సాహితీ ఝరి - నా హృదయ మంజరి లో...
కులాల గురించి జరిగే చర్చల్ని మూడు విభిన్న భాగాలు విభజిస్తేగాని అర్థవంతమైన చర్చ జరగదని నా అభిప్రాయం.
1.సామాజిక విభజనగా కులాలు- కులవివక్ష
2.కులప్రాతిపదికన ప్రత్యేకహోదా - రిజర్వేషన్లు
3.రాజకీయ అంశంగా కులం - politics of representation and rhetoric.
మీ అతర్మధనంలో మరియూ చాలా వరకూ జరిగే చర్చల్లో(మీ టపాకొచ్చిన వ్యాఖ్యల్లోకూడా) ఈ మూడింటినీ కలగలిపి మాట్లాడేస్తుంటారు. అందుకే అవి ఎప్పటికీ తెగే చర్చలు కావు.
పైన చెప్పిన మూడింటికీ మూలాలు కులమే అయినా వాటి manifestation,విస్తృతత్వం,రూపం,అవసరం చాలా విభిన్నమైనవి అందుకే ఒకేగాటన కట్టదగినవి కావు.ఒకే స్థాయిలో బేరీజు చెయ్యదగినవీ కావు.అందుకే వాటిని ప్రత్యేకంగానే చర్చించాలి.
1.సామాజిక విభజనగా కులాలు- కులవివక్ష:
కులవ్యవస్థ ఏలా ఏర్పడింది అనే దానికి ఖచ్చితమైన సమాధానాలు లేవు.కాకపోతే భారతదేశ చరిత్ర మొదలైనప్పటి నుంచీ కులప్రస్తావన ఉందిగనక అది హిందూమతంలోంచీ పుట్టిన వ్యవస్థగా అనుకోవాలి.ఇక మతపరంగా "జన్మనా జాయతే.." లాంటి ప్రస్తావనతో అది రూఢిగా తెలుస్తుంది. ఇక ఎవరు ఎక్కడ్నించీ(ఏఏ భాగాల్నుంచీ) పుట్టారో చెప్పే జుగుప్సాకర సిద్ధాంతం ఉండనేవుంది.
ఇవన్నీ పక్కనబెట్టి కులాలు కేవలం పనులవల్ల వచ్చాయనుకుంటే వివక్ష ప్రస్తావన వచ్చుండేది కాదు. కాబట్టి మతమూలాన్ని అంగీకరించక తప్పదు.మతమూలాల పరంగా చూస్తే advantageous పనులున్న మైనారిటీ కులాలు మెజారిటీ అయిన మిగతాకులాలపై ఆధిపత్యాన్ని చలాయించడానికి దేవుడిపేరు చెప్పి వివక్ష మొదలెట్టారని నమ్మకతప్పదు.
ఇక శూద్రులకన్నా అధమమైన పంచమకులాన్ని తమ అసహ్యాన్ని తెలియజెప్పేందుకు సృష్టించారు.Dignity of labour ని ఎలాగూ కులవ్యవస్థ గుర్తించలేదు,కానీ మాలిన్యాన్ని శుభ్రంచేసే కులాల్ని మరింత దిగజార్చి అస్పృశ్యుల్ని(అంటరానివాళ్ళని) చేసారు.
అంటరానితనం అన్ని మూలాల్లోకీ చొచ్చుకునివెళ్ళింది. విద్య,వైద్యం,సామాజిక-ఆర్ధిక ప్రగతి అన్నింటిలోనూ అంటరానివారు అంటరానివారుగానే మిగిలారు.కొన్ని వేల సంవత్సరాలు ఈ వివక్ష నడిచింది.కులహింస గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే హిందూ మతానికి అంత మంచిదని నా అభిప్రాయం. తెగిన నాలుకలూ,చెవిలో సీసాలూ,తెగనరికిన తలలూ ఆ కులాల్లో నమోదుచేసే నాధుళ్ళు లేక లెక్కలు లభ్యంగా లేవు. ఒకవేళ ఎవరైనా లెక్కకట్టుంటే పరిస్థితి ఇప్పుడు మరింత ప్రమాదకరంగా తయారయుండేదేమో. కాబట్టి ఈ విధంగా హిందూమతం తనకు గొప్పసేవే చేసుకుంది.
