Friday, August 7, 2009

కట్నానికి మరోవైపు... సుఖాంతం



జూలై 2008 లో "కట్నానికి మరోవైపు" అని, ‘కట్నం తీసుకోకూడదు’ అనుకున్న ఒక మిత్రుడి బాధలు చెప్పాను.
ఆ టపా మీద అప్పట్లో బ్లాగుల్లో చాలా చర్చలే జరిగాయి.

ఆ మిత్రుడు శంకర్ ది ఈ రోజు ( అగష్టు 7,2009) కాకినాడలో పెళ్ళి. ఇప్పుడే పెళ్ళి భోజనం చేసొస్తున్నాను.

కాణీ కట్నం తీసుకోలేదు.
ఆడపడుచుల కట్నాలూ లాంఛనాలూ లేవు.
సొంత ఖర్చుతో రిజిస్టరాఫీసులో పెళ్ళి, ఒక చిన్న రిసెప్షన్ తో జంట ఒకటయ్యారు.

తన ఆశయం, ఆదర్శం గురించి కుటుంబానికీ, బంధువర్గానికీ చెప్పి ఒప్పించడానికీ. ఆ ఆదర్శాన్ని అర్థం చేసుకుని సహకరించే అమ్మాయిని వెతికిపట్టుకుని పెళ్ళి చేసుకోవడానికి ఒక సంవత్సరం పట్టింది.
కానీ...సాధించాడు.

శంకర్ లాంటి ఎందరో ఉండాలని కోరుకుంటూ....మిత్రుడు శంకర్ కి నా అభినందనలు

****

24 comments:

Anonymous said...

మాటలను చేతల్లో చూపించిన వ్యక్తికి my heartly congrats !

asha said...

అదెంత కష్టమైన పనో నాకు తెలుసు. అతనికి నా అభినందనలు.

తమిళన్ said...

కాని చాల ప్రాబ్లెంస్ వస్తాయి....మీ మిత్రుడికి ఏమి కష్టాలు రాకుడదని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను...

contrats to your friend

మధురవాణి said...

మీ పాత పోస్టు, అక్కడ జరిగిన చర్చ అంతా చూసాను. చాలా మంచి చర్చని లేవదీసారు :)

Hats off to your friend.!
Please convey our best wishes to the newly married couple :)

Bala said...

God knows Dowry issue, I just want to marry a girl who loves this world and people in it.

Anonymous said...

మీకు ఒక మంచి మిత్రుడు దొరికాడు. ఆ జంట నిండు నూరేళ్లు చాలా ఆనందంగా జీవించాలని, నలుగురికి ఆదర్శంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.

భావన said...

మీ పాత పోస్ట్ అక్కడి చర్చ ఇప్పుడే చూసేను.. బాగుంది...
మీ ఫ్రెండ్ కు మా తరపు నుంచి కూడా బెస్ట్ విషెస్ చెప్పండి..

సుజాత వేల్పూరి said...

ఏడాది పట్టిందన్నమాట! కొత్త జంటకు అభినందనలు!

Anil Dasari said...

>> "శంకర్ లాంటి ఎందరో ఉండాలని కోరుకుంటూ"

ఉన్నారు .. చాలామంది.

మీ శంకర్‌కి అభినందనలు - పెళ్లి సందర్భంగా. ఆశయం తీరింది. అసలు కథ ముందుంది ;-)

వేణూశ్రీకాంత్ said...

శంకర్ గారికి అభినందనలు.

gaddeswarup said...

నేను అలాగే చేసాను; మావాళ్ళు వీడు పెళ్ళి చేసుకుంటే చాలని ఏమీ పేచీ పెట్టలేదు. ఒక పార్సీ స్నేహుతుడు మంగళసుత్రానికి డబ్బులు అప్పిచ్చాడు ; అవతలవాళ్ళు బాధపడతారని మామూలు పెళ్ళి చేసుకున్నాము. మా అమ్మాయికి Registrar office లో పెళ్ళి అయింది.

Anonymous said...

@ అసలు కథ ముందుంది ;-)

మా ఆఫీస్ లో కొలీగ్ కు ఈ పోస్ట్ చూపించాను, గంట వాదించుకున్నాం. ఆ పాయింటే ఆయన పట్టుకొని నేను చెప్పింది అసలు ఒప్పుకొలేదు.

