బర్గర్ కింగ్ లక్ష్మీ దేవి వివాదంతో, హిందువులకు "సారీ" అయితే దక్కిందిగానీ సమస్యమాత్రం అట్టాగే ఉండిపోయింది.
ఏదో అడ్వర్టైజింగ్ ఏజన్సీవాడు తామర పువ్వు మీద కూర్చుని చిరునవ్వులు చిందిస్తున్న దేవతని చూసి "కూల్ యార్!" అనుకుని ఈ కూల్ గాడెస్ ని బర్గర్ మీదకెక్కించాడు. తీరా ఆ బర్గర్ కాస్తా బీఫ్ (పశుమాంసం) బర్గర్ ఆయే. అంతే మనోళ్ళ మనోభావాలు తీవ్రంగా దెబ్బతినేశాయ్. తినాల్సిందే మరి. ఎంతైనా మనం ఆ బర్గర్లు తినంకదా!
లక్ష్మీ స్వీట్ల్స్, లక్ష్మీ వైన్స్, లక్ష్మీ టాకీస్, లక్ష్మీ లాండ్రీ అయితే ఫరవాలేదుగానీ మాంసాహారం మీద లక్ష్మీదేవి పోస్టరే! అస్సలు సహించలేం. మొత్తంగా ఒక మాంసాహార హోటల్ పేరు లక్ష్మీ విలాస్ అయితే మాత్రం ఫరవాలేదు.
చికెన్, మటన్ అయినా క్షమించొచ్చుగానీ ఏకంగా పశుమాంసమే...అస్సలు కుదరదు. ముఖ్యంగా తెలీనోడు చేస్తేమాత్రం సారీ అడగాల్సిందే. అడిగేసాడు. మొత్తం పాపాన్ని కడిగేసాడు.
సమస్య ఇక్కడితో తీరిందనుకోకండి. ఇక్కడే ఇందులో ఇంకో కిటుకుంది. ఆ పోస్టర్ మీద పెద్దగా "Snack is Sacred" అని రాసుంది. మనోళ్ళ అమూల్యమైన అభ్యంతరం ఏమిటంటే "మాసంలో పవిత్రత ఏముంది?. మా మతంలో మాసం అస్సలు ముట్టంబాబూ!" ఇక్కడే అసలు సమస్య స్టార్ట్.
ఎవరి మతం? ఎవరు మాంసం తినరు? ఎవరికి మాసం పవిత్రత కాదు? మాసం పవిత్రం ఎందుకు కాకూడదు? మాంసానికీ మతానికీ సంబంధం ఏమిటి?
నాకు బాగాగుర్తు, మాఊర్లో చిన్నప్పుడు మాతమ్మ జాతరప్పుడు ఏటలు తెగాల్సిందే మాంసం కుతకుతా ఉడకాల్సిందే. ఎంత పెద్ద జీవాన్ని నరికితే అంత గొప్ప. అంత గొప్ప భక్తి. తిరపతి గంగమ్మ జాతరప్పుడు తెగిన కోడి తలకాయలు చూసి నా తల తిరిగేది. ఇక భైరవుడికి కక్కాముక్కా లేకపోతే అస్సలు పూజ పూర్తికాదు.
ఇవన్నీ హిందూమతాలు కావని ఇప్పుడే తెలుస్తోంది. మాసం పవిత్రం కాదని అమెరికాలోని హిందువొకడు చెబితే నాకు తెలుస్తోంది. ఆ హిందువు పేరుకూడా కొంచెం విచిత్రంగానే ఉంది లెండి. రాజన్ జెడ్...అట. ఈ జెడ్ ఏమిటో నాకైతే తెలీదు. ఈ మనిషి హిందూమతంలో మాసం "పవిత్రం" కాదు అని ఎట్టాచెబుతున్నాడో నాకైతే అస్సలు అర్థం కాలేదు.
