయం. ప్రతి వ్యక్తీ తన సత్యాన్వేషణకి, తన అనుభవాలకి అనుగుణంగా నడుచుకోగల వెసులుబాటు ఇప్పటి హిందూ మతంలో కూడా నిక్షేపంగా ఉంది. నేను దేవుడ్ని నమ్మటం మానేసి, హిందూ విధులుగా చెప్పబడుతున్న వాటిని పట్టించుకోటం మానేసి చాలా సంవత్సరాలయ్యింది. కానీ నన్ను ఏ మతాధిపతులు, స్వాములు, కనీసం మా పక్కింటి వారు కూడా, నువ్వు హిందువువి కావు పొమ్మనలేదు.

మతం అన్నాక తప్పొప్పుల చిట్టా తప్పనిసరి. కానీ దాన్ని మతం ఎంత బలంగా enforce చేస్తున్నదని చూడాలి కానీ, అసలవి ఉండటమే తప్పంటే ఎట్లా. పేరుకు మాత్రమే వున్న మతాధిపతులకు ఏం పవర్స్ వున్నాయి. వారు ఫత్వాలాంటిది జారీ చేస్తే పాటించేదెవ్వరు. కంచి పీఠాధిపతిని లాక్కెళ్ళి జైల్లో పడేస్తే సామాన్య జనాల్లో ఎవరు పట్టించుకున్నారు. వీరి చేతుల్లో హిందూ మతం ఉందనేది అనాలోచితమైన వాఖ్య. వేదకాలం నాటి సనాతన ధర్మం ఎవరి చేతుల్లో లేదు, ఇప్పటి హిందూ మతమూ ఎవ్వరి చేతుల్లో లేదు. మధ్య కాలంలో చాలా మంది గుప్పెట్లో ఉండుండొచ్చు కాని ఇప్పుడు లేదు. అడిగేవారు, ప్రశ్నించేవారు, enforce చేసేవారు ఎవ్వరూ లేరు. ఒక హిందువు ఎంత విశాలంగా, ఉన్నతంగా ఐనా ఉండొచ్చు, ఎంత సంకుచితంగా ఐనా ఉండొచ్చు. ఎంతటి విశాల భావనల్ని accommodate చేసుకోగలదు అనే maximum limit మాత్రమే ఒక మతం యొక్క metric గాని, minimum limit కాదు. Minimum limit పాటించేవారి maturity బట్టి ఉంటుంది.

సనాతన ధర్మానికి మూలమైన వేదాలలో లేవా విధులు, నిషేధాలు. ఇప్పటి కంటే ఎక్కువే వున్నాయి. వాటితో పాటు వేదాంతాలలో తాత్విక చర్చలూ వున్నాయి. మాకు formalities అక్కర్లేదు, philosophyనే ముద్దు అన్నవారి కోసమే ఉపనిషత్తులు పుట్టాయి. ఎవరికి నచ్చినవి వారు తీసుకున్నారు. ఇప్పుడైనా అలా వుంటే వద్దన్నదెవరు. భగవద్గీత అయినా, మను ధర్మ శాస్త్రమైనా నన్ను కన్విన్స్ చేసిన పార్ట్ ని ఒప్పుకుని పాటిస్తాను. కన్విన్స్ అవ్వకపోతే లైట్ తీసుకుంటాను. మతమిచ్చిన వెసులుబాటుని వాడుకోని(వాడుకోలేని) వారి మూర్ఖత్వాన్ని ఎగ్జాంపుల్ గా చూపించి, మతమంతా ఇంతే అంటే ఎట్లా.

Teja Shreyus said...

ఒక ప్రశ్న మీరు హిందుత్వం గురుంచి ఎలా తేలుసుకున్నారు.నేను చదివిన దాని బట్టి హిందుత్వం అనేది మతం కాదు అదొక జీవన విధానం. కొంచం మీరు చరిత్ర చూస్తే ఎక్కడ ఇది మతం అని దిన్ని అనుసరించమని ఎవరు చెప్పలేదు. భారత దేశంలో ఉండేవారి జీవన విధానం పాశ్చాత్యులకు తెలియక మతం అని భావించారు . అప్పట్నుంచి ఆ జీవన విధానమే మతంగా మారింది .
సనాతన ధర్మం ఈ జీవన విధానంలో ఒక భాగం .
నేను ఏమైనా తెలియక రాసుంటే క్షమించగలరు.

భస్మాసుర said...

Dear Kathi,

Your post is confusing.