అందరికీ అటువంటి ఆశయాలు వుంటాయి. కానీ మీరు నాలాంటి వాళ్ళు ఏవేవో కారాణాలు చెప్పి తప్పించుకుంటాం. చేసి చూపించిన ఆయన త్యాగాన్ని పొగడండి అంటే ఒప్పుకొలేదు అసలు కథ ముందుంది అంటూ.

Kathi Mahesh Kumar said...

@అశోక్ & a2zdreams: ఈ ముందున్న అసలు కథ ఏమిటో నాకు అర్థం కావడం లేదు.

కట్నం ఒక సామాజిక దురాచారం అని నమ్మిన ఒక అబ్బాయి కట్నం తీసుకోకుండా పెళ్ళి చేసుకోవాలనుకున్నాడు. అదే ఆదర్శాన్ని నమ్మిన మరో అమ్మాయి ఇప్పటికి దొరికింది.ఆ అబ్బాయి ఇప్పటివరకూ వ్యతిరేకించిన కుటుంబ సభ్యుల్ని convince చేసి, ఇద్దరూ సరిసమానంగా డబ్బులు ఖర్చుపెట్టి జంటయ్యారు.

ఇందులో నాకు పరస్పర గౌరవంతో పాటూ ఉన్నత వ్యక్తిత్వాలు కనిపించాయి. ఇప్పుడు ఇలా పెళ్ళయిన తరువాత కొత్తగా వచ్చే సమస్యలేమిటో నాకు అర్థం కాని విషయం.

నేను ఇలాగే పెళ్ళిచేసుకున్నాను. ఆరు సంవత్సరాలు కావస్తోంది. నాకైతే సమస్యలు లేవు. మరి కట్నం లేకుండా పెళ్ళిచేసుకుంటే వచ్చే సమస్యలేమిటో మీరు లేక మీ స్నేహితుడు కొంచెం విశదంగా వివరించగలిగితే కొంతైనా నేర్చుకోగలుగుతాము.

@అబ్రకదబ్ర: అలా అందరూ ఉండాలని కోరుకోనా మరి! ;-)

మీ అందరి శుభాకాంక్షలూ శంకర్ కి తెలిపాను. He is happy. ప్రస్తుతం "తేనెచంద్రుడి"కోసం వైజాగ్ చెక్కేసాడు.

గీతాచార్య said...

First of all best wishes to the nice couple (nice in the sense making it possible in what they believe.

మరి కట్నం లేకుండా పెళ్ళిచేసుకుంటే వచ్చే సమస్యలేమిటో మీరు లేక...

మై హూఁ నా? Just thinking about it.

మరువం ఉష said...

Kudos to Sankar. He laid another layer on the path for many to traverse. Bravo.. You deserve appreciation to share the news. Hope this becomes infectious in good sense and more and more younger crowd follow the track.

విశ్వ ప్రేమికుడు said...

నలుగురికీ ఆదర్శ ప్రాయంగా నిలిచిన మీ శంకర్ గారికి అభినందనలు. కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోవాలంటే నేటికీ ఇంత కష్ట పడాలా అని ఆశ్చర్యంగానూ, బాధగానూ ఉంది. నాకూ పెళ్లి కాలేదు. ప్రయత్నించి చూస్తా ఏమి జరుగుతుందో..

కనీసం ఆ విషయమై ఆలోచించేలా చేసిన మీ ప్రయత్నానికి ధన్యవాదాలు. :)

Anil Dasari said...

@a2zdreams

నా వాక్యాన్ని quote చేసి మరీ ఎత్తిపొడిచారు కాబట్టి అది నన్ను ఉద్దేశించిన వ్యంగ్యమే అనుకుంటున్నాను.

>> "కానీ మీరు నాలాంటి వాళ్ళు ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకుంటాం"

నా గురించి మీకు ఏం తెలుసని పై మాటన్నారు?

'అసలు కథ ముందుంది' అని నేనన్నది 'పెళ్లి చేసుకోవటంతో సరి కాదు, అసలు జీవితం ఇప్పుడు మొదలు కాబోతున్నది' అన్న ఉద్దేశంతో. దానికి కట్నం తీసుకోటం, తీసుకోకపోటంతో సంబంధం లేదు.