మన ‘జెడ్’ గారు అంతటితో ఆగకుండా హిందువులు సాత్విక ఆహారులని, రాజసిక - తామసిక ఆహారాలు తీసుకోరని శెలవిచ్చాడు. దీంతో ఒక్కసారిగా నా గుండాగినంత పనయ్యింది. పోయినవారమే మటన్ ధర హైదరాబాద్ లో 250 రూపాయలు కిలో అయ్యేసరికీ, అదికొనడంకన్నా వారానికొకసారి బావర్చిలో మటన్ బిర్యానీ తినడం చీప్ అని నిర్ణయించుకున్నాను. ఈ మాసం అంతా హిందువులు కానివాళ్ళు తినేసి ఇలా ధరలు పెంచెయ్యటం ఎంత దారుణం అనిపించింది. ఒక్క క్షణం కాస్త తమాయించుకుని చూద్ధునుకదా, నా చుట్టుపక్కలున్న హిందువులందరూ మాంసాహారులే, అందరికీ మాంసం ధర పెరగడంతో మహచెడ్డ చికాకుగా ఉంది. మరి "ఈ జిడ్డు...కాదుకాదు... జెడ్డేమిటో ఇలా వాగుతున్నాడా!" అనిపించింది. హేమిటో ఈ మాయ.
మనుషుల్ని వెజ్- నాన్వెజ్ గా ఆహారపు అలవాట్లు మారిస్తే, ఈ మతంగాళ్ళెవరో దేవతల్ని వెజ్ -నాన్వెజ్ చేసిపడేసారు. అంతవరకూ బాగానే ఉంది. మనుషుల్ని ఆహారపు అలవాట్ల ఆధారంగా ఏ మతస్తులో డిసైడ్ చేసేస్తే ఎట్లా! అసలూ... మాసం తినని హిందువుల శాతం ఎంత? మాంసం తింటే వాళ్ళు హిందువులు కారు అని నిర్ణయిస్తే, హిందూ మతంలో ఉండేవాళ్ళ శాతమెంత?
బర్గర్ కింగ్ సంగతేమిటోగానీ, ఇలాంటి ఒంటిమతంగాళ్ళ వల్ల మొత్తంగా హిందూమతానికి వెజ్ బర్గర్ తినే కాలమొస్తుందేమో!
****
21 comments:
RighttO! Must think of their actions
టీవీ 9 లో ఈ వివాదం ఇంకా రాకపోవడం వల్ల ఇక్కడ జెడ్ ఏమని మాట్లాడాడో నాకు తెలీదు, ఇక్కడ చూడ్డమే! నేను అనుకోవడం అతగాడు జైన్ అయి ఉంటాడని. నాకు తెలిసి మాంసాహారం విషయంలో అంత పట్టుదల గా ఉండేది వారే!
అయితే, బొమ్మ ఏమిటో ఎవరిదో కూడా తెలీకండా "కూల్ యార్" అని ఎక్కించేసిన వాడు "The snack is sacred" అని ఎందుకు చేర్చాడట మరి?(అంటే బొమ్మ sacred అని కొద్దో గొప్పో తెలిసుండాలన్నమాటేగా?)
లక్ష్మి విలాస్ లు, లక్ష్మి స్వీట్లు,లాండ్రీలు-- ఈ పేర్లు 'షాపుకు" మాత్రమే పరిమితం కానీ అందులోని సరుకుకు కాదు. మరి బర్గర్ కింగ్ వాడు "లక్ష్మి బర్గర్ కింగ్" అని పెట్టుకోకుండా బీఫ్ తో చేసిన బర్గర్ (బీఫ్ ఇండియన్స్ తినరని తెలిసి)కి లక్ష్మీ దేవి బొమ్మనెందుకు వాడినట్లు?
ఇవన్నీ కావాలని చేసే పనులే కానీ "తెలీకో" "బొమ్మ బాగుందనో" చేసే పనులు ససేమిరా కావు.
ఆహారం విషయానికొస్తే మతానికి, కులానికి, దానికి సంబంధం లేదు.
@సుజాత: తినేతిండి అది పశువైనా,పందైనా తినేవాడికది పవిత్రమే.మనకు భక్త కన్నప్ప కథ తెలిసిందేకదా! కాబట్టి snack is sacred తో నాకు సమస్య లేదు. బహుశా ఆ కంపెనీవాడు అక్కడ్నుంచే మొదలెట్టుంటాడు. గూగుల్లో GOD అని కొట్టి, వచ్చిన ఫోటోల్లోంచీ నచ్చింది తీసి పెట్టాడేమో!
ఇక అలా రాసినోడి ఇగ్నొరెన్స్ విషయంలో కొంత చెప్పుకోవాలి.రాసినోడిది స్పెయిన్, ఈ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది స్పెయిన్లో, అక్కడోళ్ళకి భారతీయుల భోజనపద్ధతుల గురించి పెద్దగా తెలుసుంటాయని నేననుకోను.ముఖ్యంగా meat అంటే కేవలం beef అనుకునే దేశాల్లో భారతీయులు కేవలం మటన్, చికెన్ మాత్రం ఆత్రంగా ఆరగిస్తారని, పశుమాంసాన్ని "అపవిత్రంగా" చూస్తారని తెలియకపోయుండచ్చు.