19 వశతాబ్ధపు ప్రారంభంలో కొందరు జ్యోతీబా ఫూలే వంటి సంఘసంస్కర్తలు "మనిషిని మనిషిగా చూడాలనే" ఒక చిన్న (కొందరికి తప్పుడు) పాశ్చాత్యధోరణిని దొరకబుచ్చుకుని నిమ్నకులస్తుల్ని ముఖ్యంగా అప్పటికి శూద్రులతొ సహా అన్ని చాతుర్వర్ణాల ఆభిజాత్యాహంకారాన్ని అనుభవిస్తున్న పంచముల్ని ఉద్దరించాలని కంకణంకట్టుకున్నారు.కనీసం పూర్తి వివక్షను కాకున్నా "అంటరానితనాన్ని" రూపుమాపే ప్రయత్నం చేసారు.
స్వాతంత్ర్యపోరాట సమయానికి సంఘసంస్కర్తల ప్రయత్నం.కులాన్ని సరిగ్గా అర్థం చేసుకోని ఇంగ్లీషు పాలకుల పుణ్యమా అని పంచములు అక్కడక్కడ బహుకొద్దిమంది కాస్తోకూస్తో ఆధునిక విద్యను అభ్యసించారు.మనుషులమనే చైతన్యం వచ్చింది.తక్కువచేసి చూడబడుతున్నారనే భావన జాగృతమయ్యింది. కానీ పోరాడే శక్తిలేదు.ఎదురుతిరిగే వనరులు లేవు.
స్వాతంత్ర్యోద్యమంలో గాంధీ ప్రవేశించాడు. అప్పటివరకూ కేవలం అగ్రకులాల్లో మాత్రమే వున్న స్వాతంత్ర్యాకాంక్ష జనబాహుళ్యానికి విస్తరించకపోతే లాభం లేదనే రహస్యాన్ని గ్రహించాడు.స్వాతంత్ర్యోద్యమం విసృతమయ్యింది.మిగతాకులాలు కలిసాయి. అంటరానివాళ్ళనికూడా "హరిజనులు" అని పేరుపెట్టి కలుపుకునే ప్రయత్నం చేసాడు. కానీ అగ్రకులాల్లో విపరీతమైన నిరసనభావం రగిలింది. సామాజిక న్యాయంకన్నా దేశస్వతంత్ర్యం ముఖ్యమనుకుని తన తీవ్రతని తగ్గించాడు.
ఈ పరిణామక్రమంలో కులపోరాటాన్ని దేశస్వతంత్ర్యంకన్నా అతిముఖ్యమనుకున్నాడొక పంచమ కులస్తుడు.అతని పేరు భీంరావ్ అంబేద్కర్.తనప్రజల సామాజికస్వతంత్ర్యానికి పాటుపడుతూనే దేశస్వతంత్ర్యానికీ తనదైన సేవచేసాడు. పోరాటాలు సాగాయి. గుళ్ళలోకి ప్రవేశం. తాగే నీళ్ళకోసం పోరాటం.అస్పృస్యతకు వ్యతిరేకంగా నినాదం ఎన్నో జరిగాయి. అయినా వివక్ష పోలేదు.
స్వతంత్ర్యం వచ్చింది.అంటరానితనం ఒక నేరంగా పరిగణించబడింది.అగ్రకుల అధికారులు.అగ్రకుల అనుకూల సామాజిక-ఆర్ధిక-రాజకీయరంగాలు చట్టాన్ని అమలు చెయ్యలేదు.మళ్ళీ పోరాటాలు..మళ్ళీ పోరాటాలు. ఇప్పటికీ పోరాటాలు.
