Monday, January 26, 2009

రామసేన సేవ...!అమ్మాయిల జుట్టుపట్టి లాగి...చెంప ఛెళ్ళుమనిపించి...పరిగెత్తించి కొట్టి...క్రిందపడదోసి...కాలితోతన్ని...మన భారతీయ సంస్కృతిని రక్షించారు. ఆ ధర్మ రక్షకుల సంస్థ పేరు "శ్రీరామ సేన". కర్ణాటక రాష్ట్రం మంగుళూరు నగరంలోని ఒక పబ్ లో శనివారం మధ్యాహ్నం స్నేహితులతో సమయం గడుపుతున్న కొందరు అమ్మాయిల పై పైచాచికంగా దాడి చేసి కొట్టి, మన భారతీయ సంస్కృతి గౌరవాన్ని సగౌరవంగా కాపాడారు.

ఈ సందర్భంగా ఈ భావజాలాన్ని ఆకాంక్షించే అందరికీ నా అభినందనలు. రామ సేవకులందరికీ, మత రక్షకులందరికీ, సాంస్కృతిక పరిరక్షకులందరికీ జేజేలు.

మరిన్ని వివరాలకు ఇక్కడ చూడండి.

50 comments:

సుజాత said...

రాత్రి టీవీలో చూసి నిజంగా మతి పోయింది. అశ్లీల ధోరణులని వ్యతిరేకించాలిందే కానీ...ఇలా కాదు!

veera said...

Mahesh,
As per as the Previous comments I have seen your blog no body supported this kind of actions in the name of cultural protection. Every body is saying there should be stern action against any one ireespective of is ist srreramsena or Majlis people r christian missionary pertaining illegal activities.

Marthanda said...

అశ్లీలత... అంటే ఏమిటి? గోవాలో ఇద్దరు అమ్మాయిలు అబ్బాయిలతో సెక్స్ చేస్తుంటే కొందరు ఆకతాయిలు సెల్ ఫోన్ తో వీడియో తీశారు. ఆ విషయం బయట పడిన తరువాత ఆ అమ్మాయిలు అవమానానికి లోనై ఆత్మహత్య చేసుకున్నారు. సెక్స్ చేసేటప్పుడు సిగ్గు అనిపించలేదట! కానీ ఆ విషయం పది మందికి తెలిసిన తరువాత సిగ్గేసిందట! ఏమిటీ పేరడాక్స్?

పిచ్చోడు said...
This comment has been removed by the author.
Anonymous said...

నేటి పరిస్ధితి, రామసేన చర్య సక్రమమా, అక్రమమా అనే స్ధితిని దాటిపోయింది. నేటి చర్చాంశం, మోరల్ పోలీసింగ్ వాంఛనీయమా కాదా అన్నదిగా మారింది. జాతి నిర్వీర్యమైపోతున్న ప్రస్తుత పరిస్ధితుల్లో ప్రతి భారతీయుడు ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడకుండా తనవంతు సాయం చేయ ప్రయత్నించాలి. ఈ ప్రయత్నంలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోవచ్చుగాక. భావస్వాతంత్ర్యం, స్వేచ్ఛ ముసుగులో జరుగుతున్న కార్యకలాపాలని అడ్డుకోవడం ఎలా సమర్ధనీయం కాదో నాకైతే అర్ధం కావడం లేదు. అది అభ్యంతరకరంగా, స్త్రీ స్వేచ్ఛని హరించే చర్యలుగా ఎలా పరిగణిస్తున్నారో కూడా అర్ధం కాకుండా పోతోంది. దీనికి తాలిబానైజేషన్ అని నామకరణం కూడానా, సిగ్గులేకుండా. ఈ కుహానా లౌకిక వాదులని కాల్చిపారేయాలి. అప్పటికైనా ఈదేశం, ఈ జాతి బాగుపడుతుందేమో. ఇదంతా చదివి నేనేదో స్త్రీలకు వ్యతిరేకిననో, ఇంకోటో అని భావిస్తే అది నా తప్పు కాదు. నా ఆక్రోశం అంతా ఈ జాతియావత్తు నిర్వీర్యమైపోతోందనే వేదనే. ఈ హింసాత్మక ఘటనను నేను కూడా సమర్ధించడం లేదు. అయినప్పటికీ, ప్రతి సమస్యనీ ప్రతి ఒక్కరూ తమదైన పరిధిలో ఆలోచిస్తారు. కొందరు గాంధీలాగా, కొందరు బోస్ లాగా, కొందరు భగత్ సింగ్ లాగా. కాని, అందరి లక్ష్యం ఒకటే అయినప్పుడు ఎందుకు తప్పు పట్టాలి. ఈ విధంగా ఆలోచిస్తే మాత్రం, నిస్సందేహంగా రామ సేన కలాపాలు సమర్ధనీయమే అనిపించక మానదు.

సుజాత said...

అనోనీమస్ గారు,
జాతి నిర్వీర్యం అయిపోతోందన్న మీ ఆవేదన అర్థం చేసుకోదగ్గది. ఈ రోజు ఈనాడు పేపర్లో చూసారా..పబ్ కి వచ్చిన స్త్రీల వేష ధారణలు! అటువంటి వాటిగురించి మాట్లాడకూడదు మనం! మాట్లాడితే "ఏం, వాళ్లకిష్టమైన బట్టలు వాళ్ళు వేసుకునే స్వేఛ్చ లేదా" అనో, "ఆడవాళ్లలో ఎవరూ రెచ్చగొట్టే వారు లేరు, మగాళ్లే రాక్షసులు" అనో వాదనలు మనకి వినిపిస్తాయి.

