Sunday, November 30, 2008

మతం - మతవాదం - మతోన్మాదం


ముంబై మారణహోమం నేపధ్యంలో మతాన్నీ, మతవాదాన్నీ, మతోన్మాదాన్నీ ఒకేగాటనకట్టి చాలామంది తమ భావజాల జాలాన్ని విజయవంతంగా అల్లడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ తరహా ప్రశ్నలు రాజకీయఉద్దేశాలను సాక్షాత్కరించగలవేగానీ సమస్యకు సమాధానాన్ని కాదు.


మతం: ఒక పుస్తకాన్ని,ప్రవక్తను లేక ఒక నిర్దేశించబడిన/ వివరించబడిన విధానాన్నిఆధారం చేసుకుని దాన్ని అనుసరించి జీవితాన్ని గడపడం. హిందూ మతం ఒక నిర్ధిష్టమైన code నుంచీ ఉద్భవించలేదు. కానీ క్రైస్తవం యూదుల మతానికీ రోమన్ సామ్రాజ్యానికీ వ్యతిరేకంగా ఉద్భవించింది, ఇస్లాం జుడాయిజం,క్రైస్తవంలోని అవినీతికి వ్యతిరేకంగా మహ్మదు ప్రవక్త సమర్పణ భావానికి ప్రతీకగా ఆవిర్భవించింది. నిజానికి ఇస్లాం అంటేనే భగవంతునికి సమర్పించబడింది అని అర్థం. క్రైస్తవం ఇస్లాం అవిఉద్భవించిన చారిత్రక స్థితినిబట్టి మతాలుగా వ్యాప్తిచేందే దిశలోనే మతవాదాలుగా మారిపోయాయి.

మతవాదం: ఒక రాజకీయ ప్రయోజనన్ని ఆశించి అనుకూలమైన మతం మాత్రమే పాలనకు అర్హమైనదిగా భావించడం. ఆ భావజాలం నేపధ్యంలో మిగతా మతాలను సమాన రాజకీయ అవకాశాలకూ పాలనాధికారాలకూ దూరం చెయ్యడం. ఒక విధంగా ఇతర మతాలను second rate citizens గా భావించడం. ఇస్లాం క్రైస్తవం సహజంగా నే ఈ విధానం వైపు త్వరగా మొగ్గుచూపినా హిందూ మతం ఈ ధోరణులనుంచీ దూరంగానే ఉంది. ముస్లింల దండయాత్రల నేపధ్యంలో కొంత ఈ భావజాలం కనిపించినా, ఆ తరువాత మొఘల్ కాలంలో (ఔరంగజేబ్ వరకూ) సద్భావనే వెల్లివిరిసింది. బిటిష్ కాలంలోకూడా మతాన్ని ఆధారం చేసుకుని రాజకీయ ప్రయోజనాలను బేరీజు చెయ్యలేదు. కానీ కాలక్రమంలో ముస్లింలీగ్ ఒకవైపు హిందూమహాసభ మరోవైపు (ఆ తరువాత ఆర్.ఎస్.ఎస్- సంఘ్ పరివార్) మతవాదానికి పెద్దస్థాయిలో తెరతీసారు. దేశవిభజన ఆ తరువాత పాకిస్తాన్ తో జరిగిన యుద్ధాలు మతపరమైన అపనమ్మకాన్ని ఒక రాజకీయ వాదాలరూపంలో, హిందుత్వవాదం పేరుతో బీజేపీ ఇప్పటికీ సజీవంగా నిలుపుతోంది. అందుకే మతవాదానికీ మతానికీ ఆధారం మతమే అయినా, రెంటికీగల తేడా గుర్తించడం అవసరం. కొందరి రాజకీయ ఉద్దేశాలకూ మతాన్ని నమ్మి జీవించే సామాన్యప్రజలకూ గల భావవైరుధ్యాన్ని తెలుసుకోవడం అవసరం.


