ఏభావజాలాన్ని నమ్మినా, టెర్రరిజం యొక్క ముఖ్య ఉద్దేశం భీభత్సాన్ని సృష్టించి ప్రజల్లో భాయాందోళనల్ని కలిగించడం. వ్యవస్థమీద సామాన్యులకు అపనమ్మకాన్ని కలిగించటం.జీవితాల్లో దిగులు నింపి అసురక్షిత భావాన్ని కలిగించడం. ముంబై మారణహోమం నేపధ్యంలో వస్తున్న తెలుగు బ్లాగుల స్పందనల్ని చూస్తుంటే, తీవ్రవాదులు తమ ఉద్దేశంలో సఫలమైనట్లుగా అనిపిస్తోంది. ఆధునిక టెర్రరిజం యుద్ధం కాదు. అదొక ఉన్మాదం. ఉన్మాదాన్ని ఎదుర్కోవడానికి ప్రణాళికకన్నా, ఆత్మస్థైర్యం ముఖ్యం. అదే మనకిప్పుడుకావాలి. ముంబై పోలీసులూ, NSG కమేండోలూ అదే నిరూపించారు. మనకు దారి చూపించారు. టెర్రరిస్టులని చంపడంతోపాటూ వారి మూల ఉద్దేశాలను నిర్విర్యం చేసినప్పుడే గెలుపు మనవైపు నిలుస్తుంది.
ఇలాంటి పరిస్థితుల్లో మనం సురక్షితంగా ఉన్నామా? అనే ప్రశ్న ఉదయించడం సహజం. కానీ, ఆ అపనమ్మకం కలిగిందంటే తీవ్రవాదుల ఉద్దేశం సాకారమైనట్లే. ఒకవైపు వ్యవస్థవైఫల్యాలు తేటతెల్లంగా కనబడుతుంటే భయపడకుండా, దుగులుపడకుండా ఉండలేము. కానీ, మనలోని భయాన్ని మార్పుని ఆశించే ఆలోచనగా, మనలోని దిగులుని మార్పుకోసం పోరాడే నిర్ధిష్టమైన కోపంగా మార్చుకోవడం ఎంతో అవసరం. ఆ ఆలోచననీ, నిర్ధిష్టమైన కోపాన్నీ channelize చెయ్యడానికి తగిన ప్రాతిపదికని ఏర్పరుచుకోవడానికి ప్రయత్నిద్దాము.
ముంబై మారణహోమంలో మరణించిన సామాన్యులకూ, పోరాడుతూ ప్రాణాలు విడిచిన పోలీసులూ, కమెండోలకూ అశృనివాళి.
Saturday, November 29, 2008
దిగులు..భయం కాదు మార్పుకోరుకునే కోపం కావాలి !
****
Subscribe to:
Post Comments (Atom)
11 comments:
Your write up remainded me top executive speach of this country.
An immediate junior, Nissar, to one of our heroes ATS chief Hemant Karkare was talking to CNN IBN on TV, "Our boss was so encouraging, motivating. He told us just focus on our job, think that you are Indian and just fighting terrorism, whatever may be the form(religion)". Nissar could not control his tears. We all are safe because of these dedicated sons of our land.
Let us salute these people who are sacrificing their lives for our safety.
Not those with political leaders just say that "I came here to sacrifice my life to you, just give me power to reach Assembly/Parliament".
జోహార్లు..
హేమంత్ కమలాకర్ కర్కార్,
అషోక్ కాంటే
విజయ్ సలాస్కర్
సందీప్ ఉన్నికృష్నన్
ఇంకా అజ్ఞాత వీరులు…భరత మాత వీర పుత్రులారా.. జోహార్లు..
ఉగ్రవాదులారా మీరేమి చేయాలని వచ్చారో,ఏమి సాధించారో తెలియదు కానీ మాకు మాత్రం నిద్రాణమయిపోతున్న దేశభక్తిని తూటాలతో,బాంబులతో తట్టి లేపారు.భిన్నత్వంలో ఏకత్వాన్ని గుర్తుచేసారు.మేమంతా ఒకటే అని మమ్మల్ని విడదీయలేరనే నిజాన్ని రుజువు చేసారు.మీరేమి చేసినా మా ధైర్యాన్ని పోగొట్టలేరని నిరూపించారు.
పనిలో పనిగా మీ ఎడల మా నిర్లక్ష్యాన్ని, ఉపేక్షని, నిస్సిగ్గుగా రుజువు చేసారు.