హరిజనులు తమల్ని తాము "దళితులు" అనుకున్నారు. వివక్ష మాత్రం మరింత sophisticated రూపాన్ని సంతరించుకుంది.పల్లెల్ని దాటి పట్టణాల్లో నాగరికత విస్తరించిన నగరాల్లో ప్రవేశించింది. మరిన్ని రంగాల్లో విస్తరించింది.విద్య,ఉద్యోగం,రాజకీయం అన్నిఅన్ని రంగాల్లోనూ ఎదో ఒకరూపంలో ప్రవేశించింది.పుట్టుకలొ చావులో..పెళ్ళిలో తద్దినంలో అన్నింటిలోనూ వివక్ష ఇంకా ఏదో ఒకమూల సాగుతూనే ఉంది.
దళితులపై హింస...అస్సలు తగ్గలేదు.2006 లో 27,070 కేసులు, 2007లో 30,013 కేసులూ భారతదేశంలో నమోదయ్యాయి. ఇవి కేవలం నమోదైనవి మాత్రమే.నమోదుకానివి లక్షల్లొ వుంటాయని అంచనా.
1)రివర్స్ కుల వివక్ష ఆమోద యోగ్యమా మొరల్గా? 2) కులాలను రూపు మాపగలమా?
ఏది ఏమైనా సమస్య చరిత్ర తెలీకుండా సమాధానం కష్టం కాబట్టి నా మునుపటి వ్యాఖ్యని భూమికగా భావించండి. ఆ నేపధ్యంలో నేను మీ ప్రశ్నలకు సమాధానాలు వెతకడానికి ప్రయత్నిస్తాను.
1.రివర్స్ కులవివక్ష ఆమోదయోగ్యం కాదు.ఒకప్పుడు చిన్నచూపు చూసారని, ఇప్పుడు చూస్తున్నారని అగ్రవర్ణాలపై కక్షగట్టడం సిద్ధాంతరీత్యా దళిత స్పూర్తికి విరుద్ధం.కష్టాలు పడినవాడు అదే కష్టాల్ని ఎదుటివాడికి పెట్టాలనుకోడు.కానీ,అందరి వ్యక్తుల స్పందన సిద్ధాంతాల్ని అనుసరించి ఒక్కలాగే ఉండకపోవచ్చు.ఇది అగ్రవర్ణాలకు కూడా వర్తిస్తుంది.
ఉదాహరణకు..రిజర్వేషన్ విధానం ద్వారా సీటుకోల్పోయిన అగ్రవర్ణవిద్యార్థి కి ఒక victim లాగా ఫీలయ్యే అధికారం ఉంది.ఈ విధానం వల్ల తన rightful seat కోల్పోయాననే ఆక్రోశం అతని అధికారం. కానీ తన వ్యక్తిగత ఆక్రోశాన్ని ‘వ్యవస్థలోపం’ లేక ‘విధానపరమైన అన్యాయం’ అనే హక్కు అతనికి లేదని గుర్తించ గలగాలి. ఎందుకంటే విధానం ఒక విస్తృత సామాజిక న్యాయానికి సంబంధించిన నమూనా. అందులో కొందరు వ్యక్తులకు అన్యాయం జరిగిందా అనేకన్నా,సమాజానికి న్యాయం జరిగిందా అనే కొలమానమే సరైనది.చాలా వరకూ చర్చల్లో ఈ రెంటిమధ్యా తేడా గుర్తించక దాన్ని వివక్ష అని అపోహపడే ప్రమాదం మెండుగా ఉంది.చాలా వరకూ జరిగేది అదే.రివర్స్ వివక్షగా భావిస్తున్నవాటిల్లో ఇలాంటివే ఎక్కువ.