మతోన్మాదం: తమ మతం తప్ప మిగతామతాలు అనర్హమైనవిగా భావించడం. తాము ఉత్తమమైనదిగా భావించే తమ మతస్థాపనలో భాగంగా ఇతర మతాల ప్రజలను హింసకు గురిచెయ్యడం, ప్రాణాలు హరించడం మతం ఇలా చెయ్యమని ఎక్కడా చెప్పదు. మతవాదం బలంగా వ్యాపించినప్పుడు ఆ మతాలకు చెందిన కొందరు ఈ ఉన్మాదస్థితిలోకి చేరే ఆవకాశం ఉంటుంది. ఈ ఉన్మాదానికి రాజకీయ, ఆర్థిక శక్తులు/ఆశయాలు తోడైతే ఉగ్రవాదంరూపంలో బయటపడుతుంది. వీరికి మతంతోకానీ, మతాన్ని అనుసరించే ప్రజలతోగానీ సంబంధం ఉండదు. ఒకస్థాయిలో వీరు పిచ్చివాడి చేతిలో రాయిలాంటివాళ్ళు. మరొకస్థాయిలో స్వయానా ఉన్మాదస్థితిలో ఉన్నవాళ్ళు. మతవాదుల చేతుల్లో బలమైన ఆయుధాల్లాంటివాళ్ళు. హిందుమతాన్ని పరిరక్షించడానికి. మాలెగావ్ లో బాంబులు పేల్చినా పాకిస్తాన్ ప్రోద్బలంతో ముంబైలో మారణహోమం చేసినా అది మతోన్మాదమేతప్ప మరొకటికాదు. ఈ మతోన్మాదాన్ని మతవాదంతో ముడిపెట్టి తమ రాజకీయపబ్బాలు గడుపుకునే నాయకత్వం వలన ఈ ధోరణి పెరుగుతుందేతప్ప అదొక ప్రత్యామ్నాయం అవుతుందని అనుకోవడం మన తెలియనితనమేతప్ప మరొకటి కాదు. ఎందుకంటే ఆ రెండూ ఒకదానిమీద ఒకటి తమ అస్థిత్వాన్ని నిలుపుకునే విధానాలు.

ఈ తేడాలను గుర్తించకుండా కేవలం భావోద్వేగాలతో ప్రస్తుత పరిస్థితికి సమాధానం వెతకాలనుకుంటే మనకు మిగిలేది ద్వేషం, కసి, కోపమేతప్ప శాంతీయుతంగా జీవించడానికి మనం ఆశిస్తున్న మార్పుకాదు. ఈ విషయం గమనించి స్పందించడం చాలా అవసరం.


****

11 comments:

Anonymous said...

mahesh,
according to what I observed and as a person read all the posts in koodali about this in last 2 days, no one mingled these three thing s. but they only raised their objections why govt is not taking strong, stern, immediate action against the persons and institutions trying to convert 'matavadam' to 'matonmadam ' irrespective of the relegion.

Anonymous said...

మీరు చెప్పిందంతా సరిగానే ఉన్నట్లనిపిస్తోంది. ఐతే మతవాదం, మతోన్మాదం అంతర్గతంగా (Intrinsic) ఇముడ్చుకున్న ఒక మతం వలననే ఈనాడు ప్రపంచమంతటా ఉగ్రవాదం పెచ్చరిల్లుతున్నది. ఆ మతానికి సంబంధించినంత వరకు మతమూ, మతవాదమూ, మత మౌఢ్యమూ, మతోన్మాదమూ వేరువేరు కాదు. క్షీర నీర న్యాయంగా వాటన్నిటినీ వేరుచేసి చూడగల పరమ 'హంస' లు తక్కువే.

పెదరాయ్డు said...

మహేష్,

మీరెప్పటికీ ఒక చట్రం నుంచి మాట్లాడటానికే ప్రయత్నిస్తారు. నవయుగ వైతాళికులుగా మిమ్మల్ని మీరు భావిస్తారు. అందరికంటే నేనొక భిన్నమైన వ్యక్తినని నిరంతరం నిరూపించటానికి మొండిగా వాదిస్తూనే వుంటారు. మీ వాదనలతో నెగ్గే సామర్థ్యం/ఓపిక చాలా మందికి అరుదు. కాని దాన్ని మీరు మీ విజయంగా భావిస్తే చేయటానికేమీ లేదు. మొదట్లో మీరు నిర్భయంగా వెల్లడించే అభిప్రాయాలను చూసి ముచ్చట పడినా తరువాత దూరంగా వుండటమే మంచిదనిపించింది. ఇక విషయానికొస్తే,

