Saturday, August 1, 2009

ఇమేజ్ ‘ట్రాప్’


ఒక రచయిత మిత్రుడు మంచి కథలు రాస్తాడు.
సినిమా కథ రాయాలని ఆశలేదుగానీ, సినిమాకు పనికొచ్చే మంచి కథలు తనదగ్గరున్నాయని భావిస్తాడు.
ప్రస్తుతానికి ఒక పత్రికలో పనిచేస్తున్నాడు.

‘కరెంట్' అనే ఒక పిచ్చి ప్రేమ(తీసే)కథతో వచ్చిన సినిమా చూసిన ఆ మిత్రుడు తాళలేక, "ఇంత ఛండాలంగా ఉండే కథకన్నా నా దగ్గరున్న కథలో నొబిలిటీ ఉంది" అని డిక్లేర్ చేశాడు.
తన దగ్గరున్న కథ నేను విన్నాను. బాగుంది. రెగ్యులర్ ప్రేమకథలకన్నా మించిన ఉదాత్తత ఉంది. ఒక తాత్విక కోణం, మానవీయ స్పందన కలగలిపిన కథాంశం ఉంది. "ఎలాగూ పరిశ్రమలోని వాళ్ళతో పరిచయముందికదా ఒకసారి ఈ కథ ఎవరికైనా చెప్పి చూడ్రాదూ!" అని నేనొక ఉచిత సలహా పారేసాను.

తను ప్రయత్నించాడు. ఒకరిద్ధరు భవిష్యత్ దర్శకులతో చర్చించాడు. "బాగుందిగానీ ఎవరైనా (హీరో) చెయ్యడానికి రెడీ అయితే" అని ‘హీరో దయ’ అని ప్రకటించేశారు.

ఒక హీరోల లిస్టొకటి తయారు చేశాడు.
సుమంత్ - ఏమో!
రామ్ - ఎవరికీ అందడు
అల్లు అర్జున్ - అస్సలు దొరకడు
రామ్ చరణ్ తేజ - రాజమౌళి వదిల్తేగా!
నాని - ఎక్కడున్నాడో తెలీదు
సుశాంత్ - ప్రయత్నించొచ్చు

ఇలా తిరిగితిరిగీ సుశాంత్ దగ్గరికొచ్చి కరెంట్ కొట్టినట్లు ఆగిపోయాడు. అప్పుడు నేనే అన్నాను "ఎలాగూ కరెంట్ దెబ్బ తినున్నాడుకదా, ఈ ప్రేమకథ అయితే వర్కౌట్ అవుతుందని చెప్పొచ్చు. కానీయ్!" అని. అష్టకష్టాలూ పడి, ఉన్న పరిచయాల్ని ఉపయోగించి సుశాంత్ ఆఫీస్ నంబరు దొరకబుచ్చుకున్నాడు.

పోన్ చేశాడు...
"ట్రింగ్ ట్రింగ్"
"హలో!" "హలో!!"
"సుశాంత్ గారిని కలవాలండీ"
"మీరెవరండీ"
"రైటర్ని. సార్ కి కథ చెప్పాలి"
"బాబు కొత్త కథలు వింటున్నారు. కానీ మీరు ఇంతకు ముందు ఎవరిదగ్గర పనిచేశారో చెప్తారా."
"ఎవరి దగ్గరా లేదు"
"ఐతే ఎట్లా?"
"ఏమిటి ఎట్లా! కథ చెప్పడానికి కథకావాలిగానీ ఎవరిదగ్గరైనా పనిచెయ్యడం ఎందుకు?"
"అట్లా కుదరదండీ"
"ఐతే ఒక నాలుగు నెలలు ఎవరిద్దగ్గరైనా పనిచేసొచ్చి కథ చెప్పమంటారా?"

....అవతలి వైపునుంచీ ఒక నిమిషం నిశ్శబ్ధం....