ఎక్కడినుంచి వచ్చిందీ విపరీత ధోరణి? ఈ ప్రేమికుల దినాలేమిటి? ఇంట్లో మస్కా గొట్టి దుర్గం చెరువు దగ్గర సభ్య సమాజం కళ్ళు మూసుకునేలా ప్రవర్తించడమేమిటి?ఇదివరలో ప్రేమలు, ప్రేమికులు లేవా? కానీ పైన పిచ్చోడు గారు చెప్పినట్టు ఆ సేనలో ఒక్కడినైనా ఆందోళన చేసి ఆ పబ్ ని మూయించమనండి చూద్దాం! ఏ ముంబాయి నుంచో ఎవడో వెనకనుంచి పురెక్కిస్తూ ఉంటే ఇలా తెగిస్తారు గానీ నిజంగా భజరంజదళ్ కి సంస్కృతిని కాపాడే ఉద్దేశం ఉందా? సంస్కృతిని కాపాడటం ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగించాలి గానీ ఇలా ప్రేమికుల దినం రోజు, మరో రోజు గుర్తుకొస్తుందా కర్తవ్యం?

విదేశీ సంస్కృతుల మోజులో పడి వివస్త్రలై తిరుగుతున్న డబ్బు బలిసిన నేటి ఆటవిక యువతలో ఇటువంటి పనిష్మెంట్లు ఏ రకమైన మార్పు తెస్తాయో తెలీదు గానీ ఈ అశ్లీఅ ధోరణులకు అడ్డుకట్ట మాత్రం పడి తీరాలి.

కానీ ఆ వీడియో చూస్తుంటే చాలా భయం వేసింది.అంత భీభత్సంగా ఉంది.

చూడండి పరిస్థితి! గృహ హింసకు, వేధింపులకు గురైనా సర్దుకు పోయి బతికే స్త్రీలు ఒకవైపు,(మధ్యతరగతి కుటుంబాల్లో ఎన్నో ఇళ్లల్లో బయటికి కనపడని హింస శారీరకంగానో, మానసికంగానో కొనసాగుతూనే ఉంటుంది) కన్ను, మిన్ను గానక స్త్రీలందరికీ మచ్చ తెచ్చే స్త్రీలు మరో వైపు. ఇప్పుడు దేశం యావత్తూ సానుభూతి చూపిస్తోంది వారికే చూడండి!

కత్తి మహేష్ కుమార్ said...

@అనామకుడు: ఏమిటా జాతిని వీర్యవృద్ధి చేసే లక్ష్యం? ఈ చర్యను చేపట్టినవారు బోస్ లేదా భగత్ సింగ్ ఆదర్శాలను అనుసరిస్తున్నారనా మీ ఉద్దేశం? ఇది కేవలం అవాంఛనీయ సంఘటనా!!! నిస్సందేహంగా రామసేన కలాపాను సమర్థనీయంగా అనిపిస్తాయా!?!

అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతోందా? మీలాంటి మరో పది మంది చాలు ఇక్కడా మరో మంగుళూరు జరగడానికి. మోరల్ పోలిసింగ్ అదీ చట్టపరిధుల్ని దాటి హింసాత్మకమైన మోరల్ పోలీసింగ్ అవాంఛనీయం కాదు. గర్హనీయం,దండనీయం. ఏమిటి మీకు తెలిసిన స్వేచ్చ ముసుగులో జరుగుతున్న కార్యకలాపాలు? పబ్ కు వెళ్ళి బీరు తాగడమా!? ఏం మహిళలకు ఆ అధికారం లేదా? కేవలం మగాళ్ళకుండాలా?

భారతీయ సంస్కృతిని రక్షించే పేరుతో ఆడాళ్ళమీదపడి బట్టలు లాగి,శరీర భాగాల్ని స్పృశించి,లాగిపెట్టి కొట్టి, నేలకేసి మోది నానాయాగీ చేస్తే దాన్ని తాలిబనైజేషన్ అనక great Indian culture అనాలా? ఇదేనా మన సంస్కృతి? ఇదేనా దాన్ని పరిరక్షించుకునే విధానం?

Anonymous said...

"మ్రుచ్చు గుడికి పోయి ముడివ్రిప్పునే కాని..."

గుడికెళ్ళాము కదా అని మ్రుచ్చు దేవుడిని చూస్తున్దా తమ్ముడూ? అలవాటు ప్రకారం ముడి విప్పుతుంది. అది గుళ్ళో దేవుని తప్పా?
దీన్ని చూసి మీరు భారతీయ సంస్కృతి మీద నోరు పారేసుకుంటే ఏమి నష్టము, ఎవరికి నష్టము? మీరు మ్రుచ్చు స్వభావులని మళ్ళీ ప్రపంచానికి చాటటము తక్క?
అయినా మీకు నచ్చిన రాతలు మీరు రాసుకోక జనులమీదకు రాళ్ళెందుకు విసురుతున్నారు? కొత్తగా మీరు వెదజల్లుచున్న ఈ భారతీయ ద్వేష కుసుమాల కారణమేమిటి చెప్మా?

Anonymous said...

బాబ్బాబ్బాబు.... అక్కడ వాల్లు మగాల్లను కూడా కొట్టారంట, కొంచెం దానిగురించి కూడా బాదపడండి నాయనలారా..!!! ఇక విషయానికి వస్తే, నాదొ బుల్లి డౌటు, నిజంగా ఆవచ్చిన వాల్లు ఆడవాల్లను కొట్టకుండా కేవలం మగాల్లను మాత్రమే కొట్టివుంటే అది ఇంత పెద్ద న్యూస్ అయ్యుండేదా అని? ఏది ఐతేనేం అలా కొట్టడం తప్పే,

కత్తి మహేష్ కుమార్ said...

