బీఫ్ బర్గర్లపై జరిగిన ఇటాలియన్ రగడ గురించి నేను రాసిన వెజ్ దేవతలూ - నాన్వెజ్ దేవతలూ
టపా చదివి ఒక మిత్రుడు "ఎక్కడిదో ఎందుకు? మన HCU లో జరిగిన గొడవ గురించి రాయకపోయావా!" అని అడిగారు.
"నిజమే! మనచుట్టూ ఇన్ని ఘటనలు జరుగుతుండగా ఎక్కడో ఇటలీలో జరిగిన విషయాన్ని చర్చించుకోవడం ఎందుకూ" అనిపించింది.
అసలేం జరిగిందంటే...
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ‘సుకూన్’ అని ఒక కల్చరల్ ఫెస్టివల్ జరుగుతుంది. వారాంతరంలో జరిగే ఈ సాంస్కృతిక మేళాలో వివిధ ప్రాంతాల వంటలు, సంస్కృతుల మేళవింపుని విధ్యార్థులు ప్రదర్శనకు పెడతారు. విద్యార్థులే నిర్వహించే ఈ స్టాల్స్ లో భారతదేశంలోని వివిధ ప్రదేశాల వంటకాలు రుచిచూసే అవకాశం ఉంటుంది.
2006 లో కొందరు దళిత విద్యార్థులకి తాము ఇష్టపడితినే బీఫ్ బిర్యానీ "కళ్యాణి బిర్యాని" పెడితే బాగుంటుందనిపించింది. హైదరాబాద్ లో ఈ బిర్యానీకి మంచి గిరాకీ ఉంది. యూనివర్సిటీలో కూడా 15% కేరళ విద్యార్థులు, దాదాపు మరో 17 శాతం దళితులు, ఇంకో 6-7 శాతం ముస్లింలలో మెజారిటీ భాగం ఈ బిర్యానీ తినేవాళ్ళే కాబట్టి సేల్స్ కూడా బాగుంటుందని మొదలెట్టారు.
మొదలెట్టిన మొదటి రోజు వండింది రెండు గంటల్లో అయిపోతే, మళ్ళీ ప్రత్యేకంగా వండించి తీసుకురావల్సి వచ్చింది.
ఈ రెండో వాయి వచ్చేసరికీ కొందరు "ఇది మన సంస్కృతికి విరుద్ధం" అంటూ అడ్డుచెప్పారు. గొడవ వైస్ ఛాన్సిలర్ వరకూ వెళ్ళింది. అప్పుడే కొత్తగా వచ్చిన వైస్ ఛాన్సిలర్ ముందుగా ఒక చర్చ జరిపి తరువాత నిర్ణయం చేద్ధాం ప్రస్తుతానికి ఆపండి అన్నారు.
సో...ఆ సుకూన్ లో బీఫ్ బిర్యానీ అర్థాంతరంగా ఆగిపోయింది.
మళ్ళీ...మరో సంవత్సరం...2007 సుకూన్ ఆరంభం ఇంకా ఉందనగానే...
గొడ్డుమాంసం "మన సంస్కృతి కాదు" అనే పెద్దలు ముందుగానే వైస్ ఛాన్సిలర్ దగ్గర అభ్యంతరం లేవనెత్తారు.
ఈ స్టాల్ పెట్టాలనుకున్నవాళ్ళది సింపుల్ ఆర్గ్యుమెంట్. "బీఫ్ బిర్యాని మేము తింటాం. మా కుటుంబాలు తింటాయి. కాబట్టి అది ‘మా సంస్కృతి’ దీన్ని కాదనే హక్కు ఎవరికీ లేదు."
ఈ చర్చలు జరుగుతున్నప్పుడు ఎవరో కొంత ఉత్సాహం చూపి National Institute of Nutrition నుండీ ఒక లెటర్ తీసుకొచ్చారు. అందులో బీఫ్ పౌష్టిక విలువలు ఉటంకించబడి, ఒకానొక రెకమండెడ్ ఆహారపదార్థంగా బీఫ్ ను గుర్తిస్తూ రాసుంది. ఆ లెటర్ ప్రకారం న్యూట్రియన్ట్స్, ప్రొటీన్లు అపారంగా ఉండి, కొవ్వుపదార్థాలు అతి తక్కువ ఉండే బీఫ్ ఆరోగ్యకరం. నిజానికి మిగతా మాంసాలకన్నా గొడ్డుమాంసం శ్రేష్టం.
అంతే...గొప్పోళ్ళ సంస్కృతి కేకలు హుష్ కాకి.
అప్పట్నుంచీ ప్రతిసంవత్సరం కళ్యాణీ బిర్యానీ సుకూన్లో లభ్యం. కథ సుఖాంతం.
ఇదండీ మన హైద్రాబాద్ కథ.
"పేరుకే అది పెద్ద విశ్వవిద్యాలయం
దీని కన్నా మా ఊరే నయం
మా ఊరి పెద్దకాపు
మా పేట చివర నిలబడి
మా తాతని...
