ఈ మధ్య (ఈ రోజు కూడా) కొందరు సినీ ఔత్సాహికుల మధ్య జరిగిన చర్చల్లో (www.navatarangam.com), ప్రపంచ సినిమా అదీ ముఖ్యంగా యూరోపియన్ సినిమాలు ఉత్తమమైనవి కావున, అవి అనుకరణీయాలని చెప్పడం జరిగింది. అవిగొప్పవని నేనుకూడా అంగీకరిస్తాను, కానీ నా సమస్యల్లా... యూరోపియన్ న్యూవేవ్ దిశగా మన తెలుగు సినిమా స్థాయిని ఒక్కసారిగా పెంచాలనుకోవడం. ప్రపంచసినిమా (ముఖ్యంగా యూరోపియన్ న్యూవేవ్ ) పుట్టిన సామాజిక,రాజకీయ మరియు సైద్ధాంతిక పరిణామాల్ని హఠాత్తుగా మనం తెలుగు సినిమాలో కోరుకుని,ఆ విధంగా మార్పుని ఆశించడం అంత అభిలషణీయమా కాదా? అని మాత్రమే.
తెలుగు సినిమా పరిణామక్రమాన్ని అర్థం చేసుకుని,ప్రస్తుతం ఉన్న ఝాడ్యాలను గుర్తించి, కీలెరిగి వాత పెడితే మంచిదేమో అని నా ఆలోచన. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఎట్లా? మన నేఫధ్యం వేరు, పరిస్థితులు వేరుకాబట్టి మన ఎదుగుదల ‘కొత్తదారి’ కూడా వేరుగా ఆవిర్భవింఛగలదని నా ఆశ. అంతేకాక ఒక సగటు ప్రేక్షకుడిగా, ఉట్టినెక్కలేనమ్మ ఆకాశానికి ఎగిరినట్టు, తెలుగు సినిమాని(యూరోపియన్ సినిమా జతలో) ఆకాశం లో ఒక్కసారిగా కూర్చోబెట్టడం నాకు ఊహించనలవికాని స్థితి. Aspiration is good,but not unrealistic expectation.
గొప్ప సినిమా అంటే, ఫార్మ్ (విధానం) అండ్ కంటెంట్ (విషయవస్తువు) రెండూ సమపాళ్ళలో కల్గి ప్రేక్షకుడికి “రస స్పందన” కలిగించేది అనుకుంటే, తెలుగు సినిమాని మొదట “రసమున్న”(కంటెంట్ ఉన్న) మంచి సినిమా దిశగా నడిపించి కొత్త రూపాంతరం చెందింపజేసి, గొప్ప సినిమా సరసన నించోబెట్టాగలమన్నది నా భావన. Though I wish for a revolution, I prefer a “change” keeping the possibilities in view.
ఇలా చేయగలిగితే బహుశా, we can find new language and grammer to cinema, which might be uniquely different from Europian masters. అంతే కాక అది నిజంగా "మన సినిమా" అవుతుందేమో !?!.
Monday, May 5, 2008
తెలుగు సినిమా లో,యూరోపియన్ సినిమా కళ రావాలా?
Subscribe to:
Post Comments (Atom)
1 comments:
mahesh
u gave gud clearity btween both streams.its gud thng u hav done.it helps me a lot 2 get clearity.
satya.b
Post a Comment