మతవాదం అనే వివరణలో మీరు చెప్పినవే అసలు కారణాలైతే ఈ సంఘటనలు భారతావనికే పరిమితమవ్వాలి. కాని ప్రపంచం మొత్తంలో సదరు మతం వారే ఈ దారుణాలకు ఒడిగడుతున్నారు. వీళ్ళు ఎక్కడ వుంటే అక్కడ మారణ హోమమే (మిగతా చోట్ల వీటితో పోలిస్తే నామమాత్రమే). హైదరాబాదు ప్రత్యేక దేశం కావాలన్నది ఏ ప్రాతిపదికన? మతం కాదా? అది ఏ మతమో చిన్నపిల్లాడిని అడిగినా చెబుతాడు. మరి దీన్ని మత దృష్టితో కాకుండా మరే దృష్టితో చూడాలి? కేవలం వారి మతం కారణంగా వారిని నిలదీయకూడదా? దీన్ని ఇలా వదిలేస్తే రేపు మరో మతం వాడు ఇలాగే చేస్తాడు. ఒకదేశపు మైనారిటిలే ఇంత విద్వేషాగ్నిని రగిలిస్తే అదే కడుపుమంటతో మిగిలినవారు ఎంత మారణహోమం సృష్టించగలరు? ఇది రెచ్చగొట్టటం కాదు. ఒక భయంకరమైన సాకరమవగలిగే సంభావ్యత వున్న ఆలోచన. అందరు ముస్లిములూ అలా కాదు అంటే, దీన్ని ఖండించిన కనీసం విచారం వ్యక్తం చేసిన ఒక్క ముస్లిం ప్రముఖుడేడీ? మన దేశ ముస్లిం సోదరులంతా ముక్త కంఠంతో దీనిని వ్యతిరేకిస్తే ఆ ఉగ్రవాదులకు మళ్ళీ ఇటువంటి దాడులకు తెగబడే స్థైర్యం ఉంటుందా? మనకు వారిమీద గౌరవం, నమ్మకం కలగవా? చెదురు మదురు సంఘటనలు తప్ప ఎన్నో సార్లు మనం వారికి అండగా నిలబడలేదా? ఎన్నో సందర్భాలలో కానీ జరుగుతున్నదేమిటి, వాళ్ళకి భయపడి ఒక నేరస్తుడు వారిమతం కావటం చేత కాపాడబడితే మిగతావారికి భావోద్వేగాలు సడలుతుంది.

మీ భాషా పాండిత్యంతో మతం, మతవాదం, మతోన్మాదం, మతమౌడ్యం, మత ఉదారవాదం , మత అతివాదం, మత పిచ్చి లాంటి పదాలకు భిన్న వివరణలిచ్చినా ఈ ఘటనలన్నిటికీ కారణం మతమే. మీరు ఎంత కాదన్నా మతమన్నది మనిషితో విడదీయరాని/లేని భంధం కలిగి వుంది. ఉదాహరణకు మీరు దేవుణ్ణి నమ్మకపోయినా మీ ఇంట్లో వాళ్ళకోసం గుడికి వెళ్తారని ఒక సందర్భంలో చెప్పారు. మీ నమ్మకాలకన్నా మరో బలీయశక్తి (అది ఏదైనా కావచ్చు) మిమ్మల్ని మతానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో అంటుకునేలా చేస్తోంది. అదే భావోద్వేగాలను నిదర్శనం. భావోద్వేగాలు లేకుండా జీవించటానికి మనమేమీ రాళ్ళూ రప్పలం కాము.

మత ప్రస్తావన లేకుండా, మత మారణ హోమాలను ఆపాలనుకోవటం వట్టి భ్రమ. మతముంది కాబట్టే ఈ చిచ్చు. మతం గురించి మాట్లాడకుండా ఈ దారుణ కాండలను నివారించలేం. ఇటువంటి ఉన్మాదులకు మతమొక కారణం మాత్రమే. కనుక వారికెవరో ఎప్పుడొ ఎందులోనో అన్యాయం చేసారని ఇలా లక్ష్యం లేకుండా తెగబడుతుంటే నివారించలేకపోయినా విమర్శించటానికి కూడా వెనకాడితే వారికి(ఉన్మాదులకు) అడ్డేమీ వుండదు. నిజంగానే వారికి అన్యాయం జరిగి వుంటే ఇతరులకు అటువంటి అన్యాలాను తలపెట్టకూడదనే కనీస స్పృహకుడా లేనివారికి సౌమ్యమైన మాటలు చెవికెక్కవు.