అగ్రవర్ణాల ప్రజలను వివక్షకు గురిచేసే స్థితికి దళితులు ఇంకా చేరలేదని నా అభిప్రాయం. ఒకవేళ ఆ స్థితికి చేరినా వివక్షకు గురిచేసే మానసికత రాదనే నా నమ్మకం.సైధాంతిక విభేధాలూ,రాజకీయ rhetoric సందర్భాలలో "బ్రాహ్మణత్వాన్ని" తెగిడే దళితులు కనిపిస్తారేమోగానీ బ్రాహ్మణుల్ని కాదు. "అగ్రవర్ణభావజాలాన్ని" ధూషించే దళితులు కనిపిస్తారేగానీ అగ్రవర్ణాల ప్రజల్ని కాదు. ఈ రెంటిమధ్యాగల తేడాని గుర్తించలేని వారు అపోహల్ని సృష్టించడంలోనూ,అపొహల్లో జీవించడంలోనూ,అపొహలకి విస్తృత ప్రాచుర్యం కలిగించి ఉద్యమంపట్ల భయాన్నీ,తమ ప్రజల్లో insecurity ని సృష్టిస్తారేతప్ప, సమస్యకు సమాధానం దిశగా contribute చెయ్యలేరు.
2)కులాలను రూపుమాపలేము. చాలా అభ్యంతరకరంగా అనిపించినా అదే నిజం. కులం ఇప్పుడొక రాజకీయ ఆయుధం.సామాజిక అస్థిత్వంలో భాగం.కాబట్టి కులాన్ని నిర్ములించడం సులభం కాదు. దాదాపు అసాధ్యం కూడా.
మనమిప్పుడు సంధిగ్ధమైన సమయం(conflicting times)లో జీవిస్తున్నాము. దళితుల్లో "అన్యాయమైపోయాము" అనే స్పృహ చైతన్యవంతమయ్యింది. ఆ అన్యాయానికి సమాధానాలు వెతికేప్రయత్నంలో ఘర్షణ తప్పదు.ఇప్పటిదాకా ప్రశ్నించేవారు లేరు కాబట్టి వ్యవస్థ status-quo లో ఉంది. ఇప్పుడు సంతులన(equilibrium)దెబ్బతినింది. మళ్ళీ even out అవ్వడానికి సమయం పడుతుంది. అది ఎప్పుడు జరిగేనో ఈ సమాజానికున్న shock absorbers మరియూ రాజకీయవిధానాల్ని బట్టుంటుంది.
ఆ సమయం కోసం శాంతినీ సమానత్వాన్నీ కోరుకునే అందరూ ఈ సమస్యను అర్థం చేసుకుని సమాధానాల్ని వెతికే దిశగా ప్రయత్నించాలి.
కలగూరగంప లో...
కులరహిత హిందూ సమాజాన్ని నేను కాంక్షించినా, ప్రస్తుత రాజకీయభావజాలం నేపధ్యంలో అదొక utopia క్రిందనే అనిపిస్తోంది. అందుకే కనీసం కులవివక్షరహిత సమాజం కోసం పాటుపడటంలో అర్థముందనే భావన నాది.అంతమాత్రం చేత కులాల పరిధులను దాటి ఆలోచించనట్లు కాదు. కులాన్ని ప్రాతిపదికగా చేసుకుంటూనే,ఒక అర్థవంతమైన శాంతీయుత సమాజనిర్మాణం సాధ్యమయితే కులం per se is not an issue అని నమ్ముతాను. ఈ ఆలోచనాపధంలోకూడా నేను అంగీకరించేవీ, విభేధించేవీ చాలా ఉన్నాయి.Ideology కన్నా మనుషులు ముఖ్యమనుకునే నాకు వ్యక్తుల సుఖశాంతులు ముఖ్యం.Happiness and peaceful coexistence of humanity is an issue for me not the existence of caste in itself.
Monday, January 5, 2009
కులం చర్చల్లో నేను...