ఏరా పెద్ద మాదిగి, పనిలోకొస్తున్నావా? లేదా?
అని అడిగితే...విలువలేని ఈ ఊరి నుండి పోవాలని
కష్టపడి చదివి ఈడికొచ్చాను
అందరూ బాగా చదువుకున్నోళ్ళే కదా...
కులం మధ్యలోకి రాదనుకున్నా...
32 comments:
తెలియని విషయాన్ని తెలియపరిచారు..ధన్యవాదాలండి!
http://digumarthi.blogspot.com/2008/07/blog-post_794.html
పై లింకులో ఇదే అంశంపై మంచి కవిత ఉంది.
I do not know about this. Generally meat takes much more land to produce than vegetables and in the long run, we may be better of shifting to vegetarian foods. I have eaten all these but eat mostly vegetarian food now.
>> "బీఫ్ బిర్యాని మేము తింటాం. మా కుటుంబాలు తింటాయి. కాబట్టి అది ‘మా సంస్కృతి’ దీన్ని కాదనే హక్కు ఎవరికీ లేదు."
స్ర్తీపురుష వివాహాలు పోయి స్వలింగ సంపర్కాలు/వివాహాలు చట్టుబండలు... అదేలెండి చట్టబద్దం అయిన రోజులు. రేప్పొద్దున అదే చోట మరో గుంపు మనిషి మాంసం మా అలవాటు, మేం తింటాం అంటారు... అప్పుడేమిటి మహాశేయా?
తమరు దానికీ అవునని గత్యంతరం లేక చెబుతారని తెలుసనుకోండి.
మీరు, మీ బోటి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే...ఇక్కడ విషయం సంస్కృతిది ఒక్కటే కాదు సభ్యతది కూడా..
విశ్వవిద్యాలయంలో ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో అన్నది ఆలోచించాల్సిన విషయం. సంతలో జరిగేవన్నీ ఇక్కడా చేస్తామనటంలో సంస్కృతి సంగతెలాఉన్నా సభ్యత మాత్రం చట్టుబండలై కూచుంది.
@చినరాయడు: తప్పుడు పేరుతో వ్యాఖ్య చెయ్యడానికి మీరు నిశ్చయించుకున్న క్షణాన మీ వాదనలో పెద్దలోపముందని మీకే తెలుసు. కానీ నా తరఫున నేను చెప్పాల్సింది చెబుతాను.
కొన్ని కోట్లమంది తినే గొడ్డుమాంసాన్ని "మన సంస్కృతి కాదు" అనే అధికారం ఎవరికుంది? స భ్య త...what a funny thing to say! ఒక మెజారిటీ వర్గం యొక్క సంస్కృతిని చులకన చేసి దాన్ని సంస్కృతి కాదు అనడంతోపాటూ, సభ్యత కూడా కాదనే మీలాంటోళ్ళ పోకడని ఏమనాలి? ఇదెక్కడి సభ్యత.ఇదేమి సంస్కృతి?
బీఫ్ తినడాన్ని నరమాంసంతో పోల్చడం.విశ్వవిద్యాలయాల్లో ఏది చెయ్యకూడదో నిర్ణయించడం...ఇమేజరీ బాగుందిగానీ,మీరు కొంత "రాజ్యాంగ సంస్కృతిని" అలవర్చుకోవాలేమో ఆలోచించండి.
భారతదేశంలో ఎక్కడా గొడ్డుమాంసం తినడంపై నిషేధం లేదు. Act of parliament ప్రకారం ఏర్పరచబడిన విశ్వవిద్యాలయంలో ఎందుకుండాలి? ‘సుకూన్’ ఒక సాంస్కృతిక ఫెస్టివల్ అయినప్పుడు దళిత-ముస్లిం-కేరళ సంస్కృతికి స్థానం ఎందుకు వద్దనాలి?
నేనేమీ హిందూత్వవాదిని కాదు కానీ గొడ్డు మాంసం తినడం మాత్రం నిజంగా నీచమైనదే. అసలు చికెన్ తినడం కూడా నీచమైనదే. హోమోసెక్స్ లాంటి నీచమైన పనులు చేసేవాళ్ళకి గొడ్డు మాంసం తినడం మాత్రం కష్టమా?
@ప్రవీణ్: ఎప్పటిలాగే నిర్గేతుకమైన వాదన మీది.
మీకు గొడ్డు మాంసం ఇష్టం లేదంటే అర్థముంది. అసహ్యం అంటే అంగీకరించొచ్చు. కానీ గొడ్డుమాంసం తినడం నీచం అని నిర్ణయించే అధికారం మీకు లేదు. మీ లెక్కలో దాదాపు సగం ప్రపంచం నీచమైనది. ఇక చికెన్ కూడా కలిపారుగనక ఆ శాతం మరింత పెరిగింది.
కొత్తగా హోమోసెక్సువాలిటీకీ గొడ్డుమాంసానికీ సంబంధం ఎక్కడ కలిసిందో నాకు అర్థం కావడం లేదు. ఏదైనా పరిశోధనల సారమా!
