మందంగా ప్రవర్తిస్తే...
అది మత్తగజమైనా వ్యతిరేకిస్తాను
నా ప్రాణాల్నైనా పణంగా పెట్టి
అస్థిత్వాన్ని కాపాడుకుంటాను
అది ఏనుగైతే నాకేంటి?
కనీసం మొరిగైనా నా నిరసనను ప్రదర్శిస్తాను
అకారణంగా ఉరిమితే...
అది ఆకాశమైనా నాకు లెక్కలేదు
నా ఆత్మగౌరవాన్ని నేలకురాస్తే
నింగిపైనా కోపగిస్తాను
అది అందకపోతేమాత్రం వదిలేస్తానా?
కనీసం ఉమ్మైనా ప్రతీకారం చేస్తాను
పేదవాడికోపం పెదవికి చేటని
నోరుమూసుకుని కూర్చుంటానా?
అన్యాయం చెవి పోటెక్కేలా..
పెదవి చిట్లినా, రక్తమే కక్కినా
ఒక్క పొలికేకైనా పెట్టిపోనా!
****
27 comments:
>>...నింగిపైనా కోపగిస్తాను
>>అది అందకపోతేమాత్రం వదిలేస్తానా?
>>కనీసం ఉమ్మైనా ప్రతీకారం చేస్తాను`
...??? చెప్మా!!
కవిత బాగుంది.
ఆకాశం మీదకి ఉమ్మేస్తే అది మన మీదే పడుతుంది కదా మహేష్,
అందువల్ల కొంచం పక్కకి తిరిగో/ఒంగో ఉమ్మెస్తే మంచిదేమో అలోచించండి?
కవిత మీద శ్రీ శ్రీ ప్రభావం ఉన్నట్టుంది కొంచం..
@శ్రీనివాస్ పప్పు:రసపట్టులో తర్కం కూడదన్నట్లు, ప్రతీకారేఛ్ఛలో సాధికారమైన కసి తీరే ధ్యాస తప్ప ఉమ్మొచ్చి మీదపడుతుందనే స్పృహే ఉండదు.
కొత్త తరహా కవిత. కొన్ని వాక్యాలు మామూలుగా వాడకంలో వున్న అర్థానికి వెతిరేకార్థంలో వాడిన తీరు తమాషాగా వుంది.
ఏనుగు మీద మొరిగే కుక్క అల్పమైనది, మత్తగజం పట్టిచుకోవాల్సిన పనిలేదు అని వాడకం. మీరేమో పట్టిచుకున్నా పట్టిచుకోకపోయినా (మొరిగి) నిరశన ప్రకటించే తీరుతానంటున్నారు. అలాగే ఆకాశం మీద వుమ్మేయడం వృధా ప్రయాస దాని వల్ల ఆకాశానికి వొరిగేదేమీ లేదు, పై పెచ్చు అది మన ముఖం మీదే పడుతుంది అని కదా వాడకం.. మీరేమో పడినా ఫర్లేదు ప్రతీకారానికి వుమ్మనైనా వుమ్మాల్సిందే అన్నారు. భలే వుంది. (మీరు ఇదంతా తెలిసే వ్రాసి వుంటారు..!! చదివే వారికీ తెలియలి కదా..!!)
ఇలాంటి ప్రయోగమే సిరివెన్నెలగారనుకుంటా రుద్రవీణ చిత్రంలో "తరలి రాద తనే వసంతం" అనే పాటలో "వెన్నల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా" అంటూ అడవిని కాచిన వెన్నెల వృధాకాదన్నారు. ఏమైనా కత్తి లాంటి ప్రయోగం..!!
అరిపిరాల
http://palakabalapam.blogspot.com
http://hasyadurbar.blogspot.com
అనానిమస్సులందు సుఅనానిమస్సులు వేరయా!
కవిత మర్మాన్ని సోదాహరణంగా చెప్పారు. వారి అభిప్రాయమే నా అభిప్రాయం.
కవిత మంచి భావాలను పలికిస్తూంది.
ఆలోచనలను రేకెస్తుంది.
అరిపిరాల గారి వ్యాఖ్యానం బాగుంది.
"అనానీమస్సులందు సు అనానీమస్సులు.." బాబా గారూ..మీ ముద్ర వేశారు ఇక్కడానూ!
అన్నట్టు మొరగటం మేల్కొలిపే లక్షణం కూడా!
అసలు కామెంట్ ఇంకా రాలేదేంటి?
నేనిక సామెతలని తిరగ రాసే పనిలో ఉండాలి! మీ కవిత చాలాబాగుంది.
వామ్మో!
నాకు కవులంటే భయమ్. మా వినుకొండనిండావున్నారు.ఎప్పుడు దొరికినా ప్రమాదమే.బాగలేదంటే అయితే వీటిలో బాగున్నదేదో చెప్పుఅని ఇరవైకి తక్కువకాకుండా వినిపిస్తారు.పొరపాటున బాగున్నదీ అంటే నీప్రోత్సాహం నాకుత్సాహాన్నిస్తుంది చూడు మరొకటి వదులుతా అంటారు.