@అనామకుడు: భారతీయ సంస్కృతిని ఇక్కడెవరూ ఏమీ అనటం లేదు. ఆ సంస్కృతిని రక్షిస్తున్నామని చెబుతూ రాక్షస ప్రవృత్తిని ప్రోత్సహిస్తున్న ఈ self appointed cultural saviors ని ప్రశ్నిస్తున్నాను. వాళ్ళకు వత్తాసుపలుకుతున్న మీలాంటి వాళ్ళను ఖండిస్తున్నాను.సంస్కృతి పరిరక్షణ పేరుతో దుండగాలు చేస్తూ రాజకీయ పబ్బాలు గడుపునేవాళ్ళని వ్యతిరేకిస్తే అదేదో భారతదేశం మీద ద్వేషాన్ని కలిగించే పోకడలను సాగిస్తున్నట్లు ప్రజల్ని ప్రలోభపెట్టే నీలాంటివాళ్ళ motive ఏమయ్యింటుంది చెప్మా?

@ఆకాశరామన్న: జరిగిన దాడిని ఖండిస్తూనే ఆ దాడిచేసినవాళ్ళు చెప్పే భారతీయ విలువల్ని ప్రశ్నించే దిశలో మహిళలపై జరిగిన దాడిని ప్రస్తావించడం జరిగింది. ఏది ఏమైనా్ సంస్కృతి పేరుతో హింసని ఆశ్రయించడం,మనషుల్ని నిర్ధాక్షిణ్యంగా కొట్టడం ఆటవికం,అరాచకం. అదీ సాంప్రదాయం పేరుతో చెయ్యడం ఖండీయం.

జీడిపప్పు said...

ఒక అమ్మాయి మిట్ట మధ్యాహ్నం (అర్థరాత్రి సంగతి దేవుడెరుగు!) పబ్ లొ కూర్చుని సిగరెట్, బీరు తాగే స్వేచ్చ కూడా లేదు. ఇంకెందుకు ఈ బానిస స్వాతంత్ర్యం? అసలు స్వాతంత్ర్యం రావడానికి మరో గాంధీ పుట్టాలి.

చంద్ర మోహన్ said...

ఇలాంటి సంఘటనల్లో ఏదో ఒక పక్షానిదే పూర్తిగా తప్పని చెప్పలేము. ఇతరుల వ్యక్తి స్వేచ్ఛపై ఆంక్షలు విధించే హక్కు ఈ హిందూ తాలిబాన్లకు లేనట్లే, తాము నివసించే సమాజపు కట్టుబాట్లను కాలదన్నే హక్కు ఇతరులకు కూడా ఉండదు. అలా చేసినప్పుడు ఇలాంటి సంఘటనలను ఎదుర్కొనడానికి కూడా సిద్ధంగా ఉండాలి.

"మేం పాశ్చాత్యుల్లాగా అర్ధనగ్నంగా పబ్బుల్లో తాగి తందనాలాడుతాం, కానీ మగవాళ్ళందరూ భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తూ మమ్మల్ని తల్లుల్లా, చెల్లెళ్ళలా చూడండి" - అంటే కుదరదు. స్వేచ్ఛ విలువైనది. Freedom costs. 'మాకు బీరు తాగే స్వేచ్ఛ లేదా?' అనే తరుణీ మణులు వారి రక్షణను వారే చూసుకోవాలి. సమాజం రక్షణను ఆశించకూడదు.

'రామసేన' - ఆ కోతిమూకకు సరైన పేరే పెట్టుకొన్నారు! వారిని సరైన దారిలో నడిపించడానికి రాముడే లేదు!

Marthanda said...

పబ్ లలో ముక్కూమొహం తెలియని వాళ్ళతో కలిసి తాగి డాన్సులు చెయ్యడం తప్పే కానీ ఆర్.ఎస్.ఎస్. లాంటి వాళ్ళకి మాత్రం వాళ్ళపై దాడి చేసే అధికారం లేదు. ఆర్.ఎస్.ఎస్. వాళ్ళు ఫెమినిజానికి వ్యతిరేకం అన్న విషయం గుర్తుంచుకోవాలి.

durgeswara said...

ఇంత విపరీత పరిణామాలు మొదలయ్యాక మీలాంటి మేధావులు గొంతెత్తుతారెందుకని ఒకసారి కాకుంటె ఒక్కసారన్నా ఇలా పబ్బులమ్మటి బార్లవెంత తిరగటమ్ తప్పని ఈసంస్కృతి ని అడ్దుకోవాలని ఎప్పుడూ చెప్పరెందుకని.అసలు మీరు ఈసంస్కృతులను సమర్ధిస్తున్నారా ? అది కూడా వివరించండి. ఎందుకంటే తప్పు చేసినవాడే కాదు తప్పుజరుగుతుంటే చూసి కూడా తెలియనట్లు నటించేవాడూ బాధ్యులేకదా దానికి. వాళ్ల తప్పొప్పులను తరువాత మూలాన్ని గురించి అది తప్పా ఒప్పా చర్చపెడితే బాగుంటుందేమో!

bhavani said...

వీళ్ళనుండి మన దేశానికి ఎప్పుడు విముక్తి లభిస్తుందో కానీ...ఇలాంటివి చూడాల్సి రావటం దురదృష్టం.

Anonymous said...

రామ సేన అని పేరు పెట్టుకున్నంత మాత్రాన ...వారు పవిత్రమయి పోరు.
కాని మహేష్ గారు, వారు చేసిన దాడి సంగతి ఏమో గాని సంస్కృతి మీద మీ దాడి మాత్రం చాలా అద్బుతంగా ఉందండి.

మార్పుకోసం రామసేన మెదలగు వారు బౌతిక దాడికి దిగితే మీరు మానసిన దాడికి దిగుతున్నారు... బాగు బాగు...

సత్య said...

జరిగిన సంఘటన చాలా విచారకరం. ఇందుకు బాధ్యులైన వారు చట్టపరిధి లో శిక్షింపబడాలి. అయితే మీరు ఉపయోగించిన attributes మరీ అతి గా అనిపించాయి. "కొందరు అమ్మాయిలపై దాడి చేసి 'పైచాచికంగా కొట్టి '.... " కొంచెం ఎక్కువైంది.

