రాయడం(బ్లాగడం) తగ్గింది: ఏమిటీ..ఈ మధ్య రాయడం తగ్గించారూ? అని అడిగారొక బ్లాగ్మిత్రులు. ఆ ప్రశ్నతోపాటూ, possible answers కూడా ఆరా తీసారు. ఉద్యోగంలో వ్యస్థతా! ఆర్థిక మాంద్యం ఎఫెక్టా!! వ్యాఖ్యాతల బాధలు పడలేకా లేక రాయడానికి ఏమీ మిగల్లేదా !! అని. ఈ నెలలో అతితక్కువ రాసే సమయం దొరికింది. ఉద్యోగంలో డిసెంబర్-జనవరి నెలల్లో పనిదినాలు చాలా తక్కువ ఉండటం వలన, ఉన్న కొద్దిరోజుల్లోనే నెలకు సరిపడా పని తగలడంతో..పనేపని. ఇక శెలవులంటారా! హైదరాబాద్ వచ్చాక శెలవుల్లో చెయ్యాల్సిన పనులూ,కలవాల్సిన మిత్రులూ, చూడాల్సిన సినిమాలూ,చదవాల్సిన పుస్తకాలూ చాలాచాలా తయారయ్యాయి. అందుకని బ్లాగడానికి సమయం తగ్గింది. ఇక mandatory భోపాల్ ప్రయాణాలు సరేసరి.
ఆర్థికమాంద్యానికీ నా ఉద్యోగానికీ పెద్ద లంకె లేదుకాబట్టి ఆ టెన్షన్ ప్రస్తుతానికి లేనట్టే. వ్యాఖ్యాతల బాధలు (అవి బాధలనుకుంటే) పడలేకుంటే,నేను బ్లాగడం ఎప్పుడో అపెయ్యాల్సింది.కాకపోతే నా చర్మం మందం కాకపోయినా, హృదయం విశాలం కాబట్టి అవెప్పుడూ సమస్యగా అనుకోలేదు. బ్లాగు రాసుకునేది ఎవర్నో ఉద్దరించడానికి కాక నాకోసం కాబట్టి, బ్లాగడం కొనసాగించడం పెద్ద విషయమూ కాదు. ఇక రాయడానికి ఏమీ మిగలని రోజున జీవించడం మానేస్తానంతే! If you have no story to tell, that only means you have no meaning left in life అనిపిస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో కథలు చెప్పడానికి బ్లాగుతోపాటూ మరిన్ని అవకాశాలు దొరకడం మరో కారణం అనుకుంటా బ్లాగులో రాయడం తగ్గించడానికి. ఔత్సాహిక సినిమా జనాలతో కథా చర్చలూ, సాహితీవేత్తలతో సాహిత్య విమర్శనాలూ, పాత మిత్రులతో nostalgic trips, future plans...హమ్మో! బోలెడు విషయాలు జరుగుతూనే ఉన్నాయి. ఇన్ని అనుభవాల్నీ రాయాలి...ఇంకా రాయాలి.
బ్లాగులు -బాధలు: "The first key to writing is... to write, not to think!" అంటాడు Finding Forrester అనే ఆంగ్ల చిత్రంలో Sean canary పాత్ర. బ్లాగుల ఫిలాసఫీకూడా అదే. రాయాలంటే...just రాసెయ్యడమే! బ్లాగులున్నదే అందుకోసం కదా! ఆలోచనలు చెప్పడానికి. అభిప్రాయాలు పంచుకోవడానికి.అనుభవాల సారాల్ని, జీవితంలో నేర్చుకున్న పాఠాల్నీ అక్షరాలలో పొదిగి పదిల పర్చుకోవడానికీ, పదిమందితో పంచుకోవడానికే బ్లాగుంది. అలా కాకుండా తెలుగు బ్లాగుల్లో లేక సొసైటీ ఇన్ జనరల్ లో పేరుకుపోయిందనుకున్న భావదాస్యాన్ని,ఆభిజాత్యాన్నీ,సా
చచ్చేచావు: కొందరు ఛస్తేగానీ వారి గొప్పతనం గుర్తింపబడదు. కొందరు ఛస్తామని చెప్పుకుంటేనో లేక ఇంకొకర్ని చంపితేనోగానీ వారి అస్థిత్వానికొక విలువరాదు. మొత్తానికి ఈ చావుల్తో పెద్ద చిక్కొచ్చిపడింది! చావుతోగానీ దేవదాసు ప్రేమకథ అమరం కాలేదు. చంపితేగానీ కొందరు ఉన్మాదుల ప్రేమకథలు టీవీ తెరకెక్కి ప్రజల మనసుల్లో స్థానం సంపాదించలేదు. ఒక ప్రేమకథ త్యాగం పేరుతో చేతకానితన్నాన్ని నూరిపోస్తే, మరో రకం ప్రేమలు, ప్రేమంటేనే గుండెలు జారిపోయేలా చేసాయి. ఏదిఏమైనా రెండూ చావు కథలే. మన చావుకొచ్చిన కథలే!