ఉద్దేశమేదైనా, చేసింది తప్పు అని తెలిసి క్షమాపణలు చెప్పారు. నా సమస్యల్లా ఈ వంకతో మాంసంతినే హిందువుల్ని ఈ పవిత్ర హిందువులు చేస్తున్న చులకన గురించే.ఆహారపు అలవాట్లకు మతాన్ని ఆపాదించి "విలువలు" జోడిస్తున్న ఆ హిందూవ్యాఖ్యాత గురించే.
బౌద్ధ మతం, జైన మతం ఆవిర్భవించిన తరువాతే బ్రాహ్మణులు ఆత్మరక్షణలో పడి శాకాహారులుగా మారారనీ అంతకు పూర్వం వాళ్ళూ మాంసా హారులేననే వాదం వుంది.
ఆనాటి యజ్ఞ యాగాలలో జంతువులను వధించడం విధిగా వుండేదట. అదీ లేత ఎద్దులను, ఆవులనూ వధించే వారట . బలి ఇవ్వడం అనేది హిందూమతం లో ముఖ్యంగా గ్రామాల్లో ఇప్పటికీ ఒక ఆచారంగా కనిపిస్తూనే వుంది.
యమునా నదిని దాటేటప్పుడు సీత ఇలా మొక్కుకుందట : ...''రాముడు తన ప్రతిజ్ఞా పాలన పూర్తిచేసిన తరువాత 1000 ఆవులతో , 100 పీపాల మద్యంతో నిన్ను కొలుస్తాను తల్లీ'' !
రాముడూ కృష్ణుడూ సీతా అందరినీ ఇప్పుడు శాకాహార దేవతలుగా మార్చేసారు కానీ ఒరిజినల్ గా వాళ్ళంతా మాసాహారులే కదా !
ప్రొఫెసర్ ద్విజేంద్ర నారాయణ్ ఝా తన Paradox of the Cow: Attitudes to Beef Eating in Early India అనే పుస్తకం లో. ఇట్లాంటి అనేక విశేషాలున్నాయి.
హైదరాబాద్ బుక్ ట్రస్ట్ , ప్రజాశక్తి వారు ప్రచురించిన డి ఎన్ ఝా అనువాదం ప్రాచీన భారతం లో ఆహారపు అలవాట్లు ...ఈ కింది లింకు చూడండి:
http://hyderabadbooktrust.blogspot.com/2009/07/blog-post_04.html
నేను శుద్ధ శాఖాహారి నాస్తికుడిని. నాన్ వెజ్ రెస్టారెంట్లకి దేవుళ్ళ పేర్లు పెట్టగా లేని అభ్యంతరం నాన్ వెజ్ ఐటెమ్ కి పెట్టినప్పుడు ఎలా వచ్చింది?
ఇదివరలో, చెప్పులు, టాయిలెట్ సీట్లపై హిందూ దేవతల చిత్రాలు వేయటం, దాన్ని వ్యతిరేకించతం, తరువాత సారీలు చెప్పటం జరిగాయి. ఇప్పుదు ఇదొకటా కొత్తగా.
i believe it is all part of the game to promote products, rather than ignorance.
చాన్నాళ్ల క్రితం ఆహారపు అలవాట్ల గురించి తాడేపల్లి గారి బ్లాగులో వెలిబుచ్చిన నా అభిప్రాయాలు
.....regarding food habits.
to eat is to live. eat or be eaten is the principle of nature.
whether it is a plant food or animal food that is immeterial.
one cannot assume a lion to eat grass. or a deer to chew flesh. it is all part of the game.
it does not mean carnivores are cruel or herbivores are soft hearted.
available pastures/food items are shared among the living beings for their survival so are they adopted.
bollojubaba
September 9, 2008 9:43 PM
ఈ వంకతో మాంసంతినే హిందువుల్ని ఈ పవిత్ర హిందువులు చేస్తున్న చులకన గురించే ---
అది తప్పు.
అదింకా సమాజంలో ఉంది. పోయే రోజుకోసం ఎదురుచూసే వారిలో నేనూ ఒకడిని.