పబ్ లపై నియంత్రణ, అందులో జరుగుతున్న కార్యక్రమాలపై పర్యవేక్షణ, నియమావళి కి తగినట్లుగా అందులో జరుగుతున్నాయా అనేది కూడా ఇక్కడ ముఖ్యం. మనం ఇలాంటి దాడులు ఖండించటానికి, పనిలో పనిగా హిందూయిజం ని ఏకిపడేయటానికి హడావుడిగా స్పందిస్తాం. కానీ పబ్స్ లో జరిగేవాటిపై స్పందించటానికి ఒక్కసారి కూడా ముందుకురాము. ఒక్క టపా కూడా వ్రాయలనిపించదు. అక్కడే వున్న News Channels వారు చక్కగా షూట్ చేసుకొని తమ అరుదైన కలక్షన్లలో భద్రపరుచుకొంటారు గానీ పోలీసులకి సమాచారం అందించలేదు.

Sreedhar said...

http://www.dailymail.co.uk/news/article-437871/Police-protect-girls-forced-convert-Islam.html

జరిగిన సంఘటన నిజం గ సిగ్గు చేటు, రామ సేన వాళ్ళు చెప్పినట్లు ఆ అమ్మాయలు ముస్లిం యువకుల తో వున్నారట.

కత్తి మహేష్ కుమార్ said...

@సత్య: మీరు TV లో ఆ క్లిప్స్ ఒక సారి చూడండి.నేను చెప్పిందెక్కువో వాళ్ళు చేసిందెక్కువో తెలుస్తుంది. నేను విమర్శిస్తున్నది హిందూఇజాన్ని కాదు హిందుత్వభావజాలం పేరుతో జరుగుతున్న అరాచకాన్ని.

శివరంజని said...

కత్తి మహేష్ కుమార్ గారు,

సమాజంలో పెరిగిపోతున్న విచ్చలవిడి సంస్కృతిని వ్యతిరేకించడానికి దీనికన్నా వేరే మార్గాలు చాలా ఉన్నాయి.
ఇలాంటి పనులు చేసేది శ్రీరామ సేన వాళ్లైనా, Army of God వాళ్లైనా, Dukhtaran-e-Millat వాళ్లైనా తప్పకుండా ఖండించాల్సిందే.

కాకపోతే, మీ టపా లోని విషయానికి, ఈ క్రింది వాక్యానికి సంబంధమేమిటో అర్ధం కావడం లేదు.
"రామ సేవకులందరికీ, మత రక్షకులందరికీ, సాంస్కృతిక పరిరక్షకులందరికీ జేజేలు."
వీళ్ళంటే మీకు ఎందుకంత వెటకారం ?

- Shiv.

షరా : నేను మిగతా రెండు సంస్థల పేర్లు చేర్చింది అవి కేవలం వేరే మత సంస్థలనే ఉద్దేశంతో మాత్రం కాదు. వీళ్ళు శ్రీ రామ సేన కంటే చాల ముందుగానే ఆడవాళ్ళ మీద చాలా atrocities చేసారు అని చెప్పడానికి.

సుజాత said...

"మేం పాశ్చాత్యుల్లాగా అర్ధనగ్నంగా పబ్బుల్లో తాగి తందనాలాడుతాం, కానీ మగవాళ్ళందరూ భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తూ మమ్మల్ని తల్లుల్లా, చెల్లెళ్ళలా చూడండి" - అంటే కుదరదు. స్వేచ్ఛ విలువైనది. Freedom costs. 'మాకు బీరు తాగే స్వేచ్ఛ లేదా?' అనే తరుణీ మణులు వారి రక్షణను వారే చూసుకోవాలి. సమాజం రక్షణను ఆశించకూడదు.

చంద్రమోహన్ గారితో ఏకీభవిస్తున్నాను.

Marthanda said...

పబ్ పై ఏ స్త్రీవాద సంఘం వాళ్ళో దాడి చేసి ఉంటే నేను వాళ్ళని పొగిడేవాడ్ని. హిందూ తాలిబాన్ సంస్థ వాళ్ళు దాడి చెయ్యడాన్ని హర్షించలేకపోతున్నాను.

జీడిపప్పు said...

భారతీయులు సిగ్గుపడాలి
http://jeedipappu.blogspot.com/2009/01/blog-post_970.html

అబ్రకదబ్ర said...

చేసుకున్నోళ్లకు చేసుకున్నంత మహదేవ. తన్నినోళ్లూ, తన్నించుకున్నోళ్లూ - అందరూ స్వేఛ్చకి అసలర్దం తెలీని దద్దమ్మలే. కొందరా ఎక్స్‌ట్రీమ్, కొందరీ ఎక్స్‌ట్రీమ్. దొందూ దొందే. వీళ్ల గురించి డిస్కషన్ కూడా వృధాయే.

Anonymous said...

ఉపదేశో హి మూర్ఖాణాం ప్రకోపాయ న శాంతయే
పయఃపానం భుజంగానాం కేవలం విషవర్ధనం

కదాచిదాపి పర్యటన్ శశవిషాణమాసాదయే
న్నతు ప్రతినివిష్టమూర్ఖజనచిత్తమారాధయేత్

కత్తి శిష్యా! అద్దిరిందోయ్ ఇలాగే కుమ్మెయ్ నువ్వు చెబుతాను

ఆమెన్

భవదీయుడు
ఛవట బుచ్చర్ రావు

Marthanda said...

ఒళ్ళు సఘం కనిపించేలా బట్టలు వేసుకుని బహిరంగ ప్రదేశంలో డాన్స్ చెయ్యడం "అనాగరిక స్వేఛ్ఛ" కిందకి వస్తుంది.

rekha said...