దొరకని పుస్తకాలు: పట్టువదలని పుస్తకమార్కుడిలాగా మళ్ళీ విజయవాడ లెనిన్ సెంటర్లో పాత పుస్తకాల షాపుపైకి కత్తి పట్టుకుని బయల్దేరాను. దాదాపు నాలుగు సంవత్సరాలుగా చివుకుల పురుషోత్తం 'మహావేద', డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ 'శ్రావణి',స్పార్టకస్ 'ఖాకీ బతుకులు' నవలల్ని వీలైనన్ని చోట్ల వెతుకుతూనే ఉన్నాను. నవయుగా,ప్రజాశక్తి,దిశ,ఎమెస్కో,
Sunday, January 25, 2009
ర్యాండమ్ ఆలోచనలు
Posted by Kathi Mahesh Kumar at 9:16 AM
Labels: వ్యక్తిగతం
Subscribe to:
Post Comments (Atom)
18 comments:
ur 100% right..
నువ్వు ఎక్కువగా రాసినా బాధే.. తక్కువ రాసినా బాధే. అలా అలవాటైపోయింది నీ బ్లాగు చదువరులకు. :)
ఈ చచ్చే చావుల సంగతి ఆసక్తిగానే ఉంది. వివరంగా రాయొచ్చుగా!
అయితే సినిమాల మీద మాకు బోలెడు కబుర్లు రెడీగా ఉంచారన్నమట.
"If you have no story to tell, that only means you have no meaning left in life అనిపిస్తుంది. " - బ్లాగటం సరే! ఆ బ్లాగే సమయం ఒక కొత్త పుస్తకం చదువుకుంటానికో, మంచి సంగీతం వినటానికో వినియోగించి ఆ క్షణాలను మనవి గా చేసుకుని -ఆనందిస్తే. కెనడా, అమెరికాల లో ఎన్నో ప్రదేశాలు చూశా. చూస్తున్నా. ఈ సమయంలో బ్లాగు రాయలేకపోయానన్న విచారం లేదు. ఇది స్వార్థమా?
బ్లాగు తలుపులు మూసివేసి కొందరికే ఆహ్వానం పంపే కొత్త దశకు చేరింది బ్లాగ్లోకం. ఇంకొన్నాళ్లకు ఫలానావారు బ్లాగు మూసివేత ప్రకటన ఇస్తే ఆశ్చర్య పోయేవాళ్లు తక్కువయితే-దానికి ఏమిటనర్ధం? మనం మరికొన్ని కాగడాలు, దివిటీలు, టార్చ్ లైట్ బ్లాగులకు అలవాటు కూడా పడతామేమో!
మీ పోస్టుల్లో 90 శాతం చెత్త అయినా కొన్ని చాలా బాగుంటాయి. అపుడపుడు రాస్తుండండి.
జీడిపప్పు గారు:)
హమ్మయ్య ఇంకా రాస్తారన్న మాట!
జీడి పప్పు. హ హ్హ హ్హ. భలే వారండీ! అలాంటి సున్నితమైన పేరెట్టుకుని మరీ ఇలా మిరియాల ఘాటు గుప్పిస్తే ఎలాగా? :) ఐనా పర్లేదులేండు. మహేశుడు గట్టోడు, తట్టుకోగల్డు.
మహేశా .. చచ్చేచావు .. నిజంగా నిజం.
కళ్ళంటూ ఉంటే చూసీ వాక్కుంటే వ్రాసీ అన్నాడు మహాకవి. నీ బ్లాగుకేం ఢోక లేదు.
నిజమే మహేష్, నేనూ బ్రతికేసా చానాళ్ళు మానులా, మాకులా ఇపుడిపుడే జీవించటం నేర్చుకున్నా, అందులో భాగమే వ్రాయటం, బ్లాగటం. ఇకపై ఇలాగే జీవించాలనే అదీ చచ్చేదాకా ఇలాగే జీవించాలనివుంది. బాగా వ్యక్తపరిచారు, మీ భావాలు.