బొల్లోజు బాబా
ఖచ్చితంగా వారి ఉత్పత్తుల ప్రచారం కోసం చేసిన పనే.
// మన ‘జెడ్’ గారు అంతటితో ఆగకుండా హిందువులు సాత్విక ఆహారులని, రాజసిక - తామసిక ఆహారాలు తీసుకోరని శెలవిచ్చాడు.
:)
వివాదం రేకెత్తించి పబ్బం గడుపుకోవాలనుకునే గడుసుదనం బర్గర్కింగుది. మతాల్ని ఉద్దరిస్తున్నట్లు పోజులు కొడుతూ కింగుల కార్యం తీర్చే గంధర్వరాజన్లకి ఎప్పుడూ కరువు లేదు. వాళ్లకీ వాళ్లకీ నడుమ లోపాయకారీ ఒప్పందమేదీ లేకపోతేనే వింత. దెబ్బకి, బర్గర్ కింగ్ పేరు ఇండియాలో మార్మోగటం ఖాయం. వాళ్ల వ్యాపారం రెట్టింపవటమూ ఖాయం.
హోటల్ గంగాభవాని, బాలజీ డీలక్స్ వంటివాటిలోఓ జరిగే వ్యవహారాలు వీళ్లకి తెలియదు అనుకొంటా.
"అన్నం పర బ్రహ్మ స్వరూపం" అనే దాన్ని కాపీ కొట్టీ ఉంటాడు
>> నా సమస్యల్లా ఈ వంకతో మాంసంతినే హిందువుల్ని ఈ పవిత్ర హిందువులు చేస్తున్న చులకన గురించే
వాహ్ గ్రేట్. మరి శాకాహారులతో మాంసాహారులాడే ఎకసెక్కాలగురించి కూడా కాస్త వ్రాస్తే బాగుండేది. అలాంటివాటిగురించి మీకు నిజంగానే తెలియదనుకోమంటారా లేక ఆ సంగతి కన్వీనియెంట్ గా మర్చిపోయి మీక్కావలసిన పాయింటు మాత్రమే ప్రొజెక్టు చేసుకుంటున్నారనుకోమంటారా? తిన్నదరగని ఒక జెడ్ అనేవాడెవడో మాట్లాడిన మాటలని బట్టి ఇలా స్వీపింగ్ స్టేట్మెంట్లు ఇచ్చెయ్యటం ఏంటో నాకర్థం కావట్లేదు.
Mahesh, I request you to remove the photograph attached to this post. News and the other discussions are ok but the poster is objectionable in the similar lines of cartoons on Allah(Happened in Europe) and the Jesus with cigar (Sakshi news). Showcasing such information is also a violation of law and I hope you will honor the request. Thanks in Advance.
@వికాసం (బృహస్పతి): I might have considered your request, but with this law angle attached to it, I shall stand by what I put forth.As it is not "illegal".I don't see any violation of "law" here.
I am a Hindu and I don't feel offended by the photograph. As a Dalit and a beef eater, I have no issues in offering beef burger to "my goddess".
The same photographs is carried by Saturday (11th July) Times of India. A news paper that reaches millions of homes.If you want to show them the law please do so.(please see the link: http://epaper.timesofindia.com/Default/Client.asp?Daily=TOIH&showST=true&login=default&pub=TOI&Enter=true&Skin=TOINEW&GZ=T)
I am sorry to refuse your request for removal.
అసలు పాయింటు ఇదంతా గాదు.
బర్గరు కింగువాడు తనది కాని దాన్ని తెచ్చుకుని ఏదో చెయ్యబోయాడు. అదీ తప్పు. నా యింటి చెట్టుని నేను అంటు కట్టుకుంటాను, కాయలు కోసుకుంటాను, ఇష్టమైతే నరుక్కుంటాను. పక్కింటోడికి నా చెట్టుతో పనేంటి?
అసలు సంగతేమిటంటే హిందువులకు జరిగిన అవమానంతో ఆత్మగౌరవాలేమన్నా మేలుకుంటయనే భయం గల హిందూవ్యతిరేక శక్తులు పల్ వ్యూహాలు పన్నుతుంటాయి అందుకు అమాయకంగా మనవారే సహాయ పడుతుంటారు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది అదేకదా ? అవమానించిన వానిని వదలి ఆత్మగౌరవం తో పోరాడినవానిని ,ఆవాదనను బలహీన పరచి మనలను అవమానించటం ఏమీ తప్పుకాదనే భావనను కలిగిస్తునా ఈ మేధో పరమైన వ్యూహాన్ని గమనించలే స్థితికి చేరుకున్నాము .కానివ్వండి అన్ని ప్రశ్నలకు సమాధానాలు ప్రకృతి సిధ్ధపరుస్తున్నాది. అనుభవం లోకిరావటానికి కొద్దిగా ఆలస్యమవుతుంది అంతే !