నాయనా కత్తి,
అజ్ణాతగా కామెంటెట్టటానికి అవకాశం ఇచ్చి మళ్ళీ అలా కామెంటినవాడిమీద పడి ఏడవటంలో ఏమైనా న్యాయం ఉందా? ఇష్టంలేకపోతే అజ్ణాత అవకాశం తీసెయ్యవచ్చుకదా. దానికీ, వాదనకీ లింకెట్టటం ఎంత డొల్లగా ఉంది?
>>భారతదేశంలో ఎక్కడా గొడ్డుమాంసం తినడంపై నిషేధం లేదు. Act of parliament ప్రకారం ఏర్పరచబడిన విశ్వవిద్యాలయంలో ఎందుకుండాలి?
ఈ వాదన ఎంత చెత్తగా ఉందో చెప్పలేను. ఒక్కసారి మరికొన్ని ఉదాహరణలు ఇదే పాయింట్ మీద ఆలోచించుకో....నీకు తెలియక కాదని తెలుసు.
ఇప్పుడిక్కడెవడు దళిత ప్రస్తావన తెచ్చాడు. ఇతరకులాల్లో కూడా గొడ్డు మాంసం తినేవాళ్ళున్నారు. మళ్ళీ ఇక్కడ దళితవాదన తేవడంలోనే ఈ విషయంపైన తమరి అభద్రతాభావం తెలుస్తోంది.
‘సుకూన్’ ఒక సాంస్కృతిక ఫెస్టివల్ అయుండొచ్చు, కానీ సభ్యత ఫెస్టివల్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా... సభ్యత అన్నది ఏ రంగానికైనా కామనే :-)
గొడ్డుమాంసం పేరుతో వ్యవహరిస్తున్నది ఆవు/ఎద్దుమాంసం గురించి. ఆవు హిందువులకి గౌరవనీయమైన జీవి. ఆవు శరీరంలో సకలదేవతలూ నివసిస్తారని, దాన్ని చంపడం గానీ తినడం గానీ మహాపాపమనీ హిందూధార్మికగ్రంథాల్లో పదేపదే చెప్పారు. లౌకికంగా ఆలోచిస్తే నైతికసూత్రాలన్నీ కృతజ్నతాభావం మీద ఆధారపడి ఉన్నాయి. ఆవుల్ని బతికున్నంతకాలం ఎక్స్ ప్లాయిట్ చేసి మాంసం రూపంలో కూడా ఎక్స్ ప్లాయిట్ చెయ్యొద్దని మన పూర్వీకుల భావమై ఉంటుంది. అలా చెప్పారని తెలిసీ మొండిగా అదే చేస్తామనడం ఎడ్డెతనమే అవుతుంది. పోషకాలు ఆవుమాంసంలోనే కాదు, మనిషిమాంసంలో కూడా ఉంటాయి. కొన్ని రకాల పురుగుల్లోను, కొన్ని జీవుల మలమూత్రాల్లో కూడా మంచిమంచి పోషకాలుంటాయి. అలా అన్జెప్పి అవన్నీ తినాలని, తినొచ్చుననీ వాదించడం అసహ్యం.
మనిషి తన ఇష్టానిష్టాల్ని బట్టి యోగ్యత సంపాదించుకుంటాడు. ఆవుమాంసం తినాలనే కోరికని బట్టి, పొందరానివాళ్ళని పొందాలనే వాంఛల్ని బట్టి మానసిక శూద్రత్వం, మానసిక ఛండాలత్వం సంక్రమిస్తాయి.
"కొన్ని కోట్లమంది తినే గొడ్డుమాంసాన్ని "మన సంస్కృతి కాదు" అనే అధికారం ఎవరికుంది"
మరి అదే విదంగా, కొన్ని కోట్ల మంది తప్పు అనుకునే గొడ్డు మాంసం తినడం మన సంస్కృతికి బిన్నమైనది కాదనుకునే హక్కు మాత్రం ఎవరికుంది. మరో మెజారిటి వర్గం వారి భావాలను కించపరిచడం వారి సంస్కృతిని అసలు సంస్కృతి అనే హక్కు మీకెవరిచ్చారనడం మాత్రం ఎంతవరకు సబబు.
ఇప్పుడు కొనతమంది పందిని అసహ్యించుకుంటారు. కొంతమంది 'పోర్క్' ని ఇష్టంగా తింటారు. పందిని అసహ్యించుకునే వారి దగ్గర 'పోర్క్' ని తింటే జరిగే గొడవ గురించి మీకు తెలీదా? మరి ఒక్క గోడ్డు మాంసం విషయంలోనే ఇదంతా ఎందుకు?
:) This post is right. In the sense, this is fighting for its(beef eating) aceptablity in the main stream - while it has been in the main stream for ages!
(Ofcourse - its not logic.Something staying in the main stream for ages, is not something to be accepted. Just because majority take dowries, it does not become 'right'. Isn't it!? My point is- It is part and parcel of our culture. This time around, beef eaters might win!)
