Thursday, August 20, 2009

జిన్నా భూతం

జిన్నా భూతం ఒకప్పుడు అద్వానీని కలవరపరిచింది. తన పార్టీలోనే తన పరిస్థితిని కకావికలం చేసింది.
ఇప్పుడు...జస్వంత్ సింగ్ రాజకీయ జీవితానికి చరమగీతం పాడింది.

జస్వంత్ సింగ్ ఉద్వాసన ‘చింతన్ బైఠక్’ మొసలవ్వకముందే "యువతకు పగ్గాలివ్వండి" (ముసలాళ్ళని ఇళ్ళకు పంపండి) అన్న ఆర్.ఎస్.ఎస్. సూచన నేపధ్యంలో జరగడం చాలా అర్థం చేసుకోదగ్గ పరిణామం. బీజేపీ పార్టీ మానసిక-సైద్ధాంతిక పరంగా ఇంకా ‘అఖిలభారత హిందూమహాసభ (1915)’ మూలాల్ని విడవలేదనడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. ఒక రాజకీయ పార్టీగా పరిణితి చెందలేదనడానికి నిదర్శనం మాత్రమే.

చరిత్ర చూసుకుంటే మాత్రం, బీజేపీ జిన్నా భూతాన్ని చూసి ఇంతగా ఝడుసుకోవడం హాస్యాస్పదంగా అనిపిస్తుంది. బహుశా జస్వంత్ సింగ్ కూడా అలాగే అనుకున్నారేమో!

ముస్లిం లీగ్ ఏర్పాటుకూ జిన్నాకు ఎటువంటి సంబంధం లేదు. ఏదో క్వాజీ సలీముల్లా, వకీర్ ఉల్ ముల్క్ వంటి కొందరు మాజీనవాబులు, ముఖ్యంగా ముఘల్ సామ్రాజ్యపు వైభవాన్ని కాపాడుకోవాలనుకుంటున్న రొమాంటిక్ ఫూల్స్ 1900 సంవత్సరంలో యునైటెడ్ ప్రావిన్స్ (ప్రస్తుతం ఉత్తరప్రదేశ్) లో ఉర్థూ స్థానంలో హిందీని పరిపాలనా భాషగా తీసుకురావడంతో కలతచెంది ఏర్పరిచారు. ముఘల్ వైభవాన్ని కాపాడాలని ఏర్పరిచినా, బ్రిటిష్ లాయల్టీని ప్రబోధించిన ఈ ముస్లిం లీగ్ లో జిన్నా 1913 వరకూ చేరలేదు. సెక్యులర్ రాజకీయ సంస్థ(అప్పటికి కాంగ్రెస్ పార్టీ కాదు) అయిన కాంగ్రెస్ లోనే ఉన్నారు. బెంగాల్ విభజన నేపధ్యంలో జరిగిన పరిణామాల దృష్ట్యా మారిన ముస్లిం లీగ్ విధానాన్ని ఆసరాగా తీసుకుని, హిందూ-ముస్లిం ఏకత్వసాధన ఒక అవసరంగా భావించిన జిన్నా ముస్లింలీగ్ లో చేరాడు. అప్పట్లో జిన్నా ముస్లింలకు "సరైన" రాజకీయ ప్రతినిధిత్వాన్ని కోరుకున్నాడే గానీ దేశ విభజననీ హిందూ-ముస్లిం అనైక్యతను కాదు.

1916 లో జిన్నా ముస్లింలీగ్ అధ్యక్షుడయ్యాడు. ముస్లింలకు న్యాయబద్ధమైన సీట్లు కేటాయించే విధంగా కాంగ్రెస్ పార్టీతో ‘లక్నో ఒడంబడిక’ చేసుకున్నాడు. ఈ నేపధ్యంలో, చంపారన్ సత్యాగ్రహంతో హఠాత్తుగా హీరో అయిన గాంధీ కాంగ్రెస్ పై పట్టు సాధించారు. 1920 లో సహాయనిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ సిద్ధాంతాలను సమూలంగా మార్చేసిన గాంధీ విధానం జిన్నాలో అసంతృప్తినీ అపనమ్మకాన్నీ రేకెత్తించింది (జిన్నా అపనమ్మకాన్ని బలపరుస్తూ తరువాత 1928 లో లక్నో ఒడంబడికను కాంగ్రెస్ తుంగలో తొక్కింది). రాజకీయవైఫల్యాన్ని ఊహించిన జిన్నా, లండన్ కు ఫలాయనమంత్రం పఠించాడు.