ఇది కూడ మంచిదే మాకు ఇప్పుడయినా మేలుకుంటాము, నిద్రలేస్తాము,జూలువిదులుస్తాం,పంజా విసురుతాము,మిమ్మల్ని తుదముట్టిస్తాము.
ఇలాంటి ఉగ్రవాద శక్తుల్ని తుదముట్టించడానికి భారత దేశంలో ప్రతి ఒక్క పౌరుడూ పైన చెప్పిన వీరుల్ని ఆదర్శంగా తీసుకోవాలని ఆసిస్తూ..
కొసమెరుపు:
ఈ ఉగ్రవాదుల కన్నా వీళ్ళకి సాయం చేసిన ఇంటి దొంగలే భయంకరమయిన వాళ్ళు.ఎందుకంటే ఉగ్రవాదులు బయటనించి వచ్చి ఎదురుగా పోరాడారు..కనీసం ధర్మ యుద్ధమో?అధర్మ యుద్ధమో?..వీళ్ళకి సాయం చేసినా వాళ్ళే మనని నిజంగా దొంగ దెబ్బ తీసింది.తల్లి పాల్ల్లు తాగి ఆ రొమ్మునే కోసేస్తున్నారు..ఉగ్రవాదుల కంటే ఈ దొంగలే ప్రమాదకరమయిన వాళ్ళు. ఇలాంటి చీడపురుగుల్ని కనిపెట్టి నాశనం చేస్తేనే కాని ఇలాంటి విద్రోహాలకి అంతం ఉండదు..
దేశ పౌరులారా మేల్కోండి..నిద్రాణమయిన మీ శక్తిని మేల్కొలపండి.. ప్రచ్ఛన్న యుద్ధం మొదలయ్యింది..అంతం కాదిది ఆరంభం మాత్రమే..చేయి చేయి కలపండి..జాతి మొత్తాన్ని నిర్వీర్యం చేసే అరాచక శక్తుల్ని తుదముటింద్దాం కదలండి..అడుగు ముందుకు వేయండి.
బోలో భారత్ మాతా కి జై..అమరవీరులారా జిందాబాద్..వందే మాతరం..
ముంబై మారణ హోమంలో మరణించిన వారందరికి అశృనివాళి ...మహేష్ గారు మొదటి రోజు భయం వేసినా తరువాత పరిణామాలు చుస్తే, మనమే తెగింపుతో ఎదుర్కుంటే ,ముంబై పౌరులంతా హోటళ్ళ లోకి చొచ్చుకు పోయి టెర్రరిస్టులని హతమార్చాలి. "పోతే కొంతమంది పోతాము" అన్నంత కోపం వచ్చింది. ఉన్మాదాన్ని నిర్మూలించడానికి ప్రతి పౌరుడికి ఆత్మస్థైర్యం ముఖ్యం. ముంబై పోలీసులకు,ఎన్.ఎస్.జి కమెండోలకు జై .భరత మాతకు వందనం.
"ఆ అపనమ్మకం కలిగిందంటే తీవ్రవాదుల ఉద్దేశం సఫలమైనట్లే.." ఇవి గత నాలుగు రోజులుగా వింటున్న మాటలే! రాజకీయ నాయకుల మాటలు. మరి అలాగే మాట్లాడుతున్నారు మీరు!
అసలు ఈ సందర్భంలో భయం అంటే ఏమిటి? (చదువరి గారి బ్లాగులో చూశాను),ముంబై తర్వాత వాళ్ళు సరాసరి మనం ఉన్న నగరానికొచ్చి, మన పక్క బిల్డింగ్ లోనో, మనం వెళ్ళిన షాపింగ్ మాల్ లోనో కాల్పులో, పేల్పులో జరిపి మన ప్రాణాలు తీసేస్తారని వణికి చావడమా? ఇరాక్ మొదలైన మధ్య ప్రాచ్య దేశాలో ఒకప్పుడు వీధుల్లో మిలటరీ పోరాటాలు చూసి మన దేశం క్షేమకరమైన దని, ఆ దేశాల్లో ప్రజలు ఎలా బతుకుతారో అని ఆశ్చర్యపడిన మనం ఇవాళ వారి పరిస్థితిలో మనముండి అనుభవిస్తున్నాం.
ఈ పరిస్తితిలో భయమంటే? ఏమిటి భయమంటే? నిజంగా భయపడి వీధిలోకెళ్లడానికి వణికి చస్తూ, బయటికెళ్ళిన వాళ్ళు ఇంకా ఇంటికి తిరిగిరాలేదని దిగులు పడటమా?