@ కొత్త పాళీ
ఘాటు జీడిపప్పు :)
నాకలాగే అనిపిస్తుంది మహేశ్ గారి పోస్టులు చూసి. హెడ్డింగ్ చూసి ఊహించేయవచ్చు నేను చెప్పిన "చెత్త పోస్టు" ల్లో ఏముంటుందో!! Of Course అవి నాకు అనవసరం. కొన్ని పోస్టులు ఎలా ఉంటాయంటే "ఇంత బాగా ఇంకెవరయినా వ్రాయగలరా" అనిపిస్తుంటాయి. అందుకే నేను "కాస్త" మహేశ్ గారి అభిమానిని. ఆయన పోస్టాలి, మనము రీడాలి :)
మహేశ్ గారు, సహృదయంతో నా మొదటి కామెంట్ allow చేసినందుకు ధన్యవాదాలు.
@జీడిపప్పు:నా బ్లాగుల్లో నాకు ఇష్టం వచ్చింది రాసుకునే అధికారం ఎలా ఉందో,పాఠకులకు వాటి మీద అభిప్రాయాలు ఏర్పరుచుకునే హక్కూ అలాగే ఉంది. అలాంటిదే మీ అభిప్రాయంకూడా.కాబట్టి,సమస్యే లేదు.
@ఉష: ఏదో ఒక విధంగా మనిషి తన భావాల్ని express చెయ్యడం ముఖ్యం. అప్పుడే జీవించిన అనుభవం conscious గా మిగులుతుంది.
@cbrao:బ్లాగటం అనేది జీవిత అనుభవాలకు అక్షరరూపం. మీరు చెప్పినవి జీవిత అనుభవాలు. అవి లేకపోతే బ్లాగే అవసరమే లేదు.
@సుజాత: సినిమాల గురించి బోలెడు కబుర్లు తయారవుతున్నాయి లెండి!
@జ్యోతి:నిజమే!!!
@kothapaali.
kruvrudhaa !
gattivaadu ite laabham ledu. nuvvu cheppavu kadaa tOlu mandam cEsukovalani. alaa i poyaaru blaagarlandaru.
కొంతమంది బ్లాగ్స్ రాయటం మానేస్తున్నారు అని
మా హజ్బెండ్ తో చెప్తే, "కత్తిమహేశ్ గారు రాయటం మానేస్తే నువ్వు బ్లాగ్స్ చదవటం మానేస్తావేమో" అని టీజ్ చేసారు.
అలాంటి అవకాశమే లేదని ఈ రోజు చెప్పేస్తాను.
I was looking for books on 'Janapadageyalu' in Vijayawada last year. Navodaya Ramamohana Rao directed me to a road parallel to Eluru Road (about 1o minutes from his book shop) and I found quite a few second hand books there.
డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ గారి 'శ్రావణి' పుస్తకం మా ఇంట్లో ఉండేది. (ఈసారి ఇండియా వెళ్ళినప్పుడు ఇంకా ఉందో లేదో వెతకాలి). ఆ పుస్తకం నేను చదవలేదు కానీ, దాని గురించి నేను విన్నదాన్నిబట్టి మీరు అంతగా వెతకాల్సినంత సీను దానికి ఉందా అని నాకో సందేహం.
మహేష్ కుమార్ గారు, మీ వ్రాతలు కత్తండి. భావస్వేచ్చ చాలా అవసరం. మీ భావాలు చాలా బావుంటాయి balanced ga
ఖాకి బతుకులు పుస్తకం విజయవాడ నవోదయలో దొరుకుంతుందేమో ప్రయత్నించండి.
మహేష్ బాబూ! కత్తి.
కందము:-
ర్యాండమ్మాలోచనలో
నిండగు మీ భావ స్వేచ్ఛ తృప్తిని గొలిపెన్.
మెండగు వ్యాఖ్యలు కూడా
దండిగ స్వేచ్ఛా యుతంబు. దర్పణ మననౌన్.
పేర్లోనే ఉందిగా. ప్రత్యేకంగా 'పట్టుకుని బయల్దేరటం' ఎందుకు!?!
I have 'spartacus'.
I don't like the mood. But I know it's a good book. manaki nachhanidi anthaa chetta kaadugaa.
If you really want it, ...
Post a Comment