But, the earlier post on the avertisement campaign was a complete misunderstanding.I would have been happier if you could show a way out for ....what was his name? Zed ...rt!?
The idea of using goddess Lakshmi on burger, perhaps, was not really to say "annam parabrhmaswaroopam" or 'snack is sacred'.
The image of using Lakshmi on burger in Italy is equavalent to using a deamonic figure in India.That way, it was purposeful.
If you would use Jesus on burger in Italy, it is surely saying 'sacred'. For that matter, if you use Jesus in India too, it will be taken as 'sacred'. You can have a Lakshmi wines...I am not too sure if you can get away with a Jesus wines!
My point is this: advertisement has a message and an image which is purposefully invoked. If Katrina is acting in the Fanta ad with the husky song in the background, it is suggesting something 'else' too.
Similarly, the 'Lakshmi on Burger' is not suggesting "sacred" there. Even the line "Snack is sacred" was not meant to be taken as seriously as "Food is God"! This is why a Hindu will have an objection.
You identify yourself as "beef eater" and so Zed's argument hurts you. This is understandable. But do you understand what hurts a Hindu, in the ad? Then how do you help Zed win the case?
That would be empathy! This is self-assertion.
This post makes a clear point. That post will surely antagonise more people than this post.
Ofcourse, its a different issue altogather if you wanted Hindus to loose the case.(the italian ad)
ఆహారానికీ, కులమతాలకు లంకె ఏర్పరచడం ఒక కొత్త ట్రెండు. గోమాంసం స్టేపుల్ డైట్ గా ఉన్న ఆర్యులు వ్యవసాయిక జీవనాన్ని అలవరచుకొన్న తరువాత హఠాత్తుగా గోమాంస భక్షణాన్ని నిషేధించడం వెనుక ఆర్థిక, సాంఘిక కారణాలున్నాయే గానీ ఆధ్యాత్మిక కారణాలు లేవు. రంతిదేవుడు చంపిన గోవుల చర్మంనుండి కారిన నీరు చర్మణ్వతీ నదిని పుట్టిస్తే, గోవును చంపి వడ్డించిన తప్పుకు గౌతముడు ఒక నదినే పుట్టించవలసి వచ్చింది.
ఒరిస్సా, బెంగాల్, మిధిల ప్రాంతాల్లో బ్రాహ్మణులకు చేపలు, కొండొకచో మటన్ తినడం నిషేధం కాదు. కానీ కోళ్ళను, పక్షులను తినకూడదు. అవి కజిన్స్ కనుక :-) (పక్షులు కూడా ద్విజులు కదా!). ఆహారపుటలవాట్లు దేశ,కాల పరిస్థితులను బట్టి మారుతుంటాయి. దానికి కులమత రంగులు అద్దడం అవివేకం. చేపలు తప్ప మరేమీ దొరకని, పండని ఒక దీవిలో ఎవరైనా ప్రవక్త చేపలు తినడం తప్పని బోధిస్తే ఆ మతంలోకి ఒక్కరు కూడా రారు. బౌధ్ధ మతవ్యాప్తిని అడ్డుకోవడానికి హిందూ మతం మాంస భక్షణ నిషేధిస్తే, ఖండాంతరాలకు తరలి పోయిన బౌధ్ధం గోమాంస భక్షకుల మతమైపోయింది. టిబెట్ లో ఆ మాటకొస్తే మైసూరు దగ్గరి బైలకుప్పెలో వారు రోజూ భుజించేది అదే!
నీకు నచ్చితే పంది మాంసం కూడా తిను. మమ్మల్ని కూడా ఎందుకు తినమంటావ్?
@పొట్టిరాయుడు:మిమ్మల్ని ఎవరు తినమన్నారు? తినేవాళ్ళని వాళ్ళమానాన వదిలెయ్యమంటున్నారు అంతే.
బీఫ్ పౌష్టిక విలువలు ఉటంకించబడి, ఒకానొక రెకమండెడ్ ఆహారపదార్థంగా బీఫ్ ను గుర్తిస్తూ రాసుంది. ఆ లెటర్ ప్రకారం న్యూట్రియన్ట్స్, ప్రొటీన్లు అపారంగా ఉండి, కొవ్వుపదార్థాలు అతి తక్కువ ఉండే బీఫ్ ఆరోగ్యకరం.
ఇది మాత్రం కరక్ట్ కాదు. బీఫ్ వరస్ట్ రెడ్ మీట్. మిగతా మీట్ తొ దెనితొ కంపర్ చెసినా బీఫ్ మంచిది కాదు.
నేను బీఫ్ పొర్క్ మటన్ లాంటి రెడ్ మీట్ నుండి వైట్ మీట్ (చికన్, ఫిష్ ) కి మారడానికి చాలా ట్రై చెస్తున్నా..
