నియో-హిందుత్వ రాజకీయ భావజాలంలో కొట్టుమిట్టాడుతున్న కొందరికి తత్వశాస్త్రానికీ,ఆధ్యాత్మికతకూ కూడా మతాన్ని అంటగట్టే అలవాటు అలవోకగా వస్తున్నట్లుంది. నిన్నమొన్న పుట్టిన మతం, ఆది ప్రశ్నలైన "ఈ జీవితం ఏమిటి? దీనికి అర్థం ఏమిటి? ఈ చుట్టూవున్న ప్రపంచంతో దాని సంబంధం ఏమిటి?" అనే వాటికి అనాదిగా సమాధానాలు వెతుకుతున్న మానవజాతి జిజ్ఞాసకు మూలం అనే వాదన అచ్చంగా హాస్యాస్పదం.
Sunday, August 2, 2009
ఆధ్యాత్మిక తత్వచింతనకు మతమేమిటి?
ఆధ్యాత్మికతత్వం యొక్క అనాది తత్వం ముందు మతం గోళీలాడే బచ్చా కాదా!
మతం ఒక వర్గంతో ముగుస్తుంది. ఆధ్యాత్మిక తత్వచింతన మనుషుల జీవితాన్ని అర్థం చేసుకునే శోధనతో మొదలౌతుంది. ఈ విధంగా చూస్తే మతంతో ఆధ్యాత్మికతను ఆరంభించినా మతం కట్టుబాట్లను వీడితేగానీ నిజమైన ఆధ్యాత్మికత మొదలు కాదు. మతానికి అతీతమైన భక్తిలేనిదే ఆధ్యాత్మికతకు అర్థం లేదు. తత్వచింతన ఆ ఆధ్యాత్మికతకు దారిచూపే ఒక సాధనం మాత్రమే. అంతే.
తత్వచింతన కేవలం హిందూమతంలో ఉంది అని వాదించేవాళ్ళకు "మనిషి" మీద కనీస గౌరవం లేదని నాకు అనిపిస్తుంది. మనిషి ఏ ప్రాంతంవాడైనా, ఏ దేశంవాడైనా ఏ మతం వాడైనా ఏ కాలానికి చెందినా, పుట్టకముందూ మరణించిన తరువాతా ఏమవుతుందో ఎరుగని స్థితిలో కనీసం జీవితం గురించైనా తెలుసుకుందాం, ఈ జీవిత పరమార్ధాన్ని గ్రహించుకుందాం అనే ఆలోచన చెయ్యకుండా ఉంటాడా?
ఆధ్యాత్మిక తత్వచించతనకి మూలం మనిషి. కాబట్టి దానికి ఏమతంతోనూ విరోధం లేదు. కేవలం ఒక మతానికి చెందినది అంతకన్నా కాదు. అది మనిషి జీవితానికి సంబంధించినది. మానవత్వానికి చెందింది. నమ్మకం,అపనమ్మకం రెండూ తత్వచింతనకు తోడ్పాటునిచ్చాయి. వివిధమార్గాల్లో "సత్యాన్ని" శోధించడానికి అవకాశాన్ని ఇచ్చాయి. ఈ మూలాల్ని గ్రహించని వాళ్ళ అబిప్రాయాలకు విలువేమిటి?
ఒకవైపు చార్వాకులూ మరోవైపు బౌద్ధ-జైనాలు తత్వవిచారణను మానవప్రపంచంలోని ఈ భాగంలో మొదలుపెడితే దాదాపు ఇదే సమయంలో గ్రీకు తత్వవేత్తలైన సోక్రటీస్,అరిస్టాటిల్ లు సాధనలు చేశారు. వారి మాటల్లోనే ఈజిప్టు తత్వంగురించి మనకు కొంత తెలుస్తుంది. ఇక చైనాలో కన్ఫూసియస్,మోట్సులు వివిధ కోణాల్లో మానవతత్వచింతనను ఆవిష్కరించారు. మానవజాతికి ఆధ్యాత్మికతత్వచింతనకు ఇంత ఘనమైన చరిత్ర ఉండగా, దాన్ని ఒకేఒక హిందూమత ఘనకార్యంగా చెప్పుకునేస్తే ఎట్లా?