@ చంద్రమోహన్
ఆడవాళ్ళు తల్లి లాగో చెల్లి లాగో చూడాలని కోరుకోవట్లేదు. సమానత్వం కొరుకుంటున్నారు. Treat women as your equal. మగవళ్ళైనా ఆడవాళ్ళైనా, కొందరికి పబ్ లో గడపటం ఇష్టం కొందరికి గుళ్ళో గడపటం ఇష్టం. ఎవరి ఇష్టం వాళ్ళది. ఒకరికి enforce చేసే హక్కు లేదు. Thats what a democracy is.

Sreedhar said...

ఏది మంచి ఏది చెడు చెప్పడానికి వీళ్ళు ఎవరండి ? చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అనే వాళ్ళకి రేపు పబ్లిక్ లో పైట జారింది క్లిప్ ఎందుకు పెట్టుకోలేదు అని జుట్టు పట్టుకుని నేలకేసి కొడితే తెలుస్తుంది నెప్పి. రాముడు చొక్కా వేసుకోలేదు కాబట్టి మగాళ్ళు అందరు చొక్కాలు లేకుండా తిరగాలా ? సీత మహా సాద్వి ఆకాలం లో చీర కట్టుకుందో వంటికి ఆకులు జింక తోళ్ళు కట్టుకుందో వీళ్ళు చూసారా ? హనుమంతుడు కందమూలలు తిన్నాడు కాబట్టి బ్రెడ్ బట్టర్ తినే వాళ్ళు పలుగు పార పట్టుకుని అడవుల వెంట తిరగాలా ? పాశ్చాత్యులు కనుకొన్న ఫోన్, సోఫా, టీవీ, ఫ్రిజ్, బాన్ చెయ్యండి వాటిని వాడే వాళ్ళని వెంటపడి తరమండి, ఆడ మగ పార్క్స్ లో కలిసి తిరిగితే అశ్లీలం, గుడి మీద రాధా కృష్ణులు బట్టలు లేకుండా కనబడితే అది సృష్టి కి మూలం.

Marthanda said...

ఆడవాళ్ళు తల్లి లాగో చెల్లి లాగో చూడాలని కోరుకోవట్లేదు. సమానత్వం కొరుకుంటున్నారు. ఈ విషయం నేను ఒప్పుకుంటాను. అంత మాత్రాన ఒళ్ళు సఘం కనిపించే బట్టలు వేసుకుని పబ్లిక్ గా డాన్సులు చెయ్యాలని దాని అర్థం కాదు.

Anonymous said...

చాలా సహజమైన స్పందనలున్నాయిక్కడ. కానీ చాలా అసహజంగా, విస్మయపరచేలా ఉన్నది మాత్రం మార్తాండ గారు రాసినది. "పబ్ పై ఏ స్త్రీవాద సంఘం వాళ్ళో దాడి చేసి ఉంటే నేను వాళ్ళని పొగిడేవాడ్ని. హిందూ తాలిబాన్ సంస్థ వాళ్ళు దాడి చెయ్యడాన్ని హర్షించలేకపోతున్నాను." - ఏంటిది? ఆ ఆడవాళ్ళపై దాడి చెయ్యాల్సిందే.. కానీ హిందువులు చెయ్యకూడదు! స్త్రీ సంస్థలు చేస్తే మాత్రం పొగుడుతారట! ఎలాంటి మనస్తత్వమిది?

ఇది లౌకికవాదమా? ఇదా కమ్యూనిజం? ఇలాంటి దొంగ మనస్తత్వం పెట్టుకున్నవాళ్ళా హిందువులను తాలిబన్‌లని అనేది? తాలిబన్‌లు విషప్పురుగులు - మతం పేరిట వాళ్ళ సమాజంలో అర్థం పర్థం లేని ఆంక్షలు పెడుతూ అరాచకం సృష్టిస్తున్నారు. -కానీ చెప్పి చేస్తున్నారు. మనసుల్లో ఏదో పెట్టుకుని బయటికి బోడి అభ్యుదయం కబుర్లు చెప్పడం లేదు. కానీ, లౌకికవాదం ముసుగేసుకుని, కమ్యూనిజం ముసుగేసుకుని, స్త్రీ అభ్యుదయం ముసుగేసుకుని మాటల్లో విషం చిమ్మేవారు తాలిబన్‌లను మించినవారు.

Anonymous said...

చదువరి గారూ...

అలాగే మతవాదం ముసుగేసుకొని...కూడా చేరిస్తే బావుంటుంది.

Anonymous said...

@ మహేష్
మహేష్ గారు, ఏదో అందరూ ఆడవారి మీద దాడికే స్పందిస్తున్నారన్న చిన్న ఆక్రోషంతో అలా అన్నాను కానీ, దీన్ని సమర్ధించే ఆలోచన నాకు లేదులెండి. నిజంగా వీల్లకు పబ్లిసిటి పిచ్చి కాక కేవలం భారత సంస్కృతిమీద అంత ప్రేమ వుంటే దాన్ని చాలా రకాలుగా ప్రదిర్షించవచ్చు.
అసలు కొట్టడం దేనికి? ఒకమ్మయిని తోస్తే పాపం పరిగెత్తుతున్న ఆవిడ దబీమని బొర్లా పడిపోయింది. మరొక రామ సేన హీరో గారు, ఇంకో మగాన్ని, గాల్లొ ఎగిరి మరీ గుద్దాడు. తాముచేసే ఇలాంటి పనులను సంస్కృతి పరిరక్షన అని చెప్పుకోవడం వీరికే చెల్లింది.

@ మార్తాండ
ఏమిటండి ఈ చోద్యం, మహిలా సంఘాలకు సపరేటుగా రెండు కొమ్ములు ఎగస్ట్రాగా వచ్చాయనా మీ వుద్దేసం? చట్టాన్ని చేతిలోకి తీసుకునే హక్కు వారికి మాత్రం ఎక్కడిది. ఐన ఇంత "మగలాలిత్యం (thanks to mahesh)" ఎందుకండీ..? "chivalry also chauvinism" అని స్త్రీవాదులు చెబుతుంటారు వినలేదా మీరు...?