బాబాగారూ,
ఆ అజ్ఞాత నేనే స్వామీ...!! (కింద వ్రాశాను కూడా.!!)
ఆఫీసులో బ్లాగులు చూస్తుంటాం.. మన్సుకి హత్తుకుంటుంది.. లేదూ గుచ్చుకుంటుంది. వెంటనే వ్యాఖ్య వ్రాయాలనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం ఆఫీసులో లాగిన్ అవ్వలేము... మహేష్‌గారిలా అనామక వ్యాఖ్యలు అనుమతిస్తే ఇలా వ్రాయగలం... లేదంటే వ్యాఖ్యానించాలని వుండి వ్యాఖ్యానించలేక ఆ బాధ చెప్పలేము... (వర్డ్ ప్రెస్సులో ప్రస్తుతానికి ఆ ఇబ్బంది లేదు..!!)
చాలా చాలా బావుందండీ!! ప్రతీకారేఛ్చని ఈ లెవల్లో చెప్పిన రాతలేవీ నేనింతవరకూ చదవలేదు.. Too good!
"అనానీమస్సులందు సు అనానీమస్సులు.."...
అద్భుతంగా చెప్పారు బొల్లోజు బాబా గారూ.
సూపర్ మహేష్‌గారు
చాలాబాగా రాసారండి.కసి కనిపిస్తుంది కవితలో :) నిజమే ఒక్కోసారి అనిపిస్తూ వుంటుంది రాబోయే ప్రమాదాలు ఏమయినా ఈసారి నేను చెయ్యాలనుకున్నది చేసెయ్యాలి అని.ఇంతకీ సుజాత గారు ఎవరి గురించి ఎదురుచూస్తున్నట్టు?
ప్రతీకారం చేస్తాను.
ప్రతీకారం తీర్చుకుంటాను అనుండాలేమో?
బాగుంది.
చదివాక ఎందుకో పోస్ట్ చెయ్యాలనిపించింది.
ఈ క్రింది సంభాషణ, "pursuit of happiness" సినిమాలో
తండ్రి కొడుకుతో మాట్లాడే సన్నివేశంలోనిది.
Don't ever let anyone tell you that you can't do something. You have got a dream and you have to protect it. People can't do something themselves and they will tell you the same. If you want something, go get it.
Good One Mahesh
chaalaa baagundi
నాలోనూ ఎప్పుడూ ఇలాంటి భావాలే ఉప్పొంగుతూ ఉన్నా.నేను రాసుకున్న కవితల్లో కంటే మీ మాటల్లో ఆ నిరసన చాలా బాగా ద్వనించింది.
I like it very much.
కత్తి లాంటి కవిత!మహేష్‌గారు,ఇలాంటి ప్రయోగం కొత్తగా వుందండీ.
బ్లాగ్కవులు ఎక్కువైపోతున్నారు. నాలాంటి వాళ్లు మైనారిటీలవుతున్నారు.
కత్తి మహేష్ కుమార్ said...
"కనీసం ఉమ్మైనా ప్రతీకారం చేస్తాను".
ప్రతివొక్కరికి "క్షమించె" గుణం ఉందాలి కదా!. ఎవరినా "ప్రతీకారం" తొ సాదించెదెమిటి.
Cool down my friend. Remember Jesus who loves everyone.
ఉదయాన్నే నా కళ్ళలోకి అరుణం తెచ్చారండీ. ఒక్కసారిగా, కన్నెగంటి హనుమంతు గుర్తుకొచ్చాడు. ఎందుకంటే ఏం చెప్పలేను కాని.
It is a nice poem.
I think we lost the fire to express ourselves, in this consumer world we are driven by unknown forces, and it is fact that our lives were affected by the people whom we ever seen and spoke with them. Life became a hunt for existence. We are not really enjoying what we are doing, in this race winning has priority and name, our values and morals have gone. We don't know why we are running, do we ever stop, and ever we look back why we are running all the time. Are we are running... for Satyam, American companies...why are craving for corporate culture, which is blind to human values. It is face is filled with alcohol and sex. But they have name and have news in news papers, cinemas about them, and publicity in TVs....they are everywhere...bustards.
Common man never has history and we are stop talking about them....
చరిత్ర హీనులు
ఆయస పడుతూ అయస్సు పోసి
జో కొట్టి జోల పాడి
పుస్తెనమ్మి పస్తులుండి
మెతుకు కోసం బతుకు నమ్మిన
నా తల్లులు చరిత్ర హీనులు
.................
సు .. అనానిమస్సు అంటే గుర్తొచ్చింది.
మొన్నే కంత్రీ సినిమా చూశ .. ఎందుకులే, రివ్యూ రాయడం కూడ వేస్టు. కానీ, ఒక పాటలో వయస్సునామీ అనే ప్రయోగం చాలా నచ్చింది.
హెహెహె excellent
Post a Comment