"మీరట్లా మాట్లాడిదే ఎట్లాగండీ. కథ ఉందని ఎందరో వస్తుంటారు వాళ్ళందరికీ బాబుతో మాట్లాడే ఛాన్స్ ఇస్తే ఎట్లా? అందుకే అడిగాను"
"సారీ. అయితే మీరు మొదట కథ విని ఆ తరువాత సుశాంత్ గారికి చెప్పండి."
"ఇంతకీ మీరు ఎక్కడ పనిచేస్తారు సార్?"
"......"(పత్రిక పేరు)
"ఐతే రండి సార్ మాట్లాడదాం."

రెండ్రోజుల తరువాత సెక్రట్రీ అపాయింట్మెంట్ దొరికింది. అరగంటలో కథ చెప్పాడు.

"కథ బాగుందిగానీ. చాలా క్లాస్ గా ఉందండీ. బాబు ఇమేజ్ కి సరిపోదనుకుంటాను."
"ఇప్పుడుకాకపోతే ఇంకెప్పుడు ప్రయోగాలు చెయ్యాలండీ? అయినా, సుశాంత్ చేసింది రెండు సినిమాలేకదా. రెండూ పెద్ద హిట్లు కూడా కావు. మరి అప్పుడే ఇమేజ్ ఎక్కడొచ్చిందీ?" అని అడిగేశాడు నా మిత్రుడు.

అంతే ఆ తరువాత "కథ" ముందుకు నడవలేదు. ఇక ఆ సెక్రెటరీ అక్కడుండేంత వరకూ మావోడికి ఎంట్రీ దొరకదు. చుట్టూవున్న వాళ్ళు సృష్టించిన ఇమేజ్ ట్రాప్ నుంచీ బయటపడే వరకూ సుశాంత్ కి మంచి కథ దొరకదు.
****

23 comments:

కొత్త పాళీ said...

Who is Susanth?

Anonymous said...

ఒక్క సెక్రెటరీనే ఇంప్రెస్ చెయ్యలేని కథ, ప్రేక్షకులందరినీ ఎలా చెయ్యగలదని మీరనుకుంటున్నారు?

సినిమా ఫార్మెట్ లో COOK చేసి చెపితే నచ్చేదెమో.

జీడిపప్పు said...

Good one.

"బాబు ఇమేజ్ కి సరిపోదనుకుంటాను." loll.
These "Babu"'s are the biggest cancer for Telugu industry. Let me wish for more flops!

రమణ said...

//"కథ ఉందని ఎందరో వస్తుంటారు వాళ్ళందరికీ బాబుతో మాట్లాడే ఛాన్స్ ఇస్తే ఎట్లా?"

//"కథ బాగుందిగానీ. చాలా క్లాస్ గా ఉందండీ. బాబు ఇమేజ్ కి సరిపోదనుకుంటాను."

:) :)

asha said...

blessing in disguise అంటే ఇదే. సుశాంత్ అంత అధ్బుతంగా నటిస్తాడు మరి.

Sujata M said...

ha ha ha ha.. Nijame! very crazy heros.

చదువరి said...

సుశాంతూ, ఇమేజీ! భలే!!

నిజంగానే ఇమేజి ఉన్నవాళ్ళేమో దానికి బందీ అయిపోయి కొండలు పిండి చేసేస్తూ ఉంటారు. సినిమాలు పల్టీలు కొట్టేస్తూ ఉంటాయి. ఇమేజి లేనివాళ్ళు కూడా తామూ బాబులమేనని భ్రమించి, తమను తాము మోసం చేసుకుంటే.. ఆళ్ళ ఖర్మ. -మనది కూడా!

ఇంతకీ ఈ నాని ఎవరూ?

గీతాచార్య said...

ROFL

I'l write a post

Anonymous said...