మనకి సిగ్గు లేనప్పుడు పక్కవాడు చూసి నవ్వితే బాధ పడడం ఎందుకు? మన మతం వాళ్ళలోనే చాలా మంది వారానికి ఒక సారి కక్కుర్తి పడి మరీ నాన్ వెజ్ తింటున్నప్పుడు వాళ్ళకి చెప్పడం మనకి చేతకాదు కానీ దేవుని బొమ్మల విషయంలో ఇంత సింగినాదం ఎందుకు?
Mahesh,
I don’t mean to hurt you by getting the law in to this context. I just want to make you aware that such issues have been treated as against law in the past. If my wording hurts your feeling, I sincerely apologies and ready to take back that word which I really don’t mean to threaten. I still wish that you will honor the request.
"@సుజాత: తినేతిండి అది పశువైనా,పందైనా తినేవాడికది పవిత్రమే.మనకు భక్త కన్నప్ప కథ తెలిసిందేకదా! కాబట్టి snack is sacred తో నాకు సమస్య లేదు. బహుశా ఆ కంపెనీవాడు అక్కడ్నుంచే మొదలెట్టుంటాడు. గూగుల్లో GOD అని కొట్టి, వచ్చిన ఫోటోల్లోంచీ నచ్చింది తీసి పెట్టాడేమో!"
ఎవడో స్పెయిన్ గాడు వాడి బర్గర్లు అమ్ముకోడానికి ఇలాంటి చీప్ ట్రిక్స్ చేస్తే వాడికి మీరు benifit of doubt ఇచ్చేస్తున్నారు, ధారాళంగా. ఇది మొదటి సారి అయితే వేరే సంగతి. ఇది వరకు చెప్పుల మీదా, దొడ్ల మీదా రాయడం చేశారు. మీ వాక్యాలు మీరే ఒకసారి చదువుకోండి. అవి నిజానిజాలను అన్వేషిస్తున్నాయా, లేక ఒక వాదనకు కొమ్ము కాస్తున్నాయా అని మీకే తెలియాలి.
"నా సమస్యల్లా ఈ వంకతో మాంసంతినే హిందువుల్ని ఈ పవిత్ర హిందువులు చేస్తున్న చులకన గురించే.ఆహారపు అలవాట్లకు మతాన్ని ఆపాదించి "విలువలు" జోడిస్తున్న ఆ హిందూవ్యాఖ్యాత గురించే."
ఇంకొకడు ఎవడో అదేమిటని అడిగితే (వాడు ఆ బర్గర్ గాడి ఏజెంట్ అయితే - అది వేరే సంగతి),వాడిని అడ్డం పెట్టుకుని "పవిత్ర హిందువులు" ఎవరో ఎవరినో చులకన చేస్తున్నట్టు, కుట్రలు ఆపాదిస్తున్నారు.
ఇక్కడ సమస్య మాంసం కాదు. ఒకరి నమ్మకాన్ని కించపర్చడం. ఆ నమ్మకం హేతుబద్ధంగా ఉన్నదా లేదా అన్నది వేరే సంగతి. ఆ మాటకొస్తే అమ్మ ఫోటోలు, భార్య ఫోటోలు, పాపాయి ఫోటోలు మన పర్సుల్లో ఉండవా? ఫోటో సింబల్ అని మనకు తెలుసు, ప్రాణం లేని "వస్తువ"ని మనకు తెలుసు. అయినా ఎందుకు మనకా "నమ్మకం"? అందులో మనకు తృప్తినిచ్చే విషయం ఉంది కాబట్టి. దేవుడూ అలాంటి నమ్మకం అయి, దానివల్ల ఒకరికి ఇబ్బంది లేనప్పుడు, దాన్ని ఏ హై టెక్ కిరాణా కొట్టు వాడో, మార్కెటింగ్ కోసం వాడుకుంటే అది తప్పు కాక ఒప్పెలా అవుతుంది?