ఎవడి ఇస్టం వాడిది. కాకపొతె ముస్లిం లు ఎక్కువగా వుండె కాలెజ్ లొ ఇదె పరిస్తితి వచ్చి , మీరు పొర్క్ తింటాను అంటె ఆ ముస్లిం ఫ్రెండ్స్ రెస్పొన్స్ ఎలావుంటుందొ మరి. అప్పుడు కూడా మీ ఫ్రెండ్స్ ఇలాంటి లెటర్ తీసుకువచ్చెవారా.. మీరు ఇలాగె వాదించే వారా? చిన్న డవుటు అంతె
@మంఛుపల్లకీ: నేను నామానాన పోర్క్ తింటుంటే ముస్లింలు అభ్యంతరం చెబితే all I would say is...go to HELL!
నేను ఏంతినాలో ఏంతినకూడదో నిర్ణయించుకునేది నేను. నా మతం కాదు. వేరే ఏ మతమూ కాదు.
@చంద్రచూడ్: హమ్మయ్య! మొత్తానికి సగానికిపైగా ప్రపంచం మానసిక శూద్రత్వం,మానసిక ఛండాలత్వంలో మునిగి తేలుతోందన్నమాట.
అవునూ...ఒక సందేహం "మానసిక" అన్నారు, అంటే "శారీరకం" ఇంకోటుందా?
@మంచుపల్లకీ:
రెడ్ మీట్సా, పౌల్ట్రీనా అన్నది ముఖ్యం కాదు. ఆ రెంటిలోనూ లీన్ మీట్స్ (కొవ్వు పదార్ధాలు లేని భాగాలు) తినటం మంచిది. తోలుతో సహా తింటే చికెన్ కూడా (ముఖ్యంగా థైస్) మంచిది కాదు.
@మహేష్:
దళితేతర హిందువుల్లోనూ గొడ్డు మాంసం తినేవాళ్లు చాలామంది ఉన్నారు. అదేదో దళిత ఆహారం అన్న కోణంలోనుండి మీరీ వ్యాసం రాయకుండా ఉంటే ఇక్కడ ఆరోగ్యకరమైన చర్చ జరిగుండేది.
నావరకూ నేను చికిటేరియన్. బీఫ్, పోర్క్ నాకు నచ్చవు కాబట్టి తినను. నా మతానికీ, కులానికీ దానితో సంబంధం లేదు.
mmm. Interesting.
BTW.. I never heard of Kalyani Biriyani.
I feel you should not have written "కొందరు దళిత విద్యార్థులకి తాము ఇష్టపడితినే బీఫ్ బిర్యానీ "కళ్యాణి బిర్యాని" " Instead of "కొందరు తాము ఇష్టపడితినే బీఫ్ బిర్యానీ "కళ్యాణి బిర్యాని" "
Similar to how eenadu writes..
మీరు ఇలాగె రాయలి అని నేను చెప్పడం లెదు ...
కానీ..
మీరు దలిత్/ముస్లిం / కెరళ అన్న పదాలు లెకుండా రాసినా అర్ధం మారెదు కాదు అని నా అభిప్రాయం మరియు అప్పుడు కింద వుండె కామెంట్స్ కూడా డిఫ్ఫరంట్ గా వుండెవి.
పాశ్చాత్యసంస్కృతిని అన్ని విధాలా అక్కున చేర్చుకొని వారి ఆహారపుటలవాట్లను కూడా అనుకరిస్తూ అనుసరిస్తూ అమెరికా అధ్యక్షులవారి కాల్మొక్తా బాంచెం దొరా అని సాగిలబడిన వాళ్ళకి దళితులు తమ ఆర్ధిక పరిస్థితి కారణంగానే ఇప్పటికీ అధిక శాతం మంది మిగతా కులం మతం వాళ్ళు వెక్కిరిస్తున్నా తింటున్న గొడ్డుమాంసంపై ఇంత రాద్ధాంతం చేస్తారా? బ్రాహ్మణ ఆధిపత్య సమాజంలో వాళ్ళకు నచ్చినవిధంగా మర్హుకున్న సామాజిక కట్టుబాట్లను బలవంతంగా రుద్ది అనుసరింపజేయడాన్ని ఇప్పటికైనా మార్చుకోలేమా? దళిత మితృని ఆవేదనను అర్ధం చేసుకోలేమా?
@అబ్రకదబ్ర:బీఫ్ దళిత ఆహారం (మాత్రమే) అని నేను వ్యాసంలో ఎక్కడైనా చెప్పానా? ముస్లింలు, కేరళప్రాంతం వాళ్ళు తింటారని చెప్పానుకదా! నార్త్ ఈస్ట్ వాళ్ళు కూడా తింటారు. అది బహుశా నేను ఉటంకించలేదు.
ఈ ఘటన జరిగిన యూనివర్సిటీలోనే ఆరోగ్యవంతమైన చర్చ జరిగింది. Amids such a heated controversy.కానీ ఇక్కడ కొందరు మిత్రులు "ఒకే కోణం" నుంచీ చూస్తే సమస్య ఎవరిది?