"మనం ప్రస్తుత పరిస్థితుల్లో పాటిస్తున్న హిందూ విధుల్ని దృష్టిలో పెట్టుకుని కూడా, ఈ వాదన ఎలా చెయ్యగలరనేది మరీ ఆశ్చర్యాన్ని గొలిపే విషయం"
This gives me an impression that you are knowledgeable in hindu matters. Please let us know, what makes you a Hindu(assuming that you are a hindu)? what are those duties, following which one is a Hindu(విధులు)?
మీరంటున్న 'హిందూ విధులు' ఏవో కొంచెం చెబుతారా?

"చాలా వరకూ హిందూ స్వాములూ, రాజకీయ నాయకులూ, మతాధిపతులూ,మఠాధిపతులూ, గుళ్ళూగోపురాలలో ప్రస్తుతం విజయవంతంగా అమలులోవున్న హిందూమతానికీ సాతనధర్మంగా పిలువబడే విలువలకీ నక్కకీ నాగలోకానికీ వున్నంత తేడా వుంది"

This doesn't make any sense. Could you please shed some light on what is 'successfully Hindusim in practice'? If you don't articualte what you are talking about clearly, you shouldn't pass your judgements on that.

You are trying to compare sanatana dharma and hinduism, arriving at a conclusion that hindusim is a religion. If you dont know what either of these terms convey, you are ineligible to pass comments on these. what has cosmopolitan to do with sanatana dharma? you had me worried there, for a moment.

I have read your earlier post about so called hindu terrorism.
I question you what the heck does that term mean? is that supposed to mean "an aggressive, indian, hindu that kills". If that is what you mean, Why didn't you ever write a blog post with the title "Reddy terrorists/ Naidu terrorists?" they also kill each other, what will you call them 'caste terrorists'?

There are many things that suggest you are completely clueless about everything that you wrote. I dont have any problems with it. Its not my place to enlighten you with a couple of random comments. You may write whatever you want about 'hindu terrorists' to your heart's content, I don't give a damn. It doesn't make any difference to anyone. But, you commonsense wisdom sucks, sucks big time!!

Back in Brahmo Samaj days, it was fashionable to downgrade bhahmins, and vedas. Vedas was trash, brahmins are priests and all this crap. The same way, it is now fashionable to be a secularist. You seldom realize that secularism and its underlying principles are variants of christian theology. If you want to talk about Hindus and dharma, just do that. Dont do theology, and dont borrow ideas from media, everyone has access to it.

Don't tell me your intentions are good. There is a hiatus between intentions and results.

Cheers
భస్మాసుర

anamika said...

Mr.Mahesh,
I agree with Mr.chaitanya krishna and Bhasmasura.
ఈ వాదనలని బట్టి చూస్తే బ్లాగుల్లో కూడా మత కల్లోలాలు చెలరేగు తున్నాయి. నాకు తెలిసి దీనికి నాంది మీరు, మీ కామెంట్సు.తద్వారా జరిగే వేడి వేది వాదోపవాదాలకు, దారుణ ధుర్భాష్యాలకి మీది బాధ్యత.
నాకు తెలియకడుగుతాను. మీకు ఈ మతాల గురించి తప్పితే వేరొక టాపిక్ దొరకదా? గతమ్లో కూడ ఇలాటి దుమారం లేపారు. As someone said why don't u comment the other religions? U first study all the religions and get some authority to comment on.

బ్లాగరులారా...
గమనించండి ఇతనొక మతోన్మాద శక్తుల సంస్థకి ఏజంటని నా అనుమానం. ఇతని తో వాదించి ఇతనికి అనవసరమయిన గుర్తింపుని ఇస్తున్నాము.
Bloggers...

Please understand that he is an agent to a certain anti-religious activities organisation. Please do not involve in commenting and waste your valuable time.
Let us excile him from blogworld.

కత్తి మహేష్ కుమార్ said...

@అనామిక:మతోన్మాదం ఎక్కడ కనబడుతోందో మీ వ్యాఖ్యనిబట్టే తెలుస్తోంది.ఇలాంటి లేనిఅపోహలతో బాధపడటాన్ని ఒక మానసికవ్యాదంటారు. మీరు అర్జంటుగా మానసిక వైద్యసహాయం తీసుకోవడం మంచిది.

@భస్మాసుర:ముస్లింలు మతంపేరుతో మారణహోమం చేసినప్పుడు "ఇస్లాం టెర్రరిజం" అన్నప్పుడు,హిందువులు అదేపనిచేస్తే "హిందూ టెర్రరిజం" అంటే తప్పొచ్చిందా?