****
Subscribe to:
Post Comments (Atom)
13 comments:
కొంత చెప్పె ప్రయత్నం చెసారు కానీ , ఈ విషయం లొ మీరు ఇంకా లొతుగా చర్చించవలసిన అవసరం వుంది , ఇక కులరహిత సస్మాజం గురించి మీ ఆశలు ఇక నెరవెరె అవకాసం లెదు
అగ్రవర్నాలు ఒప్పుకున్నా నిమ్న కులాలు ఇందుకు ఒప్పుకొవు ఎందుకంటె వారికి అందుతున్న అనెక సౌకర్యాలు అందకుందా పొతాయి , దలిత ముసుగులొ వారికి దొరుకుతున్న రక్షన ( తప్పుడు పనులు చెసాక తప్పించుకొవదానికి ) ఆ పైన దొరకదుగా ,
ప్రతి ఒక్క దలితుడూ మంచివాదు అని అనుకొలెము , ఎందుకంతె అవకాసం వస్తె వీరు తమకన్నా క్రింది వారిని అనగదొక్కె ప్రయత్నం చెస్తారు ఉదాహరనకు మాలలు మాదిగలను తక్కువ చూపు చూస్తారు , నా స్నెహితుదొకదు మాల కులానికి చెందినవాదికి బ్రాహ్మన అమ్మాయిని చెసుకొవాలని కొరిక , అమ్మాయి అందం గా లెకున్నా , చదువులెకున్నా ఆమెను చెసుకొని సామాజికం గా తన స్తాయిని పెంచుకొవాలని కొరిక , ఇంకూ అబ్బాయి మంగలి , కానీ కమ్మ అనిచెప్పుకొంతూ వుంతాడు ఇది ఏరకమైన భావజాలమొ నాకు తలీదు , మీకు తెలెస్తె చెప్పగలరు
కులం చాలా చద్ది టాపిక్ అయి పోయిందండి! ఇక దీనిగురించి చర్చించడం కొంత కాలం ఆపేస్తే ఎలా ఉంటుంది?
@సుజాత: నిజమే! కానీ కొన్ని టపాల్లో నేను కష్టపడి రాసింది ఎక్కడైనా వెళ్ళిపోతుందని ఇక్కడ అంటించాను అంతే తప్ప మళ్ళీ కొత్తగా చర్చించడానికి కాదని గమనించగలరు.
కులాలు పోవు అని మరీ నిరాశ చెందనవసరం లేదు. చాలా మార్పు వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ల వలన చాలా ఫలితం రావాల్సి ఉండి అది ఎలా మిస్ అయ్యిందో నేను ఒక పోస్టు రాస్తాను.
మార్కులు కొలమానంగా ఉన్న మన విదా వ్యస్థలో మెరిట్ అనేది ఎక్కువగా డబ్బులు పెట్టి, ఎక్కువగా సౌకర్యాలననుభవిస్తూ చదివే వాళ్ళతో పోలిస్తే నిమ్న కులాలవాళ్ళకు గ్రామీణ ప్రాంత విదార్ధులకు తక్కువ మార్కులు రావడం సహజం. అంచేత వాళ్ళలో ప్రతిభ లేదనే మెరిట్ వాదులది తప్పు.
ఉదోగానికి,జీవితానికి పనికొచ్చేది ఇనీషియేటివ్, క్రియేటివ్ మైండ్. దానికీ మార్కులకూ ఏ సంబంధమూ లేదు. వివరాలు ఒక పోస్టులో రాస్తాను.
you made your views at many places. you would have brought all of them to here that could be a holistic perception of your personality.
good attempt
with best wishes
i recently thought of collecting all my comments in different blogs (excluding bagunddi/good/fine etc) and post as a separate post under the heading 2008 comments.
you always become pioneer to many. isnt it. :-)
మహేష్ గారు, టపా బాగుంది.. కొన్ని ఆమోదయోగ్యం కానివి ఉన్నయి ఎప్పటిలానే. :)
1) "కులహింస గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే హిందూ మతానికి అంత మంచిదని నా అభిప్రాయం."
అసలు మానవజాతి ఒక సంఘ జీవనం గా ఏర్పడ్డ నిర్మాణం నించే వివక్ష, అగ్ర/నిమ్న, ఎక్కువ-తక్కువ అనే తేడాలు పుట్టుకొచ్చాయి..దేశ, ప్రాంతలతో సంభందం లేకుండా. మహా అయితే వివక్ష తీరులో భేదమే కానీ అసలు వివక్ష లేని సంఘం గానీ, సమాజం గాని లేదు. అయితే కాలక్రమేణా ఏర్పడ్డ మతాలు, జాతులలో ఇవి అంతర్భాగమయ్యాయి. దీనిలో భాగం గానే హిందూ మతం లో కూడా ఇవి కులాల రూపం లో ప్రవేశించాయి. ఇది చెప్పటం యొక్క ఉద్దేశ్యం వివక్ష అనేది హిందూ మతానికే పరిమితమైన అంశం అనే ఆలోచనలు, అపోహలు ని వివరించటం, కుల వివక్షలంటూ హిందు మతాన్ని నిరంతరం విమర్శించే వారికి వివరణ ఇవ్వటం కోసమే కానీ సమర్ధించటం కోసం కాదు.