చాల బాగా అడిగాడు మీ మిత్రుడు, లేకపోతే సుశాంత్ కి ఇమేజ్ ఏంటండీ? చెత్త నటుడు. ఒక అభినయం తెలీదు, వాచకం తెలీదు, మొహం కూడా సరిగ్గా లేదు. ఉన్నదల్లా అక్కినేని కుటుంబం అన్న పేరు. అలంటి వాళ్ళ సినిమాలు కాదు కదా టీవీ లో వాళ్ళ ప్రోగ్రామ్స్ కూడా చూడకూడదు.
ఇంతకు ముందు ఇలాగె అక్కినేని పేరు చెప్పుకొని సుప్రియ అని ఒక నటి వచ్చింది. తర్వాత పత్తా లేదు, ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ లో ఎకౌంటు లెక్కలు కడుతుంది...ఇమేజ్ గిమేజ్ అంటే సుశాంత్ పరిస్థితి కూడా అంతే అవుతుంది...

Anonymous said...

>>ఒక్క సెక్రెటరీనే ఇంప్రెస్ చెయ్యలేని కథ, ప్రేక్షకులందరినీ ఎలా చెయ్యగలదని మీరనుకుంటున్నారు?

ఒక్క సెక్రటరీ కోట్ల ఆంద్రుల ప్రతినిధెప్పుడయ్యాడు?

గీతాచార్య said...

కొత్త పాళీ గారు,

మీరు చాలా అదృష్టవంతులు. (పెద్దల కోసం).

You are lucky. (ఇది నాకోసం).

గీతాచార్య said...

కొత్త పాళీ గారు,

మీరు చాలా అదృష్టవంతులు. (పెద్దల కోసం).

You are lucky. (ఇది నాకోసం). :-)

ప్రియ said...

హహ్హహ్హహ్హహ్హహ్హ...! ఒక వికటాట్టహాసాన్ని ఊహించుకోండి.

When u see an image through lens, what we see is in reverse of the original. (ఎపుడో చిన్నప్పుడు ఫిజిక్సులో చదువుకున్నట్టు అనుమానం).

అంటే సుశాంత్ బాబు ఇమేజి కూడా తను అనుకునేదానికి రివర్సే కదా. ;-)

వేణూశ్రీకాంత్ said...

:-) :-) :-) హ హ హ సుశాంత్ ఇమేజి :-)

కొత్తపాళీ గారి ప్రశ్న సూపర్..

మహేశ్ నన్నడిగితే మీ ఫ్రెండ్ చాలా అదృష్టవంతుడు. కాస్త ఆలస్యమైనా (నటన సంగతి దేవుడెరుగు) కనీసం చూడ దగిన ఫేస్ కల హీరో ని ప్రయత్నించమని చెప్పండి. వీడికిస్తే ఎంత మంచి కధ అయినా వీడికి భయపడి జనాలు సినిమా చూడరు.

అది సరే కానీ నాని ఎవరండీ !!

Kathi Mahesh Kumar said...

@చదువరి & వేణూ శ్రీకాంత్: ‘నాని’అష్టా-చెమ్మా సినిమా హీరో నండీ! తన రెండవ సినిమా ‘రైడ్’.

సుశాంత్ కాకపోయినా ప్రస్తుతం వస్తున్న ఏ హీరోకూడా "ప్రయోగాలు" (కనీసం కొంత వైవిధ్యం ఉన్న సినిమాలు చెయ్యడానికి) తయారుగా లేరు. వీరికన్నా నాగార్జున,వెంకటేష్ తరం బెటర్ అనిపించేలా ఉన్నాయి వీళ్ళ తలతిక్క చేష్టలు. ఇక వీళ్ళచుట్టూ ఇమేజి కోటగట్టి వీళ్ళ పునాదుల్ని బీటలు వార్చే ఇలాంటి సెక్రటరీలు కోకొల్లలు.

mohanrazz said...

