Sunday, November 16, 2008

కులాల కురుక్షేత్రం

చెన్నై లోని అంబేద్కర్ లా కాలేజిలో జరుగుతున్న సం‘కుల’సమరం నేపధ్యంలో మళ్ళీ కులచర్చలు వీధుల్లోకొచ్చాయి.దళితుల్లో సామాజిక స్పృహ పెరిగినకొద్దీ కులఘర్షణలు తీవ్రరూపం దాలుస్తున్నాయన్నది ఎవరూ కాదనలేని సత్యం . అగ్రకులాలుదీన్ని, ‘అతిగా స్పందించడం’ అంటుంటే, దళితులు ‘వారి ఎదుగుదలకి ఓర్వలేని అగ్రకులాల దాష్టీకానికి వ్యతిరేకంగా ఈ ఘర్షణలు జరుగుతున్నాయి’ అంటున్నారు. రెండుధృక్పధాలూ పాక్షికంగా సరైనవే, కానీ తమిళనాడు చారిత్రక నిజాల వెలుగులో చూస్తే ఈ generalization అంత సులభం కాదనిపిస్తుంది.


తమిళజాతీయవాద స్ఫూర్తితో బ్రాహ్మణులకు వ్యతిరేకంగా మొదలైన ద్రవిడ/తమిళ ఉద్యమం అగ్రకుల ఆధిపత్యానికి సవాలుగా జరిగినా, బ్రాహ్మణేతర కులాలు దళిత అజెండాని ఈ పోరాటంలో భాగం చెయ్యక దళిత ఉనికిని మరుగుపరిచారని దళితమేధావుల వాదన. దీంతో సామాజిక, ఆర్థిక,రాజకీయ పరంగా దళితులు వెనక్కునెట్టబడి, ఇప్పటికీ (కనీస) మానవహక్కులకోసం నిత్యజీవన పోరాడటం సాగిస్తున్నారు.తమిళ అస్థిత్వసాధనలో, హిందీ hegemony కి వ్యతిరేకంగా తమిళసంస్కృతి పునర్జీవనం జరిగినా, అందులోనూ దళితులకు సముచిత స్థానం లభించలేదు. గుళ్ళో ప్రవేశం, పూజల్లో వివక్ష, మతంలో సముచిత స్థానం ఇంతవరకూ ప్రశ్నార్థకంగానే ఉంది. ఇప్పటికీ జీవించడంలోనే కాక చావులోకూడా ఈ వివక్ష కొనసాగటం ఈ వివక్షవిస్తృతత్వానికి అద్దం పడుతుంది.


ఇదే నియో-అగ్రకులభావజాలం ఒకవైపు రాజకీయ వ్యవస్థలో ప్రతిఫలిస్తే, మరోవైపు అధికారవ్యవస్థ నిర్మాణానికి ఇదే మూలంకావడంతో పరిస్థితి విషమించింది. ఒకవైపు సమాజం, మరో వైపు ప్రభుత దళితవ్యతిరేక భావజాలానికి ఆధిపత్యం వహిస్తే, ఒకమూలకు త్రోయబడ్డ దళితులు ప్రతిఘటించడంతప్ప మరేమీ చెయ్యలేని నిస్సహాయులయ్యారు. ఈ నిస్సహాయతలోని ఉక్రోషం ఒకవైపు అడుగడుగునా తక్కువచెస్తున్న అగ్రకులాలపై కోపం మరోవైపు, ఇవన్నీ చూస్తూకూడా నిమ్మకునీరెత్తినట్లుండే ప్రభుత్వం,రాజకీయవ్యవస్థపై తిరుగుబాటు ధోరణి ఒకవైపూ ఏకమై ఈ ఘర్షణలు జరుగుతున్నాయి.


ప్రస్తుతం జరిగిన ఘటనకు మూలం కాలేజి పేరులోని ‘అంబేద్కర్’ పేరుతొలగించి దేవర్ కులస్థులు ఒక కరపత్రాన్ని పంచడం. దళిత ఆత్మగౌరవానికీ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుకీ విడదీయరాని సంబంధం ఉందని తెలిసీ ఈ పని చెయ్యడం దేవర్ కులస్థుల అహంకారానికి ప్రతీకైతే, హింసకుపూనుకోవడం పల్లవర్ కులస్తుల పోరాటస్ఫూర్తిలోని లోపాలను ఎత్తిచూపుతుంది. ఈ రెండు సామాజిక పార్శ్వాలకూ వారికారణాలు వారికుంటే, ఉద్రిక్త పరిస్థితి తెలిసీ ముందస్తుజాగ్రత్తలు తీసుకోని కాలేజీ యాజమాన్యం(ప్రిన్సిపాల్), ఘర్షణ సమయంలో అక్కడుండీ చోద్యం చూసిన పోలీసుల పాత్రమాత్రం సిగ్గుపడేలాగా ఉంది. ఇలాంటి ఘర్షణలకు ఊతమచ్చి తమ రాజకీయ పబ్బంగడుపుకునే రాజకీయ పార్టీల తీరు అత్యంతహేయం.