నిజానికి హిందూమత పరిరక్షకులనుకుంటున్న శంకరాచార్యుడు చెప్పింది అద్వైతం కాదా! రామానుజుడు ప్రభోధించింది విశిష్టాద్వైతం కాదా! మధ్వాచార్యుడిది ద్వైతం కాదా!! ఇవి మతానికి కాదు మనిషికి చెందుతాయన్న కనీసస్పృహ రానంతవరకూ మానవత్వానికి "ముక్తి" లేదు.
చరిత్ర తెలియకపోయినా క్షమించెయ్యొచ్చు. ‘మతం’ తత్వానికి మూలం అనుకుంటే మాఫ్ చెయ్యొచ్చు. కానీ తత్వశాస్త్రం మొత్తం ఒక వర్గం/కులం సొత్తు అనే వాళ్ళ మతిభ్రమణాన్ని ఏంచెయ్యాలో అర్థం కావడం లేదు.
‘ఆధ్యాత్మికత జీవనమూల్యానికి కాక పరలోక ముక్తికి’ అని నమ్మబలికి మానవత్వాన్ని మంటగలుపుతున్న మతం పోకడల మధ్య, ఆద్యాత్మికతత్వచించనకు మతం రంగును పులిమి దాన్నొక బూతు చెయ్యకండి. దానికి వర్గ/కుల ఆపాదనలు చేసి సాటి మానవుల్ని కించపరచకండి.
****
Subscribe to:
Post Comments (Atom)
10 comments:
తత్వ చింతనకి మతమేమిటి? మనిషి తనని తాను తెలుసుకోవటానికి మతాలూ, అవి నేర్పే దృక్పధాలూ అవసరం లేదు.
It would be interesting to study these developments in different regions of the world. My impression is that religion, philosophy, spiritial quest and science went together for a long time in Europe. Monks stored various manuscripts of Greeks to those of Arabs. Early universities like Oxford were started by monks and Cambridge by dissident monks. I think as the desciplines developed there was conflict and separation of the desciplines. The trajectory of these developments might have been different in India. Early there were great dissidents like Charvaka and Budha but later all thse quests seem to have gone together. May be somebody can suggest some books, articles about these trajectories of development.
మతం అన్నది మత్తు మందు అని మార్క్స్ ఆనాడె చెప్పారు. తత్వ శాస్త్రం వేరు, మతం వేరు. మతం పాలకులకు తమ రాజ్యాధికారాన్ని నిలుపుకునే సాధనంగా వాడుకునే పనిముట్టు. ప్రకృతి శోధనలో భాగంగా అనేక తాత్విక చింతనలు ఆవిష్కరింపబడ్డాయి. వాటి మద్యన ఏర్పడిన సంఘర్షణ సమాజ అభివృద్ధికి తోడ్పడింది. దానిని మతం ముసుగులో కప్పిపెట్టె క్రియను మన బ్రాహ్మణ వాదులు చక్కగా నెరవేరుస్తున్నారు....
@గద్దేస్వరూప్: మీరు చెప్పినటువంటి సైన్స్- మతం- తత్వం-ఆధ్యాత్మికతలను తులనాత్మక రీతిలో అర్థం చేసుకున్న రచనలు చాలానే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో నేను చదివిన అటువంటి పుస్తకం Ken Wilber's A Brief History of Everything.
మనిషి జ్ఞానాన్ని వర్టికల్ (తత్వం-వేదాంతం-ఆధ్యాత్మికం)గా హారిజాంటిల్ (ఒకవైపు హ్యూమానిటీస్,సోషియల్ స్టడీస్ మరోవైపి మ్యాథ్సూ సైన్సూ)గా పెట్టి ఒక ఆసక్తికరమైన ధియరీని ప్రతిపాదిస్తాడు. ఎక్కడైనా దొరికితే చదవండి. నా దగ్గరున్న కాపీ ఎవరో మిత్రులు ‘జాతీయం’ చేశారు. మళ్ళీ ఎప్పుడొస్తుందే ఏమో!