1930 లో చాలా వరకూ రాజకీయాలకు దూరంగా జిన్నా లండన్ లో కాలం గడిపేసాడు. మొహమ్మద్ ఇక్బాల్ 1930లో ప్రతిపాదించిన ‘రెండు దేశాల సిద్ధాంతం’ మొదలు, సైమన్ కమిషన్, రౌండ్ టేబిల్ సమావేశం, 1935 గరవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ వరకూ కనీసం జిన్నా ఊసుకూడా చరిత్రలో కనిపించదు. ఆ తరువాత (1937 నుండీ) 1940 లాహోర్ సమావేశంలో " "Hindus and the Muslims belong to two different religions, philosophies, social customs and literature... It is quite clear that Hindus and Muslims derive their inspiration from different sources of history. They have different epics, different heroes and different episodes... To yoke together two such nations under a single state, one as a numerical minority and the other as a majority, must lead to growing discontent and final destruction of any fabric that may be so built up for the government of such a state." అంటూ ఒక సరికొత్త ముస్లింరాజకీయవాద (‘మతవాద’ కాదు) జిన్నా ఆవిర్భవిస్తాడు.

వ్యక్తిగతంగా జిన్నా మతాన్నెప్పుడూ పాటించలేదు. ఆరంభంలో తన ఉద్దేశం ముస్లింలకు రాజకీయ ప్రాతినిధ్యం. హిందూ-ముస్లిం ఐక్యత. కానీ అతివాదం, ఎమోషనలిజం తప్ప మరెటువంటి విధానమూ పనికిరాని వ్యవస్థ నైరాశ్యంలో తన రాజకీయ మనుగడకోసం, లేని మతం రంగును ఆపాదించుకుని మొండివైఖరి అవలంభించిన ఫలాయనవాద "బలవంతపు మతవాది"గా మారిన రాజకీయనాయకుడు జిన్నా.

దేశవిభజనకు జిన్నా మొండితనం ఎంత కారణమో నెహ్రూ చేతకానితనం, గాంధీ నైరాశ్యం, కాంగ్రెస్ విధానాల వైఫల్యాలు అంతే కారణం. దేశవిభజన జరిగినా ఇండియా-పాకిస్తాన్ మిత్రులుగా మెలగొచ్చనుకున్న జిన్నా భారతీయవ్యతిరేకి కాదు అనేది బహుశా కొంతకాలం బ్రతికుంటే తెలిసేదేమో!

ఆరంభంలో భారతీయ చరిత్రకారులు జిన్నాను ఒక విలన్ గా చిత్రీకరించడం nation building process లో భాగంగా మనం అర్థం చేసుకున్నా, ఇప్పుడు జిన్నాను "సరిగ్గా" అర్థం చేసుకోవడం అవసరం. సమస్యాత్మకం చేసుకోవడం అనవసరం. ముఖ్యంగా అది బిజేపీ చెయ్యడం వారి తెలియనితనాన్నే సూచిస్తోంది. జస్వంత్ సింగ్ జిన్నాను హీరో చేస్తే, విలన్ అయ్యేది కాంగ్రెస్ పార్టీ. అలాంటప్పుడు అది బీజేపీకి లాభం చేసేదేగానీ నష్టం కాదు. బీజేపీ చరిత్రని ఎప్పుడూ తప్పుగా అర్థం చేసుకుందనడానికి ఇదొక ఉదాహరణ అనుకుంటాను.

****

18 comments:

రమణ said...