హిందూవిధులేమిటో మీరు దయచేసి హిందువులకు ప్రాతినిధ్యం వహిస్తున్న BJP,VHP,RSS లను అడగండి.

@తేజ: మాటికీ చరిత్రలోకి వెళ్ళిపోకండి. It might become all the more problematic. సనాతనధర్మంకూడా "ఆర్యుల" ధర్మంగా చెప్పబడింది. దక్షిణభారతీయులు ద్రవిడులు.

@చైతన్యకృష్ణ: మీరు చెప్పినవాటితో నేను చాలావరకూ ఏకీభవిస్తాను. ఎవరికి నచ్చింది వారు తీసుకుంటే అసలు సమస్యలేదు. నేను చేసేదీ అదే! కానీ, అదేదో పెద్ద పాపం,ద్రోహం అంటూ ఛాంధసభావాల్ని ఒలికించేవాళ్ళతోనే నా విభేధమంతా.

@రవి: ఈ టపా ఒక వ్యాఖ్యకు స్పందించి రాసింది. ఆ నేపధ్యం చదివితే ఈ వ్యాసాన్ని కొంత context లో చదివే అవకాశం వుంది. మనబ్లాగుల్లో చాలా మంది పూర్తివ్యాసం దానిలో ఉటంకించిన రెఫరెన్సులు (సమూలంగా)చదవకుండా,బ్లాగరి మీద ఇదివకే ఉన్న అభిప్రాయంతో (prejudice)తో వ్యాఖ్యానించేస్తూ వుంటారు. అలాంటివాళ్ళు అవాకులు పేలుతారేతప్ప చదివినవారు కాదు.

చదివి నాతో విభెధిస్తే నాకు సంతోషమే.I can be totally wrong some times.It will be an education to me. కాకపోతే, కేవలం హిందూమతానికేదో అన్యాయం జరిగిపోతుందన్నట్లు వ్యాఖ్యానించి,వాదనలకు దిగేవారిని నేనేమీ చెయ్యలేను.

భస్మాసుర said...

I dont seek explanations from you. I asked you questions, since you pass judgements, you should answer these questions.

I dont give a hoot to what BJP,RSS,VHP says about Hinduism. They are as retarded as people like you are, if not more.

I am appealing to reason, logic. The process is scientific. Forget about Hinduism, terrorism etc., You write some stuff on say X,Y, Z. You make some claims which I view are u8nscientific and idiotic. So I ask you questions, if you stand by what you write, you should engage in a dailogue.

Dont think that you can give some itsy bitsy answers which doesnt solve anything and get away with it. They may satisfy your 'oh-you're-cho-chweet-kathi anna' fellow bloggers. Not me.

రవి said...

మహేష్ గారు, ఇది బ్లాగు ప్రపంచం, బ్లాగు అనేది పూర్తిగా వ్యక్తిగతం (నా భావన) కాబట్టి, మీరు ఇలాంటివి బ్లాగడం లో అభ్యంతరాలను లెక్కించనవసరం లేదు.
అయితే...

మనది పవిత్రమైన మతం, మన గ్రంథాలు ఇంకా పవిత్రమైనవి, అవి మన సాంప్రదాయానికి ప్రతీకలు, వాటిని మనం పరిరక్షించుకోవాలి (అర్థం జోలికి వెళ్ళకుండా, కనీసం ప్రయత్నించకుండా, కొన్ని prejudices ను అడ్డం పెట్టుకుని).....ఇలాంటి వాదనలను చూసి, మీరు ఆవేశపడినంత మాత్రాన జనాలు మారరు. వారిని పట్టించుకోకపోవడం ఉత్తమం అన్నది మాత్రమే నా సూచన.

ఇక మీ ఆలోచనలను గౌరవించడానికో, సద్విమర్శించడానికో, చైతన్య కృష్ణ లాంటి వారు ఉండనే ఉంటారు. మీ టపాలు వీరిని ఉద్దేశిస్తే మీకే కాక, మంచి విషయాలు, కొత్త విశ్లేషణలు తెలుసుకోవాలనే (నా లాంటి) ఔత్సాహికులకు ఉపయోగపడతాయి.

ఆవేశపరులకు మీరు స్పందించడం వల్ల ఒరిగేదేం లేదని నా అభిప్రాయం.

సంప్రదాయ వాదులకు వ్యతిరేకంగా వెళితే, ఏమవుతుందో, ఇంటా, బయటా నాకూ అనుభవమే. వాళ్ళను చూసి జాలిపడ్దమో, నవ్వుకోవడమో తప్ప ఆవేశపడి లాభం లేదని నా అనుభవం నాకు నేర్పిన పాఠం.అలాగని నా పంథా నేను మార్చుకోలేదు కూడానూ.