@మంచుపల్లకి: ఈ ఘటన కల్పన కాదు. నిజం. ఆ కళ్యాణీ బిర్యానీ స్టాల్ పెట్టింది దళిత విద్యార్థులు. ఇందులోనేను "ప్రజామోదం" కోసం మార్చాలిసిందేమీ లేదు.
జరిగిన ఘటనలోని సారం "దేన్ని ఎవరు సంస్కృతిగా పాస్ చేస్తున్నారు. మిగతా సంస్కృతుల్ని ఒక పద్దతి ప్రకారం "శూద్రం" చేస్తున్నారు" అనేది. ఆ ప్రశ్నలు ఉదయించకపోతే నేను ఇది రాయటానికి అర్థం లేదు. కామెంట్స్ ఆకోణంలోనే వస్తున్నాయి. ఇప్పటికీ ఉన్న ప్రెజుడిస్, కల్చరల్ హెజిమొనీ కి దర్పణం పడుతూనే వ్యాఖ్యలూ ఉన్నాయి.
@వర్మ: ఇలా అర్థం చేసుకొనే విశాలత్వమే ఉంటే "భిన్నత్వంలో ఏకత్వా"నికి సార్థకత ఎప్పుడో వచ్చేది. సాంస్కృతిక ఏకమూసత్వాన్ని ప్రేరేపించే భావజాలాలు రాజ్యమేలుతున్నంత వరకూ ఈ ఘర్షణ తప్పదు.
తరతారలుగా తమ వాదనని, తమ సంస్క్రుతిని మాత్రమే సమాజం అని నమ్మి, నమ్మించినవారికి ఈ బ్లాగు శారాంసం అర్ధం కాదు. ఇక్కడ కత్తి మహేష్ కులాన్ని/మతాన్ని ఆపాదించలేదు. ఎవరు ఎవరిని ఎలా గౌరవించాలో ఎక్కడ నేర్పుతారు అని అడుగుతున్నారు. మన సహచరుల సంస్క్రుతి, అలవాట్లని, అర్ధం చేసుకోని ఉన్నత విద్యాలయ మేధావుల గురించి చెబుతున్నారు. ఇక్కడ నేను చెప్పలనుకున్నది ఒక్కటె, మన సమాజం అంతా ఒక్కటిగా ఎప్పుడూ పెరగలేదు, పెరగనివ్వలేదు. మన సంస్క్రుతులన్నీ వేరు వేరు. కాదని మీరు ఎంత ప్రయత్నించినా ఓటమి మీదే. వీలయితే ఇప్పటికైనా అర్ధం చేసుకోండి. లేదంటే "unity in diversity" గురించి చదువుకోండి.
సంస్కృతి ని ఒకరివైన ప్రమాణాల తో సంకుచితం గా నిర్వచించినంత మాత్రాన అది సర్వ జన ప్రామాణికం ఐపోదు.. ఈ విషయం అందరికి అర్ధం కానంత వరకు (ఎప్పటికి అర్ధం కాదు కూడా ) మరి ఈ వాదనలు తప్పవు... అనివార్యం కూడా.
నేను గొడ్డు, పంది మాంసం తినను కానీ పొరపాటున కొన్నిసార్లు తిన్నాను కానీ అపరాధ భావన ఏమీలేదు. నాకు ఎలాగూ కుల మత భావనలు లేవు కనుక నేను తినకపోవడానికి వాటికీ సంబంధం లేదు. చిన్నప్పటి నుండీ తినకపోవడం వల్ల అయిష్టం అంతే.
నా బాల్య స్నేహితుడు ఒకరు దళితుడు. చిన్నప్పుడు వాళ్లింట్లో అప్పుడప్పుడు భోజనం చేస్తుండేవాడిని. అప్పుడప్పుడు మేకమాంసం అని చెప్పి సరదాగా గొడ్డు మాంసం పెట్టి నన్ను ట్రిక్ చేస్తుండేవారు ఆ ఇంటివారు. తినేసిన తరువాత విషయం చెప్పాక హాయిగా నవ్వేసుకునేవారం.
ఇంట్లో ఆ వంటకాలు వుండవు కానీ పాఠశాలల్లో అయా వంటకాలు తినడానికి మా పిల్లలకు అనుమతి ఇచ్చాము (ఏయే వంటకాలు తినొచ్చో ఒక స్కూల్ ఫార్మ్ సంతకం చేయాలి మేము). బయటకి వెళ్ళినప్పుడు మా ఆవిడ వుంటే అవి తిననివ్వదు కాబట్టి ఆమె పక్కన లేనప్పుడు మా పిల్లలు ఆ వంటకాలు తింటూవుంటారు.