@ చంద్రమోహన్
చక్కగా చెప్పారు.

సురేష్ కుమార్ దిగుమర్తి said...

జీవితమొక చక్రం. రాజ్యం, సమాజం లలో ఎవరి ప్రమేయం ఎవరిమీద ఎక్కువైనా ప్రత్నామ్యాయం రావాల్సిందే. ఆ క్రమంలోనే మార్పులు జరుగుతాయి అన్నది నా అవగాహన. ఒక ఊరిలో ఒక వ్యక్తికి కొమ్ములు వస్తే ఆ వ్యక్తిని విపరీతమైనదిగా భావించి వెలేసారు. కొంత కాలానికి అందరికీ కొమ్ములు వచ్చి ఒక వ్యక్తికి రాకపోతే, ఈ సారి వెలి కొమ్ములు రానివారిని వరించింది. ఇందులో ఎవరిది తప్పు.
అర్ధం చేసుకోవాలి కోవాలి గానీ అంతం చేసేస్తే ఎలా. ఇది కేవలం చాందసవాదం. ఈ చాందసవాదాన్ని కప్పిపుచ్చడానికి, అమాయిల కట్టుబొట్టుల మీద పడవలసిన అవసరం లేదు.
ఏ "సేన" చేస్తే ఆ సేన పేరే వ్రాస్తారు. అంత మాత్రాన అన్నింటికీ వారే కారణం అనికాదు. ఒక్కమాటకే అంత బాధ కలిగితే ఇంకెప్పుడూ అలా చేయవద్దని కబురు పంపించండి. ఊరికే ఎవరూ అనరు కదా.
స్త్రీలమీద కాబట్టి చర్చ అయింది, పురుషులయితే అవుతుందా అంటే కిందనున్నవారు పైనున్నవారికన్నా ఎక్కువ బలాన్ని ఉపయోగించినపుడే నిలబడగలరు. లేకపోతే ఎప్పటికీ పైకి రాలేరు. అలాంటి సమయంలో వచ్చిన స్పందనను మనం పురుష వ్యతిరేకంగా తీసుకోకూడదు.
మనల్ని మనం నడిపించాలి గానీ ఎదుటివారి నడవడిక, కట్టుబొట్టులు నడిపించకూడదు. వాటిని చూసి మనం react అవుతున్నాం అంటే మనం లేనట్టే కదా.

మార్తాండ said...

@చదువరి గారు.
మీకు స్ట్రాటెజిక్ విషయాలు అర్థమయినట్టు లేదు. అమెరికా సామ్రాజ్యవాదులకి వ్యతిరేకంగా హమాస్ ని పొగిడాను కానీ నేను హమాస్ సిద్ధాంతాలని పూర్తిగా నమ్మడం లేదు. I am a dedicated feminist despite of my views on Islam.

bala said...

As Bush try to bring peace by bringing violence to Iraq, people think that they can bring change by applying external forces on the system. Violence is a dead mind action; people become violent if they don’t understand the problem.

If we notice today there is violence in everybody actions, people are violent to pass the exams, and score marks, get profit in business, and get ranks, etc., everywhere there is a blind force is acting on us. I think we are becoming criminal ourselves and the outside violence is just the result of this inner corruption of self. We start denying our identity and forgot to look ourselves.

rekha said...

@"అంత మాత్రాన ఒళ్ళు సఘం కనిపించే బట్టలు వేసుకుని పబ్లిక్ గా డాన్సులు చెయ్యాలని దాని అర్థం కాదు."
వాళ్ళు పబ్లిక్ గా డాన్స్ చెయ్యలేదు. పబ్ లో చేశారు. ఆడవాళ్ళు వేసుకునే బట్టల్లో మాత్రమే మన సంస్కృతి దాచామా? very sad. ఒకప్పుడు మన పూర్వికులు వేసుకున్న బట్టలకీ మనం ఇప్పుడు వెసుకునే బట్టలకీ చాలా తేడా వుంది, మగ ఆడ ఇద్దరి విషయం లో.

అమ్మాయిలు వళ్ళు కనిపినించే బట్టలు వేసుకుంది to get a lover అంతేకానీ తన్నులు తినటానికి కాదేమో.కాలం మారింది మనం ఇంకా మొఘల్ మరియు బ్రిటిష్ కాలం లో వుంటే ఎట్లా. అంతకు ముందు రవికలు లేవు తెలుసా!

Marthanda said...

కొంత మంది మగవాళ్ళు అనేక మంది స్త్రీలతో తిరగడం స్వేఛ్ఛ అనుకుంటారు. వాళ్ళు తమతో కలిసి తిరిగిన స్త్రీలని వ్యభిచారులుగా చూస్తారు కానీ అలా తిరిగిన స్త్రీని పెళ్ళి చేసుకోవడానికి వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు ఆడదానికొక నీతి, మగవాడికి ఇంకొక నీతి ఉండాలని నమ్మే వంచకులు. ఈ వంచకులని నమ్మే అమాయక స్త్రీలు ఉండడం వల్లే మగవాళ్ళ ఆటలు ఇంత సులభంగా సాగుతున్నాయి.

Anonymous said...

ఎవరి జీవితం వారిది..వీళ్ళేవరు ఒకరి వ్యక్తిజీవితం లోకి తొంగి చూట్టానికి, పబ్ లకి వెల్తారో..బార్లకి వెల్తారో వారిష్టం మద్యలో ఈ సేన ఎవరూ..? వీరేకేమి హక్కు ఉంది వారి మీద చేయి చేసుకోవడానికి ముందు అవి ఆలోచించండి తర్వాత సంస్కృతి. ఆచారాలు గురించి ఆలోచించెదరు..! ఒకరి ని అకారణంగా కొట్టి హింసించడమన్నది నేరం.. ఒకరి స్వేచ్చను హరించే హక్కు ఇంకొకరికిలేదు...!