చరిత్ర గురించి కొంత తెలియజేసారు ధన్యవాదాలు. ఏమైనా నేను కూడా, ఈ విషయాన్ని గురించి బాగా తెలుసుకున్న తర్వాత పూర్తిగా స్పందిస్తా.
అద్వాని, జశ్వంత్ సింగ్ జిన్నా గురించి మంచిగా చెప్పటం, ఆ పార్టీ మూల సిద్ధాంతాలకు విరుద్ధం. వారి ఉద్దేశం కొంతమంది ముస్లిం లను బిజెపి వైపు వ్యతిరేక భావం పోగొట్టాలనేమో !. భారతీయుల్లో చాలా మందికి జిన్నా అంటే సదభిప్రాయం ఉండదు. బిజెపి వాళ్ళే కాదు, సగటు భారతీయులు కూడా ఎంతో కొంత వ్యతిరేకిస్తారు.
మనకి మూలం చరిత్రే. అయితే ఇప్పుడు జిన్నా గురించి తెలుసుకోవటం, అర్ధం చేసుకోవటానికి ప్రయత్నం చేయటం అనవసరం. అలా అర్ధం చేసుకోవటానికి చేసే ప్రయత్నం లోనే మళ్ళీ విద్వేషాలు రగులుతాయి. ప్రజలకు ఉండే నమ్మకాన్ని అంత సులువుగా మార్చలేరు.
జిన్నా గురించి నాకు తెలియదు కానీ, ఈ సమయంలో జశ్వంత్ అలా వ్రాయడం అనవసరంగా వివాదాన్ని రేపినట్లైంది కదా ?

chandramouli said...

జిన్నాని అత్యుత్తమ రాజీకీయ (బలవంత) మత నాయకుడిగా చిత్రంచటంలో తప్పులేదు కాని.... జిన్నా భారత దేశ ప్రజలకు కూడా హీరో వంటి వాడు అనటం సబబు కాదు అని..... అలా అయితే ... హిట్లర్ ని మించిన నాయకుడు ప్రతిభాశిలి, వారి జాతి ప్రజల శ్రేయస్సుకోసం పని చేసిన నాయకుడిగా చరిత్రలో ప్లాటినం అక్షారాలతో లిఖించాలి కదా......

ముస్లీం లీగ్ అయుధాలు దరించి విప్లవానికి దిగి పంజాబ్ సిక్కులను ఊచ కోస్తుంటే చూస్తూ ఉరుకున్న(దగ్గరుంది కోయించిన) జిన్నా నిజానికి హీరోనే....సంధర్బం కాదు గాని మహేష్ అన్నా ఎందుకో హిందువులంటే మీకు ఒకరంగా చిన్న చూపే... మెదట్లో మీరు అలోచించే కోణం అవసరమయిన వాదన అనుకునే వాడిని కాని ఇలా జిన్నాని హీరుగా చూస్తూ.... విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన హిందూ ముస్లీం ప్రాణాలను వెక్కిరిస్తుంటే.... అదోలా అనిపించింది....

Kathi Mahesh Kumar said...

@చంద్రమౌళి:PLEASE READ SOME HISTORY: Suggestive reading is "India after Gandhi" By Ramchandra Guha.

జిన్నా దగ్గరుండి సిక్కుల్ని చంపించాడని మీకు ఏ చరిత్ర చెప్పిందో నాకు తెలీదు. Jinnah has always been an armchair politician. నిజానికి mass politics అస్సలు చేతకాని వ్యక్తి. బహుశా తను సారస్వత ఎన్నికల్లో నిలబడుంటే ఎప్పుడూ గెలిచేవాడు కాదేమో. కాబట్టి జిన్నాకు నిలబడి నరికించే ధైర్యం ఉందనేది మీ అపోహ మాత్రమే.

దేశవిభజన ఒక చారిత్రాత్మకతప్పిదం అనేది అందరూ అంగీకరించే విషయమే అయినా, అది జరిగింది "తప్పనిసరి పరిస్ద్థితుల్లో". దానికి జిన్నా ఎంత కారణమో కాంగ్రెస్ పార్టీ అంతే కారణం and British played their part.