"ఏమిటి? ఈ దేశం ఇంకో దేశపు తీవ్రవాదులకింత చులకనా? మన భద్రత బలహీనతల పైన ఇంత నమ్మకమా వారికి? ఇదేనా మనం మన భావి తరాలకందించాల్సిన వారసత్వం? ఇన్ని వందలమంది ప్రజల ప్రాణాలు ఉఫ్ మని ఊదేసే అధికారం వారికెవరిచ్చారు? మరణించిన వారి భార్యా బిడ్డల భవిష్యత్తేమిటి? ఎక్కడో రగులుతున్న అసంతృప్తి జ్వాలలకు వీరెందుకు బలి కావాలి?" ఇటువంటి ప్రశ్నల మధ్య ఉదయించిన ఆలోచనలు, ఆందోళనలు..అంతే!
భయమంటే కేవలం ప్రాణభయం కాదు. మీరు కేవలం దేశ ప్రజలందరూ ప్రాణ భయంతో వణుకుతున్నారని భావిస్తున్నారా?
పోలీసుల్నీ, ఏకంగా NSG కమెండోలనూ సాధారణ ప్రజలతో ఎలా పోలుస్తారు? అది వారి వృత్తిధర్మం! వారిలాగా ఆత్మస్థైర్యం అలవర్చుకోవడమంటే, ప్రత్యక్ష యుద్ధంలోకి ప్రజలంతా దిగాలా? పైగా ఉన్మాదాన్ని ఎదుర్కోడానికి ప్రణాళిక కూడా అక్కర్లేదంటున్నారు. ఇది అప్పటికప్పుడు పుట్టిన ఉన్మాదం కాదు. దశాబ్దాల నుంచి రగులుతున్న ఉన్మాదం!
తెలుగు బ్లాగర్ల స్పందన చాలా సహజంగా ఉంది.మానవీయంగా ఉంది.
ఇటువంటి panic condition లో కలిగేది(ఇంత దూరాన ఉన్నా కూడా) మొదట కలిగేది భయం, నిర్వేదం! అదే ఇక్కడ జరిగింది.
అంత మాత్రాన మనకెవ్వరికీ ఆత్మస్థైర్యం లేదని అనుకోనక్కర్లేదు. ఈ భయం,నిర్వేదం లోంచి "ఏం చెయ్యాలి? దేశాన్ని ఎలా కాపాడుకోవాలి?" అనే ఆలోచనలెప్పుడూ ఉదయిస్తూనే ఉంటాయి.
ఇప్పుడు కావలసింది కేవలం ఐక్యత! మతాలకతీతంగా కలిసి కట్టుగా నడవగలిగే ఐక్యత మాత్రమే ఇప్పుడు కావలసింది.
దిగులో, భయమో, కోపమో---అది ఆ సమయంలో వచ్చే ఓ భావన, దానికి మీరు ఏ పేరైనా పెట్టుకోండి, భావాలకి ముందస్తు ప్రణాళికలు, ప్రాతిపదికలు ఉండవు, ఇలాంటి భావాలే రావాలి ఇలాంటి అనుభూతులే కలగాలి అని నిర్దేశించనూలేము.
ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఓ మామూలు మనిషికి ముందస్తుగా కలిగేది భయమూ, దిగులే, అంటే ఇప్పటికిప్పుడు మనకేదో అవుతుందన్న భయం కాదు, ఇంకా ఇలాంటివి ఎన్ని చూడాలో అన్న భయం, ఎంతమంది అమాయకులు బలవుతారో అన్న దిగులు. ఇలా విచ్చలవిడిగా దాడులు జరుగుతుంటే భయపడకుండా దిగులు పడకుండా ఉండటం సామాన్యుల వల్ల కాదనుకుంటా. మనలో ఆత్మస్థైర్యం కావాలి నిజమే దాంతోపాటు మన వ్యవస్థలో పాలకుల్లో మార్పు రావాలి.
సుజాత గారు మీతో 200 % ఏకీభవిస్తాను. మీరు చాలా చాలా బాగా చెప్పారు. మీరన్నట్టు " ఈ దేశం ఇంకో దేశపు తీవ్రవాదులకింత చులకనా ?" ఇన్ని వందలమంది ప్రజల ప్రాణాలు ఉఫ్ మని ఊదేసే అధికారం వారికెవరిచ్చారు? మరణించిన వారి భార్యా బిడ్డల భవిష్యత్తేమిటి? ఈ ప్రశ్నలు చాలా భాదిస్తోంది.