Anonymous said...

కమల్

Marthanda said...

మనిషి నీతినియమాలు అవసరం లేదు, ఎవడి స్వేఛ్ఛకి అనుగుణంగా వాడు బరితెగించొచ్చు అనుకుంటే మనం ఉంటున్నది సమాజంలో అని అనుకోనక్కర లేదు. మనం ఉంటుంది మోడర్నైజ్డ్ అడవి అని అనుకోవాలి.

Anonymous said...

నీతి నియమాలా..? అంటే ఏంటవి..? మీరు నిర్ణయిస్తారా..ఇవి నీతి నియమాలు అని..? మీరు అనుకున్నా నీతి నియమాలకి ప్రమాణికాలు ఏంటి..? మీరు అనుకున్నవే మిగతా ప్రపంచం అంతా పాటించాలా..? ఎందుకు పాటించాలి మీరు చెప్పే నీతి నియమాలు..? మీకు అనిపించిన నీతి నియమాలు మిగతా వారు ఎందుకు వినాలి..? వారికి నచ్చేవిదంగా వారు నడుచుకుంటారు..! నీకు నచ్చేవిదంగానే ఎందుకు నడుస్తారు..? అలా అనుకుంటే తమరు ఎదుటివారికి నచ్చేవిదంగా జీవిస్తారా మరి..? ఒకరి వ్యక్తి జీవితం ఇంకొకరికి అనవసరం..? పబ్ , బార్ కెల్లడం అన్నది చట్టవిరుద్దుమా..? అలా అయితే ప్రభుత్వం ఎందుకు వాటికి అనుమతినిస్తుంది..? అలా అనుమతి ఇచ్చాక మీరెవరూ వాటిని ప్రశ్నించడానికి..? చట్ట విరుద్దంగా ప్రవర్తిస్తె అప్పుడు ప్రశ్నించాలి అంతె..! సమాజం అంటే ఏంటి..? మనుషుల సమూహమే సమాజం..! ఎవైనా కాని మనం తయారు చేసుకున్నవే ఈ నీతినియమాలు..అవి కొందరికి నచ్చొచ్చు ఇంకొకరికి అవి పాటించడం అంతగా నప్పదు..వారికున్న నియమాలు వేరు ఉంటాయి..! సొ ఒకరి వ్యక్తి గత జీవితం శాసించే హక్కు ఇంకొకరికిలేదు. కమల్....

Marthanda said...

దావూద్ ఇబ్రహీమ్ కూడా డ్రగ్స్ అమ్మడం నీతివంతమైన పనే అని నమ్ముతాడు. లేకపోతే అతను డ్రగ్స్ ఎందుకు అమ్ముతాడు. అతని బిజినెస్ అతన్ని చేసుకోనిద్దామా? మనం అతని స్వేఛ్ఛకి అడ్డుతగలడం తప్పే అనుకుందామా?

కత్తి మహేష్ కుమార్ said...

@మార్తాండ: అందుకే భారతదేశంలో చట్టం అనేదొకటుంది. అది మంచీ చెడుల్ని నిర్వచిస్తుంది. దానికి మీరి ఈ కోతిమూకలు సంస్కృతిని రక్షిస్తామని నానాయాగీ చెయ్యడాన్ని మాత్రమే ఇక్కడ ఖండిస్తున్నది. స్వాతంత్ర్యాన్ని ఆకాంక్షిస్తున్నది చట్టపరిధులకు లోబడి మాత్రమే.

Marthanda said...

నేనేమీ ఆర్.ఎస్.ఎస్. వాళ్ళని సమర్థించే స్థాయికి దిగలేదు. పరాయి ఆడవాళ్ళతో తిరిగే మగవాడికి పరాయి మగవాళ్ళతో తిరిగిన ఆడదాన్ని పెళ్ళి చేసుకునే నిజాయితీ ఉంటే ఆ తిరుగుళ్ళలో మోసం లేదని నేను నమ్ముతాను. నేను పరాయి ఆడవాళ్ళతో తీరుగుతాను, నా భార్య మాత్రం పబ్ లు లాంటివాటి ముఖం చూడని పతివ్రత అయి ఉండాలి అనుకునే హిపోక్రిటిక్ తత్వంగల వాళ్ళ సంగతి ఏమిటి? పది మంది ముందు ఒళ్ళు కనిపించేలా డాన్సులు చేసే వాళ్ళని పోలీసులు అశ్లీల ప్రదర్శన కేసు కింద అరెస్ట్ చెయ్యొచ్చు. వైజాగ్ లో రోశయ్య గారి అల్లుడ్ని అరెస్ట్ చేసి బెయిల్ ఇచ్చేశారు. మంగళూరులో హిందూత్వవాదులు రెచ్చిపోవడానికి కూడా అక్కడి పోలీసుల చేతకానితనమే కారణం అనుకుంటాను.

Anonymous said...

babu katti garu miru antha hiondu devasam tho vrasaru
me akka nu chelli ni kuda ala seat kapadinatlu chest kanapadi natlu pub ki pampi beru taga mantara me cristyen ammaelanu pamputara vallu seat kana paditay maga vallu repu murder sex asid dadi encounter ivi avasarama

chevari ga oka mata me akka chelli ni ala chustay me pravarthana ela untadho me kavitha gyanam rachana saskti medha sakti upa yoginchi vrayandi meru nija maina nyayam unna vyaktulu ayethy

Marthanda said...