దేశవిభజన ఒక ill conceived plan.ఇంత స్థాయి హింసని బ్రిటిష్ వాళ్ళు ఊహించలేదు. Nobody was prepared for it. సగానికిపైగా అర్మీ అప్పటికీ బ్రిటిష్ వాళ్ళ ఆద్జీనంలోనే ఉంది.అటుపాకిస్తాన్ గానీ ఇటు భారతదేశంగానీ పూర్తిస్థాయి నియంత్రణలో లేని పరిస్థితుల్లో ఆ అమానవీయ హననాలు (ఐదు నుంచీ పదిలక్షల మంది చంపబడ్డారు) జరిగాయి. వాటిని హర్షించే వాళ్ళు ఈ భూమి మీద ఎవరూ ఉండరు.

ఈ చర్చలో హఠాత్తుగా మీకు కనబడిన నా "హిందువులపై చిన్నచూపు" ఏమిటో నాకు అర్థం కాకుండా ఉంది.

నా వ్యాసం ఏ విధంగానూ జిన్నాను హీరో చెయ్యటం లేదు. కొన్ని నిజాల్ని చెబుతున్నాయి అంతే.

ప్రియ said...

Hmm very nice.
Jinnah may not be a hero, but not a really bad villain. He too played his part in some good things. The divide and rule politics of the British is a factor for all the catastrophes.

Sai Praveen OS said...

మీకు ఇలా పలు ఆంశములపై అవగాహన, పట్టు వుండటం చూస్తుంటే, నాకు ఆశ్చర్యము మరియు మీపై గౌరవము పెరుగుతున్నది.

చరిత్ర గురించి తెలిపినందుకు ధన్యవాదములు. మీ టపాను సమర్థిస్తూ, ఒక వీడియో లంకెను ఇక్కడ అందిస్తున్నాను. http://www.engagevoter.com/news/Meghnad-bjp.php

chandramouli said...

చరిత్ర తెలియకుండానే జిన్న గురించి పంజాబ్ సిక్కులగురించి మాట్లాడాను అని మీరు ఎలాఅనుకున్నరనేది మీ విజ్ఞతకే వదిలి...... పార్టిషన్ లో ఎంతో మంది తప్పుచేశారు అని తెలిసిన విషయమయిన అత్యంత మూర్ఖంగా ఎంత మంది హెచ్చరించినా తిరుగులేని మూర్ఖ నిర్ణయం తీసుకున్నది చాలదా ..... జిన్నా అంతర్గత భావలు తెలియపరచుటకు.... తరతరాల సంస్కృతి వేళ్ళూనుకున్న పంజాబ్ ని ముక్కలు చేయ్యాలి అన్న ప్రతిపాదన జిన్నాది కాదా... సామరస్యంతో విభజన లేక పోతే విభజనతో సాధపరుస్తాను అని మౌంటుబాటన్ ను హెచ్చరీంచిన రెందవరోజే తూర్పుపంబాబు వందల మంది ఘోరీలను,బాబర్,అక్భర్,గజనీల మానస పుత్రులను చూడలేదంటారా... అయినా ... వాదనతో గాంధీని జాతికి పట్టిన శనిగా, ఘోరీకి భారత రత్న ఇవ్వొచ్చు... జిన్నాని ఒక పొలిటికల్ వ్యూలో చూస్తే మీరన్నట్టుగా గొప్ప నాయకుడే... ఎవరయిన దేశానికి నాయకుడవుతాడు, కాని జిన్నా దేశాన్ని నిర్మించుకుని మరీ నాయకుడయ్యాడు... a nations with flush and blood as its foundation....

అందుకే ముందేచెప్పాను కదా సంధర్బంకాదు కాని అని - అయిన పార్టిషన్ హిందూ ముస్లీం గొడవగానే చూస్తాను నేను....

Kathi Mahesh Kumar said...

@చంద్రమౌళి: మీకు తెలిసిన చరిత్రలో కొన్ని గ్యాప్స్ ఉన్నమాట మీ వ్యాఖ్యతో తేటతెల్లమవుతోంది.