పశు మాంసం ఏమో నీచము, సంస్కృతికి వ్యతిరేకమా ? ఆ లెక్కన అదే పశువులిచ్చే పాలు కూడా అంతే అపవిత్రం, సంస్కృతీ వ్యతిరేకం కావాలి కదా! వామ్మో, రోజూ పాలు/కాఫీ/చాయ్ తాగిన మనుషులు ఇంకెంత నీచము, సంస్కృతీ వ్యతిరేకము కావాలి ? ఆ లెక్కన, మన సంస్కృతి మొత్తం తనకు తనే సంస్కృతీ-వ్యతిరేకం అయిపోలా ! సంస్కృతీ-రక్షకులు ఆలోచించాలి మరి.
తిండి ఏదైనా కూడా, తినే వాడికి అది పవిత్రమే. ఆకు కూర కి, చికెన్ కి, బీఫ్ కి ఒక్క రుచి/పౌష్టికం లో తప్పక వేరెందులోనూ తేడా లేదు. ఒకటి పవిత్రం, ఒకటి నీచం అని చెప్పడానికి నువ్వెవ్వరు ? అన్నీ కూడాను మనిషి యొక్క ఆహారాలే. నచ్చితే తిను, లేకపోతె మానేయ్.
కాబట్టి అర్థం లేని ఆభిజాత్యాలను, వ్యర్థమైన పోలికలను, ఆహారపు అలవాట్లను సంస్కృతి-వ్యతిరేకం గా జమకట్టడాలను వదిలెయ్యండి. లేదు, కాదు, కూడదు అంటే గనక మిమ్మల్ని ఏ నరమాంస భక్షకులకో, లేదా స్వలింగ సంపర్కులకో పట్టిచ్చేస్తా, జాగ్రత్త ! ( No offence meant to either community :-)
ఆంధ్రాలో అసలు మాంసం చవకైనది కాదు, గొడ్డు మాంసం మరీ ఖరీదైనది. గొడ్డు మాంసాన్ని ప్రోత్సహించడం దళితుల ఉద్ధరణ అవ్వదు. అది ధనవంతుల ఉద్ధరణ అవుతుంది.
ఖరీదు కాదు ఇక్కడి సమస్య. అత్మాభిమానం. గ్రామాలలో, సంతలలో ఇప్పటికీు కొనుక్కువెళ్ళి గిరిజనులు. దళితులు అధిక శాతం మంది ఆహారంగా ఉఫయోగిస్తున్నారు. బక్కచిక్కిన, అనారోగ్యం పాలైన పశు మాంసం వాడి అనేక రోగాల బారిన పడుతున్నారు. వారి ఆర్ధిక స్థితి అంతంత మాత్రమే కాబట్టి ఇలా జరుగుతోంది. మా ప్రాంతంలోని సవర తెగ గిరిజనులు పశు మాంసాన్ని ఎండబె్ట్టి ఓరు అంటారు ఇంటి వెన్ను పట్టీకి వేలాడగట్టి అప్పుడప్పుడు వండుకు తింటారు. ఇది దళితులు కూడా కొ్న్ని గ్రామాలలో ఆచరిస్తున్నారు. ఇది వారి పేదరికా్నికి గుర్తు కాదా? నేను పనిచేస్తున్న గ్రామాలలో ప్రత్యక్షంగా చూసాను. మాంసం తినడానికి ఇష్టపడని వారు చర్చలోనికి చొచ్చి లేనిపోని వ్యాఖ్యానాలు చేయడమెండుకు. ఇప్పటికి యాగాలు చేసేటప్పుడు మేక, గుర్రం, ఎద్దు బొమ్మలు పిండితో చేసి బ్రహ్మణులు క్రతువు నిర్వాహకులు తింటూంటారు. ఇది వారి జిహ్వ చాపల్యం కాదా? గొడ్డు మాంసం తిన్న రోజుల్లోనే వేదాలు గానం చేయగలిగారు. మానేసామన్నతరువాత వారి మేధా శక్తి సన్నగిల్లి రాజులపై ఆధారపడి పాలక వర్గ తొత్తులుగాతయారయి సమాజాన్ని భ్రష్టుపట్టించారు.
మరి టేప్ వార్మ్స్ వ్యాధి కారణమయ్యే పంది మాంసం తినడం సంగతి ఏమిటి? మహేష్ పంది మాంసాన్ని కూడా తినమని అడ్వొకేట్ చేశాడు కదా.
పశుమాంసం తినేవారి పట్ల వివక్ష చూపించటం మంచిది కాదు. చికెన్ తినేవారి కంటే గొడ్డు మాంసం తినేవారు ఏ విధంగా తక్కువ? ఆ మాంసం మనకు నచ్చకపోతే వదిలేయాలి. అంతే. అకారణ ద్వేషాన్ని అంత త్వరగా మార్చలేరనుకుంటా.
@ప్రవీణ్ శర్మ: మీరు ఏ లోకంలో ఉంటారో నాకు అర్థం కాదు.
నేను అడ్వకేట్ చెయ్యడమేమిటి?!? నేను నా అభిప్రాయాలు చెబుతాను. వాటిని అందరూ పాటించాలని ఎక్కడా చెప్పను.
ఇక్కడ సమస్య ఏ మాంసం చవక అనేది కాదు. సమస్య మీకు అర్థమయ్యేంత చిన్నది మాత్రం కాదు.