ఇక ఇక్యత , మనలో ఉన్నా రాజకీయనాయకులు ఉండనివ్వరు అని నా అభిప్రాయం. మార్పు ముందు నాయకులలో రావాలి. తీవ్రవాద వ్యతిరేఖ దళాలకు స్వయం ప్రతిపత్తి ఉండాలి. రాజకీయాలను, పార్టీలను పక్కన పెట్టి దీనికి వ్యతిరేఖంగా పొరాడాల్సిన అవసరం ఉంది. ముంబాయి పోలీసుల వైఫల్యం అని మోడీ అంటే, గుజరాత్ వైఫల్యం అని మొయిలీ .. ఈవిధంగా ఒకరిమీద ఒకరు ఆరోపణలు చేసుకుంటుంటే ఇక సమస్య మూలాలలోకి వెళ్ళడం ఎలా.
బ్లాగరులు అందరూ సహజంగానే స్పందించారు. నా అభిప్రాయం కూడా ఇదే.
నిజమే..సుజాతగారన్నట్లు మనకి కావల్సంది ఆలో్చన.
అప్రమత్తతో వ్యవహరించాల్సిన సమయం.ఇది ప్రభుత్వ వైఫల్యమే కావచ్చు. కాని ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమవడానికి ప్రజలెంతవరకూ భాద్యులు అనేది మరో కోణం. నిజానికి అంత పెద్ద పెద్ద హోటళ్ళలో ఒక సాధారణ లగేజి స్కానర్ ఉండి ఉంటే...అన్ని వందల కేజీల ఆర్డీక్స్ ,మారణాయుధాలు లోపలికి చేరి ఉండేవికాదుగా...
నిజమే! దిగులెందుకు, అద్వానీ గారన్నట్లు 'నికమ్మా' ప్రధానీ, 'నికమ్మా టు ది పవర్ ఆఫ్ టెన్' హోంమంత్రీ, ఇతర కంత్రీలు పాలకులుగా ఉన్నంత వరకు ఇలాంటి దాడులు ఇంకెన్నో చూడాలి మనం. ఇప్పుడే అందరం బెంబేలెత్తిపోతే తీవ్రవాదుల లక్ష్యం ఠక్కున నెరవేరిపోయి పాకిస్తాన్ మదార్సాలన్నీ మూతపడిపోవూ!
అంచేత, భయపడిపోయి తీవ్రవాదుల లక్ష్యం నెరవేరడానికి దోహదపడే వారిని వదిలేసి, మీరు మాత్రం "ధైర్యంగా చావండ్రా " అని నినదించండి. ప్రజలకు చావు ధైర్యం నూరిపోసి తీవ్ర వాదుల తరువాతి మారణహోమాలకు సమిధలను సిద్ధం చేయండి. జిహాద్ వర్థిల్లనీ! మన దేశప్రజల ధైర్యాన్ని రక్తాక్షరాలతో లోకానికి చాటి చెప్పనీ! మన్మోహన్ సింగు ఫ్రాన్సు ప్రధాని ఎదుట సగర్వంగా తలెత్తుకొని తిరగనీ! మా కళ్ళలో నీళ్ళు ఇంకిపోనీ!
I wonder whether Bombay is still vulnerable. Both Rediff and Outlook suggest that Dawood had some part in providing the logistics. Part of Mumbai economy seems to be underground economy and from these reports, it seems that Dawood still wields influence there. Perhaps one way to root this out would be bring these folks in to main stream economy by controlling smuggling and providind opportunities in the main stream economy. Just one small suggestion.
"దిగులు, భయం కాదు మార్పుకోరుకునే కోపం కావాలి !" Could you tell me how to translate your words into action plan? I would like to know from you how to express anger for change? As an individual what you or anybody to do to avoid this kind of incidents other than discussing and writing articles. I am not criticizing or saying something like writing articles is wrong here. Other than these to options as a common man do we have any other options infront of us?
అదొక ఉన్మాదం. ఉన్మాదాన్ని ఎదుర్కోవడానికి ప్రణాళికకన్నా, ఆత్మస్థైర్యం ముఖ్యం. అదే మనకిప్పుడుకావాలి. ముంబై పోలీసులూ, ణ్శ్ఘ్ కమేండోలూ అదే నిరూపించారు. మనకు దారి చూపించారు.
If it happens first time what you said above will justifies the word "ఆత్మస్థైర్యం ముఖ్యం". But it already happend several times in this year itself.
టెర్రరిస్టులని చంపడంతోపాటూ వారి మూల ఉద్దేశాలను నిర్విర్యం చేసినప్పుడే గెలుపు మనవైపు నిలుస్తుంది.
How to nullify their intensions. Do you have any sugetions here.Can you throw some light on this. Share your thoughts Please.
Thanks in advance for publishing my openion in your blog.
Post a Comment