ర్యాడ్ క్లిఫ్ ఆధ్వర్యంలోని "పంజాబ్ బౌండరీ కమీషన్" ప్రొసీడింగ్స్ మీకు తెలిస్తే బహుశా ఈ తప్పుని జిన్నామీదకు నెట్టివెయ్యరు. అందుకే మిమ్మల్ని రామచంద్రగుహ latest publication చదవమంటున్నాను.

సమయాభావం, నిర్ణయాలలేమి,ర్యాడ్ క్లిఫ్ అవగాహనారాహిత్యం ఇవన్ని కలిపి అర్థరహిత పంజాబ్ విభజనకు కారణమయ్యాయి. ఇందులో జిన్నాపట్టిన మంకుపట్టుకన్నా operational issues పాత్రే ఎక్కువ.

Partition has never been a pleasurable thing for both sides. కానీ మీరు ఒకేవైపునుంచీ చూస్తున్నారు.నేను రెండువైపులా చూడమంటున్నాను. అంతే.

chandramouli said...

ఆకలితో మలమలా మాడుతున్న కుటుంబం కడుపునింపటానికి ఒక దొంగ నా కుటుంబ సభులను చంపితే నేను రెండువైపులనుంచి ఆలోచించను..... ఎందుకంటే చనిపోయింది నా కుటుంబసభులు కనుక........ ( సెంటిమెంట్ కోసం చెప్పలేదు, అర్దం అవుతుంది అని చెప్పాను...)

జిన్న పంజాబ్ మీద పట్టు విడచివుంటే పంజాబ్ లో అల్లకల్లోజరిగి ఉండేది అని మీరు విశ్వసిస్తున్నారా?

Kathi Mahesh Kumar said...

@చంద్రమౌళి: చరిత్రని వ్యక్తిగత బాధల్లోంచీ నిర్ణయించకూడదు.History can't be judged based on personal tragedy.

లాహోర్,ముల్తాన్,రావల్పిండిలో ముస్లిం ఉన్మాదుల చేతుల్లో నరకబడిన సిక్కులతోపాటూ అమృత్ సర్,లుధియానా,గురుదాస్పూర్లలో సిక్కు గొరిల్లాల ద్వారా తెగ్గోయ్యబడ్డ ముస్లిం తలలూ లెక్కచూస్తేనే చరిత్ర్ర పూర్తవుతుంది.

పంజాబ్ ప్రాంతాన్ని వదిలేస్తే పాకిస్తాన్ (వెస్ట్ పాకిస్తాన్) కు మిగిలేది ఎడారి,బంజరు భూమి.కాబట్టి ముస్లిం బాహుళ్యం ఉన్న కొన్ని ప్రాంతాల్ని కావాలనుకోవడంలో నాకు జిన్నా తప్పు కనిపించడం లేదు. కానీ, తద్వారా జరిగిన హింసకు జిన్నాని "మాత్రమే" కారణం చెయ్యలేను. మతోన్మాదం,పిచ్చి,మానవుల్లోని పశుత్వం దానికి కారణం.

chandramouli said...

అంటే పాకిస్తాన్ మెత్తం కేవలం కొల్లగట్టబడిన పంజాబ్ మీదనే ఆధార పడి జీవిస్తుందా ...... నిజంగా ప్రజల శ్రేయస్సుకోసం పంబాజ్ ని లాక్కొంటే .... జమ్మూనిలాక్కోవటం కూడా అదేశ్రేయస్సుకోసం అంటారా..... కాశ్మీర్ రాజు ఇండియాలో కలిపేశిన తారువాత కూడా?

chandramouli said...

ఎవరు ముందు చంపారు అని నేను చెప్పను కాని..... సిక్కులు ప్రతిహింస సాగించి ఉండి ఉండక పోతే .... పంజాబ్ మరో కాశ్మీరం అయిఉండేది అని నేను నమ్ముతాను....

Kathi Mahesh Kumar said...

@చంద్రమౌళి: పంజాబ్-సింధ్ ప్రాంతాన్ని, హిమాలయాల్నీ వదిలేస్తే పాకిస్తాన్ మ్యాప్ లో మిగిలేదేమిటో ఒకసారి చూడండి.