మనిషి మొదట దొరికింది తిని బ్రతికాడు.
అవి ఆకులు ,అలములు ,కాయలు ,పండ్లు లేక ఇతర జంతువుల్లా ..అందిన మిగతా జంతువులు.
తర్వాత నెమ్మదిగా ..కాల్చుకొని ..తిన్నాడు .క్రమంగా అందులో ఉప్పో కారమో లేక ఇతర దినుసులో కలిపి ..కాల్చుకునో ,ఉడికించో రుచికి ప్రాధాన్యత ఇచ్చి ..
మనిషీ నాగరికత చెందుతున్నకొలది, ఆహారపు అలవాట్లు మారిపోయాయి ..
మనిషికి ..సాటి మనుషుల పట్ల ,,ప్రకృతి పట్ల ..ప్రకృతిలో ఇతర జీవరాసి పట్ల ..ప్రేమ సుహృద్భావం ..కలగటం సహజం ..ప్రకృతిలో ..సహజీవులయిన జంతువులని వేటాడి, వధించి ..భుజించడం ..నాగరికమానవుడికి .. సంశయం ..లాగా తోచింది .
ఈనాటికి ..నేడు . ..మనం ,, విలవిల లాడుతున్నా ..కోడి పిల్లలని సైకిల్ .హాండిల్ కి వేళ్ళాడేసుకుని ..స్కూటర్ ..కి ముందు కొన్ని, వెనకాల సీటుకి .. అటు ఇటు తల్లకిందులా
బజారులో చూసి ..జాలిపడమా...ఇక వాటిని వధ్యశాలకి తరలించి ..ఒక్కూక్క కోడి మెడ కొద్దిగా గాటు పెట్టి ..రక్తం చిమ్ముతూ వాటిని కుప్పలాగా పారేసి ..తీరికగా ఒక్కొక్క పక్షి రెక్కలు వలచి ..
మొన్న ..ఆదివారం జ్యోతి దినపత్రికలో .. మేనకా గాంధీ ..కుందేళ్ళని ..అతి ఇరుకయిన ..ఇనుపతీగల బోనులో పెంచే,, పట్టుకువెళ్ళే ..విధానం ..వాటిని బోనులో కుక్కి ..వాటి పాదాలు కింద, బోను తీగలకి ..చీరి ..అవి .ఘోరంగా ఆక్రోసిస్తుంటే ..వాటిని .బండ కేసి బాది..చర్మం వలిచి ..వాటి మాంసం ..అమ్మకానికి ..పెట్టడం ..ఇలా ..ఎన్నో ..క్రూర పద్ధతులు ..
అలాగే ఆవుల్ని ,మేకల్ని ..వధ్యశాలలో ..అతి దారుణంగా ..భయపడేలాగా ..నిర్దాక్షిణ్యంగా ..కాస్త కాస్త గొంతు కోసి ..రక్తం ఏరులయి ప్రవహిస్తుంటే ..నెమ్మది నెమ్మదిగా ..చెర్మం వలచి ..వధిస్తారట ..
నేడు ..మనలో ..చాలా మంది ... ఇవన్ని చూసి సహించలేరు ...
.వీటన్నిటికి అతీతంగా ..నీట్ గా ..వేడి వేడి గా ..ప్లేట్ లో .అందంగా అలంకరించిన మాంసాహారం ..అసలు స్పృహ కలగకుండా ..ఎలాతయారయింది ..అని
ఆలోచించకుండా ..ఆస్వాదించాలి ..నాగరికత ..నాజూకు ..పర్యావరణ స్పృహ ..sensitivity
అనేది లేకుండా ...
.మనిషికి ఆహారపు అలవాట్లకి ..sophistication కి ..సంబంధం ఉన్నదేమో ...
ఇక మనిషీ జీర్ణవ్యవస్థ కూడా ..మాంసాహారానికి అనువుగా ..తయారవలేదని విన్నాను ..
పర్యావరణ రక్షణ రీత్యా ..శాకాహారం క్షేమకరమట...
సంస్కృతి .సాంప్రదాయం ..పక్కనపెడితే ....
జీవహింస చేసి ..వన్యప్రాణులని.భుజించడం ..నాగరిక లక్షనమేనా ?
అవును ..ప్రపంచ జనాభాలో 99%.మాంసాహారం చేస్తారు ..అనాగరికులు అనలేముకదా..
నాకయితే మనిషి ..పరిణతి చెందినకొద్దీ ..శాకాహారిగా మార్పుచెందుతాడని..అభిప్రాయం .
FYI...
http://www.plzbeveg.blogspot.com/
oka sari chadavagalaru. I happened to see this post accidentally!!
I have no intention of proving any one wrong. I am just trying to make people understand the damage caused/causing to ourselves because of our innocence. Again, I'm no prophet but a social animal with a human heart.
best,
-Karthik
Very nice article and brings up a very subtle point of cultural domination.
Post a Comment