Sunday, May 4, 2008

తెలుగు సినిమాని ఉద్దరించాలి !

అర్జంటుగా, తెలుగు సినిమాని ఉద్ధరించాలి !

చైతన్యం తో కాకున్నాకాస్త 'చాయ్'తన్యం తో నైనా నిద్రలేపాలి

"బాబులు" బాంబుల సంస్కృతి ని

బలవంతంగా పేల్చెయ్యాలి

వారసత్వపు హీరో ల

భరణం బర్తరఫ్ చెయ్యాలి

భాష రాని భామల్ని

'బరహ' లో భర్తీచెయ్యాలి

పొగాకు పచ్చళ్ళ పైసల్ని

కాల్చేసి పాతర వెయ్యాలి

దొమ్మరాట దర్శకుల్ని

దాస్యం నుండీ దాటెయ్యాలి

నవతరంగం తన నాలుక తో పాటు

నాగళ్ళకు కూడా పదును పెట్టి,

తెలుగు సినిమా ని దున్నెయ్యాలి

కొత్త పంట పుట్టించాలి

అర్జంటుగా, తెలుగు సినిమాని ఉద్దరించాలి!

2 comments:

రాధిక said...

మీకు సినిమాల మీద పట్టుతో పాటూ సాహిత్యం మీద కూడా పట్టున్నట్టు కనిపిస్తుంది.మరి మీరు సాహితీయానం ఎందుకు చెయ్యకూడదు?మీ నుండి మంచి కవితలు ఆశిస్తున్నాను.

Kathi Mahesh Kumar said...

రాధిక గారు,
సినిమా నా జీవిత గమ్యమైతే, సాహిత్యం అందుకు రాచమార్గం అని అని నమ్ముతాను.ఇప్పటివరకూ మనిషికి వచ్చిన గొప్ప అలోచనలు,అభిప్రాయాలు,అనుభూతులు అక్షరబద్దమై సాహిత్యం లో ఉంటాయని నా నమ్మకం.

ఇక కవితా వ్యాసంగం అంటారా,ఈ విషయం గూర్చి ఎప్పుడూ ఆలోచించలేదు.స్కూలు కాలేజిల్లో కొన్ని కవితలు రాసినా,వ్యాసాలలోనే నా భావప్రకటన బాగున్నట్టనిపించి మానేశా! మీరు చెప్పింతర్వాత మళ్ళీ ఆలోచనలో పడ్డానండోయ్.