కాశ్మీర్...హ్మ్మ్ Now you are coming in to another issue with same misinformation.పాకిస్తాన్ దొంగచాటుగా దాడిచెయ్యడం మోసం. అందులో సందేహం లేదు కానీ, జునాగడ్ లాజిక్ మీకు తెలుసుకదా! దానితో బేరీజు చెయ్యండి.మన పరిస్థితి మనకు తెలుస్తుంది.Indian failed to defend our case for Kashmir in UN.అది మీకు తెలుసనుకుంటాను.

సిక్కుల (ప్రతి)హింసని సమర్ద్గిస్తున్న మీకు. ఇరువైపులా జరిగిన హింసను ఖండిస్తున్న నాకు ఆ మాత్రం తేడా ఉండాలి లెండి.

Unknown said...

మహేష్, మీ వివరణకు నా ప్రత్యుత్తరం.
జెనరల్ అయూబ్ ఖాన్ పాకిస్తాన్ లో రాజ్యాధికారం చేపట్టేవరకూ (1958)అదొక సెక్యులర్ స్టేట్.
1948లో మరణించిన జిన్నా కూ, 1958 వరకూ ఉన్న సెక్యులరిజానికీ సంబంధం లేదు (మాస్ పోలిటిక్స్ తెలియని వాడని మీరే చెప్పారు)
జిన్నా మతవాది కాదు.నిజజీవితంలో బలమైన మతవిలువల్ని పాటించిన మనిషి కాదు. మతం అతనికొక రాజకీయ సాధనం.
నిజమే అతను మతాన్ని వాడుకుని పాకిస్తాన్ ని సాధించుకున్నాడు. మీరు చెప్పిన రొమాంటిక్ ఫూల్స్ (??) ఆసరాతో మతాన్ని ఈ విధంగా వాడుకున్నాడు.
హిందూ-ముస్లిం ఏకత్వసాధన ఒక అవసరంగా భావించిన జిన్నా ముస్లింలీగ్ లో చేరాడు. అప్పట్లో జిన్నా ముస్లింలకు "సరైన" రాజకీయ ప్రతినిధిత్వాన్ని కోరుకున్నాడే గానీ దేశ విభజననీ హిందూ-ముస్లిం అనైక్యతను కాదు.

ఈ వాక్యంలో మీరు చాల కన్ఫ్యూషన్ ప్రదర్శించారు. 1906లో స్ధాపించబడ్డ ముస్లిం లీగ్ మొదటి నుండి కూడా ప్రత్యేక హక్కుల కొరకు, స్వాతంత్ర్యానంతరం బెంగాల్ దిక్కున తమకంటూ ఒక ముస్లిం దేశం కొరకు ప్రాకులాడుతూనే ఉంది. ఇటువంటి లీగ్ లో చేరిన జిన్నాకు ప్రత్యేక రాజ్యకాంక్ష లేదనటం అవివేకం. ఒక వేళ వ్యక్తిగతంగా అలాంటి వాడనుకున్నపటికినీ సంస్థ ఉద్దేశ్యాలనే అతడు represent చేస్తాడు.

ఏతావాతా నాకర్ధమయ్యిందేమిటంటే, అధిక శాతం భారతీయులవలెనే మీకు కూడా జిన్నా పై సదభిప్రాయం లేదు. (మతాన్ని రాజకీయ సాధనంగా వాడుకున్నాడు వంటి కామెంట్ల వల్ల ఇలా భావిస్తున్నాను). అయితే కేవలం భారతీయ జనతా పార్టీని విమర్శంచే లక్ష్యంలో మీరు జిన్నాని హీరోని చేస్తున్నారు. బి.జె.పి. ని విమర్శించండి. తప్పులేదు. ఎంతో మంది భారతీయులు సైతం మీతో ఏకీభవిస్తారు ఈ విషయంలో. అయితే ఇందుకోసం జిన్నాని కొత్తగా 'అర్ధం' చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జిన్నా వంటి బలమైన ప్రతిఘటన లేకుంటే విభజన జరిగేదీ కాదు, ఇంత హింసకి చోటుండేదీ కాదు. జిన్నా కాకపోతే మరో ముస్లిం నాయకుడు వల్ల అది జరగదా అని మాత్రం అనవద్దు. జిన్నా లేకపోతే విభజన విషయంలో అంతటి ప్రతిఘటన ఉండేది కాదు అని నా విశ్వాసం.