అబ్రకదబ్ర said...

నా స్నేహితుడొకాయనున్నాడు. తెల్లారి లేస్తే దైవ ప్రార్ధన చేయందే రోజు మొదలెట్టడు. పెద్ద పెద్ద చదువులు చదివాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు. చాలా విషయాల్లో అతనికున్న విజ్ఞానం అబ్బుర పరుస్తుంది. కానీ ఒకటే సమస్య. ప్రపంచంలోని పరాయి మతస్థులందర్నీ నరికి పారేయాలంటాడు; అమెరికాకి ఒక నల్లవాడు అధ్యక్షుడైనందుకు శ్వేత జాతి అమెరికన్లని మించి ఈయన తెగ బాధ పడిపోయాడు.

చదువు కొందరికి ఏమీ నేర్పదు. ముఖ్యంగా, మతం వంటి విషయాల్లో ఆ చదువే వాళ్లని మరింత మూర్ఖుల్ని చేస్తుంది.

ఈ చర్చలు తెగేవి కావు. మతాలన్నిట్నీ కట్టగట్టి సముద్రంలో పారేస్తే పీడా వదులుద్ది :-)

hameed said...

అబ్రకదబ్ర గారు,
చాలా బాగా చేప్పారు.
మతం మనిషికి మనుగడే లేకుండా చేస్తుంది.
నాకు తేలిసి మతాలలో గోప్ప మతం,
మానవతం.

Anonymous said...

కులాలు మతాలు మానవ నిర్మితాలు ... మనతకు మనం కట్టుకున్న అడ్డుగోడలు ... హమీద్ గారు చెప్పినట్లు .. మానవ మతం గొప్పది ... :)

అబ్దుల్లా said...

ఒసామా బిన్ శాస్త్రి....

ఏమ్ వాయ్ రాసూల్..... కాఫిర్ల...... ఎవరు కాఫిర్లు....
ఇస్లామ్ కు ద్రోహం చేసేవారు...అందులో నువ్వుకూడా ఉన్నావ్... నీ ఉన్మాద భుద్దితో ఇస్లామ్ శాంతి బావాలు వీళ్ళ గంగలో కలుపుతున్నావ్ (ఇలా ఎన్నో భావాలు గంగలో కలప బట్టి కాబోలు గంగ పవిత్రత పెరిగిపోతుంది).... అంటే ఆ ఖుదా దృష్టిలో నువ్వుకూడా కాఫిర్ వే.....

అస్సలు కాఫిర్ కాఫిర్ అంటున్నావ్...
నువ్వు వాడూతున్న ఇంటర్ నెట్ దగ్గర నుంచి,నువ్వు నడిచి వచ్చిన రోడ్డు ఒక కాఫిర్ వేసిందే, నీ జీవితంలో ప్రతి క్షణం ఎదొక కాఫిర్ కనిపెట్టిన,తయారు చేసిన,అమ్మిన, వస్తువునో, భావన్నో నువ్వు స్ప్రుసిస్తూనే ఉన్నావ్. ఇక మీదట ఉంటావ్..

ఆంతెందుకు, నువ్వు తినే అన్నం, ఒక కాఫిర్ పండించింది అయికూడా ఉండచ్చు... నువ్వు వంటి మీద వేసుకున్న డ్రస్, ఒక కాఫిర్ పండించిన పత్తి నుంఛి వచ్చిందవవచ్చు... ప్రపంచాన్ని నీ శక్తితో గెలిచే శక్తిలేక, ఇస్లాం అడ్డం పెట్టుకుని నీ గొప్పను చాటూకోవాలనే దుర్బుద్ది నిన్ను కాఫిర్ చేస్తుందని గుర్తుంచుకో .....

అంతెందుకు, జీహాద్ కి కూడా కాఫిర్ కనిపెట్టిన బాంబులు, కాఫిర్ కనిపెట్టిన కలష్నికోవ్ (ఏ.కే నలబది ఏడు గన్ ) కావాలి మరి... ఈ కాఫిర్లే లేక పోతే ..... నీ జీవితం ఎక్కడుండేదో ఆలోచించుకో...

లాల్ సలామ్
బిస్మిల్లాహ్ ఇర్ర్హహమాన్ ఇర్రహీం...