మహేష్ గారూ...మీరు చెప్పింది నిజం. మీ మిత్రుడికి జరిగిన అనుభవం చూస్తుంటే..పరిస్థితులు అలానే ఉన్నాయనిపిస్తోంది. అయితే మీతో ఇక్కడొక చిన్న షార్ట్ స్టోరీ పంచుకోవాలి -
పూరీ జగన్నాధ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నపుడు, మొదటి సినిమా కోసం పవన్ కళ్యాణ్ ని దృష్టి లో పెట్టుకుని బద్రి స్టోరీ తయారు చేసుకున్నాట్ట. అయితే పవన్ కళ్యాణ్ అపాయింట్‌మెంట్ కోసం ఎవరెవరి ద్వారానో ప్రయత్నిస్తూ ఉంటే, కెమెరామన్ ఒకాయన దొరికాట్ట. కాకపోతే ఆయన, "ముందు కథ నాకు చెప్పు. నాకు నచ్చితేనే నీకు అపాయింట్‌మెంట్ ఏర్పాటు చేస్తాన"న్నాట్ట. పూరీ ఒక్క క్షణం ఆలోచించి, అతని ఆలోచనాస్థాయిని అంచనావేసి, బద్రి స్టోరీ ఇతనికి చెప్తే ఇతనికి ఖచ్చితంగా నచ్చదని క్షణాల్లోనే నిర్ధారించుకుని, అతనికి అంతకు ముందెపుడో తయారు చేసుకున్న ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం స్టోరీ చెప్తే అదతినికి నచ్చి అపాయింట్‌మెంట్ ఏర్పాటు చేస్తే అక్కడికెళ్ళాక పవన్ కి బద్రి స్టోరీ చెప్పడం, అదతను సింగిల్ సిటింగ్ లో ఓకే చేయడం జరిగిపోయాయిట. పవన్ ఉండి "ఆ కెమెరామన్, మీరు చెప్తానన్న స్టోరీ కానట్టుందే " అని నవ్వితే పూరి, "కావాలంటే అది కూడా చెప్తాను" అన్నాట్ట."అక్కర్లేదన్నా"ట్ట పవన్.

కాబట్టి తెలుగు ఇండస్ట్రీ లో కథారచయిత అవ్వాలంటే, కథలు వ్రాయగల సృజనాత్మకత కంటే ముఖ్యంగా- ఎవరికి ఎలా చెప్పాలనే లౌక్యం అవసరమనుకుంటా.

mohanrazz said...

మహేష్ గారూ...మీరు చెప్పింది నిజం. మీ మిత్రుడికి జరిగిన అనుభవం చూస్తుంటే..పరిస్థితులు అలానే ఉన్నాయనిపిస్తోంది. అయితే మీతో ఇక్కడొక చిన్న షార్ట్ స్టోరీ పంచుకోవాలి -
పూరీ జగన్నాధ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నపుడు, మొదటి సినిమా కోసం పవన్ కళ్యాణ్ ని దృష్టి లో పెట్టుకుని బద్రి స్టోరీ తయారు చేసుకున్నాట్ట. అయితే పవన్ కళ్యాణ్ అపాయింట్‌మెంట్ కోసం ఎవరెవరి ద్వారానో ప్రయత్నిస్తూ ఉంటే, కెమెరామన్ ఒకాయన దొరికాట్ట. కాకపోతే ఆయన, "ముందు కథ నాకు చెప్పు. నాకు నచ్చితేనే నీకు అపాయింట్‌మెంట్ ఏర్పాటు చేస్తాన"న్నాట్ట. పూరీ ఒక్క క్షణం ఆలోచించి, అతని ఆలోచనాస్థాయిని అంచనావేసి, బద్రి స్టోరీ ఇతనికి చెప్తే ఇతనికి ఖచ్చితంగా నచ్చదని క్షణాల్లోనే నిర్ధారించుకుని, అతనికి అంతకు ముందెపుడో తయారు చేసుకున్న ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం స్టోరీ చెప్తే అదతినికి నచ్చి అపాయింట్‌మెంట్ ఏర్పాటు చేస్తే అక్కడికెళ్ళాక పవన్ కి బద్రి స్టోరీ చెప్పడం, అదతను సింగిల్ సిటింగ్ లో ఓకే చేయడం జరిగిపోయాయిట. పవన్ ఉండి "ఆ కెమెరామన్, మీరు చెప్తానన్న స్టోరీ కానట్టుందే " అని నవ్వితే పూరి, "కావాలంటే అది కూడా చెప్తాను" అన్నాట్ట."అక్కర్లేదన్నా"ట్ట పవన్.