పబ్ కి వెళ్ళడం తప్పు కాదనుకునేవాడు తన భార్యని కూడా పబ్ కి తీసుకెళ్ళి పరాయి మగవాళ్ళతో డాన్స్ చెయ్యంచాలి. నేని పరాయి ఆడవాళ్ళతో తిరుగుతాను, నా భార్య మాత్రం సతీ సావిత్రి లాగ ఉండాలి అనుకుంటే అద్ హిపోక్రిటిక్ మెంటాలిటీ అవుతుంది.

Anonymous said...

Anonymous Marthanda said...

దావూద్ ఇబ్రహీమ్ కూడా డ్రగ్స్ అమ్మడం నీతివంతమైన పనే అని నమ్ముతాడు. లేకపోతే అతను డ్రగ్స్ ఎందుకు అమ్ముతాడు. అతని బిజినెస్ అతన్ని చేసుకోనిద్దామా? మనం అతని స్వేఛ్ఛకి అడ్డుతగలడం తప్పే అనుకుందామా?
---------------------------------
మీరు పబ్ లలో జరిగిన దాడిని, దావుద్ అమ్మే డ్రగ్స్ కి పోలికి పెట్టి సమస్యని పక్క దారి పట్టిస్తున్నారు..! సరె మీరు పెడుతున్న పోలిక గురించే మాట్లాడుకుందాము. దావుద్ డ్రగ్స్ అమ్ముతున్నది తన వ్యక్తి జీవితం లో ఉన్న వ్యక్తులకి కాదు. అంటే సమాజం లో ఉన్న ఇంకొకరి ( మనుషులకి) అమ్ముతున్నాడూ, సొ అతను చేసేది తన వ్యక్తిగత సమూహం లో కాదు ఇంకొకరి జీవితాలతో ఆడుకుంటున్నాడు, అది ముమ్మాటికి తప్పే. ఇక్కడ పబ్ ల సంస్కృతి అన్నది ఒకరి వ్యక్తిగత విషయం.అందులో ఇంకొకరి తో ప్రమేయం కాని లేక ఇంకొకరిని ప్రలోపించడం కాని లేదు. అది చట్ట విరుద్దం, పబ్ లకి వెళ్ళడం అన్నది చట్ట విరుద్దం కాదు కదా..? అలా అయితే ప్రభుత్వం ఎందుకు వాటీకి అనుమతినిస్తుంది..? మరి డ్రగ్స్ అమ్మడానికి అనుమతి ఇవ్వట్లేదు కదా..అంటే అది చట్ట విరుద్దమైనప్పుడే అది ఎవరూ చేయకూడని పని అని అర్థం, ఇక్కడ పబ్ లకి అనుమతి ఇచ్చినప్పుడూ పబ్ లకెల్లడం అన్నది చట్ట విరుద్దం కాదు కదా..? సొ దయచేసి విమర్శ కాని లేక చర్చలలో కాని చర్చించేటప్పుడూ కాస్త స్పృహతో చర్చించండి అంతే గాని ఊరికే వాదనలు గెలవాలనో లేక పిడివాదం తోనో మాట్లాడీతే ఇలాగే ఉంటూంది తలా తోక లేకుండ. ఆడవారి పబ్ లకు వెల్లడానికి..దావుద్ డ్రగ్స్ కి సంబంధం ఏంటో..!

....కమల్.

Anonymous said...

మీరు వ్యక్తి గత జీవితానికి. భాహ్య జీవితానికి అంటే సంఘపరమైన జీవితానికి తేడా తెలీకుండా మాట్లాడుతున్నారు. మన ఇంట్లో మన వ్యక్తి గత జీవితం లో ఒకరి ప్రమేయం ఏంటి..? ఒకరికి నచ్చేవిదంగా ఇంకొకరు తమ తమ వ్యక్తిగత జీవితం లో జీవించడానికి సాధ్యమా..? ఆచారాలు, సంస్కృతులు అన్నది వ్యక్తిగతమైనది..! అవి మిగతా ప్రపంచానికంతటికి ఆపాదించి..మిగతా వారు కూడ అలాగే జీవించాలి అని అంటే ఎలా..? ఎవరికి నచ్చినట్లు వారు జీవిస్తారు. ఇక భాహ్య ప్రవర్తన వేరు..వాటికి కొన్ని నియమాలు పెట్టుకుంటాము అంటే సివిక్స్ సెన్స్ అని అనొచ్చేమో..వాటిని ఖచ్చితంగా పాటిస్తేనే చుట్టూ ఉన్న సమాజం సరిగ్గ నడుస్తుంది లేదా..? అది ఎప్పుడు రోగిష్టిలాగే ఉంటుంది. వ్యక్తి జీవితం వేరు. సామాజిక జీవితం వేరు. అవి గుర్తించి ప్రవర్తిస్తే బాగుంటుంది...కమల్.

Anonymous said...

అయినా అక్కడ పబ్ ల సంస్కృతి ఇప్పటిది కాదే ఏ 30 ఏళ్ళ క్రితం నాటీదో..! ఇప్పుడూ హింధూతత్వ ప్రభుత్వాలు వచ్చాయి కాబట్టి వాటి మీద దాడి చేస్తున్నారు ! మరి అంతక మునుపెందుకు వాటి మీద ధ్యాస పెట్ట లేదు..? కాలం తో బాటు ఆచారాలు..సంస్కృతులు మారుతూ ఉంటాయి..ఆ మార్పుని ఆహ్వానించాలే గాని వాటిని ఆపాలని ప్రయత్నించడం వృధాప్రయాసే.!kamal

మార్తాండ said...

నా ప్రశ్నకి మీరు సమాధానం చెప్పడం లేదు? ఆడవాళ్ళకి వ్యక్తిత్వం ఉండదని అనుకునే వాళ్ళే తాము పబ్ లలో తిరుగుతూ, తమ భార్యలకి మాత్రం ఆ స్వేఛ్ఛ ఇవ్వరు. స్వేఛ్ఛ అనేది మగవాడికి మాత్రమే ఉండాలా? ఆడదానికి అవసరం లేదా?