Anonymous said...

@Mahesh: Excellent post. Please remove the moderation and allow readers post the comments. Don't screen the comments.

Anonymous said...

"హిందుమతాన్ని పరిరక్షించడానికి. మాలెగావ్ లో బాంబులు పేల్చినా పాకిస్తాన్ ప్రోద్బలంతో ముంబైలో మారణహోమం చేసినా అది మతోన్మాదమేతప్ప మరొకటికాదు."

ఎవరికీ తెలియని ఒక అద్భుతమైన కోణాన్ని ఆవిష్కరించారు మహేష్ గారు! మీకు జోహారులు!!

@ పెదరాయ్డు గారూ, రాజా రామ మోహన రాయ్ కి ఏ మాత్రమూ తీసిపోని మన నవయుగ బ్లాగు వైతాళిక చక్రవర్తి మహేశుడికి మీ లాంటి విజ్ఞులు, ఆ మాటకొస్తే మన సామాన్య పెజానీకం అందురూ ఇవ్వగల ఒకే ఒక్క ఘనమైన గౌరవం ఏమిటంటే; మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఈ అనితరసాధ్యమైన రచనలను చదివి, స్పందించకుండా ఉండటం. వైతాళికులు జనంగోల వినరు రాయుడు గారూ, వినకూడదు!!

మీరు అర్థవంతమైన సమాధానాలను ఆశిస్తే, మీరు మరో సారి ఇక్కడికి వచ్చి, ఇక్కడి రాతలను చదివి స్పందిచకండి; తద్వారా ఇక్కడి రాతల విలువను అనవసరంగా పెంచకండి.

Anonymous said...

మొదటగా.. what swamy said is correct! బ్లాగు లో ఎవరూ మీరు చెప్పే విజయవంతమైన కృషి చేసినట్లు నాకూ కనపడలేదు.

ఇకపోతే ఒక మతం లో కేవలం 30% మంది మాత్రం ఉదారంగా వుండి, మిగతా 60-70% మంది అతివాద భావాలతో గాని, విచక్షణ లేని మతాభిమానం కలిగి ప్రత్యేక గుర్తింపు కోరుకోవటం జరిగినప్పుడు, ఇంకా పైన చెప్పిన 30% యొక్క ప్రభావం మిగతా వారి మీద ఏ మాత్రం లేనప్పుడు ఈ మూడింటిని ఒకేచోట చేర్చడం సాధారణం. ఇదేమి mathematics కాదు. 100% true only true..otherwise 0% true అని భావించటానికి . దురదృష్టవశాత్తూ మనం మట్లాడుకునే మతం లో, సాధారణమైన మతం + మతవాదం కాకుండా, మతవాదం + మతోన్మాదం కలయిక ప్రభావం ఎక్కువైంది. దాని ఫలితమే ఈ జరుగుతున్న నష్టం అంతా.. అప్పుడు, దీనిని సంస్కరించాల్సిన బాధ్యత ఆ మతసంస్థ ల మీద, మతం లోని ఉదారవాద వ్యక్తుల మీద ఉంటుంది. ఇంకా కరెక్ట్ గా చెప్పలంటే ఆ మతం/మతగ్రంధం మీదే ఉంటుంది..అవి ఎంతబాగా ఈ ఉదారవాద ఆలొచనలకి ఆస్కారం/ప్రోత్సాహం ఇవ్వగలవు అనే విషయాలమీదే ఆ మత సంస్కరణలు అమలు సాధ్యం అవుతుంది. కానీ ఇస్లాం లో ఇది చాలా నిదానంగా, అనుకున్న స్థాయిలో జరగటం లేదనటానికి ఉదాహరణలు, తరచూ ఇది mis-interpretation కి గురవ్వటం. ఏమైననూ ఈ మతం లో సరళమైన భావజాలంపై నియంత్రణ ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. మతగ్రంధం వల్లకానీ/మతపెద్దలవల్లకానీ/వారిని అనుసరించే మతస్థులలో మెజారిటి ఆలొచనా విధానం వల్ల కానీ... అందుకే ఇక్కడ ఈ మతం + మతోన్మాదుల కలయిక దారుణ పరిణామాలకి దారితీస్తుంది.. ఇప్పుడు మనం చూసేది అదే.. ఈ కలయికలో ఇబ్బందులకి గురౌతుంది మాత్రం ఆ మిగిలిన 30% మందే.