చూడండి మహేష్ గారు,

మీరు మీ మతంలో మంచిని మాత్రం చూడలేరు, మా మతంలో మంచిని మాత్రం చూస్తున్నారు... మీ మతం లో మంచి అనేది లేక పోతే ఇండియా లో ఎప్పుడో అంతర్యుద్దం వచ్చేది... అక్రోశంతో చేసిన పనులు రాజకీయం వైపు మళ్ళిస్తున్న మీ మతనాయకుల తప్పును సాధారణ జనం,వారి మతం పై రుద్ది .. వారిని తప్పుడోరు చెయ్యటం వల్లా మీ కు వరిగే లాభంలేదు...

ఇదిగో మాలో ఉండే కాఫిర్ల (రసూలాంటీ వారు, అంత కంటే ఉన్మాదులు)కు అవకాశం ఇచ్చినవారవుతారు...... తప్పు ఉంటే మీ వాళతో, మీ చుట్టూ ఉన్నవాళ్లకు కను విప్పుకలిగించండి.... అంటే కాని ఇలా బహిరంగం చేసి.... దరిద్రం చెయ్యద్దు....

ప్రపంచ వ్యాప్తంగా మతం పేరుతో చంపిన చనిపోయినవారి సంఖ్య, పరిస్తితులు...
మా మతంలో , మా ఆదిమతం (కిరస్తానీల్లో)నే ఎక్కువ ఉంది... మీలో కొందరు చాందసానికి బలయ్యారు కాని... పరాయి వారిని హింసిచిన దాఖలాలు చరిత్రలో తక్కువే.... అయిన ఇప్పుడు ఎవరు చెడ్డ అని నిర్ణయించి చేసేదేమిలేదు కూడాను.. ఎంతమెరుగ్గా మనం కలిసి ఉండ గలం అలోచించి అది రాయండి అందరూ హర్షిస్తారు...ఆదరిస్తారు.....

ధన్యవాదాలు....

అబ్దుల్లా said...

యా ఆలి మదద్..

ఇక్కడ కొంత ఇస్లాం మత విధేషం కనిపించిన మాట వాస్తవమే.... మీ చూట్టురా ఉండే లోభిగుణస్తులని చూసి అందరని ఒక గాటన కట్టేయద్దు.... ప్రతి మతంలో నల్లగొర్రెలు ఉంటాయి... మా మతం పేరిట నల్లగొర్రెలను కాచే వారుకూడా ఉంటారు.... మాలో ఎంతో మంది మంచి వారు ఉన్నారు ఉంటారు..... మన దేశ అణ్యస్త్ర పితామహుడు కలాం మావడే, పాకిస్తాని అణ్వస్త్ర పితామహుడు ముస్లలమాను అయి ఉండి కూడా ముసల్ మానులకు ద్రోహం చేశాడూ ...కాని మన కలాం దేశ పురోగతికి తన జీవితాన్నే ధారపోశాడు... ఎంతో మందికి ప్రేరణ అయ్యాడు....

మీ అందరు మేము పాకిస్తానుని ప్రేమించాలి అని చిన్నప్పటినుంచి నూరిపోస్తుంటే (సినిమాల్లో, టీవీల్లో, బయట ప్రపంచంలో) మరి మా ప్రవర్తన అంతే ఉంటుంది... అలా కాక నువ్వు ఇండియన్వి అయి ఉండికూడా ద్రోహం చేస్తావా అని టివి వాళ్ళు , సినిమా వాళ్ళూ రాస్తే మాలో కూడా దేశభక్తిని పెంపొందించిన వారవుతారు (ఇప్పుడు లేదని కాదు, ఆ గుర్తింపు లేదని).... ఇండియన్ ముసల్మానులను ఇండియన్లుగా గుర్తించండి... ముందు.......

ఇన్షా అల్లా

అబ్రకదబ్ర said...

@అబ్దుల్లా:

గణాంకాలు, చరిత్ర, సిద్ధాంత రాద్ధాంతాల్లోకి పోకుండా అన్ని మతాలకీ చురుక్కుమనిపించేలా భలే వాతలు పెట్టారు. ఇంత సూటిగా, నిష్పక్షపాతంగా మతాల గురించి రాసిన కామంట్ నేను చూడలేదు. అభినందనలు.

శివరంజని said...

అబ్దుల్లా గారు,

టోపీలు తీసేస్తున్నామండీ మీకు (Hats off to you Sir). అసలు టపాలోనే లేని సంయమనం, నిష్పాక్షికత మీ వ్యాఖ్యలో కనిపించింది.

ధన్యవాదాలు.

- Shiv.

mallik said...

mahesh garu migilana varu ante christain or islimics avaraina mammalni balavantamga matam mariste adevudaina okkate ani mimu maripovali how dare you to say like that