"ఇక ఎవరు ఎక్కడ్నించీ(ఏఏ భాగాల్నుంచీ) పుట్టారో చెప్పే జుగుప్సాకర సిద్ధాంతం ఉండనేవుంది."
మన ఆలోచనల దృక్కోణం కొంచెం మార్చితే, మనం దైవం యొక్క పాదాలకే మొదట మొక్కుతాం, అలా చూస్తే వారికి ఎంతో ఉన్నత స్థానం కల్పించినట్లౌతుంది. కానీ ఆచరణలో జరగలేదులెండి.
2) "హరిజనులు తమల్ని తాము "దళితులు" అనుకున్నారు. వివక్ష మాత్రం మరింత sophisticated రూపాన్ని సంతరించుకుంది.పల్లెల్ని దాటి పట్టణాల్లో నాగరికత విస్తరించిన నగరాల్లో ప్రవేశించింది."
మీరు ఈ sophisticated వివక్ష ని కొంచెం విశదీకరిస్తారా? వ్యక్తిగతం గా మనసులో భావించే వివక్షలు కాదు, రాజ్యాంగ పరంగా వారిని ఏం వివక్షకి గురి చేస్తున్నారో చెప్పాలి. వ్యక్తిగతం గా వారు కూడా చాలా చూపిస్తున్నారు. అగ్రవర్ణాల పట్ల ద్వేషభావాన్ని. ఇంకా కొన్ని సంధర్భాలలో బహిరంగంగా కూడా చేస్తారు. BC నాయకుడైన ఆర్.కృష్ణయ్య పప్పు తినేవాళ్ళు, నెయ్యన్నం తినేవాళ్ళు అంటూ టి.వి లలో పత్రికలలో వ్యాఖ్యానిస్తారు. మంద కృష్ణ ఎప్పుడూ తిడుతూనే ఉంటారు. అగ్రవర్ణాలు ఎదురు కూడా చెప్పలేకపొతున్నారు.
3) "రిజర్వేషన్ విధానం ద్వారా సీటుకోల్పోయిన అగ్రవర్ణవిద్యార్థి కి ఒక victim లాగా ఫీలయ్యే అధికారం ఉంది.ఈ విధానం వల్ల తన rightful seat కోల్పోయాననే ఆక్రోశం అతని అధికారం. కానీ తన వ్యక్తిగత ఆక్రోశాన్ని ‘వ్యవస్థలోపం’ లేక ‘విధానపరమైన అన్యాయం’ అనే హక్కు అతనికి లేదని గుర్తించ గలగాలి. "
ఇది అవాస్తవం. మన రాజ్యాంగ స్పూర్తి 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అని. అలానే సామాజిక శ్రేయస్సు అంటూ వ్యక్తులని బలవంతం గా త్యాగాలు చెయ్యమనటం కూడా మన రాజ్యాంగ స్పూర్తి కి వ్యతిరేకం. సమాజం అంతా వ్యతిరేకిస్తున్నా కూడా ఒక వ్యక్తి స్వేచ్చ నీ న్యాయబద్దం గా, నైతికంగా అందాల్సిన అవకాశాలని, హక్కులని హరించటం మన రాజ్యాంగం అనుమతించదు. ఇది అచ్చంగా నా మాట కాదు. జయప్రకాష్ నారాయణ్ ఒక సంధర్భం లో చెప్పిన మాటల్నే ఇక్కడ వ్రాశా. కాబట్టి మీరు ఒక చక్కని వాక్య నిర్మాణంతో విస్తృత సామాజిక న్యాయమే కొలమానం, రివర్స్ వివక్ష అపోహ మాత్రమే అని కన్విన్సింగా చెప్పినప్పటికి ఏ నాగరిక, ప్రజాస్వామ్య దేశంలోనూ ఇలాంటి చట్టం, వ్యవస్థ ఆమోదయోగ్యం కాదు..కాదు..కాదు.