Kathi Mahesh Kumar said...

@బృహస్పతి: నాది కన్ఫ్యూషన్ కాదు. మనుషులకన్నా వారి పరిస్థితులు వార్ని నిర్ణయిస్తాయన్న నమ్మకం. అందుకే, I believe,
Jinnah is a complex man and he needs to be understood with all his complexity.

జిన్నా ఒక pragmatic politician అనేది ఎవరూ కాదనలేని విషయం. గాంధీకి హఠాత్తుగా కాంగ్రెస్ లో పెరిగిన పరపతిని, స్వతంత్ర్యపోరాటాన్ని ఒక మాస్ మూమెంట్ చెయ్యలన్న కాంగ్రెస్ నిర్ణయాన్ని జీర్ణించుకోలేని ఒక కులీనరాజకీయ వాది జిన్నా. వ్యక్తిగతంగా నమ్మిన సిద్ధాంతాలు-రాజకీయ అవసరాలమధ్య మతాన్ని ఒక "రాజకీయవాదం" మాత్రమే అనుకుని ముస్లిం లీగ్ లో చేరాడు. తన ఉద్దేశాల్లో స్వార్థం ఉన్నా వ్యక్తిగత ఆదర్శాల్లో కాదు.

రాజకీయస్వార్థం ఎవరికి మాత్రం లేదు? జిన్నాను ప్రధానమంత్రిని చెయ్యడానికి నెహ్రూ ఒప్పుకొనుంటే విభజన బహుశా జరిగేదే కాదేమో! గాంధీ నెహ్రూకిచ్చిన ప్రాధాన్యత కాంగ్రెస్ లో జిన్నాకూ ఇచ్చుంటే పరిస్థితి అంతదాకా వచ్చేదే కాదేమో! These are all meaningless speculations now.

Jinnah laid the foundations of a secular state in Pakistan. ఒకసారి మీరు జిన్నా స్పీచ్ లు,writings చదివితే అది తెలుస్తుంది.కానీ దురదృష్టవశాత్తూ Pakistan proved to be a failed state in all counts.

విభజనకు "కేవలం" జిన్నా బాధ్యుడు అనేది giving his too much of credit.

Unknown said...

>> బెంగాల్ విభజన నేపధ్యంలో జరిగిన పరిణామాల దృష్ట్యా మారిన ముస్లిం లీగ్ విధానాన్ని ఆసరాగా తీసుకుని, హిందూ-ముస్లిం ఏకత్వసాధన ఒక అవసరంగా భావించిన జిన్నా ముస్లింలీగ్ లో చేరాడు.

"హిందూ-ముస్లిం ఏకత్వసాధన ఒక అవసరంగా భావించి" కాదు. ముస్లిం లీగ్ తన బ్రిటిష్ విధేయతను తొలగదోసి స్వాతంత్ర్య సాధన లక్ష్యంగా ప్రకటించుకుంది కాబట్టి.

>> ముస్లింలకు న్యాయబద్ధమైన సీట్లు కేటాయించే విధంగా కాంగ్రెస్ పార్టీతో ‘లక్నో ఒడంబడిక’ చేసుకున్నాడు.

అయ్యా! లక్నో ఒడంబడికలో ఉన్నవి ముస్లింలకు న్యాయబద్ధమైన సీట్ల కేటాయింపు మాత్రమే కాదు. (మీరు ప్రవచించే సెక్యులరిజానికి వ్యతిరేకంగా) ముస్లిం ప్రజాప్రతినిధులను ముస్లిం ఓటర్లే ఎన్నుకోవాలనే అతి ప్రమాదకరమైన సపరేట్ ఎలక్టరేట్ కూడా.