ఈ పరిస్థితుల చారిత్రక నేపధ్యం గురించి తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవండి.

DALITS IN DRAVIDIAN LAND — Frontline Reports on Anti-Dalit Violence in Tamil Nadu 1995-2004: S. Viswanathan; Pub. by Navayana Publishing, I Floor, 12/293, Ahmed Complex, Royapettah High Road, Chennai-600014. Rs. 300.


****

7 comments:

శరత్ కాలమ్ said...

కుల, మత రహిత సమాజం వున్నంత వరకు, వాటి ఆధారిత రాజకీయాలు పనిచేస్తున్నంతవరకూ ఇలాంటి కక్షలు, కార్పణ్యాలు వుండటము లో ఆశ్చర్యం లేదు.

SaveNatives said...

కత్తి,

You started discussion on contentious and most important contemporary social/political/international issue.

Lets start the discussion with few questions.

1)Who are these దేవర్ కులస్థులు. Are they still practicing Hinduism? or they were converted to Christianity or Islam or Comunists?

2) Who are these పల్లవర్ కులస్తులు? Answer to the queston raised on (1) here also.

3) What is the role of Politicians in this incident? Is anti-Hindu DMK is creating all these issues before the elections? Don't forget that DMK threatened Manmohan, that if he did not solve Tamil issue in Sri Lanka, Karunanidhi will withdraw his support.

4) What is the role of rabid/terroristic Christian Missionaries in this issue.

5) And what was the role of Islamic Mullas and Communists in this issue?

6) What was the role of Upper Castes?

7) What was the role of South/North animosity?

8) What is the role of anti-Hindu media?


Don't underestimate point (4). Those terrorists play the same game (divide and rule) all over the world to rule over Natives.

Kathi Mahesh Kumar said...

@SaveNatives: నాదగ్గర కేవలం మీరడిగిన రెండుప్రశ్నలకిమాత్రం సమాధానం ఉంది. కారణం అవి factual information కాబట్టి. మిగతావి,ఆధారం చూపలేని అనుమానాలు లేక ఊహలు మాత్రంగానే ఎవరైనా చెప్పగలరు. In this issue speculations would render the discussion useless.

1.దేవర్ కులస్తులు అగ్రకుల హిందువులే. ఇప్పటికీ హిందూమతాన్ని అవలంభిస్తున్నవాళ్ళే. వీళ్ళని ‘మరవార్లు’ అనికూడా పిలుస్తారు.తమిళ వీరులజాతికి చెందిన కులంగా వీరికి గుర్తింపు ఉంది. భూస్వాములవడం వలన చాలా బలమైన సామాజికవర్గం.కమల్ హాసన్ నటించిన "క్షత్రియ పుత్రుడు" ఈ కులంగురించే.తమిళ్ లో ఆ సినిమా పేరు "దేవర్ మగన్".

2.పల్లవర్ కులస్తులు దళితులు. వారిలో కొందరు క్రైస్తవమతంలో చేరినవాళ్ళున్నారు.

SaveNatives said...

కత్తి,

Thank you for answering two questions. We will find out answers to other questions. They are very relavent discussing caste clashes in India.

Answer to (2) question is important.
"పల్లవర్ కులస్తులు దళితులు. వారిలో కొందరు క్రైస్తవమతంలో చేరినవాళ్ళున్నారు."

History is litered with countless incidents of Christian Missioanries penetrate unsuspecting natives, and "divide and rule" them.

Please read the history and current events in Nort East States to understand Missionary Terrorism.

Naxals are supported and handled by Christian Missionary Terrorists. They supply money, men, materials, arms, media support to Naxalites.

I know you may say these are baseless allegations. Either you are like Gandhari/Dhritarastra who bilded themselves on Dhuryodhans mis-deeds or know everything and to raise all thse controversial topics to poke at Hindus.

Anonymous said...

ఓహో, ఈ కులాల కురుక్షేత్రం వెనక, క్రైస్తవమూ, వారి మతమార్పిడీ ఉన్నాయన్నమాట! Savenatives, నెనరులు

శరత్ కాలమ్ said...

నా క్రితం వ్యాఖ్యలో పొరపాటు వుంది. సవరణతో క్రింద:

కుల, మత రహిత సమాజం రానంత వరకు, వాటి ఆధారిత రాజకీయాలు పనిచేస్తున్నంతవరకూ ఇలాంటి కక్షలు, కార్పణ్యాలు వుండటము లో ఆశ్చర్యం లేదు.

Kathi Mahesh Kumar said...

@చదువరి: ఇప్పటి గొడవకీ క్రైస్తవమతమార్పిడులకీ సంబంధం లేదు. ఇది కాలేజిలో జరుగుతున్న socio-political power politics లో భాగం మాత్రమే. ఈ కాలేజిలో ఇదివరకూకూడా ఇలాంటి కులపోరాటాలు జరిగిన చరిత్ర ఉంది.

తమిళనాడు కులdynamics ని అంత oversimplification తరహాలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకండి.అందుకే ఈ పుస్తకం చదవమని చెప్పాను.