4) "సైధాంతిక విభేధాలూ,రాజకీయ rhetoric సందర్భాలలో "బ్రాహ్మణత్వాన్ని" తెగిడే దళితులు కనిపిస్తారేమోగానీ బ్రాహ్మణుల్ని కాదు. "అగ్రవర్ణభావజాలాన్ని" ధూషించే దళితులు కనిపిస్తారేగానీ అగ్రవర్ణాల ప్రజల్ని కాదు. "
అగ్రకులాల వాళ్ళు అంటూ, ఏ మొహమాటాలు లేకుండా వ్యక్తులని విమర్సిస్తారు. "ఏం పంతులూ" అంటూ వెటకారాలు చేస్తారు. కానీ మీకు ఇదంతా బ్రాహ్మణత్వాన్నే కానీ బ్రాహ్మణులని కాదనిపిస్తుంది. ఇన్నయ్య లాంటి దళిత మేధావులు కూడా ఎన్నో సంధర్భాలలో అగ్రవర్ణాలని అకారణంగా విమర్శిస్తారు. వారికి లేని వివక్షలు కూడా అంటగట్టే ప్రయత్నం చేస్తారు. ఉదాహరణకి హర్భజన్, సైమండ్స్ వివాదం గురించి CNN IBN చర్చలో బ్రాహ్మణులు నలుపు రంగు పట్ల వివక్ష చూపేవారని, చివరకు జంతువుల విషయంలో కూడా ఈ తరహ వివక్ష ఉండేదని, ఆవు తెల్లగా ఉంటుంది కాబట్టి పూజించేవారని, గేదె నల్లగా ఉంటుంది కాబట్టి దాన్ని ఇతర అవసరాలకి మాత్రమే వాడుకుంటారని అన్నారు. నిజానికి కర్రి ఆవుని బ్రాహ్మణులు చాలా పవిత్రంగా భావిస్తారన్న విషయం ఇన్నయ్యకి తెలీదా? ఇలాంటి విద్వేషాలు పెంచేది ఎందుకోసమో వారికే తెలియాలి.
"అపొహలకి విస్తృత ప్రాచుర్యం కలిగించి ఉద్యమంపట్ల భయాన్నీ,తమ ప్రజల్లో insecurity ని సృష్టిస్తారేతప్ప, సమస్యకు సమాధానం దిశగా contribute చెయ్యలేరు."
కులవివక్షలకి వ్యతిరేకంగా అగ్రకులాల వారు contribute చెయ్యలేదనా మీ అభిప్రాయం? నాకు ఆ వాక్యం కొంచెం అర్ధం కాలేదు. ఒకవేళ అదే మీ ఆలోచన ఐతే దళిత ఉద్యమాలు ఈ స్థాయి లో కూడా ఉండేవి కాదని గ్రహించండి.
మహేష్ గారు,
మనిషి స్వభావం ఏంటంటే పక్కవాడికంటే తనే గొప్ప అనుకోటం. అది ఒక మతానికో, కులానికో సంబంధించిన జాఢ్యం కాదు. మనుషులందరికీ సంబంధించింది. కులం, మతం నిర్మూలించినంత మాత్రాన మనుషుల మధ్య తేడాలు లేకుండా పోవు. కాబట్టి వైవిధ్యం తప్పు అనలేము, వివక్ష తప్పు. వివక్ష ఎవరు, ఎవరి విషయం లో చూపినా అది ముమ్మాటికీ తప్పే.
Rekha Garu,
"మనిషి స్వభావం ఏంటంటే పక్కవాడికంటే తనే గొప్ప అనుకోటం. అది ఒక మతానికో, కులానికో సంబంధించిన జాఢ్యం కాదు".