ఇంక హిందు మతానికి/మతగ్రంధాలకి ప్రస్తుత స్థల, కాలమాన పరిస్థితులలో ఈ కలయిక చాలా చాలా అరుదు.

కానీ, హింస ఎవరు చేసినా తప్పే. ప్రజలు కోరుకునేది మాలెగవ్ బ్లాస్ట్స్ లో చూపించే శ్రద్ద మిగతా కేసుల్లో కూడా చూపించాలని. minority appeasement politics లో ఉగ్రవాదం వంటి విషయాలకు కూడా భాగం కల్పించకూడదని.. అఫ్జల్ గురు ని ఎందుకు ఉరి తీయలేదో ఈ ప్రభుత్వం ఒక్క కారణం చెప్పలేదు. 7 గురు చనిపొయిన ఒక్క దుర్ఘటన తో హిందూ తీవ్రవాదం అని ప్రచారం కల్పించటం, at the same time, వేలాదిగ చనిపొయిన సంఘటనల్ని ప్రస్తావించి ఇస్లామిక్ ఉగ్రవాదం అంటే..ఉగ్రవాదానికి మతానికి సంభంధం లేదనటం/ ప్రతిపక్షాలు మతం రంగు పులుముతున్నాయనటం.. ఎంత hypocrasy..

నిజానికి ఎన్నో దుర్ఘటనల తర్వాతే ఎక్కువ మందికి 'ముస్లిం మతోన్మాదం' వల్లే ఇదంతా అనే భావనలు కలిగాయి. కానీ ఈ ఘటనలని మతం తో ముడి పెట్టడం తప్పు అనే హిందు ఉదారవాదులు చాలామంది ఉన్నారు..వారి వాయిస్ కి ప్రాముఖ్యత కూడా ఉంది..ఇది ఆ మతగ్రంధాలు/దానిని అనుసరించే వాళ్ళలో మెజారిటి ప్రజల ఆమోదం వీరికి వుండటం వల్ల కలిగిన సౌలభ్యం. లేకపోతే ఈ పాటికే నిజమైన హిందూ మతోన్మాదం ఇదే స్థాయి లొ వుండేది.

అసలు హిందువులు minorty గా ఉండే దేశంలో, వారు ఇటు వంటి మతోన్మాద ఘటనలకి పాల్పడితే majority నించి/ప్రభుత్వం నుంచి ఏ విధమైన చర్యలు ఉంటాయో మనకు తెలుసు.. ఇలాంటివేమీ కూడా చెయ్యకపోయినా హిండ్రాఫ్ వంటి సంస్థ కి మలేషియా లో ఏం జరిగిందో మనం చూశాం. అదే పాకిస్తాన్ లో అయితే అసలు మిగలరు కూడా...

ఈ దేశం లో ఉదారవాద ముస్లింలు వాళ్ళ చుట్టు జరిగే ఈ మతోన్మాద కార్యకలాపాల పట్ల మరింత అప్రమత్తం గా వుండాలి. అటువంటి వాటిని మతం అడ్డుపెట్టుకోని సమర్ధించుకో చూసేవారిని నిరోధించాలి. అంతా జరిగిన తర్వాత ఇస్లాం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించదు అని చెప్పేదానివల్ల ఫలితం తక్కువ...దాన్ని తక్కువగా అనిపించే స్థాయి లో పరిస్థితులు ఉన్నాయి. నేను ఇలా ఎందుకు అంటున్నా అంటే..ఎవరో పొరుగు దేశం వాళ్ళు వచ్చి మనదేశంలో ఉగ్రవాదనికి పాల్పడటం ఒకరకం. కాని మనదేశం లోని యువతే పాకిస్థాన్ వెళ్ళి శిక్షణ పొంది మనదేశాన్ని నాశనం చెయ్య పూనుకోవటం ఆందోళన కలిగిస్తుంది. పాతబస్తి లాంటి ప్రదేశాల్లో ఏం జరుగుతుంది అని, ఎవరెవరు ఇటువంటి వాటిల్లో ప్రేరణ పొందుతున్నరో అక్కడ నివశించే చాలా మందికి తెలుసు..exact గా కాకపొయినా నిఘా పరిశీలన కి ఆస్కారం ఉన్న స్థాయిలో. కాబట్టి చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందం గా కాకుండా వీటిని ఇక్కడే అరికట్టాలి. దీనికి మన పోలిస్ వ్యవస్థ కూడా సహకరించాలి.

