Thursday, January 29, 2009

బీజేపీ -కాంగ్రెస్ దొందుదొందే!

బీజేపీ ఆధ్వర్యంలోని కర్ణాటకలో సాంస్కృతిక పరిరక్షణ పేరుతో రౌడీమూకలు పబ్బులపై దాడిచేసి అమ్మాయిల్నీ అబ్బాయిల్నీ పైచాచికంగా కొడితే, ఇప్పుడు కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ ప్రభుత్వం పబ్బులు, మాల్స్ తోపాటూ అమ్మాయిలూ అబ్బాయిలూ చట్టాపట్టాలు వేసుకుని తిరిగే "అసభ్య" సంస్కృతిని రూపుమాపే ప్రయత్నంలో పడింది. రామసేనకూ మాకూ ఎటువంటి సంబంధం లేదని బీజేపీ విదిలించేసుకుంటే, ఇక్కడ ఏకంగా ముఖ్యమంత్రి అశోక్ గెహలోట్ సగర్వంగా ఈ చర్యలు చేపట్టడానికి తయారయ్యాడు. పైగా, క్రింతం పరిపాలించిన వసుంధరా రాజే (బీజేపీ)ప్రభుత్వం ఈ సాంస్కృతిక హీనతకు కారణమని ఎద్దేవాకూడాచేశాడు.

ఏది ఏమైనా రాజకీయ పార్టీలూ, రౌడీమూకలూ భారతీయ సంస్కృతంటే ఏమిటో డిసైడ్ చేసిపారేసి ఫాలో అయిపోమని చెప్పడానికి రెడీగా తయారయిపోయారు. రేపు ప్యాంటెందుకు వేసుకున్నావని నా కాళ్ళనూ, ముక్కుపుడకెందుకు పెట్టుకోలేదని మరో మహిళ ముక్కునూ ఈ సాంస్కృతిక పిచ్చోళ్ళు నిర్ధాక్షిణ్యంగా నరికేసినా,కోసేసినా మనం మాత్రం జేజేలు పలుకుతూ ఉందాం.

****

7 comments:

Anonymous said...

సంస్కృతా! అది మన దేశంలో ఎక్కడ ఉంది? పల్లెటూర్లలో దేవతా విగ్రహాలకి జంతువులని బలిచ్చే మూఢ భక్తులు నుంచి పట్టణాలలో బిర్యాణీ పార్టీల కోసం కోళ్ళని, మేకల్ని మర్డర్ చేసే మెటాఫిజికల్ భోగ రాయుళ్ళ వరకు అనేక మంది కల్చర్ లెస్ పీపుల్ మనకి దర్శనం ఇస్తారు. బర్త్ డే పార్టీలు జరుపుకోవడం మన సంస్కృతి కాకపోయినా, బర్త్ డే పార్టీ డిన్నర్ కోసం కోళ్ళని, మేకల్ని మర్డర్ చేసే సంస్కృతిని ఆచరిస్తారు. ఆడవాళ్ళతో బిహేవ్ చేసే విషయంలో మాత్రం మన సంస్కృతి చాలా నీచ నికృష్టంగా కనిపిస్తుంది.

శ్రీనివాస్ పప్పు said...

ఇదింకా మొదలే.మళ్ళీ కాంగ్రెస్ కొన్ని చోట్లా,బిజేపీ కొన్ని చోట్లా రావాలి,మరింకోడు మరోచోటా రావాలి,వాడి మీద వీడూ,వీడి మీద వాడు మతపు మరణహోమాలు జరపాలి,కులాల కుంపట్లు ఇంకా ఎగదొయ్యాలి,అక్కర్లేని బురదంతా చల్లాలి,ఒకడ్ని ఒకడు క్రికెట్టాట ఆడుకున్నట్టు నరుక్కోవాలి,అంపైర్లంతా వాళ్ళకి కావల్సిన వాళ్ళకి న్యాయం చెప్పాలి,ఇలా నరుక్కుని నాశనమయిపోతే చివరికి అప్పుడే శాంతి జరిగినట్లేమో?...

కన్నగాడు said...

"ఆడవాళ్ళతో బిహేవ్ చేసే విషయంలో మాత్రం మన సంస్కృతి చాలా నీచ నికృష్టంగా కనిపిస్తుంది."
అయ్యా మార్తాండ గారు కనిపించే 'ఆడవాళ్ళతో ప్రవర్తన' మన సంస్కృతి కాదండి.

Anonymous said...

please visit my blog- dhoommachara.blogspot.com

-dhoom

Naga said...
This comment has been removed by the author.
Anonymous said...

Ayya katti mahesh garu, BJP , CoNGRESS la sangati pakkan vunchite, mana BHARATIYA SAMSKRUTI grunchi matlade arhata pabbulki velle vallaki vundantara? Inni Kaburlu chebutunna maname mana akkgani, chelligani pubki velli tappa tagi gantuluvestunte sahimchagalama? Mahilalapai dadi tappu kaavachhu kaani taapatagi vollu teliyakunda nalugurito dance cheyyadam samskruti antara?Martandagaru jantubalulu tappu ani naa chinnanati nundi nenu vadistune vunnanu,vuntanu..Daniki, bharatiya varasatva sampadaku mudipetti matlaadavaddani manavi..Samskrutigurinchi matllade mundu manamekkada vunnam ani alochinchalani manavi.Naa maatalu evarini kinchaparachalani kaadu..Kaani samskruti gurinchi meeru maatlade maatalu chooste badha anipinci e vyakhyalu post chestunnau..

Anonymous said...

మన దేశంలో కొంత మంది డబ్బున్న వాళ్లు పాశ్చాత్య సంస్కృతిని వెర్రిగా అనుకరిస్తున్నారు. అది అనుకరించడం అంత అవసరమా కాదా అని ఆలోచించరు. పశ్చిమ దేశాలలో పదమూడేళ్ళ అమ్మాయిలు కూడా గర్భ నిరోధక మాత్రలు వాడుతారు. తూర్పు దేశాలలో ఏ తల్లి తండ్రులైనా ఆ వయసులో ఉన్న తమ ఆడ పిల్లలకి గర్భ నిరోధక మాత్రలు కొనివ్వగలరా? మాది కూడా డబ్బున్న ఫామిలీయే కానీ నేను నా పన్నెండవ యేటే బర్త్ డే పార్టీలు జరుపుకోవడం మానేశాను. ఇప్పుడు ఆఫీసర్లని చూసి క్లర్కులు కూడా తమ పిల్లలకి బర్త్ డే పార్టీలు జరుపుతున్నారు. డబ్బున్న వాళ్ళు ఏ గడ్డి తింటే మిడిల్ క్లాస్ వాళ్ళు అదే గడ్డి తింటారు.