>> కాంగ్రెస్ సిద్ధాంతాలను సమూలంగా మార్చేసిన గాంధీ విధానం

ఏమిటా సమూలంగా మారిపోయిన సిద్ధాంతాలు?

>> రాజకీయవైఫల్యాన్ని ఊహించిన జిన్నా, లండన్ కు ఫలాయనమంత్రం పఠించాడు.

సహాయ నిరాకరణ ఆయనకిష్టం లేదు కాబట్టి ఫేడౌట్ అయిపోయాడు. మరి ఈ లెక్కనైతే గాంధీ మాత్రం 1921 నుంచి 1928 వరకూ తన ఆశ్రమానికి పలాయనం చిత్తగించలేదా?

>> 1920 - 30 లో చాలా వరకూ రాజకీయాలకు దూరంగా జిన్నా లండన్ లో కాలం గడిపేసాడు. మొహమ్మద్ ఇక్బాల్ 1930లో ప్రతిపాదించిన ‘రెండు దేశాల సిద్ధాంతం’ మొదలు, సైమన్ కమిషన్, రౌండ్ టేబిల్ సమావేశం, 1935 గరవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ వరకూ కనీసం జిన్నా ఊసుకూడా చరిత్రలో కనిపించదు.

వాస్తవాలు తెలుసుకోండి సార్! In 1924 Jinnah reorganized the Muslim League, of which he had been president since 1919, and devoted the next seven years attempting to bring about unity among the disparate ranks of Muslims and to develop a rational formula to effect a Hindu Muslim settlement, which he considered the pre condition for Indian freedom. He attended several unity conferences, wrote the Delhi Muslim Proposals in 1927, pleaded for the incorporation of the basic Muslim demands in the Nehru report, and formulated the “Fourteen Points” (src: wikipedia)

>> అతివాదం, ఎమోషనలిజం తప్ప మరెటువంటి విధానమూ పనికిరాని వ్యవస్థ నైరాశ్యంలో తన రాజకీయ మనుగడకోసం, లేని మతం రంగును ఆపాదించుకుని మొండివైఖరి అవలంభించిన ఫలాయనవాద "బలవంతపు మతవాది"గా మారిన రాజకీయనాయకుడు జిన్నా.

గాంధీ ఆయన సమకాలికుడేనే! ఆయన విధానాలకు ప్రజల నుంచి వచ్చిన అపూర్వమైన స్పందనను చూసి కుడా నైరాశ్యం ఎందుకు?

Unknown said...

@మహేష్: Complexity, మనిషిలోని భిన్న పార్శాలు(మంచి, చెడు) అన్నవి సామాన్యులకు మాత్రామే అన్వయించాల్సిన విషయాలు. చరిత్రను శాసించిన, నిర్దేశించిన (జిన్నా వంటి వారు) వారి విషయంలో ఈ కోణం తగదు. వారి ఉనికి వల్ల మేలు జరిగిందా? కీడు జరిగిందా అన్నదొక్కటే ఆలోచించాల్సిన విషయమని నేను నమ్ముతాను.
ఏదేమయినప్పటికినీ, టపా చదివి మీరు జిన్నా పక్షపాతి అని భావించినవారికి కామెంట్లలో మీ తటస్థ వైఖరి ముదావహమే

Bolloju Baba said...

fantastic discussion.
there is one more interesting fact about jinna.
he was succumbing to acute tuberculosis at the time of partition. had the partition been delayed an year more, no pakistan would have emerged. source: freedom at midnight book

Anonymous said...

జిన్నా కూడా నేటి కుహనా లౌకిక రాజకీయ నాయకుల్లా మాట్లాడాడు.నేడు కె సి ఆర్ మాట్లాడుతున్న భాషలాంటిదే."ఆంధ్రోల్లు దొంగలు,రాక్షస వారసులు ఉమ్మేసినా పట్టించుకోరు" అన్న నోటి తోనే
"మా కోపం పేద ఆంధ్రోల్ల మీద కాదు,పెత్తం దార్ల మీద అంటారు..".జనం మన చేతుల్లో వుంటే లౌకిక వాదం.లేక పోతే విధ్వంస వాదం.