Tuesday, January 13, 2009

ఆక్షణంలో ప్రేమించాను...


గడివేయని తలుపు
ఎదురుచూసే తలపు
చిహ్నంగా ఉంచిన దీపం
చీకటిచేసుంచిన గది
పందిరిమంచం
పవళించిన అందం
పరిమళించే ఆకాంక్ష
కానీ...
ఆక్షణంలో ప్రేమించాను
అందుకే తిరిగొచ్చాను


ఒకేసారి అయిపోయే సుఖంకన్నా
అవుతూ వుండే ఆనందం కోసం
ఆక్షణంలోని ఉద్రేకంకన్నా
అనుక్షణం ఆస్వాదించే స్థిరత్వం కోసం
అవధులు లేని ఆవేశంకన్నా
అద్భుతమైన అనుభూతి కోసం
తిరిగొచ్చాను
అప్పటివరకూ కేవలం కాంక్షించాను
ఆక్షణంలో ప్రేమించాను...
అందుకే తిరిగొచ్చాను


****

19 comments:

జ్యోతి said...

great expression of feelings in words...

భావాలను అందమైన పదాలుగా మార్చడం.. సూపర్...

Suresh Kumar Digumarthi said...

నిజమే, అది ప్రేమే,
ప్రేమను ప్రేమించిన ప్రేమ
ప్రేమించిన వారిని ప్రేమించే ప్రేమ
ఎంత పనైనా చేయించ (ఆప)గల ప్రేమ

లక్ష్మి said...

అబ్బ, ప్రేమని ఎంత అందంగా చెప్పారండీ, చాలా బాగుంది

పరిమళం said...

మహేష్ గారూ !"మొరిగే కుక్క -ఉమ్మే నోరు ","ఆక్షణంలో ప్రేమించాను" ఇవి రెండూ రాసింది ఒక్కరేనా అనిపిస్తుంది .సంక్రాంతి శుభాకాంక్షలు .

Bolloju Baba said...

బజార్లనిండా ఉద్రేకాలు, క్షణికావేశాలూ, చీకటి ఆకాంక్షలు, పరిమళించే సుఖాలు చవకగా దొరుకుతూ ఉన్నప్పుడు ఒక ఒకానొక అంత: శాంతికై యత్నం, ఒక శాశ్వతఅనుభూతి కై దహించుకుపోవటం, వెలుగులుచిమ్మే స్థిరమైన విలువలకై ఆరాటపడటం, ఆనందాల సుగంధాల సరోవరాలకై ఎదురుచూడటం నిజంగా స్థితప్రజ్ఞత, వాంఛనీయం, అభినందనీయం. అనుసరణీయం.

అభినందనలతో

Indian Minerva said...

వాహ్...

Padmarpita said...

మీరు ఏమిరాసినా ప్రియమేనండి....
మీకు అలా రాసే శక్తి ఉందండి....
వ్యాఖ్య ఏమి వ్రాయాలో తోచడం లేదండి...

కన్నగాడు said...

కత్తి లాగే ఉంది, విప్లవభావాలేననుకున్న వైవిధ్యంగా రాసారు

వేణూశ్రీకాంత్ said...

చాలాబాగుంది మహేష్...

Unknown said...

మహేష్ గారు ఇప్పుడే పెద్దాపురం నుంచి కాకినాడ తిరిగొచ్చాను అన్న భావం గోచరిస్తోంది,తప్పు చేద్దామని వెళ్ళిన పతి కి భార్య ప్రేమ గుర్తొచ్చి.మరి మిరే వుద్దేశం లో రాసారో?

teresa said...

బావుంది!

రాధిక said...

టైటిలు మరియు మొదటి స్టాంజాని చదివాకా గొడవ పెట్టుకుందామని రెడీ అయిపోయాను. రెండవ స్టాంజాకి వచ్చాకా నన్ను నేనే తిట్టుకున్నాను.బాగా రాసారండి.

Anil Dasari said...

కత్తింటి పేరు కవితయ్యిందా? ఈ మధ్య వరసగా ..

సుజాత వేల్పూరి said...

ఎంత బాగుందో!

Anonymous said...

ప్రేమించాను కాబట్టి ' అక్కడి ' వరకూ వెళ్లి తిరిగి వచ్చాను అంటున్నారు.
దీనికి మీ కవిత బావుంది అని కొంత మంది అనడమూనా?

అసలు
అక్కడకు వెళ్ళాలి అనే ఆలోచన రావడమే దారుణం.
అందులో ప్రేమించిన వాడికి రావడం మరీ ఘోరం.
ఆ ఆలోచనను అమలులో పెట్టి అక్కడి వరకూ వెళ్ళడం నీచం.

కానీ, ఇంతటి దౌష్ట్యాన్నీ అందమైన పదాల్లో పెట్టి
దాన్ని కవిత అనీ, పది మందితో భలీ అనిపించుకోవడం...కత్తి బాస్!!!

మీరు సామాన్యులు కారండీ బాబు, రావణ బ్రహ్మలు. :-)

-భరత్

Kathi Mahesh Kumar said...

@భరత్: బహుశా మీరు కవిత పూర్తిగా చదవలేదనుకుంటాను. అప్పటి వరకూ ఆ అమ్మాయిని కేవలం కాంక్షించి వెళ్ళిన నాయకుడు ఆ క్షణంలో తననే ప్రేమించాడనే స్పృహకొచ్చి వెనుదిరుగుతాడు. ఇక్కడ తన మొదటి ఆలోచనకన్నా, నిర్ణయానికి ప్రాముఖ్యత పెరుగుతుంది.

అయినా, ఈ నాయకుడు సామాన్యుడు.తప్పు చేసే అవకాశం వచ్చినా (ఆక్షణంలో)ప్రేమించాననే స్పృహ కలిగాక వెనుదిరిగి మాత్రమే నాయకుడవుతాడు.అవకాశం రాక శ్రీరాముళ్ళుగా మిగిలే మనుషులకన్నా, అవకాశం వచ్చీ తన నిర్ణయాన్ని మార్చుకున్న ఈ పాత్రే నావరకు నాయకుడు.

కాంక్షలోకూడా నీచత్వం ఉందని నేను భావించడం లేదు. కాకపోతే ఆ సుఖంకన్నా ప్రేమలో (శాశ్వత)ఆనందం ఉందనే ఒక ఆలోచనకు అక్షరరూపమే ఈ కవిత.

ఈ కవిత చదివి ఒక మిత్రుడు "చివరకు మిగిలేది"లో దయానిధి గుర్తొచ్చాడు అన్నారు.బహుశా నా subconscious లో ఆ నాయకుడే ఉన్నాడేమో!

Indiraatluri said...

You write very beautifully.....I can feel the emotions in your words really. Keep up the good work Mahesh!

Gopala said...

బావుందండీ కవిత్వం... బుచ్చిబాబు నవల "చివరికి మిగిలేది" లో హీరోకి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంది. అప్పటికి కాంక్షించిన మనసు, ఆ కాంక్ష తీరే అవకాశం దొరికిన క్షణాన ప్రేమించడం మొదలెడుతుంది! అసలీ ప్రేమ అనేదే ఒక అద్భుతమైన, అందమైన, భయంకరమైన, భయానకమైన ఒక భావన అనుకుంటాను! ఎప్పుడు ఏ రకంగా పరిణమిస్తుందో ఎవరికీ తెలియదు!

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ said...

kavita bavundi