The above sentence is the only reason for many of our problems.
కత్తి గారి లాంతి సొ కాల్ద్ మెధావులు కొత్తగా చెప్పె దెమీ వుండదు , వీరు అక్కడక్కడ కొందరు రాసిన విషయాలను తీసుకొని దానిని కొంత మార్చ్చి , అన్నీ కలిపి పులుసు చెసి , మనకు వడ్డిస్తున్నారు , అయ్య్యా మల్లీ ఈ పాత చినకాయ పచ్చడి ని మానండి , అంబెద్కర్ రాసిన రచనలు వీల్లకు డిక్షనరీలు ,దురద్రుస్తం ఏమిటంటె వీల్లు అంతకు మించి ముందుకెల్లి ఆలొచించరు , ఎంతసెపూ రకరకాల ముసుగులలొ అగ్రవర్నాలను విమర్సించదం , ఈ కత్తి మహెష్ కుమర్ కత్తి పద్మారావుకి భందువేమొ నాకు తలియదు కానీ , అతనూ ఇలాగె అవసరమున్న లెకున్నా కమ్మ వారిని విమర్సించదం , ఎంతసెపూ వారిని ఆడిపొసుకొవడం తప్పితె మరొపని లెదు , ఇవ్వాల టి.వి ఇంతర్యూ లొ అతను అన్నాదు , బంజారా హిల్స్ లొ వున్న వాల్లను ఖాలీ చెయించి ఆ స్తలాలను పెదవాల్లకు అప్పగించాలంత , ఇంతకంతె హాస్యాస్పదం మరొతి వుండదు , సొషలిజం అనెది నేడు ఫ్యాషన్ గా మారింది ,
@Balla Sudhir
"దురద్రుస్తం ఏమిటంటె వీల్లు అంతకు మించి ముందుకెల్లి ఆలొచించరు , ఎంతసెపూ రకరకాల ముసుగులలొ అగ్రవర్నాలను విమర్సించదం , అతనూ ఇలాగె అవసరమున్న లెకున్నా కమ్మ వారిని విమర్సించదం , ఎంతసెపూ వారిని ఆడిపొసుకొవడం తప్పితె మరొపని లెద"
అలా ముందుకెల్లి అలోచించటానికి అధికారం, ఆస్తులు, పరిశ్రమలు వుండాలి కద ఆ రెండు కులాల వాళ్ళ లాగ. ఇవి లేకే మహేష్ అఫ్పుడుడ్డప్పుదు అభ్యుదయపు కేకలు పెడుతుంటారు. మీరు అది తప్పంటె ఎలా?
"సొషలిజం అనెది నేడు ఫ్యాషన్ గా మారింది " మీకు తెలీదు ఎమొ గాని ఒక్కపుడు ఈ
సొషలిజం పార్టీ లలో వుండింది ఆ రెండు కులాల వాళ్లే ఎక్కువగా వున్నారు. ఇప్పటికి సి పి ఐ /యం ల లో వారిదె హవా. ఈ మధ్య కాలం లో విరు business/కంపెనీ లు పెట్టు కొని కొంచెం Socialism వూపు తగ్గించారు.
@బళ్ళ సుధీర్,
కమ్మ వాళ్ళు కులరాజకీయలు చేస్తున్నారా లేదా? సినీ అభిమానం నించి, ఇంజనీరింగ్ కాలేజ్ ల వరకు వాళ్ళు చేసేది ఇదే. కాదని గుండె మీద చెయ్యేసుకొని చెప్పగలరా? మీకు వాళ్ళని విమర్శించే అర్హత లేదు. ముందు సొంత కులం వాళ్ళకి సుద్దులు చెప్పండి.
కులం ఒక పెద్ద హిపోక్రిసీ. పెళ్ళి విషయంలో కులానికి ప్రిఫరెన్స్ ఇస్తారు కానీ అక్రమ సంబంధం విషయంలో ఎవడూ కులం గురించి ఆలోచించడు.
http://telugu.stalin-mao.net/?p=62
Post a Comment