@రవి: అడ్వర్టైజ్మెంట్ రంగం ఉండేదే వస్తువుల్ని "అమ్ముకోవడానికి". అందులో చీప్-కాస్లీ-మీడియం ట్రిక్కులుండవు.అమ్మజూపడం-అమ్ముకోవడం మాత్రం ఉంటాయి.
ఒక ఉదాహరణ చెబుతాను వినండి.
గాంధీ బొమ్మని చెప్పుల మీద ముద్రించి "Walk like Gandhi - fight for your freedom"అంటే అర్థం వేరౌతుంది.
అదే కొంచెం మార్చి "Walk on Gandhi - be a free man" అన్నామనుకోండి...అదొక బూతవుతుంది.
కాబట్టి intention ముఖ్యం. ఇక్కడ ఆ యిటాలియన్ వాడు అన్నది food is sacred. ఆ statement లో నాకు తప్పు కనిపించలేదు. వాడి ఉద్దేశంలో లోపం ఉందనిపించలేదు. పవిత్రమైన భోజనానికి పవిత్రమైన దేవతని వాడాడు. అంతే!
అయినా బర్గర్ కింగ్ వాడికి నిజంగా కాంట్రవర్సీ వచ్చి ఇండియాలో పాప్యులర్ కావాలంటే ఇటలీలో పోస్టరంటిస్తాడా? ఇక్కడికొస్తే ఇంతకన్నా అమ్మాబాబులాంటి సలహాలిచ్చే అడ్వర్టైజింగ్ కంపెనీలు చాలా ఉన్నాయి.
నమ్మకాన్ని కించపరిచేవారితో పోరాడటం మంచిదే. దానికి నేను వ్యతిరేకంగా ఎక్కడ రాశానూ! I have no issues with it at all. వ్యతిరేకించారు. వాడు క్షమించమని తీసేశాడు. అంతవరకూ బాగానే ఉంది. కానీ మధ్యలో ఈ జెడ్ గాడి గొడవతోనే నా సమస్యంతా. Who the hell is he to talk on behalf of me and to represent me?
మీరు ఇంతలా ఎందుకు మార్కెటింగ్ గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. In India even Gods are systematically marketed. అలాంటప్పుడు దేవుడి పేరుతో product లు, services మార్కెట్ చేస్తే తప్పెందుకౌతుంది?
@దుర్గేశ్వర్రావు: అన్నీ కుట్రలేనండీ బాబూ. అయినా, ప్రకృతి మనవేపుండగా ఏమీ కావులెండి.
@బృహస్పతి: None of the issues you have mentioned are dealt "as against law". They only became law and oder issues in some parts of the world and AP when vandalism was done in the name of protests.
I have noted your objection. But,my intention is not to insult anybody.So,the picture stays on.
"కాబట్టి intention ముఖ్యం. ...
అయినా బర్గర్ కింగ్ వాడికి నిజంగా కాంట్రవర్సీ వచ్చి ఇండియాలో పాప్యులర్ కావాలంటే ఇటలీలో పోస్టరంటిస్తాడా? ఇక్కడికొస్తే ఇంతకన్నా అమ్మాబాబులాంటి సలహాలిచ్చే అడ్వర్టైజింగ్ కంపెనీలు చాలా ఉన్నాయి."
నాదే అదే ప్రశ్నే. అక్కడా ఇటలీలో అమ్మాబాబులాంటి సలహాలతో మార్కెటింగ్ చేసుకోవచ్చు. గూగుల్లో ఒక నొక్కు నొక్కి, లక్ష్మీదేవి రాంగానే మురిసిపోయి అసలా "ఫిగరు" ఎవరో కూడా తెలియని ఇటలీ గాళ్ళకు ఆమె బొమ్మ ద్వారా మార్కెటింగ్ ఎందుకు వాడికి చేయాలనిపించింది? మీరన్నట్లు intensions ముఖ్యం. వాడి intensions మీకు తప్పనిపించలేదు. నాకు తప్పుగా, కొండొకచో చీప్ గానే అనిపిస్తున్నాయి. దానికి కారణం, ఇది మొదటి సారి కాదు కాబట్టి.
గణేశ్ అన్న పేరుతో బీడీలు ఉన్నాయి. నేనూ marketing, దానిగురించి ప్రశ్నించలేదు.
intensions ముఖ్యమని మీరే అన్నారు. నాకు వాడి intensions కరెక్టని అనిపించట్లేదు.
mahesh,
on what basis you felt z is figthing for you and included you in his group.even you have not elected z as your representative like our 25% vote MLAs..
Post a Comment