ఇక తెలుగులో ప్రపంచతత్వశాస్త్ర పరిచయాన్ని త్రిపురనేని గోపీచంద్ (తత్వవేత్తలు: సిద్ధాంతాలు-జీవిత విశేషాలు, అలకనంద ప్రచురణలు ధర: Rs 200/-)వాడ్రేవు చినవీరభధ్రుడు (సత్యాన్వేషణ, ఎమెస్కో ప్రచురణలు. ధర 175/-)లు రాశారు. వీటిని చదవడానికి ప్రయత్నించండి.
@అబ్రకదబ్ర: అదేనండీ నాపాయింటూనూ!
@వర్మ:సమాజ అభివృద్ధిని అనునిత్యం ఆటంకపరుస్తూ, తిరగబడిన తత్వవేత్తల జ్ఞానాన్ని లోపాయకారిగా మతంలోకి జొప్పించి ఇదంతా మా గొప్పతనమే అంటున్న బ్రాహ్మణవాద భావజాలం అన్నిటికన్నా ప్రమాదకరం.
మతానికి ఆధ్యాత్మికతకు ఉన్న సంబంధం ఏంటంటే.. మతం ఆధ్యాత్మికతకు ఎంత విలువనివ్వాలో చెప్పగలదు.
సగటు జనాలు ముందు మతాన్ని దిశానిర్దేశించమంటారు కాబట్టి ఆధ్యాత్మికతవైపుకు వచ్చే వారి సంఖ్య ఒక సంస్కృతిలో ప్రాంతీయ మతం మీద ఆధారపడివుండవచ్చు.
ఉదా - లక్ష్మీదేవి - ప్రాపంచిక సుఖాలు.
బ్రహ్మ (పదార్ధం)- ఆధ్యాత్మిక గమ్యం.
I hope you get the point.
There are 2 gaps from the source post, which I can clearely see..
1. Its culture but not religion that Im claiming for.
2. Its spirituality but not philosophy which Im debating for.
KMK,
Thanks for the links. Ken Wilber's book is available in one of the libraries as well as more books by him. This is one of the things I look for blog, more information to delearn and relearn as you once put it.
I don't like religion becasue it discribes human birth is a sinful act and you have to search for reality in another planet.
I liked the post and I agree with this.
తత్వచింతనకు మూలం, బాధల నుండి విముక్తి పొందటం , ఏదో తెలుసుకోవాలనే జిజ్ఞాస. దానికీ మతానికి సంబంధమే లేదు.
హిందుత్వము ఒక మతము అనుకోవటమే ఒక మూర్ఖత్వమవుతుంది, ఎందుకంటే ప్రాచీన భారతంలో ఆచరించిన ఒక ధర్మము మాత్రమే, అదే సనాతన ధర్మము. కానీ కాలాంతరములో అనేక మతములను మొదలుపెట్టటము అవి భారత దేశ సరిహద్దులకు చేరుకోవటంతో, ఇచ్చట ప్రజలు అవలంబిస్తున్న దర్మాన్ని విదేశీయులు ఇది కూడా వారి మతాల లాగానే అనుకోవటం దీనికీ ఒక పేరు అది సింధు నుంచి హిందు అనుకోవటం జరిగిపోయినాయి. అదే మనమూ అనుసరించటము జరిగిపోయినాయి.
ఇక మన శాస్త్రాలని మనము నమ్మకపోవటమ్ అనేది మనకి ఒక రుగ్మతగా తయారయినది. నాలుగు సంవత్సరాలకి ఒకటి కలుపుకోమని చెప్పే ఆంగ్ల కాలమానము మనకి శాస్తీయం గా కనపడుతుంది, కానీ ఎంతో అవలీలగా గ్రహస్థితులను , నెలలను రోజులను గణించే భారతీయ కాలమానం మనకి తగదు ఎమ్దుకంటే అది హిందు కదా!
Post a Comment