ఇకపోతే - కట్నం తీసుకోకపోవటం నా దృష్టిలో పెద్ద గొప్ప విషయం కాదు, అదో త్యాగమూ కాదు. అంటే, దానర్ధం కట్నం తీసుకోవాలని కాదు. తీసుకోవటం అతి హేయమైన విషయం. తీసుకోకపోవటం మాత్రం టముకేసి చాటింపేసుకోవాల్సిన గొప్ప విషయం కాదు. తేడా అర్ధమైందనుకుంటా.

Bolloju Baba said...

మహేష్ గారూ
ఇది అన్యాయం. :-))

బొల్లోజు బాబా

bhaavatarangini said...

katti,

Shankar is a new traveller in the boat that we r already sailing in. We didnt allow the issue of dowry to creep in when we married. I remember, I and Sanjeeva cancelled an alliance since Sanjeeva's hand had been bought and not sought. People say, fools don't take dowry. I was rediculed for months by my collegues for not taking dowry. But, I always know it well that I can face the man in the mirror boldly. And now I know that I am not a FOOL

gaddeswarup said...

"ఇకపోతే - కట్నం తీసుకోకపోవటం నా దృష్టిలో పెద్ద గొప్ప విషయం కాదు, అదో త్యాగమూ కాదు. అంటే, దానర్ధం కట్నం తీసుకోవాలని కాదు. తీసుకోవటం అతి హేయమైన విషయం. తీసుకోకపోవటం మాత్రం టముకేసి చాటింపేసుకోవాల్సిన గొప్ప విషయం కాదు. తేడా అర్ధమైందనుకుంటా."

అబద్రకద్ర గారు,
నాకూ అలాగే అనిపిస్తూంది.

Kathi Mahesh Kumar said...

@అబ్రకదబ్ర: కట్నం తీసుకోవడం "త్యాగం" ఖచ్చితంగా కాదు. కట్నం తీసుకోకపోవడం కనీస ఆత్మగౌరవానికి చిహ్నం. అదొక గౌరవప్రదమైన ఆదర్శం.

ఇకటముకేసి చెప్పడం గురించి. కట్నం తీసుకోవడం గౌరవప్రదమైన "అలవాటుగా" మారిన ఈ పరిస్థితుల్లో ఇలాంటివాళ్ళు టముకేసి చెప్పకపోతే...కట్నం తీసుకోకపోతే నేరమనే పరిస్థితి రావచ్చు.

రమణ said...

అభినందనలు శంకర్ గారు.

Kishore said...

శంకర్ దంపతులకు అభినందనలు. తేనె చంద్రుడి కోసం మా వూరికి రావడం సంతొషం. శుభారంభం. ఏవో సమస్యలు వస్తాయని అనవసరంగా ఆందోళన చెందనవసరం లేదు. మనసులు కలసిన తర్వాత కలకాలం సంతొషంగానే ఉంటారని ఆశిస్తున్నాను.

Anonymous said...

అబ్రకదబ్ర, మిమ్మల్ని వుద్దేశించి అయితే మీరు పేరు మెన్షన్ చేసేవాడిని కదా. నేను మీ వర్డ్స్ మాత్రమే తీసుకున్నాను తప్ప నా వాఖ్యలు మిమ్మల్ని వుద్దేశింది కాదు. అవే వర్డ్స్ మా కొలీగ్ ఉపయోగించడం వలన అవి తీసుకున్నాను. సడన్ గా సేమ్ వర్డ్స్ కనిపించే సరికి అలా తీసుకున్నాను అంతే.

మీ గురుంచి నాకు అసలు తెలియకుండా మీ గురుంచి ఎందుకు కామెంట్ చేస్తాను ? నా కామెంట్స్ మీ గురుంచి కాదు. మా కొలీగ్ గురుంచి.

అతని వుద్దేశం ఏమిటో ఆలోచించి వర్డ్స్ లో పెట్టే ఓపిక లేక అంతటితో ఆపేసాను. వీలుంటే ఎప్పుడైనా ఇక్కడే కామెంట్స్ గా పోస్ట్ చేస్తాలెండి.