కాబట్టి తెలుగు ఇండస్ట్రీ లో కథారచయిత అవ్వాలంటే, కథలు వ్రాయగల సృజనాత్మకత కంటే ముఖ్యంగా- ఎవరికి ఎలా చెప్పాలనే లౌక్యం అవసరమనుకుంటా.

Ramani Rao said...

హ్హ హ్హ .. కొట్టిన షాక్ నుండి ఇంకా తేరుకొని ఉండరు లెండి కాస్త (సు) శాంతపడిన తరువాత ప్రయత్నించమనండి, మీ స్నేహితుడిని. సుమంత్ కాస్త బెటరనిపించడంలేదు ఇతనికన్నా..సినీ వారసత్వం ..రాజకీయ వారసత్వం మనం తప్పక భరించాలేమో ఇలా.

Anil Dasari said...

సుశాంత్ సెక్రటరీ అన్న మాటలు పట్టుకుని సుశాంత్ మీద జోకులెయ్యటం బాలేదు. కథ బాగోలేకపోయినా, ఆ సంగతి రచయిత ముఖమ్మీదే చెప్పటం ఇష్టం లేక అలా ఇమేజ్ అనే మాట అడ్డం పెట్టుకునొండుచ్చు కదా? రెండో వ్యక్తి వాదనేమిటో తెలీకుండా ఓ నిర్ణయానికొచ్చేయటం ఎందుకు?

Vinay Chakravarthi.Gogineni said...

allu arjun dorakada....
chaala easy ani ma friend cheppadu vaadu ilane tirugutunnadu....kadha teesukoni......
teja daggariki velte naaku kadha ichhey nenu 20k istaanu annadu anta..............

Srujana Ramanujan said...

Priya LOL.

శ్రీ said...

ఒక రకం గా మీ వాడు అదృష్టవంతుడు ... కథ ఏదన్న సరే ... చింతలపూడి శ్రీనివాస్ రావు గారు దాన్ని షూటింగ్ సమయం లో ఇష్టం వచ్చినట్టు మార్చేస్తాడు .. చితం అయ్యాక మీ మిత్రుడు guide చూసాక R.K. Narayan గారి లాగా బాధపడేవారు ఏమో ..

కమల్ said...

"ఇంత చండాలంగా ఉండే కథకన్నా " అంటూ మీ మిత్రుడు వాపోవడం నవ్వొచ్చింది, ప్రతి రచయత తను రాసే కథ సూపర్ ఎక్సలెంట్ " అనే అనుకుంటాడు అది తెర మీదకొచ్చాక తెలుస్తుంది ఎంత ఎంత నోబిలిటి అన్నది, ఇక " కథ ఉందని ఎందరో వస్తూ ఉంటారు" అన్న సెక్రటరీ మాటలు నిజమే, వేలకొద్ది ఉన్నారు కథలు చెప్పేవాళ్ళు అందులో ఎన్ని బాగుంటాయో తెలిసేదెలా..? దానికి అంతే లేదు ఇతమిద్దంగా చెప్పలేము కూడ ! ఇక కరెంట్ సినిమా దర్శకుడు మొదట చెప్పిన కథ వేరు సినిమా షూటింగ్ సగం అయ్యాక దాని రూపు రేఖలు ఆ చిత్ర నిర్మాతలే మార్చుకున్నారు, మద్యలో సినిమా వదల్లేక చచ్చిన పాములా ఉండిపోయాడూ ఆ చిత్ర దర్శకుడు,

ఇక హీరోలకు, నిర్మాతలకు కథ చెప్పే టెక్నిక్ రామ్ గోపాల్ వర్మ గారి నుండి నేర్చుకోవాల్సిందే ఇక్కడ ఆయన గారి బ్లాగ్ ఇస్తున్నా చదవండి " శివ" సినిమా కథని ఒప్పించడానికి ఎన్ని కష్టాలు పడ్డడో అందులో ఉన్నది.....! కమల్.

http://rgvzoomin.com/