మహేష్,

మీరు చెప్పే మతం, మతాభిమానం, మతోన్మాదం లాంటివి theoritical గా వేరు వేరు అయినా,ఇక్కడ మాత్రం practise లో తేడా తగ్గిపోతుంది.

Anonymous said...

"ఇస్లాం క్రైస్తవం సహజంగా నే ఈ విధానం వైపు త్వరగా మొగ్గుచూపినా హిందూ మతం ఈ ధోరణులనుంచీ దూరంగానే ఉంది. ముస్లింల దండయాత్రల నేపధ్యంలో కొంత ఈ భావజాలం కనిపించినా, ఆ తరువాత మొఘల్ కాలంలో (ఔరంగజేబ్ వరకూ) సద్భావనే వెల్లివిరిసింది."

మహేష్, కొంచెం clarity ఇస్తారా!

మీరు చెప్పేది ఏ భావజాలం? హిందూ 'మతవాద' భావజాలం కొంత కనిపించిందనా? లేక, ఇస్లాం మతవాద భావజాలం 'కొంతే' కనిపించి సుహృద్భావం వెల్లివిరిసిందనా??

Anonymous said...

Hello Katti,



I feel you are not thinking in a real rational way; slightly your views are hippocratic and like a politician. You are trying your best to hide your hypocrisy and show pseudo intellectualism.



Everybody knows that NO religion preaches about violence. But, if I go with your argument WHY only certain religions people are behaving like this … I am not telling you can verify the facts across the world



By writing these kind blogs with good words and shouting FACT won’t change … FACT is a FACT always.



Why to get into all these … Can your name single person from other side “who is talking bravely about their religion”... No need to remind you what happened in Hyderabad to Tasleema, don’t you think it’s a BIG SHAME. You should be thankful; you are able to speak bravely.



DOESN’T PREACH PEOPLE THAT THERE IS A VERY SLIGHT LINK BETWEEN RELIGION AND FUNDMALISIM, if you are saying like that then I see very BIG HIPOCRACY in your statements?

Samanyudu said...

అయ్యలారా, ఆపండి. భారతదేశానికి సంబంధించినంతవరకూ, జరుగుతున్నదంతా 'రాజకీయమే', మతం ప్రసక్తి ఏమీ లేదు; ఈ విషయం కూడా, మనదేశం లో చిన్న పిల్లవాడిని అడిగినా చెప్పగలడు. I don't think it makes any sense for you intellectuals fight with each other on such topics. Especially making personal comments on one another is soooo 'అనాగరికం'....లెకుంటే అందరి identity 'దడిగాడువానసిరా' అయిపోగలదు. So, let us focus on 'రాత', but not 'రచయిత'.
{ఏంటో మీ అందరి రాతలు చూసి చూసి నాకు కూడా 'ప్రాసలు' ('స' నా? 'శ' నా?) వచ్చేస్తున్నాయి :-)}

కత్తి గురువుగారు ...మీరు నిశ్చింతగా రాసుకోండి ...రాసే వాడికి చదివే వాడు లోకువ అని వూరికే అన్నారా ?!?

సుజాత వేల్పూరి said...

సామాన్యుడు గారు,
అద్భుతంగా చెప్పారు. కఠిన వాస్తవాన్ని చెప్పారు. "భారత దేశానికి సంబంధించినంత వరకూ, జరుగుతున్నదంతా రాజకీయమే!మతం ప్రసక్తి ఏమీ లేదు". మీతో ఏకీభవిస్తున్నాను. ఇది మేథావులందరికీ తెలిసీ, ఇంతింత చర్చలెలా సాగుతాయో అర్థం కాదు.

రాజ మల్లేశ్వర్ కొల్లి said...

"ముస్లింల దండయాత్రల నేపధ్యంలో కొంత ఈ భావజాలం కనిపించినా, ఆ తరువాత మొఘల్ కాలంలో (ఔరంగజేబ్ వరకూ) సద్భావనే వెల్లివిరిసింది."

కత్తి బాబూ..! దీన్ని నిజం గా చెప్పే నీతో ఎలా